వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు.
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంసీఏ ప్రమోషన్ లో పాల్గొన్న నాని కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. తన తదుపరి చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుందని వెల్లడించాడు నాని.
Comments
Please login to add a commentAdd a comment