Merlapaka Gandhi
-
వరుస ప్లాపుల తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటన
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. దర్శకుడు మేర్లపాక గాంధీతో ఈ చిత్రాన్ని ఆయన చేయనున్నారు. భారీ అంచనాలతో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఇండో - కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ రానుంది. వరుణ్ తేజ్ 15వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్గా వరుణ్ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో వంటి చిత్రాలను మేర్లపాక గాంధీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.వరుణ్‌తేజ్ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అయతే, ఈ మూవీ కోసం సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మట్కా మూవీకి పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి మట్కా మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ కంటే ముందు వరుణ్‌తేజ్ చేసిన గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవదారి అర్జున కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇలా వరుస సినిమాలతో వరణ్ తన అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. దీంతో మేర్లపాక గాంధీతో చేస్తున్న సినిమాపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
కొరియన్ కనకరాజు?
కొరియన్ కనకరాజుగా మారనున్నారట వరుణ్ తేజ్. ఆయన హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఆదివారం ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.వచ్చే మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. -
చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ మా సినిమాకు హైప్ తీసుకొచ్చింది
‘‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ కథ హిలేరియస్‌గా ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్స్ అయిన హీరో, హీరోయిన్ ట్రావెల్ వీడియోల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘ఒక యూట్యూబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన నుంచే ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఐడియా వచ్చింది. ట్రావెల్ బ్లాగర్ కష్టాలు, ప్రమాదాలు, సవాళ్లను ఈ సినిమాలో చూపించాం. ఈ కథలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక చేంజ్ ఓవర్, మలుపు ఉంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోయారు. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్లో చిరంజీవిగారు చెప్పిన ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ డైలాగ్ మా సినిమాకి బాగా హైప్ తీసుకొచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు మేర్లపాక మురళిగారి కథతో ఓ సినిమా చేయాలనుంది. ‘జవాన్’ నిర్మాత కృష్ణగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్ మెంట్లో నా తర్వాతి చిత్రాలు ఉంటాయి’’ అని చెప్పారు. -
ఆసక్తి పెంచుతున్న సంతోష్ శోభన్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్
విభిన్న కథలను ఎంచుకుంటూ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హై స్కూల్ చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తను నేను చిత్రంలో హీరోగా మారాడు. ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకు సంతోష్ శోభన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం అప్డేట్ వదిలారుమ మేకర్స్. ఈ సినిమాకు ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్రైబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కొత్తగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? కాగా ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతీ రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్ ముగ్గురు పైకి చూస్తూ కనిపించారు. ఇక సంతోష్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని కథ అందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అడ్వేంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. An Adventurous Travel Tale filled with Joy, Thrill & Entertainment 💯😃🤞 Presenting the First Look of 𝗟𝗜𝗞𝗘👍 𝐒𝐇𝐀𝐑𝐄 🔁 & 𝑺𝑼𝑩𝑺𝑪𝑹𝑰𝑩𝑬🔔#LSS ❤️🔥@santoshshobhan @fariaabdullah2 @MerlapakaG @vboyanapalli @Plakkaraju @Ram_Miriyala #AamukthaCreations @saregamasouth pic.twitter.com/DxX0yHaDvT — Niharika Entertainment (@NiharikaEnt) September 5, 2022 -
మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు
Tamanna Fan Cried After Watching Maestro: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకు హీరోయిన్గా కుర్రకారును ఆకట్టుకుంటూ లేడీ ఫ్యాన్స్‌ను అలరిస్తూ వచ్చింది. ప్పుడూ అల్లరి, అమాయక పాత్రలు పోషించి అందరి మదిని దోచిన ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అలాంటి సమంత తన తాజాగా చిత్రం ‘మాస్ట్రో’ నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.ఇందులో తమన్నా వరుస హత్యలు చేస్తూ సైలెంట్ కిల్లర్ పాత్ర పోషించి ఫ్యాన్స్‌ను భయపెట్టింది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో ఒక్కసారిగా తన నెగిటివ్ షెడ్‌ను చూపించేసరికి ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ ఈ క్రమంలో తమన్నాను అలా చూసి ఏకంగా ఓ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి ఎవరో కాదు డైరెక్టర్ మేర్లపాక గాంధీ చిన్న కూతురు లిపి. ఆమె తమన్నాకు పెద్ద ఫ్యాన్ అట. ఈ క్రమంలో నిన్న మాస్ట్రో మూవీ చూసిన లిపి తమన్నాను అలా చూసి ఏడుపు మొదలు పెట్టిన వీడియోను హీరో నితిన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. దీనికి ‘వాట్ యా.. నీ ఫ్యాన్‌ను ఏడింపించావు. ఈ రోజు నేను చూసిన క్యూట్ వీడియో ఇది. దర్శకుడు గాంధీ చిన్నకూతురు లిపి.. నీకు పెద్ద ఫ్యాన్’ అంటూ తమన్నాను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన తమన్నా ‘తప్పకుండా ఆ చిన్నారికి హగ్ ఇవ్వాల్సిందే’ అని కామెంట్ చేసింది. చదవండి: ‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ ఇక ఈ వీడియోలో ఆ చిన్నారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా.. గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు అంటూ కన్నీరూ పెట్టుకుంటుంటే ఆమె తండ్రి డైరెక్టర్ గాంధీ తమన్నా నీ ఫేవరేట్ హీరోయిన్ హా అని అడుగుతాడు. అవును అనగానే అయితే ఇప్పుడు ఏమైందీ అనడంతో ఆ పాప తను ఎందుకు అలా అందరిని చంపుతుంది అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి అది సినిమాలే అంటూ నచ్చజెప్పింది. కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో మూవీ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో అందుడిగా నితిన్, లేడీ విలన్‌గా తమన్నా పాత్రలకు మంచి రెస్పోన్స్ వస్తోంది. @tamannaahspeaks what ya… you made your fans cry? 😂… this was the cutest video I saw today .. Thats Gandhi’s little daughter Lipi who’s a big fan of you 🤗 MAESTRO only on @DisneyPlusHS pic.twitter.com/PtbwPMlG43 — nithiin (@actor_nithiin) September 17, 2021 -
ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ అంటారు!
‘‘రీమేక్ సినిమాకి పోలికలు పెడతారు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ, పేస్ట్ అని ఆరోపిస్తారు. మార్పులు చేస్తే ఒరిజినల్ ఫిల్మ్ సోల్‌ను చెడగొట్టారని విమర్శిస్తారు. రీమేక్స్‌కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్’కి రీమేక్‌గా రూపొందిన ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకుడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు. ►‘అంధా ధున్’లోని థ్రిల్లింగ్, డార్క్ హ్యూమర్ అంశాలు నచ్చి, రీమేక్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నితిన్, సుధాకర్ రెడ్డిగార్లు ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీని మార్చాం. ఒరిజినల్ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్‌ను అలాగే వాడాం. ‘మాస్ట్రో’లో నితిన్ అంధుడిగా బాగా నటించారు. హిందీలో టబు చేసిన రోల్‌కు తమన్నాను తీసుకోవాలన్నది నా ఆలోచనే. ►ఒక స్క్రిప్ట్ అనుకుని డెవలప్ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక ఎగై్జటింగ్‌గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్‌ను స్టార్ట్ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య గ్యాప్ వస్తోంది. సినిమాలను ఫాస్ట్‌గా తీస్తాను కానీ కథలు రాయడంలో మాత్రం కాస్త లేట్. మా నాన్న (రచయిత మేర్లపాక మురళి)గారు నావెల్స్ రాస్తుంటారు.‘ఏక్ మినీ కథ’ సినిమా కథ నాదే. నాన్నగారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా నచ్చుతుందనుకుని చేశాను. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. -
'మాస్ట్రో' :ఆ ఒక్క సాంగ్ కోసం అరకోటి ఖర్చుపెట్టారట!
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్‌కు రీమేక్ ఇది. నితిన్‌కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా ప్రమోఫన్స్లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
అలా 'ఏక్ మినీ కథ' పురుడు పోసుకుంది: మేర్లపాక గాంధీ
ఓ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అందులో ఓ పాఠకుడు పంపిన ప్రశ్న నుంచి ఏక్ మినీ కథ ఆలోచన వచ్చింది. నా ఆలోచనని మా నాన్న మేర్లపాక మురళి, మా అంకుల్ మహర్షికి చెప్పినప్పుడు భయపడ్డారు. పూర్తి కథ రాశాక హ్యాపీగా ఫీలయ్యారు అని డైరెక్టర్ మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించిన చిత్రం ఏక్ మినీ కథ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం అందించిన మేర్లపాక గాంధీ ఏక్ మినీ కథకు కథ అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. నా గత చిత్రాలు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వినోదాత్మకంగా ఉంటాయి. వినోదాత్మక చిత్రాలకు థియేటర్లలో అయితే ఆ అనుభూతే వేరు. ఏక్ మినీ కథలో ఫన్ బాగా వర్కవుట్ అవుతుందనుకున్నాం. అందుకే ముందు ఓటీటీ కోసం స్టార్ట్ చేసినా, థియేటర్స్ అయితే మంచి అనుభూతి ఉంటుందనిపించింది. అయితే సెకండ్ వేవ్ వల్ల ఓటీటీకి వెళ్లాల్సి వచ్చింది. నా దర్శకత్వంలోనే ఈ సినిమా చేయాలనుకున్నాం. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు నితిన్‌తో నా డైరెక్షన్లో మాస్ట్రో సినిమా స్టార్ట్ అయింది. ఈ లోపు లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ ముగియగానే మాస్ట్రో చేయాలి. ఒకే సమయంలో రెండు సినిమాలు చేయలేం కదా? అందుకే కార్తీక్‌తో దర్శకత్వం చేయించమని యూవీ క్రియేషన్స్ వారికి చెప్పా. వారికి కథ నచ్చి నిర్మించారు. నితిన్‌తో చేస్తున్న మాస్ట్రో షూటింగ్ వారం మాత్రమే మిగిలి ఉంది. అనుకున్నట్లు అయ్యుంటే జూన్ 11న సినిమాను విడుదల చేసేవాళ్లం. మాస్ట్రో తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేద్దామనుకుంటున్నాను. ప్రతిసారీ గ్యాప్ తీసుకోకూడదనుకుంటాను కానీ గ్యాప్ వస్తోంది(నవ్వుతూ) అన్నారు మేర్లపాక గాంధీ. చదవండి: సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ ‘ఏక్ మినీ కథ’ మూవీ రివ్యూ -
ఏక్ మినీ కథ: సామిరంగా సాంగ్ రిలీజ్
‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ అయిన యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రమిది. కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ‘సామిరంగా..’ అంటూ సాగే పాట విడుదల చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ‘‘ఈ మధ్యే విడుదలైన ‘ఈ మాయలో..’ లిరికల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘సామిరంగా..’ అతి కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో విశేష స్పందన అందుకుంటూ చాట్ బస్టర్‌గా మారింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. చదవండి: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్చల్! -
నభా నటేశ్‌తో బైక్ రైడ్‌కి వెళ్లిన నితిన్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరసు సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను వదిలాడు. వాటిలో ‘చెక్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా, ‘రంగ్‌దే’ పర్వాలేదనిపించింది. ఇక నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘అంధాదున్’కి రీమేక్ ఇది. నటా నటేశ్ హీరోయిన్గా నటిస్తోంది. నితిన్ పుట్టిన రోజున(మార్చి 30) ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వదిలిన చిత్ర బృందం, తాజాగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. Love is Blind and Love doesn’t Discriminate! #MAESTRO🎹 is on the way with his girl to wish you a Happy #SriRamaNavami 🏹💥@actor_nithiin @NabhaNatesh @tamannaahspeaks @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @mahathi_sagar @Jisshusengupta pic.twitter.com/RO3GdbcDuI — BARaju (@baraju_SuperHit) April 21, 2021 చదవండి: గుండుతో హీరోయిన్ రష్మిక!.. ఫోటోలు వైరల్ 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' -
ఏదో జరిగింది.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్ లుక్
కళ్లు కన బడవు.. స్టిక్ సాయంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. అది ఓకే.. కానీ అక్కడే ఉన్న పియానో మీద రక్తపు మరకలు ఈ వ్యక్తి ఏదో హత్య చేశాడనే అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి. లేక వేరే ఎవరైనా హత్య చూసి, ఇతనిపై పడేయాలని ప్లాన్ చేశారా? అసలు విషయం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ . సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ ఇది. నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రధానపాత్ర చేస్తున్నారు. జూన్ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మహతీ స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల. చదవండి: లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ 'పదహారువందల మందిని ప్రేమించా' -
నితిన్ 30వ సినిమా : విలక్షణ పాత్రలో
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా, తమన్నా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాని జూన్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రమిది. ఇప్పటి వరకూ నటించని విలక్షణ పాత్రలో నటిస్తున్నారు నితిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్. -
నితిన్ అంధుడిగా కనిపించేది అప్పుడే!
బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'అంధాధున్'. తెలుగులో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ రీమేక్ బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 11న థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. నితిన్ అంధుడిగా, సంగీతకారుడిగా కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేశ్ అతడితో జోడీ కడుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. JUNE 11th is the Date!! #Nithiin30 @tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA — nithiin (@actor_nithiin) February 19, 2021 అంధుడైన హీరో ఓ హత్యకు ఎలా సాక్షిగా మారతాడనేది ఈ చిత్ర ప్రధాన కథ. బాలీవుడ్లో ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి నితిన్‌కు ఈ సినిమా ఎన్ని ఫలాలనిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే అతడు దేశదద్రోహిగా నటించిన 'చెక్' ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'రంగ్‌దే' మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని 'అంధాధున్' రీమేక్‌తో అభిమానులను అలరించేందుకు రానున్నాడు. చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ ముంబైలో ఇళ్లు కొన్న బుట్టబొమ్మ -
నితిన్ 30వ సినిమా షూటింగ్ షురూ
యూత్ స్టార్ నితిన్ హీరోగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నితిన్‌కి ఇది 30 వ సినిమా. ఈ మూవీ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ ఇది. (చదవండి : ప్రభాస్ మూవీపై కామెంట్.. సారీ చెప్పిన సైఫ్ అలీఖాన్) నితిన్ షేర్ చేసిన ఫొటోలో ఆయన షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్లో ఆమె పాల్గొననున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇక నితిన్, కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. #Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati pic.twitter.com/HDRjnFpKQa — nithiin (@actor_nithiin) December 6, 2020 -
క్రేజీ రీమేక్‌కి సై
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘన విజయం సాధించిన క్రేజీ చిత్రం ‘అంధాధూన్’కి ఇది తెలుగు రీమేక్. ‘ఠాగూర్’ మధు సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ . సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘అంధాధూన్’లో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను తెలుగులో తమన్నా, రాధికా ఆప్టే పాత్రను నభా నటేష్ చేయనున్నారు. ‘అంధాధూ¯Œ ’లో టబు నటనకు ప్రశంసలు దక్కాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను చేసే సవాలును స్వీకరించారు తమన్నా. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో నటించే అవకాశం లభించినందుకు నభా నటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: హరి కె. వేదాంత్. -
మోడ్రన్ దేవదాసుగా చైతూ
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మజిలీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు చైతూ. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య ఓకె చెప్పాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడట. అంతేకాదు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాగచైతన్య కోసం ఓ ప్రేమకథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా దేవదాసుకు మోడ్రన్ వర్షన్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కథా కథనాలు ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా సాగినా క్లైమాక్స్ మాత్రం దేవదాసు తరహాలోనే విషాదాంతమే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
చైతు మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడా?
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. గతకొంతకాలం నుంచి చైతూకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సరైన హిట్ లేక అక్కినేని హీరోలు సతమతమవుతున్నారు. సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు అనకున్నంతగా విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నాగ చైతన్య మజిలీ, వెంకీమామా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీని దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మస్తున్న చిత్రంలో చైతు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
కొత్త కాంబినేషన్
యువ దర్శకులతో ఈ మధ్య ఎక్కువగా పని చేస్తున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ చేయనున్నారు. ఈ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం’ సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయ్యారట చైతు. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్నారని సమాచారం. నాగచైతన్య కోసం ఓ కొత్త పాయింట్ రెడీ చేశారట మేర్లపాక గాంధీ. యూవీ క్రియేషన్ బ్యానర్ యూత్‌ఫుల్ సబ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకోవడంతో పాటు భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలు రూపొందిస్తారన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఈ నెల మూడో వారం నుంచి ‘వెంకీ మామ’లో జాయిన్ అవుతారు నాగచైతన్య. మేర్లపాక గాంధీ సినిమాను కూడా ‘వెంకీ మామ’తో సమాంతరంగా చేస్తారో లేదో వేచి చూడాలి. -
ఫుల్ ఫోకస్!
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ ఏడాది నానీతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాతి ప్రాజెక్ట్ గురించి మేర్లపాక గాంధీ బయటకు చెప్పలేదు. అయితే ఫుల్ ఫోకస్‌తో సైలెంట్‌గా కథ రెడీ చేస్తున్నారట. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుందని సమాచారం. ఇంతకుముందు మేర్లపాక దర్శకత్వంలోనే వచ్చిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. -
‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణార్జున యుద్ధం జానర్ : యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ సంగీతం : హిప్ హాప్ తమిళ దర్శకత్వం : మేర్లపాక గాంధీ నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని మరోసారి ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే నానికి వరుసగా విజయాలు వెన్నంటి నడుస్తున్నాయి. ఇక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న మేర్లపాక గాంధీ ఈ సారి నానితో జత కట్టాడు. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినీ అభిమానులను ఏ మేరకు అలరించిందో చూద్దాం. కథ చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామంలో ఉండే కృష్ణ (నాని) ప్రేమంటూ ఊళ్లో ప్రతీ అమ్మాయి వెనక పడుతుంటాడు. కానీ ఏ అమ్మాయి కృష్ణ ప్రేమను ఒప్పుకోదు. దీంతో ఊర్లో ఉన్న అమ్మాయిలను అసలు చూడకూడదనీ, ఇక ఎవర్నీ ప్రేమించకూడదని కృష్ణ అనుకుంటాడు. ఇలాంటి సమయంలో ఆ వూరి సర్పంచ్ మనమరాలు రియా( రుక్సర్ మీర్)ను చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. మరోవైపు ఫారెన్‌లో ఉన్న రాక్‌స్టార్ అర్జున్ (నాని)ను... చూసిన ప్రతి అమ్మాయి అతడికి ఓకే చెబుతుంది. ఇక కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే....అర్జున్ మాత్రం పెళ్లి గురించి పట్టించుకోకుండా కనబడిన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. అలాంటి సమయంలో అర్జున్... సుబ్బలక్ష్మి( అనుపమా పరమేశ్వరన్)ను చూస్తాడు. (సాక్షి రివ్యూస్) అయితే సుబ్బలక్ష్మి మాత్రం అర్జున్ చేసే ప్రయత్నాలను పట్టించుకోదు. ఇలా కథ కొనసాగుతుండగా కృష్ణ, అర్జున్‌లకు ఒకే రకమైన సమస్య ఏర్పడుతుంది. అదేం సమస్య? ఆ సమస్యలోంచి ఎలా బయటపడ్డారు? వీరిద్దరి మధ్య యుద్ధమే కృష్ణార్జున యుద్ధమా? లేక వీరిద్దరూ కలిసి చేసే యుద్ధం కృష్ణార్జున యుద్ధమా? అనేది థియేటర్లో చూడాల్సిందే. నటీనటులు ఊళ్లో అల్లరి చిల్లరగా తిరిగే కృష్ణ పాత్రలో నాని ఇరగ్గొట్టేశాడు. చిత్తూరు యాసలో సహజంగా ఒదిగిపోయాడు. అక్కడి కట్టు, మాటతీరుతో మాస్ లుక్కులోకి మారిపోయాడు. నాని, రుక్సర్ మీర్ల లవ్ ట్రాక్ ఇదే వరకే ఎన్నో సినిమాల్లో చూసినట్టు అనిపించినా...నాని నటనతో కొత్త దనాన్ని తీసుకొచ్చాడు. రుక్సర్ మీర్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ఇక ఊర్లో నాని స్నేహితులతో నడిచిన కామెడీ ట్రాక్ కూడా బాగా పండింది. రాక్‌స్టార్ అర్జున్ పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌ను నాని మెయింటెన్ చేశాడు. తన స్నేహితుడు ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌కు సహాయం చేసేందుకు ఫ్రీగా ఒక షో చేసి పెట్టు అని అడగాడనికి వస్తే తనకేమాత్రం అలాంటి నచ్చవనీ తన పాత్ర గురించి ఓ హింట్ ఇస్తాడు. ఇలా రెండు పాత్రలకు తన నటనలో వైవిధ్యాన్ని చూపించాడు. అర్జున్ స్నేహితుడిగా బ్రహ్మాజీ కామెడి అదిరిపోయింది. అనుపమా పరమేశ్వరన్ పిన్ని పాత్రలో దేవదర్శిని , బ్రహ్మాజికి మధ్యలో వచ్చే కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. అనుపమా క్యూట్ లుక్స్‌తో, తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక మిగిలిన పాత్రల్లో నాగినీడు, ప్రభాస్ శీను, హరితేజ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. (సాక్షి రివ్యూస్) విశ్లేషణ ద్విపాత్రాభినయం, ప్రేమ కథ, కామెడీ ఈ ఫార్మూలా టాలీవుడ్లో తెలిసిందే. ఇదే తరహాలో వచ్చిన కథలూ హిట్టే. మళ్లీ అదే కాన్సెప్ట్‌తో సేఫ్ గేమ్ ఆడి మేర్లపాక గాంధీ సక్సెస్ సాధించాడనే చెప్పవచ్చు. తనకు కలిసి వచ్చిన కామెడీతోనే సినిమాను నడిపించాడు. కానీ గాంధీ అందించిన స్ర్కీన్ ప్లే మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఒకే సమయంలో కృష్ణ, అర్జున్‌ల ప్రేమకథను నడిపించడం బాగుంది. పంచ్ డైలాగ్‌లు బాగానే పేలాయి. ఇక ప్రేమకథలో విలన్లు ఉండాలి కదా అని ఊరికే పెద్ద పెద్ద విలన్లను పెట్టకుండా...విలన్ అనే కాన్సెప్ట్‌లో వారిని అంతం చేస్తూ...సమాజానికి సందేశమిచ్చేట్టుగా వారి కథను ముగించాడు. అంటే మొత్తంగా ఇది సందేశాత్మక చిత్రమూ కాదు. కొన్ని సన్నివేశాలతో మహిళల అక్రమ రవాణా వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తారో చూపించాడు. నాని సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి భారీ యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా సినిమా బాగా వచ్చింది. సత్య తన కత్తెరకు పదును పెట్టాడని తెలుస్తోంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే అనవసర సాంగ్ సినిమా మూడ్‌ను పక్కకు తప్పించేలా ఉంది. అది కూడా కాస్త చూసి ఉంటే ఇంకా బాగుండేది. కార్తీక్ అందించిన ఛాయాగ్రహణం సినిమాను అందంగా మలిచింది. చిత్తూరు అందాలను, ఫారెన్ లొకేషన్లను తెరపై బాగా చూపించాడు. ఊర్లో పాడే పాటలకు , రాక్‌స్టార్ పాడే పాటలకు రెండింటికి తగ్గట్టుగా హిప్ హాప్ తమిళ మంచి సంగీతాన్ని అందించాడు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నాని నటన హీరోయిన్ల నటన, అందం కామెడీ కథనం మైనస్ పాయింట్స్ సెకండాఫ్ కొత్తదనం లోపించడం ముగింపు : ఈ కృష్ణార్జున యుద్ధం లో నవ్వుల పువ్వులు వికసిస్తాయి. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ విడుదల
-
ఫస్ట్ డే ఫస్ట్ షో అంటున్న హీరోయిన్
సొంత సినిమా ప్రమోషన్లకు కూడా హాజరవ్వలేనంత బిజీగా ఉంటున్నారు కొందరు. అలాంటిది తన స్నేహితుడి సినిమా టీజర్‌పై స్పందిస్తూ సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూస్తానంటూ ట్వీట్ చేసింది. ఆడోళ్లు భలే కఠినాత్ములు అంటూ వచ్చిన కృష్ణార్జున యుద్ధం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నానితో రెండుసార్లు జతకట్టి హిట్‌పెయిర్‌గా నిలిచిన నివేదా థామస్ టీజర్‌పై ట్విటర్లో స్సందించింది. ‘ఈ టీజర్లో ఏదో ఉంది. నిన్ను చూసి గర్వపడుతున్నాను నాని. మొదటి రోజు మొదటి ఆటకు సినిమాను చూస్తా’ అని ట్వీట్ చేసింది. నాని, నివేధా జెంటిల్మెన్, నిన్ను కోరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో నానికి జోడిగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ జోడిగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Damn!! This teaser is something! 😀 Absolutely proud of you @NameisNani 😊 Good luck to the team.. FDFS guaranteed! https://t.co/VDqWFhwlHq — Nivetha Thomas (@i_nivethathomas) March 11, 2018 -
కృష్ణార్జున యుద్ధం టీజర్ విడుదల
-
‘ఆడోళ్లు భలే కఠినాత్ములనిరా’
యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన నాని తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా కృష్ణార్జున యుద్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మాస్ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్ లో ఉండే రాక్ స్టార్ల కనిపిస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది చిత్రయూనిట్. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. నాని మార్క్ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన టీజర్ ఆకట్టుకుంటోంది. -
నాని ‘ఐ వాన్న ఫ్లై’ సాంగ్ రిలీజ్
-
‘ఐ వాన్న ఫ్లై’ అంటున్న నాని
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ రోజున తన పుట్టిన రోజు జరపుకుంటున్నారు. నాని ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం.. హీరోగానే కాదు నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్న తరువాత నాని జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. అంతేకాదు నానితో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న, త్వరలో సినిమాలు చేయబోయే నిర్మాణ సంస్థలు కూడా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం చిత్రయూనిట్ పుట్టిన రోజు కానుకగా సినిమాలోని మరో పాటను రిలీజ్ చేసింది ఇప్పటికే ‘దారి చూడు’ పాటతో సంచలనం సృష్టించగా తాజాగా రెండు జంట నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. హిప్ హాప్ తమిళ సంగీత సారథ్యంలో రేవంత్, సంజిత్ హెగ్డే ఆలపించిన ఐ వాన్న ఫ్లై పాటకు శ్రీజో సాహిత్యమందించారు. -
కృష్ణార్జున యుద్ధం సాంగ్ లిరికల్ వీడియో
-
‘చిత్తూరు జిల్లా మొత్తం వినపడాల’
నాని సంక్రాంతి పండుగ మూడు రోజులు అభిమానుల కోసం మూడు కానుకలు ఇచ్చాడు. ఇప్పటికే తన తాజా చిత్రం కృష్ణర్జున యుద్ధం సినిమాకు సంబంధించిన రెండు లుక్స్ ను రిలీజ్ చేసిన నాని, మూడో రోజు ఓ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ పాటను పెంచల్ దాస్ స్వయంగా సాహిత్యం అందించి ఆలపించారు. పాట సాహిత్యన్ని బట్టి చూస్తే చిత్తూరు జిల్లాలో కమలపూడి అనే గ్రామం నేపథ్యంలో సినిమా కథ నడుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు జానపద బాణీలో సాగే ఈ పాట హీరో కోసం హీరోయిన్ ఇళ్లు వదిలి వచ్చిన సందర్భంలో చిత్రీకరించినట్టుగా అర్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో నాని సరసన అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మిర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ కానుంది. -
నాని చెప్పినట్లే చేసేశాడు
సాక్షి, సినిమా : హీరో నాని చెప్పినట్లుగా చేసేశాడు. కొత్త కృష్ణార్జున యుద్ధానికి సంబంధించి రెండో పాత్ర అర్జున్ లుక్కును సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. రాకింగ్ స్టార్ అవతారంలో నేచురల్ స్టార్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. భోగి సందర్భంగా ఊర మాస్ రోల్లో కృష్ణ పాత్ర లుక్కును విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించబోతున్నాడని పోస్టర్లను చూస్తే అర్థమైపోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 😊 Happy Sankranthi :))#ArjunFirstLook #KrishnarjunaYudham #KAY pic.twitter.com/ILY41MHqfm — Nani (@NameisNani) 15 January 2018 -
ఊరమాస్ కృష్ణుడు
సాక్షి, సినిమా : నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. భోగి పండుగ కానుకగా ఈ చిత్రంలోని కృష్ణుడు పాత్ర లుక్కును విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రిభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఊరమాస్ గెటప్‌లో ఉన్న హీరో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. గత చిత్రాల కంటే కాస్త భిన్నమైన పాత్రలోనే నాని నటించబోతున్నాడని పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలతో సక్సెస్‌లు అందుకున్న మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం చిత్రానికి దరకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, రుష్కర్ మీర్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. హిప్హాప్ తమీజ్(ధృవ ఫేమ్) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక సంక్రాంతి సందర్భంగా రేపు అర్జున్ పాత్ర లుక్కును విడుదల చేయబోతున్నారు. వేసవిలో కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికీ భోగి శుభాకాంక్షలు 😊 Happy Bhogi 🔥#KAY#KrishnarjunaYudham#KrishnaFirstLook pic.twitter.com/VHpmwde3l7 — Nani (@NameisNani) 14 January 2018 -
అభిమానుల కోసం నాని సంక్రాంతి కానుక
-
నాని సంక్రాంతి సర్ప్రైజ్
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ సంక్రాంతికి అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇటీవల ఎమ్సీఏ సినిమాలో మంచి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయమున్నా.. అభిమానుల కోసం ఇప్పుడే ఫస్ట్ లుక్ లతో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని వీడియో మేసేజ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు నాని. ముందుగా 14వ తేదిన భోగి రోజు కృష్ణ పాత్ర ఫస్ట్ లుక్‌ను, సంక్రాంతి రోజు అర్జున్ పాత్ర ఫస్ట్‌లుక్‌ను తరువాత కనుమ రోజు తొలి పాటు లిరికల్ వీడియోనూ రిలీజ్ చేయనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని..కృష్ణ, అర్జున్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
మార్చిలో నాని కొత్త సినిమా..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్న నాని.. త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న కృష్ణార్జున యుద్ధం ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు నాని. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి రెండో వారంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. -
ఏప్రిల్ 12 నుంచి ‘కృష్ణార్జున యుద్ధం’
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంసీఏ ప్రమోషన్ లో పాల్గొన్న నాని కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. తన తదుపరి చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుందని వెల్లడించాడు నాని. -
రెండు పాత్రల్లో మూడో సారి..!
నిన్నటితరం హీరోలు ద్విపాత్రభినయం చేసిన సందర్భాలు ఎక్కువే. అయితే ఈ జనరేషన్ హీరోలు మాత్రం అలాంటి పాత్రలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అయితే ఈ జనరేషన్లో కూడా ఒకరిద్దరు తారలు డ్యుయల్ రోల్లో అలరిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. వరుస సక్సెస్‌లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నాని ప్రయోగాలకు కూడా ముందే ఉంటున్నాడు. తొలిసారిగా జెండాపై కపిరాజు సినిమాలో డ్యుయల్ రోల్లో కనిపించాడు నాని. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్మన్ సినిమా కోసం మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే రిస్క్‌కు రెడీ అవుతున్నాడు నాని. త్వరలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. ఈ సినిమాలో మరోసారి డ్యుయల్ రోల్లో నటించేందుకు ఓకె చెప్పాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నిన్నుకోరి, ఎమ్సీఏ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నాని ఎక్స్‌ప్రెస్!
దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన రెండు సినిమాల టైటిల్స్‌లో ఎక్స్‌ప్రెస్ ఉంది. రిలీజైన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకోవడంలోనూ, మంచి కలెక్షన్స్ సాధించడంలోనూ రెండు సినిమాలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్పీడును చూపించాయి. కానీ, దర్శకుడిగా గాంధీ ప్రయాణంలో ఆ స్పీడు కనిపించదు. సినిమాకు, సినిమాకు మధ్య ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు. గతేడాది సంక్రాంతికి గాంధీ రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విడుదలైతే... ఇప్పుడు త్వరలో మూడో సినిమా కబురు బయటకు రానుంది. వరుస విజయాలతో ఎక్స్‌ప్రెస్ వేగంతో సినిమాలు చేస్తున్న నాని హీరోగా మేర్లపాక గాంధీ ఓ సినిమా తీయనున్నారని టాక్. ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుందట! నాని కామెడీ టైమింగ్, యాక్టింగ్, స్టోరీ సెలక్షన్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. కథలో కమర్షియల్ హంగులు మిస్ కాకుండా కామెడీతో కితకితలు పెట్టడం గాంధీ సై్టల్. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సూపర్ స్టోరీ కమ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు!! -
చెర్రీ నెక్ట్స్ మూవీ మెగా ఎక్స్‌ప్రెస్..?
ప్రస్తుతం ధృవ షూటింగ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 నిర్మాణ పనులతో బిజీగా ఉన్న చరణ్, తన నెక్ట్స్ సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే సుకుమార్, మేర్లపాక గాంధీల దర్శకత్వంలో సినిమాలు అంగీకరించిన మెగా పవర్ స్టార్, ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ధృవ పూర్తయిన నెల రోజులు తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాడు చరణ్. కేవలం మేకోవర్ కోసం ఈ గ్యాప్ తీసుకోనున్న చరణ్, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా వెంటనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు గాంధీ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మెగా ఎక్స్‌ప్రెస్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. గతంలో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు మంచి విజయం సాధించాయి. అందకే చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కూడా ఎక్స్‌ప్రెస్ అనే పదం వచ్చేలా మెగా ఎక్స్‌ప్రెస్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి గాంధీ సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. -
సంక్రాంతి సక్సెస్ ఈ నలుగురిదీ!
స్టార్ టాక్ దర్శకులు సుకుమార్, శ్రీవాస్, మేర్లపాక గాంధీ, కల్యాణ్‌కృష్ణ - నలుగురూ ఇప్పుడు హాట్ టాపిక్. వీళ్ళ నలుగురి సినిమాలూ ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగిన సినిమా పందెంకోళ్ళు. వివిధ హీరోల అభిమానులు, పరిశ్రమలోని వర్గాలు కత్తులు నూరుకుంటున్న టైమ్‌లో ఈ నలుగురు దర్శకులనూ ‘సాక్షి ఫ్యామిలీ’ ఒకే దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళతో ముచ్చటించింది. తీసిన సినిమాలు, నటించిన హీరోలు వేరైనా, పరిశ్రమలో అందరూ ఒకటేనని నిరూపించింది. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తులైన నలుగురు దర్శకులతో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ డబుల్ ‘డబుల్ ధమాకా’ ఇది... మీ నలుగురు దర్శకులకూ ఒకరికొకరు పరిచయమేనా? లేక ఇప్పుడే కలిశారా? శ్రీవాస్ - నాకు సుక్కు (సుకుమార్) బాగా తెలుసు. సంక్రాంతికి వచ్చిన మా ‘డిక్టేటర్’, సుక్కు ‘నాన్నకు ప్రేమతో’ పనులు ప్రసాద్ ల్యాబ్స్‌లో పక్కపక్కనే జరిగాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మేర్లపాక గాంధీ, ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో దర్శకుడైన యువకుడు కల్యాణ్‌కృష్ణ గురించి విన్నాను. గాంధీ - నేను, సుకుమార్ గారు యాక్టర్ బ్రహ్మాజీ గారింట్లో ఒకసారి కలిశాం. సుకుమార్- నాకు శ్రీవాస్ గారు బాగా తెలుసు. ఇక, మా కాకినాడ అబ్బాయి కల్యాణ్‌కృష్ణను బన్నీ పార్టీలో కలిశా. ఇక, గాంధీ వాళ్ళ నాన్న గారు మేర్లపాక మురళి నవలా రచయిత కదా! ఆయన సాహిత్యంతో పరిచయముంది. మీ నలుగురిలో గాంధీ (చిత్తూరు జిల్లా) మినహా మిగిలిన ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా వాసులే? శ్రీవాస్ - అవును. మేమూ ముందు గమనించలేదు. ఇందాకే ఎవరో ఈ మాట అన్నారు. మా గోదావరి జిల్లాల్లో ఉండే ఆప్యాయతలు, వెటకారాలు అన్నీ మాలో ఉన్నాయి. ఇంకో మాటేమిటంటే, మీ నలుగురూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవాళ్ళు. పల్లె సంస్కృతికి ప్రతిబింబమైన సంక్రాంతికే మీ నలుగురి సినిమాలూ రావడం... శ్రీవాస్ - యాదృచ్ఛికమే అయినా ఆనందంగా ఉంది. సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? శ్రీవాస్ - మా ఊరు సీతానగరంలో రామదుర్గా పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా హాలుండేది. సంక్రాంతి అనగానే... సినిమాలు, హాలులో జనం కొట్టే విజిల్స్ గుర్తొస్తాయి. బాలయ్య లాంటి మాస్ హీరో దొరకడంతో, అనుకోకుండా సరిగ్గా అలాంటి సినిమానే తీశా. సుకుమార్ - ఆ... ఇదీ కారణం! (నవ్వులు...) గాంధీ - మాది తిరుపతి దగ్గర రేణిగుంట. నాకు కూడా సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి సినిమాలే. ఫ్రెండ్స్‌తో కలసి రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళి, అక్కడ సినిమాలు చూసేవాళ్ళం. ‘నరసింహనాయుడు’ లాంటి సినిమాలు సంక్రాంతికి చూసి, ఎంజాయ్ చేసిన రోజులు మామూలువి కావు. సుకుమార్ గారూ! మరి, మీరు చెప్పండి? సుకుమార్ - ముందుగా తమ్ముడు కల్యాణ్‌కృష్ణ చెబుతాడు. కల్యాణ్‌కృష్ణ - మా అమ్మమ్మ గారిదీ, నాయనమ్మ గారిదీ పల్లెటూరే. అందుకే, సంక్రాంతి అంటే - అందరం కలవడం, ఆనందంగా గడపడం అలవాటు. బేసిక్‌గా నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టం. మా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా అలాగే వచ్చింది. అందరి మూలాలూ గ్రామాల నుంచే మొదలవుతాయి. అందుకే, మా సినిమా ఎక్కువగా కనెక్ట్ అయింది. సుకుమార్ - (సరదాగా... బుంగమూతి పెడుతూ...) మా సినిమాలు కూడా కనెక్టయ్యాయండీ... (నవ్వులు...) శ్రీవాస్ - (నవ్వేస్తూ...) {పతిసారి లాగా కాకుండా ఈసారి విశేషం ఏమిటంటే, సంక్రాంతి సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. ఈసారి ‘డిక్టేటర్’ ఫుల్ మాస్... ‘నాన్నకు ప్రేమతో క్లాస్ నిండిన మాస్... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్యామిలీస్... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమాలపరంగా ఈ మధ్య ఇంత విభిన్నమైన సంక్రాంతి మరొకటి రాలేదేమో! శ్రీవాస్ - మేమందరం కలసి ఒక మాట చెబుతాం. (మిగిలినవాళ్ళ వైపు తిరిగి...) మీరు కూడా ఓటేయాలి. ఇలా వివిధ రకాలైన సినిమాలు ఒకే సీజన్లో రావడం ప్రేక్షకుల అదృష్టం. మా దురదృష్టం. ఎందుకంటే, సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాకు రూ. 150 కోట్లు వసూలవుతాయనుకుంటే, అదే మొత్తాన్ని నాలుగు సినిమాలూ పంచుకోవాల్సి వచ్చింది. నాలుగు సినిమాలొచ్చాయి కదా అని ఎక్స్ట్రా ఎమౌంట్ ఎక్కడ నుంచీ రాదు కదా! సినిమాల కోసం ఎంత ఖర్చు చేయాలని జనం ప్రిపేర్ అయ్యారో, అంతే ఖర్చు చేస్తారు. రెండు సినిమాలు రిలీజైతే, ఇదే మొత్తం ఆ రెండిటికీ వచ్చేది. సుకుమార్ - కానీ, నాలుగు రిలీజైతే నాలుగూ సక్సెస్ అనిపించుకోవడం విశేషం. నిజంగానే ఆనందించాల్సిన విషయం. ఎక్కువ మందిని సినిమా హాలులోకి ఆకర్షించాం. శ్రీవాస్ - ఒక్కోసారి రాజకీయాల లాంటివి ఎక్కువుంటాయి. వాటన్నిటి నుంచి పక్కకు తెచ్చి, సినిమా హాలులో కూర్చోబెట్టాం. సుకుమార్ - (ఛలోక్తిగా...) జనమంతా సినిమాల హడావిడిలో మునిగిపోయి, హాళ్ళలో ఉండిపోవడం వల్ల బయట క్రైమ్ రేటు బాగా తగ్గింది. అందుకు, పోలీసులతో సహా అందరూ మా సినిమా వాళ్ళను అభినందించాలి. (నవ్వులు...) శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు తీసేవాళ్ళూ అవసరం. ఇలా డిఫరెంట్ జానర్స్‌లో తీసేవాళ్ళుంటేనే, ప్రేక్షకులకూ బాగుంటుంది. ఇండస్ట్రీకీ బాగుంటుంది. అన్ని ఒకటే రకంగా ఉంటే చూడలేరు, చూడరు. కల్యాణ్‌కృష్ణ - అవును. అందరం అన్నీ చేయాలి. శ్రీవాస్ - గాంధీని కేవలం ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడనీ, కల్యాణ్‌కృష్ణను ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనీ అనుకోనక్కర లేదు. కల్యాణ్ లైఫ్ అంతా ఇంతా ఇలాంటి సినిమాలే చేస్తూ కూర్చోరు కదా! రేపు అఖిల్‌తో ఒక క్యూట్ లవ్‌స్టోరీ చేయాల్సి వస్తే, చేస్తారు. అలాగే, గాంధీ ఒక మాస్ తరహా చిత్రం చేయాల్సి వస్తే చేస్తారు. నన్నడిగితే, అసలు డెరైక్టర్స్ ఎప్పుడూ ఒకే రకం సినిమాలు తీయాలని అనుకోరు. నా సంగతే చూస్తే, ‘లౌక్యం’ మంచి హిలేరియస్ కామెడీ ఉండే సినిమా. ఆ వెంటనే బాలయ్యబాబుతో సినిమా అనగానే ‘డిక్టేటర్’ లాంటి మాస్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్ చేశాను కదా! సుకుమార్ - అవును. నేను ‘లౌక్యం’ చూశాను. చాలా క్లాస్‌గా ఉంటుంది. మేకింగ్ కూడా బాగుంటుంది. గమనిస్తే మీ నలుగురు దర్శకులకూ రచనా నేపథ్యం ఉంది. సుకుమార్, కల్యాణ్కృష్ణలైతే... మొదలైందే రచయితలుగా! దాని వల్ల సినిమాకు ఎంత ఉపయోగపడింది? శ్రీవాస్ - రైటరే దర్శకుడు కావడం వల్ల ఉపయోగమే. ఉదాహరణకు దాసరి గారు. ఇక, మా గురువు గారు కె. రాఘవేంద్రరావు రైటర్ కాకపోయినా, కథను అల్లుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. పెద్ద ఎన్టీయార్‌తో ‘అడవిరాముడు’ గురించి ఆయన చెబితే ఆశ్చర్యపోయా. ఎన్టీయార్ అప్పటి దాకా చేయని నేపథ్యంలో సినిమా అయితే బాగుంటుందని అటవీ నేపథ్యం ఎంచుకున్నారు. దానికి తగ్గట్లే హీరోను ఫారెస్ట్ ఆఫీసర్‌ను చేశారు. కానీ, ఆయన ఫలానా అని ముందే అది చెప్పేస్తే, డ్యూయెట్లకి కుదరదు కాబట్టి, ఆ సంగతి ఇంటర్వెల్‌కి చెబుదామనుకున్నారు. ఒక రైటర్ కాకపోయినా, కమర్షియల్ దర్శకుడు ఎలా ఆలోచించి, కథ అల్లుకోవాలో చెప్పడానికి అంతకు మించి ఇంక ఉదాహరణేం కావాలి! కానీ, ఈ మధ్య దర్శక - రచయితలు కూడా ఇతరుల స్క్రిప్ట్‌ల మీద ఆధారపడడం కూడా జరుగుతోంది! మరి, మీ రైటింగ్ స్కిల్స్ వృథా అవుతున్నట్లేగా? శ్రీవాస్ - అలా కాదు. గతంలో ‘లక్ష్యం’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలకు నేనే కథలు రాసుకున్నా. కానీ, మనమే కథ రాసుకొని, స్క్రిప్ట్ చేసుకోవాలంటే దానికి ఆరు నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. ఒక సినిమా అయిపోయిన వెంటనే, దాని మీద వచ్చిన విమర్శలు, రివ్యూల్లో పేర్కొన్న తప్పొప్పుల్ని అర్థం చేసుకొని, మళ్ళీ అవి జరగకుండా ఉండేలా కొత్త సినిమా స్క్రిప్ట్‌కి కూర్చోవాలి. ఇలా కొత్త సినిమా ఏమిటనేది - ఆలోచించుకోవడానికే 4 నెలల టైమ్ పడుతుంది. ఒక లైన్ అనుకొని, ఏ హీరో దగ్గరకు వెళ్ళినా, అప్పటికే అతను కనీసం రెండు సినిమాలు చేస్తూ ఉండి ఉంటాడు. దాంతో, మళ్ళీ వెయిటింగ్. అందుకే, దర్శకులైన మేము ఎక్కువగా బయటివారి కథలు తీసుకొని, సినిమాకు తగ్గట్లు తీర్చిదిద్దుకుంటాం. కానీ, బయటివాళ్ళ కథను జడ్జ్ చేయడానికి కూడా దర్శకుడికి రైటింగ్ స్కిల్స్ కావాల్సిందే. అది తప్పనిసరి. సుకుమార్ - ఇది కరెక్ట్. శ్రీవాస్ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. నన్నడిగితే - దర్శకుడిగా మమ్మల్ని పెట్టుకొనేది మా క్రియేషన్కి కాదు... మా జడ్జిమెంట్‌కి! ఫలానా కథ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది జడ్జ్ చేయడాన్ని బట్టి మా సక్సెస్ ఉంటుంది. ఎవరైతే, కథను సరిగ్గా జడ్జ్ చేయగలుగుతారో వాళ్ళకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ఫుల్ డెరైక్టర్ అవుతారు.గాంధీ గారూ! సంక్రాంతి బరిలో హేమాహేమీలైన ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల మధ్య వస్తున్నప్పుడు దేన్ని నమ్మి, ధైర్యం చేశారు? మేర్లపాక గాంధీ - కంటెంట్‌ను నమ్ముకున్నా. వినోదంతో సాగే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కథతో అందరూ కనెక్ట్ అవుతారనుకున్నాను. అనుకున్నట్లుగానే ఇవాళ చాలామంది కనెక్ట్ అయినట్లు బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయింది. కల్యాణ్‌కృష్ణ గారూ! మొదటి మూడు సినిమాలూ రిలీజైపోయాక, ఆఖరున జనవరి 15న మీ ‘సోగ్గాడి చిన్ని నాయనా’ వస్తుంటే, మీరు ఏమైనా టెన్షన్ ఫీలయ్యారా? సినిమా రిజల్ట్ ఎప్పుడు తెలిసింది? కల్యాణ్‌కృష్ణ - రిలీజ్‌కు ముందు నుంచి గట్టి నమ్మకం ఉంది. నాగార్జున గారు తన ఫ్రెండ్స్‌కీ, మరికొందరికీ షో వేశారు. చూసినవాళ్ళ రెస్పాన్స్ చూశాక, ‘తప్పు జరగదు’ అనే నమ్మకం మాకుంది. అయితే ఎంతైనా, సినిమా రిలీజ్‌కు ముందు రోజు చిన్నపాటి టెన్షనైతే ఉంది. ఇక్కడ రిలీజ్ కన్నా కొద్ది గంటల ముందే మన అర్ధరాత్రి టైమ్‌కే లండన్ లాంటి చోట్ల షోలు పడతాయి. అక్కడ నుంచే ఫస్ట్ హిట్ టాక్ వచ్చింది. ఇక్కడ కూడా షో పడ్డాక రెస్పాన్స్‌తో రిజల్ట్ తెలిసిపోయింది. శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇక్కడ రిలీజ్ రోజున పొద్దున్న మనం నిద్ర లేచే టైమ్‌కే ఓవర్సీస్ నుంచి సినిమా టాక్ వచ్చేస్తుంది. ఫోనుల్లో మెసేజ్‌లు, కాల్స్ వచ్చేస్తాయి. సుకుమార్ - అందుకే మేము లేట్‌గా నిద్ర లేస్తుంటాం (నవ్వులు...). ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకైతే రిలీజ్‌కు ముందు దాదాపు 500 గంటలు కంటిన్యుయస్‌గా పనిచేశా. అరగంట నిద్రపోవాలంటే, పెద్ద డిస్కషనే! మధ్య మధ్యలో 10 నిమిషాలు చిన్న కునుకు తీయడమే తప్ప, కంటి నిండా నిద్ర కూడా లేదు. రిలీజ్ ముందు రోజు రాత్రి కూడా ప్రింట్స్, కరెక్షన్స్ - అవన్నీ చూసుకోవడమే సరిపోయింది. వర్క్ అంతా పూర్తయ్యాక ఎప్పుడు పడుకున్నానో, నిద్ర లేచానో నాకే తెలీదు. తీరా నిద్ర లేచే సరికి ‘ఇవాళే సినిమా రిలీజ్ కదా’ అని గుర్తొచ్చింది. ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలీదు కానీ, మెమరీ 20 మిస్డ్ కాల్స్‌కే కాబట్టి, అవి నోట్ అయి ఉన్నాయంతే! అన్ని ఫోన్లు వచ్చాయంటే, సినిమా సక్సెస్ అన్న మాట అని అర్థమైంది. శ్రీవాస్ - రిలీజ్ రోజున మన ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటే సినిమా హిట్. మోగకపోతే, ఫట్ అన్న మాట. సుకుమార్ - ఫోన్ మోగలేదంటే, పొరపాటున సెలైంట్ మోడ్‌లో పెట్టేశామేమోనని ఒకటికి, రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిందే. (నవ్వులు...) శ్రీవాస్ - ‘డిక్టేటర్’ సినిమా విషయానికొస్తే - సహ నిర్మాతగా, దర్శకుడిగా నాది డబుల్ వర్క్. అయితే, టెన్షన్ పడలేదు. సర్వసాధారణంగా సినిమావాళ్ళందరికీ రిలీజ్ ముందు రోజున బయ్యర్లు సినిమా కొనడానికి కమిటైన డబ్బులో ఎంత తగ్గించి తెస్తారో అని టెన్షన్. ‘డిక్టేటర్’ విషయానికి వస్తే - డిస్ట్రిబ్యూటర్లుఒక వారం ముందే వచ్చి, ‘నాన్నకు ప్రేమతో’ సహా మరికొన్ని సినిమాలు కూడా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి, డబ్బు అనుకున్నంత సమకూరడం లేదని చెప్పారు. వాళ్ళ ఇబ్బందులు కూడా గ్రహించి, ఈరోస్ వాళ్ళతో, బాలకృష్ణ గారితో మాట్లాడాం. ముందుగా వాళ్ళు ‘డిక్టేటర్’ కొనడానికి కమిటైన డబ్బులో నుంచి 15 శాతం డిస్కౌంట్ ఇచ్చాం. దాంతో, మాకు జరగాల్సిన వ్యాపారంలో కొన్ని కోట్లు తగ్గినా, సినిమా పరిశ్రమలో అందరి క్షేమం కోసం చూశాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా మిగిలినదంతా మిస్ కాకుండా కట్టారు. పరిశ్రమ క్షేమం దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ చర్యతో బాలకృష్ణ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అనుకున్నట్లుగానే, రిలీజవగానే ‘డిక్టేటర్’ హిట్ అయింది. కానీ, సినిమా రిలీజ్ రోజున సరైన టాక్ తెలుస్తుందంటారా? శ్రీవాస్ - ఏ హీరో అభిమానులైనా తమ హీరో సినిమా రిలీజ్ రోజునే చూసేస్తారు. ఫ్యాన్స్ డెఫినెట్‌గా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. పైగా, బాలయ్యబాబు లాంటి మాస్ హీరోతో చేసే సినిమా అంటే పెద్ద ఎడ్వాంటేజ్. ఫ్యాన్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ, ముందుగా ఆనందంతో అరిచేస్తారు. ఒక్కోసారి మన సినిమా నిజంగా ఇంత హిట్టయిందా అనిపిస్తుంది. అందుకే, ఎవరమైనా సరే - ఫస్ట్ డే టాక్ నిజమా, కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాం. మాకు డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు కాబట్టి, వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటాం. వాళ్ళు అబద్ధం చెప్పరు. అందుకని రెండోరోజు నుంచి నిజాలు తెలిసిపోతాయి. నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే, మాటల్లో బుకాయించగలమే కానీ, డిస్ట్రిబ్యూటర్లు చూపించే అంకెలను కాదనలేం కదా! సుకుమార్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవును... అది నిజం. ఇంతకీ, మీ నలుగురికీ మిగతా ముగ్గురు దర్శకుల సినిమాల్లో, సినిమా మేకింగ్‌లో నచ్చిందేమిటి? శ్రీవాస్ - సుక్కుది చాలా డిఫరెంట్ స్టైల్. రెగ్యులర్ ఫార్మట్‌లో కాకుండా కొత్తగా తీస్తాడు. ఆ సీన్ చూసేవాళ్ళకూ, చూసేవాళ్ళకూ కొత్తదనం అనిపిస్తుంది. ‘ఆర్య’ సినిమా అలాంటి డిఫరెంట్ స్టైల్‌కు ఒక ఉదాహరణ. ఇక, మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చూశాను. అతని ఎంటర్టైన్మెంట్ టైమింగ్ బాగుంటుంది. కల్యాణ్‌కృష్ణ మా తూ.గో. జిల్లా వాడేగా! మా సహజమైన గోదావరి శైలిలో సినిమా తీస్తాడు. ‘సోగ్గాడే...’ బాగుందని విన్నా. కల్యాణ్‌కృష్ణ - సుకుమార్ గారిలో నాకు నచ్చేది ఏమిటంటే - ‘ఆర్య’లోని వన్‌సైడ్ లవ్ మొదలు ఏది చెప్పినా, తనదైన లాజిక్‌తో కన్విన్స్ చేస్తారు. శ్రీవాస్ గారి ‘లక్ష్యం’ నుంచి అన్ని సినిమాలూ చూస్తూ వచ్చా. ఎమోషన్ని ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక, గాంధీ గారి కామెడీ టైమింగ్ నాకు బాగుంటుంది. మేర్లపాక గాంధీ - నాకు శ్రీవాస్ గారి సినిమాల్లో అటు ఎంటర్టైన్మెంట్, ఇటు ఎమోషన్ - రెండూ డీల్ చేయడం బాగుంటుంది. సుకుమార్ గారు మంచి క్రియేటివ్ డెరైక్టర్. సుకుమార్ - శ్రీవాస్ సినిమాల గురించి ఇందాకే చెప్పేశాను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ నాకు నచ్చింది. కల్యాణ్‌కృష్ణకు ఇది తొలి సినిమానే కాబట్టి, ఇంకా బాగా వృద్ధిలోకి వస్తాడు. ఇతర దర్శకుల సినిమాలు చూసినప్పుడు అలా మనమూ తీయాలన్నంత అనిపించిన సందర్భాలు? కల్యాణ్‌కృష్ణ - కొన్ని సీన్స్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది. శ్రీవాస్ గారు తీసిన ‘లక్ష్యం’లో హీరో అన్న క్యారెక్టర్ జగపతిబాబును చూసినప్పుడూ, ‘ఆర్య’లో తాజ్‌మహల్ గురించి చెప్పే సీన్ లాంటివి చాలా ఇష్టం. గాంధీ - ఏ సినిమా చూసినా, ఫలానాది చాలా బాగుంది అనుకొనే సందర్భాలు చాలా ఉన్నాయి. సుకుమార్, శ్రీవాస్ గార్ల సినిమాలూ అంతే! కానీ, నాకు తెలిసింది, నేను చేయగలిగినదే చేద్దామని ఫిక్సయ్యా. కానీ, పక్కవాళ్ళ సినిమా చూసినప్పుడు ఇలాంటిది మనం తీయలేకపోయామనో, మన సినిమాయే బాగా ఆడాలనో జెలసీ ఉండదా? సుకుమార్ - సెకన్లో వెయ్యోవంతు ఒక చిన్నపాటి జెలసీ ఫీలింగ్ రావడం మానవ సహజం. క్రియేటివ్ ఫీల్డ్‌లో మరీ! (నవ్వులు...). కానీ, వెంటనే దాన్ని పాజిటివ్‌గా, ఆనందంగా మార్చుకోవాలి. మారుతుంది. శ్రీవాస్ - చాలామందికి తెలియనిదేమిటంటే, సినిమా పరిశ్రమలో నడిచేది ఒక చైన్ రియాక్షన్. మన ముందు సినిమాలు ఆడకూడదనుకొంటే, అక్కడ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ దగ్గర మన సినిమా కొనడానికి డబ్బులెక్కడ ఉంటాయి? కాబట్టి, ఆ ఎఫెక్ట్ మన సినిమా మీద పడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరి సినిమా ఆడాలి. ఫిల్మ్‌నగర్‌లో కూర్చొని, మన హీరో, మన సినిమా ఒక్కటే గొప్ప.. మనదొక్కటే ఆడితే చాలు. అవతలివాడి సినిమా బాగోలేదు... పోవాలి అనుకుంటే, తప్పు. సుకుమార్ - అవును. ఇది చాలా మంచి లాజిక్. ప్రాక్టికల్ కూడా! శ్రీవాస్ -నిజానికి, సినిమా బిజినెస్ అనేది గుడ్డిగా ఆడే ఒక ఆట. ఇటీజ్ ఎ ఫేక్ గేమ్. ఒక పేకాట లాగా ఉంటుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో చెప్పలేం. సుకుమార్ - ఇవాళ సంక్రాంతి రిలీజ్లు నాలుగూ సినిమాలూ ఆడుతున్నాయీ అంటే, థ్యాంక్స్ టు ‘బాహుబలి’. ఆ సినిమా కొన్నేళ్ళుగా బయటకు రాని జనాన్ని ఇళ్ళల్లో నుంచి సినిమా హాలుకి మళ్ళీ రప్పించడం మొదలుపెట్టింది. గాంధీ - ఇవాళ నిజంగానే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. శ్రీవాస్ - సినిమాలు చూసి 15 - 20 ఏళ్ళయిన అత్తయ్యలు, మామయ్యలు కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్ల వైపు వస్తున్నారు. సినిమా బాగుందని వింటే, వచ్చి చూస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ - అందుకే, ఈసారి కలెక్షన్స్ కూడా బాగున్నాయి. శ్రీవాస్ - ఏమైనా, పక్కవాడి సినిమా ఫెయిలవ్వాలి, మనం పాసవ్వాలి అనుకుంటే, వాడికి 34 మార్కులొస్తాయి. మనకు 35 మార్కులొస్తాయి. పక్కవాడికి 99 మార్కులు రావాలి, మనం అంతకన్నా ఇంకొద్దిగా బాగుండాలి అనుకుంటే, మనకు 100 మార్కులొస్తాయి. అప్పుడే అందరం బాగుంటాం. సుకుమార్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవును. బ్రహ్మాండంగా చెప్పారు. మీ మీద ప్రభావం చూపిన సినిమాలు, దర్శకులంటే? శ్రీవాస్ - నా మీద కె. రాఘవేంద్రరావు గారి ప్రభావం చాలా ఉంది. ఆయన లాగా అన్ని రకాల కోవల సినిమాలూ ట్రై చేయాలి, ఎలాంటివైనా చేయగలడనిపించుకోవాలని కోరిక. ప్రభావం చూపిన సినిమాలంటే, తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు బాగా ఇష్టం. హిందీలో ‘లగాన్’. సుకుమార్ - {పత్యేకించి కొన్ని సినిమాలని చెప్పడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు చూస్తూ ఉండేసరికి, రోజుకో సినిమా ఇష్టమై, ప్రభావం మారిపోతుంటుంది. అయితే, బేసిగ్గా రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ, మణిరత్నం అంటే నాకు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా, వర్మ గారి సినిమాలంటే! నేను టీచింగ్ వదిలేసి, దర్శకత్వం వైపు వచ్చేయాలని నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా మణిరత్నం ‘గీతాంజలి’. కల్యాణ్‌కృష్ణ - ‘సీతారామయ్య గారి మనవరాలు’ నుంచి ‘నరసింహనాయుడు’ దాకా చాలా సినిమాలు ఇష్టం. సహజంగానే వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. దర్శకుల్లో నాకు కృష్ణవంశీ గారు బాగా ఇష్టం. మేర్లపాక గాంధీ - నాకు జంధ్యాల గారు ఇష్టం. ఆయన అన్ని సినిమాలూ చూశా. బేసిక్‌గా ఆయన పాత్రల క్యారెక్టరైజేషన్ నాకు ఇష్టం. సంక్రాంతి అంటే ఆడవాళ్ళ ముగ్గులు, గొబ్బెమ్మలు, అలంకారాలు, పిండివంటలు - అన్నీ! కానీ, సినిమాలకొచ్చేసరికి ఎంతసేపటికీ, హీరోల సినిమాలేనా? హీరోయిన్ల సినిమాలతో సంక్రాంతి సీజన్ చేయొచ్చుగా? శ్రీవాస్ - (నవ్వేస్తూ...) హీరోలందరూ ఒక ఏడాది సెలవు తీసేసుకుంటే, అప్పుడు హీరోయిన్ల సినిమాలే చేయొచ్చు. సుకుమార్ - మాకైతే, జెండర్ తేడా లేదు. ఆడా, మగా ఒకటే! (నవ్వులు...). గతంలో విజయశాంతి గారి లాంటివాళ్ళకు ప్రత్యేక మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఎందుకనో చాలా కారణాల వల్ల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అన్ని రావడం లేదు. అలాంటి సినిమాలతో సంక్రాంతి వస్తే... అదో వెరైటీ. ఇంతకీ మీరు మీ సినిమాలు కాకుండా, సంక్రాంతికొచ్చిన ఇతర రిలీజ్లు చూశారా? శ్రీవాస్ - అసలు మీరు మా సినిమాలన్నీ చూశారా? సుకుమార్ - అవునవును. చూశారా? ‘సాక్షి’ - (నవ్వుతూ...) చూడకుండా ఎలా ఉంటాం! చూశాం. రివ్యూలు రాశాం. ఇంటర్వ్యూలు చేశాం, చేస్తున్నాం. శ్రీవాస్ - (నవ్వేస్తూ...) కానీ, చాలామంది చూడకుండానే, ట్రైలర్లు చూసేసి, ‘హీరో స్టైల్ బాగుంది’ లాంటి మాటలతో మసిపూసి మారేడుకాయచేసి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంటారు. కానీ, నా మటుకు నేను సంక్రాంతి రిలీజ్‌లన్నీ ఇంకా చూడలేదు. ఎక్కడండీ! ఇప్పటి దాకా మా సినిమాల పనులు, రిలీజ్ హంగామా, ఇప్పుడేమో ప్రమోషన్ హడావిడిలో ఉన్నాం. కొద్దిగా తీరిక దొరికిన తరువాత ఇప్పుడిక వెళ్ళాలి. సుకుమార్, మేర్లపాక గాంధీ, కల్యాణ్‌కృష్ణ - మా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. శ్రీవాస్, సుకుమార్- ఇప్పుడిక ఫ్యామిలీలు తీసుకొని, మిగిలిన సినిమాలకు కూడా వెళతాం. మేర్లపాక గాంధీ - నేను మా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజ్ ముందు రోజు బాగా టెన్షన్ పడ్డా. మా కన్నా ఒక రోజు ముందే జనవరి 13న ‘నాన్నకు ప్రేమతో’ వచ్చేసింది. పైగా, నేను సుకుమార్ గారి ఫ్యాన్‌ని. ఆ మధ్య ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ‘నాన్నకు ప్రేమతో’కి వెళుతూ, నన్ను రమ్మన్నారు. ‘నేను రానురా బాబూ! ఈ టెన్షన్లో సుకుమార్ గారి సినిమా చూశానంటే, నాకిక నా సినిమా నచ్చదు. నా సినిమా రిలీజయ్యాక, కొంచెం ఆగి చూస్తాను’ అని చెప్పాను. ఇప్పటి వరకూ చూడడం కుదరలేదు. ఇప్పుడు వెళతాను. సుకుమార్ - అవును. ‘కుమారి 21 ఎఫ్’ బాగుందని గాంధీ నాకు చాలా మంచి ఎస్.ఎం.ఎస్. పెట్టాడు. శ్రీవాస్ - మేము ఇతర సంక్రాంతి రిలీజ్లు చూడలేదన్న మాటే కానీ, చూసినదాని కన్నా చాలా ఎక్కువే విన్నాం. (నవ్వులు...) ఇంతకీ ఈ సంక్రాంతి మీకు ఏమిచ్చింది? శ్రీవాస్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ, సుకుమార్ - (నలుగురూ ఒక్కసారిగా...) సక్సెస్ ఇచ్చింది. సుకుమార్ - మీకు మాత్రం మా నలుగురి నుంచి మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది (నవ్వులు...) ఇంతకీ, ఫైనల్లీ ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో... ‘...అండ్ ది అవార్డ్ గోస్ టు...’? శ్రీవాస్ - (వెంటనే అందుకుంటూ...) ఆడియన్స్! అన్ని సినిమాలనూ ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ టేస్ట్‌ను బట్టి, నాలుగు కోవల సినిమాలనూ ఆదరించారు. పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికి ఇంతకన్నా ఏం కావాలి! సుకుమార్ - ఈ మాట నిజం. శ్రీవాస్ చెప్పినదానికే మా ఓటు (నవ్వులు...). గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవునవును. నిజం. చివరిగా మీ నలుగురూ కలసి ఒక్కొక్కరూ ఒక్కో భాగం చొప్పున గొలుసుకట్టుగా ఒక సినిమా స్టోరీ ఇప్పటికిప్పుడు అల్లేసి, మా ‘సాక్షి’ పాఠకుల కోసం చెబుతారా? శ్రీవాస్ - (నవ్వేస్తూ...) ఏదో ఎందుకు... ఇదే చెబుతాం... కల్యాణ్ నువ్వు స్టార్ట్ చెయ్యి! ‘సాక్షి ఇంటర్వ్యూకు వచ్చాం’ అని చెప్పు. (కల్యాణ్ నవ్వుతూ... అలాగే చెప్పారు). సుక్కు గారూ! మీరేమో... సుకుమార్ - భలే ఇంటర్వ్యూ మొదలైంది... మధ్యలో రెండు టీలు తాగాం... (నవ్వులు...) శ్రీవాస్ - పత్రికల్లో రివ్యూల ఫక్కీలో చెప్పాలంటే... మధ్యలో కాస్తంత నిదానించినా, మంచి ఇంటర్వ్యూలో భాగమై, హ్యాపీగా ఫీలయ్యాం. గాంధీ గారూ! క్లైమాక్స్ మీదే! గాంధీ - వదిలేస్తే... ఇంటికి వెళ్ళిపోతాం. (నవ్వులు... నలుగురూ దర్శకులూ ఆత్మీయంగా కౌగిలించుకుంటూ, సెల్ఫీ దిగారు). - రెంటాల జయదేవ -
గాంధీతో సినిమా చేస్తాడట..?
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన గాంధీ, ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా' సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో పోటి పడి కూడా మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా మేర్లపాక గాంధీతో సినిమాకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఈ లిస్ట్‌లో అందరి కంటే ముందున్నాడు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాపై పాజిటివ్‌గా స్పందించిన చెర్రీ, మంచి కథ రెడీ చేస్తే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం తనీ ఒరువన్ రీమేక్‌గా రూపొందనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఆ సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు. మరి గాంధీ మూడో సినిమా చరణ్‌తోనే ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
'ఎక్స్‌ప్రెస్ రాజా' కథ ఇదేనా..?
భారీ సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా తమ సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారు చిన్న సినిమా నిర్మాతలు. అలాంటిది మూడు భారీ చిత్రాలు బరిలో ఉన్నా.. అదే సమయంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు 'ఎక్స్‌ప్రెస్ రాజా'. శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది. అంత ధైర్యంగా సినిమా రిలీజ్ చేయడానికి ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలో ఏముందన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే ఇదే ఎక్స్‌ప్రెస్ రాజా కథ అంటూ ఓ లైన్ ప్రచారంలోకి వచ్చింది. ఎక్స్‌ప్రెస్ రాజా కథ అంతా ఓ కుక్క చుట్టూ తిరుగుతుంది. కుక్కలంటే అస్సలు గిట్టని హీరో రాజా, తన కుక్కను ప్రాణంగా చూసుకునే సురభితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఆ కుక్క తప్పిపోతుంది. దానిని వెతికే ప్రయత్నంలో ఎన్నో పాత్రలు వస్తాయి. ఇంతమంది ఆ కుక్క కోసం ఎందుకు వెతుకుతున్నారో అర్థం కాక హీరో తికమకపడుతుంటాడు. అయితే చివరగా ఆ కుక్క మెడలో ఓ డైమండ్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఫైనల్‌గా ఆ కుక్కను పట్టుకొని హీరోయిన్ ప్రేమను గెలుచుకుంటాడు. ఇదే ఎక్స్‌ప్రెస్ రాజా కథ అన్న విషయం అఫీషియల్‌గా తెలియకపోయినా.. ఈ కథ అయితే బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో కేవలం ఒక జర్నీనే కథగా మలిచి ఎంటర్టైన్ చేసిన మేర్లపాక గాంధీ వినోదం పంచటానికి ఎంతో స్కోప్ ఉన్న ఈ తరహా కథతో అయితే మ్యాజిక్ చేయటం గ్యారెంటీ అంటున్నారు సినీ అభిమానులు. మరి ఎక్స్‌ప్రెస్ రాజా కథ ఇదేనా..? కాదా..? తెలియాలంటే ఫస్ట్ షో పడే వరకు వెయిట్ చేయాల్సిందే. -
గాంధీ అసలు పేరు చే గెవెరా..!
తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో ఢీ కొనడానికి రెడీ అవుతున్న గాంధీ, తన పేరుకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం గాంధీగా అందరికీ పరిచయం అయిన ఈ యువ దర్శకుడుకి చిన్నతనంలో పెట్టిన పేరు వేరే ఉందట. అభ్యుదయ భావాలు ఉన్న గాంధీ తండ్రి మేర్లపాక మురళి తన అభిమాన పోరాట యోధుడు చేగువెరా పేరును తన కొడుకు పెట్టాడు. అయితే బంధువులు స్నేహితులు మాత్రం ఆ పేరు పిలవటం సారిగా రాకపోవటంతో చెగు, జగ్గు అని పిలుస్తుండటంతో, 5 ఏళ్ల వయసులో చేగువెరా పేరును గాంధీగా మార్చాడట. అలా ఓ విప్లవకారుడి పేరు, శాంతి కాముకుడిగా పేరుగా మారిపోయింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్‌ప్రెస్ రాజా జనవరి 14న రిలీజ్ అవుతోంది. శర్వానంద్, సురభి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. -
ప్రభాస్ చూశారు... బాగా ఎంజాయ్ చేశారు!
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు.. ఒక్క హిట్ కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అలాగే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ మేర్లపాక గాంధీ కెరీర్‌కి మంచి మైలురాయి అయ్యింది. దర్శకుడిగా తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న గాంధీ మలి చిత్రం కూడా అందరికీ నచ్చాలనే ఆకాంక్షతో కొంత టైమ్ తీసుకుని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ని రూపొందించారు. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ... ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత రెండో సినిమా మొదలుపెట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నారేం? కథ తయారు చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాను. ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్‌కే కేటాయించాను. ఫస్ట్ సినిమా మంచి హిట్ సాధించిన తర్వాత ఫ్లాప్ అయిన డెరైక్టర్స్‌లో నే ను ఉంటానేమో అని భయమేసింది. అందుకే వెంటనే సినిమా చేయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. మంచి సినిమా చేద్దామని ఇన్నాళ్లూ ఆగాను. నేననుకున్నట్లుగానే మంచి సినిమానే చేశాను. మీ మొదటి సినిమాలా ఇది కూడా వినోద ప్రధానంగా సాగుతుందనిపిస్తోంది? నేను కాలేజీ రోజుల్లో ఓ సీరియస్ షార్ట్ ఫిలిం తీశాను. ఎవరూ చూడలేదు. ఆ తర్వాత ‘కర్మరా దేవుడా’ అని హిలేరియస్ షార్ట్ ఫిలిం తీశాను. అందరికీ తెగ నచ్చేసింది. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారని అర్థమైంది. అందుకే నా మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’నీ, ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని కూడా అదే జానర్లోనే తీశాను. శర్వానంద్‌ని హీరోగా మనసులో పెట్టుకునే ఈ కథ రాసుకున్నారా? లేదు. ముందు కథ రాసేశాను. అప్పుడు శర్వానంద్ యాక్ట్ చేసిన ‘రన్ రాజా రన్’ చూశాను. ఆ సినిమాలో చాలా కొత్త శర్వానంద్ కనిపించాడు. నా హీరో క్యారెక్టర్‌కు సూట్ అవుతాడనుకుని, ఆయనకీ కథ చెప్పాను. వినడం, ఓకే అనడం జరిగిపోయాయి. ఆయనే యూవీ క్రియేషన్స్‌ను సజెస్ట్ చేశారు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మంచి సినిమాలు తీసిన సంస్థ కాబట్టి, నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ సంస్థతో ఎవరు చేసినా లవ్‌లో పడిపోతారు. నా నెక్స్ట్‌సినిమా కూడా యూవీ బ్యానర్లోనే ఉంటుంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కథేంటి? ఈ సినిమాలో మొత్తం అయిదు కథలుంటాయి. ప్రతి అయిదు నిమిషాలకో ట్విస్ట్ ఉంటుంది. 15 నిమిషాలకు ఓ కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. విలన్‌గా ఊర్వశి, ‘షకలక’ శంకర్, సప్తగిరి ఇలా చాలా రకాల క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. వాళ్ల క్యారెక్టర్స్‌కు, హీరో కథకు సంబంధం ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎంటర్టైన్మెంట్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది. చాలా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. స్క్రీన్‌ప్లే హాలీవుడ్ సినిమా ‘వాంటేజ్ పాయింట్’ తరహాలో ఉంటుంది. శర్వానంద్ ఆహార్యం తన గత సినిమాలతో పోలిస్తే కొత్తగా ఉంటుంది. శర్వానంద్ అద్భుతమైన నటుడు. బెటర్మెంట్ కోసం ఎన్ని టేక్స్ చేయడానికైనా వెనకాడడు. హీరో క్యారెక్టర్ చాలా స్పీడ్‌గా, స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుంది. అందుకే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పేరు పెట్టాం. హీరోయిన్ సురభి పాత్ర పేరు అమూల్య. ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది. శర్వానంద్ చేసిన ‘రన్ రాజా రన్’, మీరు చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్ కాబట్టి, ఈ రెండు చిత్రాల టైటిల్స్ కలిసొచ్చేట్లు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పెట్టారా? అందరూ అనుకుంటున్నట్టు సెంటిమెంట్ కోసం సినిమా టైటిల్ అలా పెట్టలేదు. ఇందులో హీరో పేరు రాజా. ఆ పాత్ర చాలా రేసీగా ఉంటుంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అని పెట్టడానికి అదో కారణం, ఆ సౌండింగ్ బాగుండటం మరో కారణం. సంక్రాంతికి మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి కదా? సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా కంటెంట్ మీద మాకు బాగా నమ్మకముంది. అన్ని సినిమాల నడుమ ఈ సినిమా కిల్ కాదని మా ఫీలింగ్. నిర్మాతలు కూడా ఏం టెన్షన్ పడట్లేదు. వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మొత్తం 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇంతకీ ఈ చిత్రాన్ని ఎవరికైనా చూపించారా? ప్రభాస్ చూశారు. రామ్‌చరణ్ పాటలు చూశారు. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. మీ రెండో చిత్రాన్ని సుశాంత్‌తో చేద్దామనుకున్నారు కదా. ఆ సినిమా ఏమైంది? సుశాంత్‌తో అనుకున్నది వాస్తవమే. కానీ వాయిదా వేశాం. బేసిక్‌గా మీకెలాంటి సినిమాలంటే ఇష్టం? మా నాన్నగారు మేర్లపాక మురళి (రచయిత) రొమాంటిక్ కథలు రాయమంటారు. కానీ, నాకేమో ఎంటర్టైన్మెంట్ కథలు రాయడమే ఇష్టం. ఈ విషయం మీద మేమిద్దరం వాదించుకుంటాం కూడా. అయినా ఆయనలా నేనెంత రొమాంటిక్ సబ్జెక్ట్స్ రాయలేను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కూడా ఆడదని చెప్పారు. ఆ సినిమా కోసం బ్యానర్లు కట్టినప్పుడు తీసేయమన్నారు కూడా. కానీ, ఆడింది. ఈ సినిమా చూసి ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కెరీర్ వైజ్‌గా మీరు హ్యాపీ.. పర్సనల్ లైఫ్ మాటేంటి? నా భార్య పేరు సుష్మ. మాది లవ్ మ్యారేజ్. ఎనిమిదో తరగతి నుంచి నాతో కలిసి చదువుకుంది. బీటెక్‌లో ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. హ్యాపీగా పెళ్లి చేసుకున్నాం. గత ఏడాది ఆగస్టు 15న పాప పుట్టింది. తన పేరు లిపి. పర్శనల్ లైఫ్ హ్యాపీగా ఉంది. -
'ఎక్స్‌ప్రెస్ రాజా'గా శర్వానంద్
'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సెలక్షన్లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తన నెక్ట్స్ సినిమాకు 'ఎక్స్‌ప్రెస్ రాజా' అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడు. 'ఎక్స్‌ప్రెస్ రాజా' అన్న టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి ఎక్స్‌ప్రెస్ ను రన్ రాజా రన్ నుంచి రాజాను తీసుకొని ఈ సినిమాకు ఎక్స్‌ప్రెస్ రాజా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను కూడా రన్ రాజా రన్ ను నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. బీరువా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సురభి ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నా
తిరుమల : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో త్వరలో ఓ సిని మాలో నటించనున్నట్లు యువ హీరో సుశాంత్ తెలిపారు. సోమవారం ఉదయం నైవేద్య విరామసమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడి యాతో మాట్లాడారు. దర్శకుడు గాంధీ వివాహం సందర్భంగా తిరుపతికి వచ్చానన్నారు. అనంతరం తాను స్వామి ఆశీస్సులకోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు. కాగా, ఆలయం వెలుపల హీరో సుశాంత్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అంతకుముందు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ సుశాంత్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
పెళ్లి కొడుకు కానున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ దర్శకుడు
హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మేర్లపాక గాంధీ ఓ ఇంటివాడు కానున్నాడు. తన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్తూరు జిల్లాలోని రేణిగుంట గ్రామానికి చెందిన గాంధీ ఆగస్టు 11 తేది సోమవారం పెళ్లి కొడుకు కానున్నాడు. గత ఏడాది సినీ ప్రస్తానానికి నాంది పలికిన గాంధీ తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళి ,విజయల కుమారుడైన గాంధీకి రేణిగుంట మండలం జీవగ్రామ్ ప్రాంతానికి చెందిన సుష్మతో ఏడు అడుగులు వేయనున్నాడు. మరో మూడు రోజుల్లో అంటే.. సోమవారం తెల్లవారుజామున తిరుపతి, తిరుచానురు రోడ్డులో ఉన్న అర్బన్ హబ్స్(శిల్పారామం)లో వీరి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విభిన్న ప్రయత్నంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమై టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించారు. మేర్లపాక గాంధీ తన రెండో చిత్రాన్ని సుశాంత్ హీరోగా చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. -
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకునితో సుశాంత్ కొత్త సినిమా
గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విభిన్న ప్రయత్నంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళి తనయుడైన మేర్లపాక గాంధీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. మేర్లపాక గాంధీ తన రెండో చిత్రాన్ని సుశాంత్ హీరోగా చేయబోతున్నారు. శ్రీ నాగ్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే గాంధీ చక్కటి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ప్రస్తుతం కథానాయిక, ఇతర తారాగణం ఎంపికలో దర్శక, నిర్మాతలు బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. -
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో రామ్
-
జంధ్యాలగారిలా క్లీన్ మూవీస్ చేయాలనేది నా లక్ష్యం
ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతరమే. అందుకే దర్శక, నిర్మాతలు యూత్నే టార్గెట్ చేస్తున్నారు. కొందరైతే, కుర్రకారుని వలలో వేసుకోడానికి ద్వందార్థ సంభాషణలకు కూడా తెగబడుతున్నారు. కానీ.. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. దాన్ని యువతరం సినిమా అనలేం, కుటుంబ కథాచిత్రం అని కూడా అనలేం. పోనీ ప్రేమకథ అందామా! అంటే.. అది కూడా కరెక్ట్ కాదు. అది అందరి కథ, అందరికీ నచ్చే కథ. అశ్లీలత అనేది మచ్చుకైనా కనిపించని కథ. అదే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. తొలి సినిమాతోనే... అందరి మనసుల్నీ దోచేసిన ఆ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఇండస్ట్రీలో హిట్ రాగానే... నిర్మాతలు అడ్వాన్సులతో ముంచెత్తేస్తారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అడ్వాన్సులు అందుకుంటున్నారా? నా పరిస్థితి అచ్చం మీరు చెప్పినట్టే ఉంది. అయితే.. అడ్వాన్సులు మాత్రం అందుకోవడం లేదు. ‘నా తొలి సినిమా ప్రమోషన్ పనులే ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడే నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించలేను’ అని గట్టిగా చెప్పేస్తున్నా. కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా. నా తర్వాత సినిమా ఏంటో త్వరలో తెలియజేస్తా. కథ రెడీగా ఉందా? ప్రస్తుతం అదే పనిలో ఉన్నా. కథ ఓ కొలిక్కి వచ్చింది. ఇది కూడా తొలి సినిమా లాగా భిన్నమైన కథాంశమే. లిటిల్బిట్ జర్నీ కూడా ఉంటుంది. ప్రేమ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. కొందరు దర్శకులు ఎఫర్ట్ మొత్తం తొలి సినిమాకే పెట్టేస్తున్నారు. మలి సినిమాకొచ్చేసరికి దెబ్బ తింటున్నారు. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు? కథ ఫర్ఫెక్ట్గా ఉండాలి. స్క్రీన్‌ప్లే ఇంటిలిజెంట్‌గా ఉండాలి. ‘వీడు ఏదో గమ్మత్తు చేశాడ్రా’ అనిపించాలి. అలా ఉంటే విజయం తథ్యం. యువతరం చూస్తున్నారు కదా.. అని ప్రేమకథల వెంటే పడకూడదు... ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్లాలనేది నా అభిమతం. సాధ్యమైనంత వరకూ నా సినిమాల్లో హ్యూమర్, మెసేజ్ ఉండేలా చూసుకుంటాను. జంధ్యాలగారు తీసిన సినిమాల్లా క్లీన్ మూవీస్ తీయాలనేది నా లక్ష్యం. నాకు తొలి విజయం కంటే మలి విజయమే ఇంపార్టెంట్. మీ నాన్నగారు మేర్లపాక మురళి రచయిత కదా. ఆయన ప్రభావం మీపై ఎంత? చాలా ఉంది. కళలపట్ల ఆసక్తి నాకు ఆయన నుంచే సంక్రమించింది. చిన్నప్పట్నుంచీ నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు నాన్న. బుక్ కంప్లీట్ చేస్తే ఇరవై రూపాయలు ఇచ్చేవారు. పోనుపోనూ పుస్తకాలు చదవడం నాకు వ్యసనంలా మారింది. చివరకు నేనే ఆయనకు డబ్బులిచ్చి పుస్తకాలు తెమ్మనేవాణ్ణి. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ, తిలక్ ఇలా మహామహుల పుస్తకాలు చదివేశాను. అనుకోకుండా డెరైక్టర్ అయ్యారా? లేక మీ లక్ష్యం కూడా ఇదేనా? నా లక్ష్యం ఇదే. ఇంటర్ టైమ్‌లోనే డెరైక్టర్ని అవుతానని నాన్నతో చెప్పాను. ‘బీటెక్ పూర్తి చేశాక నీ ఇష్టం వచ్చినట్లు చేయ్’ అన్నారాయన. ఆళ్లగడ్డలో ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ చేశాను. కోర్స్ పూర్తవ్వగానే, అన్నమాట ప్రకారం చెన్నయ్ ఎల్వీప్రసాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు నాన్న. అయితే, డెరైక్షన్ కోర్స్ అంటే సెల్ఫ్ సెక్యూరిటీ ఉండదని నాన్న ఫీలింగ్. అందుకే.. నాన్న కోసం సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాను. కానీ, ఎక్కువగా డెరైక్షన్ క్లాసుల్లోనే ఉండేవాణ్ణి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం ఎలా వచ్చింది? చెన్నయ్‌లో కోర్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రాగానే.. ‘ఖర్మరా దేవుడా’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ చిత్రోత్సవాలో బెస్ట్ షార్ట్ఫిలింగా ఎంపికైంది. దర్శకుడు హరీష్‌శంకర్ చేతులపై జ్ఞాపిక అందుకున్నాను. తర్వాత తన సినిమాకు పనిచేయమని హరీష్ అడిగారు. కలుద్దామనుకునేలోపు ఆయన ఫారిన్ వెళ్లిపోయారు. ఈ గ్యాప్‌లో తయారు చేసుకున్న ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను సందీప్‌కిషన్‌కి చెప్పాను. తనకు బాగా నచ్చేసింది. తనే కథ వినిపించమని నన్ను పలువురు నిర్మాతల వద్దకు పంపారు. కథ అయితే.. అందరికీ నచ్చేది కానీ, సందీప్ అనగానే.. బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని భయపడేవారు. ఓసారి మా ఊరు రేణిగుంటలో ఉండగా, ‘చోటా కె.నాయుడు కథ వింటారట’ రమ్మని సందీప్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి చోటాగారికి కథ చెప్పాను. ఆయనకు కథ తెగ నచ్చేసింది. వెంటనే.. జెమినీ కిరణ్‌గారికి చెప్పించారు. ఆయనకూ నచ్చడంతో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలవ్వగానే మీకు దక్కిన గొప్ప కాంప్లిమెంట్? సినిమా విడుదలైన రోజు ఓ ఫిలిం జర్నలిస్ట్ అన్నారు.. ‘నేను మంచి దర్శకుల మీద ఇటీవలే ఓ బుక్ రాశాను. మీ సినిమా నెల రోజులు ముందు విడుదలైనట్లయితే... నా బుక్‌లో మీరూ ఉండేవారు’ అని. ఈ సినిమా విషయంలో ఎన్ని ప్రశంసలు దక్కినా... ఆయన అన్నమాట మాత్రం నాకు అమితానందాన్నిచ్చింది. -
రైలు ప్రయాణంలో ప్రణయం
‘‘హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ అమ్మాయి, అబ్బాయి ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రణయానుభవాలతో ఈ సినిమా రూపొందింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పారు. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ -‘‘నాలుగేళ్లుగా తన సినిమాకు ఫొటోగ్రఫీ చేయమని సందీప్ అడుగుతున్నాడు. మంచి కథ దొరికితే చేస్తానన్నాను. ఈ కథ వినగానే వెంటనే ఇంప్రెస్ అయ్యాను’’ అని తెలిపారు. తన కెరీర్లో చాలా స్పెషల్ సినిమా ఇదని సందీప్‌కిషన్ పేర్కొన్నారు. ఈ నెల 25న పాటల్ని విడుదల చేస్తున్నామని సంగీత దర్శకుడు రమణ గోగుల చెప్పారు. ఇందులో పిసినారి అమ్మాయిగా నటిస్తున్నానని రకుల్ ప్రీత్ తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కర్ భట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్.