crashed
-
మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ట్రైనీ విమానం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రెండు సీట్లున్న సెస్నా 152 విమానం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కూలిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలిలో ఉన్న విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా కూలిపోయినట్లు గుణ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ దిలీప్ రాజోరియా వెల్లడించారు. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. గాయపడిన పైలట్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే టెస్టింగ్, నిర్వహణ కోసం కొన్ని రోజుల క్రితం పలు విమానాలు ఇక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. విమానం కూలిపోవటంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.#MadhyaPradesh Two pilots injured as trainer aircraft crashes in MP's Guna: Two pilots on board suffered injuries; the plane arrived a few days back for testing and maintenance https://t.co/7StFTBL0bV pic.twitter.com/4rM6CiFFq3— Global Voters (@global_voters) August 11, 2024 -
హైవేపై పెద్దపులిని ఢీకొన్న కారు
మర్రిపాడు/ఆత్మకూరు రూరల్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్దపులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం.. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డువచ్చింది.పెద్దపులిని కారు ఢీకొని కొద్దిదూరం ముందుకు దూసుకువెళ్లింది. దీంతో పెద్దపులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్నవారికి ప్రమాదం తప్పింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్లుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.శేషాచలం చేరిన పెద్దపులి!శ్రీశైలం–శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్ ఉంది. శ్రీశైలం–నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే, శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా.. లేదా.. అని ఇప్పటికీ సంశయంగానే ఉండేది. ఆ అనుమానాలకు తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరి నాయునిపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘటనతో స్పష్టమైంది. -
23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్
జైపూర్: రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్‌లోని ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. జెట్ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు. One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been constituted to find out the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 12, 2024 -
రామగుండంలో సీ అండ్ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్‌పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు భోగీలు ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో 8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి. యూటీ మిషన్‌ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్‌పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
టెస్ట్ డ్రైవ్‌లో రూ.33 లక్షల కారు నుజ్జునుజ్జు - వీడియో వైరల్
సాధారణంగా ఒక కారు కొనడటానికి ముందు కంపెనీ డీలర్షిప్ టెస్ట్ డ్రైవ్ సదుపాయం కల్పిస్తుంది. అయితే కొన్ని సార్లు అనుభవం లేని డ్రైవర్లు కారుని డ్రైవ్ చేస్తే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఈ సంఘటన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీలో జరిగినట్లు తెలుస్తోంది. అమెరికన్ కార్ బ్రాండ్ అయిన జీప్ మెరిడియన్ టెస్ట్ డ్రైవ్ సమయంలో అనుకోని పెద్ద ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లయితే, రోడ్డు తడిగా ఉండటం గమనించవచ్చు. ప్రమాదం జరగటానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు. దీనికి కారణం అతి వేగమా? లేక డ్రైవింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడమా? అనేది తెలియాలి ఉంది. అయితే ప్రమాదంలో కారు చాలా ఎక్కువ దెబ్బతినడంతో ఫ్రంట్ బంపర్, రియర్ ప్రొఫైల్ చాలా వరకు పనికిరాకుండా పోయింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండు స్ట్రీట్‌లైట్ స్తంభాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. లోపల ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడం వల్ల బహుశా వారికి గాయాలేమైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా? జీప్ మెరిడియన్.. టెస్ట్ డ్రైవ్ సమయంలో వినియోగదారుడు పరిమిత వేగంతో డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కొత్త కారు గురించి వారికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. కారు ప్రమాదానికి గురైతే టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకున్న వారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగిందా? లేదా స్పష్టంగా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన జీప్ మెరిడియన్ ధర రూ. 33.41 లక్షల నుంచి రూ. 38.61 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదం ఇదే మొదటి సారి కాదు.. టెస్ట్ డ్రైవ్ సమయంలో కార్లు ప్రమాదానికి గురవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా, టాటా కంపెనీకి చెందిన కార్లు, హ్యుందాయ్ ఐ20 ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం సాధారణ కార్లు మాత్రమే కాకుండా టెస్లా కార్లు కూడా టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్ జిల్లా బహ్లోల్‌నగర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. #WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV — ANI (@ANI) May 8, 2023 చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఘోర విమాన ప్రమాదం
-
గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్..దెబ్బకు తలకిందులుగా..
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్లోని లాస్ ఏంజింల్స్లోని శాంటా మోనికా బీచ్‌లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్‌లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్‌లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్‌కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Frank Deville (@fthemagician) -
షాకింగ్ ఘటన: అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు...ముగ్గురికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతీ బ్రెజ్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో గులాబీ బాగ్‌లోని లీలావతి పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఐతే ఆ కారు అదుపుతప్పి అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చింది. అక్కడ ఉన్న పిల్లలను ఢీకొని కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు టైరు పేలి ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కొందరూ చిన్నారులకు సాయం అందించగా, మరికొందరూ సదరు కారు డ్రైవర్ని అడ్డుకుని అందులోని మరో వ్యక్తిని బంధించారు. ఆ తర్వాత ఆ ఇద్దర్నీ పోలీసులుకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. వాస్తవానికి ఆ సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడని, ఈ ప్రాంతంలో పాఠశాల ఉందని స్థానికులు హెచ్చరించిన తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా దురుసుగా ప్రవర్తించాడని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, గాయపడిన ఇద్దరు చిన్నారులు పరిస్థితి నిలకడగానే ఉంది. మరో ఆరేళ్ల బాలుడు మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Delhi: A speeding car hits three children in Gulabi Bagh area this morning, two children received minor injuries while the third is critical but stable and admitted to a hospital: Delhi Police (Note: Graphic content, CCTV visuals) pic.twitter.com/1HAc4qyqGk — ANI (@ANI) December 18, 2022 (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్
సాక్షి, జైపూర్: రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో శుక్రవారం మిగ్-21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. అయితే ఇండో-పాక్ బార్డర్ వద్ద ఈ యుద్ధ విమానం కూలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పరిస్థితిని సమీక్షించడానికి రంగంలోకి దిగింది. మిగ్-21 జెట్ సాంకేతిక సమస్యల కారణంగా కూలిందా లేక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. -
కృష్ణా జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు
-
కూలిన అగ్నిమాపక విమానం, 8 మంది దుర్మరణం
ఇస్తాంబుల్: టర్కీ అడవుల్లో చెలరేగిన మంటలను అర్పేందుకు రష్యా నుంచి వచ్చిన యాంఫిబియస్ బెరివ్ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సులో చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని టర్కీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను టర్కీ మరచిపోదని వ్యాఖ్యానించారు. ప్రమాదానికి ముందు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత విమానం కూలినట్లు తెలిసిందని స్థానిక గవర్నర్ ఒమర్ ఫరూక్ కోస్కున్ తెలిపారు. ఈ ప్రమాదం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో టర్కీ పౌరులు మరణించడంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు పుతిన్ తన సంతాపం తెలిపారు. ఈ రెండు ఇంజిన్లు కలిగిన యాంఫిబియస్ అగ్నిమాపక విమానం 270 మెట్రిక్ టన్నుల నీటిని మోసుకెళ్లగలదు. చదవండి : చూపుడు వేలుపై 3 గంటలకు పైగా -
రోడ్డు పక్క బావి.. కారును మింగేసింది..
కరీంనగర్ క్రైం/చిగురు మామిడి: రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావి మృత్యు బావిగా మారి ఓ కారును మింగేసింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులో జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు గురువారం ఉదయం 11.00 సమయంలో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న బావిలో పడింది. వెనుకాలే కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ విషయం గమనించి కాపాడాలని ప్రయత్నించినా ఎవరూ లేకపోవడంతో కుదరలేదు. దీంతో వెంటనే స్థానికులను పిలుచుకొచ్చాడు. సుమారు 30 నిమిషాల పాటు కారు నీటిపై తేలి ఆ తర్వాత మునిగిపోయింది. క రీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై మధుకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్లతో సహాయక చర్య లు చేపట్టగా, కారు ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్లతో గాలించగా, ఫలితం లేకుండాపోయింది. 8 గంటలు శ్రమించి.. మొదట కారులో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింజన్, రెండు క్రేన్ల ద్వారా కారును వెలికితీసేందుకు చేపట్టిన చర్యలు మొదట విఫలమయ్యాయి. రెండు, మూడు సార్లు క్రేన్‌కు చిక్కినా జారిపోయింది. రెండు మోటార్ల సాయంతో నీటిని తోడించినా ఫలితం దక్కలేదు. ఆఖరికి రాత్రి 8 గంటలకు పెద్ద క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతుడు రిటైర్డ్ ఎస్సై.. కారును బయటికి తీశాక.. అందులో ఒక్కరి మృతదేహం లభించింది. మృతుడు కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ ఎస్సై అని పోలీసులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ తండాకు చెందిన రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ (62)గా గుర్తించారు. గతంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. పాపయ్యనాయక్కు భార్య భారతి, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుద్ధయ్య నీ కోసమే డ్యూటీ చేసిన్నా అన్నా.. మానకొండూర్ డివిజన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అందులో పాపయ్య నాయక్ సొంత తమ్ముడు బుద్ధయ్య నాయక్ కూడా ఉన్నాడు. బావిలో పడి చనిపోయింది తన అన్న అని తెలియకుండానే.. 9 గంటల పాటు సాయం అందించాడు. చివరకు మృతుడు తన అన్న తెలియడంతో ‘అన్నా ఇంతసేపు నీకోసమే డ్యూటీ చేసిన్నా.. బాయిల పడ్డది నువ్వేనా’అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. -
కుప్పకూలిన యుద్ధ విమానం, ఏడుగురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్‌లోని బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నిన్న (బుధవారం, అక్టోబర్ 2) ఉదయం 9:54 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానంలో టేకాఫ్ అయిన పదినిమిషాలకే సాంకేతి కసమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎమర్జన్సీ ల్యాండింగ్నకు యత్నిస్తున్న సమయంలోనే కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నారని ప్రజారక్షణశాఖ కమిషనర్ జేమ్స్ రోవెల్లా వెల్లడించారు. ఈ విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడ్డాడనీ..విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించిందనీ తెలిపారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటల పాటు మూసివేశారు. According to our pilot a plane crash on the runway in Hartford has closed the airport and has everyone scrambling. pic.twitter.com/khAGbq50z5 — Aaron Katzman (@aaron_katzman) October 2, 2019 -
కూలిన పాక్ యుద్ధ విమాన శకలాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16ను భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను కూల్చివేసినట్టు భారత అధికారులు ప్రకటించగా తాజాగా వీటి శకలాలను పాక్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తించారు. పీఓకేలో కూలిన పాకిస్తాన్ ఎఫ్ 16 శకలాలను పాకిస్తాన్ ఏడవ నార్తర్న్ లైట్ ఇన్ఫ్యాంట్రీ కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు ఇతర పాక్ వాయుసేన సిబ్బంది పరిశీలిస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు భారత యుద్ధవిమానాన్ని కూల్చివేసి పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కాగా భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత సమసిపోగానే తమ చెరలో ఉన్న భారత్ పైలట్ అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు పాక్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంలో భారత నావికా దళంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. సముద్రాల్లో నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు పెట్రోలింగ్ చేస్తూ మత్స్యకారుల కదలికలనూ గమనిస్తున్నారు. -
కుప్పకూలిన శిక్షణా విమానం
సాక్షి, ముంబై: మహారాష్త్ర పుణేలో ఒక శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. కార్వర్ ఏవియేషన్‌కు చెందిన ట్రైనీ విమానం, మహారాష్ట్రలోని పూణేలో ఇందాపూర్ సమీపంలో కూలిపోయింది. ఈ సంఘటనలో విమానం పూర్తిగా దెబ్బతింది. అయితే శిక్షణలో ఉన్న పైలట్ గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన బారామతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు, తదితర వివరాలు అందాల్సి ఉంది Maharashtra: A trainee aircraft of Carver aviation (pilot training institute) has crashed near Indapur, Pune. The trainee pilot, who is injured, has been rushed to a hospital in Baramati. More details awaited. pic.twitter.com/1fvIp96Fbm — ANI (@ANI) February 5, 2019 -
యూపీలో కుప్పకూలిన యుద్ధవిమానం
లక్నో : భారత వాయుసేనకు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం సోమవారం యూపీలోని ఖుషీనగర్ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్ ప్రాంతం వద్ద కూలిపోయింది. విమాన ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో జాగ్వర్ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌గా ఉన్న వాయుసేన పతక గ్రహీత, జామ్‌నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఎయిర్‌ఆఫీసర్ కమాండింగ్ సంజయ్ చౌహాన్ మరణించారు. -
ఇండోనేసియా విమాన ప్రమాదం.. సహాయక చర్యలు
-
లయన్ విమాన ప్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి
ఇండోనేషియాలో ఘోర ప్రమాద వార్త విన్న వెంటనే భారతీయులంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రమాదంలో భారతీయులెవరూ ఉండకూదంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రార్థించారు. కానీ వారు భయపడినంతా జరిగింది. ముఖ్యంగా న్యూఢిల్లీకి చెందిన భవ్యే సునేజా (31) ప్రమాదానికి గురైన లయన్ విమానానికి కెప్టెన్ పైలట్‌గా ఉన్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన సునేజా 2009లో పైలట్ లైసెన్స్ పొందారు. ఎమిరేట్స్, కాలిఫోర్నియాలో పైలట్ శిక్షణ పొందారు. 2011లో లయన్ ఎయిర్ సంస్థలో పైలట్‌గా చేరారు. సునేజా భార్య ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజరుగా పనిచేశారుట. సునేజా జులైలో ఢిల్లీలో పోస్టింగ్ ఇప్పించాలని కోరారు. చాలా అనుభవమున్న పైలట్. నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే అతన్ని ఇండోనేసియా సంస్థలోనే ఉంచాలనుకున్నామని లయన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. తమసంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్‌కు చెందినవారే. సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయామంటూ లయన్ ఎయిర్ అధికారులు వెల్లడించారు. కాగా ఇండోనేషియా విమానం బెలిటంగ్ దీవులలోప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్ జెట్పాసింజర్( జేటీ-610 )విమానంలో సముద్రంలో 30-30మీటర్ల లోతులో సోమవారం ఉదయం కూలిపోయింది. ఇద్దరు పైలట్లు, అయిదుగురు సిబ్బంది సహా సుమారు 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదలో ఎవరూ బతికి వుండే అవకాశం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
అమెరికాలో కుప్పకూలిన వంతెన
మయామి: అమెరికాలోని మయామిలో వారం క్రితమే నిర్మాణం పూర్తయిన పాదచారుల వంతెన కూలిన దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీని విద్యార్థుల వసతి గృహంతో కలుపుతున్న ఈ బ్రిడ్జి గురువారం రద్దీగా ఉన్న రహదారిపై అమాంతం కుప్పకూలింది. దీని కింద పలు కార్లు, వాహనాలు నలిగిపోయాయి. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలు లభించాయని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. మరో పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బ్రిడ్జి రెండు చివరలకు మద్దతుగా ఉన్న నిర్మాణాలు కూడా ఏ క్షణమైనా కింద పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి ఉన్నపళంగా నేలకొరుగుతున్న వీడియోను సీఎన్ఎన్ విడుదల చేసింది. సుమారు 950 టన్నుల బరువున్న బ్రిడ్జి కింద కనీసం 8 కార్లు, రెండు ట్రక్కులు చిక్కుకున్నట్లు తెలిసింది. వంతెన కూలిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని, తొలుత బాంబు పేలిందని అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్రిడ్జిని మోస్తున్న కేబుల్స్ వదులయ్యాయని, వాటిని బిగుతు చేస్తుండగా అది కూలిపోయిందని ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వారు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు సాయం చేసినట్లు తెలిపారు. గత శనివారమే పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ బ్రిడ్జిని 2019లో పాదచారులకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. -
నల్ల సముద్రంలో కూలిన విమానం
92 మంది మృతి.. 10 మృతదేహాలు వెలికితీత • సోచీ నుంచి సిరియాకు వెళుతున్న రష్యా మిలటరీ విమానం • బయలుదేరిన రెండు నిమిషాలకే ప్రమాదం • విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు పుతిన్.. ఉగ్ర కోణాన్ని తిరస్కరించిన రష్యా • మృతుల్లో 64 మంది సంగీత బృందం, 9 మంది జర్నలిస్టులు మాస్కో: రష్యా మిలటరీ విమానం ఆదివారం ఉదయం నల్ల సముద్రంలో కుప్పకూలిపోయింది. సిరియాకు బయలు దేరిన టీయూ–154 విమా నంలో 92 మంది ప్రయాణిస్తున్నారు. దక్షిణ రష్యాలోని సోచీ పట్టణం నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే విమానం అదృశ్యమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఐగోర్ కొనషెన్కోవ్ చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:55 నిమిషాల తర్వాత రాడార్‌కు సిగ్నల్స్ అందకుండాపో యాయని ఆయన తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలేంటి అనేది ఆయన వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థిని బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రదాడి అయి ఉండొచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఈ వాదనను రష్యా అధికారులు తోసిపుచ్చుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. వీరికి కొద్ది సేవటికే దుర్ఘటన ప్రాంతంలో 10 మృతదేహాలు లభించాయి. సోచీ తీరానికి 1.5 కి.మీ దూరంలో 50 నుంచి 70 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్‌ను ఆదేశించారు. ఒక రోజు సంతాప దినం ప్రకటించిన పుతిన్.. ప్రమాద కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఎక్కువ మంది సంగీత బృందం ప్రమాదానికి గురైన విమానం పశ్చిమ సిరియాలోని లటాకియా ప్రావిన్స్‌లోని హెమీమిమ్ ఎయిర్‌బేస్, రష్యా మధ్య నిరంతరం రాకపోకలు సాగిస్తుంది. ఆ ఎయిర్‌బేస్‌లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున సంగీత బృందాన్ని తీసుకెళుతున్నారు. విమానం కూలిపోయిన సమయంలో దానిలో 84 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో రష్యా మిలిటరీకి చెందిన అధికారిక సంగీత బృందం అలెగ్జాండ్రోవ్ ఎన్సెంబుల్ సభ్యులు 64 మంది ఉన్నారు. ఈ బృందాన్ని రెడ్ ఆర్మీ కోయిర్ అని కూడా పిలుస్తారు. మిగిలిన ప్రయాణికుల్లో 9 మంది జర్నలిస్టులు, ఓ డాక్టర్, సర్వీస్‌మెన్ ఉన్నారు. 1983లో ఈ విమానం సేవలు ప్రారంభమయ్యాయని, 2014లో మరమ్మతులు చేశామని కొనషెన్కోవ్ తెలిపారు. ఉగ్రదాడి జరిగిఉండొచ్చు అన్న వాదనను రక్షణ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు విక్టర్ ఒజెరోవ్ ఖండించారు. సాంకేతిక లోపం వల్లో, సిబ్బంది తప్పిదం వల్లో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన ఆయన తెలిపారు. మోదీ సంతాపం రష్యా సైనిక విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ ద్వారా సంతాపం తెలిపారు. ‘ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతికి రష్యాతో పాటు భారత్ కూడా సంతాపం తెలుపుతోంది’అని మోదీ ట్వీట్ చేశారు. విమాన శకలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న సహాయక సిబ్బంది -
బాలుడి కాలులోకి దిగిన గునపం
కరీంనగర్: ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి పాదంలోకి గునపం దూసుకెళ్లడంతో.. ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా సిరిసిల్ల పద్మనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశత్తు గుణపం జారి బాలుడి పాదంలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు కాలు నుంచి గుణపాన్ని వేరుచేశారు. -
కూలిన మిగ్-27 యుద్ధ విమానం
జోధ్ పూర్: రష్యా నుంచి భారత్ వైమానిక దళం(ఐఏఎఫ్) కొనుగోలు చేసిన మిగ్-27 యుద్ధవిమానం రాజస్ధాన్ లోని జోధ్ పూర్ వద్ద సోమవారం ఓ బిల్డింగ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరు విమానం కూలిపోక ముందే అందులో నుంచి బయటకు దూకేశారు. బిల్డింగ్ కు వెనుకవైపు నుంచి వెళ్తున్న విమానం ఒక్కసారిగా దానిని ఢీ కొంది. దీంతో విమానం ముందు ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్ లోని రెండు ఇళ్లు బాగా దెబ్బతినగా, ఇంటిలోని ఇద్దరికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో జరుతున్న శిక్షణా శిబిరంలో పాల్గొంటోందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. -
కుప్పకూలిన విమానం.. సిబ్బంది అదృశ్యం
ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన ఓ కార్గో విమానం బంగాళాఖాతంలో కుప్పకూలిపోయింది. నలుగురు సిబ్బందితో బయలుదేరిన చిన్న కార్గో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. బంగ్లాదేశీ పట్టణంలోని కోక్స్ బజార్ తీరం సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. కో-పైలట్ , మరో ఇద్దరు అదృశ్యం అయ్యారు.. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.