Train toilet
-
శ్రామిక్ రైలులో విషాదం.. 5 రోజుల తర్వాత..
లక్నో: నిద్రాహారాలు లేక ఫ్లాట్‌ఫామ్‌పైనే ప్రాణాలు వదిలిన బిహార్ మహిళా వలస కూలీ ఉదంతం మరువకముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో ప్రాణాలు విడిచాడు. ఇంకో 70 కిలోమీటర్లు చేరితే ఇల్లు చేరుతానని మురిసిన ఆ వ్యక్తి.. చివరకు రైలు టాయ్లెట్లో శవమై కనిపించాడు. అయితే, చనిపోయిన ఐదు రోజుల వరకూ అతని మృతదేహం ఎవరికంటా బయటపడకపోవడం మరో విషాదం. (చదవండి: ఆ పదం తొలగించే అవకాశం ఉంటుందా?) వివరాలు.. రాష్ట్రంలోని బస్తీ జిల్లాకు చెందిన మోహన్ లాల్ శర్మ (38) ముంబైలో రోజూ కూలీ చేసే కార్మికుడు. అందరిలాగే అతనికీ కరోనా లాక్‌డౌన్‌తో దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో శ్రామిక్ రైలులో ఇంటికి బయల్దేరాడు. అందరితోపాటు మే 23న ఝాన్సీకి చేరుకున్నాడు. అనంతరం ఝాన్సీ జిల్లా యంత్రాంగం శ్రామిక్ రైలులో వచ్చిన వారిని ఆయా ప్రాంతాలకు వెళ్లే స్థానిక రైళ్లలో ఎక్కించింది. ఈ క్రమంలో శర్మ తన బంధువొకరికి కాల్ చేసి.. తనను గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్లో కలుసుకోవాలని కోరాడు. అయితే, ఆ బంధువు మే 24న శర్మ ఫోన్‌కు కాల్ చేయగా.. స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. గోరఖ్‌పూర్‌లో ప్రయాణికులను దించిన తర్వాత రైలు మే 27న తిరిగి ఝాన్సీకి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం రైల్వే కోచ్‌లు శుభ్రం చేస్తున్న క్లీనింగ్ సిబ్బంది రైలు టాయ్లెట్లో శర్మ శవం చూసి షాక్‌కు గురయ్యారు. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఝాన్సీలో ప్రయాణికులను దించిన తర్వాత.. టాయ్లెట్లో పడిపోయిన శర్మను ఎవరూ చూడలేదని అధికారులు తెలిపారు. శర్మకు కోవిడ్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే శ్రామిక్ రైలులో అనుమతించామని చెప్పారు. అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి కాలేదని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో.. ఎవరూ అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం లేదని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత శర్మ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, గడిచిన రెండు నెలల్లో దాదాపు 20 లక్షల వలస కార్మికులు సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. (చదవండి: 'ఆ ఘటన కలచివేసింది.. నిజంగా దురదృష్టకరం') -
రైలు టాయ్లెట్లో పెద్ద నోట్ల కలకలం
భువనేశ్వర్: నల్లధనం దాచుకున్న కుబేరులు కొందరు పాతనోట్లను మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతుంటే.. మరి కొందరు వాటిని వదిలించుకునేందుకు పాట్లు పడుతున్నారు. నోట్లను కాల్చి నదిలో పడేయడం, కత్తరించి రోడ్ల పక్కన విసిరేయడం, చెత్తకుండీల్లో వేయడం.. వంటి పనులు చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ టాయ్లెట్లో పాత నోట్లను పడేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రైల్వే పోలీసులు 4.5 లక్షల రూపాయల నగదును గుర్తించారు. అన్ని రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ బి-6 కోచ్‌లో ఈ మొత్తం దొరికిందని, స్వాధీనం చేసుకున్నామని రైల్వే ఎస్పీ సంజయ్ కౌషల్ చెప్పారు. ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేసినట్టు తెలిపారు. కేంద్రపడా జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు రైల్వే పోలీసు వర్గాలు వెల్లడించాయి. రైలు టాయ్‌లెట్ లోపల ఎవరో కొన్ని నిమిషాల పాటు లాక్ చేసుకుని ఉన్నట్టు కొందరు ప్రయాణికులు సమాచారం అందించారని, రైల్వే పోలీసులు వెళ్లి టాయ్‌లెట్ డోర్ తెరవగా ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చినట్టు చెప్పారు. టాయ్లెట్లో తనిఖీ చేయగా పాత నోట్ల కరెన్సీ లభించిందని, ఈ ముగ్గురిని విచారిస్తున్నట్టు తెలిపారు. -
ట్రైన్ నుంచి జారిపడిన పసికందు
-
అప్పుడే పుట్టి.. రైల్లోంచి జారిపడి!
గట్టిపిండం అనే మాట ఆ పసికందుకు సరిగ్గా సరిపోతుందేమో! తల్లి కడుపులో నుంచి బయటపడ్డ మరుక్షణమే కదులుతున్న రైలు టాయిలెట్ పైపు నుంచి జారిపడినా కూడా ప్రాణాలు భేషుగ్గా నిలిచాయి! రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ చిత్రం జరిగింది. రైలులో భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో మన్ను అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా రైలు టాయిలెట్లోకి వెళ్లిన ఆమె అక్కడే బిడ్డను ప్రసవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పుట్టిన పసికందేమో టాయిలెట్ పైపు గుండా జారిపడింది. రైలు దాదాపు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత గానీ మన్నూకుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించలేకపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాలించగా, రైలు పట్టాల మధ్యలో ఏడుస్తూ కనిపించిందా పసికందు! తల్లీ బిడ్డల్ని ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. -
రైలు పట్టాలపై పసిబిడ్డ
జైపూర్: అమ్మ కడుపులోంచి రైలు పట్టాలపై పడ్డాడో పసిపిల్లాడు. బయట ప్రపంచంలోకి రావడంతోనే ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. '22 ఏళ్ల మన్ను తన భర్త, తల్లితో కలిసి రైలులో సూరత్‌ఘర్ నుంచి హనుమాన్‌ఘర్ బయలుదేరింది. ప్రయాణిస్తున్న సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో బాత్ రూంలోకి వెళ్లి మగ శిశువుకి జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బాబు అనుకోకుండా మరుగుదొడ్డి పైపు లోంచి కింద పడ్డాడు' అని జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కోమాలోకి వెళ్లిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించారని అధికారి చెప్పారు. పట్టాలపై ఏడుస్తున్న శిశువును గమనించిన ఎఫ్‌సీఐ గార్డు రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆ బిడ్డని హనుమాన్‌ఘర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు చేర్చారు. -
రైలు టాయిలెట్లోనే బాంబుల తయారీ
సాక్షి, బెంగళూరు/చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం బెంగళూరు-గువాహటి కజీరంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలిన రెండు బాంబులను దుండగులు ఆ రైల్లోనే తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముష్కరులు బాంబు తయారీకి వాడే పదార్థాలను.. పేలుళ్లు జరిగిన ఎస్4, ఎస్5 పక్కనున్న ఎస్-7 బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి బాంబులుగా మార్చారని క్లూస్ టీం నిర్ధారించింది. తయారైన బాంబులను స్టేషన్లోకి తీసుకురావడం ప్రమాదమని భావించే ఇలా చేశారని పేర్కొంది. కార్బన్ జింక్ బ్యాటరీ, టైమర్లు అమర్చిన బాంబులను ఓ సంచిలో ఉంచి ఎస్4, ఎస్5లలో పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వీటిని హడావుడిగా ఉంచడంతో పేలుళ్ల తీవ్రత తగ్గిందన్నాయి. కాగా, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు సీబీసీఐడీ అధికారులు మరికొంతమంది అనుమానితులను గుర్తించారు. బెంగళూరు, చెన్నై స్టేషన్లతోపాటు వాటి మధ్యనున్న స్టేషన్లలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించాక కొన్ని ఆధారాలు దొరికాయని, వీటిని వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు. పోలీసుల బృందం గువాహటి చేరుకుని, కజీరంగా రైల్లో ప్రయాణించిన వారిని విచారిస్తోందని తెలిపారు. బెంగళూరులో రైలు ఎక్కిన అనుమానితుడు, చెన్నై స్టేషన్లో హడావుడిగా రైలు దిగి పరుగెత్తిన అనుమానితుడు ఒకరేనా అని తేల్చుకోవడానికి నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు. ఈ పేలుళ్లకు, గత ఏడాది అక్టోబర్‌లో పాట్నాలో జరిగిన పేలుళ్లకు వాడిన బాంబులు ఒకేలా ఉండడంతో తాజా పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్, లేదా ఇతర ఉగ్రవాద సంస్థల పనేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఒక పోలీసు బృందాన్ని పాట్నాకు పంపామని వెల్లడించారు. కజీరంగా రైలు బోగీల పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోగా 14 మంది గాయపడడం తెలిసిందే. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. -
ఆ బాంబు టాయిలెట్లోనే తయారు చేశారు
బెంగళూరు : చైన్నై రైల్వే స్టేషన్లో పేలిన బాంబును దుండగులు రైలు టాయిలెట్లోనే తయారు చేసినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలను దుండగులు రైల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎస్-7 కోచ్‌లోని టాయిలెట్లో వాటిని క్రోడీకరించి బాంబును తయారు చేశారని క్లూస్ టీం నిర్ధారణకు వచ్చింది. బాంబును పూర్తిగా తయారు చేసి రైల్వేస్టేషన్‌లోకి తీసుకురావడం ప్రమాదమని భావించడం వల్లే దుండగులు ఇలా చేసి ఉంటారని ఆ టీం అభిప్రాయపడింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి మృతి చెందింది. మరో 15 మంది గాయపడ్డారు.