movie reviews
-
‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ
ఇండియన్ సినిమాల్లో లవ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. టాలీవుడ్లో అయితే ప్రేమ కథలకు కొదవే లేదు. స్వచ్ఛమైన ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘కాలమే కరిగింది’ (Kalamega Karigindi Telugu Movie Review). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకత్వం వహించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఫణి(వినయ్ కుమార్/ అరవింద్(చిన్నప్పటి పాత్ర) ఉన్నత చదువు చదివి బాగా సెట్ అయినా లైఫ్‌లో ఏదో తెలియని వెలితి ఉంటుంది. తన తొలి ప్రేమ గుర్తుకు వచ్చి.. ప్రియురాలి బిందు((శ్రావణి/నోమిన తార(చిన్నప్పటి పాత్ర)) కోసం సొంత ఊరికి బయలుదేరుతాడు. వీరిద్దరి మధ్య టెన్త్ క్లాస్ టైమ్‌లోనే ప్రేమ చిగురిస్తుంది. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. అయితే ఓ కారణంగా వీరిద్దరు దూరం అవుతారు. లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఫణి.. తొలి ప్రేమ జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఊరికి వస్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? అప్పటికే బిందుకి పెళ్లి అయిందా లేదా ఫణి కోసం అలాగే ఉండిపోయిందా? అసలు వీరిద్దరు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు కలిశారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..ఈ సినిమా కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు శింగర మోహన్ ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా మలిచి సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సారీ, థ్యాంక్స్ మినహా ఎక్కడా ఇంగ్లీష్ పదాలనే వాడలేదు. సంభాషణలు అన్ని పొయెటిక్గానే ఉంటాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆయువుపట్టులా నిలిచాయి. సంగీత దర్శకుడు తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. అయితే, కమర్షియల్ ఫార్మట్‌కి దూరంగా ఉండడం.. సినిమా మొత్తం నెమ్మదిగా సాగడం.. స్కూల్ ఎపిసోడ్లో కొన్ని సీన్లను తిప్పి తిప్పి చూపించడం ఈ సినిమాకు మైనస్. హీరోహీరోయిన్ల సంభాషణలు కూడా కవితాత్మకంగా ఉండడం వాస్తవికంగా అనిపించదు. ఫస్టాఫ్లోబిందు, ఫణిల లవ్‌స్టోరీ చూపించి.. సెకండాఫ్‌లో వాళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది చూపించారు. బిందు, ఫణి కలుస్తారా లేదా? బిందుకి పెళ్లి అయిందా లేదా? అనేది చివరి వరకు చూపించకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచారు. స్లోనెరేషన్తో అప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ప్రీక్లైమాక్స్ ఉంటుంది. పొయెటిక్ లవ్‌స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ( Kalamega Karigindi Review )ఎవరెలా చేశారంటే...ఈ సినిమా మొత్తం బిందు, ఫణి పాత్రల చుట్టే తిరుగుతుంది. మధ్యలో ఒకటి రెండు పాత్రలు వచ్చి వెళ్తాయి అంతే. బాల్యంలో ఫణి బిందు క్యారెక్లర్లను అరవింద్, నోమిన తార పోషించారు. పెద్దయ్యాక ఆ పాత్రల్లో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి కనిపిస్తారు. స్కూల్ లవ్స్టోరీకే ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. ఆయా పాత్రల్లో అరవింద్, నోమిన చక్కగా నటించారు. వినయ్ కుమార్ కూడా సెటిల్‌గా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నీకల్ విషయాలకొస్తే.. ముందు చెప్పినట్లు ఈ సినిమాకు ప్రధాన బలం గుడప్పన్ నేపథ్య సంగీతం. చాలా సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. వినీతి పబ్బతి సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. సీన్లను చాలా సహజత్వంగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో చాలా రిపీటెడ్ సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Killer Artiste Review :'కిల్లర్ ఆర్టిస్ట్' మూవీ రివ్యూ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రతన్ రిషి దర్శకత్వంలో ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిగా.. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా సోషల్‌మీడియాలో ట్రెండ్ అయిపోయింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటంటే..మన సమాజంలో జరుగుతున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథనే కిల్లర్ ఆర్టిస్ట్‌లో చూపించారు. విక్కీ (సంతోష్) స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలుగా సంతోషంగా తమ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని కొందరు వారిపై దాడి చేస్తారు. ఈ క్రమంలో స్వాతిని హింసించి చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. దీంతో బాగా కుంగిపోతాడు. ఈ క్రమంలో విక్కీ ప్రియురాలు జాను (క్రిషేక్ పటేల్) తెరపైకి వస్తుంది. అతన్నీ మళ్లీ మామూలు వ్యక్తిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో ఒక హీరోయిన్ మాస్క్ ధరించిన 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు. ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే ఉంటాడని అతను అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకొని పారిపోతాడు. అలా విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతను ప్రత్యక్షమవుతాడు. కొన్ని సంఘటనల ద్వారా తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీ నిర్ణయించుకుంటాడు. అయితే, ఇంతకు స్వాతిని చంపింది ఎవరు..? సిటీలోని మర్డర్స్ చేస్తున్నది ఒకరా? లేక ఇద్దరా? ఆ సైకో జాను పార్టీకి ఎందుకు వచ్చాడు..? ఫైనల్‌గా తన చెల్లిని హత్య చేసిన వారిని విక్కీ ఎలా పట్టుకుంటాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలైన ఈ సినిమా.. ఒక హత్యతో థ్రిల్లర్ సినిమాగా మారుతుంది. కుటుంబ సభ్యులను ఎవరైన హత్య చేస్తే అందుకు ప్రతికారం తీర్చుకున్న హీరో కథలు చాలానే తెరపైకి వచ్చాయి. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ చిత్రంలో కూడా తన చెల్లెల్ని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకున్న యువకుడి కథ అని చెప్పవచ్చు. అయితే, ఇందులో ఎవరూ ఊహించని విధంగా మర్డర్ మిస్టరీని ప్రేక్షకులకు దర్శకుడు చూపాడు. కానీ, హత్యలకు ప్రధాన కారణం ఏంటి అనేది సరైన క్రమంలో దర్శకుడు చెప్పలేకపోయాడు. రొటీన్ పాయింట్‌తోనే ప్రేక్షకులను కన్వెన్స్ చేసేలా ఉంది. మొదటి గంట వరకు విక్కీ, జాను ప్రేమ కథతో పాటు స్వాతి హత్య చుట్టే ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు సైకో నిజమైన హంతకుడు కాదని దర్శకుడు రివీల్ చేస్తాడు. అయితే, ఈ పాయింట్‌ను చక్కగా చూపాడు. సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపాలని దర్శకుడు అనుకున్నప్పటికీ దాన్ని సరైన డ్రామాగా చిత్రీకరించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సైకో పాత్రలో కాలకేయ ప్రభాకర్ నటన బాగున్నప్పటికీ అతని పాత్రను ఎక్కువసేపు తెరపై చూపించడం వల్ల ప్రేక్షకులకు విసుగొస్తుంది. క్లైమాక్స్‌లో విలన్ ఇతనే అని సర్ ప్రైజ్ చేసి చివర్లో ఓ మెసేజ్‌తో ముగించేస్తారు. ఇందులో అన్నాచెల్లెలు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లేలో కొత్తదనం కనిపిస్తుంది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్, నేను ఆర్టిస్ట్ అంటూ ప్రభాకర్‌తో చెప్పించిన సైకో డైలాగ్స్ కొత్తగా ఉంటాయి.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధనా బలం హీరో సంతోష్, కాలకేయ ప్రభాకర్... చెల్లి చనిపోతే ఒక అన్న ఎలా బాధపడుతాడో విక్సీ పాత్రలో సంతోష్ అదరగొట్టాడు. మరోవైపు క్రిషేక పటేల్ అందాలు ఆరబోస్తూనే పర్వాలేదనిపించింది. చెల్లి పాత్రలో నటించిన స్నేహ మాధురి కనిపించింది కొద్దిసేపు మాత్రమే.. అయినప్పటికీ ఆమె బాగానే నటించింది. సత్యం రాజేష్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు. తనికెళ్ళ భరణి, బిగ్ బాస్ సోనియా అక్కడక్కడా కనిపించినా తమ పాత్రలకు న్యాయం చేస్తారు. సినిమాకు తగిన విధంగానే సాంకేతిక విలువలు ఉన్నాయి. -
‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
కమెడియన్ గా పీక్స్ లో ఉన్న సమయంలోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘పెళ్లికాని ప్రసాద్’అనే సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో సప్తగిరికి హిట్ పడిందా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘పెళ్లికాని ప్రసాద్’ కథేంటంటే..?ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది. ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏజ్ బార్ అవుతున్న హీరోకి పెళ్లి కాదు. పెళ్లి కోసం నానా కష్టాలు పడడం.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. పెళ్ళికానీ ప్రసాద్ సినిమా కథ కూడా ఇదే. దర్శకుడు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ని కథగా ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తి ఉన్నా అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా ఉంది. అలాంటి సమయంలో హీరో తండ్రి కట్నం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఇదంతా మనకి తెలిసిన..చూసిన కథే. అయితే తెరపై చూస్తే మాత్రం... కొంతమేర ఎంటర్టైన్ అవుతాం. కొన్ని చోట్ల కామెడీ అతిగా అనిపించినా.. మరికొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది.హీరోయిన్ ఫ్యామిలీ ఎందుకు విదేశాలల్లో సెటిల్ కావాలనుకుంటుందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో మలెషియా నుంచి పెళ్లి కోసం ఇండియాకు రావడం..పెళ్లి చూపులు..ఇవన్నీ పాత సినిమాలను గుర్తు చేస్తాయి. హీరో హీరోయిన్లు కలిసినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ప్రసాద్‌ని ట్రాప్ చేయడానికి ఖుషీ సీన్ రిపీట్ చేయడం.. అలాగే అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పడం.. ఇవన్నీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం సాగదీతగా అనిపిస్తాయి. నవ్వించడానికే పెట్టిన కొన్ని సీన్లు.. అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సెకండాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకొని.. క్లైమాక్స్ విషయంలో జాగ్రత్త పడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్‌గా ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా.. సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఎవరెలా చేశారంటే..సప్తగిరి వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. సప్తగిరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర మురళీధర్ గౌడ్ ది. పూర్వికుల ఆచారాన్ని పాటిస్తూ కట్నం కోసం కన్నకొడుకు జీవితాన్నే ఇబ్బందులకు గురి చేసే నాన్న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.హీరోయిన్ ప్రియాంక్ శర్మ పాత్రకి నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు కానీ కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.టెక్నికల్ టీం విషయానికి వస్తే .. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘పెళ్లికాని ప్రసాద్’ టీమ్ వివరాలుదర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడినిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాలబ్యానర్: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్ డిఓపి: సుజాత సిద్దార్థ్సంగీతం: శేఖర్ చంద్రఎడిటర్: మధు- రేటింగ్: 2.5/5 -
Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం. కథేంటంటే..ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.ఎవరెలా చేశారంటే..మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులునిర్మాత: రాహుల్ రెడ్డి దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణసంగీతం: సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ ఎడిటర్: అశ్వత్ శివకుమార్ విడుదల తేది: మార్చి 21, 2025 -
ప్రియమణి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: ఆఫీసర్ ఆన్ డ్యూటీ(మలయాళ డబ్బింగ్ సినిమా)నటీనటులు: ప్రియమణి, కుంచకో బోబన్ తదితరులుడైరెక్టర్: జీతూ అష్రఫ్నిర్మాతలు: మార్టిన్ ప్రక్కత్, సిబి చవారా, రంజిత్ నాయర్సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్తెలుగులో విడుదల: 14 మార్చి 2025ఇటీవల తెలుగులో మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మలయాళంలో తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు తెలుగులోనూ సత్తాచాటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో పాటు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా మరో సరికొత్త క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. జీతూ అష్రఫ్ తన డెబ్యూ కథగా అలాంటి జోనర్‌నే ఎంచుకున్నారు. పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకునే సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత బస్సులో చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇలాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆ అమ్మాయి సూసైడ్‌కు హరిశంకరే కారణమా? దీని వెనక ఏదైనా మాఫియా ఉందా? ఇదేక్రమంలో హరిశంకర్‌కు భార్య ప్రియమణి(గీత)తో తీవ్రమైన గొడవ జరుగుతుంది. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్య గొడవ ఎందుకు జరిగింది? అసలు వారిద్దరు ఎందుకు విడిపోవాలనుకున్నారు? వీరి ముద్దుల కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపుగా ప్రేక్షకుల ఊహకందేలా ఉంటాయి. మర్డర్ మిస్టరీని ఛేదించడం లాంటివీ కథలు రోటీన్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జోనర్లో పోలీసులు, నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయడం చుట్టే కథ తిరుగుతుంది. కానీ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో పోలీసు అధికారులే బాధితులు కావడమనేది కొత్త పాయింట్‌ను డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వరుస కేసులు, దర్యాప్తు సమయంలో వచ్చే ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను ఆసక్తిని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు ఒక కేసు దర్యాప్తు చేయడానికి వెళ్తే.. ఆ కేసు మరో కేసుకు లింక్ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిందితుల కోసం హరిశంకర్ వేసే స్కెచ్, అతనికి పోలీసు డిపార్ట్మెంట్లో ఎదురయ్యే సమస్యలు కాస్తా రోటీన్‌గానే అనిపిస్తాయి. ఈ కేసు కీలకదశలో ఉండగానే ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో మరింత ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను సీట్‌కు అతుక్కునేలా చేశాడు డైరెక్టర్ అష్రఫ్. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నిందితులను పట్టుకునే క్రమంలో వచ్చే సీన్స్, ఫైట్స్‌తో ఆడియన్స్‌కు వయొలెన్స్‌ను పరిచయం చేశాడు మన దర్శకుడు. సెకండాఫ్ మొత్తం వన్ మ్యాన్ షోగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఓ సిన్సియర్ పోలీసు అధికారి కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుందనేది కోణం కూడా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. పోలీసులు నిందితుల కోసం వేసే స్కెచ్, దర్యాప్తు సీన్స్ రోటీన్‌గా ఉన్నప్పటికీ.. ఈ జోనర్లో కథలో కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కథను సస్పెన్స్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల రోటీన్‌గా అనిపించినా.. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌లతో కథను ఆసక్తిగా తీసుకెళ్లాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఎండింగ్లో కూడా అంతే ట్విస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ సీన్‌తో ఆడియన్స్‌కు కాసేపు ఉత్కంఠకు గురిచేశాడు. ఓవరాల్‌గా కొత్త డైరెక్టర్ అయినా తాను అనుకున్న పాయింట్‌ను తెరపై ఆవిష్కరిచండంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరెలా చేశారంటే..మలయాళ స్టార్ కుంచన్ బోబన్ పోలీసు అధికారిగా తన అగ్రెసివ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా తనదైన భావోద్వేగాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రియమణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తన రోల్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో ఆడియన్స్‌ను మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. విజువల్స్ పరంగా ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్‌లో ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
W/O అనిర్వేశ్ మూవీ రివ్యూ
జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ W/O అనిర్వేశ్’. ‘ది డెవిల్ చైర్’ఫేం గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ప్రైవేట్ ఉద్యోగి అనిర్వేశ్(జబర్దస్త్ రామ్ ప్రసాద్) తన భార్య విచెలిత(సాయి ప్రసన్న) తనను నిత్యం వేధిస్తోందని సి.ఐ వరదరాజులు(జెమిని సురేష్)కి ఫిర్యాదు చేస్తాడు. మరో వైపు అనిర్వేశే నిత్యం తనను వేధిస్తూ.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనకు చావే శరణ్యమని సీఐ వరదరాజులకు ఫోన్లో తన ఆవేధను అంతా వెలిబుచ్చుతుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు రాబర్ట్(సాయి కిరణ్ కోనేరి).. అనిర్వేశ్, విచెలిత కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు.కట్ చేస్తే..బిజినెస్ మ్యాన్ ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను లోబరుచుకొని దారుణంగా హత్య చేస్తాడు. ఈ కేసు విచారణలో సి.ఐ వరదరాజులు బిజీ అయిపోతాడు. అనిర్వేశ్ కేసు విచారణకు మరో పోలీసు ఆఫీసర్(కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. మరి రెండు కేసుల విచారణలో తేలిన నిజాలు ఏంటి? అనిర్వేశ్, విచెలిత, రాబర్ట్లలో ఎవరు ఎవరిని వేధించారు? మైథిలీ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఈ కేసుతో రౌడీ షీటర్ ఆది, డాక్టర్ శరణ్య, సీఐ వరదరాజులుకు ఉన్న సంబంధం ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ రామకృష్ణతో ఈ కేసులకు ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి కథలకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తీస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్లాట్ ను ఎంచుకుని... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులభంగా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉండటమే ఇందుకు కారణం. W/O అనిర్వేశ్ కూడా ఆ జానర్ కథే. మర్డర్ మిస్టరీ ప్లాట్ కి... కాస్త అడల్ట్ డ్రామా కంటెంట్ ను జోడించి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు గంగ సప్తశిఖర.భార్య వేధిస్తోందంటూ భర్త... భర్త వేధిస్తున్నాడంటూ భార్య... వీరిద్దరూ తోడుదొంగలు... నన్ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచి... నేను, నా ప్రేయసి ఏకాంతంగా ఉన్న సన్నివేశాలను వీడియో తీసి బెదిరిస్తున్నారంటూ... మరో వ్యక్తి ఫిర్యాదు.. ఇలా ట్రయాంగిల్ లో జరిగే స్టోరీకి అడల్ట్ కంటెంట్ ను కాస్త జోడించి... సినిమాను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వకుండా చూసేలా తెరకెక్కించా. ఇది యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రామ్ ప్రసాద్, సాయి ప్రసన్నల మధ్య వచ్చే ఎపిసోడ్స్ రామ్ ప్రసాద్ లోని మరో కోణాన్ని భయట పెడతాయి. ఇక ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్స్ కొన్ని మరీ బోల్డ్ గా వున్నాయి. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు కథ రివీల్ అవుతుంది. వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధం... అలాగే సి.ఐ.వరదరాజులు అసలు పాత్ర ఏమిటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో... ఈ చిత్రం అసలు సిసలైన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అనిపించుకుంటుంది. దర్శకుడు ఎక్కడా పాత్రలపై అనుమానం రాకుండా... చివరిదాకా అసలు విషయంలో సస్పెన్స్ ను చివరి దాకా క్యారీ చేయడం నిజంగా దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే..ఇప్పటి వరకు కామెడీతోనే అలరించిన జబర్దస్త్ రామ్ ప్రసాద్... ఇలాంటి క్రైం బేస్డ్ సినిమాలో నటించి తనలోని మరో సీరియస్ కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అనుమానపు మొగుడిగా శాడిస్ట్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించారు రామ్ ప్రసాద్. అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ బాగా వేరియేషన్ చూపించారు. అతనికి జంటగా నటించిన సాయి ప్రసన్న కొన్ని బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక నజియా ఖాన్ హోమ్లీ గాళ్ గా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. కిరీటి క్యారెక్టర్ కూడా చివరి దాకా బ్యాగా క్యారీ అయింది.రాబర్ట్ పాత్రలో సాయి కిరణ్ కోనేరి ఆకట్టుకున్నాడు. సీఐ పాత్రలో జెమిని సురేష్ చివరి దాకా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
జీవీ ప్రకాశ్ కుమార్ 'కింగ్స్టన్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కింగ్ స్టన్ మూవీతో నిర్మాతగా కూడా మారిపోయాడు. ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో హిరోయిన్‌గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఈరోజు రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యులో తెలుసుకుందాం.అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తమిళంలో తెరకెక్కిన కింగ్స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే కథలో బలం ఉన్నందుకే. ఇలాంటి డిఫరెంట్ కథలకి సినీ ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో... మాస్ ఎలివేషన్స్‌తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే.ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. విలన్ వద్ద హీరో పనిచేస్తూ... అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమాను చూస్తే... బాగానే ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా.... సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ కథను ఆడియన్స్‌కు వివరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ ఇలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయిపోతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ లుక్‌లో అలరించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఫ్యాన్స్‌ను జీవీ మెప్పించాడు. ఇక దివ్య భారతి తన పరిధిలో ఆకట్టుకుంది. ఆంటోని, సాల్మాన్, బోస్, చార్లెస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే విజువల్స్, కెమెరా వర్క్, బీజీఎమ్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్ విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
త్రిగుణ్ ‘జిగేల్’ మూవీ రివ్యూ
త్రిగుణ్(Trigun) హీరోగా మల్లి ఏలూరి రూపొందించిన చిత్రం ‘జిగేల్’(Jigel). వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. మేఘా చౌదరి హీరోయిన్. రఘుబాబు, మధునందన్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(మార్చి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..నందు(త్రిగుణ్) ఓ లాకర్ల దొంగ. బాగా డబ్బు దోచుకొని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. అతనికి కలలో మీనా(మేఘా చౌదరి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెతో సహజీవనం కలిసి కాపురం చేస్తున్నట్లు కలలు కంటాడు. ఓ సారి నిజంగానే మీనా తారాసపడుతుంది. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నట్లు నందుకు తెలుస్తుంది. దీంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు. ఓసారా రాజా చంద్ర వర్మ ప్యాలెస్‌లో ఉండే ఓ పురాతన లాకర్ తెరచుకోవడం లేదని..అందులో పెద్ద మొత్తంలో నగలు ఉన్నట్లు మీనాకి తెలుస్తుంది. దీంతో ఆమె జేపీ(సాయాజీ షిండే)దగ్గర పీఏగా చేరి..నందుతో ఆ లాకర్ని ఓపెన్ చేయించాలని ప్లాన్ వస్తుంది. మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అయిందా? అలసు ఆ లాకర్ ఎవరిది? అందులో ఏం ఉంది? రాజా చంద్ర వర్మ ప్యాలెస్ ప్లాష్‌బ్యాక్ ఏంటి? మీనాకి ఆ ప్యాలెస్‌తో ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఇదొక కామెడీ సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్.గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు దర్శకుడు మల్లి యేలూరి ప్రయత్నించాడు. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు... కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే పోసాని వేసిన ఆండ్రాయిడ్ బాబా వేషం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. పోసానికి రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే లాయర్ మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ చేత చేయించిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. అయితే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. సెకెండాఫ్ లో అసలు కథ మొదలై... చివరి వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..త్రిగుణ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లాకర్ టెక్నీషియన్ గా బాగా సూట్ అయ్యాడు. అందులో లాకర్ ను ఓపెన్ చేసే టెక్నిక్స్ ను కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. ఆ పాత్రలో త్రిగుణ్ బాగా ఒదిగిపోయి నటించారు. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించింది. కథ మొత్తం సెకెండాఫ్ లో ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి... ఆమె పాత్ర ఇంపార్టెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. పోసాని పాత్ర బాగా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకెండాఫ్ లోనూ అతని పాత్ర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సాయాజీ షిండే పాత్ర నెగిటివ్ రోల్ లో పర్వాలేదు అనిపిస్తుంది. మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ ఎప్పటిలాగే బాగా నటించారు. అతనితో పాటు నటించిన జయవాణి పాత్ర కూడా బాగుంది. హీరోయిన్ తల్లి పాత్రలో నళిని నటించి ఆకట్టుకుంది. రఘుబాబు ముక్కు అవినాష్, మధునందన్ పాత్రలు పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సంగీత దర్శకుడు ఆనంద్ మంత్ర అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టకుంటాయి.వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -
Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
టైటిల్: శబ్దంనటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులునిర్మాణ సంస్థ: 7G ఫిల్మ్స్ నిర్మాత: 7G ఫిల్మ్స్ శివ దర్శకత్వం: అరివళగన్సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాభన్ఆది పినిశెట్టికి (Aadhi Pinisetty) సోలో హిట్ పడి చాలా కాలమైంది. తెలుగు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. కానీ హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో తనకు ‘వైశాలి’ లాంటి బిగ్ హిట్ అందించిన దర్శకుడు అరివళగన్‌తో మరో మూవీ చేశాడు. అదే ‘శబ్దం’. (sabdham movie) ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా (Shabdam Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..హరర్ చిత్రాలన్ని ఓకే ఫార్మాట్లో సాగుతాయి. భయపెట్టే దెయ్యాలు.. వాటికి ఓ ఎమోషనల్ నేపథ్యం.. చివరకు వారి చావులకు కారణమైన వారికి శిక్ష పడడం..దాదాపు అన్ని హారర్ థ్రిల్లర్ సినిమాల కథ ఇలానే ఉంటుంది. శబ్దం కథ కూడా ఇలాంటిదే.కానీ కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టేందుకు దర్శకుడు అరివళగన్ రొటీన్ జిమ్మిక్కులను వాడుకోకుండా కొత్తగా ట్రై చేశాడు. టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఫస్టాఫ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుంది. హారర్ జానర్లో ఇదొక ప్రయోగంలా అనిపిస్తుంది. హీరో పాత్ర పరిచయం మొదలు.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం వరకు ప్రతీదీ సైంటిఫిక్ మెథడ్‌లో చెప్పారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం మళ్లీ రోటీన్ హారర్ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్ది సాధారణ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 42 దెయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యం తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే కొంతమేర కొత్తగా అనిపిస్తుంది. ఓ సీన్లో తెరపై బొమ్మ కనిపించకుండా చేసి కేవలం సౌండ్‌తోనే ప్రేక్షకుడిని భయపెట్టాడు. టెక్నికల్ అంశాలపై కొంత అవగాహన ఉంటే ఈ సినిమా బోర్ కొట్టదు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. పారానార్మల్ ఇన్వెస్టగేటర్ వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. నటన పరంగా ఆయనకు వంక పెట్టడానికేమి లేదు. ఇంటర్వెల్ వరకు ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ కూడా ఓ కొత్త రోల్ ప్లే చేసింది. డయానా పాత్రలో ఆమె చక్కగా నటించింది. నాన్సీగా లైలా తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. రిడిన్ కింగ్స్లే కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను నిలబెట్టాడు. కొన్ని సన్నివేశాలలో నటన కంటే బ్యాగ్రౌండ్ స్కోరే ఎక్కువ భయపెడుతుంది. డిఫరెంట్ బీజీఎంతో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Sabdham X Review: ‘శబ్దం’ మూవీ ట్విటర్ రివ్యూ
'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’(Sabdham Movie) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. రేపు (ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరి ఈ చిత్రానికి కోలీవుడ్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? నెటిజన్ల ఓపీనియన్ ఏంటి? ఓ లుక్కేద్దాం. ఈ సినిమా ప్రీమియర్ షోకి పాజిటివ్ స్పందనే లభించింది. సోషల్ మీడియాలో చాలా మంది పాజిటివ్‌గానే పోస్టులు పెడుతున్నారు. మరి అసలు టాక్ ఏంటనేది రేపే తెలుస్తుంది. #Sabdham (3.75/5) Suspense Horror Investigation Thriller with High quality technical stuff 👌𝐇𝐢𝐠𝐡𝐥𝐢𝐠𝐡𝐭𝐬 :Direction @dirarivazhagan Writting & Direction 👏Adhi Performance 💯 Thaman BGM 👌Technical Department 🔥1st Half 💥 𝐕𝐞𝐫𝐝𝐢𝐜𝐭 : 𝐇𝐢𝐠𝐡𝐥𝐲…— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) February 27, 2025 శబ్దం సస్పెన్స్ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. టెక్నికల్ టీమ్ పనితీరు చాలా బాగుంది. అరివళగన్ డైరెక్షన్, ఆది పినిశెట్టి యాక్టింగ్, తమన్ బీజీఎం అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ 3.75 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham Review - A Brilliant Sound Horror Thriller Rating: 3.5/5 (Try not to miss)Sabdham is a good investigative horror film that brilliantly blends the suspense with an innovative sound based horror Concept.#Arivazhagan direction keeps the tension high, making the movie… pic.twitter.com/I8gFyBEoM7— Tamizh Stories (@TamizhStoriesz) February 27, 2025 శబ్దం ఓ మంచి ఇన్వెస్టిగేటివ్ హారర్ ఫిల్మ్. హారర్ కాన్సెప్ట్‌కి వినూత్నమైన సౌండ్‌ని మిళితం చేసి చక్కగా తీర్చిదిద్దారు. అరివళగన్ డైరెక్షన్ టెన్షన్‌ని పెంచేలా ఉంది. నిజంగా జరుగుతున్నట్లుగానే సినిమాను తెరకెక్కించారంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham [3.5/5] : An Excellent horror thriller that uses sound to detect Paranormal activities..It offers plenty of thrills and emotions..Scenes arexinterestingly and intelligently written..@AadhiOfficial excels as the Paranormal Investigator.. 👏@MusicThaman 's Music is…— Ramesh Bala (@rameshlaus) February 26, 2025 శబ్దం అద్భుతమైన హారర్ థ్రిల్లర్. థ్రిల్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham - 3.5/5👌-Offers One Of The Best Theatrical Experiences in Recent Times! -A Uniquely Crafted Horror Film Where @MusicThaman's BG Score Plays A Vital Role. -Extraordinary Writing From @dirarivazhagan.-A Solid Comeback Movie For @AadhiOfficial Visually Looks Stunned pic.twitter.com/2ixhX7K5W8— Hemanathan Nagarajan (@HemanathanNaga1) February 26, 2025 -
Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ
టైటిల్: మజాకానటీనటులు: సందీప్ కిషన్, రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్నిర్మాత: రాజేశ్ దండకథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడదర్శకత్వం: త్రినాథరావు నక్కినసంగీతం: లియోన్ జేమ్స్సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీవిడుదల తేది: ఫిబ్రవరి 26, 2025యంగ్ హీరో సందీప్ కిషన్‌కి ఈ మధ్య సరైన హిట్టే పడలేదు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ హిట్ అనే పదానికే దూరమయ్యాడు. అందుకే ఈ సారికి ఎలాగైన హిట్ కొట్టాలని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాథరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘మజాకా’(Mazaka Review)తో సందీప్ హిట్ ట్రాక్ ఎక్కడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు. మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకి కథే సరిగా ఉండదు కానీ కామెడీ సీన్లతో పాసైపోతుంది. పాటలు, కామెడీ వర్కౌట్ అయితే వంద కోట్లు కలెక్షన్స్‌ని కూడా రాబడతాయి. త్రినాథరావు, ప్రసన్న కుమార్ కాంబినేషన్ దీన్నే నమ్ముకుంది. రొటీన్ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తీర్చిదిద్దుతారు. ‘ధమాకా’ వరకు వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అయింది. కానీ ‘మజాకా’ విషయంలో కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథే రొటీన్ అంటే స్క్రీన్‌ప్లే అంతకన్న రొటీన్‌గా ఉంటుంది. ఇక్కడో కామెడీ సీన్.. అక్కడో పాట..మధ్యలో ఎమోషనల్ సన్నివేశం..ఇలా సెట్ చేస్తే సరిపోతుంది సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో.వాస్తవానికి ఈ కథ లైన్ చాలా బాగుంది. కొడుకు పుట్టగానే భార్య చనిపోతే..మళ్లీ పెళ్లి చేసుకోకుండా, కొడుకు కోసం అలానే ఉండిపోయిన తండ్రి.. చివరకు కొడుకు పెళ్లి కోసమే..మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం.. మంచి ఎమోషనల్ ఉన్న పాయింట్ ఇది. కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచననే. కానీ కామెడీ కోసం రాసుకున్న సీన్ల విషయంలోనే జాగ్రత్తపడాల్సింది. కథలో కామెడీ సన్నివేశాలను ఇరికించినట్లుగా అనిపిస్తుందే కానీ సిట్యువేషనల్‌కి తగ్గట్లుగా వచ్చినట్లు అనిపించదు.తండ్రి కొడుకులిద్దరు కలిసి ప్రేమ లేఖలు రాయడం.. ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు దూకడం..‘ఖుషీ’ సీన్ రిపీట్.. ఇవన్నీ కొంతమందిని ఫుల్‌గా నవ్విస్తే..మరికొంతమందికి అతిగా అనిపిస్తాయి. ఫస్టాప్ వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే ఓ ట్వీస్ట్ ఆకట్టుకుంటుంది కానీ..ఆ తర్వాత కథనం రొటీన్‌గా సాగుతంది. కామెడీతో కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అనకాపల్లి ఎపిసోడ్ అతికించినట్లుగా ఉంటుంది. కథనం ఊహకందేలా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సినిమా ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. తండ్రికొడుకులుగా రావు రమేశ్, సందీప్ కిషన్ తెరపై హుషారుగా కనిపించారు. ముఖ్యంగా లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేశ్ ఇరగదీశాడు. యంగ్ లుక్‌లో కనిపించడమే కాదు..డ్యాన్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనతో వచ్చే ఒకటిరెండు కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ న్యాయం చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. రీతూ వర్మ, అన్షులకు బలమైన పాత్రలు లభించాయి. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతాయి.కానీ నటనకు పెద్దగా స్కోప్ లేదు. పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ పాత్రలో మురళీ శర్మ చక్కగా నటించాడు. హైపర్ ఆది కామెడీ జస్ట్ ఓకే. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నప్పటకీ అవి వచ్చే సందర్భమే సరిగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. Rating : 2.75/5 -
‘ది డెవిల్స్ చైర్’ మూవీ రివ్యూ
టైటిల్: ది డెవిల్స్ చైర్నటీనటులు: అభినయ కృష్ణ(జబర్దస్త్ అభి), ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్,వెంకట్ దుగ్గి రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ నిర్మాతలు: KK చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి .దర్శకత్వం: గంగా సప్తశిఖరసంగీతం: బిషేక్ సినిమాటోగ్రఫీ:గంగా సప్తశిఖరవిడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కథేంటంటే..ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..హారర్ చిత్రాలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఇప్పటికే ఈ జానర్లో చాలా చిత్రాలు వచ్చాయి.. వస్తునే ఉన్నాయి. ది డెవిల్స్ చైర్ కూడా ఆ జానర్ చిత్రమే. అయితే కంటెంట్‌తో పాటు మేకింగ్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు గంగా సప్తశిఖర. కేవలం భయపెట్టేందుకు మాత్రమే సీన్లను రాసుకోకుండా..బలమైన కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం ఓ వైపు భయపెడుతూనే..దురాశ దు:ఖానికి చేటు అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు హారర్ తో పాటు థ్రిల్ ను ఇవ్వడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారనేది ఇందులో చూపించారు. కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే హీరోపై లీగల్ కేసు నమోదైన తర్వాత కథనం కాస్త నెమ్మదిగా సాగుతుది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశాడు. సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీక్లైమాక్స్ నుంచి వచ్చే ప్రతీ సీన్ భయానికి గురి చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే డెవిల్ చైర్ నేపథ్యం ఏంటి? అసలు ఆ చైర్‌లోకి వచ్చి దృష్టశక్తి ఏంటనేది పార్ట్ 2లో చూడాల్సిందే. పార్ట్ 2 కోసం ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘ది డెవిల్స్ చైర్’ సినిమా నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. ఈజీ మనీకోసం అలవాటు పడిన యువకుడు విక్రమ్ పాత్రలో అదిరే అభి చక్కగా నటించాడు. రెండు మూడు వేరియషన్స్ లో అభి అభినయం అందిరినీ ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన తన పర్ ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. అలాగే ఛత్రపతి శేఖర్ ప్రొ ఫెసర్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు మనోజవ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి, పుండాక్ష పాత్రలో చంద్ర సుబ్బగారి, నూర్జహాన్ గా మూగమ్మాయిగా అద్విత చౌదరి నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. -
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).ఎలా ఉందంటే.. 'లవ్ టుడే'తో భారీ హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాలేజీ సీన్స్ మొదలు క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.అయినా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాలేజీ ఎపిసోడ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్టైనింగ్ చెప్పాడు. ఎవరెలా చేశారంటే.. రాఘవన్ అలియాస్ డ్రాగన్‌గా ప్రదీప్ రంగనాథ్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
టైటిల్: రామం రాఘవంనటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులునిర్మాత: పృథ్వీ పోలవరపుకథ: శివప్రసాద్ యానాలదర్శకత్వం: ధన్రాజ్సంగీతం: అరుణ్ చిల్లివేరుసినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కమెడియన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్థస్త్‌తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నేడు (ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ(ధన్‌రాజ్) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవ(హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటితరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాడు.చెడు అలవాట్లకు బానిసై పెరెంట్స్ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్‌తో రామం రాఘవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ధన్‌రాజ్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం, రాఘవ లాంటి పాత్రలను మనం ఎక్కడో ఒక్క చోటే చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పెరెంట్స్‌ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మంది గుండెని పిండేస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులే చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్, సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. తప్పు చేయడం..తండ్రికి దొరికిపోవడం..ఆ తర్వాత ఎమోషనల్ సంభాషణలు.. ఫస్టాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధన్‌రాజ్ లవ్‌ట్రాక్ కథకి అడ్డంకిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పటల్ సీన్ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సముద్రఖని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రల్లో అయినా జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక ధన్‌రాజ్ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్రలో కూడా నటించాడు. తొలి సినిమా అయినా కథను బాగా డీల్ చేశాడు. అనవసరపు సన్నీవేశాలను జోడించకుండా..తాను చెప్పాలనుకునే పాయింట్‌ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. ఎక్కడా ఎలివేషన్లు లేకుండా చాలా సింపుల్‌గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్‌గా నటించేశాడు. తండ్రి తనయుల సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హరీశ్ ఉత్తమ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అరుణ్ చిల్లివేరు బీజీఎం బాగుంది. పాటలు జస్ట్ ఓకే.దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే బాగుది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Laila Review: ‘లైలా’ మూవీ రివ్యూ
టైటిల్: లైలానటీనటుటు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్ తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్నిర్మాత: సాహు గారపాటిదర్శకత్వం: రామ్ నారాయణ్సంగీతం: జేమ్స్ లియోన్సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ప్రసాద్విడుదల తేది: ఫిబ్రవరి 14యంగ్ హీరో విశ్వక్ సేన్ జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కన పెడితే..ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యే మెకానిక్ రాకీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌ని తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ‘లైలా’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లైలా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Laila Movie Review)కథేంటంటే..సోను మోడల్(విశ్వక్ సేన్)(Vishwak Sen) హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటాడు. ఆ చుట్టు పక్కల మహిళలకు సోను మోడల్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. తన కస్టమర్లను అందంగా రెడీ చేయడమేకాదు..కష్టం వచ్చినప్పడు ఆదుకుంటాడు కూడా. అలా ఓ కస్టమర్‌కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్‌కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు. స్థానిక మహిళల భర్తలతో పాటు అక్కడి ఎస్సై శంకర్(పృథ్వీ)కి సోను అంటే నచ్చదు. మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్ చేసే రుస్తుం(అభిమన్యు సింగ్) కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. ఓ సారి సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులతో పాటు రుస్తుం మనుషులు కూడా అతని కోసం గాలిస్తారు. దీంతో సోను గెటప్ మార్చి లైలా(Laila Movie Review)గా మారుతాడు. అసలు సోనుపై వచ్చిన ఆరోపణలు ఏంటి? చేయని నేరంలో సోనును ఇరికించిందెవ్వరు? రుస్తుం సోను కోసం ఎందుకు గాలిస్తున్నాడు? లైలాగా మారిన తర్వాత సోనుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు తనను తప్పుడు కేసులో ఇరికించిన వారిని లైలా ఎలా పట్టుకుంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..‘కర్మలో కారం పొడి ఉంటే పళ్లెంలోకి పరమాన్నం ఎలా వస్తుంది’ అన్నట్లుగా.. కథలోనే కొత్తదనం లేనప్పుడు ఎన్ని ‘గెటప్’లు వేసినా డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ ఎలా వస్తుంది? లైలా సినిమా పరిస్థితి అలానే ఉంది. హీరోలు లేడి గెటప్పులు వేయడం కొత్త కాదు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో లేడీ గెటప్ అనగానే..ఇదేదో డిఫరెంట్ చిత్రంలా ఉందే అనుకున్నారంతా. తీరా సినిమా చూశాక..‘గెటప్’లోనే కొత్తదనం.. అంతకు మించి ఏమి లేదు. లుక్ పరంగా లైలా కొంతవరకు బాగానే ఉంది కానీ, ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అందించకుండా రొట్ట రొటీన్ సీన్లతో చాలా ‘జాగ్రత్త’గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఆయన రాసుకున్న కామెడీ సీన్లను చూసి నిజంగానే ‘నవ్వుకుంటారు’. డబుల్ మీనింగ్ డైలాగ్స్ విని ‘జబర్దస్త్’లాంటి షోలను గుర్తు చేసుకుంటారు. అడల్ట్ కామెడీ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందనుకున్నాడేమో.. ఫోకస్ అంతా దానిపైనే పెట్టాడు. కథలో సీరియస్ నెస్ లేదు..కామెడీలో కొత్తదనం లేదు. ఇక హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.వాస్తవానికి ఈ సినిమాలో పేరుకే విశ్వక్ సేన్ హీరో. కానీ కీలక సన్నివేశాలన్నీ అభిమన్య సింగ్, సునిశిత్ పాత్రలతోనే ఉంటాయి. అభిమన్యు పాత్రకు విశ్వక్‌తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. సునిశిత్ తెరపై కనిపించేది తక్కువే కానీ... కీలక సన్నివేశాల్లో ఆయనే కనిపిస్తాడు. ఇక హీరోయిన్ని అందాలను ప్రదర్శించడానికి తప్ప.. నటనకు స్కోప్ ఉన్న ఒక్క సీన్ రాసుకోలేదు. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగుతుంది. సోను మోడల్ బ్యూటీ పార్లర్ పెట్టడానికి గల కారణాన్ని బలంగా చూపించలేకపోయారు. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఆయిల్ బిజినెస్, ఎస్సై శంకర్ ఎపిసోడ్ అనీ.. బోరింగ్‌గా సాగుతాయి. లైలా ఎంట్రీతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ పాత్ర చుట్టు అల్లుకున్న కథ మళ్లీ రోటీన్‌గానే అనిపిస్తుంది. ఒకనొక దశలో లైలా పాత్రలో విశ్వక్‌ని చూడలేకపోతాం. ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ఏంటనేది అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ ఉంటుంది. పోని అది యూత్కైనా నచ్చేలా ఉంటుందా అంటే అదీ లేదు.మదర్ సెంటిమెంట్ రొటీన్‌గానే ఉన్నా .. కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. విశ్వక్ ఎప్పటిలాగే తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. సోను మోడల్‌గా, లైలాగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించి..తనదైన నటనతో వేరియేషన్ చూపించాడు. లైలా లుక్‌లో బాగున్నా.. నటనలో మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ జెన్నీ పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. అయితే ఆమెను నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువగా వాడేసుకున్నారు. రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్ చక్కగా నటించాడు. అతని కెరీర్లో ఇదొక డిఫరెంట్ పాత్ర. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిన సునిశిత్.. తన ఒరిజినల్ క్యారెక్టర్ని చేశాడు.కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ చేశారు. సురభి ప్రభావతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.జేమ్స్ లియోన్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Laila Movie X Review: ‘లైలా’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూన్నారు. ‘లైలా సినిమా కథేంటి? ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని.. విశ్వక్ సేన్ తప్ప సినిమా చెప్పుకోవడానికి ఏమి లేదని అంటున్నారు.#LailaMovie విశ్వక్ సేన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కాలం నాటి స్టోరి.. స్ర్కీన్ ప్లే.. మ్యూజిక్ సో.. సో.. డైరక్షన్ 👎👎 @VishwakSenActor కష్టం వృథా అయింది… లేడి గెటప్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు.#Laila - 2/5 pic.twitter.com/q7QK9oqylP— తార-సితార (@Tsr1257) February 14, 2025‘లైలా సినిమాలో విశ్వక్ సేన్ తప్ప చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా ఉంది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ కూడా యావరేజ్, విశ్వక్ సేన్ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో విశ్వక్ బాగున్నాడు’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు. Decent 1st Half, Sonu model killed with the characterization and some decent comedy scenes!! Expecting a huge comedy riot in 2nd Half😂❤️Pure @VishwakSenActor Domination !!#Laila pic.twitter.com/zw8EzBxzZv— Shiva Akunuri (@AkunuriShivaa) February 13, 2025 ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సోనూ మోడల్ పాత్ర అందరిని ఆకట్టుకుటుంది. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎక్కువ కామెడీ ఆశిస్తున్నా. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ ఒక్కడే అందరిని డామినేట్ చేశాడు’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#Laila Roddest movie in #VishwakSen career! Not one positive scene. Cringey comedy scenes, full double and vulgar dialogues and horrendous story. Contender for the worst Telugu movie ever made. How did he agree to this. Epic disaster! 0.25/5 pic.twitter.com/t8xPnnj1hX— AllAboutMovies (@MoviesAbout12) February 14, 2025 విశ్వక్ కెరీర్లో రాడ్ మూవీ లైలా. ఒక్క పాజిటివ్ సీన్ కూడా లేదు. క్రింజ్ కామెడీ సీన్స్, డబుల్ మీనింగ్, వల్గర్ డైలాగ్స్ తప్ప కథేమి లేదు. విశ్వక్ ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అంటూ మరో నెటిజన్ 0.25 రేటింగ్ ఇచ్చాడు.🙆🙆🙆🙆🙆#Laila is a complete disappointment, lacking a single memorable scene.Total movie 👎Chapri scenes and cringe comedy ULTRA DISASTER MOVIE 😭🤦🙏👎👎 pic.twitter.com/O3h4D4C3id— TollywoodGozzip (@TollywoodGozzip) February 14, 2025 లైలా నిరుత్సాహపరిచింది.గుర్తించుకునేలా ఒక్క సన్నివేశం కూడా లేదు. క్రింజ్ కామెడీ, వల్గర్ సన్నివేశాలు మినహా చెప్పుకోవడానికి ఏమి లేదు. అల్ట్రా డిజాస్టర్ మూవీ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Pure GUTS! @VishwakSenActor has NAILED the lady getup role, showcasing CLASS ACTING! 🔥🔥🔥🔥🔥 A one-man show, Babu! 👌👌🫡🫡 #Laila #MassKadas pic.twitter.com/eE1hxxuvsV— kiran (@abburi_k) February 13, 2025 విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అదరగొట్టేశాడు. క్లాస్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైలా కంప్లీట్‌గా విశ్వక్ వన్ మ్యాన్ షో. సినిమా బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Laila - A clueless film where everything from writing to direction to music to actors' performances failed. A bad first half followed by a pretty bad second half made the film a forgettable outing for Vishwak Sen and the team. #Laila pic.twitter.com/4ukkOWJ1wR— Prashanth VK 18 (@PrashanthSSMB28) February 14, 2025#Laila - పూర్తిగా దారి తప్పిన సినిమా 2/5 లైలా అనే సినిమా కథా రచన నుండి దర్శకత్వం, సంగీతం, నటుల అభినయం వరకు ప్రతీ అంశంలో విఫలమైంది. సినిమా చూసేంతసేపూ ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశం వస్తుందా అని ఎదురుచూసినా, అసలు ఎక్కడా కూడా కథ పట్టుదలగా కొనసాగలేదు.మొదటి భాగం పూర్తిగా అర్ధరహితమైన… https://t.co/UGMETZ3vx2— TollywoodRulz (@TollywoodRulz) February 14, 2025#LailaReview:Positives:• Vishwak Sen’s performance in parts 👍• BGM & a few comedy scenes 👍• Beauty parlour setup 👍Negatives:• Lackluster Direction & Screenplay • Outdated Story• Zero impactful Scenes• Senseless Comedy • Poorly written characters & villains…— Movies4u Official (@Movies4u_Officl) February 13, 2025#LAILA : A DECENT ONE WITH MASS KA DASS OUTSTANDING PERFORMANCE 💥💥🔥🔥🔥❤️🔥❤️🔥Mainly @VishwakSenActor is the BIGGEST PLUS FOR THIS FILM 🎥 ON SCREENS SONGS ARE SUPERB 👌With GOOD PRODUCTION VALUES ❤️🔥❤️🔥❤️🔥💥💥👍👍ENTERTAINMENT WORKED OUT 👍👌Our Rating : 2.75/5 👍👍💥… pic.twitter.com/8r3NAouTk5— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 14, 2025 -
‘ప్రేమిస్తావా’ మూవీ రివ్యూ
ఆకాష్ మురళి, అదితి శంకర్(డైరెక్టర్ శంకర్ కూతురు) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు.మరి సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దియా(అదితి శంకర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు అర్జున్(ఆకాష్ మురళీ). ఆమె చదువుతున్న కాలేజీలోనే చేరి.. ప్రేమ విషయాన్ని చెబుతాడు. మొదట్లో ఆమె ఒప్పుకోకపోయినా..కొన్నాళ్లకు అర్జున్‌ని ఇష్టపడుతుది. ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తారు. అయితే జాబ్ విషయంలో తన కంపెనీ నుంచి పోర్చుగల్‌కి వెళ్లే అవకాశం వస్తుంది దియాకి. అర్జున్ కూడా వస్తానంటే.. నో చెబుతుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. కట్ చేస్తే.. పోర్చుగల్‌కి వెళ్లిన దియా.. ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతుంది. ఈ విషయం తెలిసి.. అర్జున్ పోర్చుగల్ వెళ్తాడు. ఎలాగైన ఈ కేసు నుంచి తన ప్రియురాలిని బయటపడేయాలనుకుంటాడు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? దియా ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేసింది? దియా కోసం పోర్చుగల్ వెళ్లిన అర్జున్‌కి తెలిసిన అసలు విషయం ఏంటి? హత్యకు గురైన వ్యక్తికి శరత్ కుమార్, ఖుష్బూలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు దియా, అర్జున్ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ప్రేమ కథలకు టాలీవుడ్లో ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఇతర భాషలోని లవ్‌స్టోరీ మూవీస్ కూడా ఇక్కడ డబ్బింగ్ అతుంటాయి. ఇలా తమిళ్లో హిట్టయిన ప్రేమ కథే ‘ ప్రేమిస్తావా’. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో ఈ ప్రేమ కథను తీర్చి దిద్దారు. కథ ప్రజెంట్ నుంచి పాస్ట్‌లోకి వెళ్తుంది. ప్రైవేట్ కంపేనీలో ఉద్యోగం చేసే అర్జున్.. రియా అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే పోర్చుగల్ వెళ్లడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే గతంలో వీరిద్దరు ఎలా కలిశారు? ప్రేమలో ఎలా పడ్డారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేని రొమాంటిక్ వేలో యూత్‌ని ఆకట్టుకునేలా చూపించారు. ఫస్టాఫ్ అంతా వీరిద్దరి లవ్‌స్టోరీని చూపించి..సెకండాఫ్‌లో వారి మధ్య జరిగే ఘర్షణ, విడిపోవడానికి దారి తీసిన పరిస్థితలు చూపించారు. ద్వితియార్థం మొత్తం పోర్చుగల్‌లోనే సాగుతుంది. దియా కోసం అర్జున్ పడే బాధ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అంత వరకు కథనం రొటీన్‌గా సాగినా.. క్లైమాక్స్ ట్విస్ట్ కొత్తదనాన్ని అందిస్తుంది. ఎమోషన్స్ విషయంలో ఇకాంస్త దృష్టిపెట్టి.. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైన తెగించే యువకుడు అర్జున్ పాత్రలో ఆకాశ్ మురళి ఒదిగిపోయాడు. హీరోగా తొలి చిత్రమే అయినా.. కెమెరా ముందు ఆ విషయం తెలియకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక దియా పాత్రలో అదితి శంకర్ ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. శరత్ కుమార్, ఖుష్బులు మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. దగ్గుబాటి రాజా, కల్కి కొచ్లిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చిన్న సినిమానే అయినా..తెరపై చాలా రిచ్‌గా కనిపించేలా చేశారు. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ మూవీ రివ్యూ
భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చాయి. కానీ 31 ఏళ్ల క్రితం జపాన్ వాళ్లు ఇండియన్ టీమ్‌తో కలిసి రామాయణాన్ని యానిమేషన్ రూపంలో తెరకెక్కించారు. ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’(Ramayana: The Legend Of Prince Rama Movie) పేరుతో తెరకెక్కిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. నేడు(జనవరి 24) ఇండియాలో రిలీజైంది. మరి ఈ జపనీస్ రామాయణం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. రాముడి జననం గురించి మొదట వాయిస్ ఓవర్లో చెప్పి, ఆయనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కథను ప్రారంభించారు.రామ లక్ష్మణులు తాటకిని చంపి ఋషులను కాపాడటం మొదలు.. సీతా పరిణయం, ఆరణ్యవాసంలో సీతారామ లక్ష్మణుల వనవాసం, సీతాపహారణం, రామ, రావణల యుద్దం వరకు ఈ చిత్రంలో చూపించారు(Ramayana: The Legend Of Prince Rama Movie Review)విశ్లేషణరాముడి గురించి, రామాయణం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ప్రత్యేక ఏంటి? అంటే టెక్నాలజీని ఉపయోగించి కార్టూన్ వర్క్ పరంగా ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దారు. క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గకుండా.. చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. కాకపోతే తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే.. నిజంగానే కార్టూన్ వెర్షన్లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపించింది.రాముడి ఎంట్రీతో పాటు హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోతాయి. యానిమేషన్ చిత్రమే అయినా నిజంగా కథ జరుగుతున్నంత ఎమోషన్ ని పండించగలిగారు. చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫి, మోషన్ పిక్చర్ క్యాప్చర్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు పాజిటివ్‌గా మారింది. ఈ సినిమా కోసం సుమారుగా 450 మంది ఆర్టిస్టులు పనిచేయగా.. సుమారుగా 1 లక్షలకు పైగా హ్యాండ్ డ్రాయింగ్స్‌ను చిత్రించారు.1993 లో తీసినా ఇప్పుడు 4K HD క్వాలిటీ అనుగుణంగా సినిమా పిక్చరైజేషన్ చాలా క్లారిటీగా ఉండేలా మార్చారు. జపనీస్ యానిమేషన్ స్టైల్లో తెరకెక్కించినప్పటికీ ఈ తరం పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. -
‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ
టైటిల్: గాంధీ తాత చెట్టునటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ నిర్మాతలు: వీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాదిసంగీతం: రీసినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తులవిడుదల తేది: జనవరి 24, 2025ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi THatha Chettu Review). ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్‌లో సుకుమార్ కూడా పాల్గొనడంతో ‘గాంధీ తాత చెట్టు’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు (జనవరి 24) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మీడియా కోసం ఈ సినిమా స్పెషల్ షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుకుమార్ తనయ డెబ్యూతోనే హిట్ కొట్టిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు. అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ.(Gandhi THatha Chettu Review))ఎలా ఉందంటే.. గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని, ఓ చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేదే ఈ సినిమా కథ. టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా గాంధీ, తాత, చెట్టు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా జన్యూన్‌గానే ఇచ్చింది. అయితే సందేశం బాగున్నప్పటికీ సాగదీసి చెప్పినట్లుగా అనిపిస్తుంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ.. అహింసవాదం గొప్పదనాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి. కానీ వాస్తవికానికి కాస్త దూరంగా ఉంటుంది.ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత,గాంధీ పాత్రలను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించారు దర్శకురాలు. ఒకపక్క గాంధీ జర్నీని చూపిస్తూనే..మరోపక్క తాత, చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం బాగుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని తెలియకుండానే మన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ సాగినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కథనం మొత్తం ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు లేకుండా ఊహకు అందినట్లే సాగుతుంది. ‘నువ్వు ఒక్క మొక్క అయినా నాటావా? చెట్టును నరికే హక్కు ఎవరిచ్చారు? నువ్వు పీల్చుకున్న గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చిందే కానీ..నువ్వు సంపాదించుకున్నది ఏమి లేదంటూ బిజినెస్ మ్యాన్‌తో తాత చెబుతుంతుంటే.. ‘నిజమే కదా.. మనం కూడా చెట్లను పెంచలేదు. ఒక్కటైనా పెంచుదాం’ అనే ఆలోచన కొంతమందికి అయినా వస్తుంది. ‘ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది’, ‘చెడుని దులిపేయాలి...మంచిని పట్టుకోవాలి’, ‘పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే’ అంటూ తాత చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం అందించింది. ఎవరెలా చేశారంటే..సుకుమార్ ముద్దుల కూతురు సుకృతి వేణి నటించిన డెబ్యూ మూవీ ఇది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం నిజంగామే ఆమె గుండు గీసుకుంది అంటే.. ఎంత ఇష్టపడి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించింది. ఇక తాత రామచంద్రయ్య పాత్రకి ఆనంద్ చక్రపాణి పూర్తి న్యాయం చేశాడు. బిజినెస్ మ్యాన్ సతీష్‌గా రాగ్ మయూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు మిగిలిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ వారి వారి పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన పాటలలో పాటు నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నీవేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే షో పడిపోయింది. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డాకు మహారాజు కథ ఏంటి..? ఎలా ఉంది..? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో డాకు మహారాజుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. ఆశించన స్థాయిలో సినిమా లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.Good mass bomma delivered by #Bobby Good visualsVijay Kannan’s best DOPThaman’s powerful BGM💥Bobby Kolli’s good directorialBut Predictable & dragged climaxMay be a fourth hit for #BalayyaRating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025‘డైరెక్టర్ బాబీ ఓ మంచి మాస్ బొమ్మను అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ పవర్ఫుల్ బీజీఎం అందించాడు. బాబీ డైరెక్షన్ బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహకందేలా,సాగదీతగా అనిపిస్తుంది. బాలయ్య ఖాతాలో హిట్ పడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ 3.25 రేటింగ్ ఇచ్చాడు.#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged. The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…— Venky Reviews (@venkyreviews) January 11, 2025డాకు మహారాజ్ మంచి మాస్ ఎంటర్టైనర్.కానీ సెకండాఫ్ మాత్రం సాగదీశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య, తమన్ కాంబో మరోసారి సాలిడ్ మాస్ మూమెంట్స్‌ని అందించారు. డైరెక్టర్ బాబీ బాలయ్యను సెట్ అయ్యే కథనే ఎంచుకున్నాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథనం సాగదీశారు. ఊహకందేలా కథనం సాగుతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తుంది’అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.Blockbuster bomma 🏆🏆🔥🔥Excellent screen PlayQuality Picture @MusicThaman sava dengav ayya 🔥@dirbobby 🙏🤍@vamsi84 Production quality 👌#DaakuMaharaaj - A slick mass entertainer with stunning visuals and #Thaman's powerful score.#NBK is exceptional, delivering electrifying moments for fans.Director #Bobby ensures commercial highs, making it a festive treat despite a predictable climax.— CHITRAMBHALARE (@chitrambhalareI) January 12, 2025uMaharaaj?src=hash&ref_src=twsrc%5Etfw">#DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj — kalyan ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 (@kalyan_1405) January 12, 2025 #DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025Hahahahhahh 😂😂 ! My First Review of #DaakuMaharaaj proved “ TRUE ” !! I’m the Most Honest Film Critic in India 🇮🇳 today! Go & Watch Mass Masala this #Sankranthi 😃💥 https://t.co/DTUMdx5AOS— Umair Sandhu (@UmairSandu) January 11, 2025Oora Mass BGM From Teddy 🔥🔥Balayya Screen Presence > Nandamuri #DaakuMaharaaj pic.twitter.com/X6sNmHL5ZM— విక్రమ్ (@imVicky____) January 11, 2025A film that strikes the perfect balance between class and mass, cherished by the Maharaj🦁మళ్లీ సంక్రాంత్రి బుల్లోడు మా బాలయ్య బాబు🔥❤️Finally Good Output @dirbobby and @MusicThaman 🌟💫#DaakuMaharaaj 🦁🎇 pic.twitter.com/5E8UWwtbFa— ShelbY ᴹᵃʰᵃʳᵃᵃʲ⚔️ (@manishini9) January 11, 2025Naaku first half ye nachindhi ..Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025Last 45 min sleep veyochuRest 🔥Routine story 😢Elevations 👍 Bgm 🔥🔥🔥#DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025 -
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్ ఛేంజర్ కథేంటి? ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్ ఛేంజర్ సినిమాకు ఎక్స్‌లో మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. చరణ్ నటన అదిరిపోయింది కానీ.. శంకర్ మేకింగ్ బాగోలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్ బాగుంది. దోప్ సాంగ్ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్ సీన్అదిరిపోయింది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్ మరోసారి తన టేకింగ్ పవర్‌ని చూపించాడు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025#GameChanger#GameChangerReview First Half:Very Entertaining, fast paced screenplay by @shankarshanmugh sir. Superb first half. #SJSuryah and #RamCharan𓃵mass acting 🔥🔥🔥@MusicThaman Music is top work and #Dhop song is Hollywood level making #BlockbusterGameChanger— Mr.Professor (@EpicViralHub_) January 10, 2025SPOILER ALERT !! ⚠️⚠️IPS, IASInterval bang kosam CMMalli ventane IASImmediate ga Chief Electoral OfficerMalli climax bang kosam CMNeeku ishtam ochinattu thippav atu itu @shankarshanmugh 🤦🏻#GameChanger— . (@UrsPG) January 10, 2025Shankar’s corruption theme is outdated and he should choose a different script. Else its a Game Over for him.#GameChanger— CB (@cinema_babu) January 10, 2025భారతీయుడు శంకర్ చివరికి ఎన్. శంకర్ అయిపోతాడు అనుకోలేదు 🙏Outdated & Cringe #GameChanger— 🅰️⛓️ (@UaReports689gm1) January 10, 2025#RamCharan #GameChanger•More of a message-driven movie.•Set against a political backdrop.•Unbelievable solutions in the narrative.•Commercial elements are relatively less.•Every actor excelled in their roles, which is a very, very big plus for the movie!— USAnINDIA (@USAnINDIA) January 10, 2025 -
OTT: ‘ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్’ మూవీ రివ్యూ
వండర్‌ల్యాండ్‌కు వెళ్లడం ఎవరికైనా ఇష్టమే. వండర్‌ల్యాండ్‌కు వెళ్లే సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అదే వరుసలోని సినిమా ‘ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్’(A Boy Called Christmas). ఇందులో నికోలస్ అనే 13 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఫార్ నార్త్ వరకు ట్రావెల్ చేసి ‘ఎఫెల్మ్’ అనే వండర్ ల్యాండ్‌కి వెళ్ళి తన క్రిస్మస్ విష్ పూర్తి చేసుకుంటాడు. అదెలాగో ఇప్పుడు చెప్పుకుందాం. నికోలస్ అనే కుర్రవాడు వడ్రంగి కొడుకు. వాళ్లు పెద్ద అడవిలో ఉంటారు. రెండేళ్లకు ముందు నికోలస్ తల్లిని ఓ ఎలుగుబంటి చంపేస్తుంది. దాంతో తండ్రి కొడుకు మాత్రమే ఉంటారు. (చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?)ఓ రోజు రాజు ఆ రాజ్యంలోని ప్రజలందరికీ ఓ మాట చెబుతాడు. ఎవరైతే ఏదైనా అద్భుతం చేసి రాజ్యంలోని అందరికీ నవ్వు తెప్పిస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేస్తాడు. ఆ విషయం విని నికోలస్ తండ్రి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫార్ నార్త్‌లో ఉన్న ఫాంటసీ ఐలాండ్ కి వెళ్ళి అక్కడి నుండి ఏదైనా తీసుకువద్దామని అనుకుంటాడు. (చదవండి: ఆ హీరోయిన్ కంటే ఆమె తల్లే ఎక్కువ ఇష్టం : ఆర్జీవీ)నికోలస్‌కు అతని పిన్ని కార్లట్టాను తోడుగా ఉంచి వెళతాడు.. కాని ఆ పిన్ని చాలా సెల్ఫిష్. నికోలస్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడుతుంది. అప్పుడు నికోలస్ తన తల్లి ప్రెజెంట్ చేసిన మఫ్లర్‌ను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ మఫ్లర్లో వండర్ ల్యాండ్ ‘ఎఫెల్మ్’కు వెళ్ళే మాప్ కుట్టి ఉంటుంది. ఎలాగైనా తన ఫాదర్‌ని కలవాలని విష్ చేసుకుని ఎఫెల్మ్కు తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ జర్నీలో ఓ చిన్న ఎలుక కూడా ఉంటుంది. అంతే కాదు ఎలుక చక్కగా మాట్లాడుతూ భలే ఉంటుంది. వండర్ ల్యాండ్ ఎఫెల్మ్లో ఎన్నో మ్యాజిక్స్‌తో సూపర్ గా ఉంటుంది. మరి నికోలస్ విష్ పూర్తవుతుందా అంటే మీరందరూ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఫాంటసీ కిడ్స్ మూవీ ‘ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్’ని చూడాల్సిందే. – ఇంటూరు హరికృష్ణ -
‘మార్కో’ మూవీ రివ్యూ: వయొలెన్స్.. వయొలెన్స్.. వైల్డ్ వయొలెన్స్!
టైటిల్: 'మార్కో'నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్నిర్మాణ సంస్థ: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: షరీఫ్ ముహమ్మద్రచన-దర్శకత్వం: హనీఫ్ అదేనిసంగీతం: రవి బస్రూర్సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్ఎడిటర్: షమీర్ మహమ్మద్విడుదల తేది: జనవరి 1, 2025‘మార్కో’.. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 20) వచ్చిన ఈ మలయాళ చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మోస్ట్ వయలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు(జనవరి 1) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ‘మార్కో’ తెలుగు వాళ్లను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..?ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాల్లో హింస మితిమీరిపోతుంది. అవసరానికి మించి వయొలెన్స్‌ని చూపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘యానిమల్’, ఇటీవల వచ్చిన ‘కిల్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దారుణంగా ఉన్నాయి. వాటిని యాక్షన్ ప్రియులు ఎంజాయ్ చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేకపోయారు. కానీ యాక్షన్ ప్రియులే భయపడిపోయి.. ‘ఈ హింసను చూడలేకపోతున్నాం.. ఆపండ్రాబాబూ..’ అనుకునే సినిమా ‘మార్కో’. సెన్సార్ బోర్డ్ ఎలా ఓకే చేసిందో తెలియదు కానీ..కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. అవసరానికి మించిన హింస.. జుగుప్సాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.వాస్తవానికి ఇదొక రోటీన్ రివైంజ్ డ్రామా చిత్రం. తన సోదరుడిని చంపినవాళ్లపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగులోనూ చాలా వచ్చాయి. కానీ రివైంజ్ డ్రామాని ఫుల్ యాక్షన్ డ్రామాగా మలచడమే ‘మార్కో’ స్పెషల్. సినిమా ప్రారంభంలోనే హంతకులు ఎవరనేది ఆడియన్స్‌కు తెలిసిపోతుంది. కానీ హీరో వారిని కనిపెట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరం. ప్రతి యాక్షన్ సీన్లోనూ రక్తం ఏరులైపారుతుంది. ఇంటర్వెల్ సీన్లో వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులే తట్టుకోలేరు. తలలు ఎగిరిపడడం.. కాళ్లు, చేతులు తెగిపడడం.. పొట్టలోని పేగులు బయటకు రావడం.. ఒకెత్తు అయితే.. యాసిడ్‌తో చంపడం.. గర్భిణీ స్త్రీ నోట్ల ఆయుధం దింపడం.. చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండెర్‌తో మోది చంపడం.. గుండెకాయను కోసి బయటకు తీయడం.. మరో ఎత్తు. ఆ సన్నివేశాలను తెరపై చూడాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే. ఒకనొక దశలో ఇంత వయొలెన్స్ అవసరమా? అనిపిస్తుంది. కథ మొత్తం ప్యామిలీ చుట్టే తిరిగినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిన్న పిల్లలు, గుండెజబ్బు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. తెరపై హింసను ఆస్వాదించేవాళ్లు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘మార్కో’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఉన్ని ముకుందన్ కేరళ నటుడైనా తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితుడే. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మాలీవుడ్‌లో అతనికి మాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని పెంచే చిత్రం ‘మార్కో’. టైటిల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. మార్కో పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లుగా ఉన్ని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సిద్ధిఖీ, కబీర్ దుహాస్ సింగ్‌ల పాత్రకు కూడా బాగా పేలాయి. వారి పాత్రల పరిచయం..యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. దర్శకుడు హనీఫ్ అదేని తన రాసుకున్న పాత్రలకు తగ్గట్లుగా క్యాస్టింగ్‌ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అదిరిపోయింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. తనదైన బీజీఎంతో మూవీ స్థాయిని పెంచేశాడు. హీరోతో పాటు విలన్ పాత్రలకు సంబంధించిన ఎలివేషన్ సీన్లకు ఆయన అందించిన బీజీఎం నెక్ట్స్ లెవన్. పాటలు గుర్తుండవు. యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు అద్భుతం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘లీగల్లీ వీర్’ ఎలా ఉందంటే..?
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామాన్య కుటుంబానికి చెందిన బాలరాజు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆయన ఆ హత్య చేయకపోయినా..అన్ని ఆధారాలు ఆయన చేసినట్లే ఉంటాయి. అలాంటి తరుణంలో బాలరాజు కేసును టేకాప్ చేస్తాడు వీర్(మకిలిరెడ్డి వీర్రెడ్డి). ఆ హత్య కేసు వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారని తెలుసుకుంటాడు. లాయర్ వీర్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? బలరాజుకు న్యాయం చేసేందుకు వీర్ చేసిన సాహసాలేంటి? చివరకు ఈ హత్య కేసు నుంచి బాలరాజు బయటపడ్డాడా లేడా? అనేదే మిగతా కథ.దర్శకుడు ఎంచుకున్న కోర్డు డ్రామా పాయింట్ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడమే సినిమాకు మైనస్ అయింది. సాఫీగా సాగుతున్న కథకి యాక్షన్ బ్లాక్, రొమాంటిక్ సాంగ్స్ అడ్డంకిగా మారేయే తప్పా..ఎలాంటి వినోదాన్ని పంచలేదు. అయినప్పటికీ అసలు కథను డీవియేట్ చేయకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. అక్కడక్కడ వకీల్ సాబ్ తరహా సీన్స్ కనిపిస్తుంటాయి. టెక్నికల్ టీమ్ నుంచి తనకు కావాల్సిన ఔట్‌ఫుట్ తీసుకోవడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు. కాస్టింగ్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడి..అనుభవం ఉన్న నటీనటులను పెట్టుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.లాయర్ వీర్ పాత్రకి మలికిరెడ్డి వీర్ రెడ్డి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్రెజన్స్ బాగున్న్పటికీ..అనుభవ లేమి కారణంగా హావభావాలు పలికించడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బాలరాజు పాత్రను పోషించిన యువకుడు చక్కగా నటించాడు. బాలరాజు భార్యగా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి తనదైన నటనతో ఆకట్టుకుంది. దివంగత ఢిల్లీ గణేశ్ ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించాడు. దయానంద్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సినిమాటోగ్రపీ, ప్రొడక్షన్స్ డిజైన్ బాగున్నాయి. హీరోనే నిర్మాత కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. -
గేమ్ ఛేంజర్.. ఒక్క రోజు షూటింగ్ ఖర్చు అన్ని లక్షలా?
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం ‘గేమ్ ఛేంజర్’(game Changer) రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. గతవారం అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఈవెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రమోషన్స్ మొదలు కాలేదు కానీ నెట్టింట మాత్రం గేమ్ ఛేంజర్‌పై చర్చ జరుగుతూనే ఉంది.(చదవండి: ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చు చేశాడు. రెమ్యునరేషన్లతో కలిసి దాదాపు రూ. 500 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. శంకర్(shankar)సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ ఉండాల్సిందే. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తాడు. ఇక గేమ్ ఛేంజర్‌లో కూడా శంకర్ శైలీ పాటలు మూడు ఉన్నాయట. విజువల్ ట్రీట్ ఇచ్చేలా వాటిని తెరకెక్కించామని శంకర్ చెబుతున్నాడు. బయటి కంటే థియేటర్లో చూస్తేనే పాటలు ఇంకా బాగా ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు కూడా అంటున్నాడు. అయితే ఆ పాటలు చిత్రీకరించేందుకు శంకర్ భారీగా ఖర్చు చేశాడట. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ కోసం కోట్లల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం దాదాపు 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దించాడు శంకర్. వైజాగ్, అమృత్ సర్ వంటి ఏరియాల్లో షూట్ చేశారు. ఈ పాట షూటింగ్ సమయంలో ఒక్కరోజుకే రూ. 78 లక్షల వరకు ఖర్చు చేశారట. సినిమా మొత్తంలో ఒక్కరోజులో అయిన హయ్యెస్ట్ ఖర్చు ఇదేనట. మొత్తంగా ఈ పాట కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ పాటల స్థాయి తెలుస్తుందని దిల్ రాజు అంటున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan)కి జోడీగా కియరా అద్వానీ నటించగా..శ్రీకాంత్, అంజలి, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. Amritsar lo #Gamechanger song kosam okka roju ayina karchu 78 lakhs !!💲💸💰That was the day when the highest amount of money was spent while I was there🎯500 dancers participated in that song 🔥💥#RamCharan @AlwaysRamCharan @SVC_official pic.twitter.com/Q3L7VLHDje— Mr.RK 🎯🦁 (@RavikumarJSP) December 27, 2024 -
‘డ్రింకర్ సాయి’ మూవీ రివ్యూ
టైటిల్: డ్రింకర్ సాయి (బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్)నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, స్ఎస్ కాంచి, కిర్రాక్ సీత, రీతు చౌదరి,తదితరులునిర్మాణ సంస్థలు: ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టిసంగీతం: శ్రీవసంత్లిరిక్స్: చంద్రబోస్ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: డిసెంబర్ 27, 2024ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బూతు డైలాగ్స్‌తో పాటు మంచి ఎమోషన్‌తో కూడా ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘డ్రింకర్ సాయి’పై బజ్ క్రియేట్ అయింది. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 27) వచ్చిన ఈ చిన్న చిత్రం ఎలా ఉంది? ‘డ్రింకర్ సాయి’దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మత్తు ఎక్కిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సాయి అలియాస్ డ్రింకర్ సాయి(ధర్మ) బాగా ధనవంతుడు. పెరెంట్స్ చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం..అరెస్ట్ అయితే అతని అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) బెయిల్‌పై విడిపించడం..ఇదే తంతుగా మారుతుంది. ఓసారి బాగా తాగిఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగీ(ఐశ్వర్య శర్మ) తన బైక్‌తో ఢీకొట్టి పారిపోతుంది. ఆ మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగీనే అని తెలుసుకుంటాడు. అమెతో గొడవపడేందుకు వెళ్లి.. ప్రేమలో పడిపోతాడు. బాగీకి మాత్రం సాయి అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగీ ప్రేమను పొందేందుకు సాయి చేసిన ప్రయత్నాలు ఏంటి? బాగీ తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత సాయి ఏం చేశాడు? తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారి తీసింది? చివరకు సాయి బాగీ ప్రేమను పొందాడా లేదా? అనేదే మితగా కథ. ఎలా ఉందంటే.. హీరో తాగుతూ జులాయిగా తిరగడం.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం..ఓ మంచి పని చేసి చివరకు ఆమె ప్రేమ పొందడం..ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీనే. తాగుడుకు బానిసైన హీరో.. తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే హీరోయిన్ని ఎలా ప్రేమలో పడేశాడనేది ఈ సినిమా కథ. చివరిలో ఓ సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ ప్రేమకథను ప్లస్ పాయింట్. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఇదొక బోల్డ్ మూవీ, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉంటాయని అనుకుంటారు. కానీ తెరపై సినిమా చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగదు. ఒకటి రెండు చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా..ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే తక్కువే అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చివరిలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. కానీ ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథ, రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ వెంబడి పడడం.. ఆమె ఛీకొట్టడం.. చివరి వరకు ఇదే ఉంటుంది. లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్‌గా సాగుతుంది. అయితే వంతెన (భద్రం) పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండకపోగా.. సాఫీగా సాగుతున్న లవ్‌స్టోరీకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది. ఓ పిల్లోడితో చేయించే కామెడీ ఇరికించినట్లుగా ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ సాగుతుంది. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం దర్శకుడు ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయాడు. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథ, కథనం మరింత బలంగా రాసుకొని ఉంటే డ్రింకర్ సాయి బాక్సాఫీస్‌ని ఊగించేవాడు. ఎవరెలా చేశారంటే.. ధర్మకి ఇది రెండో సినిమా. అంతకు ముందు సింధూరం అనే సినిమాలో నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినా.. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాకే మంచి పాత్ర లభించింది. బాగీ పాత్రలో ఆమె జీవించేసింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిర్రాక్ సీత, రీతూ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవసంత్ సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. పాటలు బాగున్నాయి. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ సీన్ తెరపై రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
కిచ్చా సుదీప్ ‘మాక్స్’ మూవీ రివ్యూ
టైటిల్ : మాక్స్ నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులునిర్మాత: కలైపులి ఎస్. థానుదర్శకత్వం: విజయ్ కార్తికేయసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్రఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబువిడుదల తేది: డిసెంబర్ 27, 2024కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.మాక్స్ కూడా కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.సీఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్ మాదిరి తెరపై ఒక్క సీన్ కూడా లేకపోవడం మైనస్. విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. పోలీసు స్టేషన్..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. ఒకటి రెండు యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం కథనం పరుగులు పెడుతుంది. టైమ్ కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్, యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఎవరెలా చేశారంటే.. కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది. రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ
టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్ మోహన్సంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్ఎడిటర్: అవినాష్ గుర్లింక్విడుదల తేది: డిసెంబర్ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
OTT: హిట్లర్’ రివ్యూ.. ఇదో లవ్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాంనెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది. ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు. -
విజయ్ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ
టైటిల్: విడుదల 2నటీనటులు: విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులునిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)దర్శకత్వం: వెట్రీమారన్సంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: వేల్ రాజ్ఎడిటింగ్: ఆర్. రామర్విడుదల తేది: డిసెంబర్ 20, 2024విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు. మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వెట్రిమారన్ సినిమాలు అంటేనే వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. అణచివేత, పెత్తందార్లపై పోరాటాలే ఆయన కథలు. విడుదల పార్ట్ 2 నేపథ్యం కూడా అదే. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా బయటపడేలా చేశారు అనేది ఈ సినిమా కథ. విడుదల పార్ట్ 1 చూసిన వారికి పార్ట్ 2 కథనం ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. పార్ట్ 1లో సూరి పాత్రలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అమాయకత్వం, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ గల సూరి స్టోరీ అందరి మనసులని కలిచి వేస్తుంది. అయితే పార్ట్ 2లో మాత్రం సూరి పాత్ర నిడివి చాలా తక్కువ. కథనం మొత్తం విజయసేతుపతి పాత్ర చుట్టే తిరుగుతుంది. చాలా తమిళ సినిమాల్లో చూసిన దళితభావానికి ఎర్రజెండా వాదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్. ఎప్పటి ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి అందరికి అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే మావోయిస్ట్ ఆవిర్భావం, ఎర్రజెండా వాదం వెనుక ఉన్న ఉద్దేశం వివరించాడు. నక్సలైట్స్ ఎలా కలుసుకుంటారు? సమాచారాన్ని ఎలా చేరవేస్తారు? బడుగు బలహీన వర్గాలతో వారి సంబంధం.. ప్రతీది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా.. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి విషయాన్ని చాలా డీటేయిల్డ్‌గా చూపించడంతో సాగదీతగా అనిపిస్తుంది. దళితులపై దాడి మొదలు పోలీసుల, నక్సల్స్ మధ్య జరిగే పోరు వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు చేస్తాయి. అయితే ఓ ఉద్యమ కథకి చక్కని ప్రేమ కథను జోడించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పెరుమాళ్, మహాలక్ష్మిల ప్రేమ కథ ఆకట్టుకుటుంది. కరుప్పన్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ నక్సలైట్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెరపై చూస్తున్నప్పడు.. ఆ పాత్రపై జాలీతో పాటు పెత్తందారి వ్యవస్థపై అసహ్యం కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం అక్కడడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగే ఎన్కౌంటర్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. ఒకనొక దశలో ఓ డాక్యూమెంటరీ ఫిల్మ్ చూసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. పార్ట్ 3 కోసం తీసుకున్న లీడ్ బాగుంది. వామపక్ష భావజాలం ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఆయన జీవించేస్తాడు. పెరుమాళ్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. పోలీసు స్టేషన్లో నగ్నంగా ఉండే సీన్ అయినా.. ఇంట్లో భార్య ముందు స్నానం చేసే సన్నివేశం అయినా.. ఎక్కడ కూడా ఆయన నటించనట్లు అనిపించదు. ఆయన నటన అంత సహజంగా ఉంది. మంజు వారియర్‌కి కూడా బలమైన పాత్ర లభించింది. అభ్యుదయ భావజలం గల మహాలక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. పోలీస్ డ్రైవర్ కొమరన్గా సూరి చక్కగా నటించాడు. అయితే పార్ట్ 2లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఓ ఉద్యమ కథకి కావాల్సిన బీజీఎం అందించాడు. పాటలు పర్వాలేదు. డబ్బింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెంకడాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ
టైటిల్: బచ్చల మల్లినటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులునిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుట్టదర్శకత్వం: సుబ్బు మంగాదేవిసంగీతం: విశాల్ చంద్రశేఖర్సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్విడుదల తేది: డిసెంబర్ 20, 2024కథేంటంటే.. ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు. నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ బ్యాగ్రౌండ్, హీరో పాత్రకి నెగెటివ్ షేడ్స్ , రా అండ్ రస్టిక్ వాతావరణం.. ఈ నేపథ్యంతో కూడిన కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. బచ్చల మల్లి కూడా అలాంటి చిత్రమే. దర్శకుడు ఎంచుకుంది ట్రెండింగ్ సబ్జెక్ట్ అయినా తెరపై ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. పాత్రలను తిర్చిదిద్దిన విధానంపై పెట్టిన శ్రద్ధ.. కథనంపై పెట్టలేదు. హీరోకి విలనిజం లక్షణాలు ఉన్నా.. ప్రేక్షకులు ఆ పాత్రలో కనెక్ట్ కావాలి. అప్పుడే కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ బచ్చల మల్లి విషయంలో అది మిస్ అయింది. హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అసలు హీరోకి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనేది అర్థం కాదు. యాక్షన్ సీన్స్ కూడా బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతే. అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న హీరో.. తల్లి ఒక మాట చెప్పగానే మారిపోవడం, హీరోయిన్ తండ్రితో చివరిలో ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పించడం..ఇవన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా ఎమోషనల్‌గా టచ్ చేయవు. ఇక హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్ర పరిచయం, అతను మూర్ఖుడిగా మారడానికి గల కారణాలు కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి. హీరో మూర్ఖుడిగా మారిన తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఓ కొత్త పాత్ర ఎంట్రీతో వచ్చే ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ కొత్త పాత్ర నేపథ్యం తెలిసిన తర్వాత సెకండాఫ్ కూడా రొటీన్ సీన్లతో నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. మూర్ఖత్వంతో సరిదిద్దుకోని తప్పులు చేయ్యొద్దని దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. బచ్చల మల్లి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు . డైలాగు డెలివరీ బాగుంది. హనుమాన్ ఫేం అమృతా అయ్యర్, కావేరి పాత్రకు న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించింది. హీరో తండ్రిగా బలగం జయరాం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అచ్యుత్ కుమార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. అయితే ప్రధాన కథకి ఆ పాత్రతో సంబంధమే ఉండదు. హరితేజ, ప్రవీణ్, రావు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు పర్వా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Out of My Mind Review: ఆ అమ్మాయి గెలిచిందా?
పిల్లలూ మన దగ్గర అన్నీ ఉండి హయ్యర్ గ్రేడ్స్ అచీవ్ చేయలేకపోతే అది మన ప్రాబ్లం. కానీ చాలా ఇష్యూస్ ఉండి ఎవరైనా కష్టపడి హై స్టేటస్ అచీవ్ చేస్తే మాత్రం వాళ్ళని గ్రేట్ అంటారు. అలాంటి వాళ్ళు మనకు ఇన్సిపిరేషనల్. సో ఒక ఇన్సిపిరేషనల్ మరియు ఎమోషనల్ లైన్ తో చేసిన మూవీ నే ఈ అవుట్ ఆఫ్ మైండ్. ఈ మూవీ ని ఆంబర్ సీలే అనే డైరెక్టర్ తీశారు. ఈ సినిమా మెలోడీ అనే అమ్మాయికి సంబంధించినది. ఆ అమ్మాయికి సెలిబ్రల్ పాల్సీ అనే డిసీజ్ వల్ల తను మాట్లాడలేదు, నడవలేదు. కాబట్టి మూవీ మొత్తం తను వీల్ ఛైర్ లో ఉంటుంది. ఆ అమ్మాయి ఏమైనా చెప్పాలనుకుంటే మెడ్ టెక్ వాయిస్ ద్వారా ఇతరులకు కమ్యునికేట్ చేస్తుంది. కాని ఈ కమ్యునికేషన్ వల్ల మెలోడీ తాను చదివే స్కూల్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. స్కూల్ తరపున జరగబోయే విజ్ కిడ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది మెలోడీ. మెలోడీ క్లాస్ టీచరైన డయాన్ తో పాటు తన తోటి స్టూడెంట్ అయిన రోజ్ కూడా మెలోడీని చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో మెలోడీ విజ్ కిడ్స్ లో పార్టిసిపేట్ చేసిందా... ఒకవేళ చేస్తే ఎలా చేసింది అనే విషయాలు హాట్ స్టార్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్న ఔట్ ఆఫ్ మై మైండ్ మూవీ చూడాల్సిందే. సినిమా మొత్తం మాటల్లేకుండా మెలోడీ పాత్రలో ఫోబ్ రే టేలర్ అనే ఆర్టిస్ట్ తన యాక్టింగ్ తో మైండ్ బ్లోయింగ్ అని అనిపించుకుంది. తను నిజ జీవితంలో కూడా ఈ సెలిబ్రల్ పాల్సీ తో సఫర్ అవుతోంది. కిడ్స్ ఒక్కసారి ఆలోచించండి మనం కదల్లేక, మాట్లాడలేక వున్న టైంలో మనం చేయాలనుకున్న పనులు ఎలా చేయగలుగుతాం బట్ ఈ మూవీలో మెలోడీ అవన్నీ చేసి చూపించింది. ఎలానో మీరు మూవీ చూసేయండి. వాచ్ దిస్ వీకెండ్ ది ఇన్సిపిరేషనల్, ఎమోషనల్ మైండ్ బ్లోయింగ్ మూవీ ఔట్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ హాట్ స్టార్. - ఇంటూరు హరికృష్ణ -
‘ప్రణయ గోదారి’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రణయ గోదారినటీనటులు: సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్, పృథ్వి, సునిల్, జబర్థస్త్ రాజమౌళి తదితరులునిర్మాణ సంస్థ: పీఎల్వీ క్రియేషన్స్నిర్మాత: పారమళ్ల లింగయ్యదర్శకత్వం: పీఎల్ విఘ్నేష్సంగీతం: మార్కండేయఎడిటర్: కొడగంటి వీక్షిత వేణువిడుదల తేది: డిసెంబర్ 13, 2024కథేంటంటే..గోదారికి చెందిన పెదకాపు(సాయి కుమార్) వెయ్యి ఎకరాల ఆసామి. చుట్టూ ఉన్న 40 గ్రామాలకు ఆయనే పెద్ద. ఆయన చెప్పిందే న్యాయం. ప్రేమ వివాహం చేసుకున్న పెదకాపు చెల్లి..భర్త చనిపోవడంతో కొడుకు శ్రీను(సదన్ హాసన్)తో కలిసి అన్నయ్య దగ్గరకు వస్తుంది. తన కూతురు లలిత(ఉష శ్రీ)ని మేనల్లుడు శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు పెదకాపు. కానీ శ్రీను ఆ ఊరి జాలరి అమ్మాయి గొయ్య లక్ష్మి ప్రసన్న అలియాస్ గొయ్యని(ప్రియాంక ప్రసాద్)ఇష్టపడతాడు. గోచిగాడు(సునిల్)తో కలిసి రోజు గోదారి ఒడ్డుకు వెళ్లి గొయ్యని కలుస్తుంటాడు. వీరిద్దరి ప్రేమ విషయం పెదకాపుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే పెదకాపు మేనల్లుడి ప్రేమను అంగీకరించాడా లేదా? గొయ్య, శ్రీనులను కలిపేందుకు గోచి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? చివరకు గొయ్య, శ్రీనులు కలిశారా లేదా? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రణయ గోదారి కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ' పునర్జన్మ నేపథ్యంతో హృద్యమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు పీఎల్ విఘ్నేష్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం రొటీన్‌గా ఉంటుంది. ప్లాష్‌బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. . గొయ్యతో శ్రీను ప్రేమలో పడడం.. తన ప్రేమ విషయాన్ని చెప్పడం శ్రీను చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య గోచి పాత్ర చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం గొయ్య, శ్రీనుల ప్రేమ చుట్టునే కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రేమ విషయం పెద కాపుకు తెలియడం.. మరోవైపు గొయ్యకి వేరే వ్యక్తితో పెళ్లికి చేసేందుకు రెడీ అవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. గోచి పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో సాయి కుమార్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని, తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేవి. ఎవరెలా చేశారంటే..సదన్, ప్రియాంక ప్రసాద్ కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. సిటీ యువకుడు, పల్లెటూరి అబ్బాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన సదన్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక గొయ్యగా ప్రియాంత తెరపై అందంగా కనిపించింది. ఈమె పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. వీరిద్దరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయి కుమార్‌ది. పెదకాపు పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సినిమా చూసిన వారు గోచి పాత్రను మరచిపోరు. ఆ పాత్రలో సునిల్ ఒదిగిపోయాడు. సినిమా మొత్తం నవ్విస్తూ.. చివరిలో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. జబర్థస్త్ రాజమౌళి తనదైన కామెడీతో నవ్వించాడు. పృథ్వి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్కండేయ అందించిన పాటలు సినిమాకు ప్రధాన బలం. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రేటింగ్: 2.5/5 -
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Pushpa 2 X Review: ‘పుష్ప 2’మూవీ ట్విటర్ రివ్యూ
అల్లు అర్జున్ ఫ్యాన్‌తో పాటు యావత్ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప- ది రైజ్’ కి సీక్వెల్ కావడంతో ‘పుష్ప 2: ది రూల్’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దానికి తోడు పాట్నా మొదలుకొని చెన్నై, ముంబై, కొచ్చి లాంటి నగరాలతో పాటు దేశమంతా తిరిగి ప్రచారం చేయడంతో ‘పుష్ప 2’పై భారీ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పుష్ప 2 కథేంటి? ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్ ) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బన్నీ మాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. #Pushpa2 definately cross 250 cr on 1st day 🔥 What a film https://t.co/zSTuWaSX93— Sameer Chauhan 🥷 (@srk_MrX) December 5, 2024 First Day First Show #Pushpa2TheRulereviewReally A Great Movie - Full Paisa Wasool. #RashmikaMandana And #AlluArjun𓃵 Killer🔥 #Pushpa2 #AlluArjun #Pushpa2ThaRule #Pushpa2Review #WildfirePushpa pic.twitter.com/ii4jx7vbWs— Lokesh 🕉️ (@LokeshKhatri__) December 5, 2024 #Pushpa2 is a Decently Packaged Commercial Entertainer with a Good 1st Half and a 2nd Half that started well but drops pace significantly in the last hour. The first half starts right where Part 1 ends. This half runs purely on drama which feels slightly slow at times but…— Venky Reviews (@venkyreviews) December 4, 2024 పుష్ప 2 డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్.ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ స్టార్టింగ్ బాగుంది కానీ చివరి గంట డ్రాప్ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాను.#Pushpa2TheRule Review 1st Half = Excellent 🥵2nd Half = Justified 🙂Rating = 3.25/5🥵❤️🔥— Rama (@RameshKemb25619) December 4, 2024 ఫస్టాప్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ కథకి న్యాయం జరిగింది అంటూ మరో నెటిజన్ 3.25 రేటింగ్ ఇచ్చారు.Icon star #ALLUARJUNNata viswaroopam 🔥🔥brilliant Director Sukumar Ramapage 🔥🔥🔥India’s Biggest Blockbuster #Pushpa2 #pushpatherule— Maduri Mattaiah Naidu (@madurimadhu1) December 4, 2024 ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం, సుకుమార్ డైరెక్షన్ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.Kuthaa Ramp undhi Movie🔥🔥🔥@alluarjun acting ayithe vere level especially aa Jathara scene ayithe punakale🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Sukumar writing excellent @ThisIsDSP bgm 🔥🔥Pushpa gadi Rulu India shake avuthadi🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2TheRuleReview #Pushpa2— Hanish (@HarishKoyalkar) December 4, 2024Good 1st half Below average 2nd half Bad climax#Pushpa2 #Pushpa2TheRule Bhaai one man show ! #Pushpa2Review #Pushpa2Celebrations— CeaseFire 🦖 (@Rebelwood_45) December 4, 2024#Pushpa2 #1stHalfReviewSuperb and very entertaining. Just a mass 🔥🔥 Comedy, dialogue delivery @alluarjun just nailed it. The real Rule of #Pushpa #FahadFaasil craziness is just getting started. Waiting for 2nd half 🔥#SamCS BGM 🔥🔥🔥— Tamil TV Channel Express (@TamilTvChanExp) December 4, 2024#Pushpa2 #AlluArjun𓃵 Power packed first half followed by a good second halfSukkumark in writing and screenplay 3hr 20 mins lo oka scene kuda bore kottadu 💥Rashmika acting 👌Songs bgm💥Cinematography too good vundi asalu @alluarjun nee acting ki 🙏Peak commercial cinema.— Hussain Sha kiran (@GiddaSha) December 4, 2024 -
Spellbound Review : పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా
అవాక్కవుతారు అంతే! చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెప్తే ఎంచక్కా వినేవాళ్ళం. ఆ కథల్లో మనం ఎప్పుడూ చూడని మాయలు, ఎన్నడూ వినని అద్భుతాలు ఎన్నో ఉండేవి. అలాంటి కథలన్నీ అప్పుడప్పుడు సినిమా రూపంలో మన ముందుకు వస్తూ వున్నాయి. అటువంటి కథే ఈ ‘స్పెల్‌బౌండ్’. ఈ సినిమా సూపర్ యానిమేటెడ్ ఫాంటసీ కామెడీ మూవీ. అద్భుతమైన కథతో అంతకన్నా అద్భుతమైన విజువల్స్, క్యారెక్టర్స్‌తో సూపర్‌గా ఉంటుంది. దర్శకుడువిక్కీ జాన్సన్. స్పెల్‌బౌండ్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక కథ విషయానికొస్తే.. మ్యాజికల్ కింగ్డమ్ అయిన లుంబ్రియాలో రాజు, రాణి డార్క్ మేజిక్ వల్ల మాన్స్టర్స్గా మరిపోతారు. వారిద్దరి కుమార్తె అయిన ఎలెన్ తన తల్లిదండ్రుల గురించి దిగాలు పడుతుంది. రాజ్యంలో ఎవ్వరికీ ఈ విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. అయితే ఈ విషయంలో సన్ అండ్ మూన్‌కి సంబంధించిన ఒరకిల్స్ అయిన సన్నీ అండ్ లూనో సహాయం కోరుతుంది ఎలెన్. వాళ్ళు లుంబ్రియా కి వచ్చి ఎలెన్ తల్లిదండ్రులను చూసి భయపడిపోతారు. ఎలెన్ ఈ విషయంలో బాధపడి ఈసారి వాళ్ళున్న చోటికే తన తల్లిదండ్రులను తీసుకువెళుతుంది. మరి ఒరకిల్స్, ఎలెన్ తల్లిదండ్రులను మార్చగలిగారా లేదా అన్నది స్పెల్‌బౌండ్ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కథతో పిల్లలను చక్కగా ఆకట్టుకుంటుంది. అలాగే సినిమా ఆఖర్లో పేరెంట్స్‌కు మంచి మెసేజ్ కూడా ఉంది. అందుకే ఈ స్పెల్‌బౌండ్ పిల్లల సినిమానే కాదు పెద్దవాళ్ళు కూడా చూడాల్సిన సినిమా. సో కిడ్స్ గ్రాబ్ యువర్ రిమోట్ ఎలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ టు బి స్పెల్‌బౌండ్ బై స్పెల్‌బౌండ్ మూవీ. – ఇంటూరి హరికృష్ణ -
‘ఉద్వేగం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉద్వేగంనటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధుదర్శకుడు: మహిపాల్ రెడ్డిసంగీతం: కార్తిక్ కొడగండ్లసినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: జశ్వీన్ ప్రభువిడుదల తేది: నవంబర్ 29, 2024కథేంటంటే..మహీంద్రా (త్రిగుణ్) ఓ లాయర్. క్రిమినల్ కేసులు వాధించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం లేదంటే ప్రియురాలు అమ్ములు(దీప్సిక)తో గడపడం..ఇదే మహీంద్ర దినచర్య. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో , ఓ గ్యాంగ్ రేప్ కేసు మహీంద్రా దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్రా నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకాప్ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్ తరపున వాదించేందుకు మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ ప్రసాద్(శ్రీకాంత్ అయ్యంగార్) రంగంలోకి దిగుతాడు.ఈ గ్యాంగ్ రేప్ మహీంద్రా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఈ కేసులో ఎవరు గెలిచారు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే.. కోర్డు డ్రామా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అన్నింటిలోనూ హీరో అమ్మాయిల తరపున వాదిస్తుంటాడు. కానీ హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిదింతుడి తరపున వాదించడం అనేది ఈ సినిమాలో కొత్త పాయింట్. దర్శకుడు ఇలాంటి పాయింట్ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే కథను ప్రారంభించిన విధానం కాస్త నెమ్మదిగా ఉంటుంది. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..లాయర్ మహీంద్రగా త్రిగుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక లాయర్ ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిమాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తిక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటర్ జశ్వీన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రేటింగ్: 2.25/5 -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ
టైటిల్: మెకానిక్ రాకీనటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్నిర్మాత : రామ్ తాళ్లూరిదర్శకత్వం: రవితేజ ముళ్లపూడిసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మనోజన్ రెడ్డి కాటసానిఎడిటింగ్: అన్వర్ అలీవిడుదల తేది: నవంబర్ 22, 2024జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షలను అలరించిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు విశ్వక్ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేయడంతో ‘మెకానిక్ రాకీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేశ్ వీకే)నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా జాయిన్ అవుతాడు. కార్లను రిపేర్ చేస్తూ.. మరోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజీపై రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. వారసత్వంగా వస్తున్న ఆ గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ(శ్రద్ధా శ్రీనాథ్) వస్తుంది. తాను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నానంటూ రాకీతో పరిచయం చేసుకుంటుంది. రాకీ సమస్య తెలిసి మాయ ఎలాంటి సహాయం చేసింది? గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ఏం చేశాడు? కాలేజీలో ప్రేమించి అమ్మాయి ప్రియ(మీనాక్షి చౌదరి) గురించి రాకీకి తెలిసి షాకింగ్ విషయాలు ఏంటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? ప్రియ, రాకీల జీవితాల్లోకి మాయ వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా కథ ప్రారంభ సన్నివేశాలను చూడగానే ఇదొక సాదాసీదా ప్రేమ కథ అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్, కామెడీ సీన్లన్ని రొటీన్‌గా సాగుతాయి. ఒకనొక దశలో ఇది కామెడీ లవ్‌స్టోరీ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా జానరే మారిపోతుంది. అప్పటి వరకు కథపై ఉన్న ఓపీనియన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని తెలిసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే థ్రిల్లింగ్‌గా అపిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక్కో మలుపు ఉంటుంది. ఆ మలుపు సీన్లను మరింత థ్రిల్లింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. కొన్ని ట్విస్టులను ముందే ఊహించొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాన్ని, ఆశని ఆసరాగా తీసుకొని కొంతమంది చేస్తున్న ఆన్లైన్ మోసాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాని చుట్టు అల్లుకున్న కథే రొటీన్‌గా ఉంది. భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. మోతాదుకు మించి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కథనం వాస్తవికానికి దూరంగా సాగితున్నందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రాకీ అలియాస్ మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. అయితే ఈ తరహా పాత్రలు విశ్వక్ చాలానే చేశాడు. అందుకే తెరపై కొత్తదనం కనిపించలేదు. మాయగా శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టేసింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరికి చాలా బలమైన పాత్ర దొరికింది. మిడిల్ క్లాస్ యువతి ప్రియగా ఆమె చక్కగా నటించింది. తెరపై శ్రద్ధా, మీనాక్షి ఇద్దరూ అందంగా కనిపించారు. హీరో తండ్రిగా నరేశ్ తనకు అలవాటైన పాత్రలో జీవించేశాడు. సునీల్, హర్షవర్ధన్, రఘు, వైవా హర్షతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Mechanic Rocky Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?
మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నేడు(నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మెకానిక్ రాకీ ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని, విశ్వక్ తన నటనతో ఇరగదీశారని కొంతమంది అంటుంటే.. ఇది యావరేజ్ మూవీ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. #MechanicRocky మూవీ1st Half Ok2nd Half Extra Ordinary 👌🔥Far Better Than Recent Small Movies HIT Movie @VishwakSenActor Anna 🎉— Somesh NTR (@NtrFanELURU) November 22, 2024 ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ అదిరిపోయింది. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న చిత్రాలతో పోలిస్తే మెకానిక్ రాకీ మూవీ చాలా బెటర్. హిట్ మూవీ విశ్వక్ అన్న అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#MechanicRocky review బోరింగ్ ఫస్ట్ హాఫ్...ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవటం వల్ల ఓపికకు పరీక్షా పెడుతుంది సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు.. సినిమాలో ఉన్న ట్విస్ట్‌లు ఇంప్రెసివ్ గా వున్న స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం వల్ల పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు..మొత్తంగా ఇది చాలా సాదాసీదా…— Cinethop (@cinethop) November 22, 2024 బోరింగ్ ఫస్ట్ హాఫ్...ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవటం వల్ల ఓపికకు పరీక్షా పెడుతుంది .సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు.. సినిమాలో ఉన్న ట్విస్టులు ఇంప్రెసివ్ గా ఉన్న స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం వల్ల పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు.. మొత్తంగా ఇది చాలా సాదాసీదా సినిమా అంటూ మరోనెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు.Hittu movie👍 bit worried aftr hearing the title, thinking it might be routine, but u proved me wrong. Great acting. Congrats, @VishwakSenActor. U r the next big thing! #MeenakshiChoudhary 👍 Another nice role @ShraddhaSrinath. Good score @JxBe. My rating: 3/5 #MechanicRocky https://t.co/C8LBDcZP3r— Venkat Kondeti (@venkatpazzo) November 21, 2024#MechanicRocky’s story has the potential to be a good thriller, but the first half is unengaging and tedious. While the second half offers some twists and turns, the pacing and screenplay doesn’t get much engaging. It could have been much more tolerable if the comedy had landed.— Well, It’s Just My Opinion (@WIJMyOpinion) November 22, 2024Hit bomma1 half- average Little bit boring 2 half -mind blowing with twists Overall-3.5/5#MechanicRocky #blockbustermechanicRocky pic.twitter.com/kP16RkNA59— muddapappu (@muddapappu69) November 22, 2024#MechanicRocky Substandard 1st Half!Apart from a few jokes here and there, this film offers nothing interesting so far and irritates at times. The screenplay is outdated. Comedy is over the top for the most part and does not work. Not much of a storyline either. Need a big…— Venky Reviews (@venkyreviews) November 21, 2024💫 #MechanicRockyReview: Some twists Saved the Movie- #Vishwaksen is Good, Tried hard- #MeenakshiChaudhary gets a good role this time- Internal, 2nd half twists are worked well- But lag scenes, predictable screenplay & Somd dull moments #MechanicRocky #Jrntr #Devara #War2 pic.twitter.com/88V3dB1Lid— MJ Cartels (@Mjcartels) November 22, 2024 -
‘జీబ్రా’ క్లైమాక్స్ వరకు ఆ విషయం తెలియదు: సత్యదేవ్
‘ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థ అంతా డిజిటల్ అయ్యింది. అక్కడ క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే తప్పులు తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించాడు. ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు హీరో సత్యదేవ్. కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ హైలీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరి వరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.→ ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.→ ఇందులో నేను బ్యాంకర్ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరవుతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.→ నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.→ ప్రస్తుతం 'ఫుల్ బాటిల్' అనే సినిమా చేస్తున్నాను. అది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది. -
OTT: హాలీవుడ్ మూవీ ‘ది డైవ్’ రివ్యూ
ఏదైనా సమస్య వచ్చినపుడు పరిష్కారం కోసం చూడాలి. అంతేకాని ఆ సమస్య వల్ల కుంగిపోకూడదు. ఆదే సమస్య తో పాటు మరి కొన్ని సమస్యలు వచ్చినా మన మనో ధైర్యమే మనల్ని కాపాడుతుంది అన్న నమ్మకం ఉండాలి. ఈ దృక్పథంతో రూపొందిన సినిమాయే ది డైవ్. 2020 సంవత్సరంలో వచ్చిన నార్వే సినిమా బ్రేకింగ్ సర్ఫేస్ కి ఇది మూలం. ది డైవ్ సినిమాని మాక్సిమిలన్ అనే హాలివుడ్ దర్శకుడు దర్శకత్వం వహించి నిర్మించారు.ఈ సినిమా మొత్తం ఇద్దరు వ్యక్తుల మీదే నడుస్తుంది. ఓ రకంగా ఆ ఇద్దరే ఈ సినిమా అంతా కనపడే నటులు. కనిపించేది ఇద్దరు నటులే అయినా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు కూర్చున్న కుర్చీ బిగపట్టిన చేతిని వదలడు. అంతటి ఉత్కంఠభరితంగా నడుస్తుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే.ఈ సినిమా కథాంశం ఏమిటంటే మే, డ్రూ అక్కాచెల్లెళ్ళు. ఓ సారి ఇద్దరూ చాలా దూర ప్రాంతంలోని ఓ సముద్రపు లోయలోకి ఈతకు వెళతారు. ఇద్దరూ సముద్రంలోకి చాలా లోతుగా వెళతారు. సముద్రపు అట్టడుగు భాగంలో సరైన గాలిగాని వాతావరణంకాని ఉండదు. అలాంటిది ఆ ఇద్దరిలో ఒకరయిన మే 80అడుగుల నీళ్ళలో ఓ బండరాయి క్రింద ప్రమాదవశాత్తు ఇరుక్కుపోతుంది. ఇప్పుడు తనను కాపాడాల్సిన బాధ్యత డ్రూ మీద పడుతుంది. డైవింగ్ లో మే వాడుతున్న ఆక్సిజన్ సిలిండెర్ 20 నిమిషాల కంటే ఎక్కువ రాదు. ఒకవేళ పైకి వచ్చి ఇంకెవరినైనా సాయం అడుగుదామనుకున్నా వీళ్ళు వెళ్ళింది ఓ నిర్మానుష్య ప్రాంతానికి. ఇక మిగతా కథ మొత్తం మేని డ్రూ ఎలా కాపాడుతుంది అన్న దాని మీదే ఉత్కంఠగా నడుస్తుంది. సినిమాలో డ్రూ తన అక్క కోసం పడిన బాధ, చూపించిన తెగువ ప్రేక్షకులను మైమరిపిస్తుంది. సినిమా ఆఖర్లో చూసే ప్రతి ప్రేక్షకుడు అమ్మయ్య బ్రతికారు అని అనుకోకుండా వుండలేరు. ఓ రకంగా నేటి తల్లిదండ్రులందరూ ఈ సినిమాని తమ పిల్లల కోసం స్ఫూర్తిగా చూడాలి. ఎందుకంటే మన జీవితమనే రోడ్డు ప్రయాణంలో సమస్యలనే అడ్డంకులు వస్తే పరిష్కారంతో ముందుకు సాగిపోవాలి అంతేకాని వచ్చిన అడ్డంకి కోసం బాధ పడుతూవుంటే ఆ అడ్డంకి మన ప్రయాణానికి పూర్తిగా అడ్డమవుతుంది. వర్త్ టు వాచ్ ది డైవ్ ఫర్ ఎ ట్రూ స్పిరిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది)-ఇంటూరు హరికృష్ణ -
OTT: ‘ల్యాండ్ ఆఫ్ బ్యాడ్’ మూవీ రివ్యూ
సైనికుడి ప్రయాణం ప్రతి మలుపూ ప్రమాదభరితం అన్న లైన్ తో ముడిపడున్న సినిమా ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యోధుడు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ పాత్రధారి రస్సెల్ క్రోవ్ నటించిన సినిమా ఈ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. ఈ సినిమాని దర్శకులు విలియమ్ యూబ్యాంక్ రూపొందించారు. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ సినిమా ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా లభ్యమవుతుంది.ఇక సినిమా కథ విషయానికొస్తే యూఎస్ డెల్టా ఫోర్స్ ఓ పెద్ద ఆపరేషన్ చేపడుతుంది. సౌత్ ఫిలిప్పీన్స్ లో తీవ్రవాదులచే బందీగా వున్న సిఐఎ సిబ్బందిని రక్షించడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ ఆపరేషన్ కు స్టాఫ్ సార్జెంట్ నియా బ్రాన్సన్ సారధ్యంలో ఓ టీం వెళుతుంది. ఆఖరి నిమిషంలో ఈ టీం కు కొత్తగా యంగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసరైన కెన్నీ జాయిన్ అవుతాడు. ఈ కెన్నీయే మన సినిమాకు కథానాయకుడు. కెన్నీ పాత్రలో వర్ధమాన నటుడు లియామ్ హెమ్స్ వర్త్ నటించారు.ఇక పోతే ఈ టీం కు రీపర్ గ్రిమ్ డ్రోన్ సపోర్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ రీపర్ కథలో మరో ముఖ్య పాత్రధారి. రీపర్ పాత్రలో ప్రముఖ నటుడు రస్సెల్ క్రోవ్ నటించి మెప్పించాడు. నాడు గ్లాడియేటర్ గా నేడు రీపర్ గా రస్సెల్ క్రోవ్ నటన నభూతో నభవిష్యతి. యూఎస్ డెల్టా ఫోర్స్ టీం ఫిలిప్పీన్స్ ఆపరేషన్ కోసం బయలుదేరడంతో ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ కథ మొదలవుతుంది. టీం లో కెన్నీ కొత్తవాడవడం ఆ పై ఇది మొదటి ఆపరేషన్ అవడంతో టీం లోని మిగతావారు అతనిని ఆట పట్టిస్తుంటారు.జాగ్రత్తగా వ్యవహరించమని సలహాలిస్తుంటారు. ఈ ఆపరేషన్ లో భాగంగా టీంలోని మిగతా సభ్యులందరూ ఓ సమయంలో గాయపడతారు. ఆపరేషన్ కొత్త అయినా, ఎవరూ తోడు లేకున్నా కెన్నీ తనకున్న ధైర్యంతో రీపర్ సాయంతో ఆపరేషన్ ఎలా ముగించాడన్నదే ఈ సినిమా కథ. సాధారణంగా టెర్రరిస్ట్ ఎలిమినేషన్ ఆపరేషన్ అంటే గన్ ఫైట్ తప్ప ఇంకేమీ వుండదని అనుకుంటాం. కానీ సున్నితమైన సెంటిమెంటల్ లైన్ తో చక్కటి గ్రప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. వర్త్ టూ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. - ఇంటూరు హరికృష్ణ -
కామెడీ ఎంటర్ టైనర్‌గా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’
నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ నివ్వగా, సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.ఈ సందర్భగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ - మంచి కథ, కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్పెక్ట్ గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్ టైనింగ్ గా రూపొందిస్తున్నాడు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీకి నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. మాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్ శరత్ గారికి, పృథ్వీ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మేమంతా అజయ్ పట్నాయక్ గారి టీమ్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. అన్నారు.హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంద. నాయికగా ఇది నా ఫస్ట్ మూవీ. తొలి చిత్రంతోనే మంచి అవకాశం కల్పించిన నిర్మాత శరత్ గారికి, దర్శకుడు వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.హీరో నివాస్ మాట్లాడుతూ - అందరికీ నమస్కారం. మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన గెస్ట్ లు రఘుబాబు గారు, పృథ్వీగారు, ఆర్పీ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మంచి వినోదాత్మక చిత్రమిది. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. అన్నారు. -
థియేటర్లలో వరుణ్ తేజ్ మట్కా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళే విడుదలైంది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. మట్కా, జూదం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ తొలిసారిగా డిఫరంట్ రోల్లో కనిపించారు.కాగా.. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్స్ షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మట్కా మార్నింగ్ షోలు మొదలయ్యాయి. దీంతో మూవీ చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మట్కా అద్భుతంగా ఉందని.. మంచి స్టోరీ అని, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. మరికొందరైతే బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షి ఎలాంటి బాధ్యత వహించదు.కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. #MatkaBlock buster 🔥🔥🔥🔥🔥🔥🔥@IAmVarunTej pic.twitter.com/ySv0yXaSE6— TrendCharan (@TrendCharan) November 14, 2024 #Matka getting a positive Mouth talk from everyone 🤗❤️Congratulations @IAmVarunTej anna pic.twitter.com/822hcehFG6— PremKumaR ᴳᵃᵐᵉ ᶜʰᵃⁿᵍᵉᴿ ♔🚁 (@RC_Premkumar) November 14, 2024 #Matka - BLOCKBUSTER 🏆🔥2024 Best Movie....👏🏆🔥#MATKAFromToday @IAmVarunTej #MatkaReview pic.twitter.com/qGd25hzQKC— Aravind Editor (@aravindak0) November 14, 2024 -
Kanguva Review: ‘కంగువా’ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ పీయాడిక్ యాక్షన్ ఫిల్మ్‌లో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలో పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.కంగువా కథేంటి? ఎలా ఉంది? సూర్య ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో కంగువా చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సూర్య యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. శివ టేకింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, వీఎఫ్ఎక్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ అదరగొట్టేశాడని కామెంట్ చేస్తున్నారు. #Kanguva Review🌟🌟🌟🌟It's an EPIC BLOCKBUSTER 🔥 💥- #Suriya & #BobbyDeol's best movie till date and #DishaPatani also looks so hot🥵💥🔥👌- Top Tier BGM, faceoff Sequence Execution and VFX & visuals Top notch👍🔥✨🔥#KanguvaFromNov14#KanguvaBookings pic.twitter.com/6xjzx0SmVm— Ahmy (@ahmy30) November 14, 2024కంగువా బ్లాక్ బస్టర్ మూవీ. సూర్య, బాబీ డియోల్ కెరీర్లో ఇది బెస్ట్ ఫిల్మ్. దిశా పటానీ లుక్ హాట్‌గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం అదరగొట్టేశాడు. వీఎఫ్ఎక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Kanguva Review🏆🏆🏆An engaging screenplay & solid performances from @Suriya_offl 😨💥Face off scenes Adrenaline pump💉🥵Can’t wait for #Kanguva2#BobbyDeol As usual nailed with his performance, He’s A BEAST🔥@ThisIsDSP you’re a musical magician🥵Overall - 4.25/ 5 ⭐️ pic.twitter.com/SI2s22zRTF— Lets OTT x CINEMA (@LetsOTTxCinema) November 13, 2024 స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా ఉంది. సూర్య తన నటన అదిరిపోయింది. ఫేస్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి. కంగువా 2 కోసం ఆగలేకపోతున్నాం. బాబీడియోల్ ఎప్పటిమాదిరే తనదైన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది’అంటూ ఓ నెటిజన్ 4.25/5 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva is a below par fantasy action film that had a story with good potential but is executed in a clumsy way. Surya does well in his role and his efforts should be appreciated but it’s hard to save a script like this with just a performance. The film has a few decent…— Venky Reviews (@venkyreviews) November 14, 2024 కంగువా ఓ యావరేజ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. కథ బాగున్నా..తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. సూర్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాకు కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా కథంతా యావరేజ్. ఎమోషనల్ మిస్ అయింది. డైరెక్టర్ శివ ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో తడబడ్డాడు. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది.మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva - Honest Review 👍Positive : - Theatre ambience 👌- Safe Parking lot 💥- Unlimited Popcorn 🍿- Proper Sound system ♥️- Perfect AC temperature 🥶- Proper seating with correct level adjustments ✅Negative : -- Full Movie 👎👎— ... (@its_me_001) November 14, 2024Movie vera level🔥🥵🏆Siva has made a strong comeback! It’s a must-watch in theaters for its stunning visuals. As always, Suriya’s acting is outstanding.DSP BGM kangu kangu kanguvaaa🔥Racey Screen Play🔥🔥🔥Blockbuster #Kanguva 🔥🔥🔥🏆 pic.twitter.com/cLJ1qYZwAv— name_illa (@name_illainga) November 14, 2024First HalfFrancis Portion - 😐👎Kamguva Portion - 🙌Above avg 😐#Kanguva— Ciril_Thomas_997 (@Ciril_Thomas_97) November 14, 2024worth watching kanguva best ever tamil cinema . made tamil cinema at its peak 🔥🔥🔥🔥🥵🥵VFX , bgm , casting , dialogue delievery , surya 😱😱😱😱#Kanguva #KanguvaBookings #KanguvaFDFS #Surya #SiruthaiSiva #DSP #GnanavelRaja 🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳— karl marx (@vens1917) November 14, 2024 -
‘ది షార్ట్ కట్’ మూవీ రివ్యూ
కంచి రామకృష్ణ దర్శకత్వంతో అట సందీప్, షాజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది షార్ట్ కట్’.విజయానికి అడ్డదారులు ఉండవు అనేది ఉప శీర్షిక. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుకొని ఎట్టకేలను నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ప్రకాశ్(ఆట సందీప్)కి సినిమా డైరెక్టర్ కావాలని కోరిక. ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీలోకి వస్తాడు. సినిమా డైరెక్టర్ గా ఎదగాలి అన్న కోరికతో ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెబుతూ ఉంటాడు. ఒక్కరు కూడా తనకు సినిమా చాన్స్ ఇవ్వరు. మరోవైపు తన ప్రియురాలు దివ్య(షాజ్ఞ శ్రీ) మాత్రం సినిమా, డైరెక్షన్ వర్కౌట్ ఇప్పట్లో వర్కౌట్ కాదని, ఉద్యోగం చేయమని ఒత్తిడి చేస్తుంది. ప్రకాశ్ మాత్రం తన ఫోకస్ అంతా డెరెక్షన్పైనే పెడతాడు. ఎలాగైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ దొరుకుతుంది. ఆ డ్రగ్స్‌ని, అమ్మి వచ్చిన డబ్బుతో సినిమా చేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా డ్రగ్స్ మాఫీయా డాన్ చేతికి దొరుకుతాడు. ఆ తర్వాత ప్రకాశ్ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకున్నాయి? డైరెక్టర్ కావాలనే కోరిక నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కి అలవాటు పడి తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ డ్రగ్స్ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. కథా ప్రారంభం బాగుంటుంది. అయితే హీరో పాత్ర మొదలు చాలా సీన్లు కూడా గత సినిమాలను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథ మొత్తం డ్రగ్స్ మాఫియా చుట్టే తిరుగుతుంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలను జోడించి, కథను సాగదీసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశం అయితే ఇస్తుంది.ఎవరెలా చేశారంటే...ఆట సందీప్ అంటే ఇప్పటివరకు అందరికి డ్యాన్సర్‌గానే పరిచయం. ఆయనలో మంచి నటుడు ఉన్నాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. డైరెక్టర్ అయ్యి తన ప్రేమను పొందాలి అనే తపన ఉన్న కుర్రాడిగా చాలా బాగా నటించాడు. షాజ్ఞ శ్రీ నటన క్యారెక్టర్జషన్ బాగున్నాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈటీవీ ప్రభాకర్ గారి నటన అదే విధంగా డ్రగ్స్ మాఫియా కు సంబంధించి లోకల్ డాన్ క్యారెక్టర్ లో రాకేష్ మాస్టర్ నటన ప్రేక్షకులను అలరిస్తాయి. టెస్టర్ క్యారెక్టర్ లో బల్వీర్ సింగ్ సపోర్టింగ్ రోల్ లో చాలా బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఆర్ఆర్ ద్రువన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. ఎస్ ఎన్ మీరా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
OTT: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ
మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అందుకేనేమో రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కి డిమాండ్ & మార్కెట్ రెండూ ఎక్కువే. కాబట్టే ఒక్కో కారెక్టర్ సీరిస్ రూపేణా బోలెడన్ని పార్ట్స్ లో వస్తున్నాయి. అదే రేంజ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమా డిస్పెకబుల్ మి 4. జియో సినిమా ఓటిటి వేదికగా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లభ్యమవుతోంది. డిస్పెకబుల్ సీరిస్ లో ఇది 5వ సినిమా. క్రిస్ రేనాడ్ దర్శకత్వం వహించిన సినిమా అనుకున్నట్టుగానే సూపర్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళకి దీనిలో కారెక్టర్స్ తో పాటు కథ కూడా సులువుగా అర్ధమవుతుంది. దీనిలో మెయిన్ కారెక్టర్ గ్రూ. ఇక గ్రూతో పాటు ఫిల్, రోన్ మరియు రఫ్ అనే మీనియన్స్. ఈ డిస్పెకబుల్ మి 4 కథాంశానికొస్తే గ్రూ కి ఒక కొత్త ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. కాని ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర బానే వుంటాడు కాని గ్రూకి మాత్రం విసుగు పుట్టిస్తుంటాడు. కాని గ్రూ కి ఆ బాబంటే ఎంతో ఇష్టం. మరో పక్క తన ఎనిమీ అయిన మాక్స్ మీ లీమాల్ జైలు నుండి తప్పించుకుని గ్రూ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గ్రూ ఫ్యామిలీ సేఫ్ హౌస్ కి వెళుతుంది. ఇక అక్కడ నుండి గ్రూ మాక్స్ మీ లీమాల్ ను ఎలా ఎదుర్కుంటుందన్నదే మిగతా సినిమా. పైన చెప్పుకున్నట్టు రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కథను మరో లెవల్ కు తీసుకువెళతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మీనియన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా బ్యానర్ నేమ్ నుండే ఆ అల్లరి ప్రారంభమవుతుంది. గ్రూ చేసే సాహస విన్యాసాలు, మాక్సిమల్ క్రియేట్ చేసిన ఎక్సట్రార్డినరీ వెహికల్ సూపర్ గా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ బుల్ మూవీ డిస్పెకబుల్ మి 4. జీయో సినిమా వేదికగా ఉంది చూసేయండి. - ఇంటూరు హరికృష్ణ. -
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ఆదిపర్వంనటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులురచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటినిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటివిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో పాటు కథనం కూడా రొటీన్గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్‌కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్‌ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్‌లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్‌కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: జితేందర్ రెడ్డినటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంవిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్‌కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్‌లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్‌కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఎవరెలా చేశారంటే..జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - Rating: 2.75/5 -
హాలీవుడ్ మూవీ ‘డోన్ట్ మూవ్’ రివ్యూ
ప్రేక్షకులు సినిమాని చూస్తారు. కాని అదే దర్శకుడు సినిమాని సృష్టిస్తాడు. ఇక్కడ దర్శకుడు తన సృష్టి తో పాటు ఆ సినిమాని మానసికంగా అనుభూతి పొందుతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ అమెరికన్ థ్రిల్లర్ డోన్ట్ మూవ్. ఆడమ్ బ్రియో తో కలిసి రూపొందించిన ఈ సినిమా కాన్సెప్ట్ మిమ్మల్ని కన్నార్పనివ్వదు. డేవిడ్ వైట్ అందించిన కథకు వీరిరువురు ప్రాణం పోయగా, లీడ్ రోల్ లో ఐరిస్ పాత్రలో నటించిన కెల్సీ ఈ చిత్రానికి ఊపిరూదింది. సినిమా మొత్తం మనకు కెల్సీ కనిపించదు. ఐరిస్ మాత్రమే మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ సినిమా లో పెద్ద కథాంశం లేదు కాని తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం అదరహో అని చెప్పవచ్చు. ఐరిస్ హైకింగ్ లో తన కొడుకును పోగొట్టుకున్న బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడి నుండే సినిమా ప్రారంభమవుతుంది. అప్పుడే అక్కడ తనని తాను రిచర్డ్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఐరిస్ మీద ఓ ఇంజెక్షన్ తో దాడి చేస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల 20 నిమిషాలలో శరీరంలోని ఒక్కో అవయవం పని చేయకుండా పోతుందని రిచర్డ్ చెప్పి ఐరిస్ ని బందీగా చేసుకుని తనతో పాటు కారు లో తీసుకువెళుతుంటాడు. ఇంజెక్షన్ వల్ల ఒక్క కళ్ళు తప్ప ఎటూ కదలలేని ఐరిస్ రిచర్డ్ బారి నుండి తప్పించుకోలిగిందా లేదా అన్నది మాత్రం డోన్ట్ మూవ్ సినిమాలోనే చూడాలి. ఒక్కసారి ఆలోచించండి మన శరీరంలో ఏ కాలో, చెయ్యో ఇబ్బంది కలిగితేనే తట్టుకోలేము అలాంటిది దాదాపుగా అన్ని అవయవాలు పని చేయడం మానేసి ఓ నరరూప రాక్షసుడి చేతిలో బందీ అవడం అంటే అంతకన్నా దారుణం ఏముంటుంది. పైన చెప్పినట్టు దర్శకులు ఈ సినిమాని ఎలా సృష్టించారో అర్ధమవదు కాని వారి ఆలోచనా పటిమకు మాత్రం ప్రేక్షకులుగా మనం హాట్సాఫ్ చెప్పి తీరాలి. ఈ సినిమా మనం చూస్తున్నంతసేపు కదలలేము, వదలలేము ఎందుకంటే ఈ సినిమా పేరు డోన్ట్ మూవ్ కాబట్టి. ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్.-ఇంటూరు హరికృష్ణ -
Bhool Bhulaiyaa 3 X Review: భూల్ భూలయ్యా టాక్ ఎలా ఉందంటే.. ?
బాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి సింగమ్ ఎగైన్. మరొకటి భూల్ భూలయ్యా 3. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబలన్, మాధూరీ దీక్షిత్ కీలక పాత్రలు పోషించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సీరిస్ నుంచి వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, రెండు, మూడో భాగాల్లో కార్తీక్ ఆర్యన్ హీరో పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇటీవల బాలీవుడ్లో భారీ చిత్రాలేవి లేకపోవడంతో ‘భూల్ భూలయ్యా 3’పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు(నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 కథేంటి? ఈ సారి ఏమేరకు భయపెట్టింది? కార్తిక్ ఆర్యన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ట్విటర్లో భూల్ భూలయ్యా 3 చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా లేదని ట్వీట్ చేస్తున్నారు. #OneWordReview...#BhoolBhulaiyaa3: OUTSTANDING.Rating: ⭐️⭐️⭐️⭐️Entertainment ka bada dhamaka... Horror + Comedy + Terrific Suspense... #KartikAaryan [excellent] - #AneesBazmee combo hits it out of the park... #MadhuriDixit + #VidyaBalan wowsome. #BhoolBhulaiyaa3Review pic.twitter.com/t2GbQIAfri— taran adarsh (@taran_adarsh) November 1, 2024ప్రముఖ సీనీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అదిరిపోయిందంటూ ఏకంగా నాలుగు స్టార్స్(రేటింగ్) ఇచ్చాడు. హారర్, కామెడీ, సస్పెన్స్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుందని చెప్పారు. కార్తీక్ అద్భుతంగా నటించాడని, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటన బాగుందని ట్వీట్ చేశాడు. #BhoolBhulaiyaa3 first half... Full on cringe... Unnecessary songs and whatsapp forward jokes... @vidya_balan has the least screen presence but she stole the show... Hoping for a better second half... Pre-Interval block is interesting...— Anish Oza (@aolostsoul) November 1, 2024 ఫస్టాఫ్‌లో వచ్చే పాటలు కథకి అడ్డంకిగా అనిపించాయి. జోకులు కూడా అంతగా పేలలేదు. వాట్సాఫ్‌లలో పంపుకునే జోకుల్లా ఉన్నాయి. విద్యాబాలన్ తెరపై కనిపించేదది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది ఓ యావరేజ్ మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.The first one was a classic; this is just a disaster. #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review pic.twitter.com/e3VWavE9iB— Ankush Badave. (@Anku3241) November 1, 2024భూల్ భూలయ్యా మూవీ క్లాసికల్ హిట్ అయితే భూల్ భూలయ్యా 3 డిజాస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.#BhoolBhulaiyaa3 might've been highly anticipated, but the script feels completely off-track. It's almost as if someone unfamiliar with the franchise wrote it. Disappointing execution and weak storyline! #BhoolBhulaiyaa3Review.pic.twitter.com/yvZGfTSNp9— Utkarsh Kudale 18 (@BOss91200) November 1, 2024The third installment of Bhool Bhulaiyaa is here to give us a Diwali filled with excitement and surprises. A cinematic delight that keeps you hooked! #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review"— itz Joshi (@ItzKulkarni) November 1, 2024#BhoolBhulaiyaa3Review: ⭐⭐⭐⭐A thrilling blend of laughs, chills, and an unexpected twist! #BhoolBhulaiyaa3 is a wild horror-comedy ride. @TheAaryanKartik nails it with his flawless comic timing, while @tripti_dimri23 lights up the screen. @vidya_balan and @MadhuriDixit… pic.twitter.com/aoHA2OBVbs— Manoj Tiwari (@ManojTiwariIND) November 1, 2024There is no mosquito repellent in the hall! The theatre is empty, watching a movie is no fun #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Harish raj (@Harishraj162409) November 1, 2024Bhool Bhulaiyaa 3 is a spine-chilling delight!The plot twists are just mind-blowing.Kartik Aaryan owns every scene he’s in.It's a film that’ll have you laughing and screaming!#BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Dattaraj Mamledar (@DattarajMamled) November 1, 2024 -
Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే..బయోపిక్ మూవీ తీయడం దర్శకుడికి చాలా కష్టమైన పని. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. లేదా చొరవ తీసుకొని కమర్షియల్ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి సఫలం అయ్యాడు. 2014లో కశ్మిర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ముకుంద్ వరదరాజన్ గురించి తెలియని చాలా విషయాలను వెండితెరపై చూపించాడు. దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న గొప్ప సేవలను మరోసారి అందరికి గుర్తు చేశారు. ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ వీరమరణం పొందారనే విషయం మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇందు రెబక్క వర్గీస్‌తో ప్రేమాయణం.. వారిద్దరి పెళ్లికి వచ్చిన సమస్యలు? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం ఆర్మీ చేస్తున్న సేవలను ప.. ప్రతీది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్ అంతా ముకుంద్-ఇందుల లవ్‌స్టోరీతో పాటు ఇరు కుటుంబాల నేపథ్యం..ఇండియన్ ఆర్మీలో ముకుంద్ అంచెలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయికి ఎలా వచ్చారనేది గొప్పగా చూపించారు. ఇక సెకండాఫ్‌లో ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్ చేపట్టిన ఆపరేషన్ చుట్టే కథనం సాగుతుంది. అయితే ద్వితియార్థంలో కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. 25 ఏప్రిల్ 2014న, షోపియాన్ జిల్లాలోని ఖాసిపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలలో నిందితుడైన జైష్-ఎ-మహ్మద్ కమాండర్ అల్తాఫ్ వాసీతో పాటు మరికొంతమంది టెర్రరిస్టులను హతం చేయడానికి చేపట్టిన ‘ ఖాసిపత్రి’ ఆపరేషన్‌ను మేజర్ ముకుంద్ ఎలా విజవంతం చేశారనేది ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా చూపించారు. ఈ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ మధ్య వచ్చే చాలా సన్నివేశాలు మన మనసుని తడి చేస్తాయి. మన రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారమైన హృదయంతో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం శివకార్తికేయన్, సాయి పల్లవిల నటనే. మేజర్ ముకుంద్‌గా శివకార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి వారి వారి పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చీతా టీమ్ సభ్యుడు విక్రమ్ పాత్రను పోషించిన నటుడితో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ అందాలను చక్కగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. -రేటింగ్: 3.25/5 -
KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ
టైటిల్: కనటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులునిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి దర్శకత్వం: సుజీత్, సందీప్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసంఎడిటర్: శ్రీ వరప్రసాద్విడుదల తేది: అక్టోబర్ 31, 2024చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘క’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?ఇదొక డిఫరెంట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకద్వయం సందీప్, సుజిత్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. వినడానికి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ పేపర్‌పై రాసుకున్న కథను అర్థవంతంగా ప్రేక్షకులకు చూపించడంతో పూర్తిగా సఫలం కాలేదు.కథగా చూస్తే ఇది పాతదే. కానీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల వరకు ప్రేక్షకుడికి ఒక రకమైన అభిప్రాయం ఉంటే..క్లైమాక్స్ తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. కిరణ్‌తో పాటు చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో చెప్పినట్లు నిజంగానే ఈ మూవీ క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఓ కథను చెప్పొచ్చా? అని ప్రేక్షకుడు ఆలోచిస్తూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.ముసుగు వేసుకున్న వ్యక్తి హీరోని ఓ గదిలో బంధించడం..పక్క గదిలో మరో హీరోయిన్ ఉండడం..ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోని బంధించాడు? తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటి సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి కలిగించారు. ముసుగు వ్యక్తిని కొంతమంది గుర్తించినా..చివర్లో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉమెన్ ట్రాఫికింగ్ పాయింట్ రివీల్ అయ్యేవరకు దర్శకులు కథను నడిపించిన తీరు బాగుంది. అయితే ఉమెన్ ట్రాఫికింగ్ ఒక్కటే ఈ సినిమాలో ప్రధానాంశం కాదు. ముఖమైన మరో పాయింట్ కూడా ఉంటుంది. ఆ పాయింట్ కూడా పాతదే అయినా దాని చుట్టు అల్లుకున్న కథనం కొత్తగా ఉటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. అయితే ఓ ఫ్లోలో వెళ్తున్న కథకి హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తుంది. సంభాషణలు కూడా బలంగా ఉండకపోవడం మరో మైనస్. అయితే చివరి 20 నిమిషాలో వచ్చే సన్నివేశాలు మాత్రం సినిమా పై అప్పటి వరకు ఉన్న ఒపీనియన్‌ను మారుస్తాయి. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..గత సినిమాలతో పోల్చుకుంటే నటన పరంగా కిరణ్ అబ్బవరం చాలా మెరుగుపడ్డాడు. పోస్ట్ మ్యాన్ వాసుదేవ్ పాత్రలో జీవించేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీ కూడా పర్వాలేదు. హీరోయిన్ నయని సారిక తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే అని చెప్పాలి. ఇక మరో హీరోయిన్ తన్వి రామ్‌కి మంచి పాత్రే లభించింది. స్కూల్ టీచర్ రాధగా ఆమె చక్కగా నటించింది. బలగం జయరామ్, అచ్యుత్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 70ల కాలంనాటి పరిస్థితులను తెరపై చక్కగా చూపించారు. రాత్రివేళ వచ్చే సీన్స్ అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులునిర్మాత: నాగవంశీడైరెక్టర్: వెంకీ అట్లూరిమ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్విడుదల తేదీ: 2024 అక్టోబర్ 31మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.ఎలా ఉంది? 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.ఎవరెలా చేశారు?భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..Rating : 3.25/5- చందు డొంకాన -
IF Movie Review: ఇఫ్ మూవీ రివ్యూ.. మన ఊహే నిజమైతే!
ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల తరువాత మనకు నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన ఫ్రెండ్స్. పిల్లల్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అద్భుతంగా ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేని ఫ్రెండ్స్ గురించి గొప్పగా ఊహించుకుంటారు. అంటే ఆ ఊహలోని ఫ్రెండ్స్ కి గొప్ప పవర్స్, పవర్ ఫుల్ మేకోవర్ ఉంటాయి. మరి అలాంటి ఊహలు నిజమైతే...అలాంటి థాట్ లోంచి వచ్చిన సినిమానే ఇఫ్ చిత్రం. ఇదో ఫాంటసీ కామెడీ మూవీ. దీనిని జాన్ క్రసింస్కీ తీశారు. ప్రముఖ నటులు రేయాన్ రెనాల్డ్స్ తో పాటు కాలే ఫ్లెమ్మింగ్ తమ పాత్రలకు అద్భుతమైన న్యాయం చేశారు.ఇఫ్ సినిమా కథేంటంటే...పన్నెండేళ్ళ బీ తన డాడీ ఆపరేషన్ వల్ల గ్రాండ్ మదర్ మార్గరేట్ అపార్ట్ మెంట్ కు వస్తుంది. బీ మమ్మీ చిన్నప్పుడే చనిపోతుంది. ఓ రోజు రాత్రి బీ తనకు బిల్డింగ్ లో ఎవరో రేర్ క్రియేచర్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత రోజు కూడా ఆ క్రియేచర్ ఓ మనిషితో పాటు వెళ్తున్నట్టు మళ్ళీ కనిపిస్తుంది. ఆ మనిషి ఎవరో కాదు తన గ్రాండ్ మదర్ బిల్డింగ్ చివరి పై ఫ్లోర్ లో వున్న కాల్ అని తెలుస్తుంది. కాల్ తో వున్న క్రియేచర్ బ్లూ. కాని ఈ సారి బ్లూ తో పాటు సీతాకోకచిలుక రూపంలో వున్న బ్లాసమ్ ని చూడగానే బీ మూర్ఛపోతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు బీ కాల్ తో కలిసి ఈ క్రియేచర్స్ అన్ని ఉన్న చోటికి వెళ్ళి తన ఇమేజినేషన్ తో వాటన్నిటిని తనకు నచ్చిన విధంగా మార్చి చూసుకుని ముచ్చటపడుతుంది. అసలు బీకి కనిపించిన ఈ క్రియేచర్స్ ఏంటి, తన ఇమేజినేషన్ తో సృష్టించుకున్న క్రియేచర్స్ తో బీ ఇంకెన్ని మాజిక్స్ చేసిందో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఇఫ్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ చాలా బావుంటాయి. మనకు కనిపించే క్రియేచర్స్ ని చాలా బాగా చూపించారు. ఇట్స్ ఎ వర్త్ మూవీ ఫర్ కిడ్స్. - ఇంటూరు హరికృష్ణ -
OTT: హాలీవుడ్ మూవీ ‘ట్రబుల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రబుల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వినోదానికి భాష, ప్రాంతం ముఖ్యం కాదు. ప్రాంతాల సరి హద్దులు చెరిపేసి, భాషల హద్దులు మరిచి నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పీట వేసే దర్శకులు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే వారు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ. స్వీడిష్ దర్శకుడు జాన్ హాంబర్గ్ ఇటీవల తీసిన ‘ట్రబుల్’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్న కాణీకి సంబంధించిన కథ ఈ ‘ట్రబుల్’. కాణీకి ఒక్కటే కూతురు. భార్య విడాకులిచ్చింది. కాణీకి సాధారణంగా సమస్యలు రావు, అయితే సమస్యలను తానే కొని తెచ్చుకునే కన్ఫ్యూజ్డ్ పర్సన్. కానీ కాణీ మంచి తెలివైనవాడు. ఓ టీవీని అమర్చేందుకు ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు ఇతగాడి అత్యుత్సాహం ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో వేరేవాళ్లు తవ్విన సొరంగం గుండా బయటపడి తన సమస్యను ఎలా అధిగమించుకుంటాడో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రబుల్’లోనే చూడాలి. ఈ సినిమాలో కాణీ పాత్రకు ప్రముఖ నటుడు ఫిలిప్ బర్గ్ ప్రాణం పోశారు. తన కన్ఫ్యూజింగ్ భావాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాడు. అలాగే హీరోయిన్ ప్రాత్రలో ఎమీ, విలన్ పాత్రలో ఇవా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. పైన చెప్పినట్టు పేరుకు స్వీడిష్ సినిమా అయినా చక్కగా మన తెలుగులో డబ్ అయి ఉంది. వీకెండ్ మూవీ వాచర్స్‌కు మంచి హ్యూమరస్ మూవీ ఇది. ఈ ‘ట్రబుల్’ చూసి కాసేపు మీ ట్రబుల్స్ మరిచిపోకండి. – ఇంటూరు హరికృష్ణ -
Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ
టైటిల్: పొట్టేల్నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులునిర్మాణ సంస్థ: నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగెదర్శకత్వం: సాహిత్ మోత్కూరిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజుఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్మీట్లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది. పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు. అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్‌తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్‌స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
Vaazhai Movie Review: ఈ అరటిపండు చాలా చేదు!!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా ఉంటుందో, అది మన నోటి దాకా రావడానికి ఎన్ని జీవితాలను చేదు చేస్తుందో చెప్పిన చిత్రం ‘వాళై’. ఈ సినిమా మాతృక తమిళమైనా తెలుగులో డబ్ అయి హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. 1999 ఫిబ్రవరి 22న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి అందించిన సమాచార రూపమే ఈ ‘వాళై’ సినిమా. ఈ విషయాన్ని సవివరంగా దర్శకుడు సినిమా ఆఖర్లో చెప్పారు. ఈ సినిమాకి మారీ సెల్వరాజ్ దర్శకుడు. ప్రముఖ వర్ధమాన తమిళ నటులు కలైరాసన్, నిఖిలా విమల్ ఈ సినిమా ముఖ్య తారాగణం. ఇక కథాంశానికొస్తే... శివానందన్, శేఖర్ మంచి స్నేహితులు. బాగా పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలు. ఇద్దరూ ప్రభుత్వ బడిలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు. వారమంతా బడికి వెళ్ళి వారాంతంలో ఓ రూపాయి సంపాదించడం కోసం అరటి గెలలు కోసే పనికి ఊరితో పాటు వెళుతూ ఉంటారు. శివానందన్ చదువులో మంచి తెలివిగలవాడు, ఈ అరటిపండ్లు కోసే పని అస్సలు నచ్చదు తనకు. క్లాసులో సైన్సు పాఠాలు చెప్పే పూంగొడి టీచర్ అంటే శివానందన్‌కు చాలా ఇష్టం. ఇక అరటిపండ్లు కోయడానికి ఆ ఊరి తరఫున ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు. అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్‌గా ముత్తురాజ్ వ్యవహరిస్తుంటాడు. ముత్తురాజ్‌కు, ఖనికి కూలీ డబ్బుల మధ్య వైరం ఏర్పడి ఖని మీద ముత్తురాజ్ ద్వేషం పెంచుకుంటాడు. ఓ రోజు శివానందన్ అరటి గెలల పని నుండి తప్పించుకొని ఆకలితో ఓ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండ్లు తినబోతాడు. అంతే... ఆ తోట యజమాని శివానందన్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టగా స్పృహ తప్పి ఓ కొలనులో పడిపోతాడు. తను లేచి కళ్ళు తెరిచేసరికి ఊరంతా ఏడుస్తుంటుంది. శివానందన్ తల్లితో పాటు అక్క, తోటి స్నేహితుడు శేఖర్, ఖనితోపాటు దాదాపు 19మంది ఊరువాళ్ళు చనిపోయి పడి ఉంటారు. అసలు వీళ్ళంతా ఎలా చనిపోయారు? ఆ తరువాత శివానందన్ పరిస్థితి ఏంటి అన్నది ‘వాళై’ సినిమాలోనే చూడాలి. రోజు వారీ కూలీ చేసుకుని బతికే జీవితాలు ఎలా ఉంటాయన్న స్థితిగతులను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాని మనం తెర మీద చూస్తున్నట్టుండదు... జీవితాలను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సినిమాలో కొంచెం ల్యాగ్ ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. తినే పండు మనకు తియ్యగా ఉన్నా ఆ పండు మన దాకా రావడానికి ఎంతమంది జీవితాలను చేదు చేసిందో అని చెప్పేదే ఈ ‘వాళై’ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్రెడ్డినటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, యన్.టి. రామస్వామి, గణేశ్, పల్లవి తదితరులునిర్మాణ సంస్థ: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి రచన-దర్శకత్వం: స్మరన్ రెడ్డిసంగీతం: ప్రిన్స్ హేన్రిఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: అక్టోబర్ 18, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు ప్రేక్షకులు. కథలో దమ్ముంటే నటీనటులను ఎవరనేది కూడా చూడడం లేదు. అందుకే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలా తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. అదే ‘లవ్‌రెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికితోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లవ్‌రెడ్డి’ పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు(అక్టోబర్ 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ’ ఒక్కటే’. సినిమా ముగింపులో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే చిత్ర కథనమంతా సాగుతుంది. పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ఓ సున్నితమైన ప్రేమకథను ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ స్మరన్ రెడ్డి. వినోదాత్మకంగా కథను ప్రారంభించి.. చివరిలో ప్రేక్షకుడి గుండెను బరవెక్కించి థియేటర్ నుంచి బయటకు పంపించేశాడు. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కథనాన్ని నడిపించాడు. కొత్త నటీనటులే అయినప్పటికీ వారి నుంచి మంచి ఫెర్పార్మెన్స్ని రాబట్టుకున్నాడు. పెళ్లి చూపుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉంటాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్ వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోతుంది. నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు. దివ్య పాత్రతో నేటితరం అమ్మాయిలు చాలా వరకు కనెక్ట్ అయిపోతారు. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ మన గుండెను బరువెక్కిస్తుంది. అలా అని ఈ క్లైమాక్స్ కొత్తదని చెప్పలేం. గతంలో చాలా ప్రేమ కథలకు ఇలాంటి క్లైమాక్స్ ఉంది. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతాం. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని.. పేరున్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది. ఏదేమైనా తొలి సినిమాతోనే ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. అయినా కూడా చాలా చక్కగా నటించాడు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా నటించిన ఎన్.టి రామస్వామి ఫెర్ఫార్మెన్స్ అయితే నెక్ట్స్ లెవన్. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా నటించిన తమ్ముడితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్‌గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్‌కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘విశ్వం’ మూవీ రివ్యూ
టైటిల్: విశ్వంనటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సుమన్, ప్రగతి తదితరులునిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడిదర్శకత్వం: శ్రీనువైట్లసంగీతం: చైతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్విడుదల తేది: అక్టోబర్ 11, 2024శ్రీనివైట్లకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలే లేదు. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం దక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..కేంద్ర మంత్రి సీతారామరాజు(సుమన్)కు హత్యకు గురవుతాడు. ఈ హత్యను దర్శన అనే బాలిక కళ్లారా చూస్తుంది. హంతకులు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఓ రోజు దర్శన ప్యామిలి మొత్తం కొండగట్టుకు వెళ్ళ్తుండగా కొంతమది వారిపై అటాక్ చేస్తారు. గోపిరెడ్డి(గోపీచంద్) వచ్చి వారిని రక్షిస్తాడు. అనంతరం తాను బిల్డర్ బుల్ రెడ్డి కొడుకునని పరిచయం చేసుకొని దర్శన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? దర్శనను ఎందుకు కాపాడుతున్నాడు? కేంద్రమంత్రిని చంపిందెవరు? ఈ హత్యకు ఇండియాలో జరగబోయే ఉగ్రవాద చర్యలకు గల సంబంధం ఏంటి? ఇండియాలో సెటిలైన పాకిస్తాన్ ఉగ్రవాది ఖురేషి(జిష్షుసేన్ గుప్తా) చేస్తున్న కుట్ర ఏంటి? ఈ కథలో బాచిరాజు(సునీల్) పాత్ర ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ సమైరా (కావ్యథాపర్)తో గోపిరెడ్డి ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి హిట్ కొట్టిన చరిత్ర శ్రీనువైట్లది. ఆయన సినిమాలో కామెడీతో పాటు కావాల్సినన్ని కమర్శియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల మ్యాజిక్ తెరపై పని చేయడం లేదు. అందుకే ఈ సారి తన పంథా మార్చుకొని ‘విశ్వం’ తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని బలంగా చెప్పారు. మరి సినిమాలో నిజంగా కొత్త కామెడీ ఉందా? కొత్తకథను చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి.శ్రీనువైట్ల గత సినిమాల మాదిరే విశ్వం కథనం సాగుతుంది. టెర్రరిస్ట్ బ్యాగ్డ్రాప్ స్టోరీకి చైల్డ్ సెంటిమెంట్ జోడించి, తనకు అచ్చొచ్చిన కామెడీ పంథాలోనే కథనం నడిపించాడు. పాయింట్ బాగున్నా.. తెరపై చూస్తే మాత్రం పాత సినిమాలే గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్‌లో జాలిరెడ్డి(పృథ్వి), మ్యాంగో శ్యామ్(నరేశ్) కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్లో ప్రేమాయణం, యాక్షన్ సీక్వెన్స్ రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్ కూడా ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు కానీ..కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలనిజం బలంగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్సే. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. గోపిరెడ్డి పాత్రకి గోపిచంద్ పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటి మాదిరే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. స్టెప్పులు కూడా బాగానే వేశాడు. ప్లాష్‌బ్యాక్ స్టోరీలో గోపీచంద్ నటన బాగుంటుంది. కావ్యథాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. నరేశ్, పృథ్వీల కాంబోలో వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ అయింది. సునీల్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై అంతగా ఏమి ఉండదనే చెప్పాలి. సుమన్, ప్రగతి, వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' పాట థియేటర్లో ఈళలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.25/5 -
OTT: హాలీవుడ్ మూవీ ‘కిడ్నాప్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కిడ్నాప్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా పోరాడే తత్వం తల్లిది అన్న విషయాన్ని సూటిగా చూపించిన ఆంగ్ల చిత్రం ‘కిడ్నాప్’. 2017లో లూయి ప్రీటో దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. హాలీవుడ్ ప్రముఖ కథానాయిక హేలీ బెర్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లిష్), లయన్స్ గేట్ (తెలుగు వెర్షన్) ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. తల్లిగా ఆమె నటన ఈ సినిమా మొత్తానికే హైలైట్. కథాంశానికొస్తే... కార్లా డైసన్ ఓ సింగిల్ మదర్. తన ఆరేళ్ల కొడుకు ఫ్రాంకీని కార్నివాల్‌కు తీసుకువెళ్ళడంతో ‘కిడ్నాప్’ సినిమా మొదలవుతుంది. కార్నివాల్లో అనుకోకుండా పార్కింగ్ లాట్ నుండి తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లడం చూస్తుంది కార్లా. ఇక అక్కడి నుండి ఆ కిడ్నాపర్ల వెంటపడి తన కొడుకును ఎలా కాపాడుకుంటుంది అన్నదే మిగతా కథ. ఈ సినిమా స్క్రీన్‌ప్లే దాదాపు రోడ్డు మార్గానే నడుస్తుంది. అమెరికా రోడ్లలో పరిమితికి మించి వేగంగా కొంతమంది కార్లు నడుపుతూ ఉంటారు. అంతకు మించి వేగంగా ఈ కథ స్క్రీన్‌ప్లే ఉంటుంది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు ఈ సినిమా మొదలయ్యాక శుభం కార్డు పడే వరకు లేవరు. సినిమాను అంత ఆసక్తికరంగా దర్శకుడు లూయీ రూపొందించారనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ప్రఖ్యాత సంస్థ అయిన ఎఫ్‌బీఐ ఇచ్చిన అంచనాల మేరకు అమెరికాలో ఏటా 8 లక్షలకు పైబడి ప్రతి 40 సెకన్లకు ఓ బిడ్డ కనిపించకుండాపోతున్న పరిస్థితి ఉంది. మనందరినీ మనకి తెలిసీ తెలియకుండా నిరంతరం కాపాడే అమ్మ ఆ విజయదుర్గ. ఆ తల్లి తత్వంతో తీసిన ఈ సినిమా నిజంగా అద్భుతం. విజయదశమి పండగ సమయంలో థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్లకి ఇదో మంచి చాయిస్.– ఇంటూరు హరికృష్ణ -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్‌తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్‌కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నవ్వు ఆపుకోలేక.. చాలామంది ఆర్టిస్టులకి సారీ చెప్పా : గోపీచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి. → లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.→ శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఇందులో ఉంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. టర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.→ బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్.→ శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం.→ శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది.→ ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.→ స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను.→ ప్రభాస్‌తో సినిమా చేయాలని నాక్కుడా ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. -
Vishesham Movie Review: విషయమున్న ‘విశేషం’
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘విశేషం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్‌లో గ్లామర్ ఉండాలి అని నమ్మే దర్శకులు నేడు ఎక్కువ. కానీ కంటెంట్‌కు గ్లామర్ కన్నా గ్రామర్ ఎక్కువ అలరిస్తుందని నిరూపించారు మలయాళ దర్శకుడు సూరజ్ టామ్. అదెలాగంటారా? అయితే ఇటీవల ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా విడుదలైన ‘విశేషం’ సినిమాపై ఓ లుక్కేద్దాం. మామూలుగా సినిమా అంటే చక్కటి కథ, కామెడీతో పాటు చూడచక్కని పాత్రధారులు కూడా ఉండాలి. ‘విశేషం’ సినిమాకి కథ, కామెడీ ఉన్నాయి కానీ డీ గ్లామరైజ్డ్ హీరో, హీరోయిన్లు ఉంటారు. దానితో పాటు ఇదో సందేశాత్మక చిత్రం. ఇంకేముంది... దీంట్లో విశేషం అనుకోకండి. అసలైన విషయమున్న విశేషం ఏంటంటే... శీజు భక్తన్ మొదటి పెళ్లి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పెటాకులవడంతో రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎన్నో విపరీత, వినోద ప్రయత్నాల తర్వాత కానిస్టేబుల్ సజితతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. సజితది కూడా రెండో వివాహమే. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ నుండే దర్శకుడి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యను ఈ సినిమా ద్వారా హృద్యంగా చూపించారు దర్శకుడు. అదే సంతానలేమి సమస్య. మరీ ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో పిల్లలు లేకపోవడం అనేది కొంతమంది దంపతుల్లో విపరీత సమస్య. సంతానం లేని దంపతులు తమ కుటుంబంలో, సమాజంలో తమ సమస్య వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల సమస్య సంతాన లేమి అయితే దానిని పరిష్కరించడంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? అనే కోణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. ఎంతో సున్నితమైన సమస్యను అంతే సున్నితంగా ఎవ్వరినీ నొప్పించకుండా రూపొందించారు సూరజ్ టామ్. సినిమా చివర్లో శీజు భక్తన్, సజితలకు ఉన్న సమస్య ఎలా పరిష్కారమైంది? ఎలా పరిష్కరించుకున్నారు? అనే విషయం మాత్రం ఈ ‘విశేషం’లోనే చూడాలి. రోజూ మనం ఎన్నో మెసేజ్‌లు, వీడియాలు మన దగ్గరివారికి షేర్ చేసుకుంటాం. ఈ సినిమా గురించి మనం పది మందికి చెబితే అందులో ఎవరైనా ఈ సమస్య బాధితులు ఉంటే వారికి వినోదంతోపాటు కొంత బాసటగా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఇది విషయమున్న విశేషం కాబట్టి. – ఇంటూరు హరికృష్ణ -
మిస్టర్ సెలెబ్రిటీ మూవీ రివ్యూ
సీనియర్ కథ, మాటల రచయిత పరచూరి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఓ హీరో వచ్చాడు. ఆయన మనవడు సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా చేశాడు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(అక్టోబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌కి చెందిన సోషల్ యాక్టివిస్ట్ లలిత (శ్రీ దీక్ష)కు వింత అనుభవం ఎదురవుతుంది. ఆమెపై ఎవరో అత్యాచారానికి పాల్పడినట్లు కల వస్తుంది. పదే పదే అలాంటి కలలే రావడంతో డాక్టర్ని సంప్రదిస్తుంది. ప్రెగ్నెంట్ టెస్ట్ చేయగా..నిజమనే తెలుస్తుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కలలో వచ్చినవాడి పోలీకలతో బొమ్మను గీస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఫేమస్ యూట్యూబర్ లక్కీ(సుదర్శన్) అని తెలుస్తుంది. ఎస్సై నరహరి (రఘుబాబు) అతన్ని అరెస్ట్ చేసి.. ఆ న్యూస్ వైరల్ అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత లక్కీ నేరస్థుడు కాదని తెలుస్తుంది. కానీ మీడియా ఆ విషయాన్ని పట్టించుకోదు. అసలు లలితకు అలాంటి కలలు వచ్చేలా చేసిందెవరు? ఈ కేసులో లక్కీని ఎందుకు ఇరికించారు? వీరిద్దరితో పాటు ఎస్సై సరహరిని కూడా ఫేమస్ చేసి చంపుతానంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? పద్మశ్రీ గ్రహిత, సైంటిస్ట్ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని)ల కథ ఏంటి? ఈ కథలో వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది అని ఊరికే అనలేదు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది లేనిపోని వదంతులు సృష్టిస్తూ.. దానికి సోషల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పేలోపే అది దేశమంతా వైరల్ అవుతుంది. కొన్నిసార్లైతే అసలు నిజాన్ని బయటపెట్టినా జనాలు వినే స్థితిలో ఉండట్లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా పక్కవారిపై నిందలు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘మిస్టర్ సెలెబ్రిటీ. ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం వల్ల ఎంత నస్టం జరుగుతుంది? తెలియని తప్పుకు నిందలు వేస్తే..వాళ్లు ఎలా బాధపడతారు అనేది ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపైకి తీసుకు రావడంలో కొంత వరకే సక్సెస్ అయ్యాడు.ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగుతుంది. రూమర్ల వల్ల ఎవరు ఎలా ఇబ్బందులు పడతారన్నది ఓ మూడు సీన్లు చూపించాడు. ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్.. ఆ తరువాత సాంగ్.. ఆపై హీరోయిన్ పరిచయం, ఆమె సమస్య గురించి చెప్పడం, లలిత ఇచ్చిన ఫిర్యాదుతో లక్కీని నరహరి అరెస్ట్ చేయడం.. ఇలా సీన్లు ముందుకు వెళ్తూనే ఉంటాయి. లక్కీ, లలిత, నరహరి పాత్రలతోనే ఫస్ట్ హాఫ్ గడుస్తుంది. ఇంట్రవెల్‌కు ట్విస్ట్ వస్తుంది. ఓ ముసుగు వ్యక్తి ఇదంతా చేయిస్తాడని తెలుసుకుంటారు. దీంతో సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. వరలక్ష్మీ పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. సుదర్శన్‌కి ఇది తొలి సినిమా. అయినా బాగా నటించాడు. కొన్ని సీన్లలో కాస్త తడబడినా.. కొన్ని చోట్ల అయితే అనుభవం ఉన్నవాడినా నటించాడు. పాటలు, ఫైట్లు, డైలాగ్స్ చెప్పడంలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ శ్రీ దీక్షకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. దానికి తగ్గట్టు ఆమె కూడా బాగానే నటించింది. నరహరి పాత్రలో రఘుబాబు ఆద్యంతం నవ్వించే ప్రయత్నించాడు. వరలక్ష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే మొదటి సారనిపిస్తుంది. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటాయి. సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతికతంగానూ ఈ సినిమా మెప్పిస్తాయి. పాటలు బాగుంటాయి. మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా సాగుతుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. తక్కువ లొకేషన్లలో ఈ మూవీని చక్కగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు పెట్టిన డబ్బులు, పడిన కష్టం అయితే తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. -
Swag Movie Review: ‘శ్వాగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘శ్వాగ్’ నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్రచన-దర్శకత్వం: హసిత్ గోలిసంగీతం: వివేక్ సాగర్సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్ఎడిటర్: విప్లవ్ నైషధంవిడుదల తేది: అక్టోబర్ 04, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్లైన్లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్‌గా ఒక్కొ సీన్‌తో ముగించేశారు.1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -Rating: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్ కుమార్సంగీతం: గోవింద్ వసంత్విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. (చదవండి: దేవర మూవీ రివ్యూ)ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Devara X Reveiw: ‘దేవర’కు ఊహించని టాక్.. మైనస్ ఏంటంటే..?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగాను ఎదురు చూస్తున్న దేవర మూవీ ఎట్టకేల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడం.. జనతా గ్యారేజ్‌తో సూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ‘దేవర’పై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ చేయడంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ దేవరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం అర్థ రాత్రి నుంచి స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దేవర ఎలా ఉంది? ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇవి కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు. ఎక్స్‌లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. యావరేజ్ సినిమా అని కొంతమంది అంటుంటే... బ్లాక్ బస్టర్ మూవీ అని మరికొంతమంది కామంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారని చెబతున్నారు. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుందని కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని, సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #Devara A Passable Action Drama with a Good 1st Half but a 2nd half that was dragged in parts till the pre-climax. Koratala showed a lot of promise in his writing in the 1st half and setup the story well. However, the 2nd half should’ve been racier and became too predictable…— Venky Reviews (@venkyreviews) September 26, 2024#Devara - 2.25/5 ⭐⭐An average first half with a below average second half. Routine story with a weak climax and poor cliffhanger.Disappointing VFX & Sets, but #JrNTR tries to save the film and #Anirudh shine throughout the movie.Could’ve been much better#DevaraReview— bhaskark4852 (@bhaskark4852) September 27, 20241st half : Flash back tho start ayyi.. 💥 Intro 🌊🌊 Vfx 👍 Dance 🔥🔥🔥 Alaa plain ga vellipoddi.. Screenplay 👎Container shot nunchi highhhhh 🥵🔥🥵🔥🥵 Pre interval 30 mins 👌👌🔥🔥 Bgm 🔥🔥🔥 Overall good 1st half 👍 #Devara— SuRyA™ (@kingmakerrr999) September 27, 20242nd half starting 1st 10mins comedy thappa, rest lite!!! 2/5Why Kattappa Killed Baahubali range lo pettaru anukunnaru koratala but too much artificial...Most logic less 2nd half!!!! Only good thing is 2nd half lo lag ledu, aakariki Anirudh kuda sub par in 2md half!!!#Devara— MB | #Treble | #4peat (@iiishinigami) September 27, 2024My Review:- #DEVARA First Title Card Banger 💥🔥Excellent First Half With Interval Banger 💥🔥🥳Anirudh Mass Duty 👌🏻💥2nd Half Too Good With bit Lag But Climax Superb 🔥💥👌🏻Jannu The Beauty 👌🏻🤩🥳Overall:- A Block Buster 👍🏻🔥#DEVARA #DevaraOnSept27th #DevaraMassJaathara— 𝑨𝒆𝒔𝒕𝒉𝒆𝒕𝒊𝒄 💗 (@Aesthetic_1827) September 27, 2024Hearing Blockbuster reviews for #Devara from Telugu audience and reviewers ✌️💥😀The visuals, the action, the performances... everything is top-notch. ⭐️⭐️⭐️⭐️⭐️#JrNTR absolutely delivers a powerhouse performance. This is shaping up to be the next big South Indian blockbuster,…— Vignesh (@Vignesh_Ajith) September 27, 2024 -
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
చిరంజీవి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు : కొరటాల
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేస్తున్న రెండో సినిమా ఇది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. టెన్షన్ పడుతున్నారా?కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు స్టూడెంట్ ఎలా టెన్షన్ పడతాడు. అలా కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది.‘దేవర’ రియల్ స్టోరీనా? లేదా ఫిక్షనల్ స్టోరీనా?కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.ఈ సినిమాలో ధైర్యం కంటే ఎక్కువగా భయాన్ని చూపించినట్లు ఉన్నారు?మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం మంచి కాదు. అది ముర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో చిన్నపాటి భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అది అందరికి మంచింది. మనకు ఇచ్చిన పని మనం ఎలా చేస్తున్నామనేది చెక్ చేసుకోవడమే భయం. అదే ఈ సినిమాలో చూపించాం.ఎన్టీఆర్‌కు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎలాంటి సపోర్ట్ అందించాడు?ఎన్టీఆర్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాలేకపోతే..బాలేదని డైరెక్ట్‌గా మొహం మీదే చెబుతాడు. ఒకవేళ బాగుంటే.. ఆ విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్‌గా చెబుతాడు. మనిషికి భయం ఉండాలి అనే పాయింట్‌కి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఒకే చెప్పడంతో కథను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాం.దేవర కంటే ముందు అల్లు అర్జున్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది ఈ కథేనా?దేవర కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది సెపరేట్ స్టోరీ.‘ఆచార్య’ ఫలితం చూసిన తర్వాత ఈ కథలో ఏమైన మార్పులు చేశారా?చాలా మార్పులు చేశాం. ముందు పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్షను బాగా రాయాలనుకుంటాం కదా? ఇదీ అంతే. ఆచార్య సినిమా ఒత్తిడి నాపై పెద్దగా పడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే నేను ‘దేవర’సినిమా పనులను ప్రారంభించాను.మీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా? ఇందులో కూడా మంచి సందేశం ఉందా?మనం తీసుకుంటే మెసేజ్.. లేదంటే లేదు. ‘మనిషికి భయం ఉండాలి’అని ఈ కథలో చెప్పాం. దాన్ని సందేశం అనుకుంటే అనుకోవచ్చు.దేవరను రెండు భాగాలు తీయాలని ఎప్పుడు అనుకున్నారు?ఈ కథ నెరేషనే 4 గంటలు ఉంది. మూడు గంటల్లో ఈ కథను చెప్పగలమా అని ఆలోచించాం. రెండో షెడ్యూల్ అప్పుడే ఇది సాధ్యం కాదని మాకు అర్థమైపోయింది. అప్పుడే రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాకు మూడు, నాలుగు భాగాలు ఉండవు. పార్ట్ 2తో ఈ కథ ముగిసిపోతుంది.ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నిరాశకు గురయ్యారా?ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దురదృష్టకరం. ఆ ఈవెంట్లోనే అందరం కలుద్దాం అనుకున్నాం. చాలా మంది ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రద్దు కావడం అందరికి బాధ కలిగించింది.చిరంజీవితో మీ బాండింగ్ ఎలా ఉంది?ఆయనతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆచార్య రిలీజ్ తర్వాత నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి’అని మెసేజ్పెట్టారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.జాన్వీ కపూర్ గురించి?శ్రీదేవిగారి కూతురు కావడంతో జాన్వీ తెలుగమ్మాయిలాగే అనిపించేంది. చాలా టాలెంటెడ్. చాలా భయంతో సెట్లో అడుగుపెట్టేంది. తన డైలాగ్స్ ముందే పంపమని అడిగేది. బాగా ప్రాక్టీస్ చేసేది. మొదటి రోజు షూట్ అవ్వగానే ఆమె టాలెంట్ చూసి ఎన్టీఆర్ షాకయ్యాడు.జాన్వీని హీరోయిన్గా తీసుకోవడానికి గల కారణం?ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. దేవర సినిమాలో నటించాలని జాన్వీ ముందే అనుకుందట. అనుకోకుండా మేము కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం. సెట్లో ఆమెను చూస్తే మన ఇంటి ఆడపిల్లలా అనిపించేంది.సైప్ అలీఖాన్ గురించి?నేను రాసుకున్న పాత్రకు సైఫ్ అలీఖాన్ అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నా. ఆయనకు స్టోరీ చెప్పి, ఆ పాత్ర లుక్ స్కెచ్ పంపిస్తే.. ‘నేను ఇలా ఉంటానా’అని ఆశ్చర్యపోయాడు. ఆయన మెకప్కే దాదాపు గంట సమయం పట్టేది.సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి?మంచి సంగీతం అందించాడు. ఫియర్ సాంగ్ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. దేవీశ్రీ ప్రసాద్ నాకు మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ అతనితో కలిసి పని చేస్తా. -
మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!
‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్ మూవీ షూట్లో పాల్గొంటారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది. (చదవండి: శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు)అయితే అప్పుడు ఎన్టీఆర్ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఇదేనా?సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఫుల్ ఫోకస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్, సలార్ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. -
OTT: హాలీవుడ్ మూవీ ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఇప్పుడు అందరూ దాదాపు తలదించుకునే ఉంటున్నారు... ఎందుకంటే సెల్‌ఫోన్ చూడ్డానికి. ఆప్తుల కన్నా, కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ అయిపోయింది సెల్‌ఫోన్. ఈ సెల్‌ఫోన్ ఓ అగ్గి అయితే, సోషల్ మీడియా దానికి తోడవుతున్న గాలి. అగ్నికి ఆజ్యమన్నట్టు ఈ సోషల్ మీడియా ముఖ్యంగా నేటి యువతను పూర్తిగా వశపరుచుకుంటోంది. సోషల్ మీడియా చెడు అన్న అంశం ఎంత నిజమో మంచి అన్నదానికి నిదర్శనమే ఈ ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ సినిమా. దర్శకులు స్టూవెన్ సి. మిల్లర్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రముఖ నటుడు ఆరన్ యఖార్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ కథాంశానికొస్తే... ఫ్రాంక్ పెన్నీ ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. కానీ అతని కెరీర్లో మాయని మచ్చ ఓ షూటవుట్‌లో అనుకోకుండా ఓ చిన్నపిల్లవాడిని తన చేతులతో కాల్చి చంపడం. దాని గురించి బాధ పడుతున్న తరుణంలోనే ఓ కిడ్నాపర్ తన సహోద్యోగి కుమార్తెను కిడ్నాప్ చేసి, పోలీసులకు సవాలు విసురుతాడు. ఈ తరుణంలో అవా బ్రూక్స్ అనే యంగ్ సోషల్ మీడియా రిపోర్టర్ ఫ్రాంక్ పెన్నీకి తారసపడుతుంది. సమాజంలో జరిగే వాస్తవ దారుణాలను అవా బ్రూక్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటుంది. ఫ్రాంక్ పెన్నీతో కలిసి అవా బ్రూక్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కిడ్నాపింగ్ ఆపరేషన్ ఎలా చేసింది? అన్నది లయన్స్ గేట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘లైన్ ఆఫ్ డ్యూటీ’లోనే చూడాలి. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సోషల్ మీడియా విలువలను నేటి యువతరానికి అర్ధమయ్యేలా చెబుతుంది. వర్త్ టు వాచ్ ది ‘లైన్ ఆఫ్ డ్యూటీ’. – ఇంటూరు హరికృష్ణ -
Gorre Puranam Review: ‘గొర్రె పురాణం’ మూవీ రివ్యూ
టైటిల్: గొర్రె పురాణంనటీనటులు: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులునిర్మాత: ప్రవీణ్ రెడ్డిదర్శకత్వం: బాబీసంగీతం: పవన్ సీహెచ్సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగంవిడుదల తేది: సెప్టెంబర్ 21, 2024యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్‌లో ‘గొర్రెపురాణం’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు. ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక తెలుగులో అయితే రాజమౌళి చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా ఒక జంతువునే హీరో. కథంతా గొర్రె చుట్టే నడిపిస్తూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ప్రస్తావించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు? తమపై వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీడియాను ఎలా వాడుకుంటారు? అనేది సెటైరికల్‌గా తెరపై చూపించారు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించే విషయంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. బహుశా బడ్జెట్ ప్రాబ్లమ్ కావొచ్చ కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా సాదా సీదాగా తీసేశారు. ఓ మర్డర్ సీన్‌తో కథను ప్రారంభించి మొదట్లోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్‌తో గొర్రె ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టినప్పటి నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది. గొర్రె చుట్టూ సాగే సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా ఫస్టాఫ్ సాగుతుంది. ఒక్క సీన్ మీనహా ఇంటర్వెల్ వరకు సుహాస్ తెరపై కనిపించదు. ఇక ద్వితియార్థంలో ఎక్కువ భాగం జైలు, కోర్టు సీన్లతోనే సాగుతుంది. రవి ప్లాష్ బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. గొర్రెను జైలు నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. కోర్టు సీన్లో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. లాజిక్స్ వెతక్కుకుండా చూస్తే..‘గొర్రె పురాణం’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరో గొర్రె అనే చెప్పాలి. ఒక గొర్రెకు తరుణ్ భాస్కర్, మరొక గొర్రెకు గెటప్ శ్రీను వాయిస్ ఓవర్ ఇచ్చారు. రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరు ఇచ్చే వాయిస్ ఓవర్ నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ చిత్రంలోసుహాస్ది కీలక పాత్ర. నిడివి తక్కువే అయినా ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో లీనమై నటించాడు సుహాస్. ఖైదీ రవి పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హిందూ వాదిగా రఘు, జడ్జీగా పొసాని తమదైన కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పవన్ సీహెచ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. నిడివి తక్కువ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
‘పైలం పిలగా’ మూవీ రివ్యూ
‘పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరోగా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. పుష్ప , పరేషాన్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పావని కరణం హీరోయిన్గా నటించింది. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..తెలంగాణలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ(సాయి తేజ) డిగ్రీ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాలీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తుంపు ఉండదని, దుబాయ్‌కి వెళ్లి బాగా సెటిల్ అవ్వాలనుకుంటాడు. పాస్‌పోర్ట్, ఉద్యోగం కోసం రూ. 2 లక్షలు కావాల్సి వస్తుంది. దాని కోసం శివ తన నానమ్మ పేరుపై ఉన్న స్థలాన్ని అమ్మాలనుకుంటాడు. తన స్నేహితుడు శ్రీను(ప్రణవ్ సోను)తో కలిసి స్థలం అమ్మేందుకు వెళ్తాడు. అయితే ఆ స్థలం లిటికేషన్లో ఉంటుంది. పంచాయితీ తర్వాత గుట్టగా మారిన రెండెకరాల స్థలం అతనికి వస్తుంది. అది అమ్మకానికి పెడితే ఎవరూ కొనేందుకు ముందుకు రారు. కానీ మరుసటి రోజు 10 లక్షలు ఇస్తానని ఒకరు.. 30 లక్షలు ఇస్తానని మరొకరు.. రూ. కోటి ఇస్తా ఆ స్థలం నాకే అమ్ము అని ఇంకొకరు శివ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుతుంటారు. పనికి రాని ఆ గుట్టను కొనేందుకు వాళ్లంతా ఎందుకు ఆసక్తి చూపారు? దుబాయ్ వెళ్లాలనుకున్న శివ కోరిక నెరవేరిందా? దేవి(పావని కరణం)తో శివ ప్రేమయాణం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హాస్యం ప్రధానంగా సాగే వ్యంగ్య చిత్రమిది. కథంతా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణలో పైలం అంటే జాగ్రత్త అని అర్థం. ఆ టైటిల్‌కి తగ్గటే హీరో వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. దుబాయ్‌కి వెళ్తే భారీగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో సొంత భూమిని అమ్మాలనుకుంటాడు. అయితే ఆ భూమికి విలువ రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలనే కథగా మలచుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కథనాన్ని కామెడీగా సాగిస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రతి రోజు టీ షాపు దగ్గర ఎదురు చూడడం.. తన ప్రేమ విషయం తెలియజేయడానికి హీరో పడే పాట్లు నవ్విస్తాయి. అలాగే దుబాయ్ వెళ్లేందుకు హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. స్థలం అమ్మకానికి పెట్టేవరకు కథంతా సోసోగా సాగుతుంది. అయితే స్థలం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపడం.. కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడంతో కథపై ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కొంత సాగదీతగా ఉంటుంది. క్లైమాక్స్ పర్వాలేదు. ఎలాంటి వల్గారిటీ లేకుండా హాస్యభరితంగా కథనం సాగడం ప్లస్ పాయింట్. నిడివి కూడా తక్కువే ఉండడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. పల్లెటూరి యువకుడు శివగా సాయితేజ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రకృతిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి దేవి పాత్రకి పావని న్యాయం చేసింది. హీరో స్నేహితుడి నటించిన వ్యక్తి కామెడీ పంచులు నవ్వులు పూయించాయి. హీరో నానామ్మగా డబ్బింగ్ జానకి ఓ డిఫరెంట్ పాత్రలో మెరిసింది. చిత్రం శీను, మిర్చి కిరణ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘హైడ్ న్ సీక్’ మూవీ రివ్యూ
టైటిల్: హైడ్ న్ సిక్నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులునిర్మాణ సంస్థ: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారిదర్శకత్వం: బసిరెడ్డి రానాసంగీత దర్శకుడు: లిజో కె జోష్విడుదల తేది: సెప్టెంబర్ 21, 2024కథేంటంటే..కర్నూలుకు చెందిన శివ(విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు. తన తండ్రి, బావా ఇద్దరూ ఆర్మీలో పని చేస్తూ దేశం కోసం వీర మరణం పొందుతారు. తాను ఏదో ఒకరకంగా దేశానికి సేవ చేయాలనుకుంటాడు. అక్కతో కలిసి ఉంటూ మెడిసిన్ చదువుతుంటాడు.తోటి విద్యార్థిని వర్ష(రియా సచ్దేవ్)తో ప్రేమలో పడతాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు. ఓ రోజు శివ ఇంటి పక్కన ఒక డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు. ఎవరో అతన్ని రాడ్‌తో కొట్టి చంపుతారు. అయిదే అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీసు స్టేషన్‌కి లెటర్ వస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైష్ణవి(శిల్ప మంజునాథ్) దాన్ని సిరీయస్‌గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు సుసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సుసైడ్ అనుకుంటారు కానీ శివ మాత్రం అది హత్య అని నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు హత్య అని శివ లెటర్ పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత ఈ కేసులో శివను ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు? ఎవరు చేశారు? అసలు కర్నూలులో వరుస హత్యలు చేస్తుందన్నదెవరు? వాళ్ల లక్ష్యం ఏంటి? చివరకు పోలీసులు అధికారి వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఈ మధ్య పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటు పడ్డారు. ఆ మధ్య పబ్జీ, బ్యూవేల్ గేమ్‌లాంటి గేమ్స్ బాగా ట్రెండ్ అయింది. అలాంటి గేమ్స్‌కి కొంతమంది యువకులు బానిసలై ప్రాణాలను సైతం కోల్పోయారు. కొంతమంది క్రిమినల్స్‌గా మారారు. గేమ్ కోసం సొంతవాళ్లను దారుణంగా హత్య చేసిన ఘటనలు జరిగాయి. అలాంటి ఆన్లైన్ గేమింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘హైడ్ న్ సిక్’, ఆన్లైన్ గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.దటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటీవ్ గా తెరకెక్కించారు. అయితే సెకండ్ ఆఫ్ లో సినిమా కాస్త స్లో అవుతుంది. కొంత సేపటికి మళ్లీ వేగం పుంజుకుంటుంది. అసలు మర్డర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. అయితే ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్దతిలో చేస్తున్నారు. అనేది పూరాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది. మారణహోమం జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది. తరువాత మర్డర్ ఎక్కడ ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగోనే పద్దతి మెప్పించింది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. ప్రీ క్లైమాక్స్ తరువాత మళ్లీ సినిమా వేగం పెరగుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాల లాగా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్ గా హ్యండిల్ చేశారు. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా అలరించిన విశ్వంత్ హైడ్ న్ సిక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. బాధ్యతగల తమ్ముడిగా, స్టూడెంట్ గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. విశ్వంత్ తరువాత పోలీసు క్యారెక్టర్ చేసిన శిల్పా మంజునాథ్ మంచి మార్కులు వేసుకుంది. ఆఫీసర్ గా తన లుక్స్ చాలా బాగున్నాయి. తన ఫేస్ లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్ అద్భుతంగా పండించింది. అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుకు తక్కువ స్పేస్ ఉంది కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర. ఉన్నంతలో మెప్పించారు. అలాగే మిగితా ఆర్టిస్టుల అంతా వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. లిజో కె జోష్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటో గ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగాచేశారు.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
OTT: మలయాళ మూవీ ‘నునక్కుజి’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నూనక్కూళి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సమస్య అన్నది ఎవ్వరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కానీ దానిని ఎలా పరిష్కరించుకుంటామన్నది మాత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. గుండు సూదంత ప్రశ్నకు గుండ్రాయంత సమాధానం అనుకుంటే అంతా గందరగోళమే. ఇదే నేపథ్యంలో వచ్చిన మలయాళ సినిమా ‘నూనక్కూళి’. ఇది తెలుగులో డబ్ అయింది. ప్రముఖ దర్శకులు జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఆద్యంతం ఆకట్టుకుంటోంది. (చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)ఇక ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ పెద్ద వ్యాపార సంస్థకు ఎండీ అయిన పూళికున్నేల్ తన భార్యతో ఆంతరంగికంగా కలిసున్న వీడియోను తన లాప్టాప్లో దాచుకుంటాడు. ఇంతలో పూళికున్నేల్ సంస్థ పై ఐటీ రైడ్ జరిగి, ఇతని లాప్‌టాప్‌ను కూడా స్వాధీనపరుచుకుంటారు ఐటీ ప్రతినిధులు. కంపెనీ లావాదేవీల కన్నా ఇప్పుడు పూళికున్నేల్ దృష్టి తన వీడియో ఇతరుల దృష్టిలో పడకుండా చూడాలని ఆ ఐటీ ప్రతినిధి ఇంటికి తన లాప్టాప్ కోసం దొంగతనానికి వెళతాడు. ఆ సమయంలో వేరే ఒకావిడ తాను ఆత్మహత్య కోసం తయారు చేసుకున్న విషాన్ని పూళికున్నేల్ పొరపాటున తాగేస్తాడు. అది కాస్త పోలీస్ కేసు అవుతుంది. చివరాఖరికి పూళికున్నేల్ తన లాప్టాప్ దక్కించుకున్నాడా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెకు, ఐటి ప్రతినిధికి, హీరో పూళికున్నేల్కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీలోనే చూడాలి. పూళికున్నేల్ పాత్రలో బసిల్ జోసెఫ్ అలాగే మరో ప్రధాన పాత్రలో గ్రేస్ ఆంటోని అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం కితకితలు పెట్టిస్తూనే ఉంటుంది. సున్నిత సమస్యకు ఆ సరదా పరిష్కారం ఏంటో ‘నూనక్కూళి’ సినిమాలో ఈ వారం చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
#Life Stories Review: ఆరు కథలు.. విభిన్నమైన భావోద్వేగాలు
టైటిల్: #లైఫ్ స్టోరీస్నిర్మాణ సంస్థలు: అక్జన్ ఎంటర్టైన్మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ నటీనటులు : సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి, హ్యారీ - గోల్డెన్ రిట్రీవర్, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్ రచన, దర్శకత్వం & నిర్మాత : ఉజ్వల్ కశ్యప్నిర్మాత : MM విజయ జ్యోతిసంగీత దర్శకుడు : విన్నుపాటలు : రామ్ ప్రసాద్, సుపర్ణ వొంటైర్, బెంట్ ఆఫ్ మైండ్, సింజిత్ యర్రమిల్లిసినిమాటోగ్రఫీ: ప్రణవ్ ఆనందఎడిటర్ : వినయ్విడుదల తేది: సెప్టెంబర్ 14, 2024కథేంటంటే..ఇదొక ఆంథాలజీ. విభిన్నమైన జీవనశైలీ గల ఆరుగురి కథ. 1) క్యాబ్ క్రానికల్స్: ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి క్యాబ్‌లో వెళ్తుండగా..కారులో కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. అవి ఆ డ్రైవర్‌కి సంబంధించినవి. ఇంజనీరింగ్ చేసి.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వీరిద్ధరి మధ్య జరిగే సరదా సంభాషణనే మొదటి స్టోరీ2) వైల్డ్ హట్స్: ఉద్యోగం రిత్యా దూరంగా ఉన్న ఇద్దరి భార్యభర్తల కథ. న్యూ ఇయర్ రోజున ఇద్దరు కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటారు.కానీ భార్య శ్రెయా (షాలిని కొండేపూడి)కి తన బాస్ ఎక్కువ వర్క్ ఇవ్వడంతో ఆఫీస్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. చివరకు భార్యభర్తలు కలిసి న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారా లేదా? ‘వర్చువల్ క్యాండిలైట్ డిన్నర్’ సంగతేంటి అనేదే మిగతా కథ.3) బంగారం: ఒంటరిగా ఉన్న ముసలావిడ మంగమ్మ కథ ఇది. ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం. కానీ కొనుక్కునే స్థోమత ఉండదు. రోడ్డు పక్కన టీ షాపు పెట్టుకొని జీవితాన్ని గడుపుతుంది. ఓ రోజు రోడ్డుపై ఓ పెంపుడు కుక్కని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిపోతాడు. ఆ కుక్కను బంగారం అని పేరు పెట్టి మంగమ్మ చేరదీస్తుంది. ‘బంగారం’ వచ్చిన తర్వాత మంగమ్మ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అనేది మిగతా కథ.4) మామ్ మీ: ఓ సింగిల్ మదర్(దేవియని శర్మ) స్టోరీ ఇది. జాబ్లైఫ్లో పడి కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతుంది. అతని మంచి చెడులను ఎక్కువగా పని మనిషే చూసుకుంటుంది. అయితే తల్లితో ఆడుకోవాలని, లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాలని పిల్లాడు ఆశ పడతాడు. మరి అతని ఆశ నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ.5) గ్లాస్‌మేట్స్: ఓ సీరియర్ కపుల్ స్టోరీ ఇది. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఆ జంట రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ భర్తకి కాలేజీ ఫ్రెండ్ కనిపిస్తాడు. దీంతో వారిద్దరు కలిసి మద్యం సేవిస్తూ కాలేజీ ముచ్చట్లు చెప్పుకుంటారు. మరోవైపు ఇద్దరి భార్యలు కూడా గదిలోకి వెళ్లి మందు తాగుతూ సరదగా గడుపుతుంటారు. ఆ సరదా సంభాషణలు ఏంటనేది తెరపై చూడాల్సిందే.6) జిందగీ: సాఫ్వేర్ ఉద్యోగి తన ప్రియురాలితో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ చివరి నిమిషంలో ఆమె రాలేనని చెబుతుంది. లవర్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ సాఫ్వేర్ ఉద్యోగి ఏం చేశాడు? విడివిడిగా సాగిన ఈ ఆరు కథలు చివరకు ఎలా కలిశాయి అనేది తెలియాలంటే #లైఫ్స్టోరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత కథ చెప్పే విధానం మారిపోయింది. కొత్త కొత్త కథలను.. విభిన్నమైన రీతిలో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కథలను కలిపి ఓ పెద్ద కథగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. వీటినే మనం ఆంథాలజీ సినిమాలు అంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు నార్త్‌లో చాలా ఏళ్ల కిందటే జరిగాయి. కానీ సౌత్‌లో మాత్రం ఈ మధ్యే ఆంథాలజీ సినిమాలు వస్తున్నాయి. సౌత్ ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. #లైఫ్ స్టోరీస్ కూడా ఓ ఆంథాలజీ ఫిల్మ్. టైటిల్‌కు తగ్గట్టే ఇది మనతో పాటు మన చుట్టు ఉండే జనాల జీవన శైలీని తెలియజేసే చిత్రం. ప్రతి కథలోని పాత్రలతో మనం కనెక్ట్ అవుతాం. మనలోనో లేదా మన చుట్టో అలాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు.(చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)అయితే ఎంత మంచి కథ అయినా ఆసక్తికరంగా చెప్పకపోతే ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీల్ అవుతారు. డైరెక్టర్ ఉజ్వల్ కశ్యప్ కొన్ని చోట్ల ఆ తప్పిదం చేశాడు. స్టోరీ బాగున్నప్పటికీ.. సన్నివేశాలను సాగదీయడం.. అవసరం లేకున్నా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే సంభాషణలు చెప్పించడం కొంతవరకు తెలుగు ఆడియన్స్‌కు ఇబ్బందికరమే. స్లోనెరేషన్ ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్. మొదటి స్టోరీకి చాలా సింపుల్‌గా పుల్‌స్టాఫ్ పెట్టి రెండో కథను స్టార్ట్ చేశాడు. దీంతో ‘క్యాబ్ క్రానికల్స్’ స్టోరీ ప్రేక్షకుడికి అర్థమేకాదు. కానీ చివరల్లో ఈ స్టోరీతో మిగతా కథలను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక రెండో స్టోరీ వైల్డ్ హాట్స్‌లో ఉద్యోగం చేసే భార్యభర్తల జీవితాలు ఎలా ఉంటాయో చూపించాడు. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ.. సిటీలో ఉద్యోగం చేసే భార్యభర్తలు ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. ‘వర్చువల్ క్యాండిలైట్ డిన్నర్’ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఆరు కథలో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ ‘బంగారం’. మంగమ్మ లైఫ్ జర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. మామ్ మీ కథ వర్క్‌పరంగా ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు కాస్త సమయం కేటాయించాలని తెలియజేస్తుంది. గ్లాస్‌మేట్స్ స్టోరీ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. జిందగీ కథతో మిగతా స్టోరీలన్నీ ముడిపడి ఉంటాయి. ఈ ఆరు కథలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చుట్టూ సాగుతూనే.. చివరల్లో కలిసిన విధానం ఆకట్టుకుటుంది. క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఆంధాలజీ సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రకు న్యాయం చేశారు. మంగమ్మగా నటించిన వృద్ధురాలు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. ఆ పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. సింగిల్ పేరెంట్‌గా దేవయాని శర్మ చక్కగా నటించింది. ప్రైవేట్ బస్ కండక్టర్ గా కనిపించిన రాజశేఖర్ ఆకట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ పీయూష్ పాత్రలో సత్య ఒదిగిపోయాడు. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ
టైటిల్: మత్తు వదలరా- 2నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలతరచన, దర్శకత్వం: రితేష్ రానాసంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: సురేష్ సారంగంవిడుదల తేది : సెప్టెంబర్ 13, 2024‘మత్తు వదలరా’ సినిమా తర్వాత హీరో శ్రీసింహాకు ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు. వరుస సినిమాలు చేస్తున్నా.. ఏవీ వర్కౌట్ కాలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’తొ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మత్తు వదలరా 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని. వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ఒక హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకుంటారు. మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్‌గా ఉంటుందనే ఆశతో థియేటర్స్‌కి వస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే ఒకే.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. అందుకే సీక్వెల్ తీయడం ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. డైరెక్టర్ రితేష్ రానా ఆ సాహసం చేశాడు. కానీ పార్ట్ 1ని మించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం.. కథనం మొత్తం ఒక పాయింట్ చుట్టే తిరగడం సినిమాకు పెద్ద మైనస్. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే ఈ లోపాలన్నింటిని సత్య కామెడీ కొంతవరకు కవర్ చేస్తే.. టెక్నికల్ టీమ్ మరికొంత కవర్ చేసింది. పార్ట్ 1 చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో మొదటి నుంచే కనెక్ట్ అవుతారు. కానీ చూడని వాళ్లకు మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు. హీ టీమ్‌లో బాబు, యేసులో జాయిన్ అయ్యే సీన్ నుంచి.. రియా కిడ్నాప్ డ్రామా వరకు ప్రతి సీన్ గత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. (చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్)ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం మిస్టరీ మర్డర్, హత్య చుట్టే తిరుగుతుంది. ఫరియా, సత్య, శ్రీసింహా కలిసి చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే, కథకు ఏ మాత్రం సంబంధం లేని ‘ఓరి నా కొడక’ సీరియల్ డ్రామా అయితే నవ్వించకపోవడమే కాకుండా.. ఒకానొక దశలో చిరాకు తెప్పిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగే కథనం.. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు సినిమాపై కొంతవరకు పాజిటివ్ ఒపీనియన్‌ని తెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీయే. శ్రీసింహా హీరో అయినప్పటికీ.. సత్యనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు. బాబు మోహన్ పాత్రకు శ్రీసింహా న్యాయం చేశాడు. తెరపై శ్రీసింహా, సత్యల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రను పోషించింది. హీ టీమ్‌లో పని చేసే 'నిధి' పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్ సీన్లో కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడి ఆకట్టుకుంది. హీ టీమ్ హెడ్‌గా రోహిణి, మైఖెల్‌గా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కాల భైరవ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరపై చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘ఉరుకు పటేల’ మూవీ రివ్యూ
‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఖుష్బూ చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పటేల(తేజస్ కంచర్ల) బాగా ఆస్తి ఉంటుంది. కానీ చదువు అబ్బదు. తరగతిలో తనది చివరి ర్యాంకు. దీంతో తోటి విద్యార్థులు అతన్ని చులకగా చూస్తారు. అమ్మాయిలు అయితే.. తనవైపే చూడడానికి ఇష్టపడరు. దీంతో పెద్దయిన తర్వాత ఎలాగైన బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోతాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదివిన పటేల.. ఊర్లో బార్ నడుపుతూ సర్పంచ్ అయిన తన తండ్రి(గోపరాజు రమణ)కు రాజకీయంగా తోడుగా ఉంటాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఆ ఊరివాళ్లు ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. అయితే పక్క ఊరికి చెందిన డాక్టర్ అక్షర(ఖుష్బూ చౌదరి ) మాత్రం పటేల్‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఏడో తరగతి వరకు మాత్రమే చదివి జులాయిగా తిరుగుతున్న పటేలాను డాక్టర్ అయిన అక్షర ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? నిజంగానే పటేలాను అక్షర ప్రేమించిందా? అక్షర బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం ఆస్పత్రికి వెళ్లిన పటేలాకు ఎదురైన అనుభవం ఏంటి? అక్షర ఫ్యామిలీ చేసిన కుట్ర ఏంటి? అసలు పటేలా ఎందుకు పరుగెత్తాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఈ టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. మంచి జరుగుతుందని నమ్మి నరబలి ఇవ్వడానికి చూడా వెనుకాడడం లేదు. తరచు మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. అలాంటి వాటిని బేస్ చేసుకొని తెరకెక్కించిన చిత్రమే ఉరుకు పటేలా. థ్రిల్లర్ కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వివేక్ రెడ్డి . ఆయన ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంతో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం నార్మల్‌గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్‌పై ఆస్తకి పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకోవడమే కాదు.. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తుంది. అయితే కథనం మొత్తం ఒక ఆస్పత్రి చుట్టే సాగడం.. ఈ కమ్రంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. కథను మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. పటేలా పాత్రలో తేజస్ కంచర్ల ఒదిగిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ జోనర్ లో తను ఇరుక్కుపోయిన ప్లేస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసాడు. ఉరుకు పటేల సినిమాని తన భుజాలమీదే మొత్తం నడిపించాడు. ఓవైపు భయపడుతూనే... మరోవైపు కామెడీ పండించాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. కొన్ని చోట్ల ఆయన పాత్ర డీజే టిల్లుని గుర్తు చేస్తుంది.ఇక డాక్టర్ అక్షరగా కుష్భు చౌదరి తన అందంతో చాలా క్యూట్ గా మెప్పించింది. సెకెండాఫ్ లో వచ్చే ఆమెలోని మరోకోణం నటనతో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించి అలరించింది. ఇక మరో పాత్రలో హీరోయిన్ వదిన పాత్ర వేసిన లావణ్య రెడ్డి కూడా ఆకట్టుకుంటుంది. గ్రామ సర్పంచ్, పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ ఎప్పటిలాగే తనమార్క్ డైలాగులు, నటనతో మెప్పంచారు. సుదర్శన్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో కాస్త శ్రుతిమించే చెప్పించారు. చమ్మక్ చంద్ర పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది.మూఢనమ్మకాలతో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథను అల్లుకుని... థ్రిల్లర్, కామెడీ జానర్లో చాలా ఆసక్తికరంగా ఎంటర్టైన్మెంట్గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వివేక్. మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం రాత్రి పూట ఒకే హాస్పిటల్ లో కథ జరగడంతో దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఈ వారం వినాయకచవితి సందర్భంగా వచ్చిన హాలీడేస్ ను ఈ సినిమాతో ఎంజాయ్ చేసేయండి. -
'స్పీడ్ 220' మూవీ రివ్యూ
టాలీవుడ్లో మళ్లీ చిన్న సినిమాల సందడి మొదలైంది. దేవర మినహా ఈ నెలలో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. దీంతో ప్రతివారం మూడు నాలుగు చిన్న సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ వారం విడుదలైన చిన్న సినిమాల్లో స్పీడ్ 220 ఒకటి. కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు హర్ష బీజగం దర్శకత్వం వహించారు. ఓ వైవిధ్యమైన కథ... కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సూర్య(హేమంత్), చందు(గణేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఊర్లో భిక్షపతి(తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమీదారు ఇంట్లో పనిచేస్తూ... ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆయన కూతురు మాయ(భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్)తో వీరిద్దరికి చిన్నప్పటి నుంచే స్నేహం ఉంటుంది. పెద్దయ్యాక మాయ..సూర్య,చందులతో ఒకరికి తెలియకుండా మరొకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది.సూర్యకి బాగా క్లోజ్‌గా ఉన్న ఓ కుర్రాడు అనుమాదస్పదస్థితిలో చనిపోతాడు. అలాగే మాయ కూడా చనిపోతుంది.తనకు క్లోజ్‌గా ఉన్న ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో సూర్య పిచ్చివాడు అయిపోతాడు. అందరిని వదిలేసి ఒంటరిగా తిరుగుతుంటాడు. అయితే ఓ సారి అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. సూర్యను చంపాలని ప్రయత్నించేదెవరు? మాయ, చింటూ చనిపోవడానికి గల కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్వచ్ఛమైన ప్రేమ కోసం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన ఓ ఇద్దరు యువకులు, ఓ యువతిల మధ్య జరిగే ట్రయాంగిల్ కథ ఇది. దానిని తెరమీద బోల్డ్‌గా చూపిస్తూ.. ‘రా’ రొమాన్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే పకడ్బంధీగా ఉండాలి. తెలిసి కథే అయినా..దానిని తెరపై ఎంత ఆసక్తికరంగా చూపించారనేదానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కొంతమేర విజయం సాధించాడు. బోల్డ్ సీన్లతో కథనాన్ని నడిపిస్తూ యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా చూస్తున్నప్పడు మనకు ఆర్ ఎక్స్ 100 సినిమాలోని చాలా సీన్లు గుర్తొస్తాయి. అలాగే కొన్ని సీన్లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి సూర్య, చందుతో కలిసి పెరిగిన మాయ.. పెద్దయిన తరువాత ఎందుకు అలా ఆధునిక భావాలతో సెంటిమెంట్ కు తావులేకుండా పెరగాల్సివచ్చిందో అదే దానికి క్లారిటీ ఇవ్వలేదు. నా కూతురు కామంతో మీ ఇద్దరితో ఇలా ఆడుకుందని తండ్రితో చెప్పించడం కూడా నప్పలేదు. అలా కాకుండా ఆమె అలా పెరగడానికి ఓ బలమైన కారణం ఉండేలా చూపిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో అంతా... లవ్, రొమాన్స్ ను చూపించిన దర్శకుడు... సెకెండాఫ్ లో మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. సినిమా నిడివి తక్కువ ఉండడం సినిమాకు కలిసొచ్చింది.ఇందులో మాయ పాత్రలో చేసిన భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్ గురించి. ఆమె నటన సినిమాకి హైలైట్. బోల్డ్ సీన్స్ లో అందంగా కనిపించింది. ఉత్తరాది అమ్మాయే అయినా... తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. మల్లిడి హేమంత్ రెడ్డి సూర్య పాత్రలో రఫ్ గా కనిపించి ఆకట్టుకుంటారు. భగ్న ప్రేమికుడిగా మంచి నటనే కనబరిచారు. అలాగే గణేష్ కూడా చందు పాత్రలో మెప్పించారు. సుప్రియ పాత్రలో చేసిన శర్మ జాహ్నవి పల్లెటూరి అమ్మాయి పాత్రలో లంగా వోణిలో ఆకట్టుకుంటుంది. జమిందారుడు భిక్షపతిగా, హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన తాటికొండ మహేంద్రనాథ్ నటన కూడా పర్వాలేదు. చింటూ పాత్రలో కనిపించిన చిన్నకుర్రాడు కూడా తన పాత్రకు న్యాయం చేశారు.నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు.నిర్మాత విలువలు బాగున్నాయి. -
‘35- చిన్న కథ కాదు’ రివ్యూ: చాలా పెద్ద కథే!
టైటిల్: 35- చిన్న కథ కాదునటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులునిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిదర్శకత్వం: నందకిషోర్ ఇమానిసంగీతం: వివేక్ సాగర్విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024టాలీవుడ్లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది. సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి. స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం. తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
The Goat Review: విజయ్ ‘ది గోట్’ మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)నటీనటులు: దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్, అజ్మల్, వైభవ్ తదితరులునిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్తెలుగు విడుదల: మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం: వెంకట్ ప్రభుసంగీతం: యువన్ శంకర్ రాజావిడుదల తేది: సెప్టెంబర్ 5, 2024దళపతి విజయ్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన చివరి సినిమా ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం ఇదేనని ప్రచారం జరగడంతో ‘ది గోట్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ యంగ్ లుక్‌లో చూపించడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఓ రకమైన ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం, విజయ్ చివరి చిత్రమని ప్రచారం జరగడంతో తమిళ్లో ‘ది గోట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్‌కి ముందు తెలుగులోనూ విజయ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో తీసిన సీన్స్ ట్రైలర్లో చూపించడం..వాటిపై ట్రోల్స్ రావడంతో తెలుగులో పెద్ద అంచనాలు లేకుండానే సినిమా రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే..విడుదల తర్వాత వెంకట్ ప్రభు చేసిన డీ ఏజింగ్ కాన్సెప్ట్ పక్కా ట్రోల్ అవుతుందని అంతా భావించారు. కానీ ట్రోలర్స్‌కి వెంకట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. జూనియర్ విజయ్ పాత్రను చక్కగా రాసుకోవడమే కాదు.. తెరపై అంతే చక్కగా చూపించాడు. ఈ విషయంలో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక కథ విషయానికొస్తే మాత్రం.. ఇది రొటీన్ సినిమా అని చెప్పొచ్చు. హీరో ఓ సీక్రెట్ ఏజెన్సీలో పని చేయడం..అతని పని వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రావడం..సొంత మనుషులే నమ్మక ద్రోహం చేయడం.. చివరికి హీరో అసలు విషయాన్ని కనిపెట్టి శత్రువుని ముట్టుపెట్టడం..ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వంపై కూడా సినిమాలు వచ్చాయి. ఈ రెండు కాన్సెప్ట్‌లను మిక్స్ చేసి ‘ది గోట్’ సినిమాను తెరకెక్కించాడు వెంకట్ ప్రభు. రొటీన్ కథే అయినా తనదైన స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. కావాల్సిన చోట హీరోకి ఎలివేషన్ ఇస్తూ విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్లో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్‌లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ సీన్ బోర్ కొట్టదు. ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజీని, ధోనీ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నాడు. ఊహకందేలా కథనం సాగడం, ట్విస్టులు కూడా ముందే తెలిసేలా ఉండడంతో పాటు నిడివి కూడా ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిజం ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. ది గోట్లో స్పెషల్ ఏంటంటే విజయ్‌లోని విలనిజాన్ని చూడొచ్చు. గాంధీగా హీరోయిజాన్ని తనదైన స్టైల్లో చూపిస్తూనే.. జీవన్ అలియాస్ సంజయ్గా అద్భుతమైన విలనిజాన్ని తెరపై పండించాడు. హీరోగా కంటే విలన్‌గా విజయ్ చేసిన కొన్ని సీన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పనిచేసే ఆఫీసర్స్‌గా ప్రశాంత్, ప్రభుదేవా, ఆజ్మల్ , జయ రామ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో భార్య అనుగా స్నేహ చక్కగా నటించింది. మీనాక్షి చౌదరి తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్‌ని తెరపై చూపించడం ఆకట్టుకుంటుంది. యోగిబాబు కామెడీ పర్వాలేదు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెరపై కనిపించేంది కొన్ని క్షణాలే అయినా.. సందడిగా అనిపిస్తుంది. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. యువన్ శంకర్ రాజా సంగీతం యావరేజ్‌గా ఉంది. పాటలు ఆకట్టుకోకపోవడమే కాకుండా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. బీజీఎం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డీ ఏజింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. ఏఐ టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
OTT: హాలీవుడ్ మూవీ ‘ప్రైమల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ప్రైమల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. దేవుడా... ఈ స్థితి ఎవరికీ రాకూడదు!థ్రిల్లర్ చిత్రాలను మనం గతంలో ఎన్నో చూశాం. అదే జోనర్లో ఎప్పటికప్పుడు వినూత్న పంథాను ఎంచుకుంటూ వర్ధమాన దర్శకులు వివిధ భాషలలో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. థ్రిల్లర్ అంటే సినిమా చూసే ప్రేక్షకుడిని తమ స్క్రీన్‌ప్లేతో అలరించాలి... కథను రక్తి కట్టించాలి. 2019లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ప్రైమల్’ ఆ కోవలోనే ఉంటుంది. ఇది ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ నటుడు నికోలస్ కేజ్ నటించిన ఈ సినిమా ఓ అసలు సిసలైన థ్రిల్లర్ అని చెప్పాలి. నిక్ పావెల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ 70 శాతం నడి సముద్రంలోని ఓ ఓడలోనే జరుగుతుంది. కథాంశానికొస్తే... వాల్ష్ పాత్రలో నటించిన నికోలస్ కేజ్ ప్రమాద జంతువులను అడవిలో పట్టుకొని నగరంలో జంతు శాలలకు అమ్ముకునే ప్రమాద వృత్తిలో ఉంటాడు. ఈ దశలో అతి ప్రమాదకరమైన వైట్ జాగ్వర్ను పట్టుకుని జాగ్వర్‌తో పాటు విషపూరిత పాములు, కోతులు మరికొన్ని జంతువులను కూడా ఓ ఓడలో వేరే దేశానికి తరలిస్తుంటాడు. అనుకోకుండా అదే ఓడలో కరడుగట్టిన నేరస్తుడైన రిచర్డ్ లోఫర్‌ను కూడా అమెరికా పోలీసులు తరలించడానికి వస్తారు. ఓడ ప్రమాదకర జంతువులతో పాటు అతి ప్రమాదకరమైన నేరస్తుడుతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. సముద్ర మార్గంలో కొంత దూరం ప్రయాణించాక నేరస్తుడు తాను తప్పించుకొని ఓడలో ఉన్న జంతువులను వాటి చెరసాలనుండి విడిపిస్తాడు. వాల్ష్ తన జంతువులతో పాటు ఓడలో వున్న మిగతా పోలీసులను, అలాగే ఓడను ఆ నేరస్తుడి బారి నుండి ఎలా రక్షించాడన్నదే మిగతా కథ. విలన్ పాత్రలో కెవిన్ తన నటనతో సినిమాకే హైలెట్‌గా నిలిచాడు. ఓ టైమ్‌లో ప్రేక్షకుడు దేవుడా... ఈ స్థితి ఎవరికీ రాకూడదు అని కచ్చితంగా అనుకుంటాడు. స్క్రీన్‌ప్లే నిడివి తక్కువ ఉండి థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు సరైన ఎంటర్టైనర్ అయిన ఈ ‘ప్రైమల్’ సినిమా లయన్స్ గేట్ ఓటీటీలో ఉంది. మరింకేం... వాచ్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ -
OTT: ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ మూవీ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అన్నది వినోద సాధనమన్న విషయం మనందరికీ తెలుసు. మన కథలనే మనం వెండితెర మీద చూసుకుని మనమే ముచ్చటపడతాం. ఓ రకంగా చెప్పాలంటే సినిమా అన్నది మన జీవితాలకు అద్దం లాంటిదన్నమాట. చాలా సినిమాలు ఆనందాన్నిస్తే కొన్ని సినిమాలు మాత్రం మనలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ ఈ కోవలోకి చెందినదే. నందితా రాయ్, ముఖర్జీ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ సున్నిత అంశానికి మూలాధారం. తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన పరేష్ రావెల్ ఈ సినిమాలో గురూజీగా పిలవబడే ప్రధాన పాత్ర పోషించారు.కథాంశానికొస్తే... ఏడేళ్ల యమన్ శాస్త్రి వారం మొత్తం తన నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటూ వారాంతంలో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాడు. కొంత కాలానికి యమన్ శాస్త్రి తల్లిదండ్రులకు ఈ విషయం రుచించదు. తమ బిడ్డ మొత్తానికే తమ దగ్గర ఉండాలని మలర్ శాస్త్రి తన తండ్రైన మనోహర్ శాస్త్రిని ఉరఫ్ గురూజీని అడుగుతాడు. దానికి ఆయన ససేమిరా అంటూ వారాంతంలో మాత్రమే బిడ్డను చూసుకునే తీరిక కలిగిన మీ దగ్గర యమన్ సరిగా ఇమడలేడు అని నిక్కచ్చిగా చెబుతాడు. అయినా యమన్ విషయంలో మలర్ పట్టుబడతాడు. ఇక చేసేది లేక గురూజీ తన మనవడి కోసం తన కొడుకు, కోడలిపై కోర్టులో కేసు వేస్తాడు. ఈ కేసులో మనవడి మీద తాత మమకారం గెలుస్తుందా లేక తల్లిదండ్రుల అనురాగం గెలుస్తుందా? అన్నది ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ సినిమాలోనే చూడాలి. ఇది నేటి తరానికి ఓ చక్కటి లైబ్రరీ మూవీ అని చెప్పాలి. ఉరుకుల పరుగుల మన నిత్య జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి కూడా తల దించుకుని మొబైల్ స్క్రీన్లోనే చూస్తున్నాము తప్ప తల ఎత్తి సాటి వ్యక్తులను చూడడం కూడా లేదు. అందుకే ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ సినిమా మనందరికీ ఓ మేలుకొలుపులాంటిది, మనమందరమూ తెలుసుకోవాల్సిన విషయం చాలానే ఉంది ఈ సినిమాలో. రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం నేడు రెండుగంటలు వెచ్చించి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూడండి.– ఇంటూరు హరికృష్ణ -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
OTT: మలయాళ మూవీ ‘పేరడైజ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘పేరడైజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రముఖ దర్శకులు మణిరత్నం సమర్పించిన సినిమా ‘పేరడైజ్’. శ్రీలంక, ఇండియా రచయితలు కలిసి రాసిన కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రసన్న దర్శకుడు. రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ‘పేరడైజ్’ పూర్తిగా శ్రీలంకలో తీసిన సినిమా. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... ఓ జంట తమ ఐదో వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకలోని ఓ సుదూర గెస్ట్ హౌస్‌కు వెళుతుంది. ఆ గెస్ట్ హౌస్ కొండల మధ్యలో చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దానికి దరిదాపులో ఓ చిన్న గ్రామం ఉంటుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికీ శ్రీలంక దేశం మొత్తం ఉద్యమంతో ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. ఈ జంట నివసిస్తున్న గెస్ట్ హౌస్‌లో ఓ రాత్రి దొంగతనం జరిగి వారి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వీరు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నదే కథ. ఈ సినిమా మొత్తంలో స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్ అపించినా ఆఖరి ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనిది. అలాగే సినిమా మొత్తంలో సీతమ్మ, హనుమంతులు తిరిగిన ప్రదేశాలు చూపించడం, వాటి వివరణ ఇవ్వడం బావుంది. సినిమా మొత్తం చాలావరకు గ్రీనరీ చూడవచ్చు. ఎందుకంటే లంక అనేది రావణుని పేరడైజ్ కాబట్టి. మరి... మీరు కూడా ఈ ‘పేరడైజ్’ని ప్రైమ్ వీడియోలో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
టాలీవుడ్ మూవీ 'సంఘర్షణ'.. ఎలా ఉందంటే?
టైటిల్: సంఘర్షణనటీనటులు: శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను, ఎక్స్‌ప్రెస్ హరి, స్వాతిశ్రీ చెల్లబోయిన, సుధాకర్ తదితరులునిర్మాత: వల్లూరి శ్రీనివాస్ రావ్దర్శకత్వం: చిన్నా వెంకటేష్సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్, సుధాకర్ బార్ట్లేఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డిసంగీతం: ఆదిత్య శ్రీరామ్శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం సంఘర్షణ. మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వల్లూరి శ్రీనివాస్ రావ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) లైఫ్‌లో అనుకోకుండా ఓ సంఘటన జరుగుతుంది. అసలు వాళ్ల జీవితంలో ఎలాంటి సంఘటన జరిగింది? దాన్ని ఎలా ఫేస్ చేశారు. ఈక్రమంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలకు, చైతన్యకు ఉన్న సంబంధం ఏంటన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న క్రైం కాన్సెప్ట్‌తో ఈ కథను రాసుకున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ హాఫ్‌లో చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) చుట్టే కథ తిరుగుతుంది. ఆ తర్వాత జరిగే హత్యలు, ఇన్వెస్టిగేషన్ . దర్శకుడు చిన్న వెంకటేష్ మర్డర్ మిస్టరీని తెరపై చూపించడంలో సక్సెస్ కాలేకపోయాడు.సెకండాఫ్‌లో కథలో కాస్తా వేగం పెరుగుతుంది. హత్యలు, ఇన్‌స్టిగేషన్ సీన్స్ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోవు. అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ కథను ఆసక్తిగా చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్‌గా అనిపిస్తాయి. కథలో ఎక్స్‌ప్రెస్ హరి కామెడీ టైమింగ్ బాగుంది. ఇందులో కథ, కథనం ఆడియన్స్‌ను అంతగా మెప్పించకపోయినా.. క్లైమాక్స్ ఫర్వాలేదనిపించింది. డైరెక్టర్ చిన్న వెంకటేష్ ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎవరెలా చేశారంటే..చైతన్య, రసీదా బాను తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. శివ రామచంద్రవరుపు, కరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే కేవీప్రసాద్, సుధాకర్ బాట్లే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి కత్తెరకు మరింత పని చెప్పాల్సిది. ఆదిత్య శ్రీరామ్ నేపధ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
I.S.S Review: అంతరిక్షంలో యుద్ధం.. ఈ ఊహే థ్రిల్లింగ్!
ఊహకు రెక్కలొస్తే కాదేదీ కథకు అనర్హం అన్న నానుడి సరిగ్గా ఈ సినిమాకి సరిపోతుంది. మరి రచయిత అంత వైవిధ్యంతో ఆలోచించాడు. సినిమా పేరు ఐఎస్ ఎస్, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. ఇది చదవగానే ఇంకేముంది అంతరిక్ష ప్రయాణంతో ముడిపడిన కథ అని అనుకుంటారు. అలా అయితే రచయిత గురించి ఊసెందుకు. అసలా రచయిత ఊహ నిజంగా జరిగితే... ఆ ఆలోచనకే ఒకింత గగుర్పాటు వస్తుంది. ఈ సినిమా రచయిత నిక్ షఫీర్. దర్శకులు గేబ్రియలా. ఇక కథ విషయానికి వద్దాం. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ అమెరికా మరియు రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఐఎస్ ఎస్ సినిమా ప్రారంభం కాగానే స్పేస్ స్టేషన్ లో అమెరికా వ్యోమగాములు రష్యా వ్యోమగాములకు స్వాగతం పలుకుతుంటారు. అందరూ ఆనందంగా స్పేస్ స్టేషన్ లో కలుస్తారు. ఇంతలో ఓ అమెరికా వ్యోమగామి భూమి వైపు చూసి మిగతా వారినందరినీ అలర్ట్ చేస్తుంది. భూమి మీద భయంకరమైన విస్ఫోటనాలు జరుగుతుంటాయి. వీరికి అర్ధం కాక భూమిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత సమయం తరువాత భూమి పై అణు యుద్ధం ప్రారంభమైందని స్పేస్ స్టేషన్ తమ ఆధీనం చేసుకోవాలని వారి వారి దేశం వాళ్ళకు వర్తమానం పంపుతారు.ఉందేది అంతరిక్షలో, అదీ రెండు దేశాలకు సంబంధించి వ్యోమగాములు ఒకే స్పేస్ స్టేషన్ లో. భూమి మీద యుద్ధం. ఇదే యుద్ధం అప్పటి నుండి స్పేస్ స్టేషన్ లో కూడా ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో కుట్రలేంటి, ఎవరి మీద ఎవరు గెలిచారు, ఆఖరికి స్పేస్ స్టేషన్ ఎవరు చేజిక్కించుకున్నారు అన్నది ఐఎస్ ఎస్ సినిమాలో చూడాల్సిందే. దర్శకుడు లాగ్ లేకుండా పాయింట్ ని మంచి స్క్రీన్ ప్లే తో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. ఐఎస్ ఎస్ సినిమా మంచి వీకెండ్ మూవీ. ఈ సినిమా జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫాం వేదికగా స్ట్రీం అవుతోంది.- ఇంటూరు హరికృష్ణ -
Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా
టైటిల్: స్లీప్(కొరియన్ మూవీ)దర్శకత్వం: జాసన్ యూనిర్మాణ సంస్థ లోటే ఎంటర్టైన్మెంట్జోనర్: హారర్ థ్రిల్లర్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్(తెలుగులోనూ అందుబాటులో ఉంది)నిడివి: 95 నిమిషాలుహారర్ సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చేది దెయ్యమే. ఆ సబ్జెక్ట్ లేకుండా హారర్ సినిమా తీయడం చాలా అరుదు. తెలుగు చాలా హారర్ చిత్రాలు వచ్చాయి. కానీ దెయ్యం ఎక్కడా కనిపించకుండా ఆడియన్స్‌ను భయపెట్టేలా సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమే స్లీప్. 2023లో వచ్చిన కొరియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉండో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా మొత్త ఇద్దరు దంపతుల చుట్టే తిరుగుతుంది. సౌత్ కొరియాలో హైయోన్-సూ (లీ సన్-క్యున్), సూ-జిన్ (జంగ్ యు-మి) కొత్తగా పెళ్లి చేసుకుని ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంటారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవనం సాగిస్తుంటారు. కానీ అనుకోకుండా ఓ రాత్రి జరిగిన సంఘటనతో వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ సంఘటన తర్వాత సూ జిన్‌లో భయం మొదలవుతుంది. అసలు తన భర్త ఎందుకిలా చేస్తున్నాడో భయంతో వణికిపోతుంది.ఆ తర్వాత తన భర్త హయన్ సూతో కలిసి వైద్యుని సంప్రదిస్తుంది సూ జిన్. ఆ తర్వాత ఆమె భర్తకు ఉన్న విచిత్రమైన, భయంకరమైన వింత సమస్య గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తుంది. అసలు అతనికి ఏమైంది? భయంకరమైన డిజార్డరా? లేక దెయ్యం ఆవహించిందా?.. అలాగే వీరికి పుట్టిన బాబును ఎలా రక్షించుకుంది? అనేది తెలియాలంటే స్లీప్ ఓసారి చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్లీప్.. హారర్ మూవీ అయినప్పటికీ డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను సినీ ప్రియులకు పరిచయం చేశాడు. దెయ్యాన్ని చూపించకుండానే ఆడియన్స్‌ను భయపడేలా చేశాడు. ఇందులో విచిత్రమైన డిజార్డర్‌ను పరిచయం చేస్తూ.. హారర్‌తో పాటు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతనికి ఉన్నది డిజార్డరా? లేక నిజంగానే దెయ్యం పట్టిందా? అన్న అనుమానాన్ని ఆడియన్స్‌లో రేకెత్తించాడు. అక్కడక్కడా మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినా.. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను మరింత భయపెట్టేస్తాయి. కొన్ని సీన్స్ అయితే ఒళ్లు గగుర్పొడ్చేలా ఉన్నాయి. అలాగే చివర్లో వచ్చే డ్రిల్లింగ్ మిషన్ సీన్ చిన్నపిల్లలకు చూపించకపోవడం మంచిది. మొత్తంగా ఓటీటీలో సస్పెన్ష్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ స్లీప్ చూసేయొచ్చు. -
OTT: ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ అండ్ మిసెస్ మహినటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులుదర్శకత్వం: శరణ్ శర్మ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామిఎడిటింగ్: నితిన్ బైదిఓటిటి వేదిక: నెట్ ఫ్లిక్స్స్ఫూర్తి అన్నది ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ స్ఫూర్తికి సిద్దాంతం, వేదాంతం ఉండవు. తాను ఆడలేని పరిస్థితులలో తన ఆటను వేరొకరిలో చూసుకుని ఆడిస్తే అదే నిజమైన స్ఫూర్తి. అ కోవకు చెందినే ఈ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహీ. కథ మూలం వర్ధమాన ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ అని చెప్తున్నా ఈ సినిమాలో ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కాని సినిమా పేరు తో పాటు ధోనీ పుట్టిన రాష్ట్రంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఒక విధంగా ఇదొక మామూలు కథ. క్రికెట్ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డ కథానాయకుడు ఓ సంఘటన వల్ల అదే క్రికెట్ కి దూరమవుతాడు. తాను దూరం చేసుకుంది ఎలాగైనా సాధించాలన్న సదుద్దేశంతో తన భార్యకు క్రికెట్ కోచ్ గా మారతాడు. ఆట అంటే వచ్చే ఆనందం కన్నా ఆడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్ళు ఎన్నో ఎన్నెన్నో. అది కూడా మగవాళ్ళైతే కొంత వరకు పరవాలేదు. కాని ఆడవాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంతా కాదు. మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో ఈ పాయింట్ చాలా హృద్యంగా చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆఖర్లో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం వరకు ప్రేక్షకుడిని కట్టిబడేసేలా రాసుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు శరణ్ శర్మ. ముఖ్య తారాగణంలో నటించిన రాజ్ కుమార్ రావ్ మరియు జాహ్నవి కపూర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. వర్త్ టు వాచ్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ.- ఇంటూరు హరికృష్ణ -
‘విరాజి’ మూవీ రివ్యూ
టైటిల్: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్లదర్శకత్వం: ఆద్యంత్ హర్షసంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: రామ్ తూమువిడుదల తేది: ఆగస్ట్ 2, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆండి(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. చిన్న పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంటర్వెల్‌కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్, థ్రిల్లర్ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఎవరెలా చేశారంటే..ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. -
‘అలనాటి రామచంద్రుడు’ మూవీ రివ్యూ
టైటిల్: అలనాటి రామచంద్రుడునటీనటులు: కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహమాధురి శర్మ తదతరులునిర్మాత: హైమావతి, శ్రీరామ్ జడపోలుదర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డిసంగీతం: శశాంక్ తిరుపతిసినిమాటోగ్రఫీ: ప్రేమ్ సాగర్ఎడిటర్: జే సి శ్రీకర్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే చాలు హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోవడం లేదు. అందుకే ప్రస్తుతం మన దర్శకనిర్మాతలు కంటెంట్‌ను నమ్ముకొని కొత్త నటీనటులతో సినిమాలు తీస్తున్నారు. అలా కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రమే ‘అలనాటి రామచంద్రుడు’. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఓ మంచి లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్‌పై స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్ట్రావర్ట్. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. అంతలోనే ధరణికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్‌తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు? ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రేమ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే లవ్‌స్టోరీలో కొంచెం వైవిధ్యం ఉంటే చాలు సినిమాను ఆదరిస్తారు ప్రేక్షకులు. దర్శకుడు చిలుకూరి ఆకాశ్ రెడ్డి కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథకి ఫాదర్ సెంటిమెంట్ యాడ్ చేసి అన్నివర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్నాడు. అయితే అనుకున్న కథను అంతే ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సంభాషణల్లో ఉన్న డెప్త్.. సన్నివేశాల్లో కనిపించలేదు. డాటర్-ఫాదర్ సెంటిమెంట్ సీన్లను మాత్రం చక్కగా తీర్చిదిద్దాడు. ఆ సీన్లన్నీ అలా గుర్తుండిపోతాయి. అయితే హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ మాత్రం రొటీన్‌గానే ఉంటుంది. కాలేజీ సీన్లు, తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పేందుకు హీరో చేసే ప్రయత్నాలు అన్నీ రొటీన్‌గానే ఉంటాయి. హృదయాలను హత్తుకునే పాటలు.. మంచి నేపథ్య సంగీతం కారణంగా కథనం రొటీన్‌గా సాగినా ఫస్టాఫ్ బోర్ కొట్టదు. కానీ సెకండాఫ్‌లో కథనాన్ని నెమ్మదిగా సాగిస్తూ.. బోర్ కొట్టించేలా చేశాడు. మనాలిలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ల చిన్ననాటి ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. మనాలి నుంచి హీరోహీరోయిన్లు తిరిగి వచ్చిన తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. ఒకనొక దశలో ఇంకా శుభం కార్డు పడట్లేదే అనిపిస్తుంది. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్..ఇద్దరూ కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. ఇంట్రోవర్ట్ సిద్ధు పాత్రకి కృష్ణవంశీ న్యాయం చేశాడు. మొదటి సినిమానే అయినా.. చక్కగా నటించాడు. ఇక ధరణి పాత్రలో మోక్ష ఒదిగిపోయింది. తెలుగులో తొలి సినిమాతోనే మంచి పాత్ర లభించింది. డ్యాన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. శశాంక్ తిరుపతి సంగీతం సినిమాకు ప్లస్ అయింది. హృదయాలను హత్తుకునే పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని తెరపై రిచ్‌గా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Shivam Bhaje Review: ‘శివం భజే’ మూవీ రివ్యూ
టైటిల్: శివం భజేనటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులునిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలిదర్శకత్వం: అప్సర్సంగీతం: వికాస్ బడిససినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్రవిడుదల తేది: ఆగస్ట్ 1, 2024ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో మన దర్శక నిర్మాతలు డివోషనల్ టచ్ ఉన్న కథలలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిన తాజా చిత్రమే ‘శివం భజే’. ‘హిడింబ’ తర్వాత అశ్విన్ బాబు నటించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంలో ‘శివం భజే’పై బజ్ క్రియేట్ అయింది. మరి డివోషనల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: చందు(అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఓ కారు ఈఎమ్ఐ వసూలు చేస్తున్న క్రమంలో శైలజ(దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. శైలజ ఓ కెమికల్ ల్యాబ్‌లో పని చేస్తుంది. ఓ రోజు శైలజను కలిసేందుకు వెళ్లిన చందు ఆమె ఆఫీస్‌కు వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవ కారణంగా అతను కంటి చూపు కోల్పోతాడు. దాంతో వైద్యులు అతనికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. కొత్త కళ్లు వచ్చిన తర్వాత చందు ప్రవర్తనలో మార్పు వస్తుంది. డే మొత్తం నిద్రబోతూ.. నైట్ టైమ్‌లో మెలకువగా ఉంటాడు. అంతేకాకుండా అతని మైండ్‌లో రెండు హత్యలకు సంబంధించిన జ్ఞాపకాలు మెదులుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే..అతని కళ్లకు సంబంధించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటి? అసలు ఆ కళ్లు ఎవరివి? అతని కలలోకి వస్తున్న హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చైనా-పాకిస్తాన్ కలిసి ‘ఆపరేషన్ లామా’పేరుతో భారత్‌పై చేస్తున్న కుట్ర ఏంటి? ‘ఆపరేషన్ లామా’కు సాధారణ వ్యక్తి చందుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. కానీ తెరపై చూస్తున్నప్పడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించినప్పుడే ఫలితం ఉంటుంది. అయితే ‘శివం భజే’ విషయంలో అది కొంతవరకు మాత్రమే ఫలించింది. వాస్తవానికి దర్శకుడు అప్సర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్‌ని తెరపై ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్, సైన్స్, ఫ్యామిలీ, డివోషినల్..ఇలా ఐదారు జానార్లతో కలిపి ఈ కథ రాసుకున్నాడు. జీనోట్రాన్స్ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా నడిపిస్తే బాగుండేది.ఇండియా పై పాకిస్తాన్..చైనా చేసే కుట్ర సీన్ తో సినిమా ప్రారంభం అవ్తుంది. ఆ తరువాత వరుస హత్యలు..పోలీసుల ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒక వైపు.. హీరో..హీరోయిన్ల లవ్ ట్రాక్ మరో వైపు నడుస్తుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చెప్పకుండా కథ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరక్టర్. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. సెకండాఫ్ లో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. జీనోట్రాన్స్ప్లాంటేషన్ రివీల్ అవ్వడం..ఆ తర్వాత వెంటనే ‘డోగ్రా’ గురించి తెలియడం..దాని నేపథ్యం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ వరుస హత్యలపై పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంది. బలమైన విలన్ లేకపోవడం సినిమాకు మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్.. కాంతార లెవల్లో సాగే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. కథ మాదిరే స్క్రీన్‌ప్లేని కూడా మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..నటన పరంగా అశ్విన్ బాబుకి వంక పెట్టలేం. ఎలాంటి పాత్రలోనైనా ఆయన అవలీలగా నటించగలడు. తొలిసారి ఆయన ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిగా నటించాడు. రికవరీ ఏజెంట్ చందుగా ఆయన చక్కగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో అశ్విన్ నటవిశ్వరూపం చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాత్రకి ఇందులో పెద్దగా స్కోప్ లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. ఏసీపీ మురళీగా అర్బాజ్ ఖాన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. మురళీ శర్మ, తులసి, ఇనయ సుల్తానాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. వికాస్ బడిస నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- రేటింగ్: 2.75/5 -
‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ రావణ్నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులునిర్మాత: ధ్యాన్ అట్లూరిరచన-దర్శకత్వం: వెంకట సత్యసంగీతం: శరవణ వాసుదేవన్సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టివిడుదల తేది: జులై 26, 2024పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు..వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్..దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసడలని స్క్రీన్‌ప్లే ఉండాలి. అప్పుడే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా విషయంలో ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు.. దాన్ని చూపించిన తీరు ఉత్కంఠబరితంగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదా సీదా అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరోహీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరని తెలిసిన తర్వాత షాక్‌కి గురవుతాం. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరివరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడిపాడు. తొలి సినిమానే అయినా..కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆస్తకి కలిగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌తో లవ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీశాడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేస్ రివీల్ చేసే సీన్, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఆపరేషన్ రావణ్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. గత సినిమాలతో పోలిస్తే రక్షిత్ అట్లూరి నటన మరింత మెరుగు పడింది. జర్నలిస్ట్ రామ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్‌ని ఛేజింగ్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంగీర్తన విపిన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి కూడా క్లైమాక్స్‌లో తన నటనతో బయపెడతాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జస్ట్ ఎ మినిట్ మూవీ ఎలా ఉందంటే..?
టైటిల్: జస్ట్ ఎ మినిట్ నటీనటులు: అభిషేక్ పచ్చిపాల, ఇషిత సింగ్, వినీషా, నజియా ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లినిర్మాణ సంస్థ: రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్నిర్మాతలు : రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు డా. ప్రకాష్ ధర్మపురిదర్శకత్వం: యశ్వంత్సంగీతం: ఎస్. కే. బాజీసినిమాటోగ్రాఫర్ : అమీర్ఎడిటర్ : దుర్గ నరసింహవిడుదల తేది: జులై 19, 2024‘జస్ట్ ఎ మినిట్’కథేంటంటే..రవి(అభిషేక్ పచ్చిపాల) ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. అది బయటకు చెప్పుకోలేని సమస్య. దాని నుంచి బయట పడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి పూజ(నజియా ఖాన్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ అతని ఉన్న సమస్యను ఆమెతో షేర్ చేసుకోలేకపోతాడు. ఈ విషయంలో తన స్నేహితుడైన రాంబాబు(జబర్ధస్త్ ఫణి) సహాయం కోరతాడు. రవికి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? ఆ సమస్య పూజకు తెలిసిన తర్వాత ఎలా ససోర్ట్గా నిలిచింది? చివరకు రవి ఆ సమస్యను అధిగమించాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ‘ఏడు చేపల కథ’అనే బోల్డ్ కామెడీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు హీరో అభిషేక్ పచ్చిపాల. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో మరోసారి తనకు అచ్చొచ్చిన బోల్డ్ కామెడీ జానర్‌తోనే ‘జస్ట్ ఎ మినిట్ ’అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ‘ఏడు చేపల కథ’లాగే ఇందులో కూడా హీరో ఓ శృంగార సమస్యతో బాధ పడతాడు. ప్రస్తుతం యువత చాలా వరకు ఈ సమస్యతో బాధపడుతుంది. ఈ విషయాన్ని కామెడీగా చూపిస్తూనే ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు యశ్వంత్. అయితే ఆయన రాసుకున్న కథను తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అతనికిది తొలి సినిమానే. కొన్ని సీన్లను తెరకెక్కించిన విధానం చూస్తే.. అతని అనుభవ లేమి స్పష్టంగా తెలిపిసోతంది. అయితే కొన్ని కామెడీ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్ అంతా రవికి ఉన్న ఆరోగ్య సమస్యతో కామెడీగా సాగుతుంది. అయితే కొన్ని బోల్డ్ సీన్స్, సంభాషణలు ఓ వర్గానికి ఇబ్బందిగా అనిపించినా.. యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలిసిపోయేలా కథనం సాగుతుంది. నిడివి తక్కువ ఉండడం సినిమాకు ప్లస్ పాయింట్. థియేటర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ..ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..అభిషేక్ పచ్చిపాల తనకున్న సమస్యని కామెడీగా చూపించడంలో మంచి నటనను కనబరిచారు. హీరోయిన్ నజియా ఖాన్ పెర్ఫార్మెన్స్ గ్లామరస్ గా చాలా బాగుంది. జబర్దస్త్ ఫణి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కామెడీ మరి ఎమోషన్ ని చాలా బాగా పండించారు. సారిపల్లి సతీష్ గారు తండ్రి క్యారెక్టర్ లో అలాగే పోలీస్ పాత్రలు కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు వారు బాగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఎస్.కె. బాజీ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.5/5 -
‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కల్కి 2898 ఏడీనటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్నిర్మాత: అశ్వనీదత్దర్శకత్వం: నాగ్ అశ్విన్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జూన్ 27, 2024ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది. మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్‌లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్‌ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్‌గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
OMG Review: ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: OMG (ఓ మంచి ఘోస్ట్)నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.నిర్మాత: డా.అబినికా ఇనాబతునిదర్శకుడు: శంకర్ మార్తాండ్సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూఎడిటర్: ఎం.ఆర్.వర్మవిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్).. ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన తన మేన మరదలు, స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు(నాగినీడు) కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కిర్తీకి కూడా ఓ సమస్య ఉంటుంది? అటు దెయ్యం, ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసినవాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ, ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఓ మంచి ఘోస్ట్ కూడా ఆ జానర్లో తెరకెక్కిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే.. భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా..ప్రతీది పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో.. రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కిడ్నాప్ డ్రామ అంతగా ఆకట్టుకోదు. నలుగురి గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ.. అతన్ని దెయ్యం అనుకొని ఆ నలుగు భయపడే సన్నివేశాలు.. ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు.. ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే.. మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. -
Yevam Review: యేవమ్ మూవీ ఎలా ఉందంటే..?
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వికారాబాద్ చెందిన సౌమ్య(చాందిని చౌదరి) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదిస్తుంది. తను ఆ జాబ్ చేయడం తండ్రి, సోదరుడికి అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా సౌమ్య ఉద్యోగాన్ని వదులుకోదు. తన పై అధికారి అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు ఎనలేని అభిమానం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొనే పోలీసు వృత్తిని ఎంచుకుంటుంది. సౌమ్య ఉద్యోగంలోకి చేరిన కొద్ది రోజులకే వికారాబాద్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. యుగంధర్(వశిష్ట సింహ) అనే ఓ వ్యక్తి హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి..హత్యలు చేస్తుంటాడు. ఈ కేసును సౌమ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అభికి సమాచారం యుగంధర్ని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యుగంధర్ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? అసలు ఎవరీ యుగంధర్? హీరోల పేర్లు చెప్పి ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు? అభికి యుగంధర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసును సౌమ్య ఎలా డీల్ చేసింది? చిత్రానికి యేవమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సైకో థ్రిల్లర్‌ని, స్ల్పిట్ పర్సనాలిటీ కలిపి కథగా మార్చుకున్నాడు దర్శకుడు ప్రకాష్ దంతులూరి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉన్నా.. తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసేందుకు ప్రయత్నించాడు. కథ ప్రారంభంలోనే యుగంధర్ నైజం ఏంటో అర్థమైపోతుంది. అఘరెడ్డి బెడ్ సీన్‌తో కథను ప్రారంభించి.. ఆ తర్వాత స్టోరీని వికారాబాద్ పోలీసు స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అభి, సౌమ్య పాత్రల పరిచయం..వారి నేపథ్యం చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉంటుంది. ప్రభాస్ పేరు చెప్పి ఓ అమ్మాయిని ట్రాప్ చేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా యుగంధర్ వరుసగా హీరోలను పేర్లు చెబుతూ అమ్మాయిలను ట్రాప్‌లోకి దించడం బోర్ కొట్టిస్తుంది.మరోవైపు అభి-సౌమ్యల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. అసలు సౌమ్య అభిలో ఏం చూసి ఇష్టపడిందనే పాయింట్‌ని బలంగా చూపించలేకపోయారు. సైకోని పట్టుకునేందుకు సౌమ్య ఇచ్చే సలహాలు కూడా సింపుల్‌గానే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పటికే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రేక్షకుడికి ఇంటర్వెల్ బ్యాంగ్ షాకిస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఊహకందేలా సాగుంది. సైకో పక్కన తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం.. అతని కవ్వింపు చర్యలు అవన్నీ రొటీన్ సైకో థ్రిల్లర్స్లాగే ఉంటాయి. సౌమ్య సైకోని ఎలా పట్టుకొంది? ఎలా గుర్తించింది? అనేది మరింత బలంగా చూపిస్తే బాగుండేది. అక్కడ రివీల్ చేసే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోలేదు. తెలంగాణ ఒగ్గు కథ పాటతో ఓ ప్రధాన సన్నివేశాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్. స్క్రీన్‌ప్లే మాదిరి కథను కూడా ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. తొలిసారి చాందిని పోలీసులు పాత్రను పోషించి మెప్పించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు. అభిగా భరత్ రాజ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఆ పాత్రలో తెలిసిన నటుడైతే బాగుండేది. కానిస్టేబుల్‌గా గోపరాజు రమణ తో పాటు మిగిలిన నటీనటులతో తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
‘హరోం హర’ మూవీ రివ్యూ
టైటిల్: హరోం హరనటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులునిర్మాత : సుమంత్ జి నాయుడురచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారకసంగీతం: చైతన్ భరద్వాజ్ఎడిటర్ : రవితేజ గిరిజాలవిడుదల తేది: జూన్ 14, 2024వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఉంటాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హరోం హర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. (Harom Hara Review) ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని కొంతమంది దుర్మార్గులు తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను హింసించడం.. అక్కడకు హీరో సాధారణ వ్యక్తిలా వచ్చి వారిని అంతమొందించి ప్రజలకు విముక్తి కలిగించడం.. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. హరోం హర మూవీ లైన్ కూడా ఇదే. కేజీయఫ్, పుష్ప సినిమాల మాదిరి హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. (Harom Hara Review)సినిమా ప్రారంభం మొదలుకొని క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం.. పుష్ప, కేజీయఫ్, ఛత్రపతి సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక విలన్లు చేసే అరాచకాలు చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. కేజీయఫ్ స్టైల్లో పళని(సునీల్) హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథను ప్రారంభిస్తాడు. తమ్మిరెడ్డి, శరత్ పరిచయ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. హీరో ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. ఊర్లో తమ్మిరెడ్డి మనుషుల ఆగడాలను చూపిస్తారు. అయితే అటు లవ్ ట్రాక్‌తో పాటు రొట్టకొట్టుడు విలనిజం బోర్ కొట్టిస్తుంది. హీరో గన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యేవరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని ఫైట్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక హీరో తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం.. యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నీరసంగా సాగుతుంది. కేజీయఫ్, విక్రమ్ మాదిరి యాక్షన్స్ సీన్స్ వస్తుంటాయి కానీ ఎక్కడా ఆకట్టుకోలేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, అమితాబ్ అంటూ పేర్లు పెట్టి కొత్త తుపాకులను అమ్మడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (Harom Hara Movie Review) ఇక చివర్లో జ్యోతిలక్ష్మి(హీరో ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద గన్)తో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా నేపథ్యంతో పాటు పాత్రలను తిర్చిదిద్దిన విధానం.. పలికించిన భాష, యాస అన్ని పుష్స సినిమాను గుర్తు చేసేలా ఉంటాయి. మాస్ యాక్షన్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సుబ్రమణ్యం పాత్రలు సుధీర్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో సుధీర్ నటించలేదు. యాక్షన్ సీన్స్‌లో చించేశాడు. మాళవిక శర్మ తెరపై కనిపించేదే కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. పోలీసు ఆఫీసర్‌గా అక్షర గౌడ తన పాత్ర పరిధిమేర నటించింది. సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ పళనిస్వామిగా సునీల్, విలన్లుగా రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. (Harom Hara Movie Review) హీరో తండ్రిగా నటించిన జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యూజిక్ షాప్ మూర్తినటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులునిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటిరచన & దర్శకత్వం: శివ పాలడుగు సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగంఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డివిడుదల తేది: జూన్ 14, 2024‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథేంటంటే.. పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన మూర్తి(అజయ్ ఘోష్)..అదే గ్రామంలో మ్యూజిక్ షాప్ రన్ చేస్తుంటాడు. వయసు 52 యేళ్లు. మొదటి నుంచి మ్యూజిక్ షాప్ లోనే పని చేయడంతో...లాభాలు లేకున్నా...అదే పని చేస్తుంటాడు. భార్య జయ(ఆమని) ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముతూ..ఇద్దరి కూతుళ్ళని చదివిస్తుంది. మ్యూజిక్ షాప్ అమ్మి..మొబైల్ షాప్ పెట్టాలని జయ కోరిక.ఈ వయసులో కొత్త పని నేర్చుకునే కంటే...30 ఏళ్లుగా పని చేస్తున్న మ్యూజిక్ లోనే కొత్తగా ట్రై చేయాలని మూర్తి కోరిక. ఓ బర్త్‌డే పార్టీలో ఆయన పాటలు మిక్స్ చేసి ప్లే చేసిన విధానం అందరికి నచ్చి..డీజే అవ్వొచ్చు కదా అని సలహా ఇస్తారు. డీజే అయితే తనకు నచ్చిన పని చేస్తూనే బాగా డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చని..ఆన్లైన్లో డీజే కోర్స్ గురించి తెలుసుకుంటుంటాడు.మరో వైపు అమెరికా నుంచి తిరిగి ఇండియా కి వచ్చిన అంజన( చాందినీ చౌదరి) కి డీజే నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంటుంది. అది ఆమె తండ్రి(భానుచందర్) కి నచ్చదు. తండ్రి అనుమతి తో డీజే అవ్వాలనుకుంటుంది. ఓ సందర్భంలో మూర్తిని కలిసిన అంజనా....మ్యూజిక్ పై అతనికి ఉన్న ఆసక్తిని గమనించి డీజే నేర్పించాలనుకుంటుంది. అంజనాని గురువుగా భావించిన మూర్తి..ఆమె చెప్పే పాఠాలు శ్రద్ధ గా విని డీజే వాయించడం పూర్తిగా నేర్చుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మూర్తి డీజే అవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకు? అంజన, మూర్తి మధ్య ఉన్న సంబంధాన్ని సమాజంతో పాటు కుటుంబ సభ్యులు ఎలా తప్పుపట్టారు? అంజనా తండ్రి ముర్తిపై ఎందుకు కేస్ పెట్టాడు? డీజే అవ్వడం కోసం హైదరాబాద్ కి వచ్చిన మూర్తికి ఎదురైన కష్టాలు ఏంటి? ఫేమస్ డీజే డెవిల్(అమిత్ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? చివరకు 52 ఏళ్ల మ్యూజిక్ షాప్ మూర్తి.. ఫేమస్ డీజే మూర్తిగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథల్లో పెద్దగా ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా..తెరపై చూడాలనిపిస్తుంది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథ కూడా అంతే. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే కాస్త ఆలోచిస్తే..ఇంటర్వెల్ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఈజీగా అంచనా వేయ్యొచ్చు. అయినా కూడా తెరపై చూడాలనిపిస్తుంది. అలా అని ఈ కథ కొత్తదేమి కాదు. చాలా రోటీన్, సింపుల్ కథే. హీరో ఒకటి సాధించాలనుకుంటాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే కష్టాలు..వాటిని అధిగమించి చివరకు విజయం సాధించడం.. ఇదే మ్యూజిక్ షాప్ మూర్తి కథ.అయితే ఈ సినిమాలో హీరోకి 52 ఏళ్లు. ఆ వయసులో తన గోల్‌ని నెరవేర్చుకోవడమే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అనేది చాలా ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు శివ పాలడుగు. కథనం రొటీన్‌గా సాగించినా.. ఎమోషన్ బాగా పండించి.. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ కథకి హీరోగా అజయ్ ఘోష్‌ని ఎంచుకోవడమే దర్శకుడి మొదటి విజయం. ఓ యంగ్ హీరోని పెట్టి ఈ కథ చెబితే.. రొటీన్‌గా అనిపించేంది. కానీ వయసు మీద పడిన వ్యక్తి కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఓ పది నిమిషాల తర్వాత కథనం ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే నేర్చుకోవడం కోసం చేసే అతను సాధన చూపించారు. ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండాఫ్ మరింత ఎమోషనల్‌గా సాగుతూనే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. డీజే అవ్వడానికి మూర్తి పడే కష్టాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీక్లైమాక్స్ కన్నిళ్లను తెప్పిస్తాయి. క్లైమాక్స్ బాగున్నా..ఎందుకో కాస్త సాగదీశారేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా మ్యూజిక్ షాప్ మూర్తి జర్నీ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తుంది. ‘మొదటి ప్రయత్నానికే విజయం సాధించాలి..అది అవ్వకపోతే వదిలేసి..వేరే పని చేసుకోవాలి’అని ఆలోచించే నేటితరం యువతకి మూర్తి కథ ఆదర్శం అవుతుంది.ఎవరెలా చేశారంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరిని మెప్పిస్తున్న అజయ్ ఘోష్ ఇందులో లీడ్ రోల్ చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాభై ఏళ్లు పైబడిన మధ్యతరగతి వ్యక్తి మూర్తి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఒక్క పక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించాడు. టైటిల్ సాంగ్‌కి స్టైప్పులేసి ఆకట్టుకున్నాడు. ఇక అంజనా పాత్రకి చాందిని చౌదరి న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించిన గురువు పాత్ర తనది. ఆమె పాత్ర చెప్పే కొన్ని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్య జయగా ఆమని చక్కగా నటించింది. అమిత్ శర్మ, భాను చందర్. దయానంద్ రెడ్డి, పటాస్ నానితో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. పవన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
Rakshana Review: పాయల్ రాజ్‌పుత్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది?
టైటిల్: రక్షణనటీనటులు: పాయల్ రాజ్‌పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులునిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్దర్శక-నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్సంగీతం: మహతి సాగర్సినిమాటోగ్రఫీ: అనిల్ బండారిఎడిటర్: గ్యారి బి హెచ్విడుదల తేది: జూన్ 7, 2024ఆర్ఎక్స్ 100, ‘మంగళవారం’సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘రక్షణ’. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా..పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. మంచి అంచనాలతో నేడు(జూన్ 7)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్‌పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి. ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. నగరంలో వరుస హత్యలు జరగడం.. ఆ హత్యల వెనుక ఓ కిల్లర్ ఉండడం.. అతన్ని పట్టుకునేందుకు హీరో/హీరోయిన్ రంగంలోని దిగడం..తన తెలివితేటలన్నీ ఉపయోగించి చివరకు ఆ సైకో కిల్లర్‌ని అంతమొందించడం.. సైకో థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలన్నీ ఇంచుమించు ఒకే మూసలో సాగుతాయి. దీంటో హత్యలు జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో/హీరోయిన్ ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘రక్షణ’ విషయంలో ఇది కొంతవరకే సఫలం అయింది. సైకో కిల్లర్.. అతని నేపథ్యం ఉత్కంఠభరితంగా ఉన్నా.. కథానాయికా చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉండదు. ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్‌తో పాయల్ పాత్రను పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంటనే తన ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి.. స్నేహితురాలి హత్యను చూపించి..అసలు కథను ప్రారంభించారు. సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు చూపించకుండా కథపై ఆసక్తిని పెంచాడు. ఆ తర్వాత వెంటనే అర్జున్ పాత్రని చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేశాడు. ఫస్టాఫ్ అంతా అర్జున్, కిరణ్‌ల చుట్టే తిరుగుతుంది. అర్జున్ పట్టుకునేందుకు కిరణ్ చేసే ప్రయత్నం మెప్పించదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత..అసలు అతను ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సైకో కిల్లర్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు పెరెంట్స్‌ని ఆలోచింపజేస్తుంది. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై కూడా దర్శకుడు ఓ మంచి సందేశాన్ని అందించాడు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై గ్లామర్‌గా కనిపించిన పాయల్.. ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. ఏసీపీ కిరణ్ పాత్రలో ఒదిగిపోయింది. హీరో స్థాయిలో యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. తెరపై సరికొత్త పాయల్ని చూస్తారు. బిగ్‌బాస్ ఫేం మానస్ తొలిసారి నెగెటివ్ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్ అరుణ్ పాత్రకి మానస్ పూర్తి న్యాయం చేశాడు. రామ్ పాత్రకి రోషన్ బాగా సెట్ అయ్యాడు. రాజీవ్ కనకాల, శివన్నారాయణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. మహతి సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల టెన్షన్ పెట్టాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత ఒక్కరే కావడంతో సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ నచ్చుతుంది. -
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5 -
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ
టైటిల్: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్‌ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌కు గణేష్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్ అయిన గణేష్..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ (ప్రిన్స్ యావర్) గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్ ఓ గణేశ్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్(వెన్నెల కిశోర్) కారణంగా రుద్రా గ్యాంగ్‌తో పాటు గణేష్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్ చివరకు ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్‌లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్‌తో హిలేరిస్‌గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్‌గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్ రెడ్డి ట్రాక్.. మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్, డైమండ్‌ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డైమండ్గా వెన్నెల కిశోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్ నడిపే లవ్‌ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్వామిజీ(రంజగన్)ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్ క్లైమాక్స్‌ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. డ్యాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక జబర్థస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్‌గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిశోర్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్‌లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
Gam Gam Ganesha X Review: ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే..
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు నేడు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గం..గం..గణేశా ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేద్దాం. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో గం..గం..గణేశాకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ అని అంటున్నారు. #GamGamGanesha 🏆🏆🏆🏆 A Proper Commercial Thriller Package from Anand deverkonda 👌Entertaining First Half and Thrilling Second Half with good Climax works big time 💥 Emmanuel , Krishna Chaitanya was best in their roles 🔥#GGG pic.twitter.com/HgfRVL9RTm— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 31, 2024 ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ గం..గం..గణేశా. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ ఉంది. సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ బాగుంది. ఇమ్మాన్యుయేల్, కృష్ణ చైతన్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GamGamGanesha A Complete Fun Entertainer 🏆@ananddeverkonda Steals The Show With His Brilliant Performance 👏Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & CharacterisationsMusic & Cinematography Are Of Top Notch Quality 👌 pic.twitter.com/rGmF8sM5uw— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024 గం..గం..గణేశా ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. ఆనంద్ దేవరకొండ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ ఉదయ్ నెరేటివ్ స్టైల్‌తో పాటు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#GamGamGanesha is a 'Sit-back and Relax' fun Crime Comedy. Situational comedy works superbly & Vennala Kishore Track was 🤣. BGM 🔥Despite its known story, Kudos to @udaybommisetty for his brilliant execution! @ananddeverkonda HIT Streak continues! ✌️ pic.twitter.com/GqiSbcLxf0— The Creative Shelf (@tcsblogs) May 31, 2024 గం గం గణేశా మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫన్ క్రైమ్ కామెడీ. వెన్నెల కిషోర్ సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి కథనాన్ని నడించిన తీరు బాగుంది. ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. #GamGamGanesha Day 🔥UK reviews bagunavi 😍Another BB loading............#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9— Mahesh (@starmahesh10) May 31, 2024#GamGamGaneshaReview:Simple story but missing content.Comedy is ok in some scenes.#AnandDeverakonda trying his best in plots but this time it's not up to the mark, #Immanuel #VennalaKishore are big plus.He always trying new appreciate for that.#GamGamGanesha#GangsOfGodavari pic.twitter.com/ko7QQYNZmg— MJ Cartels (@Mjcartels) May 31, 2024#GamGamGanesha Premiere Review from UK 🇬🇧 pic.twitter.com/f6W0Hn9LFu— Anonymous (@__GirDhar) May 31, 2024Positive reviews every where another hit loading ❤️🔥Congrats @ananddeverkonda anna #GamGamGanesha pic.twitter.com/hSHsbL4fcN— sashanth (@sashant39979304) May 31, 2024#GamGamGaneshaReviewPositives: • Situational Comedy 😂• Vennala Kishore Track 🤩• Characters & Characterisations 💥• Engaging Screenplay 💯• Decent Twists 🤗• Superb BGM 🥵Negatives: • Artificial First 15mins • Weak Villain Characterization• Few Acting &… pic.twitter.com/ozh13EbQ8z— Movies4u Official (@Movies4u_Officl) May 31, 2024 -
Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
టైటిల్: లవ్ మీనటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులునిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డిదర్శకుడు: అరుణ్ భీమవరపుసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్విడుదల తేది: మే 25, 2024దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్)అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్‌కి చెబుతుండగా.. అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్‌ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే.. బేస్మెంట్ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్‌గా తీర్చిదిద్దినా..ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్ బ్యాక్ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్‌స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్టైన్మెంట్ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్‌స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించొచ్చు. ఎవరెలా చేశారంటే.. అశీష్ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. సీన్‌కి తగ్గట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్‌గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్ లెన్త్ రోల్ తనది. సంయుక్త మీనన్ ఒకే ఒక్క షాట్లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టైటిల్: C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) నటీనటులు: అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా నిర్మాణ సంస్థ: SSCM ప్రొడక్షన్స్దర్శకుడు: కృష్ణ అన్నంసంగీతం: ఆర్ఆర్ ధృవన్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటర్: సత్య గిడుతూర్విడుదల తేది: మే 24, 2024ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక చాలా కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన తాజా చిత్రం ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ నేడు (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సిద్ధు(విశ్వంత్)కి దెయ్యాలు అంటే చాలా భయం. ఓ సారి అమ్మానాన్నలు ఊరికి వెళ్లడంతో ఒంటరిగానే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఒంటరిగా డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి సిద్ధు మరింత బయపడిపోతాడు. సినిమాలోని దెయ్యం బయటకు వచ్చి తనను చంపేస్తుందని బయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలోనే అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ భయాన్ని పుట్టిస్తుంది. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ కిడ్నాపులు చేస్తుంటుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా..ఆమె దొరకదు. అలా తప్పించుకుంటూ చిరవకు విశ్వంత్ కోసం వచ్చి, అతని ఇంట్లోనే ఉంటుంది. విశ్వంత్‌కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? చివరకు పోలీసులు ఏం చేశారు? అన్నది కథ.ఎలా ఉందంటే.. హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమానే ఈ C.D. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఈ కథంతా ఒకే చోట జరుగుతుంది. దీంతో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి కానీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను భయపెట్టడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి కానీ అవి ఎందుకు పెట్టారనేది చివర్లో తెలుస్తుంది. ఇంటర్వెల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఇక ద్వితియార్థంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. ఆదా వర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. రక్ష పాత్రలో ఆమె ఒదిగిపోయింది. చూపుల్తోనే అందరిని భయపెట్టేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతిక విషయాలకొస్తే..ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్ఆర్ ధృవన్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘డర్టీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: డర్టీ ఫెల్లోనటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులునిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: జి.యస్. బాబుదర్శకత్వం: ఆడారి మూర్తి సాయిసంగీతం: డాక్టర్. సతీష్ కుమార్.పి.సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్. ఎడిటర్ : జేపీవిడుదల తేది: మే 24, 2024ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మాఫియా డాన్ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్మెంట్స్ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్ నారాయణ కుట్ర చేస్తాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు? మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాఫీయా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా యాడ్ చేయడంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అయితే ప్లాష్‌బ్యాక్ సీన్లు మాత్రం కాస్త గందరగోళానికి గురి చేస్తాయి. కథ ప్రస్తుతం జరుగుతుందా లేదా ప్లాష్ బ్యాక్ చెబుతున్నారా అనేది కొన్ని చోట్ల అర్థం కాదు. అలాగే కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్ సాంగ్... హీరోయిన్లతో రొమాన్స్ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. అయితే అతను మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనేది చూపించకుండా.. డైరెక్ట్‌గా డాన్‌గానే చూపించడంతో ఆ పాత్రకు అనవసరపు ఎలివేషన్స్ ఇచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్ మూవీ. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సిద్దు, డర్టీ ఫెల్లో పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదరగొట్టేశాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్ మెప్పించాడు. ఇక నాగి నీడు చాలా రోజుల తరువాత అందరినీ లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ మూడు పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందరూ తమ పరిధి మేరకు నటించారు.సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. డాక్టర్. సతీష్ కుమార్.పి సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్‌తో పాటు మరో పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా ఎక్కువగా ఔట్‌డోర్స్‌లోనే షూట్ చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
టైటిల్: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్ఎడిటర్ : అఖిల్ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్ సినిమా మాదిరి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్ విజయ్) ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్టైనింగ్ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎంటర్టైన్ కావడానికి వీకెండ్లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్ విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మిరల్’ మూవీ రివ్యూ
టైటిల్: మిరల్నటీనటులు: భరత్, వాణి భోజన్, కే.ఎస్ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులునిర్మాణ సంస్థ: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీనిర్మాత: సీహెచ్ సతీష్ దర్శకుడు: ఎం శక్తివేల్సంగీతం: ప్రసాద్ ఎస్ఎన్సినిమాటోగ్రఫీ:సురేష్ బాలాఎడిటర్: కలైవానన్ ఆర్ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో భరత్. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తమిళ్లో 2022లోనే విడుదలై మంచి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత అదేపేరుతో తెలుగులో విడుదల చేశారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఇటీవల విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(మే 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సివిల్ ఇంజనీరింగ్ హరి(భరత్), రమ(వాణి భోజన్)లది ప్రేమ వివాహం. ఓ అపరిచితుడు ముసుగు వేసుకొని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమకు కల వస్తుంది. అదే నిజం అవుతుందని రమ భయపడుతుంది. ఇదే సమయంలో హరి ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటాడు. జాతకంలో దోషం ఉందని రమ తల్లి చెప్పడంతో తమ స్వస్థలంలో ఉన్న కులదైవానికి పూజలు చేయాలని ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. స్నేహితుడు ఆనంద్ ఫ్యామిలీని కూడా అక్కడకు రప్పిస్తాడు హరి. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్యమైన పని కోసం అర్థరాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా నిజంగానే ముసుగు వేసుకున్న వ్యక్తి హరి ఫ్యామిలీపై దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడు? రమ కలలోకి ముసుగు వేసుకుంటున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హరి ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?హారర్, సస్పెన్స్ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. అయితే కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ భయపెట్టే విధంగా ఉంటేనే.. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు ఎం శక్తివేల్ కూడా ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మిరల్ కథను రాసుకున్నాడు. అయితే రాసుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. సస్పెన్స్ పేరుతో అసలు కథను దాచి.. అనవసరపు సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగదీశాడు. కేవలం భయపెట్టడానికే కొన్ని సీన్లను రాసుకున్నాడు కానీ.. అసలు కథని ఆ సీన్లకి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే సెకండాఫ్‌లో అసలు మ్యాటర్ రివీల్ అయిన తర్వాత కథపై ఆసక్తిపెరుగుతంది. ప్రారంభం నుంచి ప్రీక్లైమాక్స్ వరకు సినిమాపై ఉన్న ఓ అభిప్రాయం.. ఆ తర్వాత మారిపోతుంది. ప్రేక్షకుడు ఊహకందని విధంగా చివరి 20 నిమిషాల కథనం సాగుతుంది. అయితే ఈ సస్పెన్స్, థ్రిల్లర్‌కి హారర్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం.. దానికి గల కారణం కూడా అంత కన్విన్సింగ్ అనిపించదు. చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యారు. కొన్ని సీన్లకు సరైన ముగింపే ఉండదు. ఇక ఈ సినిమాకు మరో ప్రధానమైన లోపం డబ్బింగ్. కొన్ని సన్నివేశాల్లో అక్కడ జరుగుతున్న దానికి.. చెప్పే డైలాగ్స్‌కి సంబంధమే ఉండడు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. కొన్ని చోట్ల సన్నివేశాలకు సంబంధం లేకుండా బీజీఎం ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హరి పాత్రలో భరత్ జీవించేశాడు. మంచి భర్తగా, బాధ్యతాయుత కుటుంబ పెద్దగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమగా వాణి భోజన్ చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా నటించిన కేఎస్ రవికుమార్.. తనకున్న నటనానుభవంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
The Marvels Movie Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్‌లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్‌గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మార్వెల్‌కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ. ఎలా ఉందంటేమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్‌తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్ను పవర్ ఫుల్ విలన్‌గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు. ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్‌గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. -
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథంతా సీరియస్ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి. -
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ
టైటిల్: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్ గణేష్(అల్లరి నరేశ్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకఓ యాక్షన్ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్ హీరో రేంజ్లో బిల్డప్ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘శబరి’ మూవీ రివ్యూ
టైటిల్: శబరినటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బేబీ నివేక్ష తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్రచన-దర్శకత్వం: అనిల్ కాట్జ్సంగీతం: గోపి సుందర్సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిఎడిటర్: ధర్మేంద్ర కాకరాల కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్‌లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది. అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్‌కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్‌తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. శబరిలోనూ ఆ రెండు ఉన్నాయి. కానీ డైరెక్టర్ కథను డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టు అల్లుకున్న కథ.. రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా అకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి చేసే పొరాటం ఆకట్టుకుంటుంది.సిటీలో ఓ మెంటల్ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని వచ్చి ఇద్దరిని చంపి, సంజన కోసం వెతికె సీన్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత కథను రెండేళ్ల ముందుకు తీసుకెళ్లాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్‌తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటెల్డ్‌గా చూపించడంతో కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ సూర్య గురించి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ కాస్త థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. లాజిక్స్‌పై దృష్టిపెట్టి స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్‌గా గణేష్ వెంకట్రామన్ చక్కగా నటించాడు. లాయర్‌గా శశాంక్, పోలీసు అధికారి శంకర్‌గా మధుసూధన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. కానీ అవి గుర్తించుకునేలా ఉండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. OTT లొ చూడదగిన చిత్రంసన్ నెక్స్ట్ ఓటీటీలో శబరి సినిమా ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి అనుచిత సన్నివేశాలు లేకపోవడం, మరియు ప్రధానంగా తల్లి ప్రేమ, పోరాటం వంటి భావోద్వేగాలు ఉండడం, దీన్ని ఫ్యామిలీతో కలసి చూసేందుకు అనుకూలంగా చేస్తుంది. సస్పెన్స్-థ్రిల్లర్ అయినప్పటికీ, ఈ చిత్రం పరోక్షంగా కుటుంబ విలువలను కూడా ప్రతిబింబిస్తుంది, అందువల్ల కుటుంబం మొత్తం ఓటీటీలో ఈ సినిమాను కలిసి చూడొచ్చు అంతే కాకుండా వరలక్ష్మి నటన అందరిని ఆకట్టుకుంటుంది.దసరా పండుగకు ఇంటిల్లిపాది కలసి చూసే సినిమాల లిస్ట్ లో శబరి ముందు ఉంటుంది. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్‌కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్‌గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్‌గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వంనటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటిసంగీతం: రీఎడిటర్: శశాంక్ వుప్పుటూరివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘పారిజాత పర్వం’ కథేంటంటే?చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్‌లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్‌గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్‌లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్‌కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్‌గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్: తెప్పసముద్రంనటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలునిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్సంగీతం: : పి.ఆర్ సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లిఎడిటర్: సాయిబాబు తలారివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘తెప్పసముద్రం’ కథేంటంటే..తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్‌గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్‌కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్‌ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది.చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్‌గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది. రొటీన్ లవ్‌స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్‌గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్‌ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్‌కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్‌గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్‌గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్‌తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్‌గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్‌గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ
టైటిల్: మెర్సీ కిల్లింగ్ నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు. నిర్మాణ సంస్థ: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల దర్శకత్వం: వెంకటరమణ ఎస్ సినిమాటోగ్రఫీ: అమర్.జి సంగీతం: ఎం.ఎల్.రాజ ఎడిటర్: కపిల్ బల్ల విడుదల తేది: ఏప్రిల్ 12, 2024 కథేంటంటే.. స్వేచ్ఛ (హారిక) ఓ అనాథ అమ్మాయి. తన తల్లిదండ్రులు ఎవరనేది తెలియక.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక.. తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె మహేశ్(పార్వతీశం) భారతి (ఐశ్వర్య)లను కలుసుకుంటుంది. వాళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం అదించారు? పెరెంట్స్ కోసం వెతుకున్న స్వేచ్ఛకు రామకృష్ణమ్ రాజు(సాయి కుమార్) ఎలా పరిచయం అయ్యాడు? ఆయన నేపథ్యం ఏంటి? రామకృష్ణమ్ రాజు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు స్వేచ్ఛ తన పేరెంట్స్‌ని కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హారిక ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో ఒడిగిపోయింది. అలాగే ఐశ్వర్య కొన్ని ఎపిసోడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కుమార్ కు ఈ సినిమా మరో ప్రస్థానం అని చెప్పవచ్చు. తన పాత్రలో అద్భుతంగా నటించాడు. బసవరాజు పాత్రలో రామరాజు బాగా నటించాడు, అలాగే జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఎలా ఉందంటే.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు వెంకటరమణ ఎస్. ఇలాంటి సబ్జెక్ట్స్‌ని డీల్ చేయడం కొందరికే సాధ్యం. ఆ విషయంలో దర్శకుడు వెంకటరమరణ కొంతమేర సఫలం అయ్యాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్ కొంతమేర సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం వేగంగా సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. జి.అమర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, సాంగ్స్, కాకినాడ లోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్ ను తెరమీద అద్భుతంగా సహజంగా చూపించారు. ఎం.ఎల్.రాజా సంగీతం బాగుంది. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా మెర్సీ కిల్లింగ్ సినిమాను నిర్మించారు. -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్‌తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్‌నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్‌గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ
టైటిల్: మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రచన, దర్శకత్వం: చిదంబరం సంగీతం: సుశీన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్ విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమ్మల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కథేంటంటే.. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్‌కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్‌కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్‌కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్‌ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్‌కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్ బాయ్స్‌ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే.. మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్‌ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కొడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథంతా సింపుల్‌గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్‌లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్‌కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించిన తర్వాత సుభాష్‌పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్ అవుతుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్‌గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Family Star Review: ‘ ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ
టైటిల్: ఫ్యామిలీ స్టార్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్ నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్ ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: ఏప్రిల్ 5, 2024 కథేంటంటే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫ్యామిలీ అంటే అతనికి చాలా ఇష్టం. ఇద్దరు అన్నయ్యలు..వదినలు..వారి పిల్లలు..బామ్మ ఇదే తన ప్రపంచం. సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెద్దన్నయ్య మద్యానికి బానిసవడం.. చిన్నన్నయ్య బిజినెస్ అంటూ ఇంకా స్థిరపడకపోవడంతో ఫ్యామిలీ ఆర్థిక భారానంత గోవర్ధనే మోస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా.. వచ్చిన జీతంతోనే సింపుల్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్న గోవర్ధన్ లైఫ్‌లోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వచ్చేస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో కూడా పడిపోతారు. ఈ విషయం ఇరుకుటుంబాలలో చెప్పి, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తున్న సమయంలో ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి వస్తుంది. ఆ పుస్తకం చదివి..ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు గోవర్ధన్. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది? ఇందు ఎవరు? గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇందు రాసిన పుస్తకం వీరిద్దరి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? ఉన్నంతలో సర్దుకొని జీవించే గోవర్దన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఇందు, గోవర్దన్‌లు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్‌గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది. అలాంటి కాంబినేషన్లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్ చేసే పరశురామ్.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్ సరిపోలేదనిపిస్తుంది. కథ పరంగా ఈ సినిమా చాలా చిన్నది. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడు.. తన సొంతప్రయోజనాల కోసం అతనికి దగ్గరైన ఓ యువతి.. ఇద్దరి మధ్య ప్రేమ.. గొడవలు.. చివరికి కలుసుకోవడం.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథ ఇదే. అంచనాలు లేకుండా వస్తే..ఈ కథకి అందరు కనెక్ట్ అవుతారు. కానీ ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి.. ప్రేక్షకులు అంతకు మించి ఏదో ఆశిస్తారు. దాన్ని దర్శకుడు అందించలేకపోయాడు. భారీ అంచనాలు ఉన్న సినిమాకు కావాల్సిన సరకు, సంఘర్షణ రెండూ ఇందులో మిస్ అయ్యాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ లుంగి కట్టుకొని తిరగడం.. ఉల్లి పాయల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడడం.. హీరోయిన్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించమని అడగడం.. చెంపదెబ్బలు తినడం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. ‘అతనికి కాస్త తిక్కుంటుంది.. పిచ్చి ఉంటుంది.. వెర్రి ఉంటుంది’ అంటూ హీరో గురించి హీరోయిన్ చేత చెప్పిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మిడిక్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో హీరో ఎంట్రీ సీన్‌తోనే చూపించాడు. ప్యామిలీ కోసం హీరో పడే పాట్లు.. అన్నయ్యలతో వచ్చే కష్టాలు చూపిస్తూనే ఇందు పాత్రను పరిచయం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత కూడా కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తినికి పెంచుతుంది. ద్వితియార్థం ఎక్కువగా అమెరికాలోనే సాగుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. మిడిల్ క్లాస్ యువకుడి మీద హీరోయిన్ థీసిస్ ఎందుకు రాసిందనేదానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ప్రీక్లైమాక్స్ బాగుంటుంది. పతాక సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. కథ, కథనాన్ని మరింత బలంగా రాసుకొని, హాస్యంపై ఫోకస్ పెడితే ‘ఫ్యామిలీ స్టార్’ మరో లెవెల్ విజయం సాధించేది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలీవరీ, మ్యానరిజం సినిమాకు ప్లస్ అయింది. కథంతా తన భుజాన వేసుకొసి సినిమాను ముందుకు నడిపించాడు. తెరపై చాలా అందంగా కనిపించాడు. ఇక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి ఇందుగా మృణాల్ చక్కగా నటించింది. తెరపై విజయ్, మృణాల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో బామ్మగా రోహిణి హట్టంగడి తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్, వాసుకి, అభినయతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. అద్భుతమైన పాటలతో మంచి బీజీఎం అందించాడు. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Tillu Square: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ
టైటిల్: టిల్లు స్వ్కేర్ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం:మల్లిక్ రామ్ నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 29, 2024 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌తో పాటు యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టిల్లు స్వ్కేర్ కథేంటంటే.. రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్‌తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్‌తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'డీజే టిల్లు' సక్సెస్‌కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్‌ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్‌తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్ప్రైజింగ్గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది. 'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్‌ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్‌డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Aadujeevitham Review: ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్ లైఫ్ నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు నిర్మాణం:జువల్ రొమాన్స్ దర్శకత్వం: బ్లెస్సీ సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది: మార్చి 28, 2024 నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఊర్లో ఇసుక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్లాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి రూ. 30 వేలు అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్లాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తాడు. సౌదీకి వెళ్లిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరి బలవంతంగా తీసుకెళ్లి వేరు వేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్‌ని ఏడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ నజీబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఏడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్‌కి అందించిన సహాయం ఏంటి? చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వెళ్లాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అక్కడి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చని, దాంతో తమ కష్టాలన్నీ తీరుపోతాయనే ఆశతో అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అలాంటివారిలో చాలా మంది ఏజెంట్ చేతిలో మోసపోయేవారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి.. అక్కడికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ అయ్యేవారు కాదు. మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చే స్థోమత లేక చాలా మంది అక్కడ యాచకులుగా.. గొర్రెలు, ఒంటెల కాపరిగా పని చేసేవారు. కొంతమంది అయితే అక్కడే చనిపోయేవారు కూడా. అలా ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కథే ‘ది గోట్ లైఫ్’. చదువు, అవగాహన లేకుండా, ఏజెంట్ చేతిలో మోసపోయి.. దొంగ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి జీవితాలు ఎలా ఉంటాయి? అక్కడ వారు పడే కష్టాలు ఏంటి? అనేవి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు బ్లెస్పీ. ఇది వాస్తవంగా జరిగిన కథే. 90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలా కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిక్ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగానే దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. ‘అయ్యో.. ఇంకెంత సేపు ఈ వేదన’ అనే ఫీలింగ్ కలుగులుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయితే మాత్రం సీటులో నుంచి కదలరు. హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే.. వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేది చూపించారు. ఈ రెండింటిని పోల్చకనే పోలుస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి.. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగే అయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన ముఖం తాను చూసుకొని హీరో పడే బాధను చూస్తుంటే మన గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్‌లో చాలానే ఉన్నాయి. ద్వితియార్థంలో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాల నేపథ్యంలో సెకండాఫ్ సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికి నచ్చకపోవచు. నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్‌తో కనెక్ట్ అయి చూసేవాళ్లకి మాత్రం ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా తెర పై కనిపించింది. నటనపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ‘ది గోట్ లైఫ్’ కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మిజీన్ లూయీస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా కు ప్లస్ అయింది. తనదైన బిజియం తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ. ఆస్వాదించేవారికి ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్‌లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్‌ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్‌ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్‌స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్‌కి థియేటర్స్‌లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్‌కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్‌కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్‌గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్‌గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్‌గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'వ్యూహం' సినిమా రివ్యూ
టైటిల్: వ్యూహం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్(అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్ కల్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి. మళ్లీ 2019 నాటికి పవన్‌తో మళ్లీ బాబు టచ్‌లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్ (లోకేష్) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం. ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్ఫెక్ట్గా అజ్మల్ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్‌లలో జగన్ గారికి దగ్గరగా కనిపిస్తాడు. ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్ జగన్ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్ జగన్ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్‌ను నింపడం ఖాయం. -
‘చారి 111’ మూవీ రివ్యూ
టైటిల్ : చారి 111 నటీనటులు: వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, సత్య తదితరులు నిర్మాత: అదితి సోనీ దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్ సంగీతం: సైమన్ కె కింగ్ విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చారి 111లో వెన్నెల కిశోర్ హీరో అనగానే..అందరి దృష్టి సినిమాపై పడింది.టీజర్, ట్రైలర్ చూడగానే ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమైపోయింది. సినిమా మొత్తం కామెడీగానే సాగుతుంది. సీరియస్ అంశానికి కామెడీ జోడించి.. హిలేరియస్‌గా సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఎంత కామెడీ సినిమా అయినా... కొంచెం అయినా లాజిక్ ఉండాలి. అది చారి 111లో మిస్ అయింది. సీక్రెట్ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది? పై అధికారులు ఎలా వ్యవహరిస్తారు. ఓ సీఎంతో అధికారి ఎలా మాట్లాడుతాడు? రియాల్టీకి పూర్తి విరుద్ధంగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ అంతా సోసోగా సాగినప్పటికీ..కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ చేసే యాక్షన్ సీన్ ఫస్టాఫ్కి హైలెట్. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే సాగుతుంది. మహి, రావణ్‌లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ చేసే కామెడి మరింత బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. చారి 111 ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. చారి పాత్రకి వెన్నెల కిశోర్ తగిన న్యాయం చేశాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఎలాంటి కామెడీ ఆశిస్తారో అది ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథన్ ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. తెరపై చాలా గ్లామరస్‌గా కనిపించింది. మేజర్ ప్రసాద్ రావు గా మురళీ శర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య, తాగుబోతు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ
టైటిల్: భూతద్ధం భాస్కర్ నారాయణ నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై దర్శకత్వం : పురుషోత్తం రాజ్ సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్ విడుదల తేది: మార్చి 1, 2024 డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. అయితే తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా? భూతద్ధం భాస్కర్ నారాయణ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా? కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిటెక్టివ్ థ్రిల్లర్స్‌కి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ గేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరో చైల్డ్ ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాఫ్ అంతా ఫన్ ఎలిమెంట్స్, లవ్ ఎమోషన్స్‌తో సాగుతుంది. సీరియల్ కిల్లర్ తెరపై వచ్చినప్పటి నుంచి సినిమా అంతా సీరియస్ మూడ్‌లోకి వెళ్తుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను మరింత ఆకట్టకుంటాయి. దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు.దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఫస్టాప్‌లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉండడం.. ద్వితియార్థంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించడం కాస్త మైనస్. ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సస్పెన్స్‌ని మాత్రం క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంతో దర్శకుడు సఫలం అయ్యాడు.థ్రిల్లర్స్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు భూతద్ధం భాస్కర్ నారాయణ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు. ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా ఉంది. శివ నటనగా కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. రిపోర్టర్ లక్ష్మీ గా రాశీ సింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా పరంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. కెమరాపనితనం రిచ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ వాలెంటైన్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ దాడిలో 40 మందికిపైగా భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది. ఈ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కించాడు. ఇందులో దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పని చేస్తుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికి సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ వారితో పాటు నావిక, వైమానిక దళం కూడా దేశ రక్షణ కోసం పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నావిక, వైమానిక దళాలపై సినిమాలు కూడా పెద్దగా రాలేదు. కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం గొప్పదనం ప్రపంచానికి మొత్తం తెలిసింది. గనతలంలో వాళ్లు చేసే పోరాటల గురించి అంతా చర్చించుకున్నారు. బాలీవుడ్లో ఆ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే ‘ఫైటర్’ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చి..బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆపరేషన్ వాలెంటైన్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. అయితే ఇలాంటి నేపథ్యంతో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’ అనే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్(రూ.42 కోట్లు అని సమాచారం) ఇంత రిచ్‌గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. అయితే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆపరేషన్ వాలెంటైన్లో అది మిస్ అయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్‌గా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగుండేదేమో. అలా అని ఎమోషన్ పూర్తిగా పండలేదని చెప్పలేం. దాడిలో ఓ సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ తరహా ఎమోషనల్ సీన్స్ కొచ్చి చోట్ల ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది. దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్స్, సాహసాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చాలా సహజంగా వాటిని తెరపై చూపించాడు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడు.ప్రాజెక్ట్ వజ్రతో కథను ప్రారంభించాడు. ఆ ఒక్క సీన్‌తోనే హీరో పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు. ఫస్టాప్ అంతా పైలెట్ల టెస్ట్, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టునే తిరుగుతుంది. అయితే ప్రేమ కథలో గాఢత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. పాకిస్తాన్‌పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రుని తిప్పికొట్టేందుకు హీరో చేసే సాహసం.. చివరల్లో ఆపరేషన్ వజ్రని ప్రయోగించడం ప్రతీది.. ఆకట్టుకుంటుంది. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్ కమాండర్‌గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వెజ్, మాటలు ప్రతీది నిజమైన సైనికుడినే గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీసర్ అహనా గిల్‌గా మానుషిచిల్లర్ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రను మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కబీర్‌గా నవదీప్ ఒకటి రెండు సన్నివేశాల్లోనే కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. మిర్ సర్వర్, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందేమాతరం సాంగ్ ఆకట్టుకుంటుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా చిత్రీకరించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ
టైటిల్: భ్రమయుగం నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్,సిద్ధార్థ్ భరతన్ నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ తెలుగు విడుదల:సితార ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం: రాహుల్ సదాశివన్ సంగీతం: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రఫీ: షఫీక్ మహమ్మాద్ అలీ విడుదల తేది: 23 ఫిబ్రవరి 2024(తెలుగు) ‘భ్రమయుగం’ కథేంటంటే.. తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో భ్రమయుగం చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రయోగాలు చేయడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్ అనే ఇమేజ్‌ని పక్కకి పెట్టి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం కూడా మరో ప్రయోగాత్మక చిత్రమే. ఒక్క చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల పాటు కథను నడిపించడం మాములు విషయం కాదు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం కేవలం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్‌ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించి మెప్పించాడు. మమ్ముట్టి నటన.. క్రిస్టో జేవియర్ బీజీఎం సినిమా స్థాయిని పెంచేసింది. కథగా చూస్తే భ్రమయుగంలో కొత్తగా ఏమి ఉండడు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు..అతని చేతిలో బంధి అయినా ఓ ఇద్దరి వ్యక్తుల కథే ఇది. పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని మలిచిన తీరు అద్బుతంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించాడు. సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఉన్నా అంతగా భయపెట్టవు. థ్రిల్లర్ ఎమిమెంట్స్తోనే కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కథ స్లోగా సాగుతుంది. పాడుబడ్డ భవన్‌లోకి తేవన్ వచ్చిన తర్వాత అక్కడే చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఉత్కంఠకు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినా.. కొన్ని సీన్స్ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కురియన్ పొట్టి ఫ్లాష్ బ్యాక్.. చేతన్ స్టోరీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగినా.. భ్రమయుగం ఓ ఢిపరెంట్ థ్రిల్లర్ మూవీ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి నటననే. కుడుమన్ పొట్టి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై కొత్త మమ్ముట్టిని చూస్తారు. సినిమా మొత్త ఒకే డ్రెస్‌లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్‌లో ఆయన నటన అందరిని కట్టిపడేస్తుంది. దేవన్ పాత్రకు అర్జున్ అశోకన్ పూర్తి న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో అయితే మమ్ముట్టిలో పోటీపడి నటించాడు. వంట మనిషిగా సిద్ధార్థ్ భరత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తిరేకించినా.. ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో తెరపై సరిగా చూపించలేకపోయారు. టెక్నికల్ పరంగా సినిమా అదరిపోయింది. క్రిస్టో జేవియర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. షఫీక్ మహమ్మాద్ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో సాగినా.. తెరపై ప్రతి సీన్ చాలా అందంగా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
True Lover Movie Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ
టైటిల్: ట్రూ లవర్ నటీనటులు: మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి, కన్నా రవి, హరీశ్ కుమార్, నిఖిల శంకర్ తదితరులు రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్ నిర్మాతలు: హరీష్, యువరాజ్ తెలుగు విడుదల: మారుతి, ఎస్కేఎన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్: భరత్ విక్రమన్ విడుదల తేది: ఫిబ్రవరి 10, 2024 కథేంటంటే.. అరుణ్(మణికందన్), దివ్య(గౌరీ ప్రియ) ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాలీగా తిరుగుతూ.. కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తోటి ఉద్యోగులతో క్లోజ్ ఉండడంతో దివ్య ప్రేమ విషయంలో అరుణ్‌కి అభద్రతా భావం కలుగుతుంది. ప్రేమని వదిలి ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. దివ్య తన ఆఫీస్‌లో పని చేసే అబ్బాయిలతో మాట్లాడినా.. ఎక్కడికైనా వెళ్లినా సహించడు. ఆమెతో గొడవపడడం..మళ్లీ సారి చెప్పడం అరుణ్‌కి సర్వసాధారణం అయిపోతుంది. అరుణ్ ప్రవర్తన కారణంగా దివ్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అరుణ్ పొసెసివ్‌నెస్ దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చివరకు వీళ్లిద్దరు కలిశారా? విడిపోయారా? కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటే.. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒక్కసారి ఒకరిపై అనుమానం మొదలైతే..వాళ్లు ఏం చేసినా అది తప్పులాగే అనిపిస్తుంది. ఇక ఇద్దరి ప్రేమికుల మధ్య ఆవగింజంత అనుమానం ఉన్నా..అది ఆకాశమంత శోకాన్ని మిగులుస్తుంది. అనుమానం, అభద్రతా భావం పెట్టే మానసిక క్షోభ వర్ణణాతీతం. ట్రూ లవర్ కూడా ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనయింది? అనేది ఈ సినిమా కథ. నేటితరం ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. రొమాన్స్, ఎమోషన్..ఫన్ అన్ని రకాల సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేటితరం ప్రేమికుల ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా కథను తీర్చిదిద్దారు. కేవలం ప్రేమ కథనే కాకుండా.. అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. అక్కడ ఎమోషన్ పండించేందుకు అవకాశం దక్కింది. అరుణ్, దివ్యల మధ్య ప్రేమ సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు. దివ్య తోటి ఉద్యోగులతో మాట్లాడిన ప్రతిసారి అరుణ్ అనుమానం వ్యక్తం చేయడం..ఇద్దరి మధ్య గొడవలు.. మళ్లీ కలిసిపోవడం.. ఫస్టాఫ్ చాలా వరకు ఇలానే సాగుతుంది. అనుమానం కారణంగా దివ్య నిజాన్ని దాచేయడం.. ఆ విషయం అరుణ్‌కి తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్‌లో చాలావరకు రిపీట్ సన్నివేశాల్లో ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు అతన్ని భరిస్తుందనే విషయాన్ని బలంగా చూపించలేకపోయాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ మాత్రం ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ద్విదియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కూడా హీరో హీరోయిన్ల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అరుణ్ అమ్మ నాన్న రిలేషన్లో వచ్చిన సమస్యకి ఈ ప్రేమ కథతో ముడిపెట్టి చెప్పడం బాగుంది. అరుణ్‌కి తన తల్లికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోని ఎక్కువగా సిగరేట్ తాగుతూ..లేదా మద్యం సేవిస్తూ చూపించడం ఓ వర్గం ఆడియెన్స్‌కి ఇబ్బంది కలిగించొచ్చు. యూత్‌ని ఆకట్టుకోవడానికే హీరోని అలా చూపించారే తప్ప ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రూలవర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి, బ్రేకప్ అయినవారికి నచ్చే అవకాశం ఉంది. . ఎవరెలా చేశారంటే.. అరుణ్ పాత్రలో మణికందన్ ఒదిగిపోయాడు. అనుమానపు ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దివ్య పాత్రకి గౌరీ ప్రియ వంద శాతం న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై మణికందన్, గౌరీ ప్రియల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. స్నేహితుల పాత్రలు పోషించినవారంతా చక్కగా నటించారు. సాంకెతిక పరంగా సినిమా బాగుంది. సీన్ రోల్డన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలతో పాటు బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ
టైటిల్:యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ నిర్మాత: శివ మేక రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ:మది విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. యాత్ర 2 ఈవెంట్ బేస్డ్ బయోపిక్. వైఎస్సార్ మరణం అనంతరం, ఆయన తనయుడు, వైఎస్. జగన్మోహన్రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. వైఎస్సార్ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్ జగన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల కథ కాదు..వారి వ్యక్తిత్వానికి సంబంధించిన స్టోరీ. వైఎస్సార్ రాజకీయం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? అనేది ‘యాత్ర’లో చూపించిన మహి వి రాఘవ్.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పడిన కష్టాలేంటి? అదిష్టానం వద్దని చెప్పినా..తనను నమ్ముకున్న ప్రజల కోసం అండగా ఉండేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర.. వైఎస్సార్సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణం.. ప్రత్యర్థులంతా ఒక్కటైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లో చూపించాడు. వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించాడు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు మహి. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు. 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో ‘యాత్ర 2’కథ ప్రారంభం అవుతుంది. రెండోసారి వైఎస్సార్ సీఎం అవ్వడం.. రచ్చబండ కోసం వెళ్తూ మరణించండం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రజల కోసం జగన్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్ అంతా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరిని ఆకట్టుకుంటాయి. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా..జగన్ ధైర్యంతో పార్టీని నడిపించడం.. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేశ్‌ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగు.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. వైఎస్ జగన్ ఎలాంటి వాడో డైలాగ్స్లతోనే తెలియజేశాడు మహి వి.రాఘవ్. ‘జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో జగన్ వ్యక్తితం ఎలాంటిదో తెలియజేశాడు. ‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’ అనే మాటల్లో జగన్ విశ్వసనీయత ఎంతటిదో అర్థమవుతుంది. 'నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. జగన్‌పై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది తెలియజేస్తుంది. ‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది. 'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని'అంటూ అసెంబ్లీ వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ ధైర్యం ఎలాంటిదో అర్థమతుంది. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే మాటలు.. జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది. ‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే...పులిని బోనులో పెట్టినా అది పులే’అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్‌కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించేశాడు. ఇక వైఎస్ జగన్‌గా జీవా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ హుందాతనం, రాజకీయం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెరపై అద్భుతంగా పండించాడు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు.చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ‘ఓ రాజకీయ నాయుకుడి జీవితంలో డ్రామా ఉండవచ్చు.. యాక్షన్కూ అవకాశముంది.. బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందన్న వాళ్లను చూస్తే కామిడీకి స్కోపు ఉందని అనుకోవచ్చు. కానీ.. ఎమోషన్ కూడా ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది అనడమే కాకుండా... ఆ భావోద్వేగాలను అందంగా తెరపైకి ఎక్కించి మరీ చూపించాడు మహి వి.రాఘవ్. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Dheera Review: ‘ధీర’ మూవీ రివ్యూ
టైటిల్: ధీర నటీనటులు: లక్ష్ చదలవాడ, నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర నిర్మాత: పద్మావతి చదలవాడ రచన, దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్ సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ ఎడిటర్: వినయ్ రామస్వామి విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన రణ్‌ధీర్(లక్ష్ చదలవాడ)కు డబ్బు పిచ్చి ఎక్కువ. ఏ పని ఫ్రీగా చేయడు. మనీ కోసం ఎంతటి సాహసం అయినా చేస్తాడు. అలాంటి వ్యక్తికి ఓ రోజు ప్రముఖ ఆస్పత్రి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రాజ్‌గురు అనే పేషెంట్‌ని అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకెళ్తే.. పాతిక లక్షలు ఇస్తామని చెబుతారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో రణ్‌ధీర్ వెంటనే ఓకే చెబుతాడు. ఆ పేషెంట్‌ని చూసుకోవడానికి డాక్టర్ అమృత(నేహా పఠాన్)వస్తుంది. తోడుగా మరో డాక్టర్ (మిర్చి కిరణ్) వెళ్తాడు. ఈ ముగ్గురితో కలిసి అంబులెన్స్‌లో హైదరబాద్కి బయలుదేరిన రణ్ధీర్పై ఓ ముఠా దాడికి ప్రయత్నిస్తుంది. రాజ్‌గురును ఎలాగైనా హైదరాబాద్‌కు తరలించకుండా చూడడమే ఆ ముఠా టార్గెట్. మరోవైపు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవిలో ఉన్న హంసలేఖ దేవి(హిమజ).. ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ నమ్మకస్తుడైన పోలీసు అధికారి(భరణి శంకర్)ని పంపిస్తుంది. అసలు రాజ్ గురు ఎవరు? ఓ ముఠా ఎందుకు అతనిపై దాడికి ప్రయత్నిస్తుంది? వారిని రణ్‌ధీర్ ఎలా ఎదుర్కొన్నాడు? రాజ్‌గురును హైదరాబాద్ తరలించారా లేదా? హంసలేఖ ఎవరు? ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలని ఎందుకు ఆదేశించింది? ఆ పాపకు రాజ్‌గురుకు ఉన్న సంబంధం ఏంటి? రాజ్‌గురుకు ముఖ్యమంత్రి(సుమన్)తో ఉన్న సంబంధం ఏంటి? అసలు రాజ్‌గురు ఏ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు? పాప కోసం రణ్‌ధీర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అమృత, మనీషా(సోనియా బన్సాల్)లతో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ధీర’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు.. రెండు డిఫరెంట్ లవ్‌స్టోరీలు, భారీ యాక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నాయి. అయితే దర్శకుడు పేపర్‌పై బలంగా రాసుకున్న స్టోరీని అంతే బలంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. రాజ్‌గురు స్టోరీ ఏంటనేది మాత్రం చివరి వరకు ప్రేక్షకుడు పసిగట్టకుండా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్గురుని హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. మరోవైపు హంసలేఖ ఫోన్ ద్వారా వైద్యులకు సూచనలు ఇవ్వడం..ఇలా చాలా ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. లక్ష్ ఎంట్రీ స్టార్ హీరో రేంజ్లో ఉంటుంది. కారు రేసింగ్ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేశాడు. మీనాక్షితో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హీరో లవ్స్టోరీలోని ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్.. రొమాంటిక్ సీన్స్.. ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఒక్కో ట్విస్టు రివీల్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని నడించాడు. పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్నదెవరు అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో లక్ష్య్. సినిమా సినిమాకి తన పాత్రలో వేరియష్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ధీరలో కూడా రణ్‌ధీర్ అనే మరో డిఫరెంట్ పాత్రను పోషించి మెప్పించాడు. యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టేశాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డాక్టర్ అమృతగా నేహా పఠాన్, మనీషాగా సోనియా బన్సాల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. మిర్చి కిరణ్ కామెడీ సినిమాకు ప్లస్ అయింది. భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్సాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Game On Movie Review Telugu: సైకలాజికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఆన్’ మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: గేమ్ ఆన్ నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నిర్మాత: రవి కస్తూరి దర్శకత్వం: దయానంద్ సంగీతం: అభిషేక్ ఏఆర్(బీజీఎం), నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్(పాటలు) సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ ఎడిటర్: వంశీ అట్లూరి విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు(గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అదే సంస్థలో పని చేసే మోక్ష(వాసంతి)తో ప్రేమలో ఉంటాడు. టార్గెట్ సరిగా పూర్తి చేయకపోవడంతో అతన్ని ఉద్యోగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి.. అతని ఫ్రెండ్ రాహుల్(కిరీటీ)తో వెళ్లిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో సిద్దు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకి ఫోన్ వస్తుంది. ‘నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్లో వేస్తాం’అని చెబుతాడు. సిద్ధు ఈగను చంపగానే..అకౌంట్లోకి రూ.లక్ష క్రెడిట్ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమించి ఇంటికెళ్తాడు. ఆ తర్వాతి మళ్లీ కాల్ చేసి..‘ఇదొక సైకలాజికల్ గేమ్ షో అని, చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు పంపిస్తామని చెబుతారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. అతని జీవితంలోకి తార(నేహా సోలంకి) వస్తుంది. ఇలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో గేమ్‌లో భాగంగా ఓ వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్‌ని పూర్తి చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధుకి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సైకాలజిస్ట్ మదన్ మోహన్(ఆదిత్య మీనన్)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు గతమేంటి? తాత సూర్య నారాయణ(సుభలేఖ సుధాకర్) ఎలా చనిపోయాడు? అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అర్చన(మధుబాల)కి సిద్ధుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు జీవితంలోకి తార ఎలా వచ్చింది? అసలు ఆమె నేపథ్యం ఏంటి? రియల్ టైమ్ గేమ్‌లోకి వెళ్లిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది ఈ సినిమా ఇత్తివృత్తం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది కాస్త ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దయానంద్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్‌ని చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంత వరకు మాత్రమే సఫలం అయ్యాడు. కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. కథనంలో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తంలో తొమ్మిది టాస్క్‌లు ఉంటాయి. వాటిని మరింత బలంగా చూపిస్తే బాగుంటుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా..తెరపై చూస్తే కొంచెం అయినా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. గేమ్ ఆన్‌లో అది మిస్ అయింది. అయితే కొన్ని చోట్ల మాత్ర ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అలాగే యూత్‌ని ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. ఓ క్రైమ్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ పదేళ్లు ముందుకు జరుగుతుంది.ఓ లూజర్‌గా హీరోని పరిచయం చేయించాడు దర్శకుడు. ఉద్యోగం పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో హీరో క్యారెక్టర్‌పై జాలీ కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక్కసారి ఆన్లైన్ గేమ్ ప్రారంభం అవ్వగానే.. ప్రేక్షకులకు కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈజీ టాస్కులకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో..ఏదో జరగబోతుందనేది ప్రేక్షకుడికి తెలిసినా.. అది ఏంటనే క్యూరియాసిటీ మాత్రం చివరి వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. ఫన్నీ టాస్క్‌లు.. రొమాంటిక్ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గేమ్‌లోని టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా..గేమ్ ఆన్ మాత్రం కాస్త డిఫరెంట్ మూవీ అనే చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ సిద్ధార్థ్ పాత్రలో గీతానంద్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. తారగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్‌గా కనిపించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.గీతానంద్, నేహ సొలంకిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల డిఫరెంట్ పాత్ర పోషించి మెప్పించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు ఎలాంటి సన్నివేశాలు ఉండవు. సైకాలజిస్ట్ మదన్ మోహన్‌గా ఆదిత్య మీనన్ అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించాడు. వాసంతి, కిరిటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా బాగుంది. అభిషేక్ ఏఆర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
Before Marriage Review: 'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ
చిత్రం: బిఫోర్ మ్యారేజ్ విడుదల: జనవరి 26 నటీనటులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ... గాయనీగాయకులు: మంగ్లీ, సంథిల్య పిసపాటి, అపర్ణ నందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికుమార్ గొల్లపల్లి, మ్యూజిక్: పీఆర్ డీవోపీ: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి ఎడిటింగ్: అలోష్యాస్ క్సవెర్ పబ్లిసిటీ డిజైనర్: జేకే ఫ్రేమ్స్ పీఆర్ఓ: ఆశోక్ దయ్యాల యువతను ఆకర్షించే కథ, దానికి తోడు ఓ మెసెజ్ ఇస్తే సినిమాను బ్రహ్మండంగా హిట్ చేస్తారు ప్రేక్షకులు. సరిగ్గా అలాంటి సబ్జెక్టుతో వచ్చిన మూవీ 'బీఫోర్ మ్యారేజ్'. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. కథేంటి ధరణి (నవీన రెడ్డి) తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ కోరుకునే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ధరణి పెగ్నెన్సీ అవుతుంది. పెళ్ళి కాకుండానే తల్లి అవుతుందటంతో ఆమె జీవితం తలక్రిందులు అవుతుంది. దీంతో సామాజిక ఒత్తిడికి లోనవుతుంది. జీవితం తలక్రిందులైనట్టు మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెను అంగీకరిస్తారా? అలాంటి పరిస్థితిని ఎలా ఈ యువతి అధిగమిస్తుందనేదే ఈ సినిమా కథ. నటీనటులు ప్రధాన పాత్రలో నటించిన నవీన రెడ్డి క్యూట్‌గా కనిపించింది. ఈ తరం అమ్మాయిల ఆలోచన దోరణి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే చేసి చూపించింది. మెయిన్ లీడ్ పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పవచ్చు. అలాగే హీరో భారత్ ఆకాష్ పాత్రలో తన యాక్టింగ్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేశాడు. చక్కగా, చలాకీగా కనిపించాడు. ఇక అపూర్వ తన పాత్ర తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఇతర పాత్రలు తమ పరిది మేరకు నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం ఈ సినిమాకు ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ చేసిన పాటలు బాగున్నాయి. సింగర్ మంగ్లీ పాడిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. 'ఇదేమి జిందగీ. రొటీన్‌గా ఉన్నది.." పాట బాగుంది. ఇక నాచురల్‌గా విజువల్స్ కనిపించేలా షూట్ చేసిన డీవోపీ రాజశేఖర్ రెడ్డి పనితీరు బాగుంది. అలోష్యాస్ క్సవెర్ ఎడిటింగ్ సరిగ్గా కుదిరిందని చెప్పొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. స్క్రీన్ అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. విశ్లేషణ చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్రయూనిట్ ముందే ప్రకటించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలే ఈ సినిమాలో సన్నివేశాలుగా కనిపిస్తాయి. దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల తాను రాసుకున్న కథకు తగినట్టే తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పెళ్లికి ముందు తప్పు అనిపించని ఓ పొరపాటు.. లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుందని చూపించిన విధానంలో ఇచ్చిన మెసెజ్ యువతకు సూటిగా తాకుతుంది. తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్న యువతకు ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించారు. యువత థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని తప్పకుండా చెప్పొచ్చు. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్‌లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్‌తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్‌లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్‌గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
RAM Movie Review: ‘రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నటీనటులు: సూర్య అయ్యలసోమయజుల,ధన్య బాలకృష్ణ ,భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు నిర్మాణ సంస్థ: దీపికా ఎంటర్టైన్మెంట్ & ఓ ఎస్ యం విజన్ నిర్మాత:దీపికాంజలి వడ్లమాని కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్ సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే... హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న సెటప్ కొత్తగా అనిపిస్తుంది. ఉగ్రవాదం మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులుంటారని చూపించాడు డైరెక్టర్. రామ్ విషయంలో కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే ప్రయాణాన్ని, ఆ గ్రాఫ్‌ను చక్కగా ప్రజెంట్ చేశాడు. హెచ్ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్త పాయింట్ చూపించాడు. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఉండే స్లీపర్ సెల్స్ గురించి చర్చించాడు. ఓ మతం చేస్తే తప్పు.. ఇంకో మతం చేస్తే తప్పు కాదు అంటూ సాయి కుమార్ పాత్రతో డైలాగ్ చెప్పించడం దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు చాలానే రాసుకున్నాడు. సెకండాఫ్, క్లైమాక్స్‌లో హై ఇచ్చే సీన్లను బాగానే రాసుకున్నాడు. బ్యూరోక్రసీ జీహాద్ అంటూ సాయి కుమార్ పాత్రతో కొత్త పాయింట్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు దర్శకుడు. శుభలేఖ సుధాకర్ పాత్రతో రాజకీయానికి ఉగ్రవాదానికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. ఫస్ట్ హాఫ్‌ను సరదా సరదాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను ఫుల్ సీరియస్ మోడ్‌లో నడిపించాడు. క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. త్రివర్ణ పతాకం కనిపించే షాట్ డైరెక్టర్ విజన్, ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చివరకు జై హింద్ అనిపించేలా చేస్తాడు. అదే దర్శకుడి సక్సెస్ అని చెప్పొచ్చు. ఎవరెలా నటించారంటే? రామ్ పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల చక్కగా నటించాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌కు, సెకండాఫ్‌కు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అక్కడే సూర్య సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగుంటాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్గానూ ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి. రామ్ సినిమాలో టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా నిలిచింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. చివర్లో వచ్చే దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే డైరెక్టర్ మిహిరాం రాసిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
Captain Miller Review: ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ
టైటిల్: కెప్టెన్ మిల్లర్ నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత తనీష్ తదితరులు నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్ దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని ఎడిటర్: నాగూరన్ విడుదల తేది: జనవరి 26, 2024(తెలుగులో) కథేంటంటే.. ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్ అగ్నీశ్వర(ధనుష్) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక అతనికి మిల్లర్ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్(సందీప్ కిషన్) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు. రాజన్న(ఎలగో కుమారవేల్) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్ సైన్యాన్ని కెప్టెన్ మిల్లర్ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్ మోహన్), శివన్న(శివరాజ్‌కుమార్)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్షతో , నిమ్నవర్గాల అణచివేత నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు వచ్చాయి. కెప్టెన్ మిల్లర్ కథ కూడా అలాంటిదే. బ్రిటీష్ కాలంలో కుల వివక్ష ఎలా ఉండేది? తక్కువ కులం వారిని బ్రిటీష్ వారితో పాటు సంస్థాన రాజులు ఎలా చిన్న చూపు చూసేవారు? తమ అవసరాలకు ఎలా వాడుకునేవారు? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడి జర్నీని ఐదు చాప్టర్లుగా విడగొట్టి చెబుతూ..అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. బీభత్సమైన వయొలెన్స్ కారణంగా కథలోని మెయిన్ పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. హీరో ఎవరి కోసం పోరాడుతున్నాడో, ఎందుకు మారిపోయాడో అనేది క్లారిటీగా చూపించలేకపోయారు. సన్నివేశాల పరంగా చూస్తే సినిమా బాగుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం గత సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఈ కథలో సినిమాటిక్ లిబర్టీని కూడా ఎక్కువే తీసుకున్నాడు దర్శకుడు. కథ 1930లో సాగినప్పటికీ.. అత్యాధునిక ఆయుధాలు వాడడం, స్టైలిష్ బైక్స్, గాగూల్స్ వాడటం వాస్తవికతతో దూరంగా అనిపిస్తాయి. 'ఘోర హరుడు' కథతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. అతని నేపథ్య సన్నివేశలను చూపించారు. హీరో బ్రిటీష్ సైన్యంలోకి చేరడానికి గల కారణం బలంగా ఉంటుంది. అయితే సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఫస్టాఫ్‌లోనే పరిచయం చేశారు. దీంతో ఆయా పాత్రల తీరు ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుంది. అలాగే ఇన్ని పాత్రలను పరిచయం చేయడంతో కథ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్ మరింత ఎక్కువతుంది. బ్రిటీష్ సైన్యంతో పాటు స్థానిక రాజు చేసే కుట్రలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సైన్యంతో హీరో గ్యాంగ్ చేసే పోరాట ఘట్టాలు మాత్రం అదిరిపోతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని సంభాషణలు కూడా ఆలోచింపచేస్తాయి. ‘మనం వాళ్ల(బీటీష్) దగ్గర బానిసలమే.. వీళ్ల(స్థాయిక రాజు) దగ్గర బానిసలమే.. వీళ్ల కంటే తెల్లోళ్లే నయం. ఇక్కడ ఉంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్లోకి రానివ్వరు. అక్కడ వాళ్లు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్రం అన్నాలి?’ లాంటి డైలాగ్స్ అప్పట్లో అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో మొత్తం ధనుష్ వన్‌మ్యాన్ షో. అగ్నిగా, కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ అదరగొట్టేశాడు. అయితే ఇలాంటి పాత్రలు ధనుష్‌కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఈ తరహా పాత్రల్లో నటించాడు. ఇక శివన్నగా శివరాజ్‌కుమార్ తన పాత్ర పరిధిమేర అద్భుతంగా నటించాడు. భానుమతిగా ప్రియాంక అరుల్ మోహన్ ఆకట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాత్ర నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోతుంది. నివేదితా సతీష్ డిఫరెంట్ పాత్రలో నటించింది. రాజుగా జయప్రకాశ్, రాజన్నగా ఎలగో కుమారవేల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 1930ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్. జీవి ప్రకాశ్ బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ
టైటిల్: నా సామిరంగ నటీనటులు: నాగార్జున అక్కినేని,అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, రావు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకత్వం: విజయ్ బిన్ని కథ: ప్రసన్నకుమార్ బెజవాడ సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి ఎడిటర్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది: జనవరి 14, 2024 ‘నా సామిరంగ’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1963-88 మధ్య కాలంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేట గ్రామానికి చెందిన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కిష్టయ్యనే అన్ని తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్దాయన(నాజర్)దగ్గరే పనిచేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు(రావు రమేష్) కూతురు వరాలు(ఆషికా రంగనాథ్) అంటే కిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వరాలుకు కూడా కిష్టయ్య అంటే ఇష్టమే కానీ.. పదేళ్ల కిందట(1978) జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యలో అంజికి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి(మిర్నా మీనన్)తో పెళ్లి జరిగి, పాప కూడా పుడుతుంది. ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్(రాజ్ తరుణ్)..పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)తో ప్రేమలో పడతాడు. పండగవేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి దొరికిపోతాడు. ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్ని చంపేందుకు ప్రయత్నించగా.. కిష్టయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన ఆజ్ఞ మేరకు పండగ జరిగేవరకు భాస్కర్‌కు ఎలాంటి హనీ కలగకుండా చూసుకుంటాడు. కట్ చేస్తే..దుబాయ్ నుంచి తిరిగొచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాసు(డాన్సింగ్ రోజ్) కిష్టయ్య, అంజిని చంపేందుకు కుట్రలు పన్నుతాడు. దాసుతో పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు.అసలు దాసు అంజి, కిష్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పదేళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో భాస్కర్ పెళ్లిని కిష్టయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిష్టయ్య కోసం అంజి చేసిన త్యాగమేంటి? అన్నం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కిష్టయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు, కిష్టయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథ పాతదైన.. తెరపై చూస్తే బోర్ కొట్టదు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా.. అది తెరపై కనిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి సినిమానే నా సామిరంగ. కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా.. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని కమర్శియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమాగా తీర్చిదిద్డాడు దర్శకుడు విజయ్ బిన్నీ. (చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) వాస్తవానికి ఇది పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్. ఆ సినిమా చూసిన వారికి తప్పా.. మిగతావారందరికి ఇది అచ్చమైన తెలుగు సినిమానే అనిపిస్తుంది. ఎక్కడ పాట పెడితే ఊపొస్తుంది.. ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజిల్స్ పడతాయి.. ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పూస్తాయి? ఇలాంటి కమర్షియల్ కొలతలు అన్ని వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అలా ఒది గొప్ప కథ.. అద్భుతంగా తీర్చి దిద్దారని చెప్పలేం కానీ.. సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమా అని చెప్పొచు. కిష్టయ్య, అంజిల బాల్యం సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ వెంటనే పాతికేళ్ల ముందు అంటే 1963 నుంచి 1988కి వెళ్తుంది. భారీ ఫైట్ సీన్‌తో నాగార్జున ఎంట్రీ.. తర్వాత భాస్కర్ (రాజ్ తరుణ్) లవ్‌స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది. ఇక కిష్టయ్య, వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక.. ప్రేక్షకుడు కథలో లీనమై పోతాడు. వరాలు, కిష్టయ్య మధ్య జరిగే సంభాషణలు , ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. సంక్రాంతి పండక్కి ముడిపెడుతూ.. కథనాన్ని నడిపించారు. ఒక ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది. (చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వరాలు, అంజి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక క్లైమాక్స్ ఊహకందేలా, సింపుల్‌గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా.. సంకాంత్రి వేళ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. కిష్టయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు. రొటీన్ కథే అయినా.. నాగార్జున ఎనర్జీటిక్ యాక్టింగ్‌తో బోర్ కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేశ్ది. అంజి పాత్రలో నరేశ్ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించాడు. తెరపై నాగార్జున, నరేశ్‌ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది. వరాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్‌గా రాజ్‌తరుణ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నాజర్, మిర్నా, రుక్సర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. (చదవండి: హను-మాన్ రివ్యూ) సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలు ప్రాణం పోశాడు. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
‘కుల్లనారి కూట్టం’ తమిళ మూవీ రివ్యూ
టైటిల్: కుల్లనారి కూట్టం(2011) నటీనటులు: విష్ణు విశాల్, రమ్య నంబీషన్, సూరి తదితరులు దర్శకత్వం: శ్రీబాలాజీ సంగీతం: వి.సెల్వగణేష్ సినిమాటోగ్రఫీ: జే.లక్ష్మణ్ ఎడిటర్: కాశీ విశ్వనాథన్ విడుదల తేది: మార్చి 25, 2011 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘కుల్లనారి కూట్టం’ కథేంటంటే.. "సరే! రీచార్జ్ చెయ్యాల్సిన నెంబర్ చెప్పండి" అనడిగింది ఆ మోబైల్ షాపు అమ్మాయి ."9445199205" అన్నాడు ఆ అబ్బాయి. చివరి టూ జీరో పైవ్ అంటే రెండు సున్నాలు ఒక అయిదు అనుకుని ఆ 9445199005 నెంబర్‌కు రూ: 1500 రీచార్జ్ చేసింది ఆ అమ్మాయి . ఆ డబ్బులు సరాసరి ప్రియా నంబియార్ అనే ఎంతో చూడచక్కని అమ్మాయి మోబైల్ కు రీచార్జ్ అయ్యింది. అలా మొదలయ్యింది ఈ సినిమా కథ .ఆ కుర్రవాడి పేరు వెట్రివేళ్(విష్ణువిశాల్). అతని తండ్రి తనను ఒకరోజు పదిహేను వందల రూపాయలు కొడుకు చేతిలో పెట్టి తన మొబైల్ రీచార్జ్ చేయించమన్నాడు. ఆ డబ్బు తన తండ్రి మొబైల్ కి కాకుండా అలా ఊరూ పేరూ తెలియని ఓ ఆందగత్తె పాలయ్యింది. ఉద్యోగం గట్రా ఏవి లేని వెట్రివేళ్ కి ఉన్న ఆదాయమల్లా రోజువారి పాకెట్ మనీ స్కీములో లభించే కేవలం రూ 10 మరి ఎలాగని? ఎక్కడినుంచని? ఇంకో 1500 సంపాదించి తండ్రి పోన్ రీచార్జి భారం తీర్చుకుంటాడు? అదంతా ఆ చావంతా, ఆబ్రతుకంతా ఆ ముచ్చటంతా మీరు ఈ సినిమా చూసి తీర్చుకోదగ్గ ముచ్చట. విశ్లేషణ కొన్ని ప్రయత్నాల అనంతరం వెట్రివేళ్ ఆ అమ్మాయి దగ్గరినుండి డబ్బునూ, ఆ వెనువెంటనే ఆ అమ్మాయి మనసుని కూడా అంది పుచ్చుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో ఏ మాత్రం అలుపు సొలుపు బోర్ కు గురిచేయకుండా దర్శకుడు హాయి హాయిగా సినిమాలోకంలో మనల్ని ఊయాలలూపుతూ ఉంటాడు. సర్వసాధారణమయిన సినిమాల్లో పనీ గినీ లేని హీరో పక్కన మరో పనీ గినీ లేని ఒక విదూషక ఫ్రెండ్ పాత్ర పెట్టి మనల్ని అనవసరంగా నవ్వించే ప్రయత్నం దర్శకుడు శ్రీ బాలాజీ అసలు చెయ్యలేదు. ఈ సినిమాలో అనవసరం అనిపించే పాత్ర ఒక్కటీ లేదంటే అదే అశ్చర్యం! పైగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంత బాగా నటించారో! హీరో తల్లి ఎంత బాగా నటించిండో కదా అని మనం ఆశ్చర్యపోతూంటే ! మామూలు సినిమ్మా తండ్రి కూడా ఎంత హాయిగా నటించాడో అని ఇంకా నిబిడాశ్చర్య పోతాము ! ఇక వేట్టి అన్నయ్య సంగతి కాదు కానీ తమిళ సినిమాల్లో అన్నపాత్రలు వేసే వారంతా అంత చక్కని నటులేంటో! వదిన మాత్రం తక్కువ నటించిందా ఏమిటి? . సిన్మా చివర్లో వచ్చిన ఆరు మంది మిత్రులు, వారి తోడుగా దూరిన కొంత పోలీసు వారు. వారని వీరని కాదు ఈ సినిమాలో మొహానికి రంగు వేసుకున్న ప్రతి పాత్రధారి మోసం అంటే అద్భుతం అన్నంత బాగా నటించారు . ఒక సీన్ లో తండ్రి చేతిలో స్కూల్ పిల్లల పరిక్ష పత్రాలు ఉంటాయి . ఒక్క సెకను మాత్రమే కనపడే సీన్ అది . సినిమా లో ఒక పాత్ర స్కూలు మాస్టరు అయినంత మాత్రానా ఆయన ఇంటికి ఆ కాగితాలు తీసుకెళ్ళి రాత్రి దిద్ది ఉదయం బడికి పట్టుకెడుతున్నాడనే చిన్న బ్యూటిఫుల్ డిటయిల్ ప్రేక్షకుడికి ఇవ్వాలని ప్రేమకలిగిన దర్శకుడిని ఊరికే ఒట్టి మాటల్తో ఎట్టా ప్రేమించగలం. దేవుడా! ప్రేమించలేకపోవడం ఎంత కష్టం కష్టం!! సరే మళ్ళీ కథలోకి వద్దాం. వెట్రి, ప్రియా ల ప్రేమని హీరోయిన్ తండ్రి ఒకలా ఒప్పుకుంటాడు. నాయనా నీకూ, మా అమ్మాయికి పెళ్ళి కావాలంటే పరమ సింపుల్‌గా నువ్వు మిలట్రీ ఉద్యోగం అయినా సంపాదించు లేదా పోలీసు వాడివయినా అవ్వమనేది షరతు. హీరోయిన్ అమ్మాయి వాళ్ళ ది ఒక విచిత్రమైన ఊరు. ఆ ఊర్లో ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు మిలట్రీలో చేరి భారత్ మాతా కి సేవలో తరించే వాళ్ళే. మామూలుగా నిత్యజీవితాల్లో ఉద్యోగం సంపాదించడం అనేది కష్టం కావచ్చు కానీ, భారతీయ సినిమా హీరోకి- అందునా తెలుగు మరియు తమిళ హీరోలకి అసాధ్యం ఐనది ఏది? మీకెవరికయినా ఆడవి దోంగ అనే ఎనభైలనాటి సినిమా గుర్తు ఉందా? మాటలు కూడా రాని బ్బే బ్బే బ్బే అనే కథానాయకుడు . హీరోయిన్ రాధ వడిలో పడుకుని ముప్ఫై రోజుల్లో తెలుగు కామా ఇంగ్లీష్ కామా హిందీ కూడా నేర్చుకుని ఆ పై పుంజీడు రోజుల్లో జిల్లా కలెక్టరో, సుప్రీంకోర్ట్ జడ్జి వంటిది కూడా ఒకటి అయ్యి ప్రేక్షక దేవుళ్లతో చెవులు చిల్లులు పడేంత వీలలు , చిల్లర వేయించుకుంటాడు కదా. అడిగాడా మన సినిమా ఘన చరిత్ర ! మిలటరీలో చేరడానికి మరిక ప్రాబ్లెం ఏవిటి మన హీరోకి? అంటే ఏం చెప్పను? సినిమా చూడరాదు, ప్రాబ్లెమ్ ఏమిటో ! ఎంత బాగుందో ఈ సినిమా . కథ బావుంది, నడిపిన కథనం బావుంది. నటీ నటులు అందరూ బావున్నారు. అంత మంచి సినిమా చివర్లో వచ్చే కాస్త డ్రామా అంతగా ఆకట్టుకోదు! అయినా పర్లా ఆ అయిదు నిముషాల క్లైమాక్స్ అలా కన్నా ఇక మరలాగైనా తీయలేరేమో లే పాపం అని క్షమించేంత బావుంది. -
‘ప్లాంట్ మ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘ప్లాంట్ మ్యాన్’ నటీనటులు: చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి తదితరులు నిర్మాణ సంస్థ: డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్ దర్శకత్వం: కె.సంతోష్‌బాబు సంగీతం: ఆనంద బాలాజీ విడుదల తేది: జనవరి 5, 2023 ప్లాంట్ మ్యాన్ కథేంటంటే.. చారి (చందు)కి ఓ ప్రైవేట్ కంపెనీలో పాతిక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. అయినా కూడా ఆ ఉద్యోగాన్ని వదులుకొని తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. కొడుక్కి పెళ్లి చేయాలని చారి పెరెంట్స్ తెగ ప్రయత్నాలు చేస్తారు. అయితే చారి మాత్రం తన పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటాడు. చివరకు ఓ పెళ్లి చూపులకెళ్లి చందు(సోనాలి)ని ఇష్టపడతాడు. చందు కూడా చారిని ఇష్టపడుతుంది. దీంతో ఇరుకుటుంబాలు కలిసి త్వరలోనే పెళ్లి జరిపించాలకుంటారు. అయితే చందు చిన్ననాటి స్నేహితుడు చింటు(అక్కం బాలరాజు)కి ఆమె అంటే చాలా ఇష్టం. ప్రేమ విషయాన్ని చెప్పలేక చందుకు వచ్చి పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు. చారిని కూడా అలానే బెదిరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ అది వర్కౌట్ కాదు. ఎలాగైన చందు, చారిల పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు. కట్ చేస్తే.. చింటూ తండ్రి ఓ సైంటిస్ట్ . ఎడారిలో సైతం మొక్కలు మొలిపించేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తుంటాడు. ఓరోజు అతని పరిశోధన విజయవంతమై ఓ మందు కనుగొంటాడు. ఆ రసాయనం నేల మీద జల్లితే నిమిషాల్లో మొక్కలు పుట్టుకొస్తాయి. అది తెలుసుకున్న చింటూ ఆ మందును చారి మీద ప్రయోగిస్తాడు. దాంతో చారికి ఒళ్ళంతా మొక్కలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్లాంట్ మ్యాన్‌గా మారిన చారికి ఎదురైన సమస్యలు ఏంటి? ఒంటి నిండా వచ్చిన మొక్కలతో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడి మామూలు మనిషిగా మారాడు? చందుతో పెళ్లి సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే ప్లాంట్ మ్యాన్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ వ్యక్తి శరీరంపై మొక్కలు మొలకెత్తుతే ఎలా ఉంటుంది? ఇది వినడానికే విచత్రంగా ఉంది కదా? అలాంటి సరికొత్త పాయింట్‌తో తెరకెక్కిన సినిమానే ‘ప్లాంట్ మ్యాన్’. దర్శకుడు కె.సంతోష్‌బాబు ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త పాయింట్‌ని ఎంచుకున్నాడు..కానీ దాన్ని అంతే కొత్తగా, ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని కామెడీ వేలోనే నడించాడు. హీరో మూములు మనిషి నుంచి ప్లాంట్ మ్యాన్‌గా మారడం, ఆ ప్రాసెస్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని ఇవన్నీ ఫన్నీగా సాగుతాయి. హద్దు మీరని హాస్యంతో ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం అందరూ నవ్వుకునేలా తియ్యడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ ఎమోషనల్ సీన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. హీరోహీరోయిన్ల పెళ్లి చూపుల తర్వాత ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఫ్రెండ్ చేసే వాట్సాప్ చాటింగ్ నవ్వులు పూయిస్తుంది. ఒకవైపు హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ..మరోవైపు మొక్కలపై సైంటిస్ట్ చేసే ప్రయోగాన్ని చూపిస్తూ..ఈ రెండింటికి ఎక్కడో లింక్ ఉంటుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ ఎంటర్టైన్ చేస్తుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. హీరో ఒంటినిండా మొక్కలు మొలకెత్తడం.. దాని వల్ల అతనికి ఎదురయ్యే సమస్యలు అన్నీ హ్యాస్యాన్ని పంచడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో అంతర్లీనంగా మొక్కలు అనేవి మానవ జీవితానికి ఎంతో అవసరం అనే సందేశం కూడా ఉంది. అయితే పేరున్న నటీనటులు ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరోహీరోయిన్లుగా నటించిన చందు, సోనాలికి ఇది తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు లేకుండా చక్కగా నటించారు.కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన అశోక్‌వర్థన్ వేసిన పంచ్‌లు బాగా పేలాయి. అతను తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షిత రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ అందర్నీ నవ్వించాయి. ఇక యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన అక్కం బాలరాజు కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండిరచాడు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణికర్ణన్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. వినోద్ యాజమన్య అందించిన బీజీఎం, ఆనంద బాలాజీ అందించిన మెలోడీ సాంగ్స్ సినిమాకు ప్లస్. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Raghava Reddy Review: ‘రాఘవరెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: రాఘవరెడ్డి నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మాతలు: కేఎస్ శంకర్ రావ్, జీ.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వర్ రావు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి సంగీతం: సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో విడుదల తేది: జనవరి 5, 2024 కథేంటంటే.. రాఘవ రెడ్డి(శివ కంటంనేని) ఓ క్రిమినాలాజీ ప్రొఫెసర్. డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తో పాటు క్రిమినల్ కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. రాఘవ రెడ్డి పాఠాలు చెప్పే కాలేజీ లోకి మహాలక్ష్మి అలియాస్ లక్కీ ( నందిని శ్వేత) స్టూడెంట్ గా వస్తుంది. లక్కీ చాలా అల్లరి అమ్మాయి. తన యాటిట్యూడ్ తో రాఘవరెడ్డి తో గొడవ పడుతుంది. కాలేజీ లో అంతా రాఘవ రెడ్డికి భయపడతారు కానీ లక్కీ మాత్రం రౌడీ బేబీ లా ప్రవర్తిస్తూ ప్రొఫెసర్ ని లెక్కచేయదు. ఒక సందర్భంలో రాఘవ రెడ్డికి లక్కీకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇదిలా ఉంటే...లక్కీ తల్లి దేవకీ(రాశి) ఒకసారి కాలేజీ కి వచ్చి వెళ్తుంటే...ఆమె వెనుక పరుగెత్తుతాడు రాఘవ. అసలు దేవకిని చూసి రాఘవ ఎందుకు పరుగెత్తాడు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లక్కీ నీ కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? క్రిమినల్ కేసులను సాల్వ్ చేసే రాఘవ్.. కిడ్నాపర్ల ను ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హీరో తన డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకోవడం..ఆపద వచ్చినప్పుడు మళ్లీ ఫ్యామిలీ కోసం పోరాటం చేసి రక్షించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. రాఘవరెడ్డి కథ కూడా ఇదే పంథాలో సాగుతుంది. డాటర్ సెంటిమెంట్‌తో ప్యామిలీ ఎమోషనల్‌గా ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. యూత్‌ను ఆకట్టుకోవడం కోసం కాలేజీ నేపథ్యాన్ని జోడించాడు. కథ పాతదే అయినా కాస్త కమర్శియల్ అంశాలను జోడించి కాస్త డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నప్పటికీ..తెరపై ఆకట్టుకునేలా తీయడంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకుంటే మెరుగైన ఫలితం ఉండేది. ఫస్టాఫ్‌లో హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు. ప్రారంభంలోనే హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించాడు. కాలేజీ ప్రొఫెసర్‌గా ఉంటూనే.. క్రిమినల్ కేసులను పరిష్కరించడం. దోషులను గుర్తించే విధానాన్ని విశ్లేషించడం అన్ని ఆకట్టుకుంటాయి. ఇక నందిని శ్వేత పాత్ర ఎంట్రీ తర్వాత కథనం ఫన్ వేలో సాగుతుంది. కాలేజీలో ఆమె చేసే అల్లరి, శ్రీనివాస్ రెడ్డి చేసే కామెడీ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథను ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు మలిచాడు. తన కూతురు ఎవరో తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కిడ్నాపర్లను కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయత్నం కూడా అంతగా ఆకట్టుకోదు. స్లో నెరేషన్.. సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. టైటిల్ పాత్ర పోషించిన శివ కంఠంనేని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లక్కీ పాత్రలో నందిని శ్వేత అదరగొట్టేసింది. ఇక చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించిన రాశి.. దేవకి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. బిత్తిరి సత్తి, శ్రినివాస్ రెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అజయ్ ఘోష్ విలనిజం పర్వాలేదు. అజయ్, ప్రవీణ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. బీజీఎం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.