రైలు పట్టాలపై పసిబిడ్డ | Rajasthan: Baby delivered inside train toilet falls on railway tracks, survives | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై పసిబిడ్డ

Published Tue, Feb 17 2015 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

Rajasthan: Baby delivered inside train toilet falls on railway tracks, survives

జైపూర్: అమ్మ కడుపులోంచి రైలు పట్టాలపై పడ్డాడో పసిపిల్లాడు. బయట ప్రపంచంలోకి రావడంతోనే ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

'22 ఏళ్ల మన్ను తన భర్త, తల్లితో కలిసి రైలులో సూరత్ఘర్ నుంచి హనుమాన్ఘర్ బయలుదేరింది. ప్రయాణిస్తున్న సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో బాత్ రూంలోకి వెళ్లి మగ శిశువుకి జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బాబు అనుకోకుండా మరుగుదొడ్డి పైపు లోంచి కింద పడ్డాడు' అని జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కోమాలోకి వెళ్లిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించారని అధికారి చెప్పారు.

పట్టాలపై ఏడుస్తున్న శిశువును గమనించిన ఎఫ్సీఐ గార్డు రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆ బిడ్డని హనుమాన్ఘర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement