అప్పుడే పుట్టి.. రైల్లోంచి జారిపడి! | New born survives after she slips down train toilet | Sakshi
Sakshi News home page

అప్పుడే పుట్టి.. రైల్లోంచి జారిపడి!

Published Tue, Feb 17 2015 7:10 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

New born survives after she slips down train toilet

గట్టిపిండం అనే మాట ఆ పసికందుకు సరిగ్గా సరిపోతుందేమో! తల్లి కడుపులో నుంచి బయటపడ్డ మరుక్షణమే కదులుతున్న రైలు టాయిలెట్ పైపు నుంచి జారిపడినా కూడా ప్రాణాలు భేషుగ్గా నిలిచాయి! రాజస్థాన్లోని హనుమాన్గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ చిత్రం జరిగింది. రైలులో భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో మన్ను అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

ఈ విషయం ఎవరికీ చెప్పకుండా రైలు టాయిలెట్లోకి వెళ్లిన ఆమె అక్కడే బిడ్డను ప్రసవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పుట్టిన పసికందేమో టాయిలెట్ పైపు గుండా జారిపడింది. రైలు దాదాపు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత గానీ మన్నూకుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించలేకపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాలించగా, రైలు పట్టాల మధ్యలో ఏడుస్తూ కనిపించిందా పసికందు! తల్లీ బిడ్డల్ని ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement