హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సంస్థ నార్వేకు చెందిన యారా క్లీన్ అమ్మోనియా పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మోనియా పంపిణీదారుగా ఉన్న యారాక్లీన్ కంపెనీకు గ్రీన్‌కో పునరుత్పాదక అమ్మోనియాను సరఫరా చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గ్రీన్‌కో సంస్థ అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఏఎం గ్రీన్ విభాగం పర్యవేక్షిస్తుంది. దాంతో టర్మ్‌షీట్‌పై ఏఎంగ్రీన్ సంతకం చేసింది.
ఈ ఒప్పందంతో ఏంఎంగ్రీన్ ఫేజ్1 కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక అమ్మోనియా దాదాపు 50 శాతం యారాక్లీన్‌కే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ 2027 నాటికి 24 గంటలు కార్బన్ లేని కారకాల నుంచి అమ్మోనియాను తయారుచేయనుంది. ఏఎంగ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘యారా క్లీన్ సంస్థ ఎరువుల తయారీ కంపెనీలకు, షిప్పింగ్, పవర్ ఇండస్ట్రీస్, ఇతర పరిశ్రమలకు పునరుత్పాదక అమ్మోనియా సరఫరా చేస్తోంది. అందులో గ్రీన్‌కో భాగమవ్వడం సంతోషకరం’ అని అన్నారు.
యారా క్లీన్ అమ్మోనియా సీఈఓ హన్స్ ఒలావ్ రేన్ మాట్లాడుతూ..‘ఏఎంగ్రీన్ కాకినాడ ప్రాజెక్ట్‌లో తయారుచేస్తున్న పునరుత్పాదక అమ్మోనియాతో కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్ ఎనర్జీలో ఉద్గారాలను తగ్గించడం, షిప్పింగ్ ఇంధనం, పవర్ పరిశ్రమల్లో హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ఈ క్లీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment