We
-
ఆస్ట్రేలియా సంస్థతో ‘వుయ్ హబ్’ జట్టు
హైదరాబాద్: మహిళల స్టార్టప్ ఇన్క్యుబేటర్ ’వుయ్ హబ్’ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సైబర్ వెస్ట్ సైన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇరు దేశాల్లోని అంకుర సంస్థలకు సీమాంతర అవకాశాలను కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని వుయ్ హబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు. ఈ ఎంవోయూతో మార్కెట్ విశ్లేషణ, పరిశ్రమ నెట్‌వర్క్‌లు, వనరుల వివరాలు మొదలైనవి అంకుర సంస్థలకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. వ్యాపార విస్తరణ అవకాశాల గురించి అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం వుయ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
భీమవరం టౌ¯ŒS : విచిత్ర జాతిని విద్యావ్యవస్థ సృష్టిస్తుంటే విద్యార్థి సంఘాలు చూçస్తూ ఊరుకోవంటూ హా¯Œ్స ఇండియా చీఫ్ ఎ డిటర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 21వ మహాసభల్లో భాగంగా శుక్రవారం ముఖ్య అతిథిగా నాగేశ్వర్ మాట్లాడారు. విద్యాసంస్థలు సమాజం గురించి ఆలోచించే మెదళ్లను తయారు చేయలేనప్పుడు విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యారంగంలో వెనుకబడ్డాయన్నారు. బలమైన ప్రజా ఉద్యమా లు, సామాజికాభివృద్ధి ద్వారానే విద్యారంగం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రతి చర్యనూ సమర్థిస్తామని, ఇందుకు విరుద్ధమైన ప్రతి చర్యనూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పాలకులు విద్యాహక్కు చట్టాన్ని కూ డా నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు విద్యావ్యాప్తికి దోహదపడదన్నారు. దాడులను ప్రశ్నించకూడదా..! సింగపూర్, చైనా, జపాన్, అమెరికాలను చూసి నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాగేశ్వర్ అన్నారు. యూనివర్సిటీలు ఎలా ఉన్నాయనడానికి వేముల రోహిత్, కన్హయ్య సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. దాడులను విద్యార్థులు ప్రశ్నించకూడదనే భావనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనం బారులు తీరి ఉంటుండగా ఈ విషయంపై ఉస్మానియా వర్సిటీలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విద్యావిధానంలో, విద్యా సమాజంలో మార్పునకు విద్యార్థి సంఘాలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేధావులను తయారు చేసే కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆకాంక్షించారు. పేదలకు ఉన్నత విద్య దూరం ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు మ తోన్మాదులకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్, జాతీయ మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఉపాధ్యక్షుడు పి.రవికుమార్, మంతెన సీతారాం, కె.హరికిశోర్, బి.సాంబశివ, పి.తులసి, ఎల్.చిన్నారి, కె.మహేష్, రాజు, పి.కిరణ్, ఎంవీ రమ ణ, ఎ.అశోక్, కె.ఆంజనేయులు, కె.క్రాం తి తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలి
కోదాడ: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బతుకమ్మ ఉత్సవాలను జాగృతి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వాటిని విజయవంతం చెయాలని కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కె. శశీధర్‌రెడ్డి కోరారు. గురువారం కోదాడలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాగృతి నియోజకవర్గ కన్వీనర్ రణబోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 9 రోజుల పాటు నియోజకవర్గంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు 30వ తేదీన అనంతగిరిలో, 1వ తేదీన మాధవరంలో, 2న నడిగూడెంలో, 3న మునగాలలో, 4న నేలమర్రిలో, 5న మోతెలో,6న చిలుకూరులో, 7న నారాయణగూడెంలో, 8న కేఎల్ఆర్ ఎవెన్యూలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, శ్రీనివాసగౌడ్, యల్క కవిత, రాంబాబు, భరత్, ఉపేందర్, అమరనాథ్, రామకృష్ణ, సైదులు, పిచ్చయ్య, రఘు, గోపినాథ్, కోదండం తదితరులు పాల్గొన్నారు. -
మీకు న్యాయం చేస్తాం..
నయీం బాధితులకు ఎస్పీ హామీ భువనగిరి : నయీం, అతడి అనుచరుల బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో టీచర్స్ కాలనీ పక్కన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి నగర్ ప్లాట్ల ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 150 మందితో ఎస్పీ రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా నయీం అనుచరుడు షేక్ షకీల్ మరికొంత మంది తమను కత్తులు, తుపాకులు చూపించి బెదిరించి ప్లాట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, తమ డాక్యుమెంట్లు లాక్కున్నారని వివరించారు. తమ భూములను కబ్జా చేసుకున్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ స్థలం అంతా బాయ్‌సాబ్‌దని చెప్పి బెదిరించారని వివరించారు. తమకు న్యాయం చేయాలని బాధితుల సంఘం కార్యదర్శి పులికంటి నరేష్ ఎస్పీని వేడుకున్నాడు. కాగా, బాధితులు తెలిపిన విషయాలను సమగ్రంగా విన్న ఎస్పీ ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం అందరికీ తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య ఉన్నారు. -
నీటిని పొదుపు చేయాలి
కోదాడఅర్బన్: నీటిని పొదుపు చేసి , పరిమితంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్, సీసీరెడ్డి పాఠశాలల గుంటూరు ప్రావిన్స్ ప్రొవెన్షియల్ సిస్టర్ సుందరిలు కోరారు. మంగళవారం సీసీరెడ్డి పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నీటి పొదుపు ఆవశ్యకతపై నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతి«థులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను వారు తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ లతీషా, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆన్జ్యోతి, ఉపాధ్యాయులు ఎబినేజర్బాబు, సుజాత, షమ్మీబేగం, క్లెమెన్స్, నెమ్మాది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగస్పూర్తిని కాపాడాలి
కోదాడ: దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమన్యాయం అందేలా జాగ్రత్తలు తీసుకొని రాజ్యంగస్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆద్వర్యంలో ‘రాజ్యాంగం– బీఆర్ అంబేద్కర్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్చగా జీవించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చి దిద్దిన అంబేద్కర్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు కూడా రాజ్యాంగ నైతికతను అర్థం చేసుకొని తదనుగుణంగా జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అర్వపల్లి శంకర్, రాజనీతిశాస్తం విభాగాధిపతి యం. సామ్యూల్ ప్రవీణ్, అధ్యాపకులు కోయి కోటేశ్వరరావు, రేఖ వెంకటేశ్వర్లు, స్వామి , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
'పనామా పేపర్స్' పై స్పందించిన జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ పత్రాల వెల్లడిని ఆయన స్వాగతించారు. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సింది కోరారని తెలిపారు. ఇది స్వాగతించాల్సిన, ఆరోగ్యకరమైన పరిణామమని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు ఉదంతంలో విచారణ మొదలైందని గుర్తు చేశారు. హెచ్ఎస్బిసి ఖాతాదారుల సంబంధించి 2011 లో 569 ఖాతాదారులను గుర్తించామని, వీటిలో 390 అక్రమ ఖాతాలుగా తేలాయని వివరించారు. ఇప్పటికే 154 సెట్ల ఫిర్యాదులను నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమ ఖతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులను పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను రూపిందించనట్టు ఆర్థకి మంత్రి తెలిపారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు. కాగా నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి 11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు పూనుకున్న పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు గుట్టు ఈ పత్రాల్లో రట్టైన సంగతి తెలిసిందే. -
రికార్డు సృష్టించాం: చంద్రబాబు