మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళే విడుదలైంది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. మట్కా, జూదం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ తొలిసారిగా డిఫరంట్ రోల్‌లో కనిపించారు.
కాగా.. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్ షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మట్కా మార్నింగ్ షోలు మొదలయ్యాయి. దీంతో మూవీ చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మట్కా అద్భుతంగా ఉందని.. మంచి స్టోరీ అని, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. మరికొందరైతే బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షి ఎలాంటి బాధ్యత వహించదు.
కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
#Matka
Block buster 🔥🔥🔥🔥🔥🔥🔥@IAmVarunTej pic.twitter.com/ySv0yXaSE6— TrendCharan (@TrendCharan) November 14, 2024
#Matka getting a positive Mouth talk from everyone 🤗❤️
Congratulations @IAmVarunTej anna pic.twitter.com/822hcehFG6— PremKumaR ᴳᵃᵐᵉ ᶜʰᵃⁿᵍᵉᴿ ♔🚁 (@RC_Premkumar) November 14, 2024
#Matka - BLOCKBUSTER 🏆🔥
2024 Best Movie....👏🏆🔥#MATKAFromToday @IAmVarunTej #MatkaReview pic.twitter.com/qGd25hzQKC— Aravind Editor (@aravindak0) November 14, 2024
Comments
Please login to add a commentAdd a comment