సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఎరువుల కర్మాగారంలో నిర్మాణంలో ఉన్న అమ్మోనియా ప్లాంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద ఇంకా కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment