protect
-
రైతులు... అభిమానులే రక్షణ వలయంగా
-
నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
న్యూఢిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతులు మరోసారి ఉద్యమం బాట పట్టారు. నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ నుంచి నేడు(సోమవారం) రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా సరిహద్దుల్లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్బీర్ ఖలీఫా మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను కోరుతూ రైతులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.రైతుల డిమాండ్లు ఇవే..పాత భూసేకరణ చట్టం ప్రకారం బాధిత రైతులకు 10 శాతం ప్లాట్లు, 64.7శాతం పెంచిన పరిహారం ఇవ్వాలి. జనవరి 1, 2014 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం, 20 శాతం ప్లాట్లు ఇవ్వాలి. భూమిలేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలి. హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి.సరిహద్దుల్లో తనిఖీలు- ట్రాఫిక్ మళ్లింపులురైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకున్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది. -
సెల్ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.‘మా పాపకు ఇన్‌స్టా రీల్స్ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.‘స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని రూల్ ఉన్నా స్టూడెంట్స్ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్ ఫిర్యాదు.‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్‌ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.సోషల్ మీడియాతోనే చిక్కు..పిల్లల మీద స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హైద్ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదని సోషల్ సైకాలజిస్ట్ అయిన హైద్ బలంగా వాదిస్తున్నారు. పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.సమస్య ఎక్కడ మొదలైంది?ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్‌ను ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్లైన్ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్ వలలో చిక్కుకుపోయారు.మారకపోతే ప్రమాదమే..ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్ కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.ఐదు అంచెల్లో పరిష్కారం..1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ మొబైల్ ఫోన్ ఇస్తే సరిపోతుంది.2. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్‌ఫోన్‌దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్‌ఫోన్‌ను అనుమతించకూడదు. ఫోన్ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.4. స్మార్ట్ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్‌ల కోసం విద్యార్థులందరూ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.5. పిల్లలను ఫోన్ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.– సైకాలజిస్ట్ విశేష్ -
World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!
తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..చుట్టుపక్కల చూడరా...ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్‌కు అప్పగించింది.‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.ఆ విషాదంలో నుంచే..కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.సుప్రజఒకరోజు పెరియ నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్‌లాంటి ఎన్నో అవార్డ్లు అందుకుంది సుప్రజ.విజ్జీ–ది టర్టిల్ గర్ల్..భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్పార్క్లోకి వాలంటీర్‌గా అడుగుపెట్టింది విజయ.విజయఅప్పుడు ఆమె మద్రాస్‌లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్పార్క్లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.అరుణోదయం..ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలిఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.నుపుల్ కాలే‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్‌వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్‌లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు! -
Rahul Gandhi: వాళ్లది దాడి తంత్రం.. మాది పరిరక్షణ మంత్రం
జగ్దల్పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్‌సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు. ఆదివాసీ.. వనవాసీ ‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. మేమొస్తే రైతు రుణమాఫీ మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు. -
గాలిపటాలతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు. రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది. -
BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?
పోలీస్ బలగాల రక్షణ కోసం తయారు చేసే హెల్మెట్లతో పాటు బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్లు, డోర్ ఫిట్టింగ్‌లకు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా నిబంధనలు తీసుకొచ్చారు. దేశ రక్షణకోసం, ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం పని చేసే పోలీస్ దళాలు మరింత పటిష్ఠంగా పనిచేసేలా చూడాలని ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగానే వారు వినియోగించే వస్తువులు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోబుతున్నట్లు ప్రకటించింది. నాసిరక ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి కాకుండా నిరోధించాలని చెప్పింది. దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 23న పోలీస్ దళాలు, సివిల్ డిఫెన్స్, వ్యక్తిగత భద్రతా నిబంధనలు 2023, బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్ల నిబంధనలు 2023, డోర్ ఫిట్టింగ్స్ నిబంధనలు 2023 పేరిట మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ లేని ఈ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, దిగుమతులు, నిల్వ చేయరాదు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. -
ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం!
ఆధునిక యుగంలో గ్రామాలు సైతం నగరాలుగా మారిపోతున్నాయి. అయితే నేటికీ దేశంలోని కొన్నిగ్రామాలు మూఢనమ్మకాల ముసుగులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో కొలియారి గ్రామ ప్రజలు నేటికీ ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగివున్నారు. వీరు తమ ఇళ్లకు ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని చెబుతారు. గ్రామస్తులందరూ ఈ నమ్మకానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఈ గ్రామంలో పిడుగుపాటుకు గురైన వారికి ఆవు పేడ పూస్తారు. ఆవు పేడ నిల్వ ఉన్న ప్రదేశాలలో పిడుగు పడదని వీరు చెబుతుంటారు. ఈ గ్రామంలో ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నేటికీ ఏ శుభకార్యం జరిగినా ఆ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటి వెలుపల పేడతో కూడిన భద్రతా వలయం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల తమ ఇల్లు సురక్షితంగా ఉంటుందని గ్రామస్తులు అంటారు. ఇంటికి ఆవు పేడను పూస్తే పిడుగుల నుండి ఉపశమనం కలగడమే కాకుండా, పాములు, తేళ్ల నుండి కూడా రక్షణ దొరుకుతుందంటారు. అలాగే కీటకాలు కూడా ఇంటిలోనికి ప్రవేశించవని చెబుతారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్‌హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం.. -
విపత్తుల నుంచి రక్షణ ఉందా ?
ఏటా వానాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే నష్టం భారీగా ఉంటోంది. ఎడతెరిపి లేకుండా 24 గంటల పాటు వర్షం పడితే పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటి మధ్య చిక్కుకుపోవడం గురించి వింటూనే ఉన్నాం. వాహనాలు నీట మునగడం, ఇంటికి నష్టం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం చూస్తూనే ఉన్నాం. చెరువులు తెగి, నదులు పొంగడం వల్ల గ్రామాల్లోనూ పంటలకు, ఇతరత్రా ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే పరిణామం. ఈ విషయంలో మనం పెద్దగా చేయగలిగేదేమీ ఉండదు. కాకపోతే ఒక్క చర్యతో విపత్తుల వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాల తాలూకు నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చు. తగినంత బీమా కవరేజీ కలి్పంచుకోవడమే ఇందుకు ఉన్న ఏకైక మార్గం. సమగ్రమైన కవరేజీతో, అన్ని నష్టాలకూ రక్షణ కల్పించే విధంగా బీమా కవరేజీ ఉండాలి. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది. కార్లకు బీమా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసే వాహన బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సమగ్రమైన కవరేజీతోపాటు, స్టాండర్డ్ పాలసీల్లో నచి్చంది తీసుకోవచ్చు. కాకపోతే కారుకు కాంప్రహెన్సివ్ బీమా పాలసీ తీసుకున్నామని చెప్పి నిశి్చంతంగా ఉండడానికి లేదు. వరద నీరు కారణంగా ఇంజన్‌కు నష్టం ఏర్పడితే ఈ పాలసీల్లో పరిహారం రాదు. టైర్లు పేలిపోవడం, వరదనీరు కారణంగా వాహనం నిలిచిపోయినా పరిహారం రాదు. ‘‘వరద నీటి వల్ల ఇంజన్ ఆన్ అవ్వకపోతే అందుకు కాంప్రహెన్సివ్ ప్లాన్‌లో కవరేజీ రాదు. అంతేకాదు విడిభాగాలు మార్చాల్సి వచి్చనా లేదా విడిభాగాలకు మరమ్మతులు చేయాల్సి వచి్చనా కానీ, తరుగుదలకు చెల్లింపులు చేయవు. అందుకని వాహనదారు తప్పనిసరిగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, స్పాట్ అసిస్టెన్స్, డిప్రీసియేషన్ కవర్ తప్పకుండా తీసుకోవాలి’’అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ సూచించారు. సాధారణంగా ఈ కవరేజీలు యాడాన్ లేదా రైడర్ రూపంలో అందుబాటులో ఉంటాయని, వాహన బీమాతోపాటు వీటిని కూడా తీసుకోవాలన్నారు. వ్యాధుల నుంచి రక్షణ వర్షా కాలంలో దోమల వల్ల, నీరు కలుషితం కావడం వల్ల, వైరస్ల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరం, డయేరియా, చికున్ గునియా ముప్పు వర్షాకాలంలో ఎక్కువ. వీటి కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ. వేలు, లక్షల బిల్లు చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకుని వెక్టార్ బోర్న్ డిసీజ్ ఇన్సూరెన్స్‌ను ప్రతీ కుటుంబం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఈ కవరేజీ కింద దోమలు, ఇతర కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్ కారణంగా వచ్చే వ్యాధులకు సైతం కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా రిస్క్ ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోత వీటిల్లో ప్రాణ ప్రమాదం ఏర్పడొచ్చు. మనదేశంలో డెంగీ, మలేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా లక్షలాది మంది వీటి బారిన పడుతున్నారు. ‘‘కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లేని వారు, తప్పకుండా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్ కవరేజీని తమకు, తమ కుటుంబ సభ్యులకు తీసుకోవాలి. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యం చికిత్సలకు పరిహారాన్ని ఇవి చెల్లిస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. కీటకాల వల్ల ఎదురయ్యే అనారోగ్యానికి చికిత్స పొందేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే రిస్క్ ఉంటుంది. డెంగీ బారిన పడితే కోలుకునేందుకు 8–10 రోజులు పట్టొచ్చు. చికిత్సా ఖర్చు రూ. లక్షల్లో ఉంటుంది. మెట్రోల్లో రూమ్ రెంట్ రూ. లక్ష ఉంటుందని, ఒక్కసారి ప్లేట్లెట్లు ఎక్కించేందుకు రూ.40,000 తీసుకుంటున్నారని పాలసీబజార్ అంచనా. డెంగీ కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే ఒకరికి ఒకటికి మించిన సార్లు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి రావచ్చు. బీమా పరిశ్రమ ప్రత్యేకంగా వెక్టార్ కేర్ ఇన్సూరెన్స్, వెక్టార్ బోర్న్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. డెంగీ జ్వరం, మలేరియా, ఫైలేరియా, కాలా అజార్, చికెన్ గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్‌లకు వీటిల్లో కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు జీవిత కాలంలో ఒక్కసారే క్లెయిమ్ చేసుకోగలరు. ‘‘మీ బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వీటికి కవరేజీ లేకపోతే.. ఒక్కో వ్యాధికి విడిగా కవరేజీ తీసుకోవచ్చు. డెంగీ, మలేరియా ఈ రెండూ మన దేశంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు. కనుక వీటికి కవరేజీ కలిగి ఉండడం ఎంతో అవసరం’’అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ చాబ్రా సూచించారు. ఇంటికి బీమా వర్షాలు, వరదలకు ఇంటికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వడగండ్లు, పిడుగులతో కూడిన వర్షాలకు ఇంటి నిర్మాణం దెబ్బతినొచ్చు. కుండపోతకు ఇంటి పైకప్పుకు నష్టం కలగొచ్చు. అలాగే, ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర వస్తువులు, ఫరి్నచర్ దెబ్బతినడం వల్ల ఆరి్థక నష్టం ఎదురుకావచ్చు. అలాంటి పరిస్థితుల్లో హోమ్ ఇన్సూరెన్స్ ఎంతో ఆదుకుంటుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో హోమ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. హౌస్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేకపోవడం, తప్పుడు అభిప్రాయాల కారణంగా మన దేశంలో దీని విస్తరణ చాలా నిదానంగా ఉందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ నాన్‌మోటార్ నేషనల్ హెడ్ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. అయితే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ‘‘ప్రకృతి విపత్తుల (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణంగా వాటిల్లే నష్టానికి కవరేజీనే ఈ బీమా పాలసీలు ఆఫర్ చేస్తాయి. అలాగే, ఊహించని ఇతర ఉత్పాతాల వల్ల నష్టానికి కూడా రక్షణనిస్తాయి. ఏడాదికి మించిన కవరేజీని ఒకేసారి తీసుకోవడం వల్ల ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ హోమ్ కవర్ తీసుకోవాలి. దోపిడీ, దొంగతనం, వ్యక్తిగత ప్రమాద కవరేజీ, ఇల్ల దెబ్బతినడం వల్ల నష్టపోయే అద్దె ఆదాయాన్ని భర్తీ చేసే కవరేజీలు ఉండాలి. ఇంట్లోని ఖరీదైన పెయింటింగ్‌లు, ఆభరణాలకూ బీమా రక్షణ కలి్పంచుకోవాలి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని కూడా తీసుకోవాలి’’ అని గురుదీప్ సింగ్ సూచించారు. ఇంటి నవీకరణ, పునరి్నర్మాణ సమయంలో ఏవైనా మార్పులు చేసినట్టయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కచి్చతమైన విలువను పేర్కొనాలని సింగ్ పేర్కొన్నారు. ‘‘మీ ఇల్లు దీర్ఘకాలం పాటు ఖాళీగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ఎంతో అవసరం. సరైన చిరునామా, ప్రాపర్టీ విలువ సరిగ్గా పేర్కొనడం వల్ల పాలసీదారు తన వంతు నష్టాన్ని భరించాల్సిన అవసరం లేకుండా నివారిస్తుంది’’ అని సింగ్ తెలిపారు. ఇంట్లోని వస్తువులకు బీమా కవరేజీ కోసం విడిగా ఒక్కో ఆరి్టకల్ వివరాలను పూర్తిగా పేర్కొనడం, వాటి విలువను కూడా నమోదు చేయడాన్ని మర్చిపోవద్దు. రీప్లేస్మెంట్ లేదా రీఇన్స్టేట్మెంట్ కవర్‌ను తీసుకోవాలి. ‘‘హోమ్ ఇన్సూరెన్స్ విభాగంలో మార్కెట్ వేల్యూ కవరేజీ లేదంటే రీఇన్స్టేట్మెంట్ కవరేజీ తీసుకోవచ్చు. మార్కెట్ వేల్యూ కవర్లో తరుగుదల పోను మీ ఇంటి విలువలో మిగిలిన మొత్తాన్ని పరిహారం రూపంలో పొందుతారు. రీఇన్స్టేట్మెంట్ కవర్లో ఇంటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సమాన స్థాయిలో బీమా పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు వరదలు వచ్చి ఇల్లు దెబ్బతింటే, అప్పుడు ఇంటిని తిరిగి నిర్మించుకోవాల్సి రావచ్చు. అటువంటి సందర్భాల్లో హౌస్ రీఇన్స్టేట్మెంట్ కవర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ సంజయ్‌దత్తా వివరించారు. ఇవి ఉండేలా చూసుకోవాలి ► ఆటో బీమా: ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజన్ ఆయిల్, నట్లు, బోల్టులు, గ్రీజులు, వాషర్లతో కూడిన కన్జ్యూమబుల్ రైడర్లను కూడా తీసుకోవాలి. ► హోమ్ ఇన్సూరెన్స్: రీప్లేస్మెంట్ కాస్ట్ క్లాజ్ ఉందేమో చూసుకోవాలి. ఇది ఉంటే అప్పుడు ఇంటి పునరి్నర్మాణానికి కావాల్సినంత బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇంట్లోని విలువైన గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సైతం కవరేజీ ఉండాలి. మరమ్మతులు, ప్లంబింగ్, కార్పెంటరీ, పెస్ట్‌కంట్రోల్ కవరేజీ ఉందేమో చూడాలి. దాదాపు అన్ని రకాల నష్టాలకు పరిహారం ఇచ్చే సమగ్రమైన ప్లాన్‌ను తీసుకోవడమే సరైనది. ► వెక్టార్ బోర్న్ డిసీజ్: తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెక్టార్ బోర్న్ డిసీజ్‌కు కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే విడిగా కొనుగోలు చేసుకోవాలి. విడిగా ఒక్కో వ్యాధి, దానికి ఉప పరిమితుల గురించి అడిగి తెలుసుకోవాలి. బీమా లేక భారీ నష్టం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కోసారి గణాంకాలను చూస్తే కానీ అర్థం కాదు. 2001 నుంచి ప్రకృతి విపత్తుల కారణంగా 85,000 మంది మరణించగా, వేలాది కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తాజాగా స్పష్టం చేసింది. హోమ్ ఇన్సూరెన్స్ కేవలం 8 శాతం మందే కలిగి ఉండడంతో, పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వచి్చనట్టు వాస్తవాన్ని గుర్తు చేసింది. 1900 నుంచి ప్రకృతి వైపరీత్యాల పరంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. మన దేశంలో 764 సహజ విపత్తులు సంభవించాయి. తుపానులు, వరదలు, భూకంపాలు, కొండ చరియలు విరిగి పడడం, కరువు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా 1900 నుంచి 2000 మధ్య 361 పెద్ద వైపరీత్యాలు నమోదు కాగా, ఆ తర్వాత 22 ఏళ్లలో (2001–2022) 402 విపత్తులు చోటు చేసుకున్నాయి. అంటే గతంతో పోలిస్తే ప్రకృతి విపత్తులు పెరిగిపోయినట్టు ఈ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా 41 శాతం వైపరీత్యాలు వరదల కారణంగా సంభవించినవే ఉన్నాయి. ఆ తర్వాత తుపానుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో వచి్చన వరదల కారణంగా రూ. 52,500 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ, ఇందులో బీమా కవరేజీ ఉన్నది కేవలం 11 శాతం ఆస్తులకే కావడం వాస్తవం. ఇంటికి, ఆస్తులకు, ఆరోగ్యానికి, జీవితానికి బీమా ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. -
వేసవి నేపథ్యంలో నెహ్రు జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
-
మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్ చేయండి: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్!ఆ తర్వాత..) -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చేసింది పిన్ లేకుండానే చెల్లింపులు చేసేలా పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్‌తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. ఏ బ్యాంకుల యూజర్లకు ఈ సేవలు వర్తిస్తాయి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి. లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్‌కు బ్యాలెన్స్‌గా రూ. 1,000 జోడిస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్‌లో ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్‌నుండి విమాన టికెట్ల బుకింగ్‌పై రూ. 149, బస్ టిక్కెట్లకు రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై 'క్యాన్సిల్ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తక్షణమే సంబంధిత ఖాతాలోకి నగదు జమ అవుతుంది. Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this 🚀🚀 pic.twitter.com/c1tr7J4V3A — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023 -
తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు
ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను కోరారు. ఈ మహమ్మారి వ్యాపి చెందకుండా హెల్త్ క్యాపెయిన్లు ఏర్పాటు చేసి తగిన వైద్యం అందించాలని చెప్పారు. అలాగే ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేలా రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. ప్రజల జీవితాలకు భద్రతా తోపాటు మెరుగైనా ఆరోగ్యాన్ని అందించేలా చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు వెల్లువలా పెరుగుపోతుంటే..మరోవైపు ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ వైద్య సేవల కొరత తోపాటు ఔషధాలకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఈ డిమాండ్‌ని తీర్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు శ్మశాన వాటికలకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు సమాచారం. ఒక పక్క కేసుల తోపాటు మరణాలు కూడా అధికమవ్వడంతో శ్మశానాల వద్ద కిక్కిరిసిపోయిన శవాలతో హృదయవిదారకంగా ఉంది. ఐతే డ్రాగన్ దేశం కరోనా మరణాల సంఖ్యలను గణించకుండా కేవలం కోవిడ్ కారణంగా వచ్చిన న్యుమోనియా లేదా శ్వాసకోస వైఫల్య కేసులను మాత్రమే చైనా లెక్కిస్తోందంటూ.. విమర్శలు వెల్లవెత్తాయి. (చదవండి: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థతులు) -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
రైతు వేసిన కొత్త ఎత్తు.. ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. ఇదంతా ఏంటీ?
పిఠాపురం(కాకినాడ జిల్లా): ఆ పొలంలోకి వెళితే ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. అలా రా.. అలా రా...! అంటూ మనిషి కేకలు వినిపిస్తుంటాయి. అలాగని ఎంత వెతికినా ఒక్క మనిషీ కనిపించడు. తీరా చూస్తే అక్కడ ఒక కర్రకు కట్టిన లౌడ్ స్పీకర్ నుంచి ఆ కేకలు వినిపిస్తుంటాయి. ఇదంతా ఏంటా? అని అనుకుంటున్నారా! కోతుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు వేసిన కొత్త ఎత్తు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఒక రైతు తన మొక్క జొన్న పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్. (అంతర చిత్రం) అరుపులకు భయపడి పొలానికి దూరంగా ఉన్న షెడ్ పైనే ఉండి పోయిన కోతులు ఇప్పటి వరకు రేకు డబ్బాలు, ఫ్యాన్లు వంటివి ఉపయోగించే రైతులు ప్రస్తుతం బ్యాటరీతో పని చేసే లౌడ్ స్పీకర్లను వాడుతూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. ఇది చూసిన స్థానికులు ఔరా! అంటున్నారు. తాను పొలంలో ఉన్నంత సేపు చార్జింగ్ పెట్టి తాను ఇంటికి వెళ్లేటప్పుడు ఆన్ చేసి వదిలేస్తే మళ్లీ తాను తిరిగొచ్చే వరకు ఇది అరుస్తూ తన పంటను కాపాడుతోందంటున్నాడు రైతు. చదవండి: యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ.. -
పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
మొన్నటి సోమవారం.. వేకువజాము నుంచే ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు.. అకస్మాత్తుగా ఇళ్ల మధ్యలో ఉన్న ఓ చెట్టు నుంచి మంటలు.. ఆ రోజు మనమంతా చాలా భయాందోళనకు గురయ్యాం కదా.. వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. చెట్లు కాలిపోతుంటాయి. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు.? అసలు.. ఈ పిడుగులేమిటి? వాటి కథేంటి? ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు(ఎలక్ట్రాన్లు) దగ్గరలో ఉన్న వస్తువు వైపు ప్రయాణిస్తాయి. మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల (విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి) నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్ లైట్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది. తొలిసారిగా 1847లో థామస్ మోరిస్ ఈస్టర్లీ అనే వ్యక్తి వీటిని గుర్తించాడు. (క్లిక్: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..) జాగ్రత్తలు తప్పనిసరి ► ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండటం ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి. ► పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ► నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి. ► చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ► ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు. ► గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి నిలిపివేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. ► పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. క్యుములోనింబస్ మేఘాలు ప్రమాదం క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రదేశంలో పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ మేఘాలకు వర్టికల్ వేగం సెకనుకు సెంటీమీటరుగా ఉంటే, క్యుములోనింబస్ మేఘాలకు వర్టికల్ స్పీడ్ సెకను మీటర్లుగా ఉంటుంది. (క్లిక్: మామిడి తాండ్ర.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) ఉష్ణమండల ప్రాంతాల్లో అధికం ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. డాప్లర్ రాడార్ సహాయంతో పిడుగులను ముందస్తుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం సాధ్యపడుతుంది. ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత నేడు అందుబాటులో ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణశాస్త్ర విభాగం, ఏయూ -
చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్
సాక్షి, హైదరాబాద్: నాలుగు శతాబ్దాలకుపైగా నవనవోన్మేషం.. నగరానికే తలమానికం.. అపురూప కట్టడం మన చార్మినార్. దీనిని చెక్కుచెదరకుండా కాపాడేందుకు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) రక్షణ చర్యలు తీసుకుంటోంది. పిడుగుపాటు ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే దిశగా లైటనింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. చారిత్రక కట్టడం దెబ్బతినకుండా.. పిడుగుపాటుకు గురైనా నష్టం వాటిల్లకుండా ఈ కండక్టర్ నిరోధించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం గోతుల తవ్వకాలు చేపట్టింది. సమాచార లోపం కారణంగా స్థానికులు.. సొరంగాల తవ్వకాలు జరుపుతున్నారని పొరబడి ఆందోళనకు దిగారు. చార్మినార్ కట్టడం పరిరక్షణలో భాగంగా నాలు గు మినార్లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కా రణంగా నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టా మని ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఎస్.ఎ.స్మిత, అధికారులు ఎస్. కుమార్, రాజేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. లైటనింగ్ కండక్టర్ల ఏర్పాటుకు చేస్తున్న తవ్వకాల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, కట్టడాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వేల కిలోమీటర్ల నుంచి వచ్చి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకతలివే..
పిఠాపురం(తూర్పుగోదావరి): అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్టుగా ‘తూర్పు’ తీరానికి చేరుకుంటాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో జిల్లాలోని సముద్ర తీరంలో సందడి చేస్తున్న ఈ తాబేళ్ల రక్షణకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. చదవండి: రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..? అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే కాకినాడ సమీపంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్య తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు ఎక్కువగా వస్తూంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి ‘తూర్పు’ తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి, ఇసుకలో గోతులు తవ్విన, వాటిల్లో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి, తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం మరో విశేషం. అన్నీ గండాలే భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతుంటాయి. రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లను కూడా వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి. ఈవిధంగా ఏటా ఉప్పాడ తీరంలో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం జనవరి, ఫిబ్రవరి నెలలు సముద్ర తాబేళ్లకు సంతానోత్పత్తి సమయం. దీంతో ఇక్కడకు వస్తున్న తాబేళ్లకు రక్షణ కల్పిస్తున్నాం. అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. అవి గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నాం. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకూ సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నాం. తాబేళ్లను, వాటి గుడ్లను ఏ జంతువులూ తినకుండా రక్షణ కలి్పస్తున్నాం. తయారైన పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. తాళ్లరేవు సమీపంలోని కోరింగ అభయారణ్యం ప్రాంతానికి సుమారు లక్ష వరకూ తాబేళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల వల్ల బోట్లలో పడి కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎస్.అశ్వనీకుమార్, అటవీ శాఖ సెక్షన్ అధికారి, కోరంగి -
కంటిని కాపాడుకోవాలంటే.. ఇలా చేయాల్సిందే..
ఒకప్పుడు చత్వారం అంటే నలభై ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యేది. హ్రస్వదృష్టి, దూరదృష్టి వంటి సమస్యలకు కళ్లద్దాలు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్న వయసులోనే కంటి సమస్యలు మొదలవుతున్నాయి. నూటికి పదిమంది కళ్లద్దాల అవసరం ఉన్న రోజుల స్థానంలో నూటికి యాభై మందికి కళ్లజోళ్లు దేహంలో భాగమైపోతున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్లో ఉండగానే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు తప్పించుకున్న పిల్లలకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్య కళ్లద్దాల అవసరాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోషకాహారలోపం, కంటికి వ్యాయామం లేకపోవడమే. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. వ్యాయామం ఇలా.. వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు కంటి వ్యాయామాలు చేయడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. పక్కనున్న ఫొటోను పరిశీలించండి. 1. తలను, మెడను నిటారుగా ఉంచి... కుడివైపుకు, ఎడమవైపుకు చూడాలి. 2. ఇంటి పై కప్పును, నేలను చూడాలి. ఇలా చేస్తున్నప్పుడు కనుగుడ్డు మాత్రమే కదలాలి. తలను పైకెత్తకూడదు, కిందకు దించకూడదు. 3. వలయాకారంగా క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్‌గా తిప్పాలి. 4. దూరంగా ఉన్న వస్తువు మీద పది సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి. 5. ఆ తర్వాత ఐ మూలగానూ, దానికి వ్యతిరేక దిశలోనూ చూడాలి. 6. ముక్కు కొనను చూడాలి. ఈ ప్రక్రియ మొత్తానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. ఇలా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూసేవాళ్లు గంటకోసారి చేయవచ్చు. వీటిని తిందాం! మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే దానికి ముఖ్య కారణం పోషకాల లోపం కూడా కారణం అవ్వచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను తెలుసుకుందాం. ఇవన్నీ మనకు సులువుగా దొరికేవే. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది. ఇతర ఆకుకూరల్లో పొన్నగంటి, మెంతికూర, తోటకూరలను వారంలో కనీసం రెండుసార్లయినా తీసుకోవాలి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాలు, పాల ఉత్పత్తులు, క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. -
జొన్నలకు పులి కాపలా!
తుంగతుర్తి: కోతుల బెడద తీవ్రమవుతుండటంతో రైతులు విసిగిపోతున్నారు. తమ పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్‌రోడ్ తండా వద్ద ఓ రైతు తాను పండించిన జొన్నలను ఆరుబయట ఆరబోసి కోతుల బెడద నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి పులి బొమ్మను ఏర్పాటు చేశాడు. కోతులు ఈ పులి బొమ్మను చూసి దరిదాపుల్లోకి రాకుండా పోతున్నాయని రైతు తెలిపాడు. -
ఇక ఆ పెళ్లిళ్లకు భయం లేదు..
కులాంతర వివాహాలు చేసుకోదలిచారా..? పెద్దల చేతిలో పరువు హత్యలకు గురవుతామని భీతిల్లుతున్నారా..? ఇక మీకా బెంగలేదు. ఇలాంటి జంటలకు అన్ని విధాల అండదండలను కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం సాక్షిగా ప్రకటించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన వీరన్ కుమార్తె విమలాదేవిని అతని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్ 2014లో ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో అదే ఏడాది అక్టోబరులో విమలాదేవిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తెచ్చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు విమలాదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంతేగాక ఎవరికీ తెలియకుండా దహన సంస్కారాలు చేశారు. దీనిపై విమలాదేవి భర్త దిలీప్‌కుమార్ మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి రామసుబ్రమణియన్ 2016 ఏప్రిల్‌లో తీర్పు చెప్పారు. పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి పంచాయితీ ముఠాతో కుమ్మక్కుగా వ్యవహరించారు. ఈ కారణంగా సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. ఇలాంటి పరువు హత్యలను అడ్డుకునేందుకు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి రక్షణ కల్పించాలని, జిల్లాల వారీగా సాంఘిక సంక్షేమశాఖ, ఆదిద్రావిడ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక సహాయక కేంద్రాలను నెలకొల్పాలని తీర్పులో సూచించారు. ఉత్తర్వులు అమలుచేయలేదని పిటిషన్ కోర్టు ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిపై కులవివక్ష నిర్మూలన సంఘం రాష్ట్ర కార్యదర్శి సామువేల్‌రాజ్.. మద్రాసు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను గతంలో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి ఎమ్.సత్యనారాయణన్ ముందుకు ఇటీవల విచారణకు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక విభాగాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటైనట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇటీవల బదులు పిటిషన్ వేశారు. విమలాదేవీ కేసులో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన చెక్కానురాణి ఇన్స్పెక్టర్ సుకుమార్, వత్తలగుండు ఇన్స్పెక్టర్ వినోద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంది, ఉసిలంపట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాణిలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. మూడేళ్ల పాటు వారందరికీ ఇంక్రిమెంట్లు కట్ చేసినట్లు తెలిపారు. డీఐజీ లేదా ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక విభాగాలు, ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసి ఫోన్ నంబర్లను ప్రచారం చేశారు. ఈ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను పోలీస్ వెబ్సైట్లో పొందుపరచాలని ఏప్రిల్ 10వ తేదీనే ఆదేశించినట్లు తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకునే వారు ఈ ఫోన్ నంబర్ లేదా ఆన్లైన్ మూలంగా సమాచారం ఇవ్వవచ్చు. వధూవరులు కోరినట్లయితే సమీప పోలీస్‌స్టేషన్‌లోని ఇన్స్పెక్టర్ తగిన భద్రత కల్పించడంతోపాటు వారిపై నిరంతర నిఘా పెడతారు. నిధుల కేటాయింపు పరువు హత్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం నిధులను సైతంకేటాయించింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తాత్కాలికంగా బస, రక్షణ, ఇరుకుటుంబాల మధ్య సామరస్యపూర్వక చర్చలకు కౌన్సెలింగ్ నిపుణుల కేటాయింపు చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ, సహకారం అందించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అన్ని చర్యలు చేపట్టిన కారణంగా ప్రభుత్వంపై వేసిన కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేయాలని బదులు పిటిషన్లో న్యాయవాది కోరారు. ఈ కేసును న్యాయమూర్తి ఆగస్టు 9వ తేదీకి వాయిదావేశారు. -
హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం
కోరుట్లటౌన్: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు కమలానంద భారతీస్వామి అన్నారు. కోరుట్లలో ఈనెల 30న భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్ర పోస్టర్‌ను ఆదివారం స్థానిక మహాదేవస్వామి ఆలయంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీరామునిచరిత్ర, హనుమాన్దీక్ష విశిష్టతను వివరించారు. ఆలయ అధ్యక్షుడు గెల్లె గంగాధర్, మంచాల జగన్, గట్ల శివ, అర్చకులు పాలెపు వెంకటరమణశర్మ, కార్తీక భరధ్వాజశర్మ, గెల్లె శ్రీనివాస్, నరేందర్, నరేశ్, రోహిత్ పాల్గొన్నారు. -
స్మగ్లింగ్ నిరోధానికి డాగ్‌స్క్వాడ్
జన్నారం(ఖానాపూర్): జిల్లాలో స్మగ్లింగ్ నిరోధానికి డాగ్‌స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అటవీ సంరక్షణ అధికారి రామలింగం తెలిపారు. బుధవారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురష్కరించుకుని మండల కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారం ఏర్పాటు చేశారు. ఎఫ్‌డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు ఉపయోగపడే అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు. కవ్వాల్ టైగర్‌జోన్‌లో త్వరలో టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డాగ్‌స్క్వాడ్ ద్వారా స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. డాగ్ ద్వారా ఎక్కడ టేకు కలప దాచి ఉన్న బయటకు వస్తుందన్నారు. వాహానాల ద్వారా తరలించినా డాగ్‌స్క్వాడ్ ద్వారా పట్టుకోవచ్చన్నారు. అలాగే అడవి లోపల నివాసం ఉంటున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టైగర్‌జోన్ పరిధిలో కోర్ ఏరియాలో ఉండే 27 గ్రామాల్లో పర్యటించి అడవుల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో అలసత్వం చేసే అధికారులపై చర్యలుంటాయన్నారు. సమావేశంలో జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట్ రేంజ్ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దేవిదాస్, సెక్షన్ అధికారి ప్రకాశ్, వివిధ రేంజ్ పరిధిలోని అటవీ అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కల్పించండి
- రివాల్వర్ లైసెన్సును ఎందుకు రెన్యూవల్ చేయరు? – పోలీసులు ఏకపక్ష ధోరణి వీడాలి – గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి గుంతకల్లు టౌన్ : ప్రానహాని ఉన్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలకు రక్షణ కల్పించాలని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి జిల్లా పోలీసు అధికారులను కోరారు. మంగళవారం ఆయన గుంతకల్లులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన రివాల్వర్ లైసెన్సు (120/1–జి) గడువు 2016 డిసెంబర్ 31కు ముగిసిందన్నారు. లైసెన్స్ రెన్యూవల్ కోసం గడువుకు 25 రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నానన్నారు. నేటివరకూ రెన్యూవల్ చేయకపోగా.. లైసెన్స్ గడువు ముగిసినందున రివాల్వర్‌ను దగ్గర ఉంచుకోవడం చట్టరీత్యా నేరమని, పోలీస్ స్టేసన్‌లో డిపాజిట్ చేయాలని నాలుగు రోజుల క్రితం వజ్రకరూర్ ఎస్ఐ తనకు నోటీసులు పంపడమేంటని ఆయన ప్రశ్నించారు. రెన్యూవల్ పీరియడ్‌లో రివాల్వర్‌ను స్వాధీనపరచాలని ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు కానీ, మార్గదర్శకాలు కానీ జారీ చేయని అధికారులు ఉన్నపళంగా రివాల్వర్‌ను స్వాధీనపరచమని నోటీసులు పంపడంపై అనుమానాలు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్సీపీ నేతల రివ్వాలర్ లైసెన్సులు మాత్రమే రెన్యూవల్ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సబబని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాణహాని ఉన్న ప్రతి ఒక్క టీడీపీ నేతకూ, వారి కుటుంబ సభ్యులకూ రక్షణ కల్పించారని గుర్తు చేశారు. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో రివాల్వర్‌ను తీసుకెళ్లమని చెప్పినా ఆయనే తీసుకుపోలేదని వ్యాఖ్యానించిన పోలీసు ఉన్నతాధికారులు.. తాము దరఖాస్తు చేసుకున్నా రెన్యూవల్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏకపక్ష ధోరణి వీడి రివాల్వర్ లైసెన్సులు రెన్యూవల్ చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ ముఖ్యనేతలందరికీ రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. లేనిపక్షంలో తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.సుంకప్ప, కౌన్సిలర్ అహ్మద్‌బాషా, యువజన విభాగం నేత శరణబసిరెడ్డి పాల్గొన్నారు. -
మండే ఎండ.. దుప్పటే అండ
పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి అన్నట్లు.. మండుతున్న ఎండల నుంచి రక్షించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇదిగో ఈ చిత్రమే ఇందుకు సాక్ష్యం. బయట ఎండను చూస్తే భయమేస్తోంది. అలాగని ఇంట్లోనే ఉంటే కడుపు కాలుతుంది. ఇంకేముంది ఎడ్ల బండి యజమాని బుర్రకు ఆలోచన తట్టినట్లుంది.. అంతే.. ఇదిగో తనతో పాటు ఎద్దుకు కూడా నీడ ఉండేలా దుప్పటి కప్పాడు. ఎంచక్కా తన పని తాను చేసుకుపోతున్నాడు. కడప నగరంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. -
నన్ను కాపాడడానికి నా తల్లి రేప్‌కు గురైంది
-
హస్తకళలను కాపాడుకోవాలి
హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ఏడీ మురళీకృష్ణ కరీమాబాద్ : ఎంతో విలువైన భారతీయ హస్తకళలను కాపాడుకోవాలని హ్యండీ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ఏడీ కే.ఆర్ మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం నగరంలోని ఉర్సు ప్రతాప్‌నగర్‌లో కంచే నర్సింగరావు అధ్యక్షతన ‘పెహచాన్ ఆర్టిజన్ ఎన్ రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ఎన్ రోల్ చేయించుకున్న హస్త కళాకారులకు ఐడీ కార్డు ఇస్తారని, ఎల్ఐసీ సదుపాయం, ముద్రా లోన్ లభిస్తాయన్నారు. అలాగే ఇందులోని సభ్యులకు మరింత శిక్షణతో పాటు తగిన వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి, మేనేజర్ కమలాకర్, మల్లికార్జున్ , దస్తగిరి, నర్సింహాచారి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, వీరబ్రహ్మం, రవి పాల్గొన్నారు. -
వ్యాపారులకు అండగా చాంబర్ ఆఫ్ కామర్స్
పాత గుంటూరు: 75 ఏళ్ల నుంచి వ్యాపార, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి చాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేసిందని ది ఇండియన్ చాంబర్ ఆఫ్‌కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. జిన్నాటవర్ సెంటర్లోని చాంబర్ కార్యాలయంలో మంగళవారం 77వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆతుకూరి ఆంజనేయులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో 3 వేల మంది సభ్యులు, 90 అనుబంధ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీ యాక్ట్ కింద రిజిష్ట్రరు అయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చాంబర్ గుంటూరు ఒక్కటేనన్నారు. ఎక్స్‌పోర్టు సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజన్ ఇచ్చే అధికారం ఉందన్నారు. జిల్లాలో పొగాకు, మిర్చి, కాటన్ ఎగుమతి అవుతుందని, ఎవరైనా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళాలంటే చాంబర్ లెటర్ ఉంటేనే వ్యాపార వీసా ఉంటుందని వెల్లడించారు. డిసెంబరులో చాంబర్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం∙జూబిలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆతుకూరి ఆంజనేయులును సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు, మిత్రులు శాలువా, పూలదండలతో సత్కరించారు. సంస్థ కార్యదర్శి అన్నా పూర్ణచంద్రారవు, గజవల్లి శివన్నారాయణ, రంగ బాలకృష్ణ, తూనుగుంట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
–జూలకంటి రంగారెడ్డి మొల్కచర్ల(దామరచర్ల) : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని.సోమవారం దామరచర్ల మండలం మొల్కచర్లలో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలతో పాటు తెగిన మల్లప్ప చెర్వును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు తెగడం వల్ల దానికింద సాగు చేసిన 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. చెరువు గండిని పూడ్చి వేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలన్నింటినీ జాప్యం చేయకుండా ఒకే విడతలో మాపీ చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎం yì విజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు,డి.చంద్రశేఖర్‌యాదవ్,సర్పంచి కొర్రా శ్రీనునాయక్ తదితరులు ఉన్నారు. -
బాధితులకు అండగా నిలుస్తా..
* అన్నదాతకు వైఎస్ జగన్ భరోసా * పంటలు నష్టపోయిన రైతన్నకు ఆత్మీయ పలకరింపు * వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పరామర్శ * రైతుల బాధలు చూడాలంటూ సీఎంకు సూచన * జననేతకు ఘనస్వాగతం పలికిన జిల్లా వాసులు సాక్షి, అమరావతి బ్యూరో: జననేత వైఎస్ జగన్ రాక పల్నాడు రైతుల్లో భరోసా కల్పించింది. భారీ వర్షాలు, వరదలు పోటెత్తడంతో పంట నష్టపోయి.. మనోనిబ్బరం కోల్పోయి తల్లడిల్లుతున్న రైతన్న ఆత్మీయ నేత పలకరింపుతో ఊరడిల్లాడు. ప్రభుత్వం నుంచి సాయం కొరవడి, కనీసం ఆదుకుంటామనే మాట చెప్పడానికి కూడా ముందుకు రాని సర్కారు తీరుపై కినుక వహించిన రైతులకు భరోసా కల్పిస్తూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పల్నాడు పర్యటన సాగింది. పల్నాడు ప్రాంతాల్లో వర్షాల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన సోమవారం ఉదయం పొందుగల వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వమే ఆదుకోకపోతే ఎలా బతుకుతారు? పంట కోల్పోయిన ఆవేదనలో ఉన్న అన్నదాతలను ఆదుకోవడానికి ఆకాశమార్గాన చక్కర్లు కొడితే సరిపోదని, భూమార్గానికి వచ్చి రైతుల బాధలను చూడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత సూచించారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోకపోతే ఎలా బతుకుతారంటూ సర్కారును నిలదీశారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు సాయం అందేలా వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని రైతన్నలకు హామీ ఇచ్చారు. దాచేపల్లిలోని ఎస్సీ కాలనీలో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించిన జననేత చలించిపోయారు. కాలనీ పక్కనే ఉన్న కాటేరువాగు పొంగిపొర్లడంతో జలమయమైన కాలనీలో కాలినడకన తిరిగిన జగన్ వరద తీవ్రతతో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. వరదల్లో నష్టపోయిన ఎస్తేరు అనే ఓ మహిళ జగన్ వద్దకు వచ్చి ప్రభుత్వం నుంచి సాయం అందలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ఆదివారం ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కాలనీలోకి రాకుండా రోడ్డుపై నుంచే వెళ్లిపోయాడని, బాబు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయింది. అధైర్యపడకు.. అండగా ఉంటానని ఆమెకు వైఎస్ జగన్ భరోసా కల్పించారు. హైవే బ్రిడ్జి నిర్మాణ లోపం వల్లే ఈ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు తెలుపడంతో.. నేషనల్ హైవేస్ అథారిటీకి లేఖ రాయాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్‌కు ఘన నివాళులు.. దాచేపల్లి ఎస్సీ కాలనీ నుంచి గురజాలకు బయలుదేరిన ౖÐð ఎస్ జగన్‌కు రహదారికి ఇరువైపులా జనం నీరాజనం పట్టారు. జగన్ నడికుడిలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కొత్త అంబాపురం చేరుకున్నారు. ఆ గ్రామ ప్రజలు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడా వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గురజాల బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న జననేతకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన జగన్ ఘనంగా నివాళులర్పించారు. తర్వాత గురజాల నుంచి జంగమహేశ్వరపురం, చర్లగుడిపాడు, లక్ష్మీపురం మీదుగా మిరియాల గ్రామానికి చేరుకుని వరద ఉధృతికి తెగిపడిన చెరువు కట్టను పరిశీలించారు. అంతకుముందు చర్లగుడిపాడు, మిరియాల అడ్డరోడ్డు వద్ద జననేతకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో వైఎస్ జగన్ వెంట.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, లాల్పురం రాము, కిలారి రోశయ్య, రావి వెంకటరమణ, కావటి మనోహర్నాయడు, ఆతుకూరి అంజనేయులు, శ్రీకృష్ణదేవరాయ, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెని క్రిస్టినా, పి.వెంకటరామిరెడ్డి, దేవడ్ల రేవతి, కోలకలూరి కోటేశ్వరరావు, వనమా బాల వజ్రబాబు (డైమండ్) తదితరులు పాల్గొన్నారు. -
యురిలో సైన్యం విఫలమైంది: దిగ్విజయ్
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)కి సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపును రక్షించుకోవడంలో సైన్యం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. యూరిలో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 20 మంది జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఆయన సోమవారం ట్విట్టర్లో స్పందించారు. గతంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ సందర్భంగా ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడుదల చేసి.. ఎన్డీఏ ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడిందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. యూరి ఉగ్రదాడి మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రభుత్వ సహకారంతో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు అని, అయితే తమ క్యాంప్‌ను రక్షించుకోవడంలో సైన్యం విఫలమైందనే విషయాన్ని కూడా చూడాలని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. యురి అమరులకు నివాళులు అర్పించిన ఆయన.. అంతర్జాతీయంగా పాక్‌ను ఒంటరిని చేసేలా భారత ప్రభుత్వం కృషి చేయాలన్నారు. Masood Azhar's Jaish e Mohammad behind the attack. Of course with full connivance of Pakistan Establishment.— digvijaya singh (@digvijaya_28) September 19, 2016Should also look at the failure of the Army to protect its Army Camp near the LOC.— digvijaya singh (@digvijaya_28) September 19, 2016 -
పంటను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
– రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని – ముందే మేల్కొని ఉంటే బాగుండేదన్న వ్యవసాయాధికారులు మదనపల్లె రూరల్: వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. శుక్రవారం సీటీఎం పంచాయతీ మిట్టపల్లెలో రెయిన్ గన్స్ ద్వారా వేరుశెనగ పంటకు అందిస్తున్న నీటి తడులను ఇచ్చే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. పంట పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలైలో వేసిన పంటకు ప్రస్తుతం ఎలాంటి డోకా లేదని, జూన్ నెల మొదటి వారంలో వేసిన పంటతోనే ఇబ్బందని అధికారులు మంత్రికి వివరించారు. సుమారు 50శాతం వరకు పంట నష్టం రావచ్చని తెలియజేశారు. పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు. పదిహేనురోజుల క్రితం తడులు అందించి ఉంటే నష్టం పెద్దగా ఉండేది కాదంటూ వివరించారు. అనంతరం తిరుపతి వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం పంట పరిస్థితిపై విచారించారు. ప్రస్తుతం అందిస్తున్న తడులతో మొక్క, పైనున్న భూమి తడుస్తోందే తప్ప నీరు భూమిలోకి ఇంకి లోపలకు వెళ్లడం లేదని వివరించారు. ఎకరాకు 20 వేల లీటర్ల నీరు కాకుండా 30 వేల లీటర్లు అందిస్తే ప్రయోజనముంటుందన్నారు. మంత్రి కిమిడి మణాళిని మాట్లాడుతూ వేరుశనగ పంటను కాపాడేందుకు ముఖ్యమంత్రి వారంరోజులుగా రాయలసీమలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారుల సమన్వయంతో విపత్తును ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశాలను అనుభవంగా చేసుకుని రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కృతికాభాత్రా, ఎమ్మెల్సీ నరేష్కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటిరమేష్, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత
మోత్కూరు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని మోత్కూరు మండల ఎంపీపీ ఓర్సులక్ష్మీ పురుషోత్తం తెలిపారు. బుధవారం మండలంలోని దాచారం గ్రామంలో జీవవైవిధ్యంపై అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు గ్రామంలోని ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు. జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరారు. సింగిల్ విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడకపోతే మానవ మనుగడ అసాధ్యమన్నారు. జీవవైవిధ్య జిల్లా కోర్డినేటర్ ఎట్టం శ్రీనివాస్ మాట్లాడుతూ ఔషధ మొక్కల ఉపయోగాన్ని గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, సర్పంచ్ కడమంచి వస్తాద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ యాదగిరి, అవిలయ్య, ఉప సర్పంచ్ కప్పల లింగయ్య, వార్డు సభ్యులు, జీవవైవిధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కాలువను పూడ్చి వేసేందుకు చర్యలు
చిలుకూరు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉదృతికి తెగిన కాలువకు వెంటనే మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, పీఆర్‌జేఈ భాస్కర్‌రావులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని అక్షర కళాశాలకు సమీపాన హుజూర్నగర్ రోడ్డు వెంట తెగిన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ తెగడం వల్ల నారాయణపురం గ్రామస్తులకు, కళాశాల విద్యార్థులకు రాకపోకలు బంద్ అయినాయని తక్షణమే మరమ్మతులు చేయించి కాలువను పూడ్చి వేస్తామని వారన్నారు. -
చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి
మునగాల: మండల కేంద్రంలో 229 సర్వే నంబర్లో గల ఊరచెరువును మునగాల, నారాయణగూడెం గ్రామాలకు చెందిన కొందరు గ్రామస్తులు ఆక్రమణలకు పాల్పడి బోర్లు, బావులు ఏర్పాటు చేసుకొని సాగుచేస్తున్నారని గ్రామాలకు చెందిన పలువురు బుధవారం స్థానిక ఇన్చార్జి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే దాదాపు 150ఎకరాల వరకు ఆక్రమణ జరిగిందని గతంలో ప్రభుత్వం చెరువు భూమికి హద్దులు ఏర్పాటు చేసిందని వారు వివరించారు. దీంతో చెరువులో నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో ఆయకట్లు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆక్రమణల దారులనుంచి చెరువు భూమిన కాపాడాలని వారు కోరారు. వినతిపత్రం అందచేసిన వారిలో ఎల్పి.రామయ్య, బండారు నర్సయ్య, పిడమర్తి వెంకన్న, ఎల్.మట్టయ్య ఎల్.వెంకన్న, ఎల్.రాములు, ఎల్.ఈదయ్య, నెమ్మాది దుర్గయ్య, నెమ్మాది ముత్తయ్య, ఎల్.నాగేశ్వరరావులు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
చిలుకూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పర్యావరణ ఉద్యకారుడు కొల్లు లక్ష్మీనారాయణరావు అన్నారు. ఆదివారం చిలుకూరులో మహిళలు, చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కైలాసం వెంకటేశ్వర్లు, సురగాని లింగయ్య, వైష్ణవి డీఎడ్ కళాశాల కరస్పాండెంట్ బూర లక్ష్మీనారాయణ, వసంత, మాలతీ, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
డిండి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. గురువారం మండలంలోని తవక్లాపూర్ గ్రామంలో ఆయన మెుక్కలు నాటి మాట్లాడారు. మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలనే సదుద్ధేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు రాజనేని వెంకటేశ్వరరావు, బల్ముల తిరుపతయ్య, జయానందం, బయ్య వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
నందిగామ(కొత్తూరు): మొక్కల సంరక్షించి అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని మండల పరిధిలోని నందిగామ సర్పంచ్ కొమ్ముకష్ణ కోరారు. గురువారం పంచాయతీ పరిధిలోని పెద్దగుట్టతాండ, బండకుంటతాండలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం తాండలో పలుచోట్ల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండవాసులు, మహిళసంఘం సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
–సీమాంధ్రుల కుట్రలతోనే నీటి ఇబ్బందులు –శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కొత్తూరు: విద్య ద్వారనే దేశం, రాష్ట్రాలు అన్ని రంగాల్లో మరింత అభివద్ధి సాధిస్తాయని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పాఠశాల సిబ్బంది పూలమాలలు, శాలువాతో సన్మానించారు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగ అభివద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈస్ట్ ఇండియా వారు ఆంధ్రప్రాంతాన్ని ఆక్రమించుకుని తమ కార్యకలాపాలు నిర్వహించే సమయంలో ఆ పాఠశాలల్లో వారితో పాటు ఆంధ్రుల పిల్లలు సైతం చక్కగా చదువుకున్నట్లు వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఉండడం వల్ల ఇక్కడ సరైన పాఠశాలలు లేక ప్రజలు చదువుకోలేదన్నారు. కుట్రలతోనే నీటి ఎద్దడి.... ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, పాలకులు తమ కుట్రల ద్వార తెలంగాణ ప్రాంతంలోని నిధులతో ఆంధ్రా ప్రాంతంలో అభివద్ధి చేసుకున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్రం గుండా వందల కిలోమీటర్ల మేర నదులు ప్రవహిస్తున్నప్పటిMీ ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించ లేదన్నారు.అనంతరం హరితహారంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదమ్మ, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ జగన్, ఆర్వీఎం పీఓ గోవిందరాజులు, ఎంపీటీసీ అనురాధ, స్పెషలాఫీసర్ ప్రియాంక, విద్యార్థులు, అయా శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు. -
చేనేతకు కావాలి చేయూత
– ప్రభుత్వాలకు పట్టని ఘనత – నేడు జాతీయ చేనేత దినోత్సవం జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల కిందట వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించిన చేనేత రంగం ఉనికిని కోల్పోతోంది. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం లేక చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా నేతన్నలకు ఉపాధి లేకుండాపోయింది. అక్కడక్కడ అదే వృత్తిని కొనసాగిస్తున్న వారికి ఆదాయం లేదు. దీంతో కుటుంబాలు గడవడం కష్టంగామారింది. చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, చేనేత రంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోకపోవడంపై నేత కార్మికులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. – గద్వాల నాటి వైభవం తిరిగొచ్చేనా.... జిల్లాలోని గద్వాల, నారాయణపేట, కొత్తకోట, రాజోళి, అమరచింత, కోటకొండ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. నాలుగు దశాబ్దాల కిందట వేలాది మగ్గాలు ఉండేవి. దాదాపు 15వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవారు. అనేక గ్రామాలలో చాలామంది ఇళ్లల్లో కూడా వందలాది మగ్గాలు ఉండేవి. మహిళలు ఇళ్లలో కండెలు చుట్టడం, రంగులు అద్దడం వంటి పనులు చేసేవారు. చేతినిండా పని ఉండటంతో కార్మికుల అవసరాలు తీరేవి. అప్పట్లో చేనేత కార్మికులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహించేది. నేటి పాలకులు చెప్పడమే కానీ చేసిందేమీ లేదు. మరమగ్గాలు, అధునాతన వస్త్ర ఉత్పత్తి యంత్రాలు వచ్చాక ప్రజలు ఆధునిక నమూనా (డిజైన్లు) ఆకర్షితులు కావడంతో చేనేత వస్త్రాలకు ఆదరణ తగ్గింది. ఆధునిక వస్త్రాలతో పోలిస్తే చేనేత వస్త్రాల ఉత్పత్తి వ్యయం కాస్త ఎక్కువగా ఉండి పని కల్పించలేని పరిస్థితి ఉత్పన్నమైంది. చేసిన పనికి గిట్టుబాటు కావడంలేదు. ఇదీ జిల్లాలో చేనేత పరిస్థితి ప్రస్తుతం నేత కార్మికులు – 22వేల నుంచి 25వేలు చేనేత సొసైటీలు – 107 మాస్టర్ వీవర్స్ – 60 నుంచి 80మంది వలస వెళ్లిన కార్మికులు – సుమారు 2వేలు అనారోగ్యంతో మృతి చెందిన కార్మికులు – సుమారు 500 ఇతర పనులకు వలస వెళ్లిన వారు – సుమారు 1500 ప్రతిబంధకాలకు ప్రత్యామ్నాయాలివే – రూ.లక్షల పెట్టుబడి పెట్టి నూలు, ఇతర ముడి సరుకుల కొనుగోలు చేసే స్థోమత సంఘాలకు లేదు. ఉత్పత్తి లేనందున కార్మికులకు పని లభించడం లేదు. సంఘాలకు ప్రభుత్వం మూలధనం సమకూర్చాలి. ముడి సరుకుల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలి. పలు సంఘాల భవనాలు శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనాలు నిర్మించాలి. – ఆధునిక వస్త్రాల తయారీ, మార్కెటింగ్‌లో సంఘాలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. వాటిని అధిగమించడానికి ప్రభుత్వం సహకరించాలి. – చేనేత కార్మికులకు తగిన ఆదాయం రాక పనులు మానుకుంటున్నారు. ఉపాధిహామీ పథకాన్ని చేనేత రంగానికి అనుసంధానించి కార్మికులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయాలి. బీడీ కార్మికుల మాదిరి జీవన భృతి ఇవ్వాలి. పింఛన్లు, ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలి. – చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు కార్మికుల రుణాలు మాఫీ కాలేదు. వెంటనే మాఫీ చేయాలి. ప్రస్తుతం నిలిపివేసిన సిల్కు సబ్సిడీని పెంచుతూ కొనసాగించాలి. – నిరుద్యోగ యువత చేనేత వృత్తి వైపు ఆసక్తి కనబర్చడం లేదు. వారికి ఆధునిక డిజైన్లలో వస్త్రాల తయారీకి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలి. సొంత మగ్గాల స్థాపనకు రాయితీపై రుణ సదుపాయం కల్పించాలి. ముడి సరుకులపై రాయితీ ఇవ్వాలి – రామలింVó శ్వర కాంళ్లే, చేనేత క్లస్టర్ చైర్మన్, గద్వాల నూలు, ఇతర ముడి సరుకులపై రాయితీ ఇవ్వాలి. పెట్టుబడి లేక ఉత్పత్తి పెంచలేని పరిస్థితి ఉంది. కార్మికులకు ఇస్తున్న డబ్బులు గిట్టుబాటు కావడంలేదు. సిల్కు సబ్సిడీని కొనసాగిస్తూ 20శాతానికి పెంచాలి. ప్రభుత్వం సంఘాలను ప్రోత్సహించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. చేనేత రుణాలను మాఫీ చేయాలి. ఉపాధి హామీతో అనుసంధానించాలి – దామ వీరన్న, ఆప్కో డైరెక్టర్ జిల్లాలో చేనేత సహకార సంఘాలు నడవలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేనేత రంగాన్ని ఉపాధిహామీతో అనుసంధానిస్తే కార్మికులకు, సంఘాలకు మేలు జరుగుతుంది. సిల్కు సబ్సిడీని రూ.600 నుంచి రూ.1000కి పెంచాలి. ప్రతి కార్మికునికి అంత్యోదయ కార్డులివ్వాలి. చేనేత సహకార సంఘాల నుంచి టెస్కో సంస్థ ప్రతినెలా కొనుగోలు చేసి బిల్లులు చెల్లించాలి. -
రాజ్యాంగస్పూర్తిని కాపాడాలి
కోదాడ: దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమన్యాయం అందేలా జాగ్రత్తలు తీసుకొని రాజ్యంగస్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆద్వర్యంలో ‘రాజ్యాంగం– బీఆర్ అంబేద్కర్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్చగా జీవించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చి దిద్దిన అంబేద్కర్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు కూడా రాజ్యాంగ నైతికతను అర్థం చేసుకొని తదనుగుణంగా జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అర్వపల్లి శంకర్, రాజనీతిశాస్తం విభాగాధిపతి యం. సామ్యూల్ ప్రవీణ్, అధ్యాపకులు కోయి కోటేశ్వరరావు, రేఖ వెంకటేశ్వర్లు, స్వామి , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ
మునగాల : హారితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మెుక్కలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిదని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన స్థానక తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంఓ జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు, ఎంపీపీ ప్రమీల, తహసీల్దార్ కె.ఆంజనేయులు, ఆర్ఐ స్వప్న, ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ అమరబోయిన మట్టయ్య పాల్గొన్నారు. -
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
గుండ్రాంపల్లి (చిట్యాల) : హరితహారం కార్యక్రమంలో హైవే పక్కన నాటిన ప్రతి మొక్కను సంరంక్షించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. మంగళవారం ఆయన నల్లగొండలో జరిగే సమావేశానికి వెళ్తూ మండలంలోని గుండ్రాంపల్లి శివారులో హైవే వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ నాటిన వేప మొక్క దగ్గరగా వెళ్లి పరిశీలించారు. సీఎం నాటిన మొక్కకు రక్షణగా ట్రీ గార్డు ఏర్పాటు చేకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. వెంటనే ట్రీ గార్డును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మొక్కలకు రోజుకు ఎన్నిసార్లు నీరు పోస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎండిన మొక్కలను పరిశీలించి వెంటనే వాటిని తొలగించి కొత్తవాటిని నాటాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గుండ్రాంపల్లి సింగిల్ విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్‌ను ‘హరితహారంలో పాల్గొంటున్నారా..?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఆయన ‘అందరూ పాల్గొంటున్నారు’ అని బుదులివ్వడంతో మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట పలువురు ఆటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
ఆలయాల పరిరక్షణకు ప్రాణాలైనా ఇస్తాం
-శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ (మధురానగర్): అభివృద్ధి పేరిట ఆలయాల్లో ఒక్క ఇటుకరాయిని తొలగించినా సహించబోమని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు. వాటి పరిరక్షణకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల రక్షణ కోసం అవసరమైతే రాష్ట్రంలోని పీఠాధిపతులతో కలసి నిరాహారదీక్ష చేస్తామని పేర్కొన్నారు. పుష్కరాల పేరుతో ఆలయాలను తొలగించడం విచారకరమన్నారు. ఇక్కడ ఆలయాలను పడగొడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాల్లో 108 నాగప్రతిమలు, రెండు శివలింగాలను తొలగించి ఘాట్‌ను ఏర్పాటు చేయడం వల్లే అపశ్రుతి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక్కడా ఆలయాలు తొలగించి పనులు చేస్తున్నారన్నారు. దీనివల్ల అపశ్రుతులు జరగకుండా శుక్రవారం ఆలయాల్లో అఖండ నామసంకీర్తన, మూడోతేదీన హోమాలు, నాలుగున 352 పీఠాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధుసంత్‌ల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ టీడీపీ నాయకులు గూండాలు, రౌడీల మాదిరిగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సమావేశంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.విద్యాధరరావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజు పాల్గొన్నారు. -
వయసు నిబంధన.. ప్రమాదాన్ని తగ్గిస్తుంది!
హూస్టన్‌ః అనేక దేశాల్లో వివాహాలకు చట్టపరమైన వయసు నిబంధనలు ఉన్నసంగతి తెలిసిందే. కానీ అలవాట్లకు సైతం నిబంధనలు విధిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు తాజా పరిశోధకులు. చిన్ననాటినుంచే చెడు అలవాట్లకు బానిసలౌతుండటంతో, అతి తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. మద్యపానానికి చట్టపరంగా 21 ఏళ్ళ వయసును నిర్థారిస్తే.. చిన్నవయసునుంచే మద్యం తాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మరణాల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మద్యం తాగేందుకు కనీస వయసు (మినిమమ్ లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎంఎల్డీయే) 21 ఏళ్ళు ఉండేట్టుగా చట్టాన్ని తెస్తే మరణాల శాతం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మద్యం తాగే వయసు కనీసం 21 ఏళ్ళు ఉండేట్లుగా చూస్తే.. యవ్వనంలో ఆరోగ్య పరంగా అనేక లాభాలు చేకూరుతాయని అధ్యయనకారులు చెప్తున్నారు. 21 ఏళ్ళ వయసుకన్నా ముందే మద్యానికి అలవాటు పడినవారు... మద్యానికి సంబంధించిన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటమే కాక, మరణించే ప్రమాదం కూడ ఉన్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 1990 నుంచి 2010 మధ్య జనాభా మరియు, వారి మరణాలకు కారణాల డేటాను అమెరికా రీసెర్స్ సొసైటీనుంచి సేకరించిన శాస్త్రవేత్తలు.. 21 ఏళ్ళ వయసులోపు మద్యపానం అలవాటు అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలుసుకున్నారు. మద్యపానం అలవాటుతో కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడినవారు, మద్యపానం వల్ల క్యాన్సర్ తో చనిపోయినవారి రికార్డులను సైతం అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా మద్యపానం సేవించే కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలనే చట్టపరమైన నిబంధన విధిస్తే... అనేక ఆల్కహాలిక్ వ్యాధులవల్ల ఏర్పడే మరణాల సంఖ్య తగ్గించి, జీవించే సమయాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళనివారికి ఈ నిబంధన వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. అలాగే విద్యాలయ ప్రాంగణాల్లో 21 ఏళ్ళ వయసు లోపు ఉన్నవారిపై మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఎంఎల్డీయే వల్ల కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుందని భావిస్తున్న అధ్యయనకారులు తమ క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ పరిశోధనలను ఆల్కహాలిజం జర్నల్ లో నివేదించారు. -
దుప్పిపై కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో పునాదుల్లో పడిపోయిన ఓ దుప్పిని స్థానికులు రక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు భవనాల నిర్మాణానికి తీసిన పునాదుల గుంటల్లో ఆదివారం రాత్రి ఓ దుప్పి పడిపోయింది. దీనిపై కుక్కుల దాడి చేసి గాయపరిచాయి. అయితే, కుక్కల అరుపులతో ఇందిరమ్మ కాలనీకి చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకుని దుప్పిని కాపాడి సోమవారం ఉదయం అటవీ అధికారులకు అప్పగించారు. -
జనావాసాల్లో జింక
నల్లగొండ: నూతన భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి జింకకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని తిరుమల థియేటర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. సమీపంలోని లతీఫ్ షావలి గుట్టపై సంచరిస్తున్న జింకను కుక్కలు తరమడంతో.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడింది. ఇది గుర్తించిన స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంటలో పడిన జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
సినీ పరిశ్రమను రక్షించండి: కోదండరాం
హైదరాబాద్: రెండు, మూడు కుటుంబాల కబంద హస్తాల్లో ఉన్న సినీ పరిశ్రమను రక్షించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ సంఘం ప్రతినిధులు గురువారం సచివాలయంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, అది బలవంతులు, ధనవంతులకే అనుకూలంగా ఉందని, ఈ స్లాబ్ విధానాన్ని తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టికెట్ల ఆధారంగానే పన్నులు వసూలు చేయాలన్నారు. చిత్ర పరిశ్రమలో కార్పొరేట్ గుత్తాధిపత్యం పోవాలన్నారు. ఒక ప్రత్యేక కమిటీని వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిత్రాలకు, తెలంగాణ కళాకారులతో నిర్మించిన చిత్రాలకు పన్ను రాయితీ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమకు అనుకూల ప్రకటన చేయాలని కోదండరాం కోరారు.