సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అలనాటి కర్ణుడుని తలపిస్తూ ఓ పసిపాప చెక్కపెట్టెలో గంగా నదిలో తేలియాడిన ఘటన పలువురి ఆశ్చర్య పరిచింది. దీనిపై స్థానికులు ఆశా జ్యోతి కేంద్రానికి సమాచారం అందించారు. అనంతరం 22 రోజుల పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాప బాధ్యతను పూర్తిగా తీసుకుంటామని ప్రకటించినట్టు ఐఏఎన్ఎస్ వావార్తా సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా మారింది.
ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డకొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం చోటు చేసుకుంది. చంటిబిడ్డ ఏడుపులను స్థానికంగా పడవ నడిపే వ్యక్తి గమనించాడు. అతను అందించి సమాచారం ప్రకారం మహభారతంలో కుంతీదేవి కర్ణుడిని పెట్టెలో పెట్టి వదిలి ఘటనను తలుచుకుందో ఏమో కానీ ఆ తల్లి దుప్పట్లో చుట్టిన తన బిడ్డను చెక్కపెట్టెలో పెట్టి భద్రంగా గంగానదిలో విడిచిపెట్టింది. అంతేకాదు బిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా చేర్చింది. అలాగే బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. ఇదంతా గంగమ్మ తనకు ఇచ్చిన వరమని నావికుడు మురిసిపోయాడు. ఈ బిడ్డనే తానే పెంచుకుంటానని చెప్పాడు. కానీ దీన్ని నిరాకరించిన పోలీసులు సంఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు.
A 22-day old baby girl was found abandoned in a wooden box floating in the Ganga river in Ghazipur district.
— IANS Tweets (@ians_india) June 16, 2021
Chief Minister #YogiAdityanath has announced that the #UttarPradesh government will take the full responsibility of the child and will ensure its proper upbringing. pic.twitter.com/1D5NxHmCfA
Comments
Please login to add a commentAdd a comment