newborn
-
నవజాత శిశువుల్లో హైపోగ్లైసీమియా
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.గర్భిణులే జాగ్రత్త వహించాలిబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.ముందుగా గుర్తిస్తే మేలుశిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలుఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. -
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం
‘ఇప్పటికే నాకు ఆరుగురు ఆడ పిల్లలు పుట్టారు. మళ్ల అమ్మాయే పుట్టింది. మా అత్త నన్నెంతో ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నాను. మీకు అనుకూలంగా ఉంటే నా కుమార్తెను పెంచండి. నన్ను క్షమించండి’.. అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఒక మాతృమూర్తి చేసుకున్న అక్షర వేదన ఇది. ఆ తల్లి తన నవజాత ఆడ శిశువును ఒంటరిగా ఆ మహిళా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఆమెకు ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏడవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది. అత్తింటిలో పోరు పడలేక ఆ మహిళ తన కుమార్తెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఒక లెటర్‌ను కూడా అక్కడ ఉంచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా ఆసుపత్రిలో రోదిస్తున్న శిశువును గమనించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అలాగే ఆ చిన్నారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నవజాత శిశువును వైద్యులు వార్డుకు తరలించారు.ఈ సందర్భంగా భరత్పూర్ జనతా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హిమాంశు గోయల్ మాట్లాడుతూ ఈ చిన్నారి 3 రోజుల క్రితమే జన్మించిందని అన్నారు. చిన్నారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే -
సంచలనం: గంగలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అలనాటి కర్ణుడుని తలపిస్తూ ఓ పసిపాప చెక్కపెట్టెలో గంగా నదిలో తేలియాడిన ఘటన పలువురి ఆశ్చర్య పరిచింది. దీనిపై స్థానికులు ఆశా జ్యోతి కేంద్రానికి సమాచారం అందించారు. అనంతరం 22 రోజుల పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాప బాధ్యతను పూర్తిగా తీసుకుంటామని ప్రకటించినట్టు ఐఏఎన్ఎస్ వావార్తా సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డకొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం చోటు చేసుకుంది. చంటిబిడ్డ ఏడుపులను స్థానికంగా పడవ నడిపే వ్యక్తి గమనించాడు. అతను అందించి సమాచారం ప్రకారం మహభారతంలో కుంతీదేవి కర్ణుడిని పెట్టెలో పెట్టి వదిలి ఘటనను తలుచుకుందో ఏమో కానీ ఆ తల్లి దుప్పట్లో చుట్టిన తన బిడ్డను చెక్కపెట్టెలో పెట్టి భద్రంగా గంగానదిలో విడిచిపెట్టింది. అంతేకాదు బిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా చేర్చింది. అలాగే బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. ఇదంతా గంగమ్మ తనకు ఇచ్చిన వరమని నావికుడు మురిసిపోయాడు. ఈ బిడ్డనే తానే పెంచుకుంటానని చెప్పాడు. కానీ దీన్ని నిరాకరించిన పోలీసులు సంఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. A 22-day old baby girl was found abandoned in a wooden box floating in the Ganga river in Ghazipur district. Chief Minister #YogiAdityanath has announced that the #UttarPradesh government will take the full responsibility of the child and will ensure its proper upbringing. pic.twitter.com/1D5NxHmCfA — IANS Tweets (@ians_india) June 16, 2021 -
ఎనిమిదో తరగతి ఫెయిల్: బ్లేడ్‌తో డెలివరీ
లక్నో: అంతులేని నిర్లక్ష్యం ఓ గర్భిణీతో పాటుగా, నవజాత శిశువు ప్రాణాలను బలితీసుకుంది. రిజిస్ట్రేషన్ లేని ఓ నర్సింగ్ హోమ్‌లో ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి గర్భిణీకి డెలివరీ చేయాడానికి ప్రయత్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. రేజర్ బ్లేడ్‌తో ఆపరేషన్ చేయడంతో ఇలా జరిగింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలోని సైనీ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నిందితుడిని 30 ఏళ్ల రాజేంద్ర శుక్లాగా గుర్తించారు. అతడు 8వ తరగతి వరకు చదివినట్టుగా తేలింది. వివరాలు.. రాజేశ్ సహనీ అనే వ్యక్తి స్థానికంగా మా శార్దా ఆస్పత్రి పేరుతో ఓ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. పైగా ఇందులో పనిచేసేందుకు ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన రాజేంద్ర శుక్లా అనే వ్యక్తిని నియమించుకున్నాడు రాజేశ్. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాజారామ్ అనే వ్యక్తి తన భార్య పూనమ్ పురిటి నొప్పులతో బాధపడుతుంటంతో ఆమెను ఒక మంత్రసాని వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆ మంత్రసాని డెలివరీ చేయడం తన వల్ల కాదని.. వెంటనే ఆమెని ఆరోగ్య కేంద్రానికి తరలించమని సలహా ఇచ్చింది. దాంతో అతడు పూనమ్‌ను రాజేష్‌కు చెందిన నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ అనుభవం లేని రాజేంద్ర శుక్లా పూనమ్‌కు చికిత్స అందించాడు. ఆపరేషన్ చేసేందుకు రేజర్ బ్లేడ్ వాడాడు. దీంతో పూనమ్‌కు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించమని అక్కడివారు చెప్పారు. అయితే సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో రాజారామ్ తన భార్యను 140 కిలోమీటర్ల దూరంలో లక్నోలోని కేజీఎంయూ ట్రామా కేంద్రానికి తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇక, ఈ ఘటనపై రాజారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేంద్ర శుక్లా, రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అక్రమ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆరోగ్య కార్యదర్శికి లేఖ రాశారు. చదవండి: నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు.. -
బిడ్డకు కరోనా, తల్లికి మాత్రం నెగెటివ్
న్యూఢిల్లీ: కరోనా బారిన పడ్డ గర్భిణిలకు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు వింటూనే ఉన్నాం. అయితే కరోనా నెగెటివ్ మహిళ జన్మనిచ్చిన బిడ్డకు పాజిటివ్ అని తేలింది. ఈ షాకింగ్ ఘటన గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో గర్భంతో ఉన్న ఓ మహిళ జూన్ 11న కరోనాతో రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో జూన్ 25న మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అనే వచ్చింది. జూలై 7న మూడోసారి జరిపిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. కోవిడ్ నుంచి బయటపడ్డ ఆమె తర్వాతి రోజు రాత్రి 8.50 గంటలకు పసికందుకు జన్మనిచ్చింది. (చుక్కల్లో కోవిడ్-19 ఔషధం ధర..) ఆరు గంటల తర్వాత ఆ పసిగుడ్డుకు పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. శిశువులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. దీనిపై ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి వైద్యులు రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కరోనా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గర్భంలో ఉన్న శిశువుకు కరోనా సోకడమనేది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (తెలిసింది కొంతే.. తెలియనిది ఇంకెంతో!) -
కోవిడ్-19: వారికి సోకదు
బీజింగ్: కరోనా వైరస్ తల్లుల నుంచి బిడ్డలకు సోకదని చైనాలో జరిగిన అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. హౌఝాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఆఫ్ పీడియాట్రిక్స్ తాజా సంచికలో ప్రచురితమైంది. వైరస్‌కు కేంద్ర బిందువైన హుబేలోని వూహాన్లో నలుగురు గర్భిణులపై ఈ అధ్యయనం జరిగింది. వీరందరూ కోవిడ్ బారిన పడినప్పుడే పిల్లలకు జన్మనిచ్చారు. నవజాత శిశువులను ఐసీయూలో ఉంచి సాధారణ ఆహారం అందించినప్పటికీ ఎవరిలోనూ జ్వరం, దగ్గు లాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని తెలిపారు. పుట్టిన నలుగురిలో ముగ్గురిలో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు లేవని స్పష్టం కాగా, నాలుగో బిడ్డపై పరీక్షలు చేసేందుకు తల్లి నిరాకరించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక పసిబిడ్డ మూడు రోజులపాటు కొద్దిపాటి శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొందని తెలిపారు. (చదవండి: ‘కోవిడ్’ దిగ్బంధనం) కరోనా వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభం వాషింగ్టన్: ప్రాణాంతక కోవిడ్‌కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్‌కు ప్రయోగాత్మక టీకా వేశారు. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు చెప్పారు. సియాటెల్‌లోని కైసర్ పెర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. తీవ్రమైన దుష్ప్రభావాలేవీ లేనట్టు నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నామని, ఇందులో వైరస్ ఏదీ లేని కారణంగా టీకా తీసుకున్న వ్యక్తికి కోవిడ్ సోకే అవకాశమూ లేదని వివరించారు. (కరోనా వైరస్‌కు రెండు మందులు) -
అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు!
అమీ జాక్సన్ అమ్మయింది. ఇందులో విశేషమేమే లేకున్నా.. అమ్మగా అమీ చేసిన వినూత్న ప్రయత్నం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. తల్లీపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో చెప్పడానికి అమీ జాక్సన్ తన కొడుక్కి పాలిస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలిస్తూ.. తల్లీపాల ఆవశ్యకతను చాటుతూ పెట్టిన ఫొటోపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘యాండ్రియాస్.. మా ఏంజెల్. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్ చేస్తూ పాపతో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో అమీ జాక్సన్ హీరోయిన్గా నటించారు. ఇండియాలోని పలు భాషల్లో నటించిన అమీ జాక్సన్ హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. డాన్సర్‌గా, సింగర్‌గా, నటిగా నిరూపించుకున్న జాక్సన్.. సామాజికంగానూ ముందుంటానని చెప్పారు. -
మరో పెద్దాసుపత్రి నిర్వాకం: బతికుండగానే...
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దాసుపత్రుల అంతులేని నిర్లక్ష్యానికిఅద్దం పట్టిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నగాక మొన్న దేశ రాజధాని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రి ఫోర్టిస్ నిర్వాకం వెలుగులోకి రాగా ఈ కోవలోకి మ్యాక్స్ ఆసుపత్రి చేరింది. ఫోర్టిస్ నిర్లక్ష్యానికి డెంగీతో బాధ పడుతున్న ఏడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన మరవక ముందే..ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రి లోమరో విషాదం నెలకొంది. నవజాత శిశువు బతికుండగానే.. చనిపోయిందని ఇక్కడి వైద్యులు ప్రకటించేశారు. శిశువును ఆరు వరుసల ప్లాస్టిక్ పేపర్లో చుట్టేసి మరీ అప్పగించారు. అంతేకాదు పుట్టిన కవల బిడ్డల చికిత్సకు భారీమొత్తంలో బిల్లు వేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే...ప్రవీణ్ అనే వ్యక్తి భార్య నవంబరు 30వ తేదీన కవల పిల్లలకు మ్యాక్స్ ఆస్పత్రిలో జన్మనిచ్చింది. అయితే వీరిలో ఒకరు మృతి చెందారని.. మరొకరికి అత్యాధునిక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇంజక్షన్‌ను రూ.35 వేలు, రోజుకు లక్ష రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని చెప్పింది. ఇంతలోపే రెండో శిశువు కూడా మృతి చెందిందని పేరెంట్స్‌కు వైద్యులు చెప్పారు. దీంతో ఇద్దరు శిశువులను తీసుకుని ఖననానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా శిశువు కదిలడం..శ్వాస తీసుకోవడాన్ని గమనించిన బందువులు వెంటనే శిశువును మరో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ బేబి రికవరీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రవీణ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన షాకింగ్‌కు గురి చేసిందని.. అతి పెద్ద నిర్లక్ష్యమని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. తక్షణమే ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడారు. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనలను కోరామని, విచారణ జరుగుతోందని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. మరోవైపు మాక్స్ హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. పూర్తి విచారణ జరిపించాల్సిందిగా సంబంధిత శాఖను ఆదేశించినట్టుగా ట్విట్టర్లో వెల్లడించారు. కాగా మ్యాక్స్ ఆస్పత్రిలో కవలలకు వైద్యం అందించిన డాక్టర్ సెలవులో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. Sought a report on shocking criminal negligence byMaxHospitalShalimar Bagh & directed Dept to conduct a inquiry into this unacceptable act — Satyendar Jain (@SatyendarJain) December 1, 2017 -
మంట కలిసిన మానవత్వం
-
రామాంతపూర్‌లో దారుణం
హైదరాబాద్: అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుండి పక్కన పడేసి వెళ్లారు. ఈ సంఘటన నగరంలోని రామాంతపూర్ వెంకట్‌రెడ్డి నగర్లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక బస్టాప్ పక్కన ఉన్న చెత్తకుండి వద్ద అప్పుడే పుట్టిన చిన్నారి ఏడుస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు శిశువును వైద్య చికిత్సల నిమిత్తం నీలొఫర్ ఆస్పత్రికి తరలించారు. పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
నవజాత శిశు సంరక్షణ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)లో పని చేస్తున్న వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి శుక్రవారం ఆస్పత్రిలోని అకాడమిక్ హాల్లో యూని సెఫ్ ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ బలరాం మాట్లాడారు. అప్పుడే పుట్టిన శిశువులకు మరింత మెరుగైనా వైద్యం అందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు తోడ్పడుతాయన్నారు. తెలంగాణ జిల్లాలో నల్లగొండ, మెదక్ జిల్లాలో పిడియాట్రిక్ విభాగంలో మెరుగైనా వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు నేషనల్ నూయోనెటానలజీ ఫోరం సర్టిఫికేట్‌ను ఎన్ఎన్ఎఫ్ ప్రదానం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి సైతం ఈ సర్టిఫికేట్ అందించే దిశగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఈక్రమంలో ఈనెల 10వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి ఇక్కడి ఎస్ఎన్సీయూ ప్రమాణాలను పరిశీలిస్తుందని చెప్పారు. -
ఆడబిడ్డను 'అమ్మే' సింది!
ధన్బాద్ః ముగ్గురు పిల్లలకు మాతృమూర్తి. అయినా మరోకాన్పుకు సిద్ధమైంది. నాలుగోసారి ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. అప్పుడుకానీ ఆమెకు పెంచలేమన్న భయం తెలియలేదు కాబోసు.. కళ్ళుతెరవని పసిగుడ్డును బేరం పెట్టేసింది. పిల్లలు లేని ఓ మహిళకు కేవలం 7 వేల రూపాయలకు పొత్తిళ్ళలో బిడ్డను అమ్మేసింది. ఆర్థిక దారిద్ర్యం ఆమెను 'అమ్మ'కానికి పురిగొల్పింది. జార్ఖండ్ ధన్‌బాద్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ళ దులాలీ దేవి తన నవజాత శివువును పాటలీపుత్ర మెడికల్ కాలేజీ (పీఎంసీహెచ్) వద్ద ఓ పిల్లలు లేని మహిళకు 7000 రూపాయలకు అమ్మేసింది. దులాలీ దేవికి అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా.. ఆమె నాలుగో ప్రసవంలో పీఎంసీహెచ్ లోని గైనకాలజీ వార్డులో ఒక ఆడ, ఒక మగ సహా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. దీంతో పుట్టిన కవలల్లోని ఆడబిడ్డను దులాలీ దేవి.. పిల్లలు లేని షహీదా కతూన్ కు 7 వేల రూపాయలకు అమ్మేసినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి (సీడబ్ల్యూసీ) ఛైర్ పర్సన్ నీతా సిన్హా తెలిపారు. ఆర్థిక అవసరాలతో దులాలీ దేవి బిడ్డను అమ్మేసిన సమాచారం తెలుసుకున్న సీడబ్ల్యూసీ జోక్యంతో... 24 గంటలు తిరిగే లోపు బిడ్డ తల్లివద్దకు చేరింది. శిశువును వెనక్కు తెప్పించిన సమయంలోనే షహీదా కనూన్ ను జూలై 21న విచారణకోసం తమ కార్యాలయానికి రమ్మని పిలిచినట్లు సిన్హా తెలిపారు. మరోవైపు పీఎంసీహెచ్ ఆసుపత్రిలో పసిపిల్లల అమ్మకాలపై ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రారంభ నివేదికల ప్రకారం తమ ఆస్పత్రిలోని సిబ్బందికి అమ్మకాలకు ఎటువంటి సంబంధం లేదని పీఎంసీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ రంజన్ పాండే చెప్పారు. అయితే ఆస్పత్రిలో ప్రస్తుత సంఘటన ఎలా జరిగింది అన్నదానిపై విచారణకు ఆదేశించింది. తన ఐదుగురు పిల్లలను పెంచే స్థోమత లేకపోవడంతోనే బిడ్డను అమ్మే ప్రయత్నం చేసినట్లు దులాలీదేవి ఆస్పత్రి అధికారులు, సీడబ్ల్యూసీ ముందు ఒప్పుకుంది. తన భర్త ఓ రోలింగ్ మిల్లులో పని చేస్తాడని, అతడి ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలడం లేదని.. పొట్ట గడవడంకోసమే తన బిడ్డను అమ్మకానికి పెట్టాల్సివచ్చిందని దులాలీ ఆవేదన వ్యక్తం చేసింది. -
చిత్రం వెనుక కథ!
కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వుతుంటే... వారికి గతజన్మలో విషయాలు గుర్తుకొస్తాయని , దేవుడే ఆ చిన్నారులను నవ్విస్తాడని వారి వారి నమ్మకాలను బట్టి చెప్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో ఇటీవల కనిపించిన ఓ పసిపాప చిత్రం.. కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. కొత్తగా లోకంలో అడుగుపెట్టి, నిద్రలోనే బోసినవ్వులను కురిపిస్తూ కనిపించిన ఆ ఫోటో వెనుక కథ ఎందరినో కదిలింప జేసింది. సుమారు నలభై లక్షలమంది లైక్ చేసిన చిత్రం.. ఎనభైవేల సార్లు షేర్ కూడ అయ్యింది. ఇంతకూ ఆ చిత్రం వెనుక కథేమిటో చూద్దామా. తొమ్మిది నెలలు మోసి కని పెంచే తల్లితోపాటు, కంటికి రెప్పలా కాపాడే తండ్రి స్పర్శకు సంబంధించిన విషయం.. ప్రతి గుండెను తట్టింది. లోకం తెలీని పసిపాప ప్రస్తుతం నిద్రలో నవ్వులు చిందిస్తున్నా... ఊహ తెలిపిన తర్వాత ఎంత వేదన పడుతుందో అంటూ సానుభూతి వ్యక్తమౌతోంది. ఆమె పుట్టడానికి కేవలం నెల రోజుల ముందు బైక్ రేసర్ అయిన తండ్రి చనిపోయినా.. అతడు వాడిన గ్లౌజ్ లు, హెల్మెట్ స్పర్శతోనే ఆమె నిద్రలో నవ్వులు పూయించడం ఓ మిరాకిల్ గా మారింది. మోటార్ సైకిల్ రేస్ అంటే అమితంగా ఇష్టపడే హెక్టార్ డానియల్ ఫెర్రర్ అల్వరేజ్ ఫ్లోరిడాలో ఏప్రిల్ నెలలో స్నేహితుడి చేతులో హత్యకు గురయ్యాడు. ఆయన జ్ఞాపకాలను మరచిపోలేని అల్వరేజ్ భార్య.. కేథరిన్ విలియమ్స్.. ఆయన వాడిన గ్లౌజ్ లు , హెల్మెట్ ను అతడి ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంది. నెలరోజుల తర్వాత ఆయన గుర్తుగా బిడ్డ ఆబ్రే పుట్టినా... మామూలు ప్రపంచంలోకి రాలేకపోయింది. భర్తను తలచుకొంటూ, అతడి ప్రేమకు గుర్తుగా గ్లౌజ్ లు, హెల్మెట్ దాచుకుంది. బిడ్డను హత్తుకున్నట్లుగా, తండ్రి చేతుల్లోనే నిద్రపోతున్నట్లు గ్లౌజ్ లు, హెల్మెట్ బిడ్డను హత్తుకున్నట్లుగా పెట్టి ఫోటోలు తీయించింది. గాఢంగా నిద్రపోతున్న ఆ పసిపాప.. తండ్రి గ్లౌజుల స్పర్మ తగలగానే చిరునవ్వులు ప్రారంభించిందని, నిజంగా ఆ సన్నివేశం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ ఫోటోగ్రాఫర్ కిమ్ స్టోన్ వివరించాడు. పసిపాప అమ్మమ్మ ఫోటో సెషన్ కోసం తనను బుక్ చేసిందని, చిన్నారి పుట్టక ముందే ఆమె తండ్రి చనిపోయినట్లు ఆవిడ చెప్పిందని, ఆ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తీయాలంటూ తనను బుక్ చేశారని కిమ్ స్టోన్ తెలిపాడు. కుమార్తెను నిజంగా పట్టుకున్నట్లు గ్లౌజ్ లను పెట్టగానే..పసిపాప బోసి నవ్వులు చిందించడం ఆశ్చర్యం కలిగించినట్లు కిమ్ చెప్తున్నాడు. అలా కిమ్ తీసిన ఫోటోల్లోని ఓ చిత్రమే ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఫొటో వివరాలను చెప్తూ కిమ్... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి తక్కువ వ్యవధిలో కోట్లకొద్దీ మనసులను దోచుకుంది. ఆ చిట్టితల్లి చిరకాలం అలా నవ్వుతూనే ఉండాలంటూ ప్రతి మనసూ కోరుకుంది. స్టోన్ పోస్ట్ కు స్పందించిన విలియమ్స్.. అలాగే తన చిన్నారికి జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు సందేశాన్ని పంపింది. తన బిడ్డ కోసం ప్రపంచం ఎంత ప్రార్థించిందో ఆమె పెద్దయిన తర్వాత చూపిస్తానంటూ విలియమ్స్ తన సందేశంలో వివరించింది. తండ్రి కలలను ఫోటో నిజం చేసిందని, ఆయన చనిపోయినా చిరస్థాయిగా నిలిచేట్టు చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నిద్రలో నవ్వుతుంటే పసిపాపలకు దేవుళ్ళు కనిపిస్తారంటారు... అది నిజంగా నిజమేనేమో అంటూ స్టోన్ వ్యాఖ్యానించగా.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫోటోను చూసి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తండ్రి పాత్రకు తగిన గుర్తింపునిచ్చే ఉద్దేశ్యంతో సోనారా.. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే పండుగ వెలుగు చూసేలా చేస్తే... అదే సమయంలో.. తండ్రి స్పర్శ, జ్ఞాపకాలకు సంబంధించిన గుర్తులతో 'ఆబ్రే' ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. అందమైన 'ఫాదర్స్ డే' ఉత్సవానికి మరో మచ్చుతునకైంది. -
సీసీకెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు
హువనాన్(చైనా): కిడ్నాప్‌కు గురైన రెండు రోజుల పసికందును సీసీకెమెరా వీడియో ఫుటేజీ సహాయంతో కేవలం ఏడుగంటల్లోనే చైనా పోలీసులు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చగలిగారు. ఈ సంఘటన ఈశాన్య చైనాలోని హువనాన్ కౌంటీలోని హిలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులోకి ప్రవేశించిన ఓ అనుమానిత మహిళ రెండు రోజుల వయసున్న బాలున్ని కిడ్నాప్ చేసింది. బాలున్ని తీసుకొని బయటకు వెళ్లి అక్కడే ఉన్న వాహనంలో గుట్టుచప్పుడుకాకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ హోటల్ గదికి వెళ్లింది. అక్కడి నుంచి మరో వాహనంలో మరో చోటుకి వెళ్లింది. ఈ తతంగం అంతా సీసీకెమెరాల్లో రికార్డయింది. సమాచాం అందుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా అనుమానితురాలి కోసం హువనాన్ కౌంటీ మొత్తన్ని జల్లెడ పట్టారు. మొత్తం 300 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఏడు గంటల్లోనే బాలున్ని కనుగొన్న పోలీసులు కిడ్నాపర్ల చెరనుంచి సురక్షితంగా రక్షించగలిగారు. -
లక్షలమందిని ఆకట్టుకుంటున్న కవలలు!
కవల పిల్లలు పుట్టడమే ఓ వింతగా కనిపిస్తుంది. నవజాత శిశువుల్ని చూసేందుకు కూడ అందరూ ఎంతో ఇష్టపడతారు. అటువంటిది ఆ పిల్లలు ఒకరికొకరు చేతులు పట్టుకొని మరీ పుట్టారంటే నిజంగా అది వింతే కదా! అందుకేనేమో ఇప్పుడు ఆ పసివాళ్ళ వీడియో ఫేస్ బుక్ యూజర్లను కట్టి పడేస్తోంది. ఆంథియా జాక్సన్, రూస్ ఫోర్డ్ ల కు పుట్టిన నవజాత శిశువులు క్రిస్టినా, క్రిస్టియన్ లు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుట్టిన ఆ పిల్లలు తల్లిదండ్రులకే ఎంతో ఆశ్చర్యం కలిగించారు. అందుకేనేమో ఆ పిల్లల మురిపాన్ని అందరితో పంచుకోవాలనుకున్న తల్లిదండ్రులు వారిద్దరినీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియోను కోటీ డెభ్భై లక్షలమంది చూశారు. అంతే కాదు లక్షా అరవై వేల మంది షేర్ కూడ చేశారు. అసలు తల్లి గర్భంలో ఉండాల్సిన కన్నా 11 వారాల ముందే... అంటే 28 వారాలకే పుట్టిన ఆ నవజాత శిశువులు ఒక్కొక్కరూ ఓ కేజీ మాత్రమే బరువున్నారు. అయితేనేం చేయీ చేయీ పట్టుకొని ముందుకు నడుద్దాం అన్నట్లుగా ఎంతో ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందర్నీఅకట్టుకుంటోంది. వీడియోను అనేకమంది ఇష్టంగా చూస్తుండటంతో తల్లి ఆంథియా.. ఆ కవల పిల్లల మరిన్ని ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పోస్ట్ చేసింది. అయితే దానికి వెనుక ఆతల్లి మనసు ఆరాటం ఉంది. తన పిల్లలు ప్రీమెట్యూర్డ్ గా పుట్టడంతో వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ఇతర తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను ఆమె ఆశిస్తోంది. అటువంటి పిల్లల పెంపకంపై అనుభవజ్ఞులైనవారి నుంచి సలహాలను కూడ ఆ తల్లి కోరుకుంటోంది. '' ప్రిమెట్యూర్ కవలలు పుట్టడంతో నేను చాలా ఖంగారు పడ్డాను. అయితే వారు కాస్త స్థిరపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. నేను వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడానికి చిన్న కారణం ఉంది. తల్లిదండ్రులంతా ఇచ్చే కామెంట్లతో నాలో ధైర్యం కలుగుతుందని ఆశించాను.'' అంటూ ఆంథియా ఫేస్ బుక్ లో తన కామెంట్ ను కూడ పోస్ట్ చేసింది. '' మా పిల్లలకు ఇంతటి ఆదరణ దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా పిల్లలకు కూడ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని కూడ తన భావాలను వ్యక్తం చేసింది. -
ఆస్పత్రిలో చిన్నారి మృతి: కుటుంబ సభ్యుల ధర్నా
ఆదిలాబాద్: అప్పుడే పుట్టిన శిశువు ఆస్పత్రిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి ప్రాణాలొదిలిందని బంధువులు ఆస్పత్రి గేట్ వద్ద ధర్నాకు దిగారు. వివరాలు..రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు శంకర్ కూమార్తె శనివారం ఆస్పత్రిలో ప్రసవించింది. ఆ శిశవుకు పరీక్షలు చేస్తుండగా పుట్టిన 30 నిమిషాలకే మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్షంతోనే చిన్నారి మృతి చెందిందని బంధవులు ఆందోళనకు దిగారు. -
అప్పుడే పుట్టి.. రైల్లోంచి జారిపడి!
గట్టిపిండం అనే మాట ఆ పసికందుకు సరిగ్గా సరిపోతుందేమో! తల్లి కడుపులో నుంచి బయటపడ్డ మరుక్షణమే కదులుతున్న రైలు టాయిలెట్ పైపు నుంచి జారిపడినా కూడా ప్రాణాలు భేషుగ్గా నిలిచాయి! రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ చిత్రం జరిగింది. రైలులో భర్తతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో మన్ను అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా రైలు టాయిలెట్లోకి వెళ్లిన ఆమె అక్కడే బిడ్డను ప్రసవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పుట్టిన పసికందేమో టాయిలెట్ పైపు గుండా జారిపడింది. రైలు దాదాపు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత గానీ మన్నూకుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించలేకపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాలించగా, రైలు పట్టాల మధ్యలో ఏడుస్తూ కనిపించిందా పసికందు! తల్లీ బిడ్డల్ని ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. -
ఆస్పత్రిలో ఆడ శిశువు మాయం
-
చీమలపుట్టలో పసిపాప!!
లోకంలో పాపం, పుణ్యం అంటే ఏంటో ఇంకా ఆ పసికందుకు తెలియదు. కానీ ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన నేరం. ఆ నేరానికి గాను ఆమెను చీమలపుట్టలో వదిలిపెట్టారు కసాయి తల్లిదండ్రులు. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని తేని జిల్లా వీరజక్కమ్మాళ్పురంలో వెలుగుచూసింది. చీమలు విపరీతంగా కుడుతుండటంతో బాధ భరించలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు గమనించి ఆమెను బయటకు తీసి, పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆమెను వెంటనే తేనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి, ఆమెకు చికిత్స అందించారు. ఆమె ముఖం, ఇతర భాగాలు చీమలు కుట్టడం వల్ల బాగా వాచాయని వైద్యులు తెలిపారు. పాప త్వరగా కోలుకుంటోందని, ఆమె శరీర బరువు సాధారణంగానే ఉందని చెప్పారు.