ఎరువుగా ఉపయోగించే అమోనియాను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే పద్ధతి మొదలైంది. అమెరికాలోని బ్రూక్లిన్‌కు చెందిన ‘అమోగీ’ సంస్థ ఇదివరకే అమోనియాతో నడిచే ట్రక్కు, ట్రాక్టర్లను విజయవంతంగా రూపొందించింది. ఇటీవల అమోనియా ఇంధనంగా నడిచే ఓడను కూడా ఈ సంస్థ రూపొందించింది.
ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు!
నార్వేకు చెందిన ‘యారా క్లీన్ అమోనియా’ సంస్థ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘గ్రీన్ అమోనియా’ను వాడుకుని నడిచే వాహనాలను ‘అమోగీ’ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పూర్తిగా అమోనియానే ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే ఓడను రూపొందించింది. అమోనియాను ఇంధనంగా ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పూర్తిగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగానికి తగిన వెసులుబాటు లేని ప్రాంతాల్లో అమోనియాతో నడిచే వాహనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment