drown
-
స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్‌ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్‌లో చోటుచేసుకుంది. మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. గంతులేస్తూ ఆడుతూనే..మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి. -
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
గాలిపటాలతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు. రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది. -
సిద్దిపేటలో విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.
సాక్షి, సిద్దిపేట, హైదరాబాద్: సెల్ఫీ సరదాకు ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన షేక్ కైసర్ (28), అతని అన్నకొడుకు షేక్ ముస్తఫా (3), సమీప బంధువు, జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్ సోహెల్ (17) గురువారం రాత్రి సిద్దిపేట (దుద్దెడ)లో జరగనున్న ఫంక్షన్లో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులతో కలసి గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లిలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారు వర్గల్ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలోగల బంధువుల పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో షేక్ ఖైసర్, మమ్మద్ సోహెల్‌లు ముస్తఫాను తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సమీపంలో ఉన్న సామల చెరువుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ముస్తఫా చెరువులో ఉన్న గుంతలో జారిపడ్డాడు. ఇది గమనించి అతడిని రక్షించే ప్రయత్నంలో సోహెల్, అతడిని కాపాడేందుకు ఖైసర్‌లు వరుసగా గుంతలో దిగారు. ఈత రాకపో వటంతో బాలుడితో పాటు వారిద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. సమీపంలో వున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మొదట బాలుడి బయటకు తీసి చికిత్స కోసం తరలించగా అప్పడికే అతను మృతిచెందాడు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుంచి ఖైసర్, సోహెల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్‌కు భార్య, మూడు నెలల కూతురు ఉన్నారు. అప్పటిదాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన ముస్తఫా నీట మునిగి విగత జీవిగా మారటంతో తండ్రి జుబేర్, తల్లి అయేశాలు కన్నీరు మున్నీరై బోరుమని విలపించారు. కాగా మహ్మద్ సోహెల్ ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో దూకి.. చెన్నైలో తేలిన టెక్కీ.. కేసులో ఊహించని ములుపు!
కోలారు: 16వ తేదీన కోలారు తాలూకాలోని కెందట్టి చెరువులో బెంగళూరు రూరల్ బాగలూరులో ఉండే చెందిన టెక్కీ రాహుల్ (27), కూతురు దియా (3)తో కలిసి దూకాడన్న కేసులో మిస్టరీ వీడుతోంది. చిన్నారి దియా అదే రోజు చెరువులో శవమై తేలడం తెలిసిందే. టెక్కీ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు అతడు చెరువులోకి దూకలేదని, పాపను విసిరేసి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తంచేశారు. చివరకు అదే నిజమైంది. టెక్కీ రాహుల్ శనివారం చెన్నై నుంచి భార్యకు ఫోన్‌కు చేసి తనను కిడ్నాప్ చేశారని ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. దీంతో అతడు బతికే ఉన్నాడని ఖరారైంది. మరో కొత్త డ్రామా అని అనుమానాలు అయితే కిడ్నాప్ అయ్యానని అతడు చెబుతున్న మాటలు మరో కొత్త డ్రామా అని భావిస్తున్నారు. 15వ తేదీన తన కుమార్తె దియాను బడికి వదలి వస్తానని కారులో బయలేదేరిన రాహుల్ అనంతరం కనిపించలేదు. తరువాత 16వ తేదీన తాలూకాలోని కెందట్టి చెరువులో కూతురు దియా మృతదేహం కనిపించింది. కానీ రాహుల్ కనిపించలేదు. రాహుల్‌ను నిజంగానే కిడ్నాప్ చేశారా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీడి దేవరాజ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఈ విధంగా కథ నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. -
Amaravati: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ
సాక్షి, విజయవాడ: ఈ ఫోటోలు చూశారా? అమరావతికి అన్యాయమంటూ చంద్రబాబు చెప్పినప్పుడు గానీ, ఆయన అనుకూల మీడియా గానీ ఇలాంటి ఫోటోలు ఎప్పుడూ ప్రచురించవు. ఇప్పటిదాకా అక్కడ నిర్మించిన హైకోర్టు భవనమో, సచివాలయ, అసెంబ్లీ భవనాలనో మాత్రమే చూపిస్తాయి. కానీ ఇక్కడి ప్లాను గానీ, కట్టడాలు గానీ ఎంత దారుణమో తొలి చినుకుకే చిల్లులు పడ్డ అసెంబ్లీ భవనం, పైకప్పు నుంచి నీళ్లు కారే సచివాలయ ఛాంబర్లు చెప్పేశాయి. ఇక అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో వర్షం పడ్డ ప్రతిసారీ కళ్లకు కడుతూనే ఉంటుంది. తాజాగా మూడు రోజుల కిందటి వరకూ వర్షాలు పడ్డాయి. అప్పట్లో అక్కడికి వెళ్లే పరిస్థితే లేదు. మూడు రోజుల తరవాత మంగళవారం అక్కడి పరిస్థితికి అద్దం పట్టే చిత్రాలివిగో... ఇది చెరువు కాదు. పొలమూ కాదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు.. వర్షం పడ్డ మూడు రోజుల తరవాత కూడా నడుంలోతు నీళ్లలో మునిగే స్థితిలో ఉందీ రోడ్డు. వాహనాల సంగతి సరే. కనీసం నడిచి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇది రాజధాని కోర్ ఏరియాలోని నీరుకొండ గ్రామం. రోడ్డుకు అటూ ఇటూ ఉన్నవి ప్రస్తుతానికి పొలాలు. వివిధ నిర్మాణాలు రావాల్సిన స్థలాలవి. కానీ అవి చెరువుల్ని మించిపోయాయి. ఆ రోడ్డుపై వెళ్లటమే దుస్సాధ్యంగా మారిందిప్పుడు. నీరు కొండ గ్రామంలో అటూ ఇటూ ఉన్నవారు మెయిన్ రోడ్డుకు చేరుకునే ప్రాంతం మొత్తం చెరువును మించిపోయింది. దాంతో రోడ్డుమీదకు రావటానికి ఇలా పాట్లు పడక తప్పటం లేదు. (క్లిక్ చేయండి: అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్) -
విహారంలో విషాదం.. అంత వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది!
రణస్థలం(శ్రీకాకుళం): విహారం విషాదంగా మారింది. సరదాగా సముద్ర స్నానానికి వెళితే ప్రాణాలమీదకు వచ్చింది. మండలంలోని ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేటలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. జేఆర్ పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొవ్వాడ పంచాయతీలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన గాదం పాపాయమ్మ, గాదం కృష్ణ ఇంటికి వారి అల్లుడు తిరుపతి గణేష్ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి ఇద్దరు పిల్లలతో రెండు వారాల కిందట వచ్చారు. ఈయన స్వగ్రామం విశాఖలోని భీమిలి. భార్యా పిల్లలను కొవ్వాడలోనే వదిలేసి గణేష్ మరుసటి రోజు వైజాగ్ వెళ్లిపోయారు. మళ్లీ శనివారం ఉదయం ఆయన తన మేనకోడలు దీవెనతో కలిసి రామచంద్రపురం వచ్చారు. సాయంత్రం ఏడుగురు కుటుంబ సభ్యులు పోతయ్యపేటలోని సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. అంతా కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో తిరుపతి గణేష్(32), తిరుపతి మానస (9), మేనకోడలు వానమామల దీవెన (18)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా గగ్గోలు పెట్టారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. వారు పడవలపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి గల్లంతైన వారి కోసం వెతికినా లాభం లేకపోయింది. గల్లంతైన వారిలో భీమిలి మండలంలోని కాపులుప్పాడ సమీపంలోని నగరప్పాలెం గ్రామం. ఆయన మేనకోడలు దీవెనది విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో గల వడ్డాది గ్రామం. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. -
ఒక్కడే కుమారుడు.. దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ..
సాక్షి, నెల్లిమర్ల(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి పుణ్యక్షేత్రంలోని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని వస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. తోటి అయ్యప్ప మాలధారులు, నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు అందించిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని అయ్యకోనేరు సమీపంలోని గుమ్చీ ప్రాంతానికి చెందిన బత్తుల చంటి(21) మరో ఐదుగురు అయ్యప్ప మాలధారులతో కలిసి మంగళవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం అనంతరం స్వాములంతా కలిసి విజయనగరానికి బయలుదేరారు. నెల్లిమర్ల మీదుగా తిరిగి వస్తూ పట్టణంలోని మొయిద వంతెన సమీపంలో చంపావతి నదిలోకి అందరూ స్నానానికి దిగారు. నదిలో కాస్త వరద ఎక్కువగా ఉండటంతో చంటి మునిగిపోయారు. మిగిలిన స్వాములంతా ఆయనను రక్షించడానికి ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తల్లిదండ్రులు సత్యనారాయణ, రమ్మణమ్మ చిన్న టిఫెన్ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. చంటి మెయిన్ రోడ్డులోని వానపాము పూజా సామాగ్రి షాపులో పని చేస్తున్నారు. చంటి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ అయ్యప్ప కూడా దీక్షలో ఉన్న తమ కొడుకును కాపాడలేకపోయారని బోరుమన్నారు. ఎస్ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ? -
సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది
మైసూరు(బెంగళూరు): చెరువు కట్ట పైన నిలబడి మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన హుణసూరు తాలూకాలోని హోసకోటె దగ్గర కెంచన చెరువులో చోటు చేసుకుంది. మృతులు అబ్దుల్లా (21), తన్వీర్ (20). ముగ్గురు కలిసి చెరువు చూడడానికి వచ్చారు. కట్టపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు జారిపడ్డారు. చెరువు లోతుగా ఉండడంతో ఈదలేక మృత్యువాత పడ్డారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. రౌడీషీటర్ అరెస్ట్ శివమొగ్గ: వ్యాపారుల ను బెదిరించి దందాలు చేయడంతోపాటు అనేక నేరాలతో సంబంధం కలిగి ముంబైలో తలదాచుకున్న శివమొగ్గ నగరంలోని టిప్పు నగర్‌కు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ బచ్చన్(29)ను శివమొగ్గ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్స్టేషన్లలో 53 కేసులున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బసవనగుడికి చెందిన మహ్మద్ తౌహిద్(19), మహ్మద్ బిలాల్(21)ను నవంబర్ 16న పోలీసులకు పట్టుబడ్డారు. వారు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ముంబై వెళ్లి బచ్చన్‌ను పట్టుకొచ్చారు. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది -
‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’
సాక్షి,దుబ్బాక( మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లీకూతురు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో చిన్న కుమార్తె చైత్ర(5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతులోకి వెళ్లింది. గమనించిన తల్లి చైత్రను కాపాడటానికి ముందుగా తన చీరను విసిరింది. చీరను అందుకోకపోవడంతో తానే నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ నీటమునిగి ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. చెరువు గట్టుపై ఉన్న పెద్దకుమార్తె రషి్మక, మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద ఉన్న వారు గమనించి మృతదేహాలను బయటకు తీశారు. రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్‌తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రోజా ఇటీవలె తల్లిగారింటికి వచ్చింది. బతుకమ్మ పండగ రోజు తల్లీ కూతురు మృతి చెందడంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మ కావాలే..లే అమ్మా తల్లి, చెల్లి మృతి చెందడంతో రష్మిక ఏమి చేయలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నది. తల్లిదండ్రులను కోల్పోయిన రష్మిక ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. నాకు మా అమ్మ కావాలి.. నువ్వు లే అమ్మా అంటూ ఆ చిన్నారి ఏడవడంతో అందరూ కంటతడి పెట్టారు. చెల్లి చేతులు పట్టుకుని లే చెల్లె ఆడుకుందాం అంటూ ఏడ్చేసింది. చదవండి: Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం -
తల్లీకూతుళ్లే కాదు, తండ్రీకొడుకులూ మిగల్లేదు
సాక్షి, అనకాపల్లి, మాకవరపాలెం: భయపడినంతా జరిగింది.. తల్లీకూతుళ్లే కాదు.. తండ్రీ కొడుకులు కూడా విగతజీవులుగా మిగలడం అందరినీ కలచివేసింది. ఇన్నాళ్లూ కన్నులపండువగా కనిపించిన కుటుంబం కాసుల కారణంగా కనుమరుగైంది. అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో పప్పుల చీటీలు నిర్వహించే పన్నెల గోపాలకృష్ణ భార్య ఉమాదేవి(38), కుమార్తె జాహ్నవి(10) మృతదేహాలు గత నెల 22న కశింకోట మండలం లచ్చర్ల వద్ద ఏలేరు కాలువలో లభ్యమైన విషయం తెలిసిందే. అప్పటికే గోపాలకృష్ణ(42), అతని కుమారుడు రోహిత్(8) ప్రసాద్‌లు కనిపించకపోవడంతో అందరూ పలు రకాలుగా ఊహించుకున్నారు. వారిద్దరు కూడా మరణించి వుంటారన్నది ఒక కథనం కాగా.. వారైనా తిరిగివస్తే బాగుణ్నని సన్నిహితుల ఆశ.. సుమారు 12 రోజుల తర్వాత మాకవరపాలెం మండలంలోని ఏలేరు కాలువలో ఆదివారం రెండు మృతదేహాలను గుర్తించారు. ఇవి గోపాలకృష్ణ, అతని కొడుకు రోహిత్‌లవేనని ఎస్ఐ కరక రాము నిర్థారించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్టీ కాలనీలో విషాదం బీఆర్టీ కాలనీవాసుల గుండె బరువెక్కింది. ఏమిటింత దారుణం... ప్రాణాలు తీసుకోవాల్సినంత దయనీయ స్థితికి ఎందుకెళ్లారు...? కను‘పాప’లను సైతం చిదిమేసుకోవాల్సిన పరిస్థితికి కారణమేంటి..? పిల్లల్నైనా వదిలేసి ఉంటే బాగుండు కదా..? అందరూ ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాలకృష్ణ కుటుంబం పదేళ్ల నుంచి ఇక్కడే నివసిస్తోంది. భార్యభర్తలిద్దరూ పప్పుల చీటీలు వేసే వారని అక్కడి వారిచ్చిన సమాచారం. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సరకులు ఇవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలకు మించిన ఆర్థిక భారంతో దంపతులిద్దరూ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. గోపాలకృష్ణ, ఉమాదేవితో సహా పిల్లలు గత నెల 20న బలిఘట్టం వైపు వెళ్లారు. 22న భార్య ఉమాదేవి, కుమార్తె జాహ్నవిలు కశింకోట మండలం అడ్డాంకు సమీపంలో ఏలేరు కాలువలో విగత జీవులుగా కనిపించారు. ముందు ఇది హత్యేనన్న అనుమానంతో అలజడి రేగింది. ఈ కోణాన్ని పరిగణనలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కుటుంబం మొత్తం ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న సమాచారం మేరకు భర్త గోపాలకృష్ణ, కుమారుడు రోహిత్ ప్రసాద్‌లు కనిపించకపోవడంతో అందరి మదిలో అనేక ప్రశ్నలు ఉదయించాయి. పోలీసులు ఏలేరు కాలువ పరిధిలో 25 కిలోమీటర్ల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో వెతికించినా ఫలితం దక్కలేదు. దీంతో మృతురాలి భర్త, కుమారుడు బతికే ఉంటారని అంతా భావించారు. అయితే ఆ ఆశ కూడా అడియాసగానే మారింది. అప్పుల వల్లే ఆత్మహత్యలు మాకవరపాలెం పరిసరాల్లో బైక్ కనిపించందని రైతు ఇచ్చిన సమాచారం మేరకు రెండు కిలోమీటర్ల పరిధిలో పోలీసులు వెతికారు. చివరకు మాకవరపాలెం మండలం పైడిపాలెం సమీపంలో గోపాలకృష్ణ, రోహిత్‌లు విగతజీవులుగా కనిపించడంతో విషాదం మిగిలింది. అప్పుల వల్లే గోపాలకృష్ణ, ఉమాదేవి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నామని సీఐ భాస్కర్ చెప్పారు. ఇందులో హత్య కోణం లేదన్నారు. సంక్రాంతి సమీంచడంతో పప్పుల చీటీల సొమ్ము డిమాండ్ చేస్తారన్న భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్నారు. రెండు బృందాలుగా గోపాలకృష్ణ, ప్రసాద్‌ల కోసం ఆరా తీశామని, మృతదేహాలు ఏలేరు కాలువలో కనిపించాయన్నారు. (చదవండి: పక్కింటి అమ్మాయిని చూశాడని..) -
ఇద్దరు బాలురను బలిగొన్న గుంత
ఉప్పల్: గృహ నిర్మాణం కోసం తవ్విన ఓ గుంత ఇద్దరు బాలుర ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఉప్పల్ న్యూశాంతినగర్లో ఉంటున్న వెంకటరావు కొడుకు రేవంత్(13), సత్యానగర్ కాలనీలో ఉంటున్న పోలెపల్లి స్వామి కుమారుడు మనోహర్(14)లు 8, 7వ తరగతులు చదువు తున్నారు. ఆదివారం వీరిద్దరు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హెచ్ఎండీఏ బగాయత్ లేఅవుట్లో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ సుందర్రావు తమ ఇంటి భూమి పూజకు 15 అడుగుల వరకు గోతిని తవ్వి వదిలేశారు. అందులో నీళ్లు ఊరాయి. ఆ ప్రాంతానికి ఆడుకోవడానికి వెళ్లిన రేవంత్, మనోహర్‌లు బంతి నీళ్లలో పడటంతో గుంతలోకి దిగారు. నీరు ఉండటంతో ఇద్దరు మునిగిపోయారు. బయట ఉన్నవారు బాలుర తల్లిదండ్రులకు తెలిపారు. బాలురిద్దరిని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు తో యాజమానులపై కేసు నమోదు చేశారు. ఐఫోకస్ ఎన్జీవో సభ్యులు శ్రీహరి, భరత్‌సింగ్, మైత్రి అసోసియేషన్ సభ్యులు వినోద్ యాదవ్, శేఖర్ఇవాన్, వేంకటేశ్వర శర్మ, రవిచందర్, ఉమామహేశ్వర్లపై కేసు నమోదైంది. -
ఈత కోసం వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
-
నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం వద్ద చెరువులోకి ఈతకు దిగిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే వారి జాడ తెలియట్లేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు వెళ్ళి పరిశీలించారు. చెరువు గట్టుపై రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన పుస్తకాలు, బట్టల బ్యాగులు ఉండటాన్ని గుర్తించారు. ఈతకు గిది గల్లంతైన విద్యార్థులు ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులేనని నిర్ధారించారు. గల్లంతైన నలుగురు విద్యార్థులను హరికృష్ణరాజు, విజయశంకర్, ఎఎస్‌కే పరశురామ్, కోట సాయిగా పోలీసులు గుర్తించారు. అయితే కోట సాయి (ఈసీఈ, రెండవ సంవత్సరం) మృతదేహం మాత్రం నీటిపై తేలింది. మిగిలిన ముగ్గురి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి
-
ఒడిశాలో విషాదం
-
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురి మృతి
అచ్చంపేట(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని అచ్చంపేట మండలం కోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానం చేయడానికి కృష్ణానదికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. -
చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతిచెందారు. జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం గ్రామానికి శ్రీవరామ కృష్ణ(5), శ్రీసాయి(3) అనే ఇద్దరు చిన్నారులు ఆదివారం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు మృతితిచెందారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలువుకున్నాయి. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
మహబూబ్ నగర్: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. జిల్లాలోని కొత్తగూడెం మండలం ఎదళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణ్(6), శివ(6) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బీచ్‌లో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
-
సబర్మతీ నదిలో మునిగిపోయిన ఆరుగురు యువకులు
అహ్మదాబాద్: విహార యాత్ర వారిపాలిట మృత్యువుగా మారింది. శబర్కంత జిల్లాలోని రస్లోడ్ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్ లో ఉన్నపురాతన శివాలయం దగ్గరికి విహారయాత్రకు గురువారం వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికని నదిలోకి దిగి మునిగి పోయారని పోలీసు అధికారి తెలిపారు. స్థానిక మత్సకారుల సాయంతో శవాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరళించారు. ప్రమాదవశాత్తు మరణించినట్టుగా కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
60 అడుగుల బావిలో పడిన చిరుత!
పూణె: నగరానికి దగ్గరలోని ఓ గ్రామంలోని బావిలో చిక్కుకున్న చిరుతను అటవీశాఖ అధికారులు కాపాడారు. పింపల్ గావ్ సిద్ధానాధ్ గ్రామం శివారులో ఆదివారం ఉదయం ఓ బావి నుంచి పెద్దగా గాండ్రింపులు వినిపించాయి. వాటిని అనుసరిస్తూ బావి దగ్గరకు వెళ్లిన రైతుకు 60 అడుగుల లోతు బావిలో చిరుతపులి ప్రాణాల కోసం పోరాడుతుండటాన్ని గమనించాడు. చిరుతను చూసిన భయాన్ని తగ్గించుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వైల్డ్ లైఫ్ ఎస్ఎస్ఓతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తొలుత చిరుత శ్రమను తగ్గించడానికి మూడు అడుగుల దుంగను బావిలోకి వేశారు. అప్పటికే బాగా అలసిపోయిన చిరుత.. ప్రాణభయంతో దుంగను గట్టిగా పట్టుకుంది. ఒక పులి బోనుకు తాళ్లు కట్టని అధికారులు గ్రామస్థుల సాయంతో దానిని బావిలోకి దించారు. బోను దగ్గరకు రావడంతో చిరుత దానిలోకి వెళ్లడానికి యత్నించగా.. జారి మళ్లీ నీళ్లలో పడిపోబోయింది. బోనును ఇంకొంచెం కిందకు దించిన అధికారులు ఈసారి చిరుతను బోనులోకి వెళ్లేట్టుగా చేయడంలో సఫలం అయ్యారు. చిరుత బోనులోకి వెళ్లగానే బోనును మూసివేశారు. జున్నూర్ జిల్లాలో ఎక్కువగా బావులు ఉండటం వల్ల తమ నివాసాల నుంచి తప్పిపోయిన వన్యప్రాణులు చెరకు పంటలో తలదాచుకుంటున్నాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ ఖర్మాలే చెప్పారు. అప్పుడప్పుడు ఇలా బావుల్లో చిక్కుకుపోతున్నట్లు తెలిపారు. రక్షించిన చిరుతకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరిగి అడవిలో వదిలేసినట్లు వివరించారు. -
వరుణార్పణం..
నిండా ముంచిన వర్షం.. నీట మునిగిన వేరుశనగ పంట ఎకరాకు రూ .50 వేలు పెట్టుబడి 10 శాతం కూడా చేతికి రాని పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాలని వినతులు రేపల్లె : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతి కందే తరుణంలో వర్షార్పణమవడంతో రైతులకు కన్నీటిని మిగిల్చింది. రెక్కల కష్టం వృధాగా మారి నష్టాలను మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఖరీప్ సాగుకు సిద్ధపడుతున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే, మరోవైపు వేసవిలో వేరుశనగ సాగు చేసిన రైతులకు విషాదాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం, తుమ్మలపాలెం, కావూరు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వేసవిలో వేరుశనగ సాగు చేశారు. రెండేళ్లుగా ఖరీప్‌లో వరి సాగు ఆగస్టు చివరి మాసంలో ప్రారంభమవుతుండటంతో ఈ ప్రాంత రైతులు మే నెలలో వేరుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పుడు సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికందే సమయంలో ఉంది. ఈ తరుణంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు రాంబోట్లవారిపాలెం పంచాయతీ పరిధిలో సుమారు 200 ఎకరాల పంట నీటమునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో కోతకు వస్తున్న సమయంలో కురిసిన వర్షాలకు మళ్లలో నీళ్లు చేరి కుళ్లిపోయే దశకు చేరుకున్నది. పంటను రక్షించుకునేందుకు రైతుల ప్రయత్నాలు.. వర్షాలకు కుళ్లిపోతున్న పంటను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీటిలో నానుతున్న వేరుశనగను పెకలించి వాహనాల్లో ఒడ్డుకు చేర్చి బాగున్న కాయలను వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం 10వ శాతం కూడా చేతికందని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
హనుమంతునిపాడు: ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం గాయంవారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మేడిబోయిన పౌర్ణమి(3) ప్రమాదవశాత్తు ఇంకుడుగుంతలో జారిపడి మునిగిపోయింది. కుటుంబసభ్యులెవరూ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఊపిరాడక చనిపోయింది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
విశాఖపట్టణం : వాగు వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు వాగులోకి దిగి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గౌరీపట్నంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సదరు బాలురు ఇద్దరు వాగు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. ఆ క్రమంలో వారు వాగులోకి దిగి... నీటి మునిగి మరణించారు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి... మృతదేహాలను వెలికి తీసి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాలుర కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. -
పార్టీ కోసం పడవలో రాత్రి వెళ్లి..
భోపాల్: నీళ్లపై బోటులో విహరిస్తూ పార్టీ చేసుకోవాలన్న వారి కోరిక నెరవేరుతుండగా విషాధమలుపు తీసుకుంది. అనూహ్యంగా ఆ పడవ బోర్లాపడి అందులోని పదిమంది నీళ్లలో పడిపోయారు. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు ఈదుకుంటూ ఒడ్డునపడ్డారు. కళ్లముందే తమ స్నేహితులు మునిగిపోతుంటే చూడటం తప్ప ఏం చేయలేకపోయారు. ఈ దుర్ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్‌లోని కమ్లాపాటి ఘాట్ వద్ద ఓ చిన్న నీటి సరస్సు ఉంది. ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లిన పదిమంది స్నేహితులు పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకొని ఓ పడవను తీసుకున్నారు. అనంతరం పార్టీ చేసుకుంటూ పడవ బోర్లాపడి ఐదుగురు జలసమాధి అయ్యారు. మిగిలిన ఐదుగురి మృతదేహాలను తర్వాత బయటకు తీశారు. -
మధ్యప్రదేశ్‌లో గురువుల దారుణం..
భోపాల్: ప్రపంచమంతా అభివృద్ధి, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్నా కొందరి మనస్తత్వాలు మారడం లేదు. వారిని పట్టుకున్న కులజాడ్యం వీడటం లేదు. ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది. ఇలా నిరక్షరాస్యులు చేశారంటే లోకజ్ఞానం ఎక్కువగా లేదనుకోవచ్చు.. కానీ సాక్షాత్తు పాఠాలు చెప్పే గురువులే చేస్తే.. మధ్యప్రదేశ్‌లో ఇదే జరిగింది. దామోహ్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచినీటికోసం స్కూళ్లో చేతిపంపు వద్దకు వెళ్లిన ఓ దళిత బాలుడిని అందుకు అనుమతించకపోవడంతో అతడు బావిలో పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి విచారణ ఆదేశించారు. -
వాగులో విద్యార్థి గల్లంతు
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం జంక్షన్ సమీపంలో సీతంపల్లి వాగులో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కోరుకొండలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు వనభోజనం కోసం ఆదివారం సీతంపల్లికి వచ్చారు. కొంత మంది విద్యార్థులు సీతంపల్లి వాగులో దిగగా, పదో తరగతి విద్యార్థి ద్వారంపూడి మనోహర్ (15) గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన మనోహర్ కోరుకొండలో చదువుకుంటున్నాడు. -
చెరువులో పడి నలుగురు విద్యార్థుల మృతి
గణపురం(ములుగు, వరంగల్ జిల్లా): గణపురం(ములుగు) మండలం చెల్పూరు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఊరి చివరన ఉన్న పెద్దచెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటనలో చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మేదిపల్లి రమణ(11), మల్లోజు ప్రదీప్(11), కొంపెల్లి శంకర్(12), కేతిరి రమేశ్(14) లు మృత్యువాతపడ్డారు. సెలవు రోజు కావడంతో ఈతకు వెళ్లిన విద్యార్థులు ఇటీవల మిషన్ కాకతీయ కోసం తీసిన గుంతలో చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముందుగా చెరువులో దిగిన నలుగురు గుంతలో ఇరుక్కుపోవడంతో వారితో వచ్చిన మరోఇద్దరు పిల్లలు తమ స్నేహితులను కాపాడాలంటూ కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న వారు అక్కడకు వచ్చి కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం మునిగిపోయిన విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మునగాలలో విషాదం
మునగాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానం చేసేందుకు నాగార్జున సాగర్ కాలువలోకి దిగిన ఇద్దరు నీటమునిగి మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా మునగాలలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చనిపోయిన ఇద్దరూ సూర్యాపేట వాసులుగా గుర్తించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మేకరాజు ప్రశాంత్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రశాంత్‌కు వారం కిందటే వివాహం అయింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా ప్రశాంత్ కుటుంబసభ్యులు దాదాపు 11 మంది బుధవారం ఉదయం మునగాలకు చేరుకున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలో స్నానాలు చేసి, సమీపంలోని అయ్యప్ప ఆలయంలో పూజలు చేయాలని భావించారు. స్నానాలు చేసేందుకు సాగర్ కాలువలోకి దిగిన ప్రశాంత్, అతని మేనమామ కనపర్తి మహేష్(50) నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయారు. కేకలు వేయటంతో అక్కడే స్నానాలు చేస్తున్న అయ్యప్ప మాలధారులు వారిని రక్షించేందుకు యత్నించారు. కొద్దిసేపటికి ప్రశాంత్‌ను ఒడ్డుకు చేర్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. మహేష్ జాడ దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నారు. వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. -
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సంగెం (వరంగల్ జిల్లా) : సంగెం మండలం పుటాన్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఊరికి సమీపంలో ఉన్న కుంట దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతిచెందారు. కార్తీక్(7), రాజు(10) అనే ఇద్దరు చిన్నారులు కుంటలో పడి మునిగిపోవడంతో పక్కనే ఉన్న మరో బాలుడు సిద్ధు భయంతో పారిపోయాడు. జరిగిన విషయాన్ని గ్రామానికి వెళ్లి వివరించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. -
వరదల్లో ఇద్దరు గల్లంతు
చిత్తూరు: సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లి వద్ద గార్గేయనది వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటనలో అన్నెమగారిపల్లి పంచాయతీ చిన్నతోపు గ్రామానికి చెందిన రజిత(15), సుబ్రహ్మణ్యం(60) అనే ఇద్దరు గల్లంతైనట్లు తెలిసింది. గల్లంతైన వారి కోసం అధికారలు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరూ తండ్రీకూతుళ్లు. వరదలతో సోమల మండలంలోని 24 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. -
శబరి నదిలో ఇద్దరు గల్లంతు
చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరులో శబరి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు ఆదివారం గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన షేక్ సలార్ (40), పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన షేక్ ముల్లా (18) చింతూరులో బంధువుల వివాహానికి వచ్చారు. ఆదివారం చింతూరులోనే ఉన్న శబరి నదిలో స్నానానికి దిగగా కొట్టుకుపోయారు. వారి కోసం పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. -
విశాఖ బీచ్‌లో నలుగురు గల్లంతు
డాబాగార్డెన్స్: విశాఖపట్నంలోని ఏయూ ఉమెన్స్ హాస్టల్ బీచ్ వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు... సెలవు దినం కావడంతో ఆదివారం నేలమ్మవేపచెట్టు ప్రాంతంలోని ప్రియాంక విద్యోదయ స్కూల్‌కు చెందిన ఏడుగురు పదో తరగతి విద్యార్థులు బీచ్‌కు వెళ్లారు. వారిలో ఆరుగురు సముద్రంలోకి వెళ్లగా గణేశ్, కె.రోహిత్, అబ్దుల్ జబార్ గల్లంతయ్యారు. వీరి కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ఏడుగురు సభ్యుల బృందం కూడా సముద్రంలోకి దిగగా, ఢిల్లీకి చెందిన షరీఫ్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. -
'నదిలో పడిన కారు.. కారులో మహిళలు'
ఓక్లాహామా: రోడ్డుపై వెళుతున్న కారు సడెన్ కారు సడెన్‌గా అదుపుతప్పింది. ఏం జరుగుతుందో తెలిసే లోగా వెళ్లి నదిలో పడింది. అదృష్టం బాగుండి సమాయానికి పోలీసులు స్పందించడంతో అందులోని ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఓక్లాహామా నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నది పక్కన ఉన్న రోడ్డు వెంట ఆదివారం సాయంత్రం 6.15గంటల ప్రాంతంలో వెళుతుండగా అనుకోకుండా అదుపుతప్పింది. దానిని నియంత్రించేలోగానే వెళ్లి నదీ భాగంలో పడిపోయింది. కారు సగం మునిగిపోయి పూర్తి స్థాయిలో జలసమాధి కానుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు అందులోని ఇద్దరు మహిళలను బయటకు తీసి కారును భారీ క్రేన్ సహాయంతో బయటకు లాగేశారు. -
నదిలో పడి యువకుడు గల్లంతు
మాడుగుల(విశాఖపట్నం): పశువులను మేపడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపాలెం మండలం తారువ గ్రామ సమీపంలోని శారదా నదిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పశువులను మేపడానికి తీసుకెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తోటి పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
కర్నూలు: బేతంచర్ల మండలం గోరుమాన్కొండకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గ్రామ సమీపంలోని మైనింగ్ గుంటల్లో ఈతకొట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిషోర్(20), సురేందర్(16), సాయిసుబ్రహ్మణ్యం(16) అనే ముగ్గురు యువకులు మరణించారు. గ్రామస్తులు గుంట నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి ప్రేమించడం లేదని ఆమె పిల్లల్ని..
బెంగళూరు: తనను ఇష్టపడటం లేదనే అక్కసుతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తాను ప్రేమిస్తున్న మహిళ పిల్లలను హతమార్చాడు. ముగ్గురు పిల్లలను మ్యాన్ హోల్లో వేయడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు కూడా నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలే. వీరిలో ఇద్దరు బాలురు కాగా, ఒకరు బాలిక. ఈ ఘటన ఆగస్టు 27న చోటుచేసుకోగా తాజాగా కొలిక్కి వచ్చంది. పోలీసులు వివరాల ప్రకారం నజీమా బేగం అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంతకాలంగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. ఆమెను ఫయూం బేగ్ అనే వ్యక్తి ఇష్టపడటం మొదలుపెట్టాడు. కానీ, ఆమె మాత్రం మరో వ్యక్తిని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఫయూం.. నజీమాపై కక్ష భూని ఆమె పిల్లలను మ్యాన్ హోల్లో వేశాడు. అందులోని మురుగు ప్రవాహానికి వారు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు సాయంత్రం నజీమా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు కేసును ఛేదించారు. నజీమాకు ఫయీం బేగ్ బంధువే. -
గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
వరంగల్ (నెక్కొండ) : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామ శివారులోని శంభుని కుంటలో శనివారం సాయంత్రం గోసుల వికాస్(11), భాషికాల విష్ణు(11) అనే ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. నిన్నంతా పోలీసులు, గ్రామస్తులు వెతికినా వారు కనపడకపోవడంతో రాత్రికి గాలింపు చర్యలు ఆపేశారు. కాగా ఆదివారం ఉదయం వారి మృతదేహాలు బయటపడటంతో వెలికి తీశారు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. ఇద్దరూ కూడా మండలకేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. శనివారం శ్రీకృష్ణజన్మాష్ఠమి కావటంతో సరదాగా ఈతకొడదామని స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈతకెళ్లిన వీరిద్దరూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. -
నీటితొట్టిలో పడి బాలుడు మృతి
డోర్నకల్: నీటి తొట్టిలోపడి బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన మౌలి-యాకూబీ దంపతుల కుమారుడు హబీబ్(18 నెలలు) గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టిలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీసేసరికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హబీబ్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
ముగ్గురు పిల్లలు మునిగిపోయారు
జైపూర్: ఓ నీటి కొలనులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వీరిలో ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అన్నాదమ్ములు. ఈ ఘటనతోవారివారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శివనాథ్(13), సురేశ్(శివనాధ్ సోదరుడు) (10), ప్రజాపత్ (10) కలిసి స్నానం చేసేందుకు ఓ నీటి కొలను వద్దకు వెళ్లారు. అక్కడ ఒడ్డకు నిల్చొని స్నానం చేస్తుండగా కాలు జారీ అందులో పడిపోయారు. ముగ్గురుకి ఈత రాకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలారు. -
వాగులో పడి వివాహిత మృతి
అదిలాబాద్(దహేగాం): వాగులో పడి వివాహిత మృతి చెందిన సంఘటన దహేగాం మండలం రాళ్లగూడలో చోటుచేసుకుంది. గ్రామంలోని పెద్దవాగులో కారు రేవతి(24) అనే వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె చెప్పులు గట్టుపై వదిలేయడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవతికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో మునిగి హైదరాబాద్‌వాసి మృతి
ఆదిలాబాద్: పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన ఒక వ్యక్తి గోదావరిలో మునిగి మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి గ్రామం వద్ద శనివారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సికిందర్ (27) అనే యువకుడు కుటుంబసభ్యులతో గోదావరి పుష్కరాలకు దండేపల్లి గ్రామానికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం గోదావరిలో పుష్కర స్నానం చేస్తుండగా నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. యువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడని పోలీసులు చెప్పారు. -
గల్లంతైన వ్యక్తి..సురక్షితం
ఖమ్మం: దైవదర్శనానికి వచ్చిన వ్యక్తి గోదావరిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన పడవల వాళ్లు ఆ వ్యక్తిని కాపాడిన సంఘటన జిల్లాలోని భద్రాచలం స్నానాల ఘాట్‌వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం తిమ్మనకుంట గ్రామానికి చెందిన గున్నె రామిరెడ్డి(60) దైవ దర్శనానికి వచ్చాడు. ఈ క్రమంలో గోదావరిలోని స్నానాల ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి నదిలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న పడవల వాళ్లు అప్రమత్తమవడంతో ఆయన ప్రాణాలు కాపాడగలిగారు. నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి.. వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఈ రోజు కాస్త శాంతించింది. ప్రస్తుంతం గోదావరి నీటిమట్టం 35 అడుగులు ఉంది. -
నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
టేకులపల్లి (ఖమ్మం జిల్లా): టేకులపల్లి మండలం కొండంగులబోడు గ్రామంలో నీటి గుంతలోపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో సునీత (9), అంజలి (8) అనే ఇద్దరు బాలికలు మృతిచెందారు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ..ఆడుకుంటూ పొలంలో ఉన్న నీటిగుంతలో పడిపోయారు. పక్కనే ఎవరూ లేకపోవటంతో కొద్దిసేపటికి ఊపిరివదిలారు. విగతజీవులైన చిన్నారుల్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
వాగులో పడి మామాఅల్లుళ్ల మృతి
ఆదిలాబాద్: ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్కంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దస్రుపటేల్గూడ గ్రామానికి చెందిన చిక్రమ్ కిషన్, రాంబాయిల కుమారుడు పవన్(9), పవన్‌కు వరసకు మామ అయిన సిడాం సూర్యభాన్ (40) జైతుపటేల్గూడ గ్రామంలో పెళ్లికి వెళ్తున్నారు. రెండు గ్రామాల మధ్య ఉన్న చిక్మన్ ప్రాజెక్టును నాటు పడవ సాయంతో దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చి గాలించగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, లక్కంపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాటు పడవను ఆశ్రయించిన మామఅల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు అంటున్నారు. -
పెన్నానదిలో పడి అన్నదమ్ముల మృతి
సెలవులు గడిపేందుకు మేనత్త ఇంటికి వెళ్లిన అన్నదమ్ములు ప్రమాదవశాత్తు పెన్నానదిలోపడి మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అనంతపురం జిల్లాలోని పెన్నా పరివాహక గ్రామమైన గార్లదిన్నె మండటం అగ్రహారంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతులు యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ (17), ప్రశాంత్ (15) లు తల్లిదండ్రులతో కలసి కొద్దిరోజుల క్రితం అగ్రహారానికి వచ్చారు. మంగళవారం ఉదయం బంధువులతో కలసి పెన్నా నీళ్లు చూడాలన్న సరదాతో ప్రశాంత్ ఒడ్డు సమీపానికి వెళ్లగా వర్షానికి మట్టి తడిసి ఉండడంతో కాలు జారి నదీ నీటిలో పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు మనోజ్ కుమార్ కూడా నదిలోకి దిగడంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడిపెట్టించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్లు ప్రారంభించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
గోనెగండ్ల : ఈత రాకపోయినా సరదా కొద్దీ బావిలోకి దిగిన ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుద్దపాశం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పుద్దపాశం గ్రామానికి చెందిన సోమనాయుడు అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థి శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని బావి దగ్గరికి ఈతకని వెళ్లాడు. స్నేహితులు బావలో ఈత కొడుతుంటే సరదా పడిన సోమనాయుడు ఈత రాకపోయినా బావిలోకి దిగి మునిగి పోయాడు. తోటి విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. -
ఈత సరదాతో మృత్యుఒడికి
ఇల్లెందు : ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలంలోని నామాలపాడు వాగులో ఈతకెళ్లిన ఈనేష్(24), నాగార్జున్(24) అనే ఇద్దరు ఇంజనీరింగ్ చదివిన యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆటవిడుపు కోసం హైదరాబాద్ నుంచి ఇల్లెందుకు వెళ్లిన ఆరుగురు యువకులు ఆదివారం ముకుందాపురం గ్రామంలో కల్లు తాగారు. అనంతరం ఈతకొడదామని దగ్గరలోని నామాలపాడు వాగులోకి దిగారు. కింద పాచి ఉండటంతో జారిపడి మునిగిపోయి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల్లో ఈనేష్ది ప్రకాశం జిల్లా కాగా, నాగార్జునది తెనాలి అయినప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం జాబ్ వేటలో ఉన్నట్లు సమాచారం. -
పండుగకు వచ్చి... విగతజీవులయ్యారు
అత్తిలి : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు..చివరికి చెరువులో శవాలై తేలారు. దుళ్ళ గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబు కుమారుడు మణికంఠ, తణుకు మండలం వేల్పూరుకు చెందిన కోటి చుక్కల నాగేంద్ర కుమార్ ఇద్దరు కుమార్తెలు పావని దుర్గ మహాలక్ష్మి, పల్లవిలు సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వీరంతా దగ్గరలోని గుడి దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళనతో కుటుంబసభ్యుల వెతికారు. అయినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుపుతుండగనే..చిన్నారుల శవాలు చెరువులో లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకూ ఓ చిన్నారి మృతదేహం వెలికి తీయగా, మిగతా ఇద్దరి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. -
నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలం పెద్ద బోరబందలో విషాధం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మరణించారు. అక్కడే ఉన్న మరో విద్యార్థి వెంటనే స్పందించి... వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారు చెరువు వద్దకు చేరుకుని... స్థానికుల సహాయంతో మృతదేహలను వెలికితీశారు. విద్యార్థుల మృతితో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. -
పడవ బోల్తా.. ముగ్గురు గల్లంతు!
-
ప్రాజెక్టుకు వరద నీరు: పలు గ్రామాలు జలయమం
గుంటూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పులిచింతల ప్రాజెక్టుకు ఆదివారం భారీగా నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాల్లోని కోళ్లురు, పులిచింతల గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. . చిట్యాల, చిట్యాల తండా, బోదనం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో సదరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయిర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ 10.40 టీఎంసీలుగా ఉంది. -
కుందూ నదికి భారీ వరద
-
గండిపేట చెరువులో ముగ్గురు యువకుల గల్లంతు
హైదరాబాద్ : ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్లుగా గుర్తించారు. దీంతో మృతుల నివాసాల్లో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేద పాఠశాల విద్యార్ధులు గల్లంతు
-
అయోధ్యలో వేద పాఠశాల విద్యార్ధులు గల్లంతు
బియాస్ నది ఘటన మరవకు మందే మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు సరయూ నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని వేదపాఠశాల నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లారు. అందులోభాగంగా బుధవారం ఉదయం ఫోటో దిగేందుకు సరయూ నదిలోకి దిగారు. ఆ క్రమంలో నీటి ప్రవాహానికి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దాంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు హాహాకారాలు చేయడంతో స్థానికులు నదిలోకి దూకి... గల్లంతైన విద్యార్థులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులు మల్కాజ్ గిరి వాణినగర్ కు చెందిన కిరణ్, చక్రపాణిలుగా గుర్తించినట్లు వేద పాఠశాలకు చెందిన ప్రతినిధిలు చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. -
నీట మునిగి ఐదుగురు మృతి
* తాత కర్మకాండలకు వచ్చి కానరాని లోకాలకు * నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో ఘటన * మృతుల్లో అన్నాతమ్ముడు, అక్కాచెల్లెలు డిండి : తాత దశదినకర్మలకు వచ్చిన మనవళ్లు, మనుమరాళ్లు ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో జరిగింది. అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, మరో బంధువు కలసి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వివరాలలోకి వెళితే... డిండి మండలకేంద్రానికి చెందిన దోవతి మల్లారెడ్డికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు దత్తారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గ్రామీణ వికాస్‌బ్యాంకులో క్యాషియర్ కాగా, రెండో కుమారుడు కరుణాకర్‌రెడ్డి డిండిలోనే టైలర్‌గా పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఫైనాన్స్ కన్సల్టెంట్. పదిరోజుల క్రితం మల్లారెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందాడు. డిండిలో ఆదివారం జరిగిన ఆయన దశదినకర్మలకు కుమారులు, కూతుళ్లతో పాటు వారి పిల్లలు, బంధువులు హాజరయ్యారు. వారంతా రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30), ప్రణీత్‌రెడ్డి(20), కరుణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న(20), దేవమణి(17), సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మల్లారెడ్డి బావమరిది నర్సిరెడ్డి (వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తి) కుమారుడు అవినాష్‌రెడ్డి(20), బంధువుల అమ్మాయి మొత్తం ఏడుగురు కలసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం చేసేందుకు వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలోకి వెళ్లగా అరవింద్‌రెడ్డిని కెమెరాతో ఫొటో తీయమన్నారు. కొంచెం లోపలికి వెళ్లేసరికి నలుగురూ నీటిలో మునిగారు. వారిని రక్షించేందుకు వెళ్లిన అవినాష్‌రెడ్డి కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న అరవింద్‌రెడ్డి, బంధువుల అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు కూడా పెద్దఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. డిండి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొం డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మృతదేహాలను సందర్శించారు. మూడు కుటుంబాల్లో గర్భశోకం.. దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రన్స రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. కరుణాకర్‌రెడ్డి పెద్దకూతురు జ్యోత్స్న హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బీటెక్ పూర్తిచేసిన అవినాష్‌రెడ్డి నర్సిరెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. నీటమునిగి ఈ మూడు కుటుంబాలకు చెందిన ఐదుగురు పిల్లలు మృత్యువాత పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఘటనపై తక్షణం స్పందించిన కేసీఆర్ హైదరాబాద్: నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెంటనే స్పందించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి గాలింపుచర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అయితే, నాయిని డిండి వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే మృతదేహాలను వెలికితీశారనే సమాచారం అందడంతో కేసీఆర్ ఆయన్ను వెనక్కి రప్పించారు. -
గంగావతరణం రోజున 27 మంది జలసమాధి
గంగావతరణం పండుగ సందర్భంగా తల్లి గంగమ్మను పూజించడానికి వెళ్లిన 27 మంది ఉత్తరప్రదేశ్ లో జలసమాధి అయిపోయారు. దివి నుంచి గంగానది భువికి దిగిన రోజు కావడంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గంగా స్నానాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది నదిలో మునిగి చనిపోయారు. మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు. గజ ఈతగాళ్లు ముగ్గురిని కాపాడారు. ఈ ప్రమాదాలు బదాయూ, బెలాదండీ, మథుర, కాస్ గంజ్, ఆగ్రా జిల్లాలో జరిగాయి. -
'శారదా'లో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
శారదా నదిలో ఈతకు దిగి గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారి మృతదేహాలను బుధవారం ఉదయం అనకాపల్లి సమీపంలోని తుమ్మలపాలం వద్ద పోలీసులు కనుగొన్నారు. మృతులు పృథ్వీ, మురళీ, అహ్మద్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. మృతులు ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్నారని, విశాఖపట్నం నగరానికి చెందినవారని వెల్లడించారు. శారదా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు.