Ammonia
-
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
జత కలిసిన బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్: లక్ష్యం ఇదే..
బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ కంపెనీలు తాజాగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి ఎంఓయూపై సంతకం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024 సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది.బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ సంస్థలు భారతదేశంలో తక్కువ కార్బన్ రసాయనాల ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏఎమ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ అమ్మోనియాను సంవత్సరానికి 1,00,000 టన్నులు సేకరించనున్నారు.ఈ అమ్మోనియా రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టివ్‌లో నిర్వచించినట్లుగా నాన్ బయోలాజికల్ ఆరిజన్ పునరుత్పాదక ఇంధనాల కోసం ఈయూ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఏఎమ్ గ్రీన్‌కు సంబంధించిన కొన్ని సౌకర్యాలు ఇప్పటికే దీనికి సంబంధించిన ద్రువీకరణను పొందాయి. మరికొన్ని సౌకర్యాల కోసం ప్రీ-సర్టిఫికేషన్ కూడా జరుగుతోంది.మా సంస్థలు స్థిరమైన పరివర్తనకు కట్టుబడి ఉంటాయి. మా భాగస్వామి ఏఎం గ్రీన్‌తో కలిసి తక్కువ కార్బన్ రసాయన ఉత్పత్తిని అన్వేషించడానికి భారతదేశం సరైన ప్రదేశమని మేము విశ్వసిస్తున్నామని బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్ అన్నారు.ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ.. పరిశ్రమలో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రోత్సహించడానికి బీఎస్ఏఎఫ్ వంటి గ్లోబల్ కెమికల్ లీడర్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఇది అనుబంధ వినియోగదారు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. -
ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా
ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా కోసం ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఏఎంజీ), ఆర్‌డబ్ల్యూఈ సప్లై అండ్ ట్రేడింగ్ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. మొత్తం సరఫరాలో 50 వేల టన్నుల అమ్మోనియాను కాకినాడ ప్లాంట్ నుంచి, మిగతా టుటికోరిన్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయబోతున్నట్లు ఏఎం గ్రీన్ అమ్మోనియా తెలిపింది.ఏఎంజీ సంస్థ సౌర, పవన, జలవిద్యుత్ శక్తిని ఉపయోగిస్తూ అమ్మోనియాను తయారు చేస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టివ్ (రెడ్ III) నిబంధనలకు లోబడి రెన్యూవబుల్ ఫ్యుయెల్స్ ఆఫ్ నాన్ బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్బీఓ) నియమాల ప్రకారం గ్రీన్ అమ్మోనియాను తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాకినాడలోని ఏఎంజీ ప్లాంట్ ఇప్పటికే ఆర్ఎఫ్ఎన్బీఓ ధ్రువీకరణ పొందినట్లు పేర్కొంది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడిఈ సందర్భంగా ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘అమ్మోనియా తయారీలో పునరుత్పాదక ఇందనాన్ని వాడుతున్నాం. ఇందుకోసం ఆర్‌డబ్ల్యూఈ సంస్థతో జతకట్డడం సంతోషంగా ఉంది. ఎనర్జీ ట్రేడింగ్‌లోనూ కంపెనీకి అవకాశం లభించినట్లయింది’ అని అన్నారు. కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ ఉత్పత్తులు తయారు చేయాలనుకునే సంస్థలకు మద్దతుగా నిలవడానికి ఆర్‌డబ్ల్యూఈ ముందుంటుందని కంపెనీ ఇంటర్నేషనల్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ కోస్టాస్ పాపమాంటెల్లోస్ తెలిపారు. -
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో సంస్థ నార్వేకు చెందిన యారా క్లీన్ అమ్మోనియా పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మోనియా పంపిణీదారుగా ఉన్న యారాక్లీన్ కంపెనీకు గ్రీన్కో పునరుత్పాదక అమ్మోనియాను సరఫరా చేయనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గ్రీన్కో సంస్థ అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఏఎం గ్రీన్ విభాగం పర్యవేక్షిస్తుంది. దాంతో టర్మ్‌షీట్‌పై ఏఎంగ్రీన్ సంతకం చేసింది.ఈ ఒప్పందంతో ఏంఎంగ్రీన్ ఫేజ్1 కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక అమ్మోనియా దాదాపు 50 శాతం యారాక్లీన్కే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ 2027 నాటికి 24 గంటలు కార్బన్ లేని కారకాల నుంచి అమ్మోనియాను తయారుచేయనుంది. ఏఎంగ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘యారా క్లీన్ సంస్థ ఎరువుల తయారీ కంపెనీలకు, షిప్పింగ్, పవర్ ఇండస్ట్రీస్, ఇతర పరిశ్రమలకు పునరుత్పాదక అమ్మోనియా సరఫరా చేస్తోంది. అందులో గ్రీన్కో భాగమవ్వడం సంతోషకరం’ అని అన్నారు.యారా క్లీన్ అమ్మోనియా సీఈఓ హన్స్ ఒలావ్ రేన్ మాట్లాడుతూ..‘ఏఎంగ్రీన్ కాకినాడ ప్రాజెక్ట్‌లో తయారుచేస్తున్న పునరుత్పాదక అమ్మోనియాతో కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్ ఎనర్జీలో ఉద్గారాలను తగ్గించడం, షిప్పింగ్ ఇంధనం, పవర్ పరిశ్రమల్లో హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ఈ క్లీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. -
ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!
ఎరువుగా ఉపయోగించే అమోనియాను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే పద్ధతి మొదలైంది. అమెరికాలోని బ్రూక్లిన్కు చెందిన ‘అమోగీ’ సంస్థ ఇదివరకే అమోనియాతో నడిచే ట్రక్కు, ట్రాక్టర్లను విజయవంతంగా రూపొందించింది. ఇటీవల అమోనియా ఇంధనంగా నడిచే ఓడను కూడా ఈ సంస్థ రూపొందించింది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! నార్వేకు చెందిన ‘యారా క్లీన్ అమోనియా’ సంస్థ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘గ్రీన్ అమోనియా’ను వాడుకుని నడిచే వాహనాలను ‘అమోగీ’ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పూర్తిగా అమోనియానే ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే ఓడను రూపొందించింది. అమోనియాను ఇంధనంగా ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పూర్తిగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగానికి తగిన వెసులుబాటు లేని ప్రాంతాల్లో అమోనియాతో నడిచే వాహనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కుప్పకూలిన అమ్మోనియం ప్లాంట్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఎరువుల కర్మాగారంలో నిర్మాణంలో ఉన్న అమ్మోనియా ప్లాంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద ఇంకా కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటిప్స్
దుమ్ముకొట్టుకుపోయిన ఉడెన్ ఫర్నీచర్‌ను శుభ్రపరచాలంటే అమ్మోనియా ద్రావకం కలిపిన నీటిని మెత్తని క్లాత్‌తో అద్దుకొని, తుడవాలి. నాన్జెల్ టూత్‌పేస్ట్, బేకింగ్ సొడా రాసి తడి క్లాత్‌తో రబ్ చేస్తే ఉడెన్ ఫర్నీచర్ పై మరకలు తొలగిపోతాయి. మరకలపై వంట నూనె, ఉప్పు రాసి పదిహేను నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో రబ్ చేసినా ఫర్నీచర్ పాలిష్చేసినట్టు కొత్తగా మెరుస్తుంది. ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడిని వేసి టేబుల్, అల్మారా సొరుగులు, కబోర్డ్స్ లోపల ఒక రాత్రంతా ఉంచితే, దుర్వాసన తగ్గుతుంది.యాంటిక్ ఫర్నీచర్ మీద మరకలు, దుమ్ము పోవాలంటే ముందుగా హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించాలి. డస్ట్ అంతా పోయిన తర్వాత నాన్జెల్ టూత్‌పేస్ట్‌ను రాసి, తడి క్లాత్‌తో తుడవాలి. -
రామగుండం యూరియా ప్లాంటుకు పూర్వవైభవం
న్యూఢిల్లీ: యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే చర్యలను కేంద్రం చేపట్టింది. మూతపడిన ప్రభుత్వ రంగ యూరియా కర్మాగారాల పునరుద్ధరణకు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. రామగుండం, తాల్చేర్‌లలో మూతపడిన యూరియా ప్లాంట్లను రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించే ప్రతిపాదనలను గత వందరోజుల్లో ఆమోదించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. సింద్రిలోని మరో మూతపడిన ప్లాంటు పునరుద్ధరణ యత్నాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (బీవీఎఫ్సీఎల్) ప్రాంగణంలో యూరియా - అమోనియా ప్లాంటును కొత్తగా నిర్మించే యత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం గత దశాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క ఎరువుల ప్లాంటును కూడా నిర్మించలేదని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసేందుకు జగదీశ్‌పూర్-హల్దియా గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణంపై పెట్రోలియం మంత్రితో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని అనంత్‌కుమార్ వెల్లడించారు. -
టపాసుల మోతతో పెరిగిన వాయు కాలుష్యం
సాక్షి, సిటీబ్యూరో : దీపావళి మతాబులు నగర పర్యావరణానికి పొగబెట్టాయి. పీల్చే గాలిలో అసలు ఉండకూడని అమ్మోనియా మోతాదు శ్రుతి మించింది. నగరంలోని ప్రతి క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములు దాటకూడని కాలుష్య కారక ధూళికణాలూ అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా నగరవాసుల్లో శ్వాసకోశ భాగాలన్నింటినీ అమ్మోనియా ఇబ్బందులు కలిగించింది. శ్వాసకోశాలను ఉక్కిరి బిక్కిరి చేసింది. సిటీజన్ల కళ్లను తీవ్రంగా మండించింది. పలు శ్వాసకోశ వ్యాధులకు కారణమైంది. కాగా క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని అమ్మోనియా అత్యధికంగా జూపార్క్‌లో 175, ఉప్పల్‌లో 120, జీడిమెట్లలో 101 మైక్రోగ్రాములుగా నమోదవడం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు పలు ప్రాంతాల్లోని పీల్చే గాలిలో ధూళికణాలు (పీఎం10), సూక్ష్మ ధూళి రేణువులు (టీఎస్‌పీఎం) మోతాదు కూడా పరిమితి మించి పెరిగింది. వీటితోపాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి మూలకాల మోతాదు కూడా భారీగా పెరగడంతో ముక్కుపుటాలు అదిరిపోయాయి. సిటీజన్ల కళ్లు, ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అబిడ్స్, పంజగుట్ట, కేబీఆర్పార్క్, చిక్కడపల్లి, కూకట్పల్లి, లంగర్‌హౌస్, మాదాపూర్, ఎంజీబీఎస్, నాచారం, రాజేంద్రనగర్, సైనిక్‌పురి, శామీర్‌పేట్, ప్యారడైజ్, చార్మినార్, జూపార్క్, బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల.. తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత అత్యధికంగా నమోదైనట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కతేల్చింది. ఆయా ప్రాంతాల్లో దీపావళికి ముందు, పండుగ రోజు వాయు కాలుష్యాన్ని లెక్కించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలను మించి వాయు కాలుష్యం నమోదు కావడం పట్ల పర్యావరణ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వాయుకాలుష్యం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడం గమనార్హం. అమ్మోనియా మోతాదు మించిన వివిధ ప్రాంతాలివీ... (క్యూబిక్ మీటరు గాలికి మైక్రోగ్రాముల్లో..) ప్రాంతం అమ్మోనియా మోతాదు ప్యారడైజ్ 71 చార్మినార్ 74 జూపార్క్ 175 బాలానగర్ 84 ఉప్పల్ 120 జూబ్లీహిల్స్ 64 జీడిమెట్ల 101 -
జూబ్లీహిల్స్, చార్మినార్‌లలో అమ్మోనియా అధికంగా నమోదు
సనత్‌నగర్, న్యూస్‌లైన్: నగర కాలుష్యంలో ‘అమ్మోనియా’ చేరడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డై ఆక్సైడ్స్, పీఎం 10 అత్యధిక మోతాదులో నమోదవుతూ వస్తుండగా... ఇప్పుడు అమ్మోనియా మోతాదు మించడం ఆందోళన కలిగిస్తోంది. మనిషి జీవక్రియకు కొంత మోతాదులో అమ్మోనియా అవసరమే. కానీ మోతాదు మించితే మానవ ఆరోగ్యం, మొక్కల ఎదుగుదలపై తీవ్ర దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో అమ్మోనియా మోతాదు వార్షిక సరాసరి క్యూబిక్ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు (100 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు)గా ఉండాలి. కానీ నగరంలో అంతకుమించిన స్థాయిలో అమ్మోనియా వెలువడుతుందని, ఇది ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంద ని పీసీబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది వార్షిక సరాసరిని పరిశీలిస్తే జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 123 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు గా నమోదు కావడం విశేషం. ఆ తరువాత స్థానాల్లో చార్మినార్ 120, ఉప్పల్ 118గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జూపార్కు, జీడిమెట్ల ప్రాంతాల్లో సైతం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ స్థాయిలో అమ్మోనియా విడుదలైనట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుదలకు కారణాలివే... అమ్మోనియా ఉద్గారాలు పారిశ్రామికవాడల నుంచి అధికంగా విడుదలవుతున్నట్లు పీసీబీ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, ప్లాస్టిక్, పేలుడు పదార్థాలు, వస్త్రాలు, కెమికల్, రంగులు తయారీ పరిశ్రమల్లో విచ్చలవిడిగా అమ్మోనియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆయా ఉత్పత్తులు ఉత్పత్తి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో అమ్మోనియా వాయువులు గాలిలోకి విడుదలవుతుంటాయి. ఒక్కోసారి అధిక వేడికి అమ్మోనియా కంటైనర్లు పేలిపోతుంటాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతంలో నివసించేవారి ఆరోగ్యంపై పెనుప్రభావం పడుతోంది. పాతకాలం నాటి రిఫ్రిజిరేటర్లు, ఐస్ తయారీ కేంద్రాలు, డ్రైక్లీనర్స్ ద్వారా అమ్మోనియా వెలువడుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయా చోట్ల కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అమ్మోనియా ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలే కారణం పరిశ్రమల ద్వారా అమ్మోనియా ఎక్కువగా విడుదలయ్యే అ వకాశం ఉంది. ఇది జనావాసాల్లో సైతం ఎక్కువగా ఉంటుం దంటే డ్రైక్లీనింగ్ల వాడకం అధికంగా ఉండడమో లేక సమీప పరిశ్రమల నుంచి విడుదలైన అమ్మోనియా ఆయా ప్రాంతాలకు వ్యాపించడమో జరగాలి. దీన్ని ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం భారంగా ఉంటుంది. ఆక్సిజన్ సైతం సరైన మోతాదులో అందదు. - వీరన్న, పీసీబీ సైంటిస్ట్ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అమ్మోనియా ఎక్కువగా పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అమ్మోనియా శాతం ఎక్కువగా ఉంటే కళ్లు, గొంతు, చర్మం మంటలు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. - డాక్టర్ పద్మజ, అమీర్‌పేట్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారిణి మోతాదు మించితే దుష్ర్పభావాలెన్నో... నిర్దేశిత ప్రమాణాలకు మించి అదనంగా ఒక గ్రాము/క్యూబిక్ మీటరు విడుదలైనా ఇబ్బందే అధిక మోతాదులో అమ్మోనియాను పీలిస్తే శ్వాస భారమవుతుంది. చర్మం, కళ్లు మంటలు పుడతాయి. ముక్కు, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేహంలోని మాంసకృత్తులను విచ్ఛిన్నం చేస్తాయి. అమ్మోనియా హైడ్రాక్సైడ్ మానవ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.అమ్మోనియాను ఎక్కువగా పీలిస్తే కడుపు మంట కూడా ఉంటుంది. మొక్కల ఎదుగుదలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది గాలి కంటే బరువైంది. ఏ ప్రాంతంలోనైనా దీని ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. బరువుగా ఉంటున్నందున ఊపిరితిత్తులపై భారం అధికంగా ఉంటుంది. ఈ వాసన పీల్చిన వారిలో చిరాకు ఎక్కువగా ఉంటుంది.