Ramgundam
-
కాసేపట్లో రామగుండం కు చేరుకోనున్న ప్రధాని మోదీ
-
ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా రామగుండంలో భారీ ఏర్పాట్లు
-
రోడ్డు ప్రమాదం: బంగారం వ్యాపారులు మృతి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంగా వెళ్లి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలోని మృతులు, క్షతగాత్రులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బంగారం వ్యాపారం చేసే కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్ బావమరిది సంతోష్ మరో వ్యక్తి కారులో రామగుండం మీదుగా మంచిర్యాల బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు బోల్తా పడడంతో నలుగురు అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసే లోపే బంగారం వ్యాపారం చేసే రాంబాబు ప్రాణాలు కొల్పోయారు. ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందారు. డ్రైవర్ సంతోష్, శ్రీనివాస్ బావమరిది సంతోష్‌కు తీవ్రగాయాలు కాగా వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రామగుండం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులో కిలోన్నర బంగారం లభించిందని పోలిసులు పేర్కొన్నారు. ముందుగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బంగారం ప్యాకెట్లను రామగుండం పోలీసులకు అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి బంగారం ఉందో లేదో అడుగుతూ -
దాడులకు పాల్పడ్డ ‘తోట’పై పీడీయాక్ట్
గోదావరిఖని(రామగుండం): రాజకీయ నాయకుడి ముసుగులో గుండాయిజానికి పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చ ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మాజీ కార్పొరేటర్ తనయుడు తోట వేణుపై పీడీయాక్టు అమలు చేసి, గోదావరిఖనిలో వేళ్లూనుకున్న గుండాయిజానికి చెక్‌పెడు తూ కఠిన చర్యలకు పూనుకున్నారు పోలీసులు. వి వరాల్లోకి వెళ్తే రామగుండం కమిషనరేట్ పరిధిలో గొడవలు సృష్టిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, రాజకీయం ముసుగులో డబ్బులు వసూలు చే స్తున్న తోట వేణుపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ రా మగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ బుధవారం ఉత్వర్తులు జారీ చేశారు. స్థానిక శి వా జీనగర్‌కు చెందిన వేణుపై 12క్రిమినల్ కేసులు న మోదైనట్లు పేర్కొన్నారు. అతడు గతంలో ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కుటుంబంపై దాడిచేసి జైలులో.. ఇటీవల శివాజీనగర్‌లో పూల వ్యాపారం చేసుకునే వారిని రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, టేలాను ధ్వంసం చేసి కుటుంబంపై దాడి చేసిన కేసులో వేణు ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో పలు దాడుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ పత్రికా కార్యాలయంపై దాడి చేసి విలేకరిపై హత్యాయత్నం చేశాడన్న అభియోగంపై కూడా అతడిపై కేసు నమోదైంది. వీటితో పాటు పోచమ్మ మైదానంలో వ్యాపారులను బెదిరించాడని, తదితర కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి ప్రవర్తనపై రామగుండం సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల పలు డివిజన్లలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులను గొడవలకు పురిగొల్పడంతో శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వేణుపై పీడీయాక్ట్ నమోదు చేయడంతో అరాచక శక్తులకు పోలీసులు గట్టి హెచ్చరిక చేసినట్లైంది. ఈమేరకు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ జైలులో ఉన్న తోట వేణుకు బుధవారం పీడీ యాక్టు ఉత్తర్వులు అందజేశారు. -
కుప్పకూలిన అమ్మోనియం ప్లాంట్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఎరువుల కర్మాగారంలో నిర్మాణంలో ఉన్న అమ్మోనియా ప్లాంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద ఇంకా కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘చెత్త’ నిర్ణయం
స్టోర్‌రూంలో పుష్కాట్స్, డస్ట్‌బిన్స్ వాడకుండానే మూలకు.. రూ.35 లక్షలు వృథా నాలుగు నెలలకే చిలుముపట్టిన కొత్త రిక్షాలు రామగుండం బల్దియాలో ప్రజాధనం దుర్వినియోగం కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ప్రజాధనం వృథా చేస్తున్నారు. పాలకులు, అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఏకంగా బల్దియాకు రూ.35లక్షల నష్టం కలిగింది. చెత్త సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు కొనుగోలు చేసి మూడేళ్లు గడిచినా వాడకుండా మూలన పడేశారు. మళ్లీ నాలుగు నెలల క్రితం ట్రైసైకిళ్లు కొన్నా వాటిది అదే పరిస్థితి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుబట్టిపోతున్నాయి. వాటిని వాడకుండానే మళ్లీ కొత్తగా కొనేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. కనీసం వాటిని వినియోగించేందుకు కార్మికులను తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. పాలకులు, అధికారులు తీసుకునే చెత్త నిర్ణయాలతో బల్దియా పేరు అభాసుపాలువుతున్నారు. మూడున్నరేళ్ల క్రితం 12వ ఆర్థిక సంఘానికి చెందిన రూ.25 లక్షల నిధులతో 90 పుష్‌కాట్(చెత్తను సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు),1,250 డస్ట్బీన్స్ను టెండర్ల ద్వారా అధికారులు కొనుగోలుచేశారు. సంవత్సరాల తరబడి ఒక్క పుష్కాట్స్ బండిని కూడా ఉపయోగించకుండానే గదుల్లో మూలకు పడేశారు. వీటి కొనుగోలుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ గతంలో కొందరు మాజీ కౌన్సిలర్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా స్పందన లేదు. ఇప్పటికే చాలావరకు పుష్కాట్స్, ప్లాస్టిక్ డబ్బాలు మాయమయ్యాయని ఆరోపణలున్నాయి. పుష్కాట్స్, డస్ట్బీన్స్ ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుండానే... ప్రస్తుత పాలకర్గం 12వ ఆర్థిక సంఘానికి చెందిన మరో రూ.10 లక్షల నిధులతో నాలుగునెలల క్రితం 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. మరో వంద ట్రైసైకిళ్లు, ఇంటింటికీ రంగు డబ్బాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త ట్రైసైకిళ్లలో నాణ్యతెంత? రూ.10 లక్షలతో కొనుగోలు చేసిన 56 ట్రైసైకిళ్లను అధికారులు నిర్లక్ష్యంగా చెట్ల కిందపడేశారు. ఎండకు ఎండుతూ... వానలకు తడుస్తూ ప్రస్తుతం రిక్షాలన్నీ తుప్పుబట్టి పాడవుతున్నాయి. నాసిరకం విడిభాగాలతో ట్రైసైకిళ్లను తయారుచేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా పారిశుధ్యం మెరుగుకు ఉపయోగంలేకుండానే రూ.35 లక్షల ప్రజాధనం వృథా అయింది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం పాలకవర్గం నోరు మొదపడంలేదు. కొలిక్కిరాని రిక్షా కార్మికుల ఎంపిక ఇంటింటా చెత్త సేకరించి రీసైక్లింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుత పాలకవర్గం 12వ ఆర్థిక సంవత్సరం మిగులు నిధులు రూ.10 లక్షలతో 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. ఒక్కో రిక్షాపై ఇద్దరు కార్మికులను పనిలోకి తీసుకుంటామని చెప్పి ఇటీవల రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. గతంలో పనిచేసిన ర్యాగ్పిక్కర్ల(రిక్షా కార్మికులు)ను పనిలోకి తీసుకోవాలని, వారిని పారిశుధ్య కార్మికులుగా గుర్తించి కార్పొరేషన్ తరఫున వేతనాలు ఇవ్వాలని చాలాకాలంగా కార్మిక సంఘాల నాయకులు, ర్యాగ్‌పిక్కర్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై కొలిక్కి రాలేదు. వినియోగంలోకి తెస్తాం.. –డి.జాన్‌శ్యాంసన్, కమిషనర్ ఇంటింటా చెత్త సేకరించడానికి 56 ట్రైసైకిళ్లు కొనుగోలు చేశాం. వీటిపై కార్మికులను తీసుకునేందుకు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. ఎవరూ ముందుకు రావడంలేదు. మున్సిపల్ కార్పొరేషనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సాధ్యంకాదు. మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. రాకుంటే మేమే 50 డివిజన్లలో ఉన్న కార్మికులతో అవసరమున్నచోట ట్రైసైకిళ్లతోపాటు పుష్కాట్స్ ఏర్పాటుచేస్తాం. 20 రోజుల్లో డివిజన్లలోకి రిక్షాలు – కొంకటి లక్ష్మీనారాయణ, రామగుండం నగర మేయర్ రిక్షాలపైన పనిచేయడానికి నోటిఫికేషన్ పిలిస్తే కార్మికులు ముందుకురాలేదు. ట్రైసైకిళ్ల వినియోగంపై దృష్టి సారించాం. 20 రోజుల్లో రిక్షాలను వినియోగంలోకి తీసుకువస్తాం. అవసరమైతే పుష్కాట్స్ కూడా పారిశుధ్యం కోసం వినియోగిస్తాం. -
ఎన్టీపీసీ.. స్థలాన్వేషణ
4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అంతర్గాంలో వేరుు ఎకరాల ప్రభుత్వ భూమి సింగరేణిభూమి వినియోగంపై అనుమానాలు గోదావరిఖని : రామగుండంలో కొత్తగా నిర్మించనున్న 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఎన్టీపీసీ యాజమాన్యం స్థలసేకరణ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి కలిసి రామగుండంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. తొలి ప్లాంట్‌ను 39 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎక్కడ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలనే విషయమై ఎన్టీపీసీ యాజమాన్యం స్థలసేకరణ కోసం అన్వేషణ ప్రారంభించింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు వందల ఎకరాల స్థలం అవసరమవుతుంది. రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ ప్లాంట్‌కు సమీపంలోనే ఈ స్థలాన్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. మండలంలోని అంతర్గాంలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. అందులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలనే ఆలోచన తో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ స్థలంలో ఎన్టీపీసీ ప్లాంట్లు పెడితే అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది కుదరని పక్షంలో సింగరేణి స్థలాన్ని ఇందుకు వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వపరంగా సింగరేణి స్థలాన్ని ఇప్పించేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ఎన్టీపీసీ అధికారులకు హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ అవసరం వస్తే మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు వెలికితీసిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఓసీపీ జీవితకాలం మరో ఆరేళ్లుంది. దానిని కేటాయించేందుకు ఇప్పుడే హామీ ఇస్తారా అన్న అనుమానంగా ఉంది. సదరు స్థలాన్ని కేటాయించినట్లయితే.. ఓసీపీలో భూగర్భంలో మట్టిని వెలిసితీసేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో భూమి పొరల్లో గట్టితనం ఉండదు. మందుగుండు పేలుడు ధాటికి మట్టి పలుచగా మారిపోతుంది. బొగ్గును వెలికితీసిన తర్వాత ఏర్పడిన గొయ్యిలో మట్టిని నింపినప్పటికీ గట్టితనం ఉండదు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఇలాంటి భూమిలో చేపట్టడం సాధ్యపడదు. విద్యుత్ ప్లాంట్‌లో చిమ్నీలు, బాయిలర్లు, ఇతర ఎత్తై కట్టడాలను నిర్మించాలంటే భూమి గట్టితనంతో ఉండాలి. దీంతో ఎన్టీపీసీ అధికారులు మేడిపల్లి ప్రాంతంలోని భూమిని తిరస్కరించే అవకాశాలున్నాయి. ఒకవేళ సింగరేణి సంస్థ ద్వారా మైనింగ్ జరిగిన ప్రాంతంలో కాకుండా కొత్త ప్రాంతంలో భూసేకరణ జరిపించి ఎన్టీపీసీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే భూసేకరణ సింగరేణికి సమస్యగా మారింది. భూగర్భంలో బొగ్గునిక్షేపాలున్న చాలాచోట్ల భూసేకరణకు స్థానిక ప్రజలకు అడ్డుచెప్పడంతో బొగ్గుగనులు, ఓసీపీలను యాజమాన్యం ప్రారంభించలేకపోతోంది. ఈ తరుణంలో సింగరేణి సంస్థకు 400 ఎకరాలు సేకరించడం తలనొప్పిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలో ఎన్టీపీసీ యాజమాన్యమే తమకు అనుకూలంగా ఉండే ప్రాంతం కోసం ఇప్పటినుంచే రహస్యంగా అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.