
సాక్షి, సినిమా : హీరో నాని చెప్పినట్లుగా చేసేశాడు. కొత్త కృష్ణార్జున యుద్ధానికి సంబంధించి రెండో పాత్ర అర్జున్ లుక్కును సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు.
రాకింగ్ స్టార్ అవతారంలో నేచురల్ స్టార్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. భోగి సందర్భంగా ఊర మాస్ రోల్‌లో కృష్ణ పాత్ర లుక్కును విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించబోతున్నాడని పోస్టర్‌లను చూస్తే అర్థమైపోతుంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 😊
— Nani (@NameisNani) 15 January 2018
Happy Sankranthi :))#ArjunFirstLook #KrishnarjunaYudham #KAY pic.twitter.com/ILY41MHqfm
Comments
Please login to add a commentAdd a comment