Out of My Mind Review: ఆ అమ్మాయి గెలిచిందా? | Out of My Mind Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Out of My Mind Movie Review: మైండ్ బ్లోయింగ్ ఇన్సిపిరేషనల్

Dec 14 2024 2:45 PM | Updated on Dec 14 2024 2:48 PM

Out of My Mind Movie Review In Telugu

పిల్లలూ మన దగ్గర అన్నీ ఉండి హయ్యర్ గ్రేడ్స్ అచీవ్ చేయలేకపోతే అది మన ప్రాబ్లం. కానీ చాలా ఇష్యూస్ ఉండి ఎవరైనా కష్టపడి హై స్టేటస్ అచీవ్ చేస్తే మాత్రం వాళ్ళని గ్రేట్ అంటారు. అలాంటి వాళ్ళు మనకు ఇన్సిపిరేషనల్. సో ఒక ఇన్సిపిరేషనల్ మరియు ఎమోషనల్ లైన్ తో చేసిన మూవీ నే ఈ అవుట్ ఆఫ్ మైండ్. ఈ మూవీ ని ఆంబర్ సీలే అనే డైరెక్టర్ తీశారు. ఈ సినిమా మెలోడీ అనే అమ్మాయికి సంబంధించినది. ఆ అమ్మాయికి సెలిబ్రల్ పాల్సీ అనే డిసీజ్ వల్ల తను మాట్లాడలేదు, నడవలేదు. కాబట్టి మూవీ మొత్తం తను వీల్ ఛైర్ లో ఉంటుంది. ఆ అమ్మాయి ఏమైనా చెప్పాలనుకుంటే మెడ్ టెక్ వాయిస్ ద్వారా ఇతరులకు కమ్యునికేట్ చేస్తుంది.  కాని ఈ కమ్యునికేషన్ వల్ల మెలోడీ తాను చదివే స్కూల్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. 

స్కూల్ తరపున జరగబోయే విజ్ కిడ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది మెలోడీ. మెలోడీ క్లాస్ టీచరైన డయాన్ తో పాటు తన తోటి స్టూడెంట్ అయిన రోజ్ కూడా మెలోడీని చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో మెలోడీ విజ్ కిడ్స్ లో పార్టిసిపేట్ చేసిందా... ఒకవేళ చేస్తే ఎలా చేసింది అనే విషయాలు హాట్ స్టార్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్న ఔట్ ఆఫ్ మై మైండ్ మూవీ చూడాల్సిందే. 

సినిమా మొత్తం మాటల్లేకుండా మెలోడీ పాత్రలో ఫోబ్ రే టేలర్ అనే ఆర్టిస్ట్ తన యాక్టింగ్ తో మైండ్ బ్లోయింగ్ అని అనిపించుకుంది. తను నిజ జీవితంలో కూడా ఈ సెలిబ్రల్ పాల్సీ తో సఫర్ అవుతోంది. కిడ్స్ ఒక్కసారి ఆలోచించండి మనం కదల్లేక, మాట్లాడలేక వున్న టైంలో మనం చేయాలనుకున్న పనులు ఎలా చేయగలుగుతాం బట్ ఈ మూవీలో మెలోడీ అవన్నీ చేసి చూపించింది. ఎలానో మీరు మూవీ చూసేయండి. వాచ్ దిస్ వీకెండ్ ది ఇన్సిపిరేషనల్, ఎమోషనల్ మైండ్ బ్లోయింగ్ మూవీ ఔట్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ హాట్ స్టార్. 
- ఇంటూరు హరికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement