కోదాడ: దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమన్యాయం అందేలా జాగ్రత్తలు తీసుకొని రాజ్యంగస్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆద్వర్యంలో ‘రాజ్యాంగం– బీఆర్ అంబేద్కర్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్చగా జీవించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చి దిద్దిన అంబేద్కర్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు కూడా రాజ్యాంగ నైతికతను అర్థం చేసుకొని తదనుగుణంగా జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అర్వపల్లి శంకర్, రాజనీతిశాస్తం విభాగాధిపతి యం. సామ్యూల్ ప్రవీణ్, అధ్యాపకులు కోయి కోటేశ్వరరావు, రేఖ వెంకటేశ్వర్లు, స్వామి , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగస్పూర్తిని కాపాడాలి
Published Sat, Aug 6 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
Advertisement
Advertisement