
బ్లాక్‌పాంథర్.. బ్లాక్‌పాంథర్.. బ్లాక్‌పాంథర్.. హాలీవుడ్ సినిమా అభిమానులు వారం రోజులుగా ఈ సినిమా జపం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించడం, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 18వ సినిమా కావడం, కెప్టెన్ అమెరికాలో సూపర్ అనిపించుకున్న బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ సినిమాగా రావడం, భారీ బడ్జెట్, భారీ రిలీజ్, సూపర్ రివ్యూలు.. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి మామూలుగా అన్ని సూపర్ హీరో సినిమాలకు, అన్ని పెద్ద స్టూడియోలు తీసే సినిమాలకూ ఉండే హంగామానే! బ్లాక్‌పాంథర్‌కు వీటన్నింటికీ మించి ఒక ప్రత్యేకత ఉంది. హాలీవుడ్‌లో ఒక రివల్యూషన్ ఇది.
మెయిన్ లీడ్ చాద్విక్ బోస్మన్ సహా దాదాపు యాక్టర్స్ అంతా నల్లజాతివాళ్లు కావడమే ఆ ప్రత్యేకత. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ కూడా నల్లజాతీయుడే! ఒక నల్లజాతీయుడు సూపర్ హీరో క్యారెక్టర్‌గా సినిమా రావడం ఇదే మొదటిసారి. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం నల్లజాతీయులే ఉన్నా, కేవలం ఆడవాళ్లే ఉన్నా ఆ సినిమాలు పెద్దగా ఆడవన్న ఒక సెంటిమెంట్ ఉంది. ఇలాంటి సెంటిమెంట్‌లన్నీ బ్రేక్ చేస్తూ ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి అటూ ఇటుగా 200 మిలియన్ డాలర్లు (సుమారు 1300 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇండియాలో బ్లాక్‌పాంథర్ వసూళ్లు అదిరిపోయేలా ఉన్నాయి. లాంగ్ రన్‌లో సూపర్ హీరో సినిమా జానర్లో బ్లాక్‌పాంథర్ కొత్త రికార్డులే
నెలకొల్పనుంది.
Comments
Please login to add a commentAdd a comment