
హైదరాబాద్: మహిళల స్టార్టప్ ఇన్‌క్యుబేటర్ ’వుయ్ హబ్’ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సైబర్ వెస్ట్ సైన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇరు దేశాల్లోని అంకుర సంస్థలకు సీమాంతర అవకాశాలను కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని వుయ్ హబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు.
ఈ ఎంవోయూతో మార్కెట్ విశ్లేషణ, పరిశ్రమ నెట్‌వర్క్‌లు, వనరుల వివరాలు మొదలైనవి అంకుర సంస్థలకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. వ్యాపార విస్తరణ అవకాశాల గురించి అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం వుయ్ హబ్‌ను ఏర్పాటు చేసింది.