Indian Air Force's MiG-21 Fighter Aircraft Crashes In Rajasthan - Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్‌-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి

Published Mon, May 8 2023 11:35 AM | Last Updated on Mon, May 8 2023 1:10 PM

Indian Air Force Mig-21 Aircraft Crash In Rajasthan - Sakshi

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్‌ జిల్లా బహ్లోల్‌నగర్‌ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.  ఈ యుద్ధవిమానం సూరత్‌గఢ్‌ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది.

అయితే మిగ్‌-21 కూలిపోవడానికి ముందే పైలట్‌ పారాచూట్‌ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు  కోల్పోయారు.  వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది.

సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.

చదవండి: టెక్సాస్‌ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement