
ఫిబ్రవరిలో రూ. 14,418 కోట్ల సమీకరణ
సగటున 83.2 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు ఫిబ్రవరిలో సగటున 83.2 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14,418 కోట్లు) నిధులను సమీకరించాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో స్టార్టప్‌లు మొత్తం 2,200 విడతల్లో 25.4 బిలియన్ డాలర్లు సమీకరించినట్లయిందని అధ్యయన సర్వీసుల సంస్థ ట్రాక్షన్ గణాంకాల్లో వెల్లడైంది. దీని ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో మొత్తం ఫండింగ్ 19.5 శాతం పెరిగింది.
వార్షిక ప్రాతిపదికన, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం 2.06 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. మరిన్ని విశేషాలు..
➤స్టార్టప్‌ల రాజధాని బెంగళూరులో అంకురాలు సగటున 2 మిలియన్ డాలర్ల చొప్పున 353 మిలియన్ డాలర్లు, ముంబైలో స్టార్టప్‌లు 102 మిలియన్ డాలర్లు సమీకరించాయి.
➤ఫిన్‌టెక్ సంస్థ ఆక్సిజో 1 బిలియన్ డాలర్లు, బీ2బీ ప్లాట్‌ఫాం ఉడాన్ 75 మిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. స్పాట్‌డ్రాఫ్ట్, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, జెటా, జినీమోడ్ మొదలైనవి ఇతరత్రా సంస్థల్లో ఉన్నాయి.
➤ఫిబ్రవరిలో కంపెనీల కొనుగోలు లావాదేవీలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో నమోదయ్యాయి. అడ్డా52 మాతృసంస్థ డెల్టాటెక్ గేమింగ్‌ను హెడ్ డిజిటల్ వర్క్స్ రూ. 491 కోట్లకు దక్కించుకుంది. అలాగే, ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్‌ఫాం క్లారి5ని పెర్ఫియోస్ అనే సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) సంస్థ కొనుగోలు చేయగా, మెగాఫైన్ ఫార్మాలో మెజారిటీ వాటాలను మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ రూ. 460 కోట్లకు దక్కించుకుంది.
➤26.5 మిలియన్ డాలర్ల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఫిబ్రవరిలో 16 ఐపీవోలు లిస్టయ్యాయి. హెక్సావేర్, ఎజాక్స్, కెన్ ఇండియా, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, రాయల్ ఆర్క్ మొదలైన లిస్టింగ్స్ వీటిలో ఉన్నాయి.
➤ఇన్వెస్టర్ల జాబితాలో షార్క్‌లు రితేష్ అగర్వాల్, అనుపమ్ మిట్టల్, అమన్ గుప్తా, పియుష్ బన్సల్ టాప్‌లో ఉండగా, వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో బ్లూమ్ వెంచర్స్, ఎక్సిమియస్ వెంచర్స్, యూనికార్న్ ఇండియా వెంచర్స్, పీక్ ఫిఫ్టీన్, యాక్సెల్, నెక్స్ వెంచర్ పార్ట్‌నర్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయి.
➤2024 మొత్తం మీద దేశీ అంకుర సంస్థలు 30.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2023లో నమోదైన 32.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 6.5 శాతం తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment