రికార్డు బ్రేక్‌: 11 రోజుల్లో 6 వేల కోట్ల కలెక్షన్లు.. | Fastest Billion Collections By Avengers Infinity Wars | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 12:25 PM | Last Updated on Sun, May 6 2018 12:25 PM

Fastest Billion Collections By Avengers Infinity Wars - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌: హాలీవుడ్‌ చిత్రం అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే 1 బిలియన్‌ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.6,432 కోట్లు) వసూళ్లు రాబట్టింది. తద్వారా ఈ ఫీట్‌ను వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు స్టార్‌ వార్స్‌: ది ఫోర్స్‌ అవెకెన్స్‌ చిత్రం(12 రోజుల్లో రాబట్టింది) పేరిట ఉంది. 

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ది వాల్ట్‌ డిస్నీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. శుక్రవారం ఒక్క రోజే 70 మిలియన్‌ డాలర్లను వసూలు చేసిందని తెలిపారు. మున్ముందు ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే అవకాశం ఉంది. ఇక ఓవరాల్‌ కలెక్షన్ల విషయంలో ఇన్ఫినిటీ వార్‌ మొదటి స్థానంలో ఉండగా.. ది ఫేట్‌ ఆఫ్‌ ది ఫ్యూరియస్‌ రెండో స్థానంలో, స్టార్‌ వార్స్‌: ది ఫోర్స్‌ అవెకెన్స్‌ చిత్రం మూడో స్థానంలో ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఇన్ఫినిటీ వార్‌ ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. 

రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్‌ మ్యాన్‌), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆంథోని రుస్సో, జోయ్‌ రుస్సో దర్శకత్వం వహించారు. మార్వెల్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇన్ఫినిటీ స్టోన్స్‌ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే విలన్ థానోస్.. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే అవెంజర్స్‌ సూపర్ హీరోలు.. వాళ్ల మధ్య జరిగే పోరాటాలు, చివరకు ఓ ట్విస్ట్‌తో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తరువాయి భాగం వచ్చే ఏడాది సమ్మర్‌లో(మే 3, 2019 అని ప్రకటించారు) విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement