గంగావతరణం రోజున 27 మంది జలసమాధి
Published Mon, Jun 9 2014 1:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
గంగావతరణం పండుగ సందర్భంగా తల్లి గంగమ్మను పూజించడానికి వెళ్లిన 27 మంది ఉత్తరప్రదేశ్ లో జలసమాధి అయిపోయారు. దివి నుంచి గంగానది భువికి దిగిన రోజు కావడంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గంగా స్నానాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది నదిలో మునిగి చనిపోయారు.
మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు. గజ ఈతగాళ్లు ముగ్గురిని కాపాడారు. ఈ ప్రమాదాలు బదాయూ, బెలాదండీ, మథుర, కాస్ గంజ్, ఆగ్రా జిల్లాలో జరిగాయి.
Advertisement
Advertisement