Billion Dollar Club
-
సంపదలో సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సంపద ఏకంగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా, 400 బిలియన్ డాలర్లు అధిగమించిన మొదటి వ్యక్తిగా.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. అంతే కాకుండా టెస్లా షేర్లు బుధవారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది మస్క్ ఆర్థిక స్థితిని మరింత పెంచింది.మస్క్ తరువాత జాబితాలో జెఫ్ బెజోస్ (249 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (224 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ (198 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (181 బిలియన్ డాలర్లు) ఉన్నారు. మస్క్ సంపద పెరగటానికి టెస్లా, స్పేస్ఎక్స్ మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ కూడా దోహదపడింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్‌ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్‌బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్‌బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్‌బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్‌మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
ఒక్కరోజులో ఎగిసిన షేర్లు.. 100 బిలియన్ క్లబ్‌లోకి డెల్ సీఈవో
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ (Dell Technologies) సీఈవో మైఖేల్ సాల్ డెల్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత పరికరాలకు పెరిగిన డిమాండ్‌తో కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయం అమాంతం ఎగిసింది. దీంతో డెల్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మైఖేల్ డెల్ సంపద శుక్రవారం మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కును సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన డెల్ షేర్లు రికార్డు స్థాయికి 32 శాతం జంప్ చేసి, దాని వ్యవస్థాపకుని నెట్‌వర్త్‌ను 13.7 బిలియన్ డాలర్లు పెంచి 104.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8.6 లక్షల కోట్లు) చేర్చాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డెల్ ఇప్పుడు భారత్ చెందిన గౌతమ్ అదానీ తర్వాత 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మైఖేల్ డెల్ సంపదలో దాదాపు సగం తన కంప్యూటర్ల తయారీ కంపెనీ నుంచే వచ్చింది. ఆయన 40 సంవత్సరాల క్రితం ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు డెల్ కంపెనీకి ప్రారంభించారు. ఏఐ సంబంధిత స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ కారణంగా ఈ సంవత్సరం సంపద విపరీతంగా పెరిగిన కొంతమంది బిలియనీర్లలో మైఖేల్ డెల్ కూడా ఒకరు. ఆయన సంపద పెరగడానికి చిప్‌మేకర్ బ్రాడ్‌కామ్ కూడా దోహదపడింది. 2021లో వీఎంవేర్‌ని కొనుగోలు చేసిన తర్వాత డెల్ అందులో వాటాను పొందారు. ఆ షేర్ల విలువ ఇప్పుడు 31 బిలియన్ల డాలర్లుకు పైగా ఉంది. -
Thums Up: ఎట్టకేలకు ఆ ఘనత సాధించిన శీతల పానీయ సంస్థ
నిదానమే ప్రధానం అనే నానుడి శీతల పానీయ బ్రాండ్ థమ్స్ అప్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్యాకేజ్డ్ డ్రింక్స్ మార్కెట్లో నెమ్మదిగా.. స్థిరంగా వ్యాపారవృద్ధిని సాధించుకుంటూ వస్తున్న థమ్స్ అప్ ఇప్పుడు అరుదైన ఫీట్ సాధించింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ‘బిలియన్ డాలర్ల బ్రాండ్’ ఘనత ఎట్టకేలకు దక్కింది. 1977లో కోలా కింగ్ రమేష్ చౌహాన్ థమ్స్ అప్ శీతల పానీయ బ్రాండ్‌ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత బేవరేజెస్ మార్కెట్లో దీని హవా కొనసాగుతోంది. స్వదేశీ బ్రాండే అయినప్పటికీ ప్రస్తుతం ఇది కోకా కోలా కింద ఉంది. అయితే కిందటి ఏడాది అమ్మకాల్లో (2021)లో బిలియన్ డాలర్ మార్క్‌ను(7,500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్) దాటేసింది థమ్స్ అప్. గ్లోబల్ బేవరేజెస్ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నా.. థమ్స్ అప్ ఈ మార్క్‌ను స్వదేశీ ట్యాగ్‌తో అందుకోవడమే ఇక్కడ కొసమెరుపు. ‘‘మా స్థానిక థమ్స్ అప్ బ్రాండ్ మార్కెటింగ్ ప్రణాళిక, సరైన ఐడియాలతో భారతదేశంలో బిలియన్-డాలర్ల బ్రాండ్‌గా అవతరించింది. థమ్స్ అప్ ఇప్పుడు భారతదేశంలో బిలియన్ డాలర్ల బ్రాండ్” అని కోకా కోలా కంపెనీ CEO జేమ్స్ క్విన్సీ గర్వంగా ప్రకటించుకున్నారు. స్వదేశీ తయారీ కూల్ డ్రింక్ అయిన థమ్స్ అప్ను 1993లో కోకాకోలా సొంతం చేసుకుంది. పార్లే బిస్లరీ వ్యవస్థాపకుడు, ఇండియన్ కోలా కింగ్ రమేష్ చౌహాన్ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది కోకా కోలా. థమ్స్ అప్‌తో పాటు మాజా, ఆ టైంలో సూపర్ హిట్ అయిన కూల్ డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్‌ను సైతం కొనుగోలు చేసేసింది. -
పేటీఎంకు భారీ షాక్
Patym Mall Lost Unicorn Status: డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేటీఎం ఈ-కామర్స్ విభాగం ‘పేటీఎం మాల్’ యూనికార్న్ హోదాను కోల్పోయింది. తాజాగా హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించిన యూనికార్న్ జాబితాలో ‘పేటీఎం మాల్’ స్థానం కనిపించలేదు. స్టార్టప్ వాల్యూయేషన్ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ స్టార్టప్‌లను ‘యూనికార్న్’ కంపెనీలుగా ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎం మాల్ వాల్యూ 1 బిలియన్ కంటే కిందకి పడిపోయినట్లు సమాచారం. ఈ పతనంపై పేటీఎం స్పందించాల్సి ఉంది. ఇక పేటీఎం మాల్తో పాటు మరో ఏడు భారీ స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొగొట్టుకున్నాయి. వీటిలో చాలావరకు చైనాకు చెందినవే ఉండడం విశేషం. ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. వేల్యుయేషన్స్ 1 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు యూనికార్న్ హోదా కోల్పోయాయి. స్టాక్ ఎక్సేంజ్ లిస్ట్ కావడం లేదంటే ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో మొత్తం 162 సంస్థలను యూనికార్న్ లిస్టు నుంచి తప్పించారు. ఈ-కామర్స్ రంగం పోటీలో భాగంగా పేటీఎం మాల్‌ను 2016లో పేటీఎం లాంఛ్ చేసింది. రెండేళ్లు తిరగకుండానే బిలియన్ డాలర్ల వాల్యూతో యూనికార్న్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది పేటీఎం మాల్. ఈబే ఫండింగ్ తర్వాత 2019లో పేటీఎం మాల్ విలువ 2.86 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో సైతం పోటీపడింది పేటీఎం మాల్. కిందటి ఏడాది 3 బిలియన్ డాలర్ల వాల్యూతో నిలిచిన పేటీఎం మాల్.. ఈ ఏడాది ఏకంగా యూనికార్న్ హోదా కోల్పోవడం విశేషం. ఇంకోవైపు ఐపీవోకి వెళ్లిన పేటీఎం.. చేదు ఫలితాల్నే చవిచూస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్.. నెక్స్ట్ చైనానే! -
వంద బిలియన్ల క్లబ్‌లోకి మరో భారతీయ కంపెనీ
Infosys:టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ అరుదైన రికార్డు సాధించింది. ఐటీ సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరో రేర్ ఫీట్‌ను సొంతం చేసుకుంది. ఇండియా నుంచి వంద బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల సరసన చేరింది. పెరిగిన షేర్ ధర ఈ ఏడాది ఆరంభం నుంచి షేర్ మార్కెట్ జోరుమీదుంది. ఫిబ్రవరిలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 50 వేల మార్క్‌ని దాటితే ఆగస్టులో 56 వేలు క్రాస్ చేసింది. అయితే ఇందులో ఎక్కువగా లాభపడింది ఐటీ కంపెనీలే. దీంతో గత కొంత కాలంగా ఐటీ కంపెనీల ఆస్తుల విలువ పెరుగుతోంది. మంగళవారం మార్కెట్లో ఇన్ఫోసిస్ ఒక షేర్ వాల్యూ ఒక శాతం పెరగింది. దీంతో ఒక షేర్ విలువ రికార్డు స్థాయిలో రూ.1,755.60కి చేరుకుంది. వంద బిలియన్ల క్లబ్‌లోకి దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో రెండవదిగా ఇన్ఫోసిస్‌కి గుర్తింపు ఉంది. బ్లూ చిప్ కేటగిరికి చెందిన ఇన్ఫోసిస్ షేర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజగా ఒక షేర్ వాల్యూ రూ.1,755.60కి పెరిగిపోవడంతో కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది. ఇండియన్ కరెన్సీలో ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 7.45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నాలుగో కంపెనీ ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు వ్యాపార సంస్థల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీలు ఉన్నాయి. వాటి తర్వాత వంద బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన నాలుగో సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. చదవండి : వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ -
రికార్డు బ్రేక్: 11 రోజుల్లో 6 వేల కోట్ల కలెక్షన్లు..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.6,432 కోట్లు) వసూళ్లు రాబట్టింది. తద్వారా ఈ ఫీట్‌ను వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ చిత్రం(12 రోజుల్లో రాబట్టింది) పేరిట ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ది వాల్ట్ డిస్నీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. శుక్రవారం ఒక్క రోజే 70 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని తెలిపారు. మున్ముందు ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ కలెక్షన్ల విషయంలో ఇన్ఫినిటీ వార్ మొదటి స్థానంలో ఉండగా.. ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ రెండో స్థానంలో, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ చిత్రం మూడో స్థానంలో ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఇన్ఫినిటీ వార్ ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్ మ్యాన్), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆంథోని రుస్సో, జోయ్ రుస్సో దర్శకత్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే విలన్ థానోస్.. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే అవెంజర్స్ సూపర్ హీరోలు.. వాళ్ల మధ్య జరిగే పోరాటాలు, చివరకు ఓ ట్విస్ట్‌తో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తరువాయి భాగం వచ్చే ఏడాది సమ్మర్లో(మే 3, 2019 అని ప్రకటించారు) విడుదల కానుంది. -
ఈ ఏడాదే అమర రాజా... బిలియన్ డాలర్ క్లబ్‌లోకి!
రూ. 600 కోట్లతో విస్తరణ ⇒ ఉత్తర, పశ్చిమ భారత్‌లో యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన ⇒ అమర రాజా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా చిత్తూరు నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఈ ఏడాది బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరగలమన్న ధీమాను అమర రాజా గ్రూపు వ్యక్తం చేసింది. గడిచిన ఏడాది తమ గ్రూపు వ్యాపార పరిమాణం రూ. 5,600 కోట్లు దాటిందని, ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో వ్యాపార పరిమాణం బిలియన్ డాలర్ల ( సుమారు రూ.6,300 కోట్లు) మార్కును అందుకోగలమన్న ధీమాను అమర రాజా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా వ్యక్తం చేశారు. చిత్తూరులో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అమర రాజా గ్రోత్ కారిడార్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది విస్తరణ కోసం రూ. 550 కోట్లు వ్యయం చేయగా, ఈ ఏడాది రూ. 600 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన గ్రోత్ కారిడార్‌లో తమ గ్రూపు 150 ఎకరాల వరకు వినియోగించుకొని మిగిలిన ఎకరాలను అభివృద్ధి చేసి ఇతర కంపెనీలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. రెట్టింపు కానున్న ద్విచక్ర బ్యాటరీ యూనిట్ ద్విచక్ర వాహన బ్యాటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 11 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యానికి అదనంగా మరో 11 మిలియన్ యూనిట్లు కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంతోపాటు ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని, నిర్వహణ పరంగా తక్కువ వ్యయం ఉన్న చోట ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఇంకా 18 నెలల సమయం ఉన్నందున పెట్టుబడి వ్యయం గురించి చెప్పలేమన్నారు. ద్విచక్ర వాహన తయారీ కంపెనీలకు నేరుగా బ్యాటరీలను అందించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, ఇప్పటికే హోండా, మహీంద్రా వాహనాలకు అందిస్తుండగా, త్వరలోనే బజాజ్, హీరో గ్రూపులతో ఒప్పందాలు కుదరనున్నట్లు తెలిపారు. ఎగుమతులపై దృష్టి ఎగుమతులపై దృష్టి సారిస్తున్నట్లు అమర రాజా ప్రకటించింది. హిందూ మహా సముద్ర తీర దేశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు రామచంద్ర నాయుడు తెలిపారు. ఇప్పటికే సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లో పట్టు సాధించామని, మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, కువైట్, ఆఫ్రికా దేశాల్లోకి విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో సుమారు 15 శాతం ఎగుమతులు ద్వారా సమకూరుతోంది. డిసెంబర్ నాటికి ట్యూబులర్ యూనిట్ రూ. 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న హోమ్ ఇన్వర్టర్ బ్యాటరీ ‘ట్యూబులర్’ యూనిట్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో పాటు ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ బ్యాటరీ యూనిట్లను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ బ్యాటరీ యూనిట్ సామర్థ్యం 2 బిలియన్ ఎంఏహెచ్‌గా ఉందని, దీన్ని వచ్చే ఒకటి రెండేళ్ళలో 2.4 బిలియన్ ఎంఏహెచ్‌కు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే 10 మిలియన్ యూనిట్లుగా ఉన్న ఆటోమోటివ్ యూనిట్ సామర్థ్యాన్ని రెండేళ్లలో 16 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.