krishnarjuna Yuddham
-
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
చిటపట చినుకులు పాట పాడుతుంటారు
‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే..’ పాట పాడుతూ ఉంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను యన్టీఆర్‌ను అన్నయ్యా అంటాను. ఆ సంభాషణను గుర్తుచేసి మళ్లీ మళ్లీ ఆ డైలాగులు చెప్పమని అడుగుతుంటారు. మరోసారి ఈ విషయాలను గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు’’ ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘విశ్వనట సామ్రాజ్ఙి’ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరోజాదేవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకున్న నటి సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు ఇది’’ అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు. -
నాని.. నెక్ట్స్ ఏంటీ..?
ఒక సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేసి నాని ఇప్పుడు స్లో అయ్యాడు. ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం తేడా కొట్టేయడంతో నెక్ట్స్ సినిమా ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సీనియర్ హీరో నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమా విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. ఈ లోగా బిగ్ బాస్ సీజన్ 2కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. కొరటాల శివతో సినిమా చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. విక్రమ్ కుమార్ తో సినిమా ఉంటుదన్న ప్రచారం జరిగినా.. తాజాగా విక్రమ్, అల్లు అర్జున్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంటే ప్రస్తుతానికి నాని నెక్ట్స్ సినిమా ఫిక్స్ కానట్టే అందుకే మంచి కథతో ఎవరు ముందు వస్తే వాళ్లకే డేట్స్ ఇవ్వాలని నాని ఫిక్స్ అయ్యాడట. -
ఆడలేదు బాబాయ్
నానీ డబుల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘కృష్ణార్జునయుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో అనూపమా పరమేశ్వరన్, రుక్సా మీర్ కథానాయికలుగా నటించారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. అయితే..‘‘సూపర్‌హిట్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను మా డిజిటల్ కంటెంట్‌లో చూడండి’’అని ట్విటర్ ద్వారా యప్ టీవీ పేర్కొంది. దానికి నానీ స్పందిస్తూ –‘‘సినిమా సూపర్ హిట్ అవ్వలేదు బాబాయ్. ఆడలేదు కూడా. అయినా మనసుపెట్టి చేశాం. చూసేయ్యండి’’ అని అన్నారు. -
నాని.. ప్రయోగానికి రెడీ!
వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన నాని జోరుకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ సినిమాలో నాని మార్క్ కొత్తదనం కనిపించకపోవటంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త పడాలని భావిస్తున్నాడు నేచురల్ స్టార్. అందుకే నెక్ట్స్ ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం నాని, సీనియర్ హీరోగా నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అవసరాల శ్రీనివాస్, విక్రమ్ కె కుమార్, హను రాఘవపూడి లాంటి దర్శకులు నానితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. నాని మాత్రం విక్రమ్ కె కుమార్‌తో సినిమా చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ దర్శకత్వంలో నటిస్తే తన ఇమేజ్ ను కాపాడుకోవచ్చని భావిస్తున్నాడట. అయితే ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న మల్టీ స్టారర్ పూర్తయితే గాని నాని నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
ఆర్టీసీ బస్సులో ‘పైరసీ’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో పైరేటెడ్ సినిమా ప్రదర్శిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. హీరో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదలైన రెండో రోజే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ ప్లస్ బస్సులో ప్రదర్శిస్తున్న తీరును ఓ ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీటర్ ద్వారా ఫిర్యా దు చేశారు. ‘ప్రభుత్వ సంస్థలే పైరసీని ప్రోత్సహిస్తే దీనికి ఎలా అడ్డుకట్ట పడుతుంది’అని ప్రశ్నించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేటీఆర్ తగిన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ రమణరావును ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో సినిమాలు ప్రదర్శించే అంశాన్ని ప్రైవేట్ సంస్థ కు అప్పగించినట్లు ఆర్టీసీ ఎండీ రమణరావు ‘సాక్షి’కి తెలిపారు. పైరసీ సినిమాలు ప్రదర్శిం చకూడదన్న ఒప్పందం ఉందని, దీనిపై చర్యలు చేపడతామని ఆయన అన్నారు. -
ఆర్టీసీ బస్సులో పైరసీ సినిమా.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శించడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలైన మరుసటి రోజే టీఎస్ఆర్టీసీ గరుడ బస్సులో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సునీల్ కొప్పరపు అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గరుడ బస్సులో కృష్ణార్జున యుద్దం పైరసీని వేశారని స్క్రీన్ షాట్‌తో సహా కేటీఆర్‌కు ట్వీట్లో తెలిపాడు. ప్రభుత్వ సంస్థల్లోనే పైరసీ జరుగుతుంటే, ఫైరసీనీ నియంత్రించాలని సామాన్యుడిని ఎలా అడుగుతారని సునీల్ ప్రశ్నించాడు. దీంతో యువకుడి ట్వీట్‌కు కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆర్టీసీ సిబ్బంది తీరుపై మండిపడిన ఆయన.. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని సంస్ధ ఎండీని కోరారు. కాగా, కేటీఆర్ వెంటనే స్పందించడంతో సునీల్ ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కేటీఆర్ స్పందించే తీరుపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. @NameisNani @tsrtc @KTRTRS privacy failure on bus travel. Garuda Volvo bus trip to Bengaluru from hyd. How can you ask a common man avoid privacy when an institute fails. Movie released yesterday. #krishnarjunayudham #avoidprivacy details of bus can be given on DM pic.twitter.com/VLPP0ks6xU — Sunil Kopparapu (@Sunil_santiago) April 15, 2018 That’s extremely irresponsible on the part of the @TSRTCHQ staff of this bus. Request JMD of @TSRTCHQ to make sure to act and prevent recurrence https://t.co/lR2Ga8Wy70 — KTR (@KTRTRS) April 15, 2018 Typo Piracy. @KTRTRS thanks for quick response. Happy to see your quick actions everytime you see something wrong happens. https://t.co/bJuiNokFWQ — Sunil Kopparapu (@Sunil_santiago) April 15, 2018 -
యుద్ధానికి సిద్ధం
-
నేనెప్పుడూ అందుకు సిద్ధంగానే ఉంటా
‘‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో మంచి కామెడీ, ఎమోషన్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్ కమెడియన్స్ చేసిన ఫన్ అందరికీ నచ్చుతుంది. ఈ వేసవిలో ఈ సినిమా నాకు మంచి సక్సెస్ ఇస్తుందనే నమ్మకంగా ఉన్నా’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న చిత్ర విశేషాలు.. ►నేను గతంలో ‘జెండాపై కపిరాజు, జెంటిల్మన్’ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశాను. ఆ రెండు సినిమాల్లో ఒకపాత్రకి మరోపాత్ర కనెక్ట్ అయ్యుంటుంది. కానీ, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో రెండు పాత్రలకి అస్సలు సంబంధం ఉండదు. ఎవరి సమస్యలతో వాళ్లు పోరాడుతుంటారు. అలాంటి ఇద్దరూ కథలో ఎలా కలుసుకున్నారు? అన్నదే మా చిత్రం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ►కృష్ణ, అర్జున్ పాత్రల్లో నాకు కృష్ణ పాత్ర చాలా బాగా నచ్చింది. ఆ పాత్రలోనే ఎక్కువ వినోదం ఉంటుంది. కృష్ణ పాత్ర కొద్దిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. చిత్తూరు యాసలో మాట్లాడటానికి మొదట్లో రెండు రోజులు కొంత ఇబ్బందిపడ్డా. మా డైరెక్టర్ గాంధీ సహాయంతో ఆ తర్వాత అన్నీ సెట్ అయ్యాయి. ► స్టార్ స్టేటస్‌ను చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. ప్రతిసారీ మన జడ్జిమెంట్ కరెక్ట్‌గా ఉండదు. ఒక్కోసారి తప్పొచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. ► ‘అ’ సినిమా విజయం నాకు పెద్ద మోటివ్. ఇకపైనా అలాంటి వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తాను. నాకు అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీకి కొత్త దర్శకుల్ని పరిచయం చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. కొందరు కొత్త కథలతో సంప్రదిస్తున్నారు. ►నా సినిమా ఎంత బిజినెస్ చేస్తుందనే లెక్కలు నాకు తెలియవు. ఈ సమ్మర్లో కమర్షియల్ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ‘కృష్ణార్జున యుద్ధం’ మంచి సినిమా. తర్వాత వారం ‘భరత్ అనే నేను’ విడుదలవుతుంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ‘రంగస్థలం’ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. ‘భరత్ అనే నేను’ కూడా పెద్ద సక్సెస్ కావాలి. ► శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాం. ఓ పాట కోసం వారం పాటు షూటింగ్ చేశాం. నాగార్జునగారితో నటించడం చాలా ఎగ్జయిటింగ్‌గా, సంతోషంగా ఉంది. ‘బిగ్‌బాస్ 2’ ఎవరు హోస్ట్ చేస్తారో ఛానల్ వాళ్లే ప్రకటిస్తారు. ►కొరటాల శివగారితో నేను సినిమా చేస్తున్నానన్నది రూమర్. ఇప్పుడప్పుడే ఆయనతో సినిమా చేసే వీలుండదు. ప్రస్తుతం నాగార్జునగారితో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నా. 5 సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఏది ముందు స్టార్ట్ అవుతుందో చెప్పలే ను. -
అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి –‘దిల్’రాజు
‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను మేర్లపాక గాంధీ ముందు నాకే చెప్పాడు. సింపుల్ కథ. సినిమా సూపర్‌హిట్ అయ్యింది. రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా మంచి హిట్. తన సినిమాలో క్యారెక్టర్స్, కామెడీ, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలు ప్యాకేజ్‌తో ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నా. గాంధీ సినిమాలతో ప్రేక్షకులకు పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎంజాయ్ చేస్తారు. నేను రీసెంట్గా ఈ సినిమా చూశా. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమా విడుదల టైమ్‌లో టెన్షన్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటు పడిపోతుందని అనుకుంటే.. ప్రతి సినిమాకు కామన్‌గా వచ్చేస్తోంది. రెండు రోజుల ముందు సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’’ అన్నారు. ‘‘ మా సినిమాను రాజుగారు విడుదల చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు మేర్లపాక గాంధీ. వెంకట్ బోయనపల్లి, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు. -
‘కృష్ణార్జున యుద్ధం’కు యు/ఎ సర్టిఫికెట్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ య్యూటూబ్‌లో మంచి వ్యూస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చాడు. -
మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది – ‘దిల్’ రాజు
‘‘బాహుబలి’ ఫంక్షన్ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా వేడుక తిరుపతిలో జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. గాంధీ ఈ సినిమాతో హ్యాట్రిక్ డైరెక్టర్ కాబోతున్నాడు. నాకు, నానీకి పోటీ జరుగుతోంది. ఇద్దరం వరుస హిట్ల మీద ఉన్నాం. సినిమాకు కథ బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మేం విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘దిల్’ రాజు సినిమా ట్రైలర్‌ను, ఫస్ట్ టికెట్‌ను ఆవిష్కరించారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కథ చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాలకే నానీగారు ఓకే చెప్పేశారు. చిత్తూరు యాసను ఆయన చాలా ఈజీగా పలకడం గర్వంగా ఫీలవుతున్నా. సుబ్బలక్ష్మి, రియా పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. హిప్ హాప్ తమిళ మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, అంతకు మూడు రెట్లు ఎక్కువ తిరుపతికి వచ్చాను. నేనే కాదు.. ప్రతి తెలుగోడు తిరుపతివాడే. గాంధీని చూస్తే సొంత సోదరునిలా అనిపించేది. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఏదైనా మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. మన ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఇక్కడ మొదలైంది. ఇక తిరుగులేదు’’ అన్నారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్, చిత్ర సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, తిరుపతి ప్రసాద్, ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ, ప్రశాంతి, మౌర్య, ప్రభాస్ శ్రీను, ఫైట్ మాస్టర్స్ జాషువా, ఆర్.కె, డ్యాన్స్ మాస్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
'కృష్ణార్జున యుద్ధం' ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఇది యాక్షన్ కాదు.. డబుల్ యాక్షన్
నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ క్లబ్ దాటేసి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లోని కృష్ణ, రాక్ స్టార్ అర్జున్ జయప్రకాశ్ రెండు పాత్రల్లో నాని కనిపించబోతున్నాడు. ముఖ్యంగా కృష్ణ అండ్ బ్యాచ్ చేసే సందడి ఫన్నీగా అనిపిస్తోంది. వాళ్ల మధ్య డైలాగులు పేలిపోయాయి. ఆపై ట్రైలర్ సీరియస్ మోడ్‌లో సాగింది. తమ ప్రేమ కోసం ఈ ఇద్దరు యుద్ధం చేయటం.. చివరకు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడటం.. ‘యాక్షన్ కాదు.. డబుల్ యాక్షన్’... అన్న డైలాగ్‌తో ట్రైలర్ ముగించేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుదల కాబోతోంది. -
కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ విడుదల
-
అమ్మకు ప్రేమతో.. నాని
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలో ఎంత సరదాగా కనిపిస్తాడో సోషల్ మీడియాలో కూడా అదే తరహా కామెంట్స్ తో అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల కొడుకు పుట్టిన రోజు సందర్భంగా నాని చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తాజాగా తల్లి విజయలక్ష్మి పదవి విరమణ సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు నాని. ‘30 ఏళ్లుగా ఫార్మసిస్ట్. ఎప్పుడూ నవ్వుతూ.. సాయం చేయడానికి ముందుంటారు. వైద్యులు, రోగులు ఆమెను ఇష్టపడతారు. మేము మరింతగా ప్రేమిస్తాం. ఈ రోజు ఆమె చివరి వర్కింగ్ డే. నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మ’ అంటూ ట్వీట్ చేశారు నాని. ప్రస్తుతం నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు (శనివారం) సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు నాని. 30 years industry as a Pharmacist . Always smiles and ready to help. Doctors love her, patients love her more and we love her the most! Today is her last day at work :) Proud of u Amma 🤗 You are the most beautiful person ever ❤️ pic.twitter.com/rCKU1fXe6n — Nani (@NameisNani) 31 March 2018 -
కృష్ణ అందరికీ నచ్చుతాడు– నాని
‘‘కృష్ణ, అర్జున అనే ఇద్దరు వ్యక్తులు ఓ పరిస్థితిలో ఒక సమస్యపై చేసే పోరాటమే ‘కృష్ణార్జున యుద్ధం’. కృష్ణది పల్లెటూరి పాత్ర. అర్జున్ రాక్‌స్టార్. నాకు కృష్ణ పాత్ర ఇష్టం. చిత్తూరు యాసలో మాట్లాడే పాత్ర. కృష్ణ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నాని అన్నారు. నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుద.లయ్యాయి. నాని మాట్లాడుతూ –‘‘గాంధీ డైరెక్షన్ నాకు ఇష్టం. తనతో పని చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. మా చిత్రానికి ఏ సినిమా ఇన్స్పిరేషన్ కాదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా తీశాం. హిప్ హాప్ తమిళ అందించిన పాటలు నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ నెల 31న తిరుపతిలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన నానీ అన్నకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. చిత్రసమర్పకులు వెంకట్ బోయనపల్లి పాల్గొన్నారు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో అంటున్న హీరోయిన్
సొంత సినిమా ప్రమోషన్లకు కూడా హాజరవ్వలేనంత బిజీగా ఉంటున్నారు కొందరు. అలాంటిది తన స్నేహితుడి సినిమా టీజర్‌పై స్పందిస్తూ సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూస్తానంటూ ట్వీట్ చేసింది. ఆడోళ్లు భలే కఠినాత్ములు అంటూ వచ్చిన కృష్ణార్జున యుద్ధం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నానితో రెండుసార్లు జతకట్టి హిట్‌పెయిర్‌గా నిలిచిన నివేదా థామస్ టీజర్‌పై ట్విటర్లో స్సందించింది. ‘ఈ టీజర్లో ఏదో ఉంది. నిన్ను చూసి గర్వపడుతున్నాను నాని. మొదటి రోజు మొదటి ఆటకు సినిమాను చూస్తా’ అని ట్వీట్ చేసింది. నాని, నివేధా జెంటిల్మెన్, నిన్ను కోరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో నానికి జోడిగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ జోడిగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Damn!! This teaser is something! 😀 Absolutely proud of you @NameisNani 😊 Good luck to the team.. FDFS guaranteed! https://t.co/VDqWFhwlHq — Nivetha Thomas (@i_nivethathomas) March 11, 2018 -
కృష్ణార్జున యుద్ధం టీజర్ విడుదల
-
‘ఆడోళ్లు భలే కఠినాత్ములనిరా’
యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన నాని తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా కృష్ణార్జున యుద్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మాస్ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్ లో ఉండే రాక్ స్టార్ల కనిపిస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది చిత్రయూనిట్. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. నాని మార్క్ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన టీజర్ ఆకట్టుకుంటోంది. -
‘శాంపిల్ ఒకటి వదులుతున్నాం’
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈసినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమాలో నాని సరసన అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్‌ను మార్చి 10న ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నాని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘కృష్ణార్జున యుద్ధం శాంపిల్ ఒకటి వదులుతున్నాం’ అంటూ టీజర్ రిలీజ్ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు నాని. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈసినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Krishnarjuna yudham sample okati vadhulthunnam :)) తేది : మార్చ్ 10 ముహూర్తం : ఉదయం 10 గంటలకు#KAYTeaserOn10th pic.twitter.com/GTKCeehipB — Nani (@NameisNani) 8 March 2018 -
నాని ‘ఐ వాన్న ఫ్లై’ సాంగ్ రిలీజ్
-
‘ఐ వాన్న ఫ్లై’ అంటున్న నాని
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ రోజున తన పుట్టిన రోజు జరపుకుంటున్నారు. నాని ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం.. హీరోగానే కాదు నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్న తరువాత నాని జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. అంతేకాదు నానితో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న, త్వరలో సినిమాలు చేయబోయే నిర్మాణ సంస్థలు కూడా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం చిత్రయూనిట్ పుట్టిన రోజు కానుకగా సినిమాలోని మరో పాటను రిలీజ్ చేసింది ఇప్పటికే ‘దారి చూడు’ పాటతో సంచలనం సృష్టించగా తాజాగా రెండు జంట నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. హిప్ హాప్ తమిళ సంగీత సారథ్యంలో రేవంత్, సంజిత్ హెగ్డే ఆలపించిన ఐ వాన్న ఫ్లై పాటకు శ్రీజో సాహిత్యమందించారు. -
హీరో నానికి తప్పిన ప్రమాదం
-
నాని ఈజ్ సేఫ్
ఐయామ్ ఓకే అంటున్నారు హీరో నాని. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని శుక్రవారం ఉదయం డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నారు హీరో నాని. ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర గంటల సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. నానికి పెద్ద గాయాలేం కాలేదు. అయితే... ముందు కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారన్న వార్తలు వచ్చాయి. పోలీసులు నాని తండ్రి రాంబాబుకు ఫోన్ చేయగా ఆ సమయంలో నాని కారులోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంపై నాని స్పందించారు. ‘‘ఐయామ్ ఓకే. అక్కడక్కడా చిన్నగా గీసుకుపోయింది. అంతే. యుద్ధానికి (షూటింగ్‌కు) స్మాల్ బ్రేక్. నెక్ట్స్ వీక్‌లో మళ్లీ యాక్షన్‌లోకి దిగుతాను’’ అన్నారు నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్ట్ లుక్స్‌తోపాటు ఓ సాంగ్‌ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.