Ganga
-
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
పట్నాకు గంగ ముప్పు.. పాఠశాలలు మూసివేత
పట్నా: బీహార్‌లోని పట్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 76 ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ఈ పాఠశాలలు సెప్టెంబర్ 26 వరకు మూసివేయనున్నారు. పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గంగా నది చాలా చోట్ల ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు.జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల సమయానికి పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయి (48.60 మీటర్లు) దాటి ప్రవహిస్తోంది. అలాగే హతిదా, దిఘా ఘాట్ల వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో డిఎండి అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసీఎస్) ప్రత్యయ అమృత్ 12 జిల్లాల అధికారులతో ఆన్లైన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గంగానది నీటిమట్టం పెరిగితే అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.గంగా నది ఒడ్డున ఉన్న దాదాపు 12 జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 13.56 లక్షల మంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, పట్నా, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్, ఖగారియా, భాగల్పూర్, కతిహార్ తదితర 12 జిల్లాలకు చెందిన ప్రజలను ప్రత్యేక సహాయ శిబిరాలకు తరలించారు.ఇది కూడా చదవండి: వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి.. -
కాశీలో గంగానది ఉగ్రరూపం.. 84 ఘాట్లు నీట మునక
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. వరదల కారణంగా గంగానది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఘాట్లకు సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాశీలోని మొత్తం 84 ఘాట్లు నీట మునిగాయి. ప్రస్తుతం హరిశ్చంద్ర ఘాట్ వీధుల్లో దహన సంస్కారాలు జరుగుతున్నాయి.గత 10 రోజులుగా వారణాసిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీధుల్లో దహన సంస్కారాలు చేయడం వల్ల కర్మకాండలు చేసేవారు సరైన సంప్రదాయాలను పాటించలేకపోతున్నారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాయంత్రం పూట దహన సంస్కారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మణికర్ణిక ఘాట్‌లో దహన సంస్కారాల కోసం జనం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. -
ఖైరతాబాద్ : గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తెప్పోత్సవం (ఫొటోలు)
-
UP Flood: నీట మునిగిన 900 గ్రామాలు
ఉత్తరప్రదేశ్‌లోని గంగా, గోమతి, ఘఘ్రా నదుల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. అలాగే రామగంగ, గర్రా, ఖానౌట్, రాప్తి, బుధి రాప్ట్, కానో, శారదా నదులు కూడా ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో లఖింపూర్ ఖేరీ, బల్రాంపూర్, అయోధ్య, ఉన్నావ్, బల్లియా, బస్తీ సహా 20 జిల్లాల్లోని దాదాపు 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. బల్లియాలో ఘఘ్రా నది కోతకు గురికావడంతో 13 గ్రామాలు నీట మునిగాయి.వారణాసిలోని గంగా నది నీటిమట్టం 48 గంటల్లో రెండు మీటర్ల మేర పెరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష జరిపేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, 24 గంటల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 1,571 గ్రామాలతో పాటు బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్ పట్టణ ప్రాంతాలు వరదల బారిన పడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.కాశీలో గంగానది నీటిమట్టం వరుసగా రెండో రోజు కూడా పెరుగుతూనే ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం గంగానది నీటిమట్టం 61.79 మీటర్లుగా నమోదైంది. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పురాతన దశాశ్వమేధ ఘాట్‌లో సాయంత్రం జరగాల్సిన గంగా హారతి వేదికను కూడా మార్చాల్సి వచ్చింది. విశ్వనాథ్ ధామ్ గంగా గేట్ పక్కనే ఉన్న లలితా ఘాట్, మణికర్ణికా ఘాట్ ర్యాంప్‌పైకి నీరు చేరుకుంది. -
భక్తిలో విశ్వాసం..!
భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి -
గంగలో భక్తుల పుణ్యస్నానాలు.. తీరంలో సందడి
ఈరోజు (ఆదివారం) గంగా దసరా.. ఈ సందర్భంగా భక్తులు వారణాసిలోని గంగా దశాశ్వమేధ ఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. అలాగే ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్‌లోని గంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.గంగా నది ఘాట్ల వద్ద స్నానాలు చేసే భక్తులకు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్నానఘట్టాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించాలని, నదీ ఘాట్ల వద్ద తగినంత వెలుతురు ఉండేలా చూడాలని, బారికేడింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.గత కొన్నేళ్లుగా ఉత్సవాల నేపధ్యంలో తలెత్తుతున్న వివాదాలను గుర్తుంచుకుని, ఊరేగింపు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు డీజపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పరిశీలించాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో యూపీ-112 వాహనాలను మోహరించాలని కోరారు. #WATCH | Varanasi, UP: Devotees take a holy dip at the Dashashwamedh Ghat of the Sacred Ganga on the occasion of Ganga Dussehra. pic.twitter.com/DlZPo3rlDV— ANI (@ANI) June 16, 2024 -
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్‌పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్‌ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
నామినేషన్‌కు ముందు వారణాసిలో పీఎం మోదీ ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)
-
ఘోరం: కేన్సర్ చిన్నారిని గంగలో ముంచి..
నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని... హరిద్వార్‌లోని హర్కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు. ఈ దృశ్యాలను ఘాట్‌కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్ కీ పైరీ ఎస్‌హెచ్ భావన కైంతోలా తెలిపారు. -
మకర సంక్రాంతికి ఏ రాష్ట్రంలో ఏంచేస్తారు?
దేశవ్యాప్తంగా నేడు మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ తరుణం నుంచి హిందువులు శుభకార్యాలను ప్రారంభిస్తారు. మకర సంక్రాంతి నాడు చేసే గంగాస్నానం, దానధర్మాలు, పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరసంక్రాంతి నాడు ఏ రాష్ట్రాల్లో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీగా జరుపుకుంటారు. తెల్లవారుజామున నదీస్నానం చేస్తారు. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మాఘి నాడు శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో భారీ జాతర నిర్వహిస్తారు. తమిళనాడు దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాల్గవ రోజు కన్యా పొంగల్ నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ సందర్భంగా గంగాసాగర్ వద్ద జాతర నిర్వహిస్తారు. స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేస్తారు. ఈ రోజున యశోదమాత.. శ్రీ కృష్ణుడిని దక్కించుకునేందుకు ఉపవాసం చేశారని చెబుతారు. అలాగే ఈ రోజునే గంగామాత భగీరథుడిని అనుసరిస్తూ, గంగా సాగర్‌లోని కపిలముని ఆశ్రమాన్ని చేరిందని అంటారు. కేరళ కేరళలో సంక్రాంతిని మకర విళక్కు పేరుతో నిర్వహిస్తారు. శబరిమల ఆలయానికి సమీపంలో ఆకాశంలో మకర జ్యోతిని భక్తులు సందర్శిస్తారు. కర్ణాటక కర్నాటకలో సంక్రాంతిని ‘ఏలు బిరోదు’ అనే పేరుతో జరుపుకుంటారు. స్థానిక మహిళలు.. చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని ఉపయోగించి చేసిన వంటకాన్ని చుట్టుపక్కలవారికి పంచిపెడతారు. గుజరాత్ మకర సంక్రాంతిని గుజరాతీలో ఉత్తరాయణం అని అంటారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ఇది కూడా చదవండి: మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి! -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్‌గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్‌లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్‌ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
గంగలో వేలకొద్దీ తాబేళ్లను ఎందుకు విడిచిపెడుతున్నారంటే..
గంగానదిలోని నీటి నాణ్యత గతంలో కన్నా ఎంతో మెరుగుపడింది. నమామి గంగే కార్యక్రమ భాగస్వాములు తెలిపిన వివరాల ప్రకారం గంగానది ప్రక్షాళనలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గంగానదిలోని వ్యర్థ పదార్థాలను అవి తింటూ, నీటిని పరిశుభ్రపరుస్తున్నాయి. గంగా యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాబేళ్ల సంతానోత్పత్తి పునరావాస కేంద్రం 1980 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 40 వేలకు మించిన తాబేళ్లను పవిత్ర గంగా నదిలో విడిచిపెట్టింది. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రం సాయంతో.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు గంగానదితో పాటు పలు నదులలోని నీటి స్వచ్ఛతకు, పరిశుభ్రతకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో గంగానది నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్, వారణాసి జిల్లాలలోని గంగానదిలో వేల తాబేళ్లను వదలనుంది. దేశంలోనే తొలిసారిగా తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రాన్ని వారణాసిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జన్మించిన తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టనున్నారు. ఇవి గంగానదిని పరిశుభ్రం చేయనున్నాయి. ‘నమామి గంగే’ కార్యక్రమంలో.. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ, భారత వన్యప్రాణుల విభాగం సంయుక్తంగా తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టే పనులను చేపట్టనున్నాయి. నగం కాలిన మృతదేహాలు, విసిరివేసే పుష్పాల కారణంగా గంగానది కలుషితంగా మారుతోంది. ఇటువంటి నీటిని పరిశుభ్రంగా మార్చడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఆశీష్ పాండ్యా మాట్లాడుతూ గంగానదిలో 2017 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 5 వేల తాబేళ్లను విడిచిపెట్టాం. ఈ ఏడాది ఇప్పటివరకూ వెయ్యి తాబేళ్లను విడిచిపెట్టామన్నారు. ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
హారతి పట్టిన చేతితో స్టెతస్కోప్!
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలోగల భాగీరథ ఘాట్ వద్ద 2019 నుంచి ప్రతిరోజూ సాయం సమయాన గంగామాతకు హారతి ఇవ్వడంతో పాటు ‘నీట్’కు ప్రిపరేషన్ కొనసాగించిన విభూ ఉపాధ్యాయ మొదటి ప్రయత్నంలోనే నీట్ పరీక్షను క్రాక్ చేశాడు. ఈ సందర్భంగా విభు మీడియాతో మాట్లాడుతూ తాను 2019 నుంచి గంగామాతకు సేవ చేస్తున్నానని అన్నారు. ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చానని తెలిపారు. ఈరోజు తాను గంగామాత ఆశీర్వాదంతోనే నీట్లో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. ఇన్నాళ్లూ గంగామాతకు ఏ విధంగా భక్తశ్రద్ధలతో హారతి ఇచ్చానో అదే విధంగా ఇకపై సమయం దొరికినప్పుడల్లా గంగా మాతకు సేవ చేస్తాననని అన్నారు. ఇలా చేస్తేనే తన మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. తాను ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ వచ్చానన్నారు. తన విజయంలో తన సోదరుడు హర్షిత్ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా విభు తల్లి సునీత శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుసంధ్యలపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కేవలం 8 నెలల పాటు సాగించిన కృషితోనే విభు నీట్ పరీక్షలో 622 వ ర్యాంకు సాధించాడన్నారు. విభు తండ్రి హరేంద్ర ఉపాధ్యాయ శ్రీ గంగాహారతి సేవా సమితి భాగీరథ ఘాట్ సభ్యుడు. కుమారుని విజయం గురించి ఆయన మాట్లాడుతూ గంగామాత కృపతోనే తన కుమారుడు నీట్లో ర్యాంకు సాధించాడన్నారు. ఇది కూడా చదవండి: ‘సార్’ కలను సాకారం చదువుల తల్లి -
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్‌సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
గంగమ్మకు కుంభాభిషేకం.. మహాద్భుతం!
సాక్షి, తిరుపతి: ‘గంగా పుష్కర కాలంలో గంగమ్మ తల్లికే మహాకుంభాభిషేకం నిర్వహించడం మహాద్భుతం. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకం’ అని కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో చివరి రోజైన శుక్రవారం నాడు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యాగ యజ్ఞపూజలు నిర్వహించారు. యాగశాల నుంచి గంగమ్మ తల్లి మూలవిరాట్‌ను తీసుకువచ్చి నూతనంగా నిర్మించిన గర్భాలయంలో విజయేంద్ర సరస్వతి..అమ్మవారిని ప్రతిష్టించి అభిషేకం నిర్వహించారు. గర్భాలయం విమాన గోపుర శిఖరంపై శాస్త్రోక్తంగా బంగారు తాపడంతో తయారు చేసిన కలశాన్ని స్థాపన చేశారు. భక్తులనుద్దేశించి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. నదులను కాలుష్యం చేయకుండా కాపాడాలని కోరారు. కుంభాభిషేకంతో సకల జనులకు సంతోషం కలుగుతుందని 18వ శతాబ్దంలో శాసనంలో పొందుపరచారని, ఈ శాసనం కంచి ఆలయంలో ఉందని చెప్పారు. హిందూధర్మం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. దేవుడు అందరివాడు: స్వరూపానందేంద్ర గంగమ్మ తల్లి తొలి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ మహా కుంభాభిషేక కార్యక్రమంలో పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణం చేస్తూ..దేవుడు ఒక కులానికి చెందిన వాడు కాదని, అన్ని కులాల వాడని అన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా భూమ న చేపట్టిన దళిత గోవిందం కా ర్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు. మంత్రి రోజా మా ట్లాడుతూ..రాజుల కాలం మాదిరిగా సీఎం జగన్ పాలనలో అద్భుతమైన రాతి నిర్మాణాలతో రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తున్నా రని చెప్పారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మహాకుంభాభిషేకంలో పీఠాధిపతులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూ టీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నయనానందం.. నృసింహుని కల్యాణం) -
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ..
ఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుంచి 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అస్సాంలోని దిబ్రూగర్ వద్ద తొలి పర్యటన ముగియనుంది. తొలి బ్యాచ్ లో 52 మంది స్విస్ టూరిస్టులు పాల్గొంటున్నారు. మొత్తం 51 రోజుల ప్రయాణానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ప్రయాణికుడికి ఒక రోజుకు రూ. 25,000- 50,000 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగానే వారణాసిలో టెంట్ సిటీకి మోదీ శ్రీకారం చుట్టారు. గంగ ఘాట్ వద్ద 200 టెంట్ల ఏర్పాటుతో పాటు రూ.1000 కోట్ల ఖర్చుతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ను ప్రారంభించారు. క్రూయిజ్ ప్రత్యేకతలు.. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది. చదవండి: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు -
గంగా విలాస్ యాత్రను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
Womens empowerment: ఉక్కు దళం
ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం... పచ్చని అడవి... చల్లని నది ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే చాప కింద నీరులా సంఘవిద్రోహశక్తులు వికటాట్టహాసం చేస్తుంటాయి. తమకు ఎదురు లేదని కొమ్ములు విసురుతుంటాయి. సంఘవిద్రోహశక్తుల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ‘ఓన్లీ ఉమెన్’ దళం రంగంలోకి దిగింది. స్త్రీ సాధికారతకు పట్టం కట్టేలా బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో మరో అడుగు పడింది. తాజాగా ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు విధులు నిర్వహించనున్నారు. ప్రసిద్ధ సుందర్ బన్ అడవుల్లో కొంత భాగం మన దేశంలో, కొంత భాగం బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సరిహద్దును ఆనుకొని ఉన్న అడవులు, చిన్న దీవులు, నదులు అనేవి సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అయింది. దీనికోసం బీఎస్ఎఫ్ సట్లెజ్, నర్మద, కావేరి, సబర్మతి, క్రిష్ణ, గంగ పేర్లతో బీవోపి (బార్డర్ ఔట్ పోస్ట్) లను ఏర్పాటు చేసింది. ‘బీవోపి’కి చెందిన ‘గంగ’ మహిళా జవానులు తొలిసారిగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన నిఘా విధులలో భాగం అవుతున్నారు. మనుషుల అక్రమ చొరబాటు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు దొంగల నుంచి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి జాలర్లను రక్షించే బాధ్యతలు కూడా ‘బీవోపి–గంగ’పై ఉన్నాయి. స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంటుంది. ‘బీవోపి–గంగ’కు ఉపయోగించే మోటర్ బోట్‌ను కొచ్చిలో తయారుచేశారు. దీనిలో 35 మంది జవాన్లకు చోటు ఉంటుంది. అత్యాధునిక రాడార్, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ‘బీవోపీ–గంగ తన సత్తా చాటబోతోంది. పోరాట పటిమ ప్రదర్శించబోతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కొందరు స్త్రీలు కూడా భాగం అవుతున్నారు. ఇకముందు వారిని అదుపులోకి తీసుకోవడం సులభం అవుతుంది’ అంటున్నారు సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ డిఐజీ అమ్రిష్ ఆర్యా. -
బిహార్‌లో మేఘా ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి నీటి సరఫరా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయా, రాజ్‌గిర్ నగరాల తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయి. శుద్ధి చేసిన గంగాజలాలు ఇకపై ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగా నదీ జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు వరద నీటిని తాగునీరుగా మార్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద నీటిని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లలో నింపి, శుద్ధిచేసి 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా 151 కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్, నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. -
ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్‌ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్‌ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం) -
రూ.36వేల కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే
షాజహాన్‌పూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల మీదుగా సాగే ప్రతిష్టాత్మక ఆరు వరసల గంగా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఉత్తరప్రదేశ్ వాయవ్య ప్రాంత జిల్లాల భవిష్యత్ రూపురేఖలు మారిపోతాయన్నారు. షాజహాన్పూర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడయ్యారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. యూపీలో మాఫియా భరతం పట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, యోగి ఎంతో ఉపయోగపడే ముఖ్యమంత్రిగా అవతరించారన్నారు. యూపీకి యోగి తోడైతే రాష్ట్ర ప్రజలకు మరెంతో ఉపయోగకరమంటూ, యూపీ+యోగి= ఉపయోగి (UP+ YOGI = U.P.Y.O.G.I) అనే కొత్త నిర్వచనాన్ని చెప్పి ఆదిత్యనాథ్‌పై మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. మీరట్, హర్పూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదాయూ, షాజహాన్‌పూర్, హర్దోయీ, ఉన్నవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్.. మొత్తంగా 12 జిల్లాల గుండా 594 కి.మీ.ల పొడవైన ఆరు వరసల రహదారిని నిర్మించనున్నారు. ‘ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ఈ జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. తద్వారా రైతులు, యువత సహా ప్రతి ఒక్కరికి వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పశ్చిమప్రాంతంలో దేశీ తుపాకులతో మాఫియా రాజ్యమేలింది. కానీ, యోగి ప్రభుత్వమొచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో మాఫియా అక్రమ సామ్రాజ్యాలను బుల్డోజర్తో తొక్కించేశారు. గత ప్రభుత్వాలకు అభివృద్ధి, దేశ వారసత్వం అంటే అస్సలు పట్టదు. వారి ధ్యాస అంతా ఓటు బ్యాంక్‌పైనే. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నెట్వర్క్, నూతన విమానాశ్రయం, కొత్త రైలు మార్గాలతో నవీకరించిన మౌలికసదుపాయాలతో ఆధునిక యూపీ అవతరించబోతోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ చేసిన యోగ ఉపయోగి వ్యాఖ్యలను ఎస్పీ, బీఎస్పీలు తిప్పికొట్టాయి. ఆయన ‘ఉత్తరప్రదేశ్‌కు పనికిరాడు, నిరుపయోగి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశాయి. -
నీట మునిగిన గంగా తీర ప్రాంతాలు
-
హిమాలయాలపై భయాంకర నిజాలను వెల్లడించిన ఐఐటీ ఇండోర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పులు. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో అకాల వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో హిమాలయాల్లో గ్లేసియర్ కరిగిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను వెల్లడించింది. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం, ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని పేర్కొన్నారు. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్ పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తెలిపారు. హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయని హెచ్చరించారు. మైదానాలు పూర్తిగా ఏడారులే..! హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలు 2.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, హిమానీనదాలతో ఈ ప్రాంతంలోని ఒక బిలియన్ మందికి పైగా నీటి అవసరాలు తీరుతాయి. ఒక శతాబ్దం అంతా హిమానీనదాల మంచు కరిగిపోతే, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్వహకులు డాక్టర్ ఆజామ్ తెలిపారు. గంగా నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఏడారిగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఐఐటీ ఇండోర్ బృందం గ్లేసియర్ కరిగిపోతున్న సమస్యకు మూడు రకాల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, పరిశీలన నెట్‌వర్క్‌లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఈ బృందం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా అధ్యయనాలను జరపాలి. ఈ పరిశోధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. చదవండి: Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
సంచలనం: గంగలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అలనాటి కర్ణుడుని తలపిస్తూ ఓ పసిపాప చెక్కపెట్టెలో గంగా నదిలో తేలియాడిన ఘటన పలువురి ఆశ్చర్య పరిచింది. దీనిపై స్థానికులు ఆశా జ్యోతి కేంద్రానికి సమాచారం అందించారు. అనంతరం 22 రోజుల పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాప బాధ్యతను పూర్తిగా తీసుకుంటామని ప్రకటించినట్టు ఐఏఎన్ఎస్ వావార్తా సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డకొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం చోటు చేసుకుంది. చంటిబిడ్డ ఏడుపులను స్థానికంగా పడవ నడిపే వ్యక్తి గమనించాడు. అతను అందించి సమాచారం ప్రకారం మహభారతంలో కుంతీదేవి కర్ణుడిని పెట్టెలో పెట్టి వదిలి ఘటనను తలుచుకుందో ఏమో కానీ ఆ తల్లి దుప్పట్లో చుట్టిన తన బిడ్డను చెక్కపెట్టెలో పెట్టి భద్రంగా గంగానదిలో విడిచిపెట్టింది. అంతేకాదు బిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా చేర్చింది. అలాగే బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. ఇదంతా గంగమ్మ తనకు ఇచ్చిన వరమని నావికుడు మురిసిపోయాడు. ఈ బిడ్డనే తానే పెంచుకుంటానని చెప్పాడు. కానీ దీన్ని నిరాకరించిన పోలీసులు సంఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. A 22-day old baby girl was found abandoned in a wooden box floating in the Ganga river in Ghazipur district. Chief Minister #YogiAdityanath has announced that the #UttarPradesh government will take the full responsibility of the child and will ensure its proper upbringing. pic.twitter.com/1D5NxHmCfA — IANS Tweets (@ians_india) June 16, 2021 -
వరుణుడి దెబ్బ.. 2వేలకు పైగా శవాలు
న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో గంగా నది తీరం వద్ద ఇసుకలో పాతిపెట్టిన వేలాది సమాధులు బయటపడ్డాయి. ఒకవైపు భారీ సంఖ్యలో కోవిడ్ మరణాలు నమోదు .. మరోవైపు శవాలను కాల్చేందుకు శ్మశానవాటికలు కూడా సరిపోకపోవడం లాంటి కారణాలతో చాలా మంది తమ వారిని ఇలా ఇసుకలో సమాధి చేసి వెళ్లి పోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్ల ఆ ప్రాంతంలో 71 మంది మృతదేహాలను గుర్తించినట్లు బిహార్ బక్సర్ జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత వానలు పడడం కారణంగా ఇలా 2 వేలకు పైగా మృతదేహాలు గంగా నది పరివాహక ప్రాంతాల్లో బయటపడ్డాయి. శవ దహనానికి డబ్బులు ఖర్చు చేయలేక, మృతదేహాలను ఖననం చేయడానికి శ్మశానవాటికలు సరిపడక ఇలా గంగా నది తీరంలోని ఇసుకలో పైపైనే సమాధుల మాదిరిగా కట్టికొందరు చేతులు దులుపుకుంటున్నారు. యూపీ, బీహార్ రెండూ రాష్ట్రాలు కలిపి 1,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ గంగా నది ప్రవహిస్తుంది. యూపీలోని కాన్పూర్, ఘాజిపూర్, ఉన్నవో, బాలియా జిల్లాల్లో మృతదేహాలను డంపింగ్ చేసే ధోరణి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఎంహెచ్ఏ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవలే మృతదేహాలు గంగా నదిలో తేలుతూ కింది ప్రాంతాలకు వచ్చిన సందర్భంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ( చదవండి: Covid Vaccination in India: వ్యాక్సిన్‌లోనూ వివక్ష..! ) -
బిహార్: పాట్నాలో నదిలోకి దూసుకెళ్లిన జీపు
-
ఉత్తరాఖండ్‌లో జల విలయం
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. రూ. 4 లక్షల నష్టపరిహారం రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది. రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టండి: సోనియా ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు. నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్ మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్‌కు అందలేదు. నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్‌కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు. రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్‌లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్‌లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది. మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..? హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్‌లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు -
గంగా జలంతో కరోనా నయమవుతుందా?!
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల చికిత్సకు గంగా జలాన్ని ఉపయోగించే అధ్యయనాన్ని పరిశీలించాలన్న జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తిరస్కరించింది. గంగా జలంతో రోగాలు నయమవుతాయనడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం, ఆధారాలు సరిపోవని స్పష్టం చేసింది. కాబట్టి గంగా జలంతో క్లినికల్ పరీక్షలకు సంబంధించిన అధ్యయనం చేయలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎవల్యూషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రపోజల్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వైకే గుప్తా నేతృత్వంలోని బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా పవిత్ర గంగా జలంతో వివిధ రోగాలు నయమైనట్లు పురాణాలు చెబుతున్నాయని మాజీ సైనిక అధికారులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ పేర్కొంది. నింజా వైరస్‌గా పేర్కొనే గంగా జలానికి బాక్టీరియాను చంపే శక్తి ఉందని గతంలో నిరూపితమైనట్లు పేర్కొంది. (‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి) ఈ నేపథ్యంలో కరోనా క్లినికల్ అధ్యయనానికి గంగా జలాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని ఈ మేరకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గంగా ప్రక్షాళన జాతీయ మిషన్(ఎన్ఎంసీజీ)కు లేఖ రాసింది. స్వచ్ఛమైన గంగా జలంలో వైరస్‌తో పోరాడే యాంటీ వైరల్ గుణం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో తమ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఏప్రిల్ 28న విన్నవించింది. ఈ లేఖను ఎన్ఎంసీజీ ఐసీఎంఆర్‌కు పంపగా... తాజాగా ఈ విషయంపై చర్చించిన ఐసీఎంఆర్ పరిశోధకులు మాజీ సైనికుల ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ మేరకు ఎంకే గుప్తా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు మరింత శాస్త్రీయ సమాచారం, సాక్ష్యాలు కావాలి. ఈ విషయాన్ని మేము ఎన్ఎంసీజీకి తెలిపాం’’అని పేర్కొన్నారు. అయితే ప్రతిపాదనల అంశమై తమకు ఐసీఎంఆర్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని ఎన్ఎంసీజీ అధికారులు పేర్కొనడం గమనార్హం.(ఆయుర్వేద ప్రభావమెంత?) -
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్‌లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఆగిన వాన హిమాచల్‌ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. -
రాముడు–భీముడు.. గంగ–మంగ
ఒకేలాంటి రూపురేఖలున్న మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. అయితే, ఒకే ఇంట్లో అచ్చుగుద్దినట్లుగా ఇద్దరూ ఒకేలా ఉంటే? అలాంటి కవలలు జంటలు జంటలుగా ఒక ఊరంతా సందడి చేస్తే..? భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. ఆ గమ్మత్తు చూడాలంటే వరంగల్ రూరల్ జిల్లా పెర్కవేడు వెళ్లాల్సిందే. ఈ గ్రామంలో మొత్తం పదహారుమంది కవల జంటలు కనువిందు చేస్తుంటారు. ఊళ్లో ఎక్కడైనా కనిపించవచ్చు పెర్కవేడులో అడుగుపెట్టగానే కనిపించే ఓ మనిషి పోలిన వ్యక్తి మరికొంత దూరం వెళ్లగానే కనిపించవచ్చు. ఇలా ఎందరైనా కనిపించే వీలుంది. పెర్కవేడు గ్రామం 960 గడపలతో ఉంటుంది. ఆ గ్రామ జనాభా 3420 మంది. కారణాలేమిటో తెలియకున్నా కొన్నేళ్లుగా ఇక్కడ కవలలు జన్మించడం సాధారణ విషయంగా మారింది. గ్రామంలో ఇంతమంది కవలలు ఒకేవిధంగా ఉండటంతో ఆ గ్రామం వారు కవలలను పేరు పెట్టి పిలవడంలో చాలా తికమక అవుతుంటారు. గ్రామం తీరో, నీటితీరో మరి ఈ ఒక్క గ్రామంలో ఇంతమంది కవలల జంటలు ఉండడం అన్నది విశేషంగా మారింది. పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్; ఆకారపు లావణ్య, రామకృష్ణ; నిఖిత్, నిఖిల; దురిశెట్టి రామ్, లక్ష్మణ్; దొడ్డ మానస వీణ, వాణి; ఊగ రాము, లక్ష్మణ్; లక్కం అనిత, సునీత; ప్రవీణ్, ప్రదీప్; ప్రమోద్, వేదప్రకాశ్, వేదవిద్య (ముగ్గురు); నిమ్మల రాము, లక్ష్మణ్; పుల్లూరు వినయ్, శివ; అంగిరేకుల నరేష్, సురేష్; ఐత రాంబాబు, ఐత రమ; గొల్లపల్లి రామయ్య, లక్ష్మయ్య; గేర ఆశీర్వాదం, రాధిక; రాజు, సువార్త కవలల్ని కనిన దంపతులు.మొత్తానికి ఇదంతా చూస్తుంటే పాత సిని మాల్లో రాముడు–భీముడు; గంగ– మంగ; చిక్కడు– దొరకడు చూసినట్టు లేదూ..? గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, వరంగల్ ఫోటోలు: బిర్రు నాగరాజు, సాక్షి, రాయపర్తి మమ్మల్ని చూస్తే అందరికీచిన్నప్పటినుంచీ తికమకే.. నేను హైద్రాబాద్‌లో ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్ జాబ్సెర్చ్లో ఉన్నాడు. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ మమ్మల్ని చూసి తికమక పడేవారు. కాకపోతే నేను లావుగా ప్రవీణ్ సన్నగా ఉండేది. ప్రస్తుతం ఇద్దరం ఒకేలా అయ్యాము. నేను మొదటిసారిగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. తర్వాత మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అయ్యారు ఆఫీసర్లు. కానీ సర్టిఫికెట్ లను ఇద్దరివి చూపించడంతో ఇచ్చి వెళ్లారు. మమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కంటిపై గాటు ఉంటుంది ప్రవీణ్‌కు ఉండదు అంతే. పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్ కుమార్ మా ఊరిలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం మా ఊరిలో కవల జంటలు ఉండడంతో సంతోషంగా ఉంది. పండగ సమయాల్లో వీరు వచ్చినప్పుడు తికమకగా ఉంటుంది. వేరే ఊర్లలో ఒక్కరూ లేదా ఇద్దరు ఉంటారు. కానీ మా ఊరు కవలలకు స్పెషల్. చిన్నాల తారశ్రీ, గ్రామ సర్పంచ్ -
సాధువు ఫోటో వైరల్
అలహాబాద్ : ట్రాక్టర్, లారీ లాంటి భారీ వాహనాలను తాడుతో పట్టుకుని ముందుకు లాగడాన్ని అప్పుడప్పు చూసే ఉంటాం. మరీ కొందరైతే జుట్టుతోనే లేక పళ్ల సాయంతోనో లాగడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ సాధువు మాత్రం వీటన్నింటినీ మించి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర భారతదేశంలో మినీ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మాఘ్ మేళా ప్రతి ఏటా జరుగుతుంటుంది. ఈ మేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి గాంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మేళా సమయంలో పవిత్ర జలాలతో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. అలహాబాద్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధిచెందిన ప్రయాగ్ లో ఓ సాధువు చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ను ఓ తాడు సాయంతో తన మర్మాంగానికి కట్టుకుని ఓ సాధువు ముందుకు లాగారు. తెల్ల జుట్టు, గడ్డంతో బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి నగ్నంగా ఉన్న ఆ సాధువు అసాధారణ ప్రదర్శనను ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి ప్రర్శనలు ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో సాధువులు ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో కూడా ఓ సాధువు డజన్ ఇటుకలను తన మర్మావయవానికి కట్టుకొని ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించి ఓ వీడియో అప్పుడు వైరల్ అయింది. 2016లో కూడా కుంభమేళా సమయంలో ఓ సాధువు పెద్ద బండారాయిని తాడుసాయంతో మర్మావయవానికి కట్టుకొని ఓ ప్రదర్శన ఇచ్చారు. 2018 మాఘ్ మేళాకు సంబంధించి మరిన్ని ఫోటోలు -
గంగా నది ప్రక్షాళనకు కొత్త మార్గం
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ సష్టం చేశారు. ఆ దిశగా పురోహితులు, అర్చకులు, హిందూ ఆధ్యాత్మిక నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గంగా నది కలుష్యానికి కారణమవుతున్న హిందువుల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఆయన చెప్పారు. గంగా నదిలో అస్థికలు కలపడం అనేది ప్రతి హిందువు ఒక నమ్మకంగా భావిస్తారు. నది కాలుష్యానికి ఇదొక ప్రధాన కారణం. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు.. అస్థికలను నదీపరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి.. దానిపై ఒక మొక్క నాటాలని ఆయన అన్నారు. ఈ పనిచేయడం వల్ల కాలష్యం తగ్గుతుందని ఆయన తెలిపారు. అస్థికలను గంగలో కలపడం అనేది ఒక అత్యున్నత విశ్వాసమే.. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత తరాలకు గంగమ్మను పవిత్రంగా అందించాలంటే ఇలా చేయడం తప్పదని ఆయన అన్నారు. విశ్వాసాల మేరకు.. చాలా తక్కువ మోతాదులో అస్థికలను గంగలో కలిపి.. మిగిలిన దానిని పూడ్చి దానిపై మొక్క నాటితే మంచిదని ఆయన తెలిపారు. ఈ దిశగా అర్చకులు, పూజారులు, హిందూ ధార్మిక నేతలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. -
నదుల అనుసంధానికి శ్రీకారం
రూ. 5.5లక్షల కోట్ల నిధులతో మొదటి దశ మొదటి దశకు అనుమతుల పూర్తి భారత దేశం వర్షాధారిత వ్యవసాయ దేశం. దాదాపు 70 శాతం మంది కేవలం వ్యవసాయం మీద ఆధాపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి అవసనమైన వర్షపాతం కొన్నేళ్లుగా తక్కువగా ఉంటోంది. కాలాలతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో వరదలు, తుఫానులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు అనుసంధానం తెర మీదుకు వచ్చింది. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటైన రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. న్యూఢిల్లీ : దేశంలో కరుపు కాటకాలను, వరదలను నియంత్రించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ మొదటి దశకు అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి. త్వరలోనే 5.5 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ తొలి అడుగు వేయనుంది. మొత్తం 60 నదులు దేశవ్యాప్తంగానున్న 60 నదులను రివర్ లింకింగ్ ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో గంగ, యమున, గోదావరి, కృష్ట సహా చాలా నదులను అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వేల హెక్టార్ల భూమి సాగులోకి రావడంతో పాటు వరదల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.. కరవు కాటకాలను ఎదుర్కోవచ్చు. అంతేకాక వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. అనుమతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నదుల అనుసంధానం మీద ప్రత్యక శ్రద్ధ చూపడంతో రివర్ లింకింగ్ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులు లభించాయి. నదుల అనుసంధానాన్ని ప్రకృతి, జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నదుల అనుసంధానం వల్ల ప్రకృతి నాశణం అవుతుందని వారు చెబుతున్నారు. కెన్-బెత్వా ప్రాజెక్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ప్రవహించే కర్నావతి-బెత్వా నదులను రివర్ లికింగ్లో భాగంగా మొదట అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్సులు లభించాయని ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. గంగా, గోదావరి, మహానదులను అనుసంధానం చేయడంవల్ల వరదలు, కరువు కాటకాలనుంచి దేశాన్ని రక్షించవచ్చని రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఏరియా కర్నావతి నది మొత్తం 425 కి.మీ. ప్రవహిస్తుంది. లింకింగ్ ప్రాజెక్టును టైగర్ రిజర్వ్ వ్యాలీ అయిన వేదాంత వద్ద నిర్మాంచాలన్నది ప్రాజెక్ట్ అధికారులు ఆలోచన. అందుకోసం ఫారెస్ట్ రిజర్వ్‌లో 6.5 శాతం భూమిని ప్రభుత్వం ప్రాజెక్ట్‌కు అప్పగించింది. అక్కడ ఆవాసం ఉంటున్న 2 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు స్థానిక ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద అన్ని రకాల క్లియరెన్సులతో మోదీ గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. తరువాత ? ఈ ప్రాజెక్ట్ తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్-మహరాష్ట్రలోని నదులను అనుంసంధానం చేయాలన్న ఆలోచన ఉందని రివర్ లికింగ్ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. సమస్యల్లో జంతువులు నదులు అనుంసంధానం వల్ల పులులు, రాబందులు, నీటిలో పెరిగే చేపలు ఇతర జంతుజాల మనుగడ ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. -
హిట్ సిరీస్‌లో మరో సీక్వల్..!
హార్రర్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న కోలీవుడ్ హీరో లారెన్స్, అదే జానర్ లో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. తనకు హీరోగా స్టార్ ఇమేజ్ సాధించిన పెట్టిన కాంచన సీరీస్ లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథాకథనాలు కూడా రెడీ అయిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ముని, కాంచన, గంగ సినిమాలతో ఆకట్టుకున్న లారెన్స్ నాలుగో సినిమాతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుండగానే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడవ్వటం విశేషం. తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయినట్టుగా సమాచారం. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా కోసం కోరియోగ్రాఫర్ గా మారిన లారెన్స్ తన నెక్ట్స్ సినిమాను సొంతం నిర్మాణ సంస్థలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. -
చెదరని స్మృతి
► గంగ అంటే ప్రీతి ►పెరుమాళ్ అంటే భక్తిభావం ►శివయ్య సన్నిధిలో రాహుకేతు పూజలు ►ఆమె పూర్వీకులది కుప్పం సమీపంలోని లక్ష్మీపురం నటిగా రెండు దశాబ్దాలు.. తమిళనాడు రాజకీయాల్లో మూడు దశాబ్దాలు ఏలి.. చరిత్రలో నిలిచిన జయలలితకు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. ఆమెకు పెరుమాళ్ అంటే మెండైన భక్తి. తెలుగు ప్రజలన్నా అంతులేని అభిమానం. అలాంటి అభిమాన ధ్రువతార ఇక లేరని తెలియడంతో జిల్లాలోని ఆమె అభిమానులు, ప్రజల్లో విషాద ఛాయలు అలుముకున్నారుు. ఆమె మరణించిన సందర్భంగా జిల్లాతో ఆమెకున్న అనుబంధం మననం చేసుకున్నారు. విషాద సాగరంలో మునిగిపోయారు. సాక్షి, తిరుమల:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరన్న వార్త జిల్లావాసుల్ని తీవ్రంగా కలచివేసింది. జిల్లా అంతటా విషాద ఛాయలు అలుముకున్నారుు. ఆమె అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. సినీనటీగా, అన్నాడీఎంకే అధినేత్రిగా రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ‘అమ్మ’తో తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘అమ్మ’ పూర్వీకులది కుప్పం సమీపంలోని లక్ష్మీపురం జయలలిత పూర్వీకులది కుప్పం నియోగజవర్గం సమీపంలోని లక్ష్మీపురం. ఆమె ముత్తాత ఎల్ఎస్ రాజు సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. జనంలో ఆయనకు మంచి పేరుంది. లక్ష్మీపురం గ్రామంలో భారీ భవంతి ఉండేది. జయలలిత తల్లి సంధ్యతో కలసి జయలలిత బాల్యంలో పలుమార్లు లక్ష్మీపురం సందర్శించారట. ఆ జ్ఞాపకాలను స్థానికులు నేడు కూడా గుర్తు చేసుకుంటుంటారు. పూర్వీకులు నిర్మించిన భవంతి స్థానిక వరదరాజస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. పాత జ్ఞాపకాలకు చిహ్నంగా ఉన్న ఆ భవంతి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. పెరుమాళ్ దర్శనం కోసం పలుసార్లు తిరుమలకు.. పెరుమాళ్ (శ్రీవేంకటేశ్వర స్వామి) అంటే జయలలితకు ఎనలేని భక్తి భావం. తాను సినీరంగంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, ఆలయ అర్చకులతోనూ, పెదజియ్యర్లతోనూ ఆప్యాయంగా పలుకరించేవారు. ఇటు తమిళం, ఆంగ్లభాషలతోపాటు తెలుగుభాషను అనర్గళంగా, మృదువుగా మాట్లాడుతూ చిరునవ్వులు చిందించేవారు. మే 24వ తేదీ 2010లో చివరిసారిగా తిరుమల వచ్చారు. శివయ్య సన్నిధిలో రాహుకేతు పూజలు రాహుకేతు పూజలకు ప్రసిద్ధి పొందిన శ్రీకాళహస్తిక్షేత్రాన్ని పలుసార్లు జయలలిత సందర్శించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం రాహుకేతు పూజలు చేసి, వాయులింగేశ్వరుడిని దర్శించుకుని వెళ్లేవారు. నాటి జ్ఞాపకాలను నేడు అర్చకులు, ఆలయ సిబ్బంది గుర్తు చేసుకోవటం గమనార్హం. గంగతో అమ్మకు మరింత అభిమానం చెన్నై మహా నగరంలోని జనం గొంతు తడిపిన తెలుగుగంగ అంటే జయలలితకు ఎనలేని ప్రీతి. ఈ జలాలు చిత్తూరు జిల్లా మీదుగానే తమిళనాడులోకి ప్రవేశిస్తారుు. గంగ సరఫరాగా ఒప్పందాలు, తాగునీటి అవసరాలపై ఆమె ముఖ్యమంత్రిగాను, ప్రతిపక్ష హోదాలోనూ ఆయా కాలాల్లో రాష్ట్ర ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతూ పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో తొలి నుంచీ మరింత సాన్నిహిత్యంగా మెలిగేవారు -
వారణాసిలో గంగమ్మకు హారతి
-
చిన్నారి జలచేప అద్భుత సాహసం!
ఉధృతంగా ప్రవహించే గంగానదిలో కొంతదూరం ఈత కొట్టడమే చాలా కష్టమైన పని. గజ ఈతగాళ్లు కూడా ఎక్కువ దూరాన్ని ఈదలేరు. అలాంటిది 11 ఏళ్ల చిన్నారి శ్రద్ధా శుక్లా మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 550 కిలోమీటర్లు ఈదేస్తానంటూ సాహసానికి సిద్ధమైంది. కాన్పూర్ నుంచి వారణాసి వరకు 10 రోజుల్లో 550 కిలోమీటర్లు ఈదాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్‌లోని మసక్రే ఘాట్ నుంచి ఆదివారం తన సాహసయాత్రను ప్రారంభించింది. రోజుకు అరవై కిలోమీటర్లు ఈదాలని ఈ వండర్ కిడ్ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఆహార, పానాదాలు, విశ్రాంతి కోసం రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే శ్రద్ధా తీసుకుంటుంది. మిగతా 19 గంటలూ ఈ చిన్నారి గంగానదీలో ఈదుతూనే ఉంటుంది. అసాధారణ సాహసానికి పూనుకున్న శ్రద్ధా తొలిరోజే 100 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడం గమనార్హం. సిద్ధార్థనాథ్ ఘాట్ నుంచి ఉనావోలోని దేవి ఆలయం వరకు తొలిరోజూ తాను ఈదింది. ఈ అసాధారణ జలచిన్నారి చేపకు స్థానికులు స్వాగతం పలికి.. తమ హర్షధ్వానాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. 10రోజుల్లో 550 కిలోమీటర్లు ఈదడం ద్వారా 10 ఒలింపిక్స్ మారథాన్లను పూర్తిచేసిన ఘనతను చిన్నారి శ్రద్ధ సొంతం చేసుకోనుంది. -
గంగను విడిచిన విభునికి... విడతల వారీగా అభిషేకం
– కృష్ణా పుష్కరాల సందర్భంగా అభిషేకాల నిలుపుదల – వారం తర్వాత నిర్ణయం మార్చుకున్న అధికారులు – ప్రతి మూడు గంటలకు ఒకసారి శాస్త్రోక్తంగా మల్లన్నకు అభిషేకం శ్రీశైలం: వారం రోజులుగా అభిషేకాలకు దూరంగా ఉన్న శ్రీశైల మహా చక్రవర్తికి విడతల వారీగా అభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు నీళ్లు లేవని భక్తులు, అధికారులు ఆందోళన చెందుతున్న తరుణంలో శివుడు గంగను విడవటంతో కృష్ణమ్మ బిరబిరమంటూ పరుగులెత్తింది. భక్తులు పుష్కర స్నానం చేసి పునీతలయ్యారు. అయితే పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు అభిషేకాలను నిలుపుదల చేశారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు విమర్శలు చేశారు. కనీసం స్వామివార్ల రుద్రాక్ష మండపానికి ఉండే ఘంటాపాత్రోలో నైనా నీటిని పోసి నిరంతరం శ్రీశైలమహాలింగ చక్రవర్తి శిరస్సుపై నీరు పడేలా ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి అధికారుల ఆలోచనలలో మార్పు వచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మల్లికార్జునస్వామికి మహా నైవేద్యం ముగిశాక ఈఓ భరత్ గుప్త ద్వారా ఆలయప్రధానార్చకులు, అర్చకులతో వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రతి మూడు గంటలకు ఒకసారి మల్లన్నకు అభిషేకం నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆలయప్రాంగణం అభిషేక సమయాన ఆధ్యాత్మిక వేదమంత్రోచ్చరణల తరంగాలతో ప్రభావితమైంది. అనంతరం తిరిగి 2.30 గంటల నుంచి 3.30గంటల వరకు అర్చకులు రుద్రాభిషేకంతో మల్లన్నకు పరమానందం కలిగిందనే చెప్పవచ్చు. అలాగే సాయంత్రం కూడా ఒకసారి, రాత్రి మరోసారి మల్లన్నకు రుద్రాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుష్కరాలలో మిగిలిన అన్ని రోజులు ఈ అభిషేకం కొనసాగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏలా ఉన్నా అభిషేక ప్రియుడైన శ్రీశైల మల్లికార్జునస్వామికి ఏదో రూపేణా అభిషేకం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా భక్తులు పేర్కొంటున్నారు. -
వర్షం కోసం కప్పల ఊరేగింపు
యాగంటిపల్లె(బనగానపల్లె రూరల్ ) : వర్షాలు కురువాలని గ్రామస్తులు ఆదివారం కప్పలతో ఊరేగింపు నిర్వహించారు. ఒక కర్రకు మధ్యలో కప్పలను వేలాడదీసి డప్పు వాయిద్యాలతో ఇంటింటికి తీరుగుతూ వర్షాలు కురువాలని వానదేవుడిని వేడుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న వాగులోనికి వెళ్లి గంగ పూజలు చేశారు. -
గంగానది ప్రక్షాళనకు కేంద్రం శ్రీకారం
-
వీడియోకోసం గంగలో దూకాడు..
సెల్ఫీలు, వీడియోల పిచ్చి మరోప్రాణాన్ని బలిగొంది. ప్రతి విషయాన్నీ తమ స్మార్ట్ ఫోన్, కెమెరాల్లో బంధించాలన్న వేలం వెర్రితో తాజాగా గంగానదిలో దూకుతూ స్నేహితులతో వీడియో తీయించుకున్నఓ వ్యక్తి.. ఏకంగా కనిపించకుండానే పోవడం ఆందోళన కలిగించింది. ప్రతి విషయాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఘటన వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. హరిద్వార్ కు దగ్గరలోని గంగానదిలో దూకిన వ్యక్తి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్నేహితుడి వీడియోను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయాలన్న తపనే తప్పించి, అతడేమయ్యాడో పట్టించుకునే పరిస్థితి వారిలో కనిపించకపోవడం ఆందోళన నింపుతోంది. బాగా మద్యం సేవించిన 27 ఏళ్ళ వ్యక్తి గంగా నదిలో దూకుతూ వీడియో తీయించుకోడానికి ముందుగా కాస్త ఆలోచించినా.. తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో అనుకున్నంతపనీ చేశాడు. ఈతకొట్టుకుంటూ తిరిగి బయటకు వద్దామనుకొని గంగానదిలో దూకిన వ్యక్తి , నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. స్నేహితులు తీసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాబాద్ గాంధ్ మిర్పూర్ కు చెందిన 27 ఏళ్ళ ఆశిష్ చౌహాన్ గంగ్ నహర్ లోని గంగా నదిలో మునిగిపోయి 48 గంటలు దాటినా బాడీ దొరకలేదు. తన స్నేహితులు అశ్విని చౌహాన్, బాలరాజ్ కుమార్ లతో కలసి ఎప్పట్లాగే గంగా నది ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురూ అక్కడి గట్టుపై కూర్చున్నారు. ముందు బాగానే ఉన్నా ఆ స్నేహితులంతా కలసి మద్యం సేవించిన అనంతరం చౌహాన్ నదిలో దూకి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆ దృశ్యాన్ని రికార్డు చేయాలని ఆదేశించాడు. ముందు కొంత ఆలోచించినా.. చౌహాన్ చివరికి నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు. స్నేహితులు వీడియో తీస్తూ ఉండిపోయారు. అయితే దూకిన వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళనలో పడ్డారు. అతడి జాడ తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, సహాయక సిబ్బందితో సహా నదిలో గాలించినా ఫలితం కనిపించకపోవడంతో చౌహాన్ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కలసి ఎన్నోసార్లు గంగానదిలో ఈత కొడుతుంటామని, చౌహాన్ మంచి ఈతగాడని చెప్తున్నారు. చౌహాన్ నదిలో దూకే సమయంలో స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొన్ని టీవీ ఛానెల్స్ కూడ ప్రసారం చేశాయి. నీటి ప్రవాహంలో చౌహాన్ శరీరం కొట్టుకుపోయి ఉండొచ్చని అది ఎక్కడో ఓచోట బయటకు వస్తుందని భద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అమర్ చంద్ర శర్మ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదని, విషయంపై చౌహాన్ కుటుంబానికి సమాచారం అందించగా.. ఎవ్వరిపైనా అనుమానం వ్యక్తం చేయడం గాని, ఆరోపించడం గాని చేయలేదని తెలిపారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిన ఘటనగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు. -
ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!
న్యూఢిల్లీః కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయడం అంటే జీవితం ధన్యం అయినట్లేనని ఎంతోమంది హిందువులు నమ్ముతారు. ఆ పుణ్య తీర్థ స్నానం జీవితంలో ఒక్కసారైనా చేయాలని ఆశిస్తారు. ఆ నదీ జలాలతో స్నానమాచరించాలనే కోరిక ఉన్నా, అవకాశం లేని వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. గంగా జలాన్ని పోస్టు ద్వారా ఏకంగా మీ ముంగిట్లోకి తెచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కామర్స్ సహాయంతో అందించనుంది. పవిత్ర గంగాజలం పోస్టుద్వారా నేరుగా ఇంటికే వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖను వినియోగించుకొని ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై ఈ ప్రత్యేక సదుపాయాన్నిభక్తులకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా గంగాజలం పొందే అవకాశాన్ని కల్పించమంటూ తమకు ఎన్నో విన్నపాలు అందాయని, అందుకే హరిద్వార్, రిషికేశ్ ల వద్దనుంచి శుద్ధి చేసిన గంగాజలాన్ని ఇంటింటికి చేర్చే సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా గంగాజలాన్ని ఇంటికి పంపిచే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపాదనతో పోస్టల్ శాఖకు ఎనభై శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వెల్లడించిన సందర్భంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాలతోపాటు చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులతో కూడి పార్శిళ్ళను అందిస్తున్న పోస్ట్ మ్యాన్ లు గంగాజలం ఎందుకు అందించకూడదు అన్నారు. స్పీడ్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ 2013-14 సంవత్సరాల్లో 1,372 కోట్ల ఆదాయాన్ని చవి చూసిందని, అలాగే 2015-16 అది 1600 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అదే సంవత్సరాల్లో ఈ కామర్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ కలెక్షన్లు 100 కోట్లనుంచి 1300 కోట్లకు పెరిగాయని తెలిపారు. -
భారీ ఆఫర్ కొట్టేసిన ఎల్ అండ్ టి
లక్నో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భారీ ఆఫర్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థ మరో కీలక ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంది. బిహార్‌లో గంగానదిపై కొత్త వంతెన నిర్మాణం కోసం రూ 3,115 కోట్ల ఆర్డర్ దక్కించుకుంది. కొరియన్ సంస్థ దేవూ (ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్) భాగస్వామ్యంలో ఈ జాయింట్ వెంచర్ ను ఎల్ అండ్ టి చేపట్టింది. గంగానదిపై ప్రతిష్ఠాత్మక బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టును సంస్థ ఎగరేసుకుపోయింది. బిహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బిఎస్డీసిఎల్) నుంచి రూ 3,115 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ పౌర నిర్మాణ రంగలో ఇది తమకు దక్కిన భారీ ముఖ్యమైన విజయమని ఎల్ అండ్ టి డిప్యూటీ ఎండీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులను ఆశిస్తున్నామని సంస్థ పేర్కొంది. గంగా నదిపై ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ ఆర్డర్ చేపట్టినట్టు తెలిపారు. -
పరిశుద్ధ గంగమ్మ ఎక్కడ?
న్యూఢిల్లీ: దేశంలో గంగానది పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం ఒక్కటైనా ఉంటే చెప్పగలరా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రశ్నించింది. గంగానది ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నదని నిట్టూర్పువిడిచింది. గంగానది ప్రక్షాళన, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవాహం సాగేవిధంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఖరి ఉదాసీనంగా ఉందని ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'వాస్తవంలో ఏమీ జరుగడం లేదని మేం అనుకుంటున్నాం' అని పేర్కొంది. గంగానదిని కలుషితం చేస్తున్న పారిశ్రామిక యూనిట్లపై చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ గతంలోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో ఇది తమ బాధ్యత కాదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. -
అలాంటి పరిశ్రమలపై త్వరలో చర్యలు
న్యూఢిల్లీ: గంగా నదిలోకి వ్యర్థాలతో కూడిన కలుషిత నీటిని వదులుతూ మురికి కూపంగా మారుస్తున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి ఉమా భారతి గురువారం ప్రకటన చేశారు. గంగా శుద్ధి కార్యక్రమంపై తాము తయారు చేసిన ప్రణాళిక తుది మెరుగులకు చేరిందని, త్వరలోనే కేబినెట్‌కు పంపించి ఆమోదింపజేసి అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే గంగా శుద్ధి కోసం నమామి గంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గంగా నది శుద్ధి కార్యక్రమాన్ని తాము ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నామని, ఇది విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు కూడా తాము విడుదల చేస్తున్న వ్యర్థాల విషయంలో మరోసారి పునరాలోచన చేసుకోవాలని, నదిలోకి విడుదల చేయకుండా ప్రత్యామ్నాయాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
'మా సీఎం గంగలా స్వచ్ఛమైన వ్యక్తి'
భోపాల్: వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సొంత పార్టీ నేతలు అండగా నిలిచారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షడు నంద్ కుమార్ ఆదివారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం శివరాజ్‌ను గంగా నదితో పోల్చారు. 'మా ముఖ్యమంత్రి గంగా నది అంతటి పవిత్రమైనవారు. కావాలనే విపక్షాలు ఆయనపై బుదర జల్లుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తారు' అని నంద్ కుమార్ వ్యాఖ్యానించారు. -
గంగానదిలో మినిస్టర్ కూతురు గల్లంతు
-
ఉత్త రిలీజులు
మే 1వ తేదీ... శుక్రవారం. ఉదయం 8.30 గంటలు... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణం... గుంపులుగా జనం... హీరో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ను చూడడానికి ఉదయాన్నే సిద్ధమై వచ్చిన జనం... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తూ... తెలుగులోకి లేట్ రిలీజైన లారెన్స్ ‘గంగ’ చూడాలని ఆసక్తిగా వచ్చిన ఆడియన్స్! తెలుగువాళ్ళు... తమిళులు... మలయాళీలు... భాషాభేదాలు లేకుండా సినిమా ఏకం చేసిన దాదాపు వెయ్యిమంది! ఎవరికి వారు పక్కవాళ్ళను విషయం అడుగుతూ, ఫోనుల్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ‘సినిమా రాలేదట!’... ‘పడం వరలా’... ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్!’... లాంగ్వేజ్ ఏదైనా డిస్కషన్ ఒకటే! ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వచ్చినా, రీళ్ళ బాక్సులు (ఇప్పుడన్నీ డిజిటల్ ప్రింట్లే కాబట్టి, డిజిటల్ కోడ్లు) రాలేదని నిరుత్సాహం! ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలుగునేల అంతటా ఆ రోజు మధ్యాహ్నానికి కానీ, తెరపై ‘గంగ’ బొమ్మ పడలేదు. తెలుగుతో పాటు తమిళనేల మీదా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్న ‘ఉత్తమ విలన్’ అయితే శనివారం మధ్యాహ్నం తరువాత కానీ, ప్రేక్షకుల్ని పలకరించలేదు. ఇన్ని కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాలు... అదీ పేరున్న పెద్దవాళ్ళ సినిమాలు కూడా ఆఖరు క్షణంలో రిలీజ్ ఎందుకు ఆగినట్లు? సినిమాలు బాగున్నా - ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే...? సినిమా కష్టాలు... సినిమా రిలీజ్‌కు ముందు సవాలక్ష కష్టాలు... పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగడం లేదు! ఫలానా ఏరియాను ఫలానా మొత్తానికి కొంటామన్న బయ్యర్లు ఆఖరు క్షణంలో... అనుకున్న మొత్తం కన్నా తక్కువ డబ్బే తెస్తున్నారు! తమకు చెల్లించాల్సిన పాత ఫ్లాప్ సినిమాల అప్పుల సంగతేంటో తేల్చమంటూ నిర్మాతల మీద పడే ఫైనాన్షియర్లు! వెరసి ఒక సినిమా ఎంత ఖర్చుతో తీస్తున్నామనే దాని కన్నా, ఎంత సులువుగా రిలీజ్ చేసుకుంటామనేది సమస్యగా మారింది. ఈ కష్టాల కథేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా సినీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటంటే... గతంలో సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన - ఈ మూడు సెక్టార్ల కలెక్టివ్ రెస్పాన్స్‌బిలిటీ. సినిమా అంటే నిర్మాత, దర్శకుడు ఒక కథ అనుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టేవారు. నిర్మాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లే కింగ్ మేకర్లు. చిత్ర నిర్మాణానికి డబ్బు వాళ్ళ నుంచి అందేది. ఆ మనీతో సినిమా తయారయ్యేది. పంపి ణీకి డిస్ట్రిబ్యూటర్లు... అద్దె లేదా నెట్ కలెక్షన్లలో పర్సంటేజ్ మీద తమ హాలులో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ. కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతల మధ్య పంపిణీ అయ్యేది. సినిమా ఆడక తేడా వస్తే, అప్పటికి ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సదరు దర్శక, నిర్మాతల తరువాతి సినిమాలో ఎడ్జస్ట్ చేసేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. రిలీజ్ ముందు నిద్ర లేని రాత్రులు! డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పోయి, బయ్యర్లు వచ్చాక రిస్క్ ఫ్యాక్టరూ పెరిగింది. నిర్మాతలు క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ చేసుకొంటారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. పదుల కోట్లు ఫైనాన్షియర్స్ నుంచి వడ్డీకి తెస్తారు. సినిమా సిద్ధమయ్యేవేళలో బయ్యర్లు క్రేజీ ఆఫర్లతో వస్తారు. కానీ, సినిమా కాస్త తేడాగా ఉందని ఏ మాత్రం ఉప్పందినా... వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. అనుకున్న దాని కన్నా తక్కువ రేటే ఇస్తారు. ఫలితం - నిర్మాతకు ఆశించిన బిజినెస్ కావడం లేదు. ఇప్పటికి ఈ సినిమా వరకు ప్రాఫిట్‌కే అమ్మినా, గత సినిమాలపై పేరుకున్న అప్పులు నిర్మాతను భూతంలా వెంటాడి వేధిస్త్తుంటాయి. ఉదాహరణకు, ఒక నవ యువ సామ్రాట్ మూడక్షరాల సినిమా ఏప్రిల్ చివరి వారంలో రూ. 10 కోట్ల దాకా బిజినెస్ కావాల్సింది. లాస్ట్‌మినిట్‌లో బయ్యర్లు 25 శాతం తగ్గించి, కట్టారు. వ్యాపారం తగ్గినా, నిర్మాత విధి లేక సినిమా రిలీజ్ చేశారు. ఇక, గత చిత్రాల లాస్‌లు తడిసి మోపెడై, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను ‘గంగ’ రిలీజ్లో ఇబ్బంది పెట్టాయి. ‘ఉత్తమ విలన్’ను సమర్పిస్తున్న తిరుపతి బ్రదర్స్‌కు పాత ఫ్లాప్ ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) తాలూకు అప్పులు ఇప్పుడడ్డుపడ్డాయి. ‘‘అక్కడెవరో తీసిన సినిమాను ఇక్కడ నుంచి వెళ్ళి ఎగబడి కొంటున్నప్పుడు, వాళ్ళకున్న పాత అప్పులేంటో మనకు తెలీదుగా! చివరకు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, తమిళ, తెలుగు వెర్షన్ల నిర్మాతలు, సినీ సంఘాలు శ్రమిస్తే కానీ ‘ఉత్తమ విలన్’ ఒకటిన్నర రోజులు ఆలస్యంగా మన దేశంలో విడుదల కాలేకపోయింది’’ అని ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. నిజానికి, ఇలా ఒక పెద్ద సినిమా రిలీజ్ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ సినిమాకొచ్చే మొత్తం రెవెన్యూలో 20 నుంచి 25 శాతం మేర నష్టపోవాల్సి వస్తుంది. ఇక, ఆ రోజున సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ మొదలు ఇతర అనుబంధ వ్యాపారాలకు కలిగే లాస్ దీనికి అదనం. నిజానికి, ఇది ఒక రోజుకో... ఒక సినిమాకో... పరిమితమైన సమస్య కాదు. కలెక్షన్స్‌లో ఇండస్ట్రీ హిట్ పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బడా సినిమాల మొదలు ఛోటా నటుల చిన్న సినిమాల దాకా ఇదే పరిస్థితి. సినిమాల రిలీజ్ ముందు రోజు రాత్రి ల్యాబుల్లో, స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ‘పంచాయతీ’లు మామూలే. కాకపోతే, కొన్ని బయటకొస్తాయి. చాలా మటుకు సినీ వ్యాపార వర్గాల ‘రహస్యాలు’గా మిగిలిపోతాయి. ‘‘ఇవాళ రెమ్యూనరేషన్స్‌తో సహా నిర్మాణవ్యయం 40 శాతం పెరిగింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పర్చేజింగ్ పవర్ 30 నుంచి 40 శాతం తగ్గింది. వెరసి సినిమా వ్యాపారానికి 70 - 80 శాతం బొక్క పడింది’’ అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్, చిత్ర నిర్మాణంలో అనుభవమున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. ఇలా కాస్ట్ పెరిగి, బిజినెస్ తగ్గి, పాత అప్పుల భారం తీరే మార్గంలేక, నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. సినిమాల రిలీజ్లు లాస్ట్‌మినిట్‌లో లేట్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి ఇప్పుడో హిట్ కావాలి! కోట్ల ఖర్చుతో సినిమా తీసిన నిర్మాత... కోట్లు పారితోషికం తీసుకొనే హీరో... తెర ముందు కనిపించే షో ఇది. ఈ షోకు తెర వెనుక ఆర్థిక సూత్రధారులుగా ఫైనాన్షియర్లు, బయ్యర్లు, వీళ్ళకు డబ్బులు సమీకరించే ఎగ్జిబిటర్లు... సినిమా బిజినెస్ గ్లామర్ దీపం చుట్టూ శలభాలు. గత అయిదు నెలలుగా అన్నీ నష్టాలవడంతో బయ్యర్ల మొదలు ఫైనాన్షియర్స్ దాకా ఎవరికీ ఇప్పుడు చేతిలో డబ్బు ఆడని పరిస్థితి. ‘‘తక్షణమే కనీసం ఒక్క పెద్ద హిట్ రావాలి. అప్పుడు కానీ, డబ్బులు పెట్టే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఈ ఫైనాన్షియల్ స్లంప్ నుంచి తేరుకోలేరు’’ అని ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘లయన్’ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు అన్నారు. ‘‘మన దగ్గర రిలీజ్ ప్లానింగ్ లేదు. బయ్యర్ల నుంచి వస్తున్నదెంత, ఫైనాన్షియర్లకు తీర్చాల్సిన అప్పుల రూపంలో పోయేదెంత అనే లెక్క చూసుకోవడం లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి. నిర్మాతలంతా కూర్చొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి’’ అని సునీల్ నారంగ్ సూచించారు. అవును... అది నిజం. ఒకప్పుడు సినిమా... కేవలం కళ! ఆ తరువాత.... కళాత్మక వ్యాపారం! మరి ఇప్పుడు కాసుల చుట్టూ తిరిగే వ్యాపార కళ!! ఈ పరిస్థితుల్లో సినిమా బిజినెస్ ప్రతి వారం టేబుల్స్ టర్న్ చేసే చిత్రమైన ‘ధందా’! ఈ వ్యాపారంలో ఆర్థిక కష్టాలను తట్టుకొని, హాలులోని జనం దాకా సినిమా రావడం... ప్రతి శుక్రవారం ఒక సెల్యులాయిడ్ సిజేరియన్ డెలివరీ! - రెంటాల జయదేవ నష్టాల్లో... అయిదు నెలలు ‘డిసెంబర్ నుంచి ఈ 5 నెలల్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో నికరంగా డబ్బులు చేసుకున్నది ఒక్కటీ లేదు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ ఒక్కటే రీజనబుల్‌గా పే చేసింది. పెద్ద స్టార్ల ‘లింగ’, ‘గోపాల గోపాల’ నుంచి లేటెస్ట్ సమ్మర్ రిలీజ్‌ల దాకా అన్నీ లాసే. బయ్యర్లను పోటు పొడిచినవే.’’ - సుధాకర్ నాయుడు, ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ అధినేత - బయ్యర్, కర్నూలు ‘‘తమిళనాట ఎవరో తీస్తున్న సినిమాను మనం ఎగబడి వెళ్ళి కొనుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉందో అర్థమైంది. అక్కడ వాళ్ళకున్న అప్పులేమిటో తెలియదుగా! 53 సినిమాలు నిర్మించినా రిలీజ్ డేట్ నాడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు 54వ సినిమా ‘ఉత్తమ విలన్’కు తొలిసారి అది నాకు అనుభవమైంది.’’ - సి. కల్యాణ్ ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేటెస్టయినా లేట్‌గా వచ్చిన కొన్ని! శంకర్ - విక్రమ్‌ల ‘ఐ’ నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ వై.వి.ఎస్. - సాయిధరమ్ తేజ్‌ల ‘రేయ్’ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ లారెన్స్ ‘గంగ’ షూటింగ్ ఫినిష్! రిలీజ్‌కే వెయిటింగ్!! నితిన్ ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ కమల్ దర్శకత్వంలోని ‘విశ్వరూపమ్ 2’ రాజశేఖర్ నటించిన ‘వందకు వంద’ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘పట్టపగలు’ ....................................................................... సెన్సారైంది..! రిలీజ్ ఆగింది! విజయశాంతి నటించిన ‘శివాని’ రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’ -
'గంగ' కూడా వాయిదా పడింది..
హైదరాబాద్ : మరో భారీ చిత్రం విడుదల కూడా నిలిచిపోయింది. రాఘవ లారెన్స్ నటించిన 'గంగా' (కాంచన-2) సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. తమిళంలో భారీ హిట్ అయిన ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాతలు దిల్ రాజు, బెల్లంకొండ సురేష్ తీసుకున్నారు. గంగా పేరుతో తెలుగులో వస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ నటించింది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే రిలీజ్ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఆ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిన ఉత్తమ విలన్ చిత్రం విడుదల కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
గంగానది పుట్టుపుర్వోత్తరాలపై లోక్‌సభలో ప్రశ్నలు!
న్యూఢిల్లీ: హిందువులు పవిత్రంగా భావించే గంగా నదిపై ఈ రోజు లోక్‌సభలో విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. గంగా నది ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తెచ్చారు? ఆ నదిలో సాన్నం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ...ఇలా సాగింది ప్రశ్నల పరంపర. సభలో బీజేపీ ఎంపీ ప్రభాత్సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ చౌహాన్ ఈ ప్రశ్నలు అడిగారు. 'ఏంటిది? ఇది కూడా ఓ ప్రశ్నేనా?' అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో జలవనరుల శాఖ సహాయమంత్రి సాన్వర్ లాల్ జాట్ సమాధానమిస్తున్న సమయంలో చౌహాన్ ఈ ప్రశ్నలు అడిగారు. దీంతో కొందరు సభ్యులు ఆయనని ఆశ్చర్యంగా చూశారు. మరికొందరు నవ్వుకున్నారు. మంత్రి కూడా కాసేపటికి తేరుకొని, జనావళి సంక్షేమం కోసం ఆ నదిని భగీరథుడు భూమి మీదకు తీసుకువచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. గంగానదికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, పరీవాహక ప్రాంతాలను అభివద్ధి పరిచేందుకు ఐఐటీ నిపుణుల కమిటీ జనవరిలో సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని మంత్రి సాన్వర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎనిమిది అంశాలపై కమిటీ సిఫారసులు చేసిందని వివరించారు. -
కలసిపోతాను... కలుపుకుంటాను...
గమనం నదుల స్వగత కథనం నేను నిరంతర ప్రవాహాన్ని. భారతదేశ జీవన విధానం నా గమనంతో మమేకమై పోయింది. భరతమాతకు కీర్తికిరీటం వంటి హిమాలయాలే నా పుట్టిల్లు. భారతీయుల జీవనంలో నేనో భాగాన్ని. అయినా సరే... తొలివేద కాలం నాటి గ్రంథాల్లో నా ఊసే కనిపించదు. అప్పట్లో సింధు, సరస్వతి నదులే ప్రముఖంగా కనిపించాయి. ఆర్యులు అప్పటికి నా వైపుగా రాకపోవడంతో నాకు పెద్దగా ప్రాచుర్యం రాలేదు. మలివేదకాలం నాటికి నేను కీలకమయ్యాను. కాశీ పట్టణం నా తీరానే ఉంది. పేర్లు గుర్తు పెట్టుకుంటూ... పుట్టినప్పటి నుంచి సాగరంలో కలిసే వరకు నేను నేనుగా ఉండను. పేర్లు మార్చుకుంటూ ప్రయాణిస్తాను. విష్ణుప్రయాగలో ధౌలిగంగ, అలకనంద కలుస్తాయి. నందప్రయాగలో నందాకిని తోడవుతుంది. కర్ణప్రయాగలో పిండార్ వచ్చి చేరుతుంది. ఇవన్నీ కలిసి వచ్చి దేవప్రయాగలో నాలో కలిసిన తర్వాత నాకు ‘గంగ’ అనే అసలు పేరు వస్తుంది. అప్పటి వరకు భాగీరథినే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి హిమానీనదంలో పుట్టి, ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టిన నా ప్రయాణంలో ఋషికేశ్ ఓ మైలురాయి. మంచు పర్వతాలను దాటి కొండల ఆసరాతో పయనించిన నేను నేల మీద అడుగుపెట్టేదిక్కడే. అప్పటివరకు నైరుతిదిశగా సాగిన నా ప్రయాణం హరిద్వార్ దగ్గర ఆగ్నేయదిక్కుకు మారుతుంది. నేను అలహాబాద్ చేరేలోపు ‘రామగంగ’ పలకరిస్తుంది. యమున దగ్గరలోనే ఉందని చెప్పి ముందుకు సాగుతానో లేదో అంతలోనే యమున కనిపిస్తుంది నా కోసమే ఎదురు చూస్తున్నట్లు. యమున పేరుకి నాకు ఉపనదే కానీ, నా ప్రవాహం కంటే యమున ప్రవాహమే మిన్న. యమునకు నాతో కలవాలనే ఉత్సాహం ఉంది కానీ తన మనుగడను కోల్పోవడం ఇష్టం లేదు కాబోలు. అంత త్వరగా కలవదు. ఒక ఒడ్డున నేను ఎరుపు వర్ణాన్ని కలుపుకున్నట్లు, మరో ఒడ్డున యమున, నేను నీల మేఘపు ఛాయలాగా ప్రవహిస్తుంటాం. పది మైళ్ల ప్రయాణం తర్వాత కానీ నా పెద్దరికాన్ని ఆమోదించదు యమున. అక్కడి నుంచి నా ప్రయాణం ‘తామస’ను కలుపుకుని తూర్పు ముఖంగా సాగిపోతుంది. తీరా కాశీ పట్టణం చేరేసరికి ఒక్కసారిగా ఉత్తరానికి తిరుగుతాను. గోమతి, ఘాఘ్రా నదులను స్వాగతించి బీహార్ దారి పట్టి పాటలీపుత్రాన్ని చూస్తూ చంద్రగుప్తుల కాలాన్ని తలుచుకుంటూ సోన్, గండకీ, కోసీ నదులతో చెలిమి చేస్తూ ఝార్ఖండ్‌లో అడుగుపెట్టి ‘పాకుర్’ చేరానో లేదో... ఓ హఠాత్పరిణామం! నా దేహం నుంచి గుండెను వేరుచేసిన భావన. నా ప్రవాహంలో పెద్ద చీలిక. హుగ్లీ పేరుతో ఓ పక్కగా వెళ్లిపోతుంది. నా అంశగా కోల్‌కతా దాహం తీరుస్తుందిలే అని సర్దిచెప్పుకుంటాను. నా నీటిని నిల్వ చేసుకోవడానికి కట్టిన ఫరక్కా బ్యారేజ్‌ను చూస్తూంటే... ఇండో- పాక్ జల వివాదాలు, ‘భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన నీటి సంధి’ జ్ఞాపకాలు కందిరీగల్లా చుట్టుముడతాయి. ఈ లోపు ‘పద్మ’ అనే పలకరింపు... అంటే బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టానన్నమాట. అది ఒకప్పటి భారతావనే. బ్రహ్మపుత్ర నుంచి చీలిన ఓ పాయ ‘జమున’ను నాకు తోడుగా తీసుకుని ముందుకెళ్తూ ఉంటే అలాంటిదే మరో పాయ ‘మేఘన’ నేనూ కలుస్తానని నా అంగీకారంతో పనిలేకనే చేరిపోతుంది. మేఘన నాతో కలుస్తుంది అనడం కంటే మేఘన వచ్చి నన్ను తనలో కలుపుకుంటుంది - అనడం సబబేమో. ఎందుకంటే ఆ క్షణం నుంచి ‘పద్మ’ అనే పేరును కూడా నాకు మిగల్చకుండా తన పేరుతోనే పిలిపించుకుంటుంది. నన్ను అందరూ ‘మేఘన’ అంటూ ఉంటే ఇక నేను లేనా అనిపించి మనసు కలుక్కుమంటుంది కూడా. ఏమైనా మనుషుల్లో స్వార్థంతోపాటు కొంచెం ఉదార స్వభావం కనిపిస్తుంటుంది. బంగాళాఖాతంలో కలిసే చోటుకు గంగా (గంగ- బ్రహ్మపుత్ర) డెల్టా అంటూ... నేను మర్చిపోయిన నా పేరును గుర్తు చేసి మురిపిస్తారు. ఎన్ని భాషలో... ఎన్నెన్ని యాసలో! కపిల మహర్షి మాట మేరకు స్వర్గంలో ఉన్న నన్ను భూమ్మీదకు తీసుకువచ్చే బాధ్యతను కోసల రాజ్యాన్ని పాలించిన సూర్యవంశ రాజు భగీరథుడు చేపట్టాడని పురాణోక్తి. అలా ఆవిర్భావ దశలో నా పేరు భాగీరథి అయింది. గంగోత్రికి నాలుగు కి.మీ.ల దూరంలో తపోవన్... భగీరథుడు తపస్సు చేసినట్లు చెప్పే ప్రదేశం ఉంది. ఇక్కడ 18వ శతాబ్దంలో నాకో ఆలయం కట్టారు. అక్కడ అందరూ ‘గంగామాత’ అంటూ పూజిస్తారు. సముద్రమట్టానికి దాదాపు పదమూడు వేల అడుగుల ఎత్తులో పుట్టిన నన్ను, 2525 కిలోమీటర్ల ప్రయాణంలో అందరూ అక్కున చేర్చుకునేవారే. నా తీరాన్ని ఆసరాగా చేసుకుని జీవనం సాగిస్తున్న మనుషులను చూస్తూ హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, ఘాజీపూర్, భాగల్పూర్, మీర్జాపూర్ల మీదుగా ప్రయాణిస్తుంటే ఎన్నెన్ని భాషలో, యాసలో. రకరకాల ఆహారపుటలవాట్లు, వస్త్రధారణలు. ఈ మధ్యలో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్‌లో బెంగాల్ టైగర్‌ను చూస్తూ, రాజ్‌మహల్ కొండల్లో ప్రయాణిస్తూ నా నీటికి ఖనిజలవణాలను సమకూరుస్తుంటాను. అక్కడి ‘సంథాల్’ గిరిపుత్రుల వ్యవసాయాన్ని చూసి తీరాల్సిందే. నా తీరాన ఉన్న నేల సారం అంతా ఇంతా కాదు. నేలను నమ్ముకున్న రైతు, నీటిని నమ్ముకున్న జాలరి సంతోషంగా జీవిస్తుంటే నా మది పులకించిపోతుంటుంది. వలలో డాల్ఫిన్లు పడితే జాలరికి పండగే. పొట్టపోసుకోవడానికి చేపలు పట్టే జాలరి పొట్టకొడుతూ కొందరు అత్యాశపరులు భారీవ్యాపారం కోసం డాల్ఫిన్లను విచక్షణరహితంగా తోడేస్తుంటే నాకు గుండె పిండేసినట్లు ఉంటుంది. నేను ఎన్ని ఇచ్చినా మనిషికి ఇంకా ఏదో కావాలనే ఆశ. ఆ అత్యాశతోనే నన్నూ కలుషితం చేస్తున్నారు. దాంతో మిగిలి ఉన్న జలచరాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నన్నే నమ్ముకుని పుట్టిపెరుగుతున్న ఆ ప్రాణులను కాపాడుకోవాలంటే నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. అందుకు మీరూ ఓ చెయ్యి వేస్తారా? నా నీటిని గొంతులో పోస్తే పోయే ప్రాణం నిలుస్తుందని ఒకప్పటి విశ్వాసం, నా నీరు తాగితే ఉన్న ప్రాణం ప్రమాదంలో పడుతుందనేది నేటి నిజం. నా నీటిలో ఆమ్లజని శాతం చాలా ఎక్కువ. స్వయంగా ప్రక్షాళన చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న నదిని. అలాంటి నన్ను ప్రపంచంలోకెల్లా కలుషితమైన నదుల్లో ముందంజలో చేర్చారు. రోజూ గంగాహారతి ఇస్తూ నా ఔన్నత్యాన్ని కీర్తించే ప్రతి పెదవినీ అడుగుతూనే ఉన్నాను. నన్ను నేను ప్రక్షాళన చేసుకోలేని అసహాయతలో చిక్కిన నా కోసం సాయం చేసే చేతులు ఉన్నాయా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. - వాకా మంజులారెడ్డి పుట్టింది: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి (14 వేల అడుగుల ఎత్తు) {పవాహదూరం: 2525కి.మీ.లు సాగర సంగమం: గంగ- బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర (బంగాళాఖాతంలో) గంగానది ప్రక్షాళన కోసం 1986 జనవరి 14వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘గంగా యాక్షన్ ప్లాన్’కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ అదే ప్రయత్నంలో ఉన్నారు. -
గంగానదిలో 100 మృతదేహాలు
సర్వత్రా కలవరం; సమాచారం కోరిన కేంద్రం వున్నావ్ జిల్లాలో రెండు రోజుల్లోనే 104 మృతదేహాలు వెలికితీత పరియార్ ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గటంతో బయటపడ్డ శవాలు లక్నో/వున్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో గత రెండు రోజుల్లోనే వందకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. వున్నావ్ జిల్లా సఫీపూర్ ప్రాంతంలోని పరియార్ ఘాట్ సమీపంలో మంగళవారం నాడు 30 మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీయగా.. బుధవారం నాడు మరో 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ తెలిపారు. మొత్తం 104 వరకూ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. 45 గ్రామాల నుంచి వివరాల సేకరణ... మృతదేహాల వెలికితీత ఉదంతంపై పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీ ఎ.కె.గుప్తా ఆదేశించారు. మృతదేహాల్లో చాలావరకూ పురుషులో, స్త్రీలో గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయని, వీటికి శవపరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో డీఎన్ఏ పరీక్షల కోసం 80 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించారు. మిగతా మృతదేహాలు మరింత తీవ్రంగా దెబ్బతిని ఉండటం వల్ల వాటి నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకోవటం సాధ్యం కాలేదని ఐజీ ఎ.సతీష్గణేష్ తెలిపారు. ఈ మృతదేహాలు అవివాహిత యువతులు, చిన్నపిల్లలవి కావచ్చునని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా మృతదేహాలను ఖననం చేసే పరియార్ ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గిపోవటంతో ఈ మృతదేహాలు బయటపడ్డాయని చెప్పారు. అవివాహితులు, చిన్నపిల్లలు మృతి చెందినపుడు వారి మృతదేహాలను బంధువులు ఖననం చేయకుండా గంగానదిలో విడిచిపెడుతుంటారని స్థానికులు వివరించినట్లు ఆయన చెప్పారు. వున్నావ్ చుట్టుపక్కల పరియార్ ఘాట్ వద్ద మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే 45 గ్రామాలను గుర్తించామని, గత ఏడాది కాలంలో ఆయా గ్రామాల్లో చనిపోయిన, మృతదేహాలకు పరియార్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబాల వివరాలివ్వాల్సిందిగా గ్రామ పెద్దలను కోరామని వివరించారు. ఆ వివరాలు అందగానే.. సదరు కుటుంబాల డీఎన్ఏ నమూనాలతో.. నదిలో లభ్యమైన మృతదేహాల డీఎన్ఏ నమూనాలతోపోల్చి తనిఖీ చేస్తామని చెప్పారు. సామూహిక ఖననానికి నిర్ణయం... మృతదేహాలు పూర్తిగా దెబ్బతిని ఉండటంతో వాటిని వెలికి తీసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరాకరిస్తున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీలను వినియోగించటంపై స్థానికులు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం రాత్రి ఘటనా ప్రాంతాన్ని సందర్శించి.. వెలికితీసిన మృతదేహాలను తగిన రీతిలో ఖననం చేయాలని, ఈ మొత్తం ఉదంతంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలన్నారు. బృందాన్ని రప్పిస్తున్నాం: ఉమాభారతి గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడటంపై వాస్తవాలను తెలుసుకునేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని పంపించాలని తమ శాఖ కార్యదర్శికి నిర్దేశించినట్లు కేంద్ర జల వనరులు, గంగా ప్రక్షాళన శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కాన్పూర్ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతున్నందున.. గంగానదిలో నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో అనేక మృతదేహాలు నీటిపై తేలుతూ బయటపడ్డాయని ఉమాభారతి పేర్కొన్నారు. -
గంగానదిలో డజన్ల కొద్ది మృత దేహాలు !
-
గంగ, జమున...మిస్టర్ ఇండియా!
-
గంగ, జమున...మిస్టర్ ఇండియా!
వారిద్దరూ తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవిభక్త కవలలు, అసహజ రూపం కావటంతో అనేక అవమానాలు, ఛీత్కారాలు చవిచూశారు. దేవుడి శాపం వల్లే ఇలా నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒకే ఉదరంతో జన్మించారని కన్నవాళ్లు కూడా వదిలేశారు. దీంతో పొట్ట కూటికోసం ఓ ట్రావెలింగ్ సర్కస్‌లో చేరారు. 45 ఏళ్లు వచ్చేవరకు ఏ తోడూ లేకండా ఒంటరిగానే గడిపారు. కానీ, ఏడు నెలల క్రితం ఓ రోజు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న జసీముద్దీన్ అహ్మద్ ను చూడగానే ఇద్దరూ మనసు మనసు పారేసుకున్నారు. ఇద్దరి పరిస్థితిని చూసిన అహ్మద్ కూడా చలించిపోయాడు. వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురూ కలిసే ఉంటున్నారు. అహ్మద్ కూడా అదే సర్కస్ కంపెనీలో సౌండ్ ఇంజనీర్‌గా పార్ట్‌టైం జాబ్‌లో చేరాడు. గంగ, జమునలు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. అహ్మద్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎంతో బాగా చూసుకుంటున్నాడని, అతడిని తాము మిస్టర్ ఇండియా అని పిలుస్తామని గంగ వెల్లడించింది. జీవితాంతం అతడి అండ ఉంటే, ఇక తమకు ఏమీ అక్కర్లేదని చెబుతోంది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని ఈ అవిభక్త కవలలు చెబుతున్నారు. అహ్మద్ కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని చెబుతున్నారు. వారి బాధలు తన బాధలుగా భావిస్తూ అన్నింటా అండగా నిలబడుతున్నాడని గంగ, జమునా మురిసిపోతున్నారు. -
గంగావతరణం రోజున 27 మంది జలసమాధి
గంగావతరణం పండుగ సందర్భంగా తల్లి గంగమ్మను పూజించడానికి వెళ్లిన 27 మంది ఉత్తరప్రదేశ్ లో జలసమాధి అయిపోయారు. దివి నుంచి గంగానది భువికి దిగిన రోజు కావడంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గంగా స్నానాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది నదిలో మునిగి చనిపోయారు. మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు. గజ ఈతగాళ్లు ముగ్గురిని కాపాడారు. ఈ ప్రమాదాలు బదాయూ, బెలాదండీ, మథుర, కాస్ గంజ్, ఆగ్రా జిల్లాలో జరిగాయి. -
గంగ అవతరించిన పుణ్యమాసం
సందర్భం- జ్యేష్ఠమాసారంభం గంగానదిలో స్నానం చేయడం విశేషఫలాలనిస్తుంది. అందుకు అవకాశం లేనివారు గంగాదేవి పేరును స్మరిస్తూ, ఇతర పుణ్యనదుల్లో స్నానం చేసినా పవిత్రస్నానం చేసిన ఫలం పొందవచ్చునని పురాణ కథనం. సంవత్సరంలోని అన్ని మాసాలూ విశిష్టమైనవే అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి గల మనం ఇప్పుడు జ్యేష్ఠమాసంలోకి అడుగుపెట్టాం. అనేక పర్వదినాలకు ఆలవాలమైన ఈ మాసంలో ఏం చేస్తే మంచిదో వివరంగా తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంలో వృషభాన్ని పూజించడం పుణ్యప్రదమని శాస్త్రోక్తి. మే 31 రంభాతృతీయ: ఈరోజున పార్వతీదేవిని ఉమానామంతో అర్చించడం శుభప్రదం. జూన్ 8, దశపాపహర దశమి: కేవలం తనలో మునిగినంత మాత్రానే అందరి పాపాలను, కల్మషాలను కడిగివేసే గంగాదేవిని పదిరకాలైన పుష్పాలతో, ఫలాలతో అర్చించి, ధూపదీప హారతులు ఇవ్వడం వల్ల తెలిసీ, తెలియక చేసే పదిరకాలైన పాపాలు తొలగిపోతాయి. ఈవేళ దైవదర్శనం, దానం శుభఫలాలనిస్తుంది. జూన్ 9, నిర్జల ఏకాదశి: విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేయడం వల్ల అత్యంత శుభఫలితాలు పొందగలరని శ్రీకృష్ణుడు భీముడికి చెప్పాడట. ఈ విధంగా చేసి, భీముడు అనేక శుభఫలాలను పొందినట్లు పురాణ కథనం. ఈ రోజు పెసరపప్పు, పానకం, నెయ్యి, ఛత్రం మొదలైన, వాటిని దానం చేయడం శుభప్రదం. గంగావతరణం: భగీరథుని తపస్సు కారణంగా ఈ రోజు గంగ దివినుంచి భువికి దిగివచ్చిన శుభదినంగా పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ రోజున గంగావతరణంగా చెబుతారు. ఈ వేళ గంగా స్నానం చేయడం విశేషఫల దాయకం. అవకాశం లేనివారు గంగాదేవి పేరును స్మరిస్తూ, పుణ్యనదుల్లో లేదా కుళాయినీటితో స్నానం చేసినా పవిత్రస్నానం చేసిన ఫలం పొందవచ్చునని పురాణ కథనం. జూన్ 13, జ్యేష్ఠ పూర్ణిమ: జ్యేష్ఠఫూర్ణిమకే ఏరువాక పున్నమి అని పేరు. ఈవేళ రైతులు పశువులను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి, మువ్వలతో అలంకరిస్తారు. తర్వాత ఎడ్లను కట్టివేసే గాటికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ఎడ్లకు ఉలవలు, పొంగలి పెడతారు. సాయంత్రం ఎడ్లను పొలం వద్దకు తీసుకెళ్లి, దుక్కిదున్నటం ప్రారంభిస్తారు. జ్యేష్ఠ పున్నమి... వటసావిత్రీ వ్రతం: ఈ వ్రతాచరణ వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని పురాణ కథనం. మహా పతివ్రత అయిన సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం నారద మహర్షి ఉపదేశం మేరకు మర్రిచెట్టునే సావిత్రిగౌరిగా భావించి, పసుపు కుంకుమలు, గాజులు మొదలైనవి సమర్పించి, చెట్టు చుట్టూ 108 మార్లు ప్రదక్షిణం చేస్తూ, అన్ని మార్లూ పసుపు దారం చుట్టిందట. తద్వారా లభించిన ఫలంతోటే యముడు తీసుకుపోయిన తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకోగలిగిందట! కాబట్టి జ్యేష్ఠపున్నమికి వటసావిత్రీవ్రతం అని పేరు. ఈ రోజు సాయంకాలం ఐదుగురు ముత్తయిదువలకు పసుపు, కుంకుమ, తాంబూలాలు, మామిడిపండ్లు వాయనం ఇవ్వడం వల్ల వారి ఐదవతనం కలకాలం నిలుస్తుందని శాస్త్రోక్తి. జూన్ 16 సంకటహర చతుర్థి: ప్రతి నెలలోనూ బహుళ చవితినాడు సంకటహర చతుర్థీవ్రతం ఆచరించినట్లే ఈ నెలలో కూడా ఈ వ్రతాచరణ చేయడం శుభదాయకం. జూన్ 23 అపరా ఏకాదశి: ఈ ఏకాదశినాడు ఉపవసించి, వామనుని పూజించినందువల్ల అనేకవిధాలైన పాతకాలు తొలగిపోతాయని పురాణోక్తి. మనం గమనించవలసింది ఏమిటంటే మనకు సాయం చేసేవారు ఎలాంటివారైనా, అంటే ఆఖరికి మూగజీవాలైనా సరే, కృతజ్ఞతతో మెలగుతూ, కనీసం సంవత్సరంలో ఒకటి రెండు సార్లయినా వారిని గౌరవించడం, అవసరాలలో ఉన్నవారికి ఆసరా ఇవ్వడం మంచిదని ఆనాటి రోజుల్లోనే రుషులు చెప్పారు. వాటిని అర్థం చేసుకుని ఆచరించడమొక్కటే మనకు సత్ఫలితాలనిస్తుంది. - డి.వి.ఆర్. -
గంగలో మునిగిన కేజ్రీవాల్
ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలు కాదు. అందునా వారణాసి లాంటి చోట ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా గంగలో మునిగి తీరాల్సిందే. మహామహా నాయకులు చేశారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజరీవాల్ కూడా అదే చేశారు. బిజెపి ప్రధాని అభ్యర్థిపై పోటీకి వారణాసి బరిలో దిగుతానని ప్రకటించిన అరవింద్ కేజరీవాల్ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. వస్తూండగా దారిలోనే ఆయన ట్వీట్ చేసి మరీ 'నాపై బిజెపి హింసకు పాల్పడే అవకాశం ఉంది' అని కాషాయ సేన ముందరికాళ్లకు బంధం వేశారు. వచ్చీ రాగానే చొక్కా ప్యాంటూ విప్పేసి, తువ్వాలు కట్టుకుని గంగానదిలో దిగి స్నానం చేశారు. మోడీపై పోటీకి దిగుతారా లేదా అన్నది ఆయన మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. 'నిండా మునిగేశాం. ఇంక చలేమిటి' అనుకుని బరిలోకి దిగేస్తారా లేక మిగతా నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోవడం ముఖ్యం అనుకుంటారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.