బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ కంపెనీలు తాజాగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి ఎంఓయూపై సంతకం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024 సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది.
బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ సంస్థలు భారతదేశంలో తక్కువ కార్బన్ రసాయనాల ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏఎమ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ అమ్మోనియాను సంవత్సరానికి 1,00,000 టన్నులు సేకరించనున్నారు.
ఈ అమ్మోనియా రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టివ్‌లో నిర్వచించినట్లుగా నాన్ బయోలాజికల్ ఆరిజన్ పునరుత్పాదక ఇంధనాల కోసం ఈయూ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఏఎమ్ గ్రీన్‌కు సంబంధించిన కొన్ని సౌకర్యాలు ఇప్పటికే దీనికి సంబంధించిన ద్రువీకరణను పొందాయి. మరికొన్ని సౌకర్యాల కోసం ప్రీ-సర్టిఫికేషన్ కూడా జరుగుతోంది.
మా సంస్థలు స్థిరమైన పరివర్తనకు కట్టుబడి ఉంటాయి. మా భాగస్వామి ఏఎం గ్రీన్‌తో కలిసి తక్కువ కార్బన్ రసాయన ఉత్పత్తిని అన్వేషించడానికి భారతదేశం సరైన ప్రదేశమని మేము విశ్వసిస్తున్నామని బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్ అన్నారు.
ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ.. పరిశ్రమలో గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ప్రోత్సహించడానికి బీఎస్ఏఎఫ్ వంటి గ్లోబల్ కెమికల్ లీడర్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఇది అనుబంధ వినియోగదారు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment