దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు.
రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్‌లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్‌లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు.
ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్‌లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment