వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. దర్శకుడు మేర్లపాక గాంధీతో ఈ చిత్రాన్ని ఆయన చేయనున్నారు. భారీ అంచనాలతో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఇండో - కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రానుంది. వరుణ్ తేజ్ 15వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ న్యూ ఏజ్ ఎంటర్‌టైన్మెంట్ ఫిల్మ్‌లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
రీసెంట్‌గా వరుణ్ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో వంటి చిత్రాలను మేర్లపాక గాంధీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
వరుణ్‌తేజ్ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అయతే, ఈ మూవీ కోసం సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మట్కా మూవీకి పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి మట్కా మూవీని ప్రొడ్యూస్ చేశారు.
ఈ మూవీ కంటే ముందు వరుణ్‌తేజ్ చేసిన గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవదారి అర్జున కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇలా వరుస సినిమాలతో వరణ్ తన అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. దీంతో మేర్లపాక గాంధీతో చేస్తున్న సినిమాపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment