Hanumangarh
-
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్ జిల్లా బహ్లోల్‌నగర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. #WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV — ANI (@ANI) May 8, 2023 చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి
జైపూర్: రాజస్థాన్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌గఢ్ సమీపంలో ఎదురుగా వస్తున్న జీపు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. జీపులో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఢీకొన్ని తర్వాత ట్రక్కు బోల్తాపడగా, జీపు నుజ్జునుజ్జయ్యింది. జీపు టైర్లు, ఇతర భాగాలు విడిపోయి కుప్పలా పడ్డాయి. స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
రైలు పట్టాలపై పసిబిడ్డ
జైపూర్: అమ్మ కడుపులోంచి రైలు పట్టాలపై పడ్డాడో పసిపిల్లాడు. బయట ప్రపంచంలోకి రావడంతోనే ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. '22 ఏళ్ల మన్ను తన భర్త, తల్లితో కలిసి రైలులో సూరత్‌ఘర్ నుంచి హనుమాన్‌ఘర్ బయలుదేరింది. ప్రయాణిస్తున్న సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో బాత్ రూంలోకి వెళ్లి మగ శిశువుకి జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బాబు అనుకోకుండా మరుగుదొడ్డి పైపు లోంచి కింద పడ్డాడు' అని జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కోమాలోకి వెళ్లిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించారని అధికారి చెప్పారు. పట్టాలపై ఏడుస్తున్న శిశువును గమనించిన ఎఫ్‌సీఐ గార్డు రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆ బిడ్డని హనుమాన్‌ఘర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు చేర్చారు. -
జైపూర్‌లో భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య
జైపూర్: కుటుంబ వివాదంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన భార్యను పదునైన కత్తితో పొడిచి చంపి, ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జైపూర్‌లోని హనుమాన్‌గఢ్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని హనుమాన్‌గఢ్‌లో విజయ్ (37), రజనీ (35) దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 12 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దంపతులిద్దరూ ఇంట్లో తరుచూ గొడవ పడేవారు. వీరి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో మనస్తాపం చెందిన భర్త విజయ్ తన భార్య రజనీని ఓ పదునైన కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తాను కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. రజనీ తండ్రి ఉదయం వారి ఇంటికి వచ్చిన సమయంలో వారి మృతదేహాలను చూసి నివ్వెరపోయాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.