MoU
-
హనీవెల్, ఏఎం గ్రీన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?
ఇథనాల్ నుంచి స్థిరమైన విమానయాన ఇంధనం (SAF), వివిధ కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గార వనరుల నుంచి గ్రీన్ మిథనాల్ & గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో సాంకేతిక - ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి హనీవెల్.. ఏఎం గ్రీన్ 'ఇండియా ఎనర్జీ వీక్ 2025' సందర్భంగా ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.భారతదేశంలో ఇంధన భద్రతను పెంచడానికి మాత్రమే కాకుండా.. అవకాశాలను గుర్తించడానికి ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఇందులో భాగంగానే ముడిచమురు దిగుమతులను తగ్గించడం, తక్కువ ఉద్గారాలను ఉత్పత్తిచేసే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం, షిప్పింగ్ కంపెనీలకు సహాయం చేయడానికి, గ్రీన్ మిథనాల్ ఎగుమతులు వంటివి ఉన్నాయి.విమానయాన, షిప్పింగ్ రంగాలను డీకార్బనైజ్ చేయడానికి సమర్థవంతమైన మార్గాలను అన్వేషించే ఏఎం గ్రీన్ సహకారం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా.. ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి సహాయపడుతుందని హనీవెల్ ఇండియా అధ్యక్షుడు ఆశిష్ మోదీ అన్నారు. -
ఆర్సెడో సిస్టమ్స్‌తో సైయంట్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్ అందించే ఆర్సెడో సిస్టమ్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సైయంట్ డీఎల్ఎం వెల్లడించింది. దీని ప్రకారం, సైయంట్ డీఎల్ఎంకి చెందిన మైసూర్ యూనిట్లో ఆర్సెడో 500 కేడబ్ల్యూపీ సామర్ద్యం గల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.ప్లాంటు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇందులో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను సైయంట్ డీఎల్ఎం కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సైయంట్ డీఎల్ఎం సీఈవో ఆంథోనీ మోంటల్బానో, ఆర్సెడో సిస్టమ్స్ సీఈవో సందీప్ వంగపల్లి తెలిపారు. -
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో జీహెచ్ఐఏఎల్ ఒప్పందం
తెలంగాణ యువతకు ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ను పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ విమానయాన శిక్షణా కార్యక్రమాలతో పాటు.. సర్టిఫికేషన్లను అందిస్తుంది. ఇది శ్రామిక నైపుణ్యాలను బలోపేతం చేయడానికి.. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు జీహెచ్ ఐఎఎల్ వెల్లడించిందిఈ సందర్భంగా జిహెచ్ ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. "విమానయాన పరిశ్రమకు నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా యువత ఉద్యోగావకాశాలు పొందుతారు. విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలకు దారితీసే ప్రతిభా అంతరాలను పరిష్కరిస్తుందన్నారు. ప్రొఫెషనల్ క్యూరేటెడ్ కోర్సుల ద్వారా విమానయాన రంగంలో ఉన్నత శ్రేణి నైపుణ్యాలను అందించేందుకు జీఎంఆర్, వైఐఎస్యూల సంయుక్త కృషి రాష్ట్ర విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.అకడమిక్ క్రెడిట్లతో కూడిన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు నిలువు మార్గాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో తక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ ఎస్ సుబ్బారావు అన్నారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రం.. దేశం కోసం విమానయాన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేయడానికి జిహెచ్‌ఐఎఎల్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. -
జత కలిసిన బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్: లక్ష్యం ఇదే..
బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ కంపెనీలు తాజాగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి ఎంఓయూపై సంతకం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024 సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది.బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ సంస్థలు భారతదేశంలో తక్కువ కార్బన్ రసాయనాల ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏఎమ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ అమ్మోనియాను సంవత్సరానికి 1,00,000 టన్నులు సేకరించనున్నారు.ఈ అమ్మోనియా రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టివ్‌లో నిర్వచించినట్లుగా నాన్ బయోలాజికల్ ఆరిజన్ పునరుత్పాదక ఇంధనాల కోసం ఈయూ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఏఎమ్ గ్రీన్‌కు సంబంధించిన కొన్ని సౌకర్యాలు ఇప్పటికే దీనికి సంబంధించిన ద్రువీకరణను పొందాయి. మరికొన్ని సౌకర్యాల కోసం ప్రీ-సర్టిఫికేషన్ కూడా జరుగుతోంది.మా సంస్థలు స్థిరమైన పరివర్తనకు కట్టుబడి ఉంటాయి. మా భాగస్వామి ఏఎం గ్రీన్‌తో కలిసి తక్కువ కార్బన్ రసాయన ఉత్పత్తిని అన్వేషించడానికి భారతదేశం సరైన ప్రదేశమని మేము విశ్వసిస్తున్నామని బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్ అన్నారు.ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ.. పరిశ్రమలో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రోత్సహించడానికి బీఎస్ఏఎఫ్ వంటి గ్లోబల్ కెమికల్ లీడర్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఇది అనుబంధ వినియోగదారు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. -
స్కిల్స్ యూనివర్సిటీకి ‘మేఘా’ రూ.200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎస్) సంస్థ ముందుకు వచ్చింది. యూనివర్సిటీ భవన సముదాయం నిర్మాణం కోసం సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ స్థాయి లో అధునాతన వసతులు ఉండేలా మేఘా సంస్థ యూనివర్సిటీ భవనాలను నిర్మి స్తుంది. ఈ మేర కు శనివారం సీఎం రేవంత్ రెడ్డితో ‘మేఘా’ఎండీ కృష్ణారెడ్డితో పాటు సంస్థ ప్రతినిధుల బృందం సచివాలయంలో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ భవనాలు నిర్మిస్తామని కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌లతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూ నాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు.వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి వర్సిటీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా సంస్థ శనివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ ఇటీవల భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. -
ఆ ఆస్తులన్నీ మా అన్న కష్టార్జితమే.. షర్మిల అన్ని తెలిసే సంతకం పెట్టింది.. Evidenceతో సహా నిజాలు బయటపెట్టిన సాక్షి
-
ఇండియా పోస్ట్, అమెజాన్ జత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకునే బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, పోస్టల్ శాఖ(ఇండియా పోస్ట్) జతకట్టాయి. ఇందుకు అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్త లాజిస్టిక్స్ సర్వీసుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాజాగా తెరతీశాయి.సామర్థ్యాల పెంపు, పటిష్టంగా వనరుల వినియోగం, రవాణా నెట్‌వర్క్‌లను పంచుకోవడం తదితరాల కోసం పరస్పరం సహకరించుకోనున్నట్లు సంయుక్త ప్రకటనలో వివరించాయి. 1,65,000 పోస్టాఫీసుల నెట్వర్క్ కలిగిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఈకామర్స్‌ను విస్తరించేందుకు దోహదపడనున్నట్లు పోస్టల్ సెక్రటరీ వందితా కౌల్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ సర్వీసులను ఆధునీకరించడం, నూతన సాంకేతికతలను వినియోగించడం తదితర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అమెజాన్‌తో చేతులు కలిపినట్లు వివరించారు. నిజానికి 2013లోనే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దేశవ్యాప్త డెలివరీలకు అమెజాన్ ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక 2023లో సమీకృత విదేశీ లాజిస్టిక్స్ సొల్యూషన్ల కోసం రెండు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహాసంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఈకామర్స్ ఎగుమతులకు తెరతీశాయి.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం -
ఏఎం గ్రీన్‌తో గెయిల్ ఒప్పందం
దేశంలో స్థిరమైన ఇంధన పరిష్కారాల అభివృద్ధికి గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఏఎం గ్రీన్ బీవీ (AMG) సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమిథనాల్ ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ (CO2) దీర్ఘకాలిక సరఫరా, దేశం అంతటా హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అన్వేషణపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గెయిల్ తెలిపింది.గెయిల్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) రాజీవ్ సింఘాల్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ & ప్రొడక్షన్) సుమిత్ కిషోర్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఒప్పందంలో భాగంగా ఈమిథనాల్ను ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ దీర్ఘకాలిక సరఫరా కోసం అధ్యయనాలను చేపట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత ఇమిథనాల్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి గెయిల్‌కి కూడా ఈక్విటీ ఆప్షన్ ఉంటుంది. అలాగే దేశం అంతటా 2.5 గిగావాట్స్ వరకు సోలార్/విండ్ హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును సంయుక్తంగా అన్వేషించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. -
సహజీవనానికి సాక్ష్యంగా... కోర్టుకు ‘ఎంవోయూ’ సమర్పించాడు!
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబైకి చెందిన వ్యక్తిపై ఓ 30 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. నిందితుడు మాత్రం తాము పరస్పర అంగీకారం మేరకే సహజీవనం చేశామని వాదించాడు. ‘‘ఆ మేరకు మేం ఒప్పందం కూడా చేసుకున్నాం. దాని ప్రకారం ఈ కేసు చెల్లదు’’అంటూ రుజువుగా సదరు అవగాహన ఒప్పందాన్నే (ఎంవోయూ) కోర్టుకు సమర్పించాడు. దాంతో వారు పరస్పర అంగీకారంతోనే కలిసి బతికారని కోర్టు తేల్చింది. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! ముంబైకి చెందిన వీరిద్దరూ 2023 అక్టోబర్ 6న కలిశారు. 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 దాకా 11 నెలల పాటు సహజీవనం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) రాసుకున్నారు. అప్పటికే విడాకులు తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు. కానీ అతనికి మరో మహిళతో సంబంధమున్నట్టు కలిసి బతకడం మొ దలుపెట్టాక ఆమె గుర్తించింది. దాంతో, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. ‘‘నేను గర్భవతినయ్యా. అబార్షన్ మాత్రలు వేసుకోమంటూ బలవంతం చేశాడు. అతనికి అప్పటికే పెళ్లయిందని తర్వాత తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. తనతో సంబంధం కొనసాగించాలంటూ పట్టుబట్టాడు. నేను లొకేషన్లు మారినా వేధిస్తున్నాడు. నా కొడుకును తీసుకెళ్తానని బెదిరించాడు’’అని ఆరోపించింది. అత్యాచార ఆరోపణలు నిరాధారమని నిందితుడు వాదించాడు. తమ అగ్రిమెంట్‌ను రుజువుగా సమర్పించాడు. దానిపై తాను సంతకం చేయలేదని సదరు మహిళ వాదించింది. ఒప్పంద పత్రం ప్రామాణికతను నిర్ధారించే ఆధారాల్లేవన్న జడ్జి శయనా పాటిల్, ‘ఇది పరస్పర అంగీకారంతో మొదలై చివరికి వికటించిన సంబంధంగా కనిస్తోంది’అని అభిప్రాయపడ్డారు. కస్టడీ విచారణ అవసరం లేదని తేల్చారు. వైరలవుతున్న ఒప్పందం వారి ఒప్పంద పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో పలు నిబంధనలున్నాయి. ‘ఏడాది పాటు అతనింట్లో కలిసుండాలి. ఆ సమయంలో పరస్పరం లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు. ఎవరికి నచ్చకపోయినా నెల ముందు నోటీసిచ్చి విడిపోవచ్చు’అని రాసుకున్నారు! -
స్థిరమైన భవిష్యత్ కోసం.. ఎన్ఏసీ, పీఎస్ఐ ఒప్పందం
మహీంద్రా యూనివర్సిటీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC), ప్రీ-ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PSI)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ రంగంలో స్థిరమైన భవిష్యత్తు కోసం జులై 19న యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను మహీంద్రా యూనివర్సిటీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.ఎన్ఏసీ, పీఎస్ఐ మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ మధుసూధన రెడ్డి, వీసీ డాక్టర్ యాజులు మేడూరి మొదలైనవారు పాల్గొన్నారు.భారతదేశంలో కన్స్ట్రక్షన్ & ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ స్థాయిని సాధించడానికి ఈ ఎమ్ఒయు కీలకమైన దశను సూచిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని అభివృద్ధి చేయడానికి మేము కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేడూరి అన్నారు.నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) డైరెక్టర్ జనరల్ పీ మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. మహీంద్రా యూనివర్సిటీ, ప్రీ-ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం నిర్మాణంలో స్థిరమైన భవిష్యత్తును సూచిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా కొత్త ఆవిష్కరణలకు, అభివృద్ధి చెందుతున్న వాటికి అనుగుణంగా ప్రభావవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.We are pleased to announce a significant collaborative effort with the National Academy of Construction (NAC) & the Pre-Engineered Structures Society of India (PSI). The tripartite #MoU signifies a shared commitment to fostering a sustainable future for the construction sector. pic.twitter.com/q9q9p80zhg— Mahindra University (@MahindraUni) July 23, 2024 -
పీఎన్బీ – సెయిల్ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్‌తో ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. పీఎన్బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్బీ జనరల్ మేనేజర్ (బిజినెస్ అక్విజిషన్) బిబు ప్రసాద్ మహపాత్ర, సెయిల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) లావికా జైన్, సెయిల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విక్రమ్ ఉప్పల్ సంతకాలు చేశారు. -
భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం
ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేసియా గవర్నర్ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్ఆర్), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది. -
Defense Deals: రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. -
మారుతీ సుజుకీ డీలర్లకు బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది. డీలర్ నెట్‌వర్క్‌ను పెంపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2008 నుంచి మారుతీ సుజుకీ, యూనియన్ బ్యాంక్ మధ్య బంధం కొనసాగుతోంది. 3,00,000 పైచిలుకు కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ వాహన రుణం సమకూర్చింది. -
భారతీయుల కోసం తైవాన్.. లక్షల్లో ఉద్యోగాలు!
భారత్, తైవాన్ మధ్య బంధం బలపడుతోంది. ఇందులో భాగంగానే తైవాన్ దేశంలో ఇండియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఇరు దేశాలు ఇటీవలే ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు తైవాన్.. భారత్, అమెరికా దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోంది. ముఖ్యంగా ఇండియాతో తైవాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తూ.. ఇరు దేశాలకు ఉపయోగకరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తైవాన్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉండటంతో 2025 నాటికి 20 శాతం వృద్ధ జనాభా ఉంటారని, కార్మికుల కొరత గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే తైవాన్ ప్రస్తుతం వలస కార్మికుల మీద ఆధారపడుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్, ఇండోనేసియా, ఫిలిప్ఫిన్స్, వియత్నాం దేశాలకు చెందిన సుమారు 7 లక్షలమంది తైవాన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనున్నట్లు గతంలోనే వెల్లడించింది. అనుకున్న విధంగానే ఇప్పుడు రెండు దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. అంటే భారతీయులకు రానున్న రోజుల్లో తైవాన్ భారీగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి #Taiwan🇹🇼-#India🇮🇳 relations reach a new high! The MOU on the Facilitation of Employment of Indian Workers, signed by @TWIndia2 Rep. Ger & @ita_taipei Rep. Yadav, promises mutual benefits for our people, igniting a powerful momentum for even deeper & more fruitful cooperation! pic.twitter.com/H9kNZvaI97 — 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) February 16, 2024 -
ఆటోమొబైల్ రంగంలో మరో కీలక పరిణామం
వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, భారత్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా భవిష్యత్తులో తేబోయే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన విడిభాగాలను ఫోక్స్‌వ్యాగన్ సరఫరా చేయనుంది. ఫోక్స్‌వ్యాగన్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్‌ను మహీంద్రా తన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ అయిన ఇంగ్లో కోసం వినియోగించనుంది. ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై అయిదు పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. తొలి మోడల్ 2024 డిసెంబర్లో అడుగు పెట్టనుంది. -
నాణ్యమైన విద్య.. ఒక హక్కు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం. కానీ.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు.. ఇది ఇక కొత్త నినాదం అని అన్నారాయన. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారాయన. ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అని అన్నారాయన. .అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు.మనం వేసిన ప్రతి అడుగు ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం. ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే... అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్ సిటిజెన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు. అందుకనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. అక్కడితో మనం ఆగిపోలేదు. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు.. ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. వాళ్లు మన ఎస్సీఈఆర్టీలో భాగమై.. ఈ ఏడాది టీచర్లకు సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెడతారు. ఈ ఏడాది టీచర్ల సామర్ధ్యం పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు వచ్చే ఏడాది ఒకటో తరగతి, ఆ తర్వాత రెండో తరగతి ఇలా.. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతాం. 6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ... ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చాం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఉన్నతవిద్యలో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజెన్స్‌గా తయారవుతారు. ప్రపంచంతో పోటీపడతారు. ఉన్నతవిద్యారంగం మీద ఈ ఐదుసంవత్సరాల మీద పెట్టిన ధ్యాస ఇంతకముందు ఎవరికీ ఊహకు కూడా అందని విధంగా ధ్యాసపెట్టి అడుగులు వేయించగలిగాం. మొట్టమొదటిసారిగా పిల్లలు కచ్చితంగా చదవాలి, వారి చదువులకు పేదరికం అడ్డురాకూడని అడుగులు వేశాం. దీనికోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ప్రతి ఏటా విద్యాసంవత్సరం జూన్ –జూలైలోనూ, అలాగే విద్యాసంవత్సరం చివర్లో కూడా వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చాం. దాదాపు 30శాతం కోర్సులు స్కిల్ ఓరియెంటెడ్‌గా మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు తీసుకువచ్చాం. తొలిసారిగా మూడేళ్ల కోర్సులో కూడా ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేస్తున్నాం. మూడేళ్ల కోర్సుతో పాటు ఇంకో ఏడాది హానర్స్డిగ్రీ ఇచ్చే విధంగా తీసుకువచ్చాం. తొలిసారిగా 400 పైగా బైలింగువల్ పాడ్‌క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్ గుర్తింపు పొందగా.. ఈ రోజు రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయి. ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి.. అలా పెంచగలిగితే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారని ప్రతి అడుగు వేశాం. అందులో భాగంగానే ఇవాళ వేస్తున్న ఇంకో గొప్ప అడుగు ఎడ్‌క్స్‌తో ఈ రోజు మనం చేస్తున్న ఒప్పందం. దాదాపుగా 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్‌గా పరీక్షలు జరుగుతాయి. మన పిల్లలు ఆ పరీక్షలు పాసవుతారు. క్రెడిట్స్ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మనదగ్గర యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా వాళ్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజిమెంట్, రిస్క్ మేనేజిమెంట్ వంటి వర్టికల్స్ పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా అందుబాటులో కనిపిస్తాయి. మన దగ్గర ఇవేవీ కనిపించవు. ఇటువంటివి నేర్పించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రెండోది ఇటువంటి పరిజ్ఞానం మన దగ్గర లేకపోవడం కూడా మరో కారణం. ఈ రెండింటిని కూడా బ్రిడ్జ్ చేస్తూ.. ఈ కోర్సులు అందుబాటులో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల వాళ్లే... ఏకంగా మన కరిక్యులమ్‌లో భాగమై, ఈ అంశాలను బోధించేలా మన పిల్లలకు అందుబాటులో తీసుకువస్తున్నాం. ఇది పెద్ద మార్పు. దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి తీసుకునే ఈ డిగ్రీలో స్టాక్ ఎక్సెంజ్, రిస్క్ మేనేజిమెంట్, వెల్త్ మేనేజిమెంట్, ఫైథాన్ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయి. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా 12లక్షల మంది విద్యార్ధులకు 2వేలకు పైగా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మన యూనివర్సిటీలలో మన పాఠ్యప్రణాళికలో భాగంగా అవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని మన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటిలో విద్యార్ధి తనకు కావాల్సిన వర్టికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాంప్రదాయంగా మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు ఉండడం వల్ల ఉద్యోగ సాధన మరింత సులభం అవుతుంది. గతంలో అన్ని యూనివర్సిటీల వీసీలకు ఇదే మాట చెప్పాను. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3డి లెర్నింగ్ వంటి వాటిని మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తీసుకునిరావాలి. అలా తేగలిగితేనే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేగలుగుతాం. మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య వారికి అందించగలిగితేనే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్ద, పెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. విద్యను ఏ స్ధాయిలో ప్రోత్సహిస్తున్నామంటే.. టాప్ –50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో టైమ్స్ రేటింగ్స్, క్యూ ఎస్ రేటింగ్స్‌లో ఉన్న 320 కాలేజీలలో సీటు వస్తే.. రూ.1.25 కోట్ల వరకు ప్రభుత్వమే ఫీజులు కట్టి చదవిస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 400 మందికి పైగా వినియోగించుకుని ఇప్పటికే వినియోగించుకున్నారు. అందరికీ ఆ రకంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు, ప్రతి యూనివర్సిటీలలో ఆ యూనివర్సిటీలనే, ఆ సబ్జెక్టులనే తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నమే ఈ ఎడ్‌క్స్‌తో చేసుకుంటున్న ఒప్పందం. దీనివల్ల పెద్ద యూనివర్సిటీలలో సీట్లు రాకపోయినా.. ఆ కోర్సులు మన యూనివర్సిటీలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇది గొప్ప మార్పు. నాణ్యమైన విద్య మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తున్నాం. ప్రతి వైస్ ఛాన్సలర్‌కి చెబుతున్నాను. మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. ఆన్లైన్ కేపబులిటీని పెంచాలి. మన దగ్గర రిజిస్ట్రేషన్లు బాగా జరిగేలా చూడాలి. పద్మావతి యూనివర్సిటీలో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్ధాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు.యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్‌కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇది ప్రారంభం. ఇటువంటి చర్యలు ప్రతి యూనివర్సిటీ తీసుకోవాలి. టెక్నాలజీని మన పిల్లలకు తీసుకునిరావాలి. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్యకు అందించగలుగుతాం. ఆ దిశగా వీసీలు మందడుగు వేయాలి. కార్యక్రమంలో మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ ఎంఓయూ చేసుకుంటున్నాం’ అని సీఎం తన ప్రసంగం ముగించారు. -
సాహిత్య ఒడంబడికలు
59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది. ‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్‌ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు. ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది. అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్‌మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే! ‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు. చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!! మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే! ‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ -
మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ ఎంవోయూ
హైదరాబాద్: మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వ్యాపారాభివృద్ధితోపాటు, ఎలక్ట్రిక్ వెరి్టక్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటాల్) ఎయిర్‌క్రాఫ్ట్ (ఎయిర్ ట్యాక్సీ/ఫ్లయింగ్ ట్యాక్సీ) విభాగంలో అవకాశాల అన్వేషణకు ఇది వీలు కల్పించనుంది. తప్పనిసరి మినహాయింపులు, సరి్టఫికెట్లను సొంతం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ మద్దతు పొందడం, పైలట్, మెకానిక్‌లకు శిక్షణ, కీలక భాగస్వాముల గుర్తింపు విషయంలో మారుత్ డ్రోన్స్‌కు ఈ సహకారం తోడ్పడనుంది. మారుత్ డ్రోన్స్ ఇప్పటికే డ్రోన్ల కోసం అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఎంఎవోయూతో ఎయిర్‌ట్యాక్సీ కార్యకలాపాల్లోకీ విస్తరించనుంది. -
టాటా పవర్, ఐవోసీ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్ అవుట్‌లెట్స్‌లో టాటా పవర్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ చార్జింగ్) వీరేంద్ర గోయల్ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్ ఈజెడ్ చార్జ్, ఇండియన్ఆయిల్ ఈ–చార్జ్ మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
అమెజాన్‌తో వాణిజ్య శాఖ ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా 20 జిల్లాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణ కలి్పంచే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇమేజింగ్, డిజిటల్ క్యాటలాగ్‌లను రూపొందించడం, పన్నుల సంబంధమైన అంశాలను తెలుసుకోవడం మొదలైన వాటికి ఈ శిక్షణ ఉపయోగపడగలదని పేర్కొంది. ఎగుమతుల హబ్‌లుగా గుర్తించిన జిల్లాల్లో అమెజాన్, డీజీఎఫ్టీ కలిసి శిక్షణ, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాల కోసం ఫ్లిప్‌కార్ట్, ఈబే, రివెక్సా, షిప్‌రాకెట్, షాప్‌క్లూస్ వంటి వివిధ ఈ–కామర్స్ సంస్థలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశీ సంస్థలు అంతర్జాతీయంగా మరిన్ని ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. 2030 నాటికి ఈ–కామర్స్ ద్వారా 350 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి 2 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఎగుమతులను సరళతరం చేయడం, 2025 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు చేర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. -
India-US Relations: అంకురాలకు దన్ను
న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది. ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్ ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్ టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. -
గోదావరి–కావేరిపై సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై సంప్రదింపులు, టాస్‌్కఫోర్స్ సమావేశాలను నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీల్లో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్రాలకు అందజేస్తామని, అప్పటి నుంచి 15 రోజుల్లోగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఎంఓయూపై సంతకాలు చేయాలని వెదిరె శ్రీరామ్ సూచించారు. ఈ భేటీల నిర్ణయాలను ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి(గోదావరి)–మూసీ–నాగార్జునసాగర్–సోమశిల– గ్రాండ్ ఆనికట్ (కావేరి)లను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ వద్దు: తెలంగాణ గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు రక్షణ కల్పిస్తే అనుసంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతామని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టంచేశారు. ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50శాతం కేటాయించాలని కోరారు. గోదావరి జలాల్లో రాష్ట్రాల వారీగా వాటాలను నిర్థారించి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగకుండా ఫ్రీజ్ చేయాలన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కాకుండా కొంత ఎగువన బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని.. లేకుంటే దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి వద్దే నిర్మిస్తాం: వెదిరె శ్రీరాం తెలంగాణ సహా ఏ రాష్ట్ర వాటా నీటికీ నష్టం కలిగించమని వెదిరే శ్రీరామ్ సమాధానమిచ్చారు. భౌగోళికంగా ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్, ఇతర ఎగువ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్న గోదావరి జలాలనే తరలిస్తామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని నిర్థారించిన నేపథ్యంలో వాటిని సైతం వినియోగించబోమని హామీ ఇచ్చారు. తెలంగాణకు 50శాతం వాటా కేటాయింపును పరిశీలిస్తామన్నారు. తొలి విడత ప్రాజెక్టుకు కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని చెప్పారు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాస్తామని, సమ్మక్క బ్యారేజీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా వాటా పూర్తిగా వాడుకుంటాం: ఛత్తీస్‌గఢ్ గోదావరిలో తమ రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకుంటామని సమావేశంలో ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఇంజనీర్ కుబేర్‌సింగ్ గురోవర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు పూర్తిచేసి, సీడబ్ల్యూసీ నుంచి ప్రాథమిక స్థాయి అనుమతులు పొందామని చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాలను వాడుకోవడం ప్రారంభించిన వెంటనే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేస్తామని వెదిరె శ్రీరామ్ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టవచ్చని, ఆలోగా మహానది–గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నుంచే అనుసంధానం జరపాలి: ఏపీ గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని ఏపీ తరఫున శశిభూషణ్‌కుమార్ కోరారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాడుకోని జలాలను సాంకేతికంగా నిర్ధారించాలని కోరారు. గోదావరిలో 75శాతం లభ్యత ఆధారంగా నికర జలాల లభ్యత లేదని తేల్చుతూ సీడబ్ల్యూసీ ఇ చ్చిన నివేదికలో తారతమ్యాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిoచాలని సూచించారు. బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని హెచ్ఎల్సీ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించాలన్నారు. ఎగువ రాష్ట్రాల వినియోగంతో గోదావరిలో దిగువ చివరి రాష్ట్రం ఏపీ వాటాకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఏపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. దీనిపై స్పందించిన వెదిరె శ్రీరామ్.. తొలివిడతలో ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామని, తదుపరి దశల్లో ఇతర ప్రాంతాల నుంచి సైతం గోదావరి జలాల తరలింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ వాటాలకు రక్షణ కల్పించే విషయంలో రాజీపడబోమని భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల కింద ఇప్పటికే ఉన్న ఆయకట్టుతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు సైతం సాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఎన్పీసీఐ ఒప్పందం
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశానికి మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్‌తో మంత్రి గోయల్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్ టాస్క్‌ఫోర్స్ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కావడం గమనార్హం. -
భారత్‌కు శివాజీ ఆయుధం
ముంబై–లండన్: ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన ఆయుధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకురానుంది. 17వ శతాబ్దంలో శివాజీ వాడిన పులిగోళ్లు ఆకారంలో ఉండే ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్‌లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియం, మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇనుముతో తయారు చేసిన అత్యంత పదునైన వాఘ్ నఖ్ (పులి గోళ్లు) ఆయుధాన్ని శివాజీ ఎక్కువగా వాడేవారు. ఆ ఆయుధాన్ని చేత్తో పట్టుకొని మహారాజా శివాజీ కదనరంగంలో స్వైరవిహారం చేస్తూ ఉంటే శత్రువులు గడగ డలాడిపోయేవారు. బీజాపూర్ సేనా నాయ కుడు అఫ్జల్ ఖాన్‌ను శివాజీ ఈ పులిగోళ్ల ఆయుధంతో చంపాడని చరిత్ర చెబుతోంది. తెల్లదొరల పాలనా కాలంలో 1818లో ఈస్ట్ ఇండియాకు చెందిన అధికారి జేమ్స్ గ్రాండ్ డఫ్ పులి గోళ్ల ఆయుధాల సెట్‌ను విక్టోరియా అల్బర్ట్ మ్యూజియానికి ఇచ్చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శివాజీ వాడిన ఆయుధం మన దేశానికి రానుంది. ఛత్రపతి శివాజీ పట్టాభి షిక్తుడై అక్టోబర్ 3నాటికి 350 ఏళ్లు పూర్తి కానున్నాయి. అదే రోజు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. -
ఐబీ సిలబస్ సవాల్‌తో కూడుకున్నది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జగనన్న సర్కార్‌లో.. ఏపీ ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు పడింది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు.. అందుబాటులోకి ఐబీ సిలబస్ రానుంది. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో ఐబీ సంస్థతో ఎంవోయూ memorandum of understanding (MOU) జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ‘‘విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఐబీ సిలబస్ అనేది సవాల్‌తో కూడుకున్నది. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా పెద్ద సవాల్. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఏపీలో పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి డిజిటలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాసుతో మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాతే ఐబీ సంస్థతో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ Olli-Pekka Heinonen, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ Matt Costello పాల్గొని మాట్లాడారు. ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. -
ఏయూతో యూకే యూనివర్సిటీ ఎంవోయూ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయంతో యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైలాండ్స్ అండ్ ఐస్లాండ్స్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ ఈసీ హాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, యూకే ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సనమ్ అరోరా ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా ఎంబీఏ, ఎమ్మెస్సీ అప్లయిడ్ డేటా ప్రాసెస్ కోర్సుల్లో రెండు యూనివర్సిటీలు సంయుక్త సహకారంతో ముందుకెళ్తాయని చెప్పారు. ఏయూ ద్వారా రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. యూకే ఇండియా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ కోర్సులు చేసే విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీతో పాటు స్కాలర్షిప్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని టాప్ వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీ విదేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, బేమ్ గ్లోబల్ సొసైటీ సీఈవో నవిందర్ కెప్లీష్, ఏయూ ఇంటర్నేషనల్ అఫైర్ అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, ఏయూ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఈసీ ‘నేషనల్ ఐకాన్’గా సచిన్
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్ ఐకాన్’గా సచిన్ వ్యవహరించనున్నారు. ఢిల్లీలో బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ తదితరుల సమక్షంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో 3 సంవత్సరాల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఈ ఎంఓయూ ద్వారా యువత, పట్టణ ప్రాంతాల ఓటర్ల భాగస్వామ్యం పెంచే దిశగా టెండూల్కర్ ‘నేషనల్ ఐకాన్’గా తన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా గత సంవత్సరం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంఎస్ ధోని, అమీర్ ఖాన్, మేరీకోమ్ వంటి ప్రముఖులు కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్ ఐకాన్’లు వ్యవహరించారు. -
CM Jagan: పేదవిద్యార్థులకు ఇక ప్రపంచస్థాయి కోర్సులు
సాక్షి, గుంటూరు: విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు.. అదీ అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులు ఉచితంగా అందించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్(edX)తో ఎంవోయూ కుదర్చుకుంది. ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు… ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి అని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ అధికారం చేపట్టాక పేద విద్యార్థులకు సంక్షేమ పథకాల ద్వారా అండగా, ఆసరాగా నిలవడంతో పాటు.. విద్యారంగానికి సంబంధించిన ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆయన ధృడ సంకల్పం.. ఇవాళ ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు వేసినట్లయ్యింది. -
నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాల శిక్షణ.. ప్రముఖ సంస్థల ఎంఓయూ
గౌహతి: నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ ఇండియా డ్రోన్ అకాడమీ (IDA), నిర్మాణ పరిశ్రమ నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (CSDCI) అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శుక్రవారం (ఆగస్ట్ 11) గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ఐడీఏ సీఈవో దేవిరెడ్డి వేణు, సీఎస్‌డీసీఐ సీఈవో నరేంద్ర దేశ్‌పాండే ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (NOS), నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) స్థాయిల ప్రకారం నిర్మాణ కార్మికులు, నిపుణులకు నాణ్యమైన డ్రోన్ శిక్షణ అందించడం ఈ ఎంఓయూ లక్ష్యం. కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), నేషనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌బీఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా ప్రమోట్ చేసిన సీఎస్డీసీఐతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని దేవిరెడ్డి అన్నారు. సీఎస్‌డీసీఐ, ఐడీఏ ద్వారా దేశవ్యాప్తంగా 3500 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వబోతోందని, డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమాల కోసం పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి గుర్తింపు పొందినట్లు ఆయన చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పనలో ఒకటైన నిర్మాణ పరిశ్రమలో నైపుణ్యాల అభివృద్ధికి సీఎస్‌డీసీఐ కట్టుబడి ఉందని సీఈవో నరేంద్ర దేశ్‌పాండే తెలిపారు. నిర్మాణ ప్రాజెక్టుల సామర్థ్యం, భద్రత, నాణ్యతను మెరుగుపరచడానికి డ్రోన్లకు అపారమైన సామర్థ్యం ఉందని, నిర్మాణ కార్మికులకు డ్రోన్ నైపుణ్యాలను అందించడానికి సీఎస్‌డీసీఐ ఐడీఏతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ శిక్షణా కోర్సులను అందించడానికి, అసెస్మెంట్లు, సర్టిఫికేషన్లను నిర్వహించడానికి, ట్రైనీలకు ప్లేస్మెంట్ సహాయం అందించడానికి రెండు సంస్థలు పరస్పరం కలిసి పని చేసేందుకు ఈ ఎంఓయూ అనుమతిస్తుంది. రెండు సంస్థల మధ్య అవగాహన, వనరుల మార్పిడిని కూడా సులభతరం చేస్తుంది. ఏరియల్ సర్వే, ఇన్స్పెక్షన్, మ్యాపింగ్, మానిటరింగ్, డాక్యుమెంటేషన్ వంటి వివిధ పనులను చేయగల నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల సమూహాన్ని సృష్టించడం ద్వారా ఈ ఎంఓయూ నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. -
ఈశాన్య రాష్ట్రాలతో గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎంవోయూ
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ తెలిపారు. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు నిర్వహిస్తున్న తాము ఈశాన్య రాష్ట్రాల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా ఆయిల్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 5 వరకూ ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి పాల్గొన్నాయి. -
స్టార్టప్‌ల కల్పతరువు విశాఖ
దొండపర్తి (విశాఖ దక్షిణ): అంకుర సంస్థలకు విశాఖపట్నం కల్పతరువుగా మారుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆన్ ఇండస్ట్రీ 4.0’ కేంద్రాన్ని ఉక్కు నగరం టౌన్షిప్లో ఏర్పాటైంది. దీనిని స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్‌భట్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టుతో విశాఖ స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయన్నారు. ఎంఈఐటీవై, ఎస్టీపీఐ, ఎస్టీపీఐ నెక్ట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్య ఉమ్మడి నిధులతో స్టీల్‌ప్లాంట్‌లో ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్టు చెప్పారు. ఈ సెంటర్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అంశాలపై ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు చేపడుతున్నట్టు వివరించారు. ఇది భారతీయ ఆటోమేషన్ పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఎగుమతుల పెరుగుదలకు దోహదం చేస్తూనే, ఆటోమేషన్ పరికరాల దిగుమతుల తగ్గుదలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌తో పాటు దేశంలో ఉన్న ఇతర పరిశ్రమల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 175 స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 5 స్టార్టప్‌లతో ఎంవోయూలు ఈ ప్రాజెక్టులో భాగంగా గురువారం 5 స్టార్టప్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్‌కుమార్, ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ఎస్టీపీఐ డైరెక్టర్ సీవీడీ రామ్‌ప్రసాద్, ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఏకే బాగ్చి సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. స్టార్టప్‌లకు మార్గదర్శక సేవలు అందించే ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్, ఐఐఎం వైజాగ్, లోటస్ వైర్లెస్ వంటి కల్పతరు భాగస్వాములతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఆర్ఐఎన్ఎల్ జీఎం పి.చంద్రశేఖర్, ఎస్టీపీఐ అడిషనల్ డైరెక్టర్ సురేష్ భాతా, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
Kurnool Medical College: మల్టీ యుటిలిటీ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం
మంగళగిరి(గుంటూరు జిల్లా): కర్నూలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ.15 కోట్లతో నిర్మించే మల్టీ యుటిలిటీ సెంటర్‌కు మంగళగిరిలోని APIIC టవర్స్ 6 వ అంతస్తులో సోమవారం నాడు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు ఛాంబర్లో అవగాహనా ఒప్పందాన్ని ( MOU ) కుదుర్చుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ( KMC) కార్యదర్శి డి.ద్వారకనాథ రెడ్డి , కోశాధికారి డాక్టర్ మహేష్ కుమార్ మార్డ మల్టీ యుటిలిటీ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ నరసింహంతో కలిసి MOUపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదిత బహుళ-వినియోగ కేంద్రానికి రూ. 15 కోట్ల మేర ఖర్చవుతుందని మరియు అదనపు విరాళాలతో మరింత అభివృద్ధి చేసేందుకు పూనుకుంటామని కెఎంసిజి ట్రస్టు ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. మల్టీ-యుటిలిటీ సెంటర్లో ఒకేసారి 300 మందికి వసతి కల్పించడానికి వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మరియు ఇతర ఆధునిక విద్యా మౌలిక సదుపాయాలు ఉంటాయని, ప్రపంచ బోధనా వాతావరణంలో తమ వృత్తిని రూపొందించుకోవడంలో విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ అలూమిని ఆఫ్ నార్త్ అమెరికా మరియు కర్నూలు మెడికల్ కాలేజ్ అలూమిని అసోసియేషన్ లు కలిసి కర్నూల్ మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ( KMCGT)గా ఏర్పడింది. ఈ ప్రాజెక్టును చేపట్టినందుకు KMCGT ప్రతినిధుల్ని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి కృష్ణ బాబు ఈ సందర్భంగా అభినందించారు . అలాగే ఇతర అలూమిని అసోసియేషన్లు మరియు ట్రస్టులు కూడా సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య సంస్థలోని విద్యార్థులు, సిబ్బంది మరియు రోగులకు సహాయక సౌకర్యాల్ని అందించేందుకు KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ కృషి చేస్తోందని, కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు కళాశాల పోర్టల్‌ల ద్వారా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు (కర్నూల్ మెడికల్ కాలేజ్ ఉత్తర అమెరికా పూర్వ విద్యార్థులు & భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర విద్యార్థులు) కలిసి వచ్చారని ప్రతినిధులు తెలిపారు. రాబోయే మల్టీ యుటిలిటీ సెంటర్ వైద్య విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ మరియు పెవిలియన్ కోసం ఉపయోగపడుతుంది. పై అంతస్తులో వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మొదలైనవాటిని.ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ప్రపంచ బోధనా వాతావరణంలో వారి కెరీర్‌ను రూపొందించుకునేందుకు ఈ సెంటర్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ నాణ్యత, సామర్థ్య ప్రమాణాలతో మల్టీ యుటిలిటీ సెంటర్ కు సంబంధించి KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య PPP విధానంలో చేపడతాయి. బహుళ-వినియోగ కేంద్రంలోKMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తుల్ని నిర్మిస్తుంది. ఈ సెంటర్ ను నిర్మించేందుకు KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్, APMSIDC కలిసి పనిచేస్తాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మరియు కౌన్సెలింగ్ సెంటర్ రూపంలో ప్లేస్మెంట్లు పొందడానికి మరియు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి KMC ట్రస్టు గ్రాడ్యుయేట్లకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన పరికరాలు, ఆడియో-విజువల్ ఎయిడ్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ లైబ్రరీ కోసం పుస్తకాల సబ్స్క్రిప్షన్ల సేకరణ, ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహిస్తుంది. క్రీడా కార్యకలాపాలలో విద్యార్థులను మరింత గా ప్రోత్సహించేందుకు కూడా ఈ ట్రస్ట్ ఎంతగానో కృషి చేస్తుంది. -
బంఫర్ ఆఫర్: ‘ఉద్యోగులకు’ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవేరా ముందుకొచ్చింది. ఈ మేరకు నెడ్‌క్యాప్‌తో అవేరా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నెడ్‌క్యాప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ రమణా రెడ్డి, అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణలు ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ‘గ్రీన్ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేక ధరలకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2 స్కూటర్‌పై రూ.10,000, రెటోరోసా లైట్ వాహనంపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Fact Check: కుంగుతున్నది రామోజీ బుద్ధే -
గ్రామీణ పేదలకు ఇంటర్నెట్: మైక్రోసాఫ్ట్, ఎయిర్‌జల్దీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ను ఇవి అందించనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది. -
టాటా టెక్నాలజీస్‌తో టిహాన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ’టిహాన్’ ఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ వెల్లడించింది. సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాలు (ఎస్‌డీవీ), అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) విభాగాల్లో కలిసి పని చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ఆటోమోటివ్ కంపెనీలు సాఫ్డ్‌వేర్ ఆధారిత వాహనాలను రూపొందించే కొద్దీ వ్యయాలను తగ్గించుకునే దిశగా వినూత్న సొల్యూషన్స్ కోసం అన్వేషిస్తుంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తగు ప్లాట్‌ఫామ్‌లను రూపొందించడం, తమ ఇంజినీర్లకు కొత్త సాంకేతికతలపై టిహాన్లో శిక్షణ కల్పించడంపై ఎంవోయూ కింద ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాటా టెక్నాలజీస్ ఎండీ వారెన్ హారిస్ తెలిపారు. ఈ భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమోటివ్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలకు ఊతం లభించగలదని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. స్వయం చాలిత టెక్నాలజీలకు సంబంధించి ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన హబ్‌ను టిహాన్గా వ్యవహరిస్తున్నారు. -
ఎఫ్ఐఈవో, బిజినెస్ రష్యా ఎంవోయూ
న్యూఢిల్లీ: భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో), బిజినెస్ రష్యాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం ఇచ్చిపుచ్చుకోనున్నట్టు తెలిపింది. రష్యా వ్యాపార మండలి, ఎఫ్ఐఈవో సంయుక్తంగా ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారులు–విక్రయదారుల సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేయడంతోపాటు, జాయింట్ వెంచర్ల ఏర్పాటు విషయంలో తమ దేశ సంస్థలకు సహకారం అందించనున్నాయి. ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 50 మంది భారత ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ కుదిరింది. రెడీ టూ ఈట్ మీల్స్, ఫిష్ మీల్, జంతువులకు దాణా, సోయాబీన్ తదితర ఉత్పత్తుల విషయంలో జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై ప్రతినిధుల బృందం దృష్టి పెట్టనున్నట్టు ఎఫ్ఐఈవో బోర్డ్ సభ్యుడు ఎన్కే కగ్లివాల్ తెలిపారు. భారత ప్రతినిధుల బృందానికి కగ్లివాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆగ్రో, ఆహార ప్రాసెసింగ్ ఎగుమతులు 750 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు వచ్చే మూడేళ్లలో పెంచుకోవాలన్నది లక్ష్యమని తెలిపారు. కొన్ని అంశాల పరిష్కారానికి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, బ్యాంకర్ల అదనపు కృషి చేయాల్సి ఉంటుందని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. -
కొరియన్ కంపెనీలతో వేదాంత గ్రూప్ ఒప్పందం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా గ్రూప్ తాజాగా 20 కొరియన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. డిస్ప్లే గ్లాస్ తయారీ పరిశ్రమకు మద్దతుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వేదాంతా పేర్కొంది. తద్వారా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం అభివృద్ధికి తెరతీయనున్నట్లు తెలియజేసింది. కొరియా ప్రభుత్వ నిధులతో అక్కడ ఇటీవల ఏర్పాటైన 2023 కొరియా వాణిజ్య షోకు వేదాంతా హాజరైంది. వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ కోట్రా ఏర్పాటు చేసిన ట్రేడ్ షోలో భాగంగా కొరియన్ డిస్ప్లే గ్లాస్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నట్లు వేదాంతా సెమీకండక్టర్ విభాగం గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె.హెబ్బర్ తెలియజేశారు. 50 కంపెనీలకుపైగా తమతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. ఇవి ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ వేల్యూ చైన్‌కు ఉపకరించనున్నట్లు వివరించారు. -
రాస్నెఫ్ట్తో ఐవోసీ ఒప్పందం
న్యూఢిల్లీ: రష్యాకి చెందిన రాస్నెఫ్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో మరింత చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలన్నది ఐవోసీ ప్రయత్నం. చమురు దిగుమతులు గణనీయంగా పెంచుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరిస్తుందని ఐవోసీ ప్రకటించింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ భారత్ పర్యటనలో భాగంగా ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. -
గోద్రెజ్ గ్రూప్, ఎస్బీఐ ఒప్పందం
ముంబై: గోద్రెజ్ గ్రూప్‌లో భాగమైన గోద్రెజ్ క్యాపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. బ్యాంకింగ్ సాధనాలు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ తదితర ఆర్థిక సేవలను ఎస్బీఐ మరింత విస్తృతంగా అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. రుణాలు పొందడాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభతరంగా చేసేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా తెలిపారు. -
ఆస్ట్రేలియా సంస్థతో ‘వుయ్ హబ్’ జట్టు
హైదరాబాద్: మహిళల స్టార్టప్ ఇన్క్యుబేటర్ ’వుయ్ హబ్’ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సైబర్ వెస్ట్ సైన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇరు దేశాల్లోని అంకుర సంస్థలకు సీమాంతర అవకాశాలను కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని వుయ్ హబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు. ఈ ఎంవోయూతో మార్కెట్ విశ్లేషణ, పరిశ్రమ నెట్‌వర్క్‌లు, వనరుల వివరాలు మొదలైనవి అంకుర సంస్థలకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. వ్యాపార విస్తరణ అవకాశాల గురించి అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం వుయ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. -
భారత్-యూఏఈ ఆర్థిక బంధం మరింత పటిష్టం!
ముంబై: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఈ దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యునైటెడ్ అరబ్ ఎమిరైట్స (యూఏఈ) సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) పరస్పర నిర్వహణా (ఇంటర్‌ఆపరేబిలిటీ) విధానాలను అన్వేషిణ సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించ డానికి ఈ ఒప్పందం దోహపడనుంది. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు) ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. సీబీడీసీకి సంబంధించి పురోగమించే సహకారం-రెమిటెన్సులు,వాణిజ్యం వివిధ విభాగాల్లో రెండు దేశాల ప్రజలు, సంబంధిత వర్గాల సౌలభ్యతను ఈ ఒప్పందం మరింత మెరుగు పరుస్తుందని అంచనా. ఆర్థికరంగంలో వ్యయ నియంత్రణకు, సామర్థ్యం పెంపుకు దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రతిష్టాత్మక యూపీఐ వ్యవస్థ అందుబాటులో ఉన్న దేశాల్లో యూఏఈ కూడా ఉండడం గమనార్హం. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు ఉన్నాయి. -
గ్రీన్ హైడ్రోజన్‌పై థెర్మాక్స్ దృష్టి
న్యూఢిల్లీ: గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఇంధనం, పర్యావరణ సొల్యూషన్ల కంపెనీ థెర్మాక్స్ ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ఆస్ట్రేలియన్ కంపెనీ ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్(ఎఫ్ఎఫ్ఐ)తో చేతులు కలిపింది. భాగస్వామ్య ప్రాతిపదికన రెండు సంస్థలూ వాణిజ్య, పారిశ్రామిక కస్టమర్ల కోసం సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకు ఎఫ్ఎఫ్ఐతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు థెర్మాక్స్ పేర్కొంది. తద్వారా దేశీయంగా తయారీ యూనిట్ల ఏర్పాటుసహా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధి అవకాశాలను సంయుక్తంగా అన్వేషించనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా దేశీయంగా రిఫైనరీలు, ఫెర్టిలైజర్లు, స్టీల్ తదితర ప్రధాన రంగాలలో కర్బనాలను తగ్గించేందుకు అవకాశముంటుందని వివరించింది. -
ఓఎన్జీసీతో టోటల్ఎనర్జీస్ జట్టు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) ట్విటర్లో వెల్లడించింది. ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. -
జీఐఎస్ రెండో రోజు: ఏపీ సర్కార్ కీలక ఎంవోయూలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం.. పరిపాలన రాజధాని విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతమైంది. సదస్సులో రెండో రోజైన శనివారం(మార్చి 4వ తేదీ) ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో.. రిలయన్స్ కంపెనీ 50వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా(ఇవాళ్టి ఒప్పందాల ప్రకారం) ఉంది. విశాఖ జీఐఎస్.. రెండోరోజు ఎంవోయూల జాబితా పరిశీలిస్తే.. ►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు ►హెచ్‌పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్లు ►టీవీఎస్ ఐఎల్పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు ►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు ►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు ►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు ►గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►ఎక్స్‌ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు ►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు ►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు ►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు ►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు ►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు ►డీఎక్స్ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు ►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు ►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు ►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు ►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►ఆటమ్‌స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►వీఆర్‌ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు ►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►టెక్ విషెన్ సాఫ్ట్వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు ►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు ►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు ►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు ►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు ►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు ►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు ►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ►ఎస్పీఎస్ ఇన్ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు ►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు ►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►ఆమ్ కన్స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు ►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు ►ఎన్జీసీ ట్రాన్స్మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు ►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు ►విన్‌విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు ►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు ►చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►స్విచ్‌గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►ఆంబర్ ఎంటర్‌ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు ►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా తొలి రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదిరాయి. మొత్తం 92 ఎంవోయూలు జరిగాయి. వీటి విలువ రూ.11లక్షల 87 వేల 756 కోట్లు. వీటిలో ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్ (రూ. 76, 033 కోట్లు), ఏసీఎమ్ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్ఓఎల్ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు), హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఇక రెండు రోజుల ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ చేసిన ప్రకటన.. కార్యరూపం దాల్చినట్లయ్యింది. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్–లులు భాగస్వామ్యం
తిరువనంతపురం: ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూఏఈకి చెందిన లులు ఎక్సే్చంజ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు భారత్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) ప్రాంతంలో సీమాంతర చెల్లింపులను బలోపేతం చేస్తాయి. తొలి దశలో రెమిట్నౌ2ఇండియా సేవలను హెచ్డీఎఫ్సీ అందుబాటులోకి తేనుంది. యూఏఈ నుంచి కస్టమర్లు భారత్‌లోని ఏదేని బ్యాంక్ ఖాతాకు ఐఎంపీఎస్, నెఫ్ట్ విధానంలో హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ వేదికల ద్వారా నగదు పంపవచ్చు. భారత్‌లో లులు ఫారెక్స్, లులు ఫిన్సర్వ్ కంపెనీల బలోపేతానికి సైతం ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బ్యాంక్ తెలిపింది. -
టాటా మోటార్స్–ఉబర్ భారీ డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో భారీ డీల్‌కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్ షేరింగ్ యాప్ ఉబర్ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్ సరఫరా చేయనుంది. ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్ వెల్లడించింది. హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది. దశలవారీగా డెలివరీలు.. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్ షేరింగ్ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్ ఫ్లీట్ పార్ట్నర్స్కు డెలివరీలను టాటా మోటార్స్ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేశ్ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌ను టాటా మోటార్స్ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్ కింద ఎక్స్‌ప్రెస్–టి తొలి ఉత్పాదన. ఫేమ్ సబ్సిడీ పోను హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర.. ఎక్స్‌ప్రెస్–టి ఎక్స్ఎమ్ ప్లస్ రూ.13.04 లక్షలు, ఎక్స్‌టీ ప్లస్ రూ.13.54 లక్షలు ఉంది. -
ఓలా సంచలనం: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్, భారీ పెట్టుబడులు
చెన్నై: ఓలా సీఈవోభవిష్ అగర్వాల్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా తాజాగా మరో అడుగుముందుకేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, లిథియం-అయాన్ సెల్‌లను తయారు చేసేందుకు ఓలా రూ.7,614 కోట్ల పెట్టనుంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేసారని శనివారం ట్వీట్ చేశారు. (ఇవీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర) తమిళనాడులో టూ వీలర్, కార్ల లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. తమిళనాడుతో ఈరోజు ఎంఓయూపై సంతకం చేశామని భవిష్ వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగర్వాల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ఏర్పాటు కానుంది. మొత్తం పెట్టుబడిలో దాదాపు రూ.5,114 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి, మిగిలిన రూ.2,500 కోట్లు కార్ల తయారీ యూనిట్లోకి వెళ్తాయి. Ola will setup the worlds largest EV hub with integrated 2W, Car and Lithium cell Gigafactories in Tamil Nadu. Signed MoU with Tamil Nadu today. Thanks to Hon. CM @mkstalin for the support and partnership of the TN govt! Accelerating India’s transition to full electric! 🇮🇳 pic.twitter.com/ToV2W2MOsx — Bhavish Aggarwal (@bhash) February 18, 2023 సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్‌తో కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2024 నాటికి ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) ప్రారంభించాలనే ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెట్టుబడుదల ద్వారా 3,111 ఉద్యోగాలను సృష్టించనుందట. తమిళనాడు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ డీల్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆటో హబ్‌గా ఉన్న తమిళనాడులో హోసూర్‌లోని కంపెనీ ప్రస్తుత సౌకర్యం ప్రపంచంలోనే అతిపెద్దఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లలో ఒకటి అని తమిళనాడు ప్రభుత్వపెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు సీఎండీ విష్ణు అన్నారు. తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2023 ప్రకారం రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను (SGST), పెట్టుబడి లేదా టర్నోవర్ ఆధారిత సబ్సిడీ , అధునాతన కెమిస్ట్రీ సెల్ సబ్సిడీ 100 శాతం రీయింబర్స్మెంట్ ఉన్నాయి. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఐదేళ్లపాటు విద్యుత్ పన్నుపై 100 శాతం మినహాయింపు, స్టాంప్ డ్యూటీపై మినహాయింపు ,భూమి ధరపై సబ్సిడీని కూడా రాష్ట్రం అందిస్తుంది. గత ఐదేళ్లలో, ఈవీ సె క్టార్లో 48,000 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టులను సాధించింది. -
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు
జోహన్నెస్‌బర్/న్యూఢిల్లీ: భారత్‌కు మరో డజను చీతాలు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చే చీతాలను మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో ఉంచుతారు. దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్లీ పెంచేందుకు కొద్ది నెలల క్రితం నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు వాటికి తోడుగా ఫిబ్రవరిలో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వస్తాయని అటవీ, మత్స్య సంపద సంరక్షణ, పర్యావరణ (డీఎఫ్ఎఫ్ఈ) శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 12 చీతాలు వస్తే, ఆ తర్వాత ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఏడాదికి 12 చీతాలు చొప్పున వస్తాయి. ప్రపంచంలోనున్న 7 వేల చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో ఉన్నాయి. -
పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్ రన్ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?) -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Natural Farming: ఏపీ స్ఫూర్తితో మేఘాలయలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రకృతిసాగు వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటీవలే మేఘాలయ రాష్ట్ర అధికారులు, గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి గిరిజనులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది. మేఘాలయలో ప్రకృతి వ్యవసాయ పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే క్రమంలో మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుసాధికార సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులకు చెందిన నిట్టపుట్టు పరస్పర సహాయ సహకార సంఘం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మేఘాలయలో ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందించనుంది. మేఘాలయలో ఘరో, ఖాశీ హిల్స్‌లో ఎంపిక చేసిన ఐదు బ్లాకుల్లో 20గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడంతోపాటు బలమైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) వ్యవస్థ రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఇందుకోసం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల బృందం మేఘాలయాకు వెళ్లింది. ఈ బృందం అక్కడి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రాజెక్టు బృందంతో కలిసి పనిచేస్తుంది. ఎంపికచేసిన బ్లాకుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతిసాగు చేపట్టడం ద్వారా వాటిని రిసోర్స్ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నారు. ఇంగ్లిష్ స్థానిక భాషల్లో ప్రకృతిసాగు విధానాలు, పాటించాల్సిన పద్ధతులపై మెటీరియల్ తయారుచేసి ఇస్తారు. సిబ్బందికి శిక్షణతోపాటు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేట్ చేసేందుకు స్టేట్ యాంకర్‌ను నియమిస్తారు. సీజన్ల వారీగా రెండు రాష్ట్రాల కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం పంచుకోవడానికి కృషిచేస్తారు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
Vizag: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: సాంకేతిక రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోందని, 130 కోట్ల మంది ప్రజలంతా టెక్నాలజీలో భాగస్వాములు కావడం విశేషమని మైక్రోసాఫ్ట్ ఇండియా క్లౌడ్ సైట్ లీడర్ చారుమతి శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘వైజాగ్ ది నెక్ట్స్ టెక్ హబ్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఎడ్యుటెక్, ఫార్మాటెక్ రంగాల్లో దూసుకెళ్లేందుకు విశాఖకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. స్టార్టప్ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందేందుకు ఇంక్యుబేటర్స్ ద్వా రా కార్యకలాపాలను పెంచడంతోపాటు ఫ్రెండ్లీ పాలసీ ద్వారా ప్రధానసంస్థల్ని ఆకర్షించాలని సూచించారు. 81 శాతం పరిశ్రమలకు ఆవిష్కరణలే బలమని చెప్పారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకం సదస్సు సందర్భంగా ఎస్టీపీఐ, ఎస్టీపీఐ నెక్టస్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ నేతృత్వంలో ఇండస్ట్రీ 4.0 ద్వారా ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా ఒప్పందం కుదిరింది. పరిశ్రమలతో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే వాతావరణాన్ని ఎస్టీపీఐ సృష్టిస్తుందని సదస్సును ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ సీవీడీ రామ్‌ప్రసాద్ తెలిపారు. విశాఖలో ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలిసి ఆవిష్కరణలు, అంకుర సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీ 4.0 ప్రారంభించామని చెప్పారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకమన్నారు. ఐటీ సెక్టార్‌తో విద్యుత్ రంగం కలిసి పనిచేస్తే వినియోగదారుల సమస్యలను మరింత త్వరగా పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందని సీఐఐ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ తెలిపారు. స్టీల్‌ప్లాంట్, సెమ్స్, మారిటైమ్ యూనివర్సిటీ, ఎక్స్పోర్ట్ హబ్ లాంటి సంస్థలతో విశాఖ పారిశ్రామిక నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందని, ఐటీ హబ్‌గా ఎదిగే రోజులు సమీపంలోనే ఉన్నాయన్నారు. సీఐఐ వైస్ చైర్మన్ పీపీ లాల్‌కృష్ణ, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హరిత హైడ్రోజన్ దిగ్గజంగా భారత్
హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్‌లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్‌షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
భారతీయ విద్యార్ధులకు బంపరాఫర్!
భారతీయ విద్యార్ధులకు బంపరాఫర్. ఇకపై ఇంటర్ తర్వాత డిగ్రీని తమ దేశంలో చదువుకోవచ్చని యూకే ఆఫర్ ప్రకటించింది. దీంతో ఆక్స్ఫర్డ్,కేంబ్రిడ్జ్, ఎల్ఎస్ఈ వంటి దిగ్గజ యూనివర్సిటీల్లో దేశీయ విద్యార్ధులు చదువుకునే అవకాశం ఏర్పడింది. గతంలో మనదేశానికి చెందిన విద్యార్ధులు యూకేలో డిగ్రీ చేస్తే తిరిగి స్వదేశంలో ఉద్యోగం చేసేందుకు అనర్హులు. అక్కడి డిగ్రీలు..(కొన్ని సందర్భాలలో) ఇక్కడ చెల్లేవి కావు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 21న యూకే ప్రభుత్వంతో కేంద్రం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో భారత్ కు చెందిన విద్యార్ధులు..యూకేలో డిగ్రీ చేసి.. ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. "నేటి నుంచి యూకే డిగ్రీలను భారతీయ డిగ్రీలతో సమానంగా గుర్తిస్తాం. మీరు అక్కడ (యూకేలో) డిగ్రీ చదువుకోవచ్చు. మనదేశంలో ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు ఈ ఒప్పందం పరిధిలోకి రావు' అని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇప్పుడు రెండు దేశాలలో గుర్తించబడతాయి. దీని అర్థం భారతీయ కళాశాలల్లో డిగ్రీ పొందిన విద్యార్ధి ఇప్పుడు యూకేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హత పొందుతాడు. భారతీయ డిగ్రీ హోల్డర్లు..యూకే డిగ్రీ హోల్డర్లతో సమానంగా పరిగణించబడతారు. యూకేలో ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. -
ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తీరు గురివింద గింజను గుర్తుచేస్తోంది.. గత టీడీపీ పాలనలో పెట్టుబడుల సదస్సుల పేరుతో లక్షల కోట్లు తీసుకొచ్చామని బాకా కొట్టి బూటకపు ప్రచారం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వస్తున్న పరిశ్రమల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. విశాఖ వేదికగా నాలుగేళ్లపాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల ద్వారా నగరాభివృద్ధికి 20 అమెరికా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించినా.. ఒక్క కంపెనీ సహకారం తప్ప.. మిగిలిన ఎంవోయూలన్నీ.. డొల్లవేనని స్పష్టమవుతున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఆయా కంపెనీలు పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వెళ్లిపోయాయన్నది హాస్యాస్పద ప్రశ్నగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సమయంలో ఏటా విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో నాలుగేళ్ల పాటు అట్టహాసం చేశారు. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిన కాకి లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లలో ఏడాదికి రూ.14 లక్షల చొప్పున గణిస్తే.. రమారమి రూ.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్‌ని ముంచెత్తి ఉండాలి. వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికీ తెలిసిందే. పైగా పెట్టుబడుల సదస్సుల పేరుతో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. 20 అమెరికా సంస్థల్లో ఒక్కటైనా..? దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమంటూ 2016లో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు బీరాలు పలికారు. అమెరికా అందించే ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలను సమర్థంగా అమలు చేసేందుకు భాగస్వామ్య సదస్సులకు హాజరైన అమెరికా బృందంతో చర్చించినట్టు ప్రకటించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా తన పిలుపు మేరకు వైజాగ్‌లో 4వ పారిశ్రామిక విప్లవం తీసుకొస్తోందని మీడియా సమక్షంలో హడావిడి చేశారు. విశాఖపట్నం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన 20 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లుగా అమెరికన్లతో ఫొటోలు దిగారు. ఇందులో ఒక్క సంస్థ కూడా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోవడం శోచనీయం. చదవండి: (CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..) అయికాం సంస్థది సహకారమే.. యూఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ చేస్తున్నట్లుగా చంద్రబాబు అండ్ కో సంతకాల కోసం ఫోజులిచ్చి.. మీడియాకు విడుదల చేశారు. అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ తరపున స్మార్ట్‌సిటీగా వైజాగ్‌ని అభివృద్ధి చేసేందుకు రూ.వేల కోట్లు నిధులు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన అయికాం, కేపీఎంజీ, ఐబీఎం కంపెనీలు విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికను రూపొందిస్తాయని సదస్సులో ప్రకటించారు. ఈ ప్రణాళికల్ని అదే ఏడాది(2016)లోనే అమల్లోకి తెస్తామంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. ఇ–గవర్నెస్, కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాల్లో విశాఖను స్మార్ట్‌సిటీగా రూపుదిద్దే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 వరకూ ఒక్క రూపాయీ ఏ ఒక్క అమెరికా సంస్థ పెట్టుబడి పెట్టలేదు. ఎంవోయూ చేసుకున్న తర్వాత.. ఏ ఒక్క సంస్థతోనూ చర్చించినట్లు దాఖలాలు లేవు. ఒక్క అయికాం సంస్థ ప్రతినిధులు మాత్రం పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి.. జీవీఎంసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అందించారే తప్ప.. ఒక్క రూపాయీ విదిలించలేదు. ఇలా.. 20 అమెరికా కంపెనీలు వైజాగ్‌ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయంటూ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని నగర ప్రజలతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. -
టాటా చేతికి ఫోర్డ్ ఇండియా ప్లాంట్
న్యూఢిల్లీ: అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సాణంద్‌లో ఉన్న ప్లాంటును కొనుగోలు చేస్తున్నట్లు దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్ ఇండియా (ఎఫ్ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం, టాటా మోటర్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎంఎల్) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం స్థలం, భవంతులు, వాహనాల తయారీ ప్లాంటు, యంత్రాలు, పరికరాలు మొదలైనవి టీపీఈఎంఎల్ కొనుగోలు చేయనుంది. అలాగే, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఎఫ్ఐపీఎల్ సాణంద్ ప్లాంటులోని వాహనాల తయారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే, అర్హత కలిగిన ఉద్యోగులు కూడా టీపీఈఎంఎల్‌కు బదిలీ అవుతారు. తదుపరి కొద్ది వారాల వ్యవధిలోనే టీపీఈఎంఎల్, ఎఫ్ఐపీఎల్ పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. సాణంద్ ప్లాంట్‌లో ఇంజిన్ల తయారీని ఫోర్డ్ కొనసాగించనుండటంతో అందుకు అవసరమైన స్థలాన్ని ఆ కంపెనీకి టాటా మోటార్స్ లీజుకు ఇవ్వనుంది. నీరు, విద్యుత్, వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంటు మొదలైనవి రెండు సంస్థలు కలిసి వినియోగించుకోనున్నాయి. కొత్త పెట్టుబడులు.. తమ వాహనాల ఉత్పత్తికి అనువుగా యూనిట్‌ను సిద్ధం చేసే దిశగా టీపీఈఎంఎల్ కొత్త యంత్రాలు, పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా ఏటా 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా ప్లాంటును తీర్చిదిద్దనుంది. తర్వాత రోజుల్లో దీన్ని 4 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోనుంది. ‘మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కొద్ది నెలలు పడుతుంది. ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది మాకు తోడ్పడుతుంది. పైగా సాణంద్‌లోని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్లాంటుకు పక్కనే ఈ యూనిట్ ఉండటం కూడా మాకు కలిసి వస్తుంది‘ అని టాటా మోటార్స్ పేర్కొంది. ‘టాటా మోటార్స్‌కు దశాబ్ద కాలం పైగా గుజరాత్‌తో అనుబంధం ఉంది. సాణంద్‌లో సొంత తయారీ ప్లాంటు ఉంది. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు ఈ ఒప్పందమే నిదర్శనం‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టీపీఈఎంఎల్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. తమ వాహనాలకు కొనుగోలుదారుల్లో డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా కంపెనీ అనేక రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు. ఉద్యోగులకు భరోసా.. 2011లో ఫోర్డ్ ఇండియా సాణంద్‌లోని ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారీ యూనిట్ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు దేశీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమైన ఫోర్డ్ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై దిగుమతి చేసుకున్న వాహనాలు మాత్రమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, తాజా ఒప్పందంతో ఆ సమస్య తప్పుతుందని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ‘ఫోర్డ్ ప్లాంటు మూసివేతతో 3,000 మంది పర్మనెంటు ఉద్యోగులు, 20,000 మంది వర్కర్లతో పాటు కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే అనుబంధ సంస్థల్లో ను భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పడే పరిస్థితి నెలకొంది. కానీ, ప్రస్తుత ఒప్పందంతో ఆ సమస్య పరిష్కారమవుతుంది‘ అని పేర్కొంది. -
ఈశాన్యంలో అవినీతి సంస్కృతి అంతం
నామ్సాయ్(అరుణాచల్ ప్రదేశ్): ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి సంస్కృతిని బీజేపీ అంతం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పట్టడం లేదని, చివరి లబ్ధిదారుడి దాకా చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిధులు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు దారుణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. ఆయన ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ(ఎన్డీయూ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అరుణాచల్ రాష్ట్రం ఈస్ట్ సియాంగ్ జిల్లాలోని పాసీఘాట్‌లో ఎన్డీయూ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం నామ్సాయ్ జిల్లాలో భారీ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ఈశాన్య భారతదేశానికి మోదీ సర్కారు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై అమిత్ షా మండిపడ్డారు. కళ్లు మూసుకుంటే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీజీ.. మీరు కళ్లు తెరవండి. ఇటలీ కళ్లద్దాలను పక్కనపెట్టండి. ఇండియా కళ్లద్దాలు ధరించండి’’ అని అమిత్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇక్కడి ప్రజల్లో దేశభక్తి నిండిపోయిందని, ఒకరినొకరు ‘నమస్తే’ బదులు ‘జైహింద్’ అంటూ అభివాదం చేసుకుంటారని తెలిపారు. ఇలాంటి సన్నివేశం దేశంలో ఇంకెక్కడా చూడలేమన్నారు. -
గూగుల్.. హైదరాబాద్‌లో భారీ క్యాంపస్.. తెలంగాణతో ఒప్పందం
దిగ్గజ కంపెనీ గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా డిజిటలైజ్ అయ్యే క్రమంలో భాగంగా గూగుల్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తాలు పాల్గొన్నారు. గూగుల్, తెలంగాణ ప్రభుత్వంల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల డిజిటలీకరణ, మహిళలు, యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణతో పాటు అవసరమైన మద్దతును గూగుల్ అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి యువతకు కెరీర్ ఓరియెంటెండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది. వీటితో పాటు పౌర సేవలు మరింత సులభతం చేసేందుకు అవసరమైన టెక్నాలజీని గూగుల్ అందిస్తుంది. మరోవైపు అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్ నిర్మాణ పనులను గూగుల్ ప్రారంభించింది. గచ్చిబౌలిలో 2019లో గూగుల్ 7.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో 23 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తోంది. ఇందులో 3.30 మిలియన్ చదరపు అడుగుల వర్క్‌స్పేస్ అందుబాటులోకి వచ్చేలా భవనాన్ని గూగుల్ డిజైన్ చేసింది. చదవండి: 4వేల కోట్లతో యూఎస్ కంపెనీని కొనుగోలు చేసిన విప్రో! -
‘ఈశాన్యం’లో సామరస్యం
సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది. అస్సాం–నాగాలాండ్ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్ తారాబరి, గజంగ్ రిజర్వ్ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్‌పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది. అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు. అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి. కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు. -
సైయంట్ 5జీ నెట్వర్క్స్ సీవోఈ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్ తాజాగా తమ ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్ అభివృద్ధి చేసిన 5జీ కోర్ ప్లాట్‌ఫామ్.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణలకు పేరొందిన ఐఐటీ–హెచ్ అనుభవం .. సీవోఈకి ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అట్ల తెలిపారు. ఇప్పటికే వివిధ అంశాల్లో సైయంట్‌తో కలిసి పని చేస్తున్నామని, ప్రైవేట్ 5జీ సీవోఈతో ఈ బంధం మరింత బలపడగలదని ఐఐటీ–హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. -
తెలంగాణకు శుభవార్త ! భారీ పెట్టుబడులకు ఆ కంపెనీ గ్రీన్ సిగ్నల్ ?
ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ సెక్టార్లో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతున్న డ్రిల్‌మెక్‌స్పా సంస్థ తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు సై అంది. ఈ మేరకు తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేందుకు డ్రిల్మెక్ స్పా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. ఇటలీకి చెందిన డ్రిల్మెక్ స్పా ఆయిల్ డ్రిలింగ్, రిగ్గింగ్ సెక్టార్ ఎక్విప్మెంట్ తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్రిల్మెక్ స్పా సుమారు రూ 1500 కోట్లు (200 మిలియన్ డాలర్ల) వ్యయంతో తెలంగాణ ఆయిల్ రిగ్ మెషినరీ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 2500ల మంది ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్ స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది. Let’s start this week with a piece of good news Drillmec SpA, Global oil-drilling rig manufacturing giant has decided to setup its manufacturing plant in #Telangana Formal MoU to be signed today 👍 Will be investing $200 MN (₹1,500) & providing employment to 2500 people — KTR (@KTRTRS) January 31, 2022 తెలంగాణలో గోదావరి తీరం వెంట అపారమైన నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గోదావరి వ్యాలీలో ఇప్పటికే ఓఎన్జీసీ పలు మార్లు సర్వేలు కూడా చేపట్టింది. ఇదే సమయంలో పాత భూగర్భ గనుల్లో నుంచి మిథేన్ వంటి గ్యాస్ వెలికితీ అంశంపై ఎప్పటి నుంచో సింగరేణి సంస్థ ప్రయత్నలు చేస్తోంది. డ్రిల్మెక్ స్పా వంటి గ్లోబల్ కంపెనీ తెలంగాణకు రావడం వల్ల నేచురల్ గ్యాస్ సెక్టార్లో తెలంగాణ పురోగతి సాధించే అవకాశం ఉంది. చదవండి: హైదరాబాద్‌లో సూపర్ కంప్యూటర్? రెడీ అయిన అమెరికా కంపెనీ! -
జియో సంచలన నిర్ణయం.. ఏకంగా 6జీపై ఫోకస్!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కు చెందిన జియో ఈస్తోనియా, ఫిన్‌ల్యాండ్ యూనివర్సిటీ ఓలు 6జీ టెక్నాలజీ వి షయంలో సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమ 5జీ సామర్థ్యాలు మరింత పెరగడంతోపాటు, 6జీకి సంబంధించి వినియోగ అవకాశాల అన్వేషణకు వీలు కలుగుతుందని జియో ప్రకటన విడుదల చేసింది. ‘ప్రపంచంలో తొలి 6జీ పరిశోధన కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఓలు యూనివర్సిటీ.. 6జీకి సంబంధించి వైర్లెస్ కమ్యూనికేషన్‌పై దృష్టి సారించింది. జియో ఈస్తోనియా, రిలయన్స్ గ్రూపుతో కలసి పరిశోధనకు ఆసక్తిగా ఉన్నాం’ అని ఓలు యనివర్సిటీ 6జీ ఫ్లాగ్షిప్ ప్రొఫెసర్ మట్టి లాత్వ పేర్కొన్నారు. చదవండి: స్టార్ లింక్‌కు షాక్.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక అడుగు..! -
గుజరాత్ ప్రభుత్వంతో రిలయన్స్ భారీ ఒప్పందం..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గుజరాత్ ప్రభుత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం రోజున జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్- 2022లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా గుజరాత్లో సుమారు రూ. 5.955 లక్షల కోట్లను ఆర్ఐఎల్ ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో గుజరాత్లో 10 లక్షల ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి అవకాశాలను రిలయన్స్ కల్పించనుంది. కర్బన రహిత రాష్ట్రంగా..! ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు భారత్‌ను కర్భన రహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్ కట్టుబడి ఉందని తెలిపింది. అంతేకాకుండా కర్బన రహితంగా రాష్ట్రంగా గుజరాత్‌ను మార్చేందుకుగాను రాష్ట్రంలో 100గిగావాట్ల పునరుత్పాదక శక్తి పవర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ఎకో-సిస్టమ్ రిలయన్స్ అభివృద్ధి చేయనుంది. 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రిలయన్స్ పెట్టనుంది. ఊతమిచ్చేలా..! చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా, పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ క్యాప్టివ్ వినియోగానికి దారితీసే కొత్త సాంకేతికతలను, ఆవిష్కరణలను ఆయా సంస్థలకు ప్రోత్సహం లభిస్తోందని రిలయన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్‌లోని కచ్, బనస్కాంత, ధోలేరాల్లో గిగా ఫ్యాక్టరీల నిర్మాణం కోసం సంబంధించి భూమి కోసం రిలయన్స్ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. కాగా కచ్‌లో 4.5 లక్షల ఎకరాల భూమి కావాలని రిలయన్స్ గుజరాత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మరో రూ. 60 వేల కోట్లు..! న్యూ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్-ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ఏర్పాటు చేసేందుకుగాను రిలయన్స్ గుజరాత్లో మరో రూ. 60,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో సోలార్ పీవీ మాడ్యూల్ ఫ్యాక్టరీ, ఎలక్ట్రోలైజర్, ఇంధన నిల్వ, ఫ్యుయెల్ సెల్స్ కేంద్రాలను ఏర్పాటుచేయనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ప్రస్తుత ప్రాజెక్టుల్లో, కొత్త వెంచర్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. జియో నెట్‌వర్క్‌ను 5జీ అప్‌గ్రేడ్ చేసేందుకుగాను రూ.7,500 కోట్లు, రిలయన్స్ రిటైల్‌లో మరో రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని రిలయన్స్ ప్రతిపాదించింది. చదవండి: Indian Premier League: తెరపైకి మరో ప్లాన్‌తో టాటా..! సానుకూలంగా బీసీసీఐ..! -
AP Police Academy: త్వరలో ‘అప్పా’ విభజన
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఏడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)’ విషయంలో కీలక ముందడుగు పడనుంది. విభజన చట్టం పదో షెడ్యూల్లో ఉన్న ఈ సంస్థ అధికారిక విభజనకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్వరలో ఎంవోయూ కుదరనుంది. దీంతో ఏపీలో పూర్తిస్థాయి పోలీసు అకాడమీ ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం కానుంది. చదవండి: Flipkart CEO: విజనరీ సీఎం.. వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవతో త్వరలో ఎంవోయూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రాష్ట్రాల ఉమ్మడి సంస్థల విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. హోంశాఖకు సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల విభజన ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. తాజాగా పోలీస్ అకాడమీ విభజన అంశాన్ని వేగవంతం చేసింది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లలోపే ఈ సంస్థల విభజన పూర్తి కావాలి. అలా అయితేనే ఆ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీస్ అకాడమీల అదనపు డీజీలు పలు దఫాలుగా చర్చించి సూత్రప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చారు. త్వరలోనే పోలీస్ అకాడమీ విభజన ఒప్పందంపై రెండు రాష్ట్రాల డీజీపీలు సంతకాలు చేసి ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందిని ఏపీ, తెలంగాణ మధ్య 52: 48 నిష్పత్తిలో పంపిణీ చేస్తారు. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఎంవోయూ కాపీని కేంద్ర హోంశాఖకు సమర్పిస్తారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తేనే పోలీస్ అకాడమీ విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తి అవుతుంది. విభజన చట్టం హామీ మేరకు ఏపీలో కొత్తగా పోలీస్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం దాదాపు రూ.500 కోట్ల వరకు నిధులు సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాల భూమిని కేటాయిస్తుంది. ఇప్పటికే పోలీస్ అకాడమీ కోసం భూమిని ప్రాథమికంగా గుర్తించారు. ఎంవోయూ ప్రక్రియ వారం పది రోజుల్లో పూర్తి కాగానే మిగిలిన అంశాలను వేగవంతం చేయాలని హోంశాఖ భావిస్తోంది. ఏడాదిలో పూర్తిస్థాయిలో పోలీస్ అకాడమీని నెలకొల్పనున్నారు. -
అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సవ్యమైన భాష, వ్యాఖ్యలను ప్రోత్సహించడానికి ధేశీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ కూ ఆధ్వర్యంలోని బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు యాప్‌కు చెందిన కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్లైన్లో సురక్షితమైన పరిస్థితులను కల్పించడానికి ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయనున్నాయి. ఆన్లైన్ బెదిరింపులు, అసంబద్ధ ఆరోపణల వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి మరియు పారదర్శకమైన ప్లాట్ఫార్మ్ రూపొందించడానికి ఒప్పందం సహాయపడుతుందని ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సివిల్ ఏవియేషన్ మధ్య కీలక ఒప్పందం
దేశంలోని ప్రీమియం బిజినెస్ ఇన్సిస్టిట్యూట్లలో ఒకటిగా ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్, సివిల్ ఏవియేషన్ శాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ ఉషా పధీ, ఐఎస్బీ డిప్యూటీ డీన్ మిలింద్ సోహానీ ఒప్పంద పత్రాల మీద సంతకం చేశారు. కొత్త సిలబస్ దేశీయంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన ప్రయాణాలను చేరువ చేసే లక్క్ష్యంతో కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రాంతీయ, జిల్లా కేంద్రాలలో ఎయిర్‌పోర్టులు అభివృద్ది చేయనుంది. ఈ రీజనల్ కనెక్టివిటీ పథకం యొక్క ప్రభావం, ప్రయోజనాలు తదితర అంశాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోతైన పరిశోధన చేపట్టి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ నివేదికను ఓ కేస్ స్టడీగా ఇతర విద్యాలయాల్లో, అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్స్టిట్యూట్లలో ఉపయోగించుకుంటామని పౌర విమానయాన శాఖ చెబుతోంది. ట్రాఫిక్ పెరిగింది కోవిడ్ సంక్షోభం తర్వాత టూరిజం, భక్తులు ఎక్కుగా వచ్చే ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ పెరిగినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. -
హైదరాబాద్‌లో మొబైల్ ప్రీమియర్ లీగ్.. కుదిరిన ఒప్పందం
పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు అనేకం ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వరుసలో మొబైల్ ప్రీమియర్ లీగ్ అనే గేమింగ్ కంపెనీ కూడా చేరింది. మొబైల్ ప్రీమియర్ లీగ్ దేశంలోనే ఈ మొబైల్ ఈ స్పోర్ట్, మొబైల్ గేమింగ్ ఫ్లాట్‌ఫార్మ్‌గా మెబైల్ ప్రీమియర్ లీగ్‌కి గుర్తింపు ఉంది. ఈ కంపెనీకి చెందిన యాప్‌లో గేమ్స్ ఆడటం ద్వారా అనేక రివార్డులు, క్యాష్ ప్రైజులు గెలుచుకోవచ్చు. ప్రతీ రోజు వందల కొద్ది గేమ్స్, టోర్నమెంట్స్ అందుబాటులో ఉంటాయి. వేలాది మంది ఈ ఫ్లాట్‌ఫామ్ మీదకు వచ్చి ఈ స్పోర్ట్స్ , గేమ్స్ ఆడుతున్నారు. ఎంపీఎల్‌కి ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. యూఎస్ఏ, చైనీస్ గేమింగ్ కంపెనీలకు ధీటుగా ఎదుగుతోంది. డెవలప్మెంట్ సెంటర్ తాజాగా హైదరాబాద్ నగరంలో గేమింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మొబైల్ ప్రీమియర్ లీగ్ ముందుకు వచ్చింది. 500ల మంది ఉద్యోగులతో అతి త్వరలో ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో మొబైల్ ప్రీమియర్ లీగ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీఎల్ సీఈవో సాయి శ్రీనివాసులు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. Hyderabad | Mobile Premier League, an online gaming platform signed an MoU with Telangana to set up a game development centre on the sidelines of IndiaJoy 2021, which began here on Tuesday It was signed in presence of State Minister of Information Technology, KT Rama Rao pic.twitter.com/6eS7iFpMtx — ANI (@ANI) November 16, 2021 టాస్క్‌తో కూడా తమ స్వంత సెంటర్ ద్వారా గేమ్స్‌ని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో మొబైల్ ప్రీమియర్ లీగ్ కలిసి పని చేస్తుంది. టాస్క్‌లో ఉన్న వారికి ఈ స్పోర్ట్స్, గేమ్ డెవలప్మెంట్, యానిమేషన్ రంగాల్లో అవసరమైన శిక్షణ అందివ్వనుంది. -
మూడు జిల్లాల్లో జూట్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూట్ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ కంపెనీలు అంగీకరించి శుక్రవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో గ్లోస్టర్ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 వేల నాలుగు వందల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు ఐటీ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. కేటీఆర్ మట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు జూట్ పరిశ్రమ లేదని, ఈ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూట్ పరిశ్రమలకు అవసరమైన జనపనార పంట పండించడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ మూడు పరిశ్రమలతోపాటు మరిన్ని యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. జనపనార పంటలకు ప్రోత్సాహం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జనపనార పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని, ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 3.20 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగిందని చెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచే రూ. 49.26 నుంచి రూ. 61.78కి ఒక్కో గన్నీ బ్యాగును సేకరిస్తున్నామని, ట్రాన్స్పోర్ట్ కోసం రూ. 2.36 వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త జూట్ మిల్లుల ఏర్పాటుతో రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు నిధుల ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. గన్నీలతోపాటు కూరగాయల బ్యాగులు, చేసంచులు, ఇతర ఉత్పత్తుల వల్ల మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని సైతం అరికట్టి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని అన్నారు. -
సీఎస్ఐఆర్, ఐఐసీటీల మధ్య పరిశోధన ఒప్పందం
సాక్షి, అమరావతి: స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్(ఎస్ఏఎస్), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, సీఎస్ఐఆర్-ఐఐసీటీల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో నిధుల కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలకు పంపవచ్చని పేర్కొన్నారు. దీంతో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు(ఎఫ్‌డిపిలు), జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు, సింపోజియం, వర్క్‌షాప్‌లు ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీఐటీ-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆసక్తి ఉన్న యువతీ యువకులు పరిశోధనలో రంగంలో ఎదగడానికి ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రాజెక్ట్, పరిశోధన, ఇంటర్న్‌షిప్, సిఓ-ఓపీ, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందించటం జరుగుతుందని చెప్పారు. ఐఐసీటీ సహకారంతో అందించే కోర్సులపై గెస్ట్ లెక్చర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ఎక్స్చేంజి ప్రోగ్రాంలు, ప్రాజెక్టులకు పూర్తి సహకారంతో పాటు ద్వైపాక్షిక కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొనుటకు సహాయపడుతుందని తెలియజేశారు. వీఐటీ-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీ.ఎల్.వీ. శివ కుమార్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.వీ. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ -
వీఎస్బీతో డిజిటల్ స్కాలర్ అవగాహన ఒప్పందం
సాక్షి, అమరావతి : వీఐటీ ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్.. డిజిటల్ స్కాలర్‌తో అవగాహాన ఒప్పందం చేసుకుంది. గురువారం వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. డిజిటల్ స్కాలర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ డిజిటల్ స్కాలర్ అనేది డిజిటల్ మార్కెటింగ్ విద్యను అందించే సంస్థ, డిజిటల్ మార్కెటింగ్ సేవల్లో దిగ్గజమైన ఎకోవీఎమ్ఈ అనుబంధ సంస్థ. ఎకోవీఎంఈ బ్యాంకులు, హోటళ్లు, ఉత్పత్తి తయారీ పరిశ్రమలు, విద్యాసంస్థలకు తన డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తోంది. 2019లో మొట్టమొదటిసారిగా సాంప్రదాయ మార్కెటింగ్ కోసం ఖర్చును మించి డిజిటల్ మార్కెటింగ్‌పై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. దీనికి కారణం వినియోగదారులు ఆన్లైన్ మాధ్యమాలలో ఎక్కువగా ఉన్నారు. సాంకేతిక పురోగతితో సరైన సమయంలో డిజిటల్ పరికరాల్లో వినియోగదారులను చేరుకోవడానికి ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటివి అవసరమైన మార్కెటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి’’ అని అన్నారు. అనంతరం వీఐటీ-ఎపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, డీన్ డా ఎస్. జయవేలు మాట్లాడుతూ.. ‘‘ డిజిటల్ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ బీబీఏ ప్రోగ్రాం ద్వారా డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ఈ ప్రోగ్రాం పరిష్కరిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు ఏకకాలంలో అకాడమిక్, రియల్ టైం నైపుణ్యాలను నేర్చుకోవటం జరుగుతుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత వారికి ధృవీకరణ పత్రం అందించబడుతుంది. బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులు కంటెంట్ మేనేజర్స్, స్ట్రాటజిస్ట్స్, వర్చువల్ రియాలిటీ డెవలపర్స్ అండ్ ఎడిటర్స్, ఎస్ఈఓ, ఎసీఈఎమ్ స్పెషలిస్ట్స్, యూఎక్స్ డిజైనర్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్, డైరెక్టర్స్, ఎనలిస్ట్స్, ఏఐ స్పెషలిస్ట్స్ వంటి ఉద్యోగాలలో ప్రవేశించవచ్చు.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.. సి.ఎల్.వి. శివకుమార్,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఇసుక’ బాధ్యత ఎంఎస్‌టీసీకి..
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయమైన విధానంలో ఇసుక సరఫరా చేసేందుకు సంస్థల ఎంపిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ, ఎంఎస్టీసీ సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఎంఎస్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గణేష్ ఎన్ జయకుమార్, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.హరినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు ప్యాకేజీలుగా విభజన ఇసుక సరఫరాకు సంస్థల ఎంపిక కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరుగా టెండర్లు నిర్వహిస్తారు. మొదటి ప్యాకేజీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలు ఉంటాయి. రెండో ప్యాకేజీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.. మూడో ప్యాకేజీలో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు ఉంటాయి. వాటి పరిధిలో ఇసుక తవ్వకం, రీచ్‌లు/స్టాక్ యార్డుల నిర్వహణ, సరఫరా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ఎంఎస్టీసీ బిడ్లు ఆహ్వానిస్తుంది. సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లు స్వీకరిస్తుంది. ఇలా 2 రకాల బిడ్ల ద్వారా 3 ప్రాంతాలకూ ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎంఎస్‌టీసీపై ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక సరఫరాకు ఈ ఒప్పందం దోహదపడుతుందని, దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీని వెనుక కచ్చితంగా టీడీపీ వాళ్లే ఉన్నారన్నారు. మెరుగైన విధానం తీసుకొచ్చేందుకే.. 2019 ఇసుక పాలసీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్Ð దీనిపై మంత్రుల కమిటీ నియమించారు. కమిటీ పలుమార్లు చర్చించి ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్‌లైన్ ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి నిర్వహణ బాధ్యతను పెద్ద సంస్థలకు అప్పగించాలంటూ పలు సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాత రూపొందించిన ఇసుక పాలసీకి సవరణలను మంత్రివర్గం ఆమోదించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే శాస్త్రీయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు ఆసక్తి ఉన్న ఏ సంస్థ అయినా తమ సంస్థను సంప్రదించి టెండర్లలో పాల్గొనవచ్చని ఎంఎస్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజరు గణేష్ ఎన్ జయకుమార్ సూచించారు. తమ సంస్థ రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లో ఇసుక నిర్వహణకు సంస్థలను ఎంపిక చేసిందని ఆయన వివరించారు. – గణేష్ ఎన్ జయకుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎంఎస్టీసీ -
భారత్ బయోటెక్, సీరంతో కేంద్రం డీల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా అంతానికి వరుసగా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించడం దేశవ్యాప్తంగా భారీ ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేకు చెందిన సీరంతో కేంద్రం త్వరలోనే ఒక ఒప్పందాన్ని చేసుకోనుంది. భారత్ బయోటెక్, సీరం సంస్థలతో వేర్వేరుగా ఒప్పందాలను ఈ వారంలోనే కుదుర్చుకోనున్నామని ఐసీఎంఆర్ తాజాగా ప్రకటించింది. టీకా డోసు ధర ప్రభుత్వానికి రూ.200, ప్రైవేటుగా రూ.1000 చొప్పున డీల్ కుదుర్చుకోనుంది. మరోవైపు ఐసీఎంఆర్ భారత్ బయోటోక్ కోవాగ్జిన్ టీకా సమర్థవంతమైందని ఐసీఎంఆర్ సలహాదారు సునీల్‌గార్గ్ వెల్లడించారు. భారతదేశంలో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరంతో వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మూడు కోట్ల ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ కేర్ వర్కర్లకు ఒక్కో మోతాదుకు 200 రూపాయల చొప్పున 6.6 కోట్ల మోతాదులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. -
లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్
ముంబై, సాక్షి: భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల వినియోగానికి సన్నాహలు చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ కంపెనీలకు ఆర్డర్లు పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల యూఎస్ దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్‌కు యూకే, బెహ్రయిన్, కెనడా అనుమతించగా.. తాజాగా యూఎస్ అదే బాట పట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక దేశీయంగానూ సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ తదితర కంపెనీలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతుల సన్నాహాల్లో ఉన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా డీసీజీఐకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. తద్వారా కోవిడ్-19 కట్టడికి దేశీయంగా ఒక వ్యాక్సిన్ వినియోగం కోసం డీజీసీఐకు దరఖాస్తు చేసిన తొలి దేశీ కంపెనీగా సీరమ్ ఇన్స్టిట్యూట్ నిలవగా.. ఐసీఎంఆర్ సహకారంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై సీరమ్ ఇన్స్టిట్యూట్ దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై మరోపక్క యూకే, బ్రెజిల్‌లోనూ తుది దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!) ఎంవోయూ కోవిడ్-19 కట్టడికి వినియోగించనున్న వ్యాక్సిన్ల సరఫరా, పంపిణీలకు వీలుగా గురువారం దేశీ కంపెనీలు స్పైస్‌జెట్, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తద్వారా చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వ్యాక్సిన్ల సరఫరాకు శీతలీకరణ సౌకర్యాలతో కూడిన ఎయిర్ కనెక్టివిటీ సర్వీసులు అందించనుంది. వీటికి జతగా లాజిస్టిక్స్ కంపెనీ స్నోమ్యాన్ భూమిమీద శీతల గిడ్డంగులు, ప్యాకింగ్, స్టోరేజీ, పంపిణీ తదితర సేవలు అందించనుంది. వెరసి ఎండ్టు ఎండ్ సర్వీసులు అందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం స్పైస్‌జెట్, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ షేర్లు బలపడిన విషయం విదితమే. ఈ బాటలో మరోసారి స్పైస్‌జెట్ షేరు 3 శాతం పుంజుకుని రూ. 103కు చేరగా.. తాజాగా లాజిస్టిక్స్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. పలు కౌంటర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. (దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి) షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నవకార్ కార్పొరేషన్ 10 శాతం దూసుకెళ్లి రూ. 42.95కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఆల్కార్గో లాజిస్టిక్స్ 4 శాతం ఎగసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 155 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వరుసగా రెండో రోజు స్నోమ్యాన్ లాజిస్టిక్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 65 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 70 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. ఈ బాటలో మహీంద్రా లాజిస్టిక్స్ 5 శాతం పెరిగి రూ. 410 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 428 వరకూ ఎగసింది. ఇదేవిధంగా సికాల్ లాజిస్టిక్స్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 18.30 వద్ద, పటేల్ ఇంటిగ్రేటెడ్ 10 శాతం వృద్ధితో రూ. 31.25 వద్ద ఫ్రీజయ్యాయి. ఇతర కౌంటర్లలో గతి, వీఆర్ఎల్ లాజిస్టిక్స్ సైతం ప్రస్తావించదగ్గ లాభాలతో కదులుతున్నాయి. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. బుధవారం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది. అనంతరం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోవటం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సమగ్ర సర్వే చేస్తుందని, దేశంలో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని వెల్లడించారు. ఆ టైటిల్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెబుతున్నామని తెలిపారు. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభించండతోపాటు టైటిల్ ఖరారు చేస్తుందన్నారు. ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన వందేళ్ల తర్వాత ఈ సర్వే వందేళ్ల తర్వాత జరుగుతోందని, ఈ వందేళ్లలో సబ్డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదుకాని పరిస్థితి ఉందన్నారు. వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కించి, రాళ్లు కూడా వేస్తామని చెప్పారు. తర్వాత యూనిక్ ఐడెంటింటీ నంబర్‌తో కార్డు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే కార్డులో క్యూర్ఆర్ కోడ్ ఉంటుందని, హార్డ్‌కాపీ కూడా ఇస్తారని సీఎం జగన్ తెలిపారు. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతామని, రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తామని పేర్కొన్నారు. విలేజ్ హాబిటేషన్స్, టైన్స్కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని తెలిపారు. చదవండి: ఏలూరు బాధితులకు సీఎం జగన్ బాసట అన్ని సేవలు ఒకచోటే రిజిస్ట్రేషన్, రెవిన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇంటిగ్రేటెడ్ రెవిన్యూ సర్వీసులు, రిజిస్ట్రేషన్‌తో పాటు అందుబాటలోకి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎక్కడా కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే ఎప్పుడూ జరగలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తీరిపోతాయని తెలిపారు. భూ వివాదాలు సమసిపోయి గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని, న్యాయమైన చట్టబద్ధమైన హక్కలు లభిస్తాయని సీఎం జగన్ తెలిపారు. కుటుంబాలు, వారి వారసులకు మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. బృహత్తర కార్యక్రమం ఇలా మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నామని, సర్వే ఆఫ్ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగం అవుతాయని వెల్లడించారు. కచ్చితమైన కొలతలు ఉంటాయని, ఎర్రర్ అత్యంత సూక్ష్మ స్థాయిలో రెండు సెంటీ మీటర్లకు అటు ఇటుగా ఉంటుందని అన్నారు. అత్యాధునిక సదుపాయాలు, కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతుమని చెప్పారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేస్తున్నారని తెలిపారు. 5వేల రెవిన్యూ గ్రామాల్లో ఈ సర్వే మొదటి విడత డిసెంబర్ 21న ప్రారంభమై.. జులై 2021 వరకూ కొనసాగుతుందన్నారు. ఆగస్టు 2021 నుంచి 6500 రెవిన్యూ గ్రామాల్లో రెండో విడత ప్రారంభమై.. 2022 ఏప్రిల్ వరకూ కొనసాగుతుందని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగి అప్పటితో సర్వే పూర్తవుతుందన్నారు. మొదటి విడత పూర్తైన తర్వాత రెండో విడత ప్రారంభం అయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాలను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివాదాలు పరిష్కరించడానికి అదే సమయంలో మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది నియామకం అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామని, అందుకోసం 14వేల సర్వేయర్లును ప్రభుత్వం నియమించిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీళ్లు ఉంటారని, వీరందరికీ కూడా శిక్షణ జరుగుతోందన్నారు. 9400 మంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. జనవరి 26 వరకు మిగిలిన వారికి ట్రైనింగ్ పూర్తవుతుందని తెలిపారు. కలెక్టర్లు-బాధ్యత వీటన్నింటినీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ట్యాండ్ టైటిలింగ్ అథారిటీని రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, సర్వే సన్నద్దతపై కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్ ఏర్పాటు సాగాలన్నారు. అప్పిలేట్ ట్రైబ్యునల్స్‌ను కూడా రిటైర్డ్ న్యాయమూర్తులతో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిని వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు. డ్రోన్స్ ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఒక డ్రోన్ టీం, డాటా ప్రాససింగ్, రీ సర్వే టీంల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. ప్రజల్లో అవగాహన కలిగించాలి సర్వే వల్ల జరిగే మంచి ఏంటి ఏమిటి? లాభాలు ఏంటన్న దానిపై ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. పూర్తిగా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయండని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభం అయ్యిందని, దాన్ని సమర్థవంతంగా చేసేలా చూడాలని, డిసెంబర్ 14 నుంచి 19 వరకూ గ్రామ సభలు కూడా నిర్వహించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. వారికి కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న బాధతో ఎల్లోమీడియా సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, సమర్థవంతంగా ముందుకు సాగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరిష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సర్వే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్వే చేపట్టడం తొలిసారని చెప్పారు. ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐదు నిమిషాల్లోనే కొలిచి ల్యాండు రికార్డులు వస్తాయని తెలిపారు. 2–3 సెంటీమీటర్ల అటు ఇటుగా కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. సమగ్ర సర్వే అన్నది దార్శనికతతో కూడిన కార్యక్రమం అని తెలిపారు. ప్రపంచంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, వందేళ్ల తర్వాత మళ్లీ ప్రస్తుతం సమగ్ర సర్వే జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో పాటు, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. -
భారత్-బంగ్లా మధ్య వ్యాక్సిన్ డీల్
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్ డీల్ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ మేరకు భారత్, బంగ్లాదేశ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. సీరం ఇన్స్టిట్యూట్, బ్రిటీస్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మూడు కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మహమ్మారి సమయంలో అన్ని దేశాలు కలసికట్టుగా పొరాటం చేయలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఆయన పొరుగు దేశాలకు సాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. (చదవండి: 2 డోసుల వ్యాక్సిన్ రూ. 1,000కే!) ఈ మేరకు భారత బంగ్లాదేశ్ హైకమిషనర్ విక్రమ్ దోరైస్వామి బంగ్లాదేశ్‌తో లోతైన సంబంధం ఏర్పర్చుకోవడంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది అంటూ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ జాహిద్ మాలెక్ మాట్లాడుతూ.. ‘సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అన్ని అనుమతులు పొందిన తర్వాత మొదటి దశలో భాగంగా మూడు కోట్ల డోసులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఢాకాలో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అన్నారు. ఇక ప్రస్తుతం భారత్‌లో అభివృద్ధి చేస్తోన్న ఐదు కరోనా వైరస్ వ్యాక్సిన్లలో నాలుగు ఫేజ్ 2/3లో ఉండగా.. ఒకటి 1/2 దశలో ఉంది. బంగ్లాదేశ్ కాకుండా మయన్మార్, ఖతార్, భూటాన్ స్విట్జర్లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రియా, దక్షిణ కొరియా దేశాలు మన వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని.. వినియోగించాలని భావిస్తున్నాయి. -
ఇక అమెజాన్‌లో సిల్క్ మార్క్ చీరలు
ప్యూర్ సిల్క్ ప్రొడక్టులను వినియోగదారులకు అందించేందుకు వీలుగా దేశీ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్(SMOI)తో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా పేర్కొంది. తద్వారా సిల్క్ మార్క్ లేబుళ్లతో కూడిన ప్రొడక్టుల విక్రయానికి ప్రత్యేకించిన సిల్క్ మార్క్ స్టోర్ ను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. సిల్క్ ఆర్గనైజేషన్‌లో నమోదైన వివిధ చేనేత, తదితర కళాకారులకు చెందిన పలు ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. దేశవ్యాప్తంగా సిల్క్ మార్క్ ను వినియోగించేందుకు 4,200 మది కళాకారులు అర్హత కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తొలి దశలో ఎంవోయూలో భాగంగా తొలి దశలో 100 శాతం ప్యూర్ సిల్క్ తో తయారైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్ కమీజ్ సెట్స్, జాకెట్లు, షర్టులు తదితర 3,000 ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా అమెజాన్ కారిగర్, అమెజాన్ ఇండియా బజార్ స్టోర్ల ద్వారా ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను అమెజాన్ విక్రయించనున్నట్లు కేంద్ర సిల్క్ బోర్డ్ సీఈవో రంజన్ ఖాండియర్ పేర్కొన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ప్యూర్ సిల్క్ లేబుళ్లుగల ప్రొడక్టులను ప్రజలకు అందించే వీలున్నదని తెలియజేశారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అమెజాన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. కేంద్ర సిల్క్ బోర్డు ద్వారా జారీ అయ్యే సిల్క్ మార్క్ సర్టిఫికేషన్‌లో భాగంగా హాలోగ్రామ్, ప్రత్యేక నంబరుతో ఈ ప్రొడక్టులు లభిస్తాయని తెలియజేశారు. కాగా.. SMOI ద్వారా ఉత్పత్తులను విక్రయించేవారికి మార్కెటింగ్, సేల్స్ సపోర్ట్, సాంకేతిక శిక్షణ తదితర అంశాలలో మద్దతు లభిస్తుందని అమెజాన్ వివరించింది. -
సీఎం జగన్ ఆ మాటే నా 'ఇకిగయ్': గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుతోనే మంత్రిగా తనకు సార్థకత అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. బుధవారం రోజున టెక్ మహీంద్రా ఫౌండేషన్, బయోకాన్ లిమిటెడ్, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి మేకపాటి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్య, వైద్య, నైపుణ్య రంగంలో వసతుల కల్పనలో సీఎం రాజీపడరు. మనిషిని మనీషిగా మార్చేది చదువు అని నమ్మిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఈ మధ్య తీరిక చేసుకుని జీవితకాల సంతోషమయ జీవితానికి రహస్యం 'ఇకిగయ్' అనే జపనీస్ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు కారణం అనేది పుస్తకంలోని అంతరార్థం. ముఖ్యమంత్రి నిర్దేశించిన స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే నా 'ఇకిగయ్'. (రాష్ట్రంలో బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) నైపుణ్యరంగ పోటీలో మన రాష్ట్రం ప్రత్యేకం. సముద్రమంత లక్ష్యంలో నాతో పాటు నావలో ప్రయాణిస్తున్న నైపుణ్యశాఖ అధికారుల కృషి మాటల్లో చెప్పలేనిది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు. విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. లైఫ్ సైన్సెస్ డొమైన్లో నాలెడ్జ్ పార్టనర్‌గా బయోకాన్ వ్యవహరించనుంది. 12 స్కిల్ కాలేజీల్లో ఆటోమేషన్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెక్టార్లో స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారం తెలిపింది' అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఎంవోయూ కార్యక్రమానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐ.టీ శాఖ సలహాదారు విద్యాసాగర్ రెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ ఎంఎం నాయక్, సీడాప్ సీఈవో ఎం మహేశ్వర్‌రెడ్డి, న్యాక్ అడిషనల్ డీజీ కెవి నాగరాజ, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి. హనుమనాయక్, డాక్టర్ బి. నాగేశ్వరరావు, ప్రొఫెసర్ డి.వి. రామకోటిరెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. (కైనటిక్ గ్రీన్ ప్రతినిధులతో మేకపాటి భేటీ)