మనిషి జీవితంలో గురువు పాత్ర అమోఘమైనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి కూడా. అయితే ప్రపంచంలోని మొట్టమొదటగా పాఠశాల ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్‌గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. 551 బీసీలో చైనాలో జన్మించిన తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక ప్రైవేట్ ట్యూటర్‌గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ, కన్ఫ్యూషియస్‌ను కూడా అదేవిధంగా భావిస్తారు. కన్ఫ్యూషియన్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే కన్ఫ్యూషియస్ విద్య అనేది అందరికీ చేరాలని కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్‌గా మారి, అందరికీ విద్యను బోధించడం ప్రారంభించారు.
3,000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులో రెండు రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్చించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. ఐదేళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16-17 ఏళ్లు వచ్చేవరకూ విద్యను బోధించేవారు.
Comments
Please login to add a commentAdd a comment