record collections
-
కిక్కు అంటే అదీ! ఆ షేర్లు ‘బ్రహ్మాండం’
సాక్షి,ముంబై: బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్లుమార్కెట్లోకి మల్టీప్లెక్స్ దిగ్గజ కంపెనీలకు జాక్‌పాట్ తగిలింది. ఈ మూవీ బాలీవుడ్ వసూళ్లు రూ.100 కోట్లు దాటడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు ఒక రేంజ్లో పుంజుకున్నాయి. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అందులోనూ ఇటీవలి నష్టాలతో షేర్ ధర తక్కువకు అందుబాటులో ఉండటంతో మరింత ఉత్సాహం నెలకొంది. ఫలితంగా పీవీఆర్ షేర్ 4.06 శాతం లేదా రూ.74.45 మేర ఎగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో, ఈ షేర్లు గరిష్టంగా రూ.1,926.20ని తాకాయి. ఐనాక్స్ లీజర్ షేర్లు 4.5 శాతం లేదా రూ. 22.55 పైగా ఎగిసి రూ.516.95 వద్ద ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనాల ప్రకారం శుక్రవారం రూ. 31.5 కోట్లు, శనివారం రూ. 37.5 కోట్లు, ఆదివారం రూ. 39.5 కోట్లు వసూలు చేసింది. ఫైనల్‌గా ఈ లెక్కే ఇంకా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆయన అంచనావేశారు. జాతీయ స్థాయిలో మంచి వసూళ్లు సాధిస్తోందని ఆదర్శ్ అన్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు డీలాపడటంతో శుక్రవారం, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ దాదాపు 5 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా రణబీర్ కపూర్, అలియా నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మౌని రాయ్‌తోపాటు, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో అలరిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ , మలయాళ భాషలలో విడుదలైంది. 18 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది. అంతేకాదు 'బ్రహ్మాస్త్రా పార్ట్ 2: దేవ్' అనే టైటిల్‌ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. -
మార్కెట్‌కు ఫెడ్ బూస్ట్
ముంబై: దలాల్ స్ట్రీట్ గురువారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది. రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్ లభించడంతో సూచీలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీల లాభాలకు కారణాలివే... చైనా ఎవర్ గ్రాండే సంక్షోభంపై గ్రూప్ చైర్మన్ హుయి కా యువాన్ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చైనా పీపుల్స్ బ్యాంక్ 17 బిలియన్ డాలర్లను చొప్పించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్ నుంచి తగ్గిస్తామనే ఫెడ్ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్‌కు జోష్ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది. ► యూఎస్ సంస్థ బ్లింక్ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్ సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది. -
తెలంగాణ ఇంట ‘కోటి’ సిరుల పంట..
యాసంగిలో 80 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌర సరఫరాల శాఖ, ఇప్పటికే 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, గద్వాల వంటి జిల్లాల్లో గత ఏడాది యాసంగి కన్నా ఈసారి రెట్టింపునకు పైగా ధాన్యం సేకరించారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. 2019-20లో 1.11 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం.. 2020–21 ఏడాది రెండు సీజన్లలో కలిపి ఏకంగా 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి చరిత్ర నెలకొల్పింది. ఒక్క యాసంగి సీజన్లోనే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం విశేషం. గత ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో నీటి సమృద్ధి పెరిగింది. దీంతో యాసంగిలో కేవలం వరి పంటే 53 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఉత్పత్తికి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపట్టి దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటగా, మరో యాభై వేల నుంచి లక్ష టన్నుల మేర ధాన్యం సేకరించి ఈ సీజన్‌కు ముగింపు పలకనుంది. గత సీజన్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. నిండుగా కాల్వలు.. అలుగు దుంకిన చెరువులు రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల కింది కాల్వలన్నీ నిండుగా పారాయి. ఆరు నుంచి ఏడు తడులుగా నీటిని పారించడంతో పంటలకు కావాల్సినంత నీరు అందింది. దీనికితోడు 46 వేలకు పైగా చెరువులకు గానూ 38 వేలకు పైగా చెరువులు అలుగు దుంకాయి. ఈ నేపథ్యంలో 53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా.. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేశారు. అందులో స్థానిక అవసరాలకు పోనూ 80 లక్షల టన్నులు సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీని విలువ సుమారు రూ.17 వేల కోట్ల మేర ఉండగా, ఇందులో రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్లలో ఐదింతలు పెరిగిన సేకరణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఏడేళ్ల కాలంలో ఐదింతలకు పైగా పెరిగింది. నిరంతర విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం సహా చెరువుల ద్వారా పెరిగిన నీటి లభ్యత కారణంగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా ఉంది. దీనికి తగ్గట్లే గత ఏడాది యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. తాజాగా కరోనా, హమాలీల కొరత, లాక్డౌన్ వంటి పరిస్థితులను అధిగమించి సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో 6,967 కేంద్రాల ద్వారా 15 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. - మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ -
ఆ సినిమా వసూళ్లు ‘హౌస్‌ఫుల్’
సాక్షి, ముంబై : కిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం హౌస్‌ఫుల్ 4 కలెక్షన్లలో దూసుకుపోతోంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రంపై మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా అనంతరం పుంజుకొని ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రూ. 200.58 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత సాజిద్ నడియావాలా మంగళవారం ప్రకటించారు. అనంతరం చిత్రం విజయం పట్ల చిత్రంలోని నటులు కృతిసనన్, రితేష్ దేశ్‌ముఖ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాణ బృందానికి అభినందనలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ గత చిత్రం మిషన్ మంగళ రూ. 202 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ రికార్డును తాజా చిత్రం అధిగమించే అవకాశముంది. మరోవైపు ఈ సినిమా వసూళ్లతో అక్షయ్‌కుమార్ 2019 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ హీరోగా నిలిచాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్ సినిమాలు సాధించిన వసూళ్లు రూ. 542 కోట్లుగా ఉన్నాయి. రెండో స్థానంలో హృతిక్ రోషన్ నిలిచాడు. ఆయన నటించిన సూపర్ 30, వార్ సినిమాలు రూ. 463 కోట్ల వసూళ్లు సాధించాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై అక్షయ్‌కుమార్ తొలిసారి స్పందించారు. ‘హౌస్‌ఫుల్ 4 చిత్ర నిర్మాణంలో లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌కాన్ కూడా పాలుపంచుకుంది. వారు మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చుపెట్టి ప్రతీ ఏటా సినిమాలు నిర్మిస్తారు. ఎంతో పేరున్న ఫాక్స్‌కాన్ సంస్థే తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ సినిమా వసూళ్లను పేర్కొంది. ఫేక్ కలెక్షన్లు అంటూ వాగే వారికి ఇదే నా సమాధాన’మంటూ ఘాటుగా బదులిచ్చాడు. -
ప్లాస్టిక్ బాటిల్స్‌కు కొత్త జీవితం: రిలయన్స్ రికార్డు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సేవా సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ రికార్డు స్థాయిలో ప్లాస్టిక్ వేస్ట్‌ను సేకరించింది. రీసైకిల్ ఫర్ లైఫ్ ప్రచారంలో భాగంగా రీసైక్లింగ్ కోసం 78 టన్నుల వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించామని శుక్రవారం ప్రకటించింది. మూడు లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు,ఇతర భాగస్వాముల ద్వారా ఈ రికార్డు కలెక్షన్ సాధ్యమైందని ఒక ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. అక్టోబర్‌లో ప్రారంభించిన రీసైకిల్ ఫర్ లైఫ్ డ్రైవ్‌లో సంస్థ ఉద్యోగులు వారి పరిసరాల నుండి వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి కార్యాలయాలకు తీసుకురావాలని విస్తృత ప్రచారం నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా రిలయన్స్, దాని అనుబంధ వ్యాపారాల నుంచి భారీ స్పందన లభించింది. పరిశుభ్రమైన, పచ్చని పుడమి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం మెరుగైన, ప్రకాశవంతమైన, శుభ్రమైన, పచ్చటి ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి వుందని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రాముఖ్యతను నమ్ముతున్నామన్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని నీతా వెల్లడించారు. ‘రీసైకిల్ 4 లైఫ్’ ప్రచారంలో భాగంగా సేకరించిన వ్యర్థ ప్లాస్టిక్ సీసాలు రీసైకిల్ చేస్తామన్నారు. అలాగే వాడిన పెట్ బాటిల్స్‌తో పర్యావరణ అనుకూల, ఉత్పత్తులను, దుస్తులను తయారు చేస్తున్న విషయాన్నిఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. -
రికార్డు బ్రేక్: 11 రోజుల్లో 6 వేల కోట్ల కలెక్షన్లు..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.6,432 కోట్లు) వసూళ్లు రాబట్టింది. తద్వారా ఈ ఫీట్‌ను వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ చిత్రం(12 రోజుల్లో రాబట్టింది) పేరిట ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ది వాల్ట్ డిస్నీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. శుక్రవారం ఒక్క రోజే 70 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని తెలిపారు. మున్ముందు ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ కలెక్షన్ల విషయంలో ఇన్ఫినిటీ వార్ మొదటి స్థానంలో ఉండగా.. ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ రెండో స్థానంలో, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ చిత్రం మూడో స్థానంలో ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఇన్ఫినిటీ వార్ ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్ మ్యాన్), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆంథోని రుస్సో, జోయ్ రుస్సో దర్శకత్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే విలన్ థానోస్.. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే అవెంజర్స్ సూపర్ హీరోలు.. వాళ్ల మధ్య జరిగే పోరాటాలు, చివరకు ఓ ట్విస్ట్‌తో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తరువాయి భాగం వచ్చే ఏడాది సమ్మర్లో(మే 3, 2019 అని ప్రకటించారు) విడుదల కానుంది. -
ఆస్తి పన్ను సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు
సాక్షి, హైదరాబాద్ : 2017-18 సంవత్సరానికిగానూ ఆస్తి పన్నుల సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 1205 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా 1320.26 కోట్లతో రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 115 కోట్లు అధికం. గత ఏడాదితో పోల్చితే అడ్వర్టైజ్మెంట్ వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. 2016-17లో రూ. 26.19 కోట్లు వసూలు కాగా ప్రస్తుతం రూ. 38.44 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం 42 కోట్లు ఉన్న ట్రైడ్ లైసెన్స్ వసూళ్లు ప్రస్తుతం రూ. 52 కోట్లకు చేరాయి. రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను సేకరించడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్డన్రెడ్డి అధికారులకు అభినందనలు తెలిపారు. -
లెక్కలు తిరగ రాస్తోంది!
బ్లాక్‌పాంథర్.. బ్లాక్‌పాంథర్.. బ్లాక్‌పాంథర్.. హాలీవుడ్ సినిమా అభిమానులు వారం రోజులుగా ఈ సినిమా జపం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించడం, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 18వ సినిమా కావడం, కెప్టెన్ అమెరికాలో సూపర్ అనిపించుకున్న బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ సినిమాగా రావడం, భారీ బడ్జెట్, భారీ రిలీజ్, సూపర్ రివ్యూలు.. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి మామూలుగా అన్ని సూపర్ హీరో సినిమాలకు, అన్ని పెద్ద స్టూడియోలు తీసే సినిమాలకూ ఉండే హంగామానే! బ్లాక్పాంథర్కు వీటన్నింటికీ మించి ఒక ప్రత్యేకత ఉంది. హాలీవుడ్లో ఒక రివల్యూషన్ ఇది. మెయిన్ లీడ్ చాద్విక్ బోస్మన్ సహా దాదాపు యాక్టర్స్ అంతా నల్లజాతివాళ్లు కావడమే ఆ ప్రత్యేకత. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ కూడా నల్లజాతీయుడే! ఒక నల్లజాతీయుడు సూపర్ హీరో క్యారెక్టర్‌గా సినిమా రావడం ఇదే మొదటిసారి. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం నల్లజాతీయులే ఉన్నా, కేవలం ఆడవాళ్లే ఉన్నా ఆ సినిమాలు పెద్దగా ఆడవన్న ఒక సెంటిమెంట్ ఉంది. ఇలాంటి సెంటిమెంట్లన్నీ బ్రేక్ చేస్తూ ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి అటూ ఇటుగా 200 మిలియన్ డాలర్లు (సుమారు 1300 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇండియాలో బ్లాక్‌పాంథర్ వసూళ్లు అదిరిపోయేలా ఉన్నాయి. లాంగ్ రన్లో సూపర్ హీరో సినిమా జానర్లో బ్లాక్‌పాంథర్ కొత్త రికార్డులే నెలకొల్పనుంది. -
బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2 సినిమా రూ. 1500 కోట్ల వసూళ్లు సాధించినా, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అనిల్ శర్మకు మాత్రం అది పెద్ద గొప్ప లెక్కలా ఏమీ కనిపించడం లేదు. 2001లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2007 నాటి అప్నే, 2010 నాటి వీర్, 2013 నాటి సింగ్ సాబ్ ద గ్రేట్ లాంటి సినిమాలు ఆయనే తీశారు. అయితే, ఇటీవల బాహుబలి-2 సినిమా బాక్సాఫీసు వసూళ్ల గురించి ఆయన దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. సన్నీ డియోల్‌తో తాను తీసిన గదర్ సినిమాతో పోలిస్తే ఇవి పెద్ద వసూళ్లే కావని ఆయన వ్యాఖ్యానించారు. కాకపోతే అప్పటి కాలం, అప్పటి టికెట్ ధరలు, నాటి డబ్బు విలువ అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దాదాపు 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాని విలువ దాదాపు రూ. 5000 కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. గదర్ సినిమా వచ్చినప్పుడు టికెట్ ధర కేవలం రూ. 25 మాత్రమే ఉండేదని, ఆ లెక్కన ఇప్పటి టికెట్ ధరలు, ద్రవ్యోల్బణం కలిపి లెక్కేసుకుంటే అప్పటి రూ. 265 కోట్లు ఇప్పటికి రూ. 5000 కోట్ల లెక్క అవుతుందని ఆయన వివరించారు. అందువల్ల ఇప్పటివరకు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లేమీ కాదని తేల్చి చెప్పేశారు. మంచి సినిమాలు ఎప్పుడూ రికార్డులను బద్దలుకొడతాయని, అయితే బాహుబలి2 మాత్రం ఎలాంటి రికార్డులూ బద్దలుకొట్టలేదని అనిల్ శర్మ అన్నారు. తనను ఈ విషయాలన్నింటిలో ఇరికించవద్దని, మంచి సినిమాలు వస్తే రికార్డులు ఆటోమేటిగ్గా బద్దలవుతాయని తెలిపారు. ఆయన ప్రస్తుతం తన కొడుకు ఉత్కర్ష్ హీరోగా వస్తున్న తొలి సినిమా జీనియస్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు బాహుబలి-2 హిందీ వెర్షన్‌కు రూ. 478 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ విడుదల చేసిన ఈ సినిమా ఆమిర్ ఖాన్ తీసిన దంగల్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. #Dangal and #Baahubali2 are akin to WAKE-UP CALL for Indian film industry... The *global biz* is an EYE-OPENER... Game changers, both... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 The resounding success of #Baahubali2 and #Dangal globally reiterates the fact that language is no deterrent if content is strong enough... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 The industry yearns for Hits... #Dangal and #Baahubali2 have achieved what we thought was IMPOSSIBLE and UNACHIEVABLE... Time to rejoice... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 #Baahubali2 and #Dangal are PRIDE OF INDIAN CINEMA... Time to make success a habit... Concentrate on content... Positive results will follow — taran adarsh (@taran_adarsh) 23 May 2017 Indeed, #Baahubali2 has emerged the HIGHEST GROSSER EVER... Yeh jo public hain yeh sab jaanti hain... Audience knows it all! https://t.co/kEp0s6d8N0 — taran adarsh (@taran_adarsh) 22 May 2017 -
ఖైదీ నంబర్ 150 రూ.102 కోట్ల వసూళ్లతో రికార్డు
కాకినాడ రూరల్ : ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. కాకినాడ లో మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో నాలుగు రోజులకు రూ.102 కోట్ల వసూలు చేసి చరిత్ర సృష్టించినట్లు వినాయక్ వివరించారు. ఏ చలన చిత్రం కూడా తక్కువ రోజుల్లో భారీగా కలెక్షన్లు వసూలు చేయలేదన్నారు. మొదటి రోజు మాదిరిగానే ఇప్పటికీ కలెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ చిత్రం విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తామని, అది ఎక్కడ ఏర్పాటు చేసేదీ త్వరలోనే వెల్ల డించనున్నట్లు తెలిపారు. సొంత కథతో ‘చిరు’ హీరోగా సినిమా పిఠాపురం టౌ¯ŒS (పిఠాపురం) : తన సొంత కథతో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వి.వి. వినాయక్ వెల్ల డించారు. మంగళవారం పిఠాపురం వచ్చిన ఆయనకు అభిమాను లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దర్శకత్వం వహించిన ఖైదీ నంబర్ 150 సినిమా ప్రదర్శిస్తున్న స్థానిక సత్యా థియేటర్లో కొంతసేపు విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నంబర్ 150 సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందన్నారు. మెగాస్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని వినాయక్ అన్నారు. సుమారు 2500 థియేటర్లలో ఈ సినిమా విడుదలై, వారం తిరగకుండానే రూ.125 కోట్లకు పైగా వసూలు చేసిందన్నారు. థియేటర్ యాజమాని దేవరపల్లి చినబాబు, పట్టణ మెగా అభిమానుల సంఘం సభ్యులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
కనక వర్షం..!
విజయవాడ సెంట్రల్/విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విద్యుత్, మున్సిపల్ శాఖలకు మేలు చేసింది. బిల్లులు చెల్లించేందుకు పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకునేలా ఆ శాఖల అధికారుల రచించిన పథకం œలించింది. ముందస్తు ప్రచారం లేకపోయినా రెండు శాఖలకు ఒక్క రోజులోనే భారీగా ఆదాయం సమకూరింది. మొండి బకాయిలు సైతం వసూలయ్యాయని ఆయా శాఖల అధికారులు తెలిపారు. పాత రూ.500, రూ.1,000 నోట్లతో వివిధ రకాల పన్నులు, బిల్లులు చెల్లించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. దీంతో విజయవాడ సర్కిల్ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ బిల్లులు వసూలయ్యాయి. ఇందులో అత్యధికం పాత బకాయిలు ఉన్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. సాధారణంగా రోజూ రూ.3.5 కోట్లు వరకు బిల్లులు వసూలు అయ్యేవి. అయితే పాత పెద్ద నోట్లు తీసుకుంటామని అధికారులు ప్రకటించడంతో ఒక్క శుక్రవారమే రూ.6 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు పాత రూ.500, రూ.1,000 నోట్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. కార్పొరేషన్‌కు భారీ ఆదాయం విజయవాడ నగరపాలక సంస్థకు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 9.15 గంటల వరకు రూ.4,76,27,747 మేర పన్నులు వసూలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు పన్నులు చెల్లించేందుకు అవకాశం ఉండటంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్ రావడం కార్పొరేషన్ చరిత్రలో రికార్డు అని అధికారులు చెప్పారు. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు పన్నులు వసూలవుతాయి. మార్చి 31వ తేదీ రూ.2.50 కోట్ల మేర పన్నులు వసూలవుతాయని రెవెన్యూ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచే మూడు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో పన్నులు కట్టించుకోవడం ప్రారంభించారు. అన్ని కేంద్రాల వద్ద బకాయిదారులు క్యూ కట్టారు. కృష్ణలంక పాతపోలీస్ స్టేషన్ రోడ్డు, పటమట సర్కిల్–3 కార్యాలయం, ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడివద్ద, మీ–సేవా కేంద్రాల్లో పన్ను వసూళ్ల తీరును కమిషనర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశారు. మరో మూడు రోజులు వసూళ్లు పెద్ద నోట్లతో మరో మూడు రోజుల పాటు పన్నులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిసింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థకు మొండి బకాయిలు రూ.100 కోట్లపైనే ఉన్నాయి. ఈక్రమంలో గడువు పెంపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో కనీసం రూ.30 కోట్ల మేర పన్నులు వసూలు చేయాలని కసరత్తు చేస్తున్నారు. -
రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ బయోపిక్!
ముంబై: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్లో రూ.66 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కూడా భారీ కలెక్షన్లు ఉండటంతో మొత్తంగా రూ.66 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ పేర్కొన్నారు. దాంతో 2016లో చిత్ర ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచినట్లు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ ట్వీట్ చేశారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'సుల్తాన్' అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. 'ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా, సుషాంత్ సింగ్ రాజ్ పుట్ టైటిల్ రోల్ ను పోషించాడు. -
4రోజుల్లో రూ.50 కోట్లు రాబట్టిన సరైనోడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'సరైనోడు' సూపర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సినిమాపై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది వసూళ్లపై ప్రభావం చూపలేదు. బన్నీ పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్న 'సరైనోడు' కలెక్షన్లతో బన్నీ రికార్డు సృష్టిస్తున్నాడు. బన్ని నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు రూ.50 కోట్ల మార్కును దాటేశాయి. అయితే ఈ సారి బన్ని సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం టాలీవుడ్లో విశేషం. కాగా తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి తొలిసారి తెలుగులో విలన్‌గా కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరిశారు. సోమవారం ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. -
తెలుగు స్టార్ హీరోలకు ఝలక్ ఇచ్చిన అనుష్క
-
బాక్సు బద్దలు కొట్టారు!
అవును! ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీ ధాటికి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బద్దలైంది. ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 4006 స్క్రీన్లపై విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్- 7 కళ్లుతిరిగే కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంలోనే 2800 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా మొదటి వారంలోనే రూ. 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి హాలీవుడ్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 కావడం విశేషం. గతంలో జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ సినిమా తొలివారంలో రూ.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ రికార్డును ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చెరిపేసింది. ఏప్రిల్ 2 నుంచి 10 వరకు సాధించిన ఈ వసూళ్లన్ని ప్రధానంగా మల్టీప్లెక్స్, మిని మల్టీప్లెక్స్ స్క్రీన్లద్వారా వచ్చినవేనని యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి సరబ్జిత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దాదాపు ప్రధాన భారతీయ భాషలన్నింటిలోనూ సిసిమాను డబ్ చేయడం, కారుప్రమాదంలో మరణించిన పాల్ వాకర్ నటించిన చివరిచిత్రం కావడం, ఆద్యాంతం విస్మయం గొలిపే యాక్షన్ సీన్లు ఉండటం వల్లే ఈ మేరకు రికార్డు కలెక్షన్లు సాధ్యమయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.