ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా కోసం ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఏఎంజీ), ఆర్‌డబ్ల్యూఈ సప్లై అండ్ ట్రేడింగ్ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. మొత్తం సరఫరాలో 50 వేల టన్నుల అమ్మోనియాను కాకినాడ ప్లాంట్ నుంచి, మిగతా టుటికోరిన్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయబోతున్నట్లు ఏఎం గ్రీన్ అమ్మోనియా తెలిపింది.
ఏఎంజీ సంస్థ సౌర, పవన, జలవిద్యుత్ శక్తిని ఉపయోగిస్తూ అమ్మోనియాను తయారు చేస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టివ్ (రెడ్ III) నిబంధనలకు లోబడి రెన్యూవబుల్ ఫ్యుయెల్స్ ఆఫ్ నాన్ బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్‌ఎఫ్‌ఎన్‌బీఓ) నియమాల ప్రకారం గ్రీన్ అమ్మోనియాను తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాకినాడలోని ఏఎంజీ ప్లాంట్ ఇప్పటికే ఆర్‌ఎఫ్‌ఎన్‌బీఓ ధ్రువీకరణ పొందినట్లు పేర్కొంది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘అమ్మోనియా తయారీలో పునరుత్పాదక ఇందనాన్ని వాడుతున్నాం. ఇందుకోసం ఆర్‌డబ్ల్యూఈ సంస్థతో జతకట్డడం సంతోషంగా ఉంది. ఎనర్జీ ట్రేడింగ్‌లోనూ కంపెనీకి అవకాశం లభించినట్లయింది’ అని అన్నారు. కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ ఉత్పత్తులు తయారు చేయాలనుకునే సంస్థలకు మద్దతుగా నిలవడానికి ఆర్‌డబ్ల్యూఈ ముందుంటుందని కంపెనీ ఇంటర్నేషనల్ హైడ్రోజన్ ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ కోస్టాస్ పాపమాంటెల్లోస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment