poster released
-
హారర్... థ్రిల్
ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక(Swasika)ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత అనే పాత్రలో స్వాసిక కనిపించనున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’. ఈ మూవీలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా సవాల్‌తో కూడుకున్న పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘తమ్ముడు’తో పాటు హీరో సూర్య 45వ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్వాసిక. -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘కాంత(Kantha)’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని ఓ లీడ్ రోల్ చేశారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ డాక్యుమెంటరీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్‌ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.నటుడిగా దుల్కర్ పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కాంత’లోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘1950 నాటి మద్రాస్(చెన్నై) నేపథ్యంలో ‘కాంత’ ఉంటుంది. అప్పటి మానవీయ సంబంధాలు, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో ఈ మూవీ కొత్తగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాను. -
ఫిబ్రవరి 5న వైస్సార్సీపీ ఫీజుపోరు.. పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ చేపట్టే 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు.2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైఎస్ జగన్ వచ్చాక రిలీజ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు: జోగి రమేష్ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు. బాధిత విద్యార్థుల తరపున పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తాం. చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలివిద్యా వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్ స్కూల్‌కు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు.ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి! -
వేసవిలో జాట్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ చిత్రాన్ని వేసవిలో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించి, కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘భారీ యాక్షన్ మూవీగా ‘జాట్’ రూపొందింది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘జాట్’ టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: రిషి పంజాబీ, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాబా సాయికుమార్ మామిడిపల్లి, జయ ప్రకాశ్ రావు (జేపీ). -
ప్రేమ కోసం ప్రతీకారం
విరాజ్ రెడ్డి చీలం హీరోగా, మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ (ప్రేమ కోసం ప్రతీకారం) అన్నది ట్యాగ్‌లైన్ . జగా పెద్ది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుప్రొడక్షన్స్ పై అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గార్డ్’. మెల్బోర్న్లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆరంభించాలనుకుంటాడు.ఆ క్రమంలో సామ్ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సుశాంత్. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ప్రేమ కోసం ఊహించని శక్తులతో సుశాంత్ ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మార్క్ కె.న్‌ఫీల్డ్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని. -
త్వరలో ‘ప్రణయ గోదారి’
పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన తాజా చిత్రం ‘ప్రణయ గోదారి’. సదన్, ప్రియాంకా ప్రసాద్ హీరో హీరోయిన్లుగా పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించి, ఈ చిత్రంలో కీలక ΄పాత్ర చేసిన సాయికుమార్ పోస్టర్ని విడుదల చేశారు.‘‘ఇప్పటివరకూ విడుదల చేసిన ఈ చిత్రం ΄పాటలు, పోస్టర్స్‌కి మంచి స్పందన లభించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. -
మీకు తెలిసినోడి కథ
‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష ఇతర కీలకపాత్రలుపోషించారు. ‘బచ్చలమల్లి’ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది మీ కథ... లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్’లో పేర్కొన్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎమ్. నాథన్. -
త్రిముఖ కొత్త ఒరవడి సృష్టిస్తుంది
‘‘త్రిముఖ’ చిత్ర దర్శకుడు రాజేష్ నాయుడు నాకెప్పటి నుంచో తెలుసు. ఆయన తీసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని నేను విడుదల చేయటం హ్యాపీగా ఉంది. హీరో యోగేష్ మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. మంచి కథతో ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుంది’’ అని హీరో సాయిదుర్గా తేజ్ అన్నారు.యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రిముఖ’. నాజర్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణమోహన్, శ్రీవల్లి సమర్పణలో శ్రీదేవి మద్దాలి, హర్ష కల్లె నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను సాయిదుర్గా తేజ్ ఆవిష్కరించారు. ‘‘ఉత్కంఠభరితమైన సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో మంచి నటన కనబరిచే చాన్స్ దక్కింది’’ అని యోగేష్ తెలిపారు. -
సెలవులు కలిసొచ్చేలా...
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని నవంబరు 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, వరుణ్ తేజ్ కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘మట్కా’ రూపొందుతోంది.కరుణ కుమార్ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను తయారు చేశారు. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్ల బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారాయన. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వరుణ్ తేజ్, ఫైటర్స్‌పై సినిమాకి కీలకమైన, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నాం.మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కార్తీక ΄ûర్ణమికి ముందుగా నవంబర్ 14న విడుదల కానున్న మా సినిమాకి లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, పి. రవిశంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
థ్రిల్లింగ్ జటాధర
సుధీర్‌బాబు హీరోగా రూ΄పొందనున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకుడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మించనున్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘జటాధర’ కథ శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికలో ఉంటుంది. ఈ రెండు ప్రపంచాలను ప్రేక్షకులు వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త అనుభూతిని ΄అందుతారు. ప్రేరణ అరోరాగారితో కలిసి ఈ సినిమా కోసం ప్రయాణం చేయటం గొప్ప అనుభూతి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘జటాధర’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం. ఈ సినిమాలో హీరోయిన్గా ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నారు. అలాగే ప్రతినాయకిపాత్రలో మరో బాలీవుడ్ నటి నటిస్తారు. 2025 శివరాత్రికిపాన్ ఇండియా ప్రేక్షకులను ఈ మూవీ అలరించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బోనాల పండగలో...
బోనాల పండగ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా బోనం ఎత్తారు. అయితే ఆమె పండగ చేసుకుంటున్నది ‘ఓదెల 2’ చిత్రం కోసం. తమన్నా లీడ్ రోల్లో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు సంపత్ నంది సూపర్విజన్లో ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021) సినిమాకి సీక్వెల్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.భారీ మల్లన్న టెంపుల్ సెట్లో క్లైమాక్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతోపాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్లోపాల్గొంటున్నారు. బోనాల సంబరాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ఇది. ఈ సన్నివేశాల్లోని తమన్నా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్‌రాజన్. -
నాదనాథుడి ఉగ్రరూపం
మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఆదివారం (జూలై 14) శరత్ కుమార్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఈ మూవీలో ఆయన నటిస్తున్న నాదనాథుడి పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న ఓ యోధుడిలా కనిపిస్తున్నారు శరత్ కుమార్. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు న్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
పవర్ఫుల్ పోలీస్
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ– ‘‘డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందించాం. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటించారు. ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
యావరేజ్ స్టూడెంట్
‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి హీరోగా మారారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి, బిషాలీ గోయెల్ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఝాన్సీ, రాజీవ్ కనకాల, ‘ఖలేజా’ గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి. కొడకండ్ల, కెమెరా: సజీష్ రాజేంద్రన్. -
అక్టోబర్‌లో వేట్టయాన్
అక్టోబర్‌లో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘వేట్టయాన్ ’. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వేట్టయాన్’. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ , జీకేఎమ్ తమిళ కుమరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వేట్టయాన్ ’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. -
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
'ఆదిపురుష్' నుంచి లేటెస్ట్ అప్డేట్.. మరో పోస్టర్ విడుదల
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్. రామయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతిసనన్ సీతగా దర్శనమివ్వనుంది. 400కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 జూన్ 16న విడుదల కానుంది. ఇటీవల రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రామ భక్తుడు, రాముడి ఆత్మ.. జై పవన్‌పుత్ర హనుమాన్!’ అని క్యాప్షన్ ఇస్తూ, రామభక్తిలో మునిగిపోయిన హనుమంతుని పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడిగా దేవదత్ నాగే నటించారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటినుంచి ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి.మొన్నటికి మొన్న రామనవమి సందర్భంగా విడుదల చేసిన లుక్‌లో కూడా రాముడు, సీత, లక్ష్మణుడి వేషధారణపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి తాజాగా విడుదలైన పోస్టర్‌తో ఇంకేమైనా వివాదాలు తలెత్తుతాయా అన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజాచిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. రేపు(శుక్రవారం)పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం. 'స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం' అనే క్యాప్షన్‌తో దర్శకుడు క్రిష్ ఈ పోస్టర్‌ను షేర్ చేశాడు. అంతేకాకుండా రేపు సాయంత్రం 5.45గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. -
'విడియుమ్ వరై కార్తిరు' టైటిల్ పోస్టర్ విడుదల
చెన్నై సినిమా: లిబ్రా ప్రొడక్షన్స్ పతాకంపై వీసీ రవీంద్రన్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి 'విడియుమ్ వరై కార్తిరు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో విద్యార్థి విక్రాంత్, కార్తీక్ కుమార్, మహాలక్ష్మి శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ముండాసిపట్టి, రాక్షసన్ చిత్రాల దర్శకుడు రామ్‌కుమార్ శిష్యుడు బాజీ సలీమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్ పోస్టర్‌ను శనివారం దర్శకుడు భాగ్యరాజ్ ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి కోయంబత్తూరులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి అనంతరం సూపర్ ఫాస్ట్‌గా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి ! ఇది ఎవరికీ తెలియదనుకుంటా: నాగార్జున -
'రుద్రుడు'గా రాఘవ లారెన్స్.. ఆ పండుగకే రిలీజ్
Raghava Lawrence Rudrudu Movie Release Date Announced: దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ఎంతోమంది హీరోలకు నృత్యం నేర్పించిన రాఘవ.. డైరెక్టర్‌గా హార్రర్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రుద్రుడు'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై కతిరేషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తాజగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. 'యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది.' అని చిత్రబృందం పేర్కొంది. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి Presenting the Second Look of @offl_Lawrence master in #Rudhran#Rudhran In Theaters Worldwide From December 23 2022#RudhranFromDecember23@offl_Lawrence @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony @onlynikil pic.twitter.com/Tqntry9XTJ — Five Star Creations LLP (@5starcreationss) July 3, 2022 -
పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆ హీరో.. అదరగొడుతున్న పోస్టర్
యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా విడుదలైన మరో పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ మైఖెల్ పాత్రలో హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన పోస్టర్‌ను రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో వినయ్ రాయ్ అత్యంత బాడాస్ ఈవిల్ మ్యాన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లాంగ్ సూట్లో చుట్టూ డ్రోన్స్‌తో ఉన్న వినయ్ రాయ్ పోస్టర్ థ్రిల్లింగ్‌గా ఉంది. వినయ్ రాయ్ ఇంతకుముందు నీవల్లే నీవల్లే, వాన సినిమాలో హీరోగా అలరించాడు. కాగా ఈ మూవీలో ఓ కీరోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు -
అక్షయ్ కుమార్ సినీ కెరీర్‌కు 30 ఏళ్లు.. ఊహించని సర్ప్రైజ్ వైరల్
Akshay Kumar Completes 30 Years In Bollywood YRF Special Poster: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తాడు. సన్నివేశం బాగా వచ్చేందుకు ఎలాంటి రియల్ స్టంట్స్ అయిన చేస్తాడు. అలా ఆయన చేసిన స్టంట్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన్ను యాక్షన్ హీరో అని ముద్దుగా పిలుచుకుంటుంది బీటౌన్. ఇటీవల 'సూర్యవంశీ', 'ఆత్రంగి రే', 'బచ్చన్ పాండే' చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు అక్కీ. తాజాగా ఈ యాక్షన్ హీరో హిందీ చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ తొలి చిత్రం 'సౌగంధ్' 1991లో విడుదలైంది. ప్రస్తుతం పరాక్రమవంతుడు పృథ్వీరాజ్ చౌహన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'పృథ్వీరాజ్' సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని 'యశ్ రాజ్ ఫిలీంస్' బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ సినీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్ రాజ్ ఫిలీంస్ అక్షయ్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. చదవండి: కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది: అక్షయ్ కుమార్ View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) అక్షయ్ కుమార్‌కు కానుకగా 'పృథ్వీరాజ్' సినిమా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్‌ను పృథ్వీరాజ్ పాత్రలో ఉన్న అక్షయ్ ఫొటోతో పాటు ఆయన కెరీర్‌లోని అన్ని చిత్రాలతో రూపొందించారు. ఈ కానుకకు అక్షయ్ వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఇందులో 'నా సినీ ప్రయాణం ప్రారంభమై 30 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. నా తొలి చిత్రం సౌగంధ్ 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా మనోహరంగా ఉంది. నా సినీ కెరీర్లో మొదటి షాట్ ఊటీలో జరిగింది. అది కూడా యాక్షన్ షాట్. ఈ పోస్టర్‌కు ధన్యవాదాలు. ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైనది.' అని తెలిపాడు ఈ యాక్షన్ హీరో అక్కీ. ప్రస్తుతం ఈ సర్ప్రైజ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చదవండి: అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు -
బ్రహ్మాస్త్ర లవ్ పోస్టర్.. అలియా-రణ్‌బీర్‌ల పెళ్లికి హింట్ !
Ranbir Kapoor Alia Bhatt Wedding Hint By Brahmastra Love Poster: బాలీవుడ్ లవ్లీ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-అలియా భట్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీలో పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వెంటనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్ర బృందం తాజాగా రణ్‌బీర్, అలియా ప్రేమగా, అతి సన్నిహితంగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చదవండి: ఏప్రిల్‌లోనే అలియా-రణ్‌బీర్ వివాహం !.. ఆ కారణం వల్లే ముహుర్తం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ పోస్టర్‌ను షేర్ చేశారు. 'ప్రేమ అంటే కాంతి. బ్రహ్మాస్త్రలోని మొదటి అధ్యాయాన్ని పార్ట్ 1: శివ అని చాలా కాలంగా మనం పిలుస్తున్నాం. కానీ పార్ట్ 1 అంటే ప్రేమ. ఎందుకంటే బ్రహ్మాస్త్ర ప్రధానంశం ప్రేమకు ఉన్న శక్తికి సంబంధించినది. ఈ ప్రేమ అగ్నిలా అన్నివైపులా వ్యాపించి సినిమాను దాటి నిజ జీవితంలోకి అడుగుపెట్టింది. ఇదిగో మా లవ్ పోస్టర్. దీనికి ఇది సరైన సమయం అనిపిస్తుంది.' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు అయాన్ ముఖర్జీ. అయితే రణ్‌బీర్-అలియా వివాహం ఈ నెల 14న జరగనుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు నిజమని చెప్పేలా అయాన్ లవ్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
'హరిహర వీరమల్లు' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్న పవన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma 🏹 - Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/8jV4BvzGJm — Mega Surya Production (@MegaSuryaProd) April 10, 2022 -
తెరపైకి మరో 'అల్లూరి' సీతారామరాజు..
Ravi Teja Launched Sree Vishnu Alluri Movie Poster: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇందులో ఫైర్ ఎలిమెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను, వాటర్ ఎలిమెంట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించారు. క్యారెక్టర్లకు తగినట్లుగానే అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ అద్భుతంగా నటించారు. రామ్ చరణ్, తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ ప్రేక్షకులను మెప్పించాడు. ఎంతలా అంటే ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా. అలా ఇదివరకూ 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతగా ఆకట్టుకున్నాయి వారి పాత్రలు. చదవండి: రామ్ చరణ్ చుట్టూ ఎగబడ్డ జనం.. వీడియో వైరల్ ఇప్పుడు మరో అల్లూరి సీతారామరాజు వెండితెరపై సందడి చేయనున్నాడు. 'అల్లూరి' పేరుతో మరో సినిమా రానుంది. శ్రీ విష్ణు హీరోగా డైరెక్టర్ ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశాడు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మూవీలో పోలీసు అధికారి అల్లూరి సీతరామరాజుగా విష్ణు కనిపించనున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని గొప్ప పోలీసు అధికారి పాత్రను ఈ మూవీ ద్వారా తెలియజేస్తున్నామని పోస్టర్లో రాసి ఉంది. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. హర్ష వర్ధన్ సంగీతం అందిస్తున్నారు. TITLE ASSAULT of My next as A Sincere Cop #𝗔𝗟𝗟𝗨𝗥𝗜 👮♂️ Witness The Greatest Police Story, Ever Told 🤙🏾 Directed by #PradeepVarma Produced by @BekkemVenugopal #Babita @luckymediaoff 🎶 @rameemusic 🎥#RajThota pic.twitter.com/Oe7PPXrCfI — Sree Vishnu (@sreevishnuoffl) April 5, 2022 చదవండి: సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ ! -
సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ 'దారి' కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
కంటెంట్ బేస్డ్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ ఎంతోమంది నూతన దర్శకనిర్మాతలకు బలాన్నిస్తోంది. దీంతో కొత్త కథలను రాసుకొని వాటిని ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్నారు. ఇదే బాటలో రాబోతున్న విలక్షణ సినిమా 'దారి'. సుహాష్ బాబు ఈ చిత్రానికి ఇదర్శకత్వం వహిస్తుండగా ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్ నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్,ఇతర అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. -
పూరి జగన్నాథ్ తమ్ముడి సినిమా.. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన వర్మ
RGV Launches Oka Pathakam Prakaram Movie Poster: సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ పనిచేస్తున్నారు.దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. -
ప్రియమణి కొత్త రూపం.. 'భామా కలాపం'
Priyamani Telugu Movie Bhama Kalapam In AHA: 2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైంది ప్రియమణి. తర్వాత ఫ్యామిలీ హీరో జగపతి బాబు నటించిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ'తో ఇక చెరిగిపోని ముద్ర వేసుకుంది ప్రియమణి. అనంతరం అనేక సినిమాల్లో నటించిన ఈ కేరళ బ్యూటీ తెలుగులో కొంతకాలం కనుమరుగైపోయింది. ఇటీవల ఎంతో పాపులర్ అయిన హిందీ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'తో ఆకట్టకుంది. ఇదే కాకుండా ప్రముఖ తెలుగు రియాల్టీ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు మళ్లీ చేరువైంది. తాజాగా ప్రియమణి కొత్త రూపం ఎత్తింది. 'భామా కలాపం' అనే వెబ్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తానేంటో చూపించనుంది. అభిమన్యు తాడిమేటి కథ, దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి టైటిల్ రోల్లో అలరించనుంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రియమణి ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలు పట్టుకుని ఆకట్టుకుంటోంది. గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూనే తనకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కుందో ఈ సినిమా ద్వారా చూపించనున్నట్లు సమాచారం. She is your friendly neighbour, but she has many stories and secrets to tell. 💁🏻#Priyamani is here with #BhamaKalapamOnAHA, a fascinating comedy thriller. Premieres soon Stay Tuned! #ADeliciousHomeCookedThriller@SVCCDigital @sudheer_ed @bharatkamma @editorviplav @justin_tunes pic.twitter.com/uvR9YdppT0 — ahavideoIN (@ahavideoIN) January 12, 2022 ఇదీ చదవండి: తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జ్‌గా తమన్ ! -
సోనూ సూద్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల
Sonu Sood New Movie Fateh Poster Released: రియల్ హీరో సోనూ సూద్ లీడ్ రోల్లో రూపొందనున్న చిత్రం ‘ఫతే’. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన అభినందన్ గుప్తా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ‘భారతదేశంలో దాక్కున్న ఒక శత్రువుపై ఒక వ్యక్తి చేసే యుద్ధం’ అని ఉంది. ‘‘కథ విన్న వెంటనే తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. ఆలోచింపజేసే ఈ కథను అందరికీ చూపించాలి. 2022ని మరింత యాక్షన్‌తో స్వాగతిస్తున్నాను’’ అన్నారు సోనూ సూద్. సోనూసూద్ అంటే లాక్డౌన్ ముందు వరకు విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత కథ మారింది! నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండగా పేదప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు రియల్ హీరో అయ్యాడీ రీల్ విలన్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది! ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ సోనూను ప్రతి ఒక్కరూ కొనియాడారు. తన దయాగుణంతో, తలపెట్టిన మంచిపనులతో స్టార్ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
భీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం.. పోస్టర్ విడుదల
Brahmanandam Look Poster Out From Bheemla Nayak Movie: బ్రహ్మానందం అంటే ఓ చక్కిలిగింతలు. కడుపుబ్బ నవ్వించే కమెడియన్. అనేక చిత్రాల్లో నటించిన ఆయన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను నవ్వులు పూయించారు. తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచిన కామెడి కింగ్‌లలో బ్రహ్మానందం ఒకరు. ఆయన నటించిన చిత్రాల్లోని సీన్లు, హావభావాలను ఇప్పటికీ మీమ్స్ రూపంలో వాడుతున్నారంటే ఆయన ఎంతలా నవ్వించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరకొర చిత్రాల్లో నటిస్తున్న బ్రహ్మానందం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని బ్రహ్మానందం లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. బీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం నటిస్తున్నారంటే యాక్షన్, డైలాగ్స్‌తోపాటు కామెడీ కూడా అదిరిపోద్దనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించడం విశేషంగా మారింది. అయితే బ్రహ్మీ కామెడీ ఏమేరకు పండుద్దో సినిమా విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం జనవరి 12, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషీయమ్' చిత్రానికి ఇది రీమేక్. -
ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి
Megastar Chiranjeevi: ‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తాను. ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. వాటిని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్‌గా పని చేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది’’ అని అన్నారు చిరంజీవి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ కుమార్తె వర్షా విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘11:11’. ఈ చిత్రంలో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిరంజీవి మాట్లాడుతూ –‘‘80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు.. ఇలా నాకు 12 సినిమాల వరకు చేశారు రాజ్–కోటి. సుమారు 60 పాటలంటే నాకు 90 శాతం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చిన కోటిగారి ఋణం తీర్చుకోలేకపోయాననే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటిగారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లెజెండరీ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావుగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని కోటిగారు ప్రేక్షకులకు అందించారు. తన ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోటి తనయుడు రాజీవ్, రాజ్‌గారి అబ్బాయి సాగర్లకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి. ఈ సినిమా విజయం సాధించి చిత్రయూనిట్ అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి ఆశీర్వాదాలు అందడం నా కొడుకు అదృష్టం’’ అన్నారు కోటి. ‘‘ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మగారి సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ ’’ అన్నారు దర్శకుడు కిట్టు నల్లూరి. ‘‘చిరంజీవి గారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రాజీవ్ . ‘‘కష్టపడితే ఏదైనా సాధించగలం అనే దానికి చిరంజీవిగారు నిదర్శనం’’ అన్నారు వీరేశ్. ఈ కార్యక్రమంలో వర్షా విశ్వనాథ్, నటుడు రోహిత్, నటుడు సదన్, సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ పాల్గొన్నారు. -
ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల
లాక్డౌన్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్. ‘ఇండియా లాక్డౌన్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతాబసు ప్రసాద్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరగనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబందం ప్రకటించింది. వచ్చే వారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ కథలో భాగమవ్వడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మధుర్ భండార్కర్ డైరెక్షన్లో షూటింగ్ త్వరగా మొదలవ్వా లని ఉంది’’ అన్నారు శ్వేతా బసు. Film India Lockdown is all set to go on floor next week. Here’s a teaser poster. Give your love. ❤️ @prateikbabbar @SaieTamhankar @AahanaKumra @shweta_official @ShihabZarin #PrakashBelawadi #IndiaLockdown pic.twitter.com/ZDnsWzajeX — Madhur Bhandarkar (@imbhandarkar) January 21, 2021 -
మరోసారి ఢీ&ఢీకి రెడీ అవుతున్న మంచు విష్ణు
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ‘ఢీ’ విడుదల తేదీ పోస్టర్ని పోస్ట్ చేసిన విష్ణు ఈ నెల 23న ఓ ఎగ్జయిటింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాం అని ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘కొన్ని వేల మంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటుడికీ ఇదొక గేమ్ చేంజర్. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది.‘ఢీ’ కంటే బెటర్ ఏం ఉంటుంది?’ అని ట్వీట్ చేశారు విష్ణు. తాజాగా శ్రీనువైట్లతో డీ&డీ సినిమా చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. బిగ్ బ్రదర్ శ్రీను వైట్లతో మరోసారి పనిచేయడం ఆసక్తిగా ఉందని, డబుల్ డోస్‌తో ఈ సినిమా రాబోతుందని ట్వీట్ చేశారు. Here we go again! But this time it’s D&D Double Dose. Very excited to partner with my big brother Sreenu Vaitla garu again. God speed! #DD #Doubledose pic.twitter.com/TLeCZAq4kd — Vishnu Manchu (@iVishnuManchu) November 23, 2020 -
ధమ్కికి రూ. 1000.. లేపేస్తే రూ.55,000
లక్నో: హోటల్‌కి వెళ్లినప్పుడు మనం మెను కార్డులు చూస్తూ ఉంటాం. ఒక్కో ఆహారానికి ఒకే రేటు. అలానే ప్రయాణాల సమయంలో, హోటల్స్, సినిమా థియేటర్లు ఇలా పలు చోట్ల మనం వేర్వేరు సర్వీసులకు ఎంత డబ్బు తీసుకుంటారో తెలిపే డిస్ప్లే బోర్డులను చూస్తూ ఉంటాం. కానీ వేర్వేరు నేరాలకు వివిధ రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. లేదంటే ఓ సారి ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ వెళ్లండి. అక్కడ మీకు ఓ గ్యాంగ్ కనిపిస్తుంది. కిడ్నాప్, బెదిరించడం, హత్య చేయడం, కొట్టడం వంటి పనులు చేసి పెడతారు. కాకపోతే వారు డిసైడ్ చేసినంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఏ క్రైమ్‌కి ఎంత చార్జ్ చేస్తారో వివరిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.(చదవండి: 'ఆంటీ' అన్నందుకు జుట్టు పట్టుకుని కొట్టింది) దాని మీద ధమ్కి(బెదిరించడానికి)కి 1000 రూపాయలు, కొట్టడానికి 5,000 రూపాయలు, ఎవరినైనా గాయపర్చడానికి 10,000 రూపాయలు.. హత్యకు 55,000 రూపాయలు మాత్రమే అంటూ ఈ గ్రూపు పోస్టర్ విడుదల చేసింది. దాని మీద ఓ యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఉండగా.. పక్కనే మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రకటన ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరంతా చరతవాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చౌకడ గ్రామానికి చెందిన వారని తెలిసింది. వీరిలో ఓ యువకుడు పీఆర్డీ జవాన్ కుమారుడిగా తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కేసు నమోదు చేశాం. సదరు యువకులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
లవ్‌లో పడేస్తారు!
అభిమాన హీరో పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంటుంది. పుట్టినరోజున రక్తదానం, అన్నదానం, పండ్లు పంపిణీ.. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. హీరోలు కూడా అభిమానుల్ని ఖుషీ చేసేందుకు తాము నటిస్తున్న తాజా చిత్రాల నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్.. ఇలా ఏదో ఒకటి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ నెల 23న హీరో ప్రభాస్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కానుకగా ఎలాంటి అప్డేట్స్ వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఆయన బర్త్ డే గిఫ్ట్‌గా ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ‘రాధేశ్యామ్’ మోష¯Œ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వాళ్లు (హీరోహీరోయిన్ ప్రభాస్, పూజా హెగ్డే) మిమ్మల్ని మరోసారి కచ్చితంగా లవ్‌లో పడేస్తారు. అక్టోబర్ 23న మోష¯Œ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
కొత్త సినిమా షురూ
నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. శుక్రవారం ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీగా ఉంటుంది. నాగశౌర్య సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఛలో’కు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: బుజ్జి. -
మిషన్ 2020
నవీన్‌చంద్ర హీరోగా నటించిన చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. శ్రీమిత్ర అండ్ మైవిలేజ్ సమర్పణలో బన్నీ క్రియేషన్స్, మధు మృధు ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్. రమేష్‌రాజు నిర్మాతలు. కరణం బాబ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలకు కరణం బాబ్జి దర్శకత్వం వహించి, ఆ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ‘మిషన్–2020’ కథ చాలా బావుంది. ఈ ఏడాది 2020 సినిమా పరిశ్రమకు పెద్ద సంక్షోభం, ‘మిషన్ 2020’ సినిమా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. కరణం బాబ్జి మాట్లాడుతూ– ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారు సెంటిమెంట్. నవీన్‌చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ రెడ్డిగారు అంకితభావంతో నటించారు. శ్రీరాపాక గారు రాసిన ఐటమ్ సాంగ్‌తో శనివారం సినిమా షూటింగ్ పూర్తయింది. 2020లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు, సంగీత దర్శకుడు ర్యాప్రాక్ షకీల్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
థియేటర్లోనే ప్రేమకథ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఎమిగోస్ క్రియేష¯Œ్స, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. శనివారం నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘లవ్ స్టోరీ’ మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘15 రోజులు షూటింగ్ మినహా సినిమా పూర్తయింది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక షూటింVŠ ప్రారంభిస్తాం. సరైన సమయంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు. చైతన్య–విక్రమ్‌ల థ్యాంక్యూ నాగచైతన్య హీరోగా తెరకెక్కనున ్న 20వ చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించనున్నారు. ‘‘చైతు, విక్రమ్ కాంబినేష¯Œ లో వచ్చిన క్లాసిక్ మూవీ ‘మనం’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు. -
అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి
మెడపై రూపాయి కాయిన్ ట్యాటూ, చేతికి కట్టుకున్న తాడులో ఓమ్ లాకెట్, ఇయర్ రింగ్.. ఇలా ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్, జి. మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. అలాVó యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్‌లకు గ్రీన్ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేశ్‌బాబు. -
బ్రదర్ అండ్ సిస్టర్
రాఖీ పండగ సందర్భంగా ‘మోసగాళ్లు’ సినిమా టీమ్ ఒక విషయం చెప్పింది. అదేంటంటే.. ఇందులో విష్ణు–కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు చేస్తున్నారని ప్రకటించింది. హాలీవుడ్–ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మించగా, ఏవీఏ ఎంటర్టై¯Œ మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ పోస్టర్ని విడుదల చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌ¯Œ తో వాయిదా పడింది. సినిమా ఎప్పుడు విడుదలయ్యేదీ త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ ఇతర కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి కెమెరా: షెల్డన్ చౌ. -
సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం
లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింసకు పాల్పడిన వ్యక్తుల ఫోటోలను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం విడుదల చేశారు. మవు జిల్లాలో నిందితుల పోస్టర్లతో పాటు వారిపై రివార్డు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితుల ఆచూకీ తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుల ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. యూపీలో ఇప్పటివరకు జరిగిన హింసలో దాదాపు 17 మంది చనిపోయారని, 213 కేసులలో 925 మందిని అరెస్ట్ చేశామని యూపీ డీజీపీ కార్యాలయం తెలిపింది. మవు జిల్లాలో సోమవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 110 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వీడియోలు, ఫోటోలన్నీ సీసీ కెమెరాలు, మీడియా నుంచి సేకరించామని పోలీసులు తెలిపారు. మవు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన అంశంలో మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశామని, 21 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కాన్పూర్ పోలీసులు శుక్ర, శనివారాలలో హింసకు పాల్పడిన 48 మంది నిందితులతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 11 మంది గాయపడ్డారు. వీరిపై 17 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేసినట్టు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ఫిరోజాబాద్‌లో శుక్రవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 80 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. బిజ్నూర్లో ముగ్గురు నిందితులపై 25వేల రివార్డు ప్రకటించగా, అల్లర్లలో ఇద్దరు చనిపోయారు. 146 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్పీ సంజీవ్ త్యాగి మాట్లాడుతూ.. విచారణలో మాజీ మున్సిపల్ చైర్మన్ జావేద్ అఫ్తాబ్, డా. ఫుర్ఖాన్ మెహర్బాన్, ఆదిల్లను గుర్తించాము. ఈ ముగ్గురిపై 25వేల రూపాయల రివార్డు ప్రకటించాము. ఈ ముగ్గురూ ప్రసుతం పరారీలో ఉన్నారు. డా. ఫుర్ఖాన్ బిజ్నూర్లో ఓ మదర్సా కూడా నడుపుతున్నాడని వివరించారు. గోరఖ్‌పూర్‌లో పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 60 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. 33 మంది ఆస్తులను అటాచ్ చేస్తూ వారి ఇంటి గోడలపై నోటీసులు అంటించారు. ఈ విషయంపై పోలీస్ అధికారి జయదీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ఆ నోటీసులలో నిందితులు రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చి హాజరు కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాం. అంతేకాకుండా అల్లర్లలో విధ్వంసానికి పాల్పడలేదని వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతున్నామని వెల్లడించారు. మరోవైపు నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు న్యాయవాది సరీం నవేద్ మాట్లాడుతూ.. పోలీసులు చట్టప్రకారమే వ్యవహరిస్తున్నారు. అయితే మైనర్ల విషయంలో చట్టాలు వేరేలా ఉంటాయి. నిబంధనల ప్రకారం మైనర్ల ఫోటోలను బహిరంగపరచకూడదు. ఈ విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
‘జార్జ్ రెడ్డి’ పోస్టర్ రిలీజ్
చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . ఈ చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘జార్జ్ రెడ్డి’చిత్ర పోస్టర్ రిలీజ్
-
రైలెక్కి చెక్కేస్తా...
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘రైలెక్కి చెక్కేస్తా...’ అనే ఐటెమ్ సాంగ్‌ను దర్శకుడు బాబీ, నటుడు సత్యప్రకాశ్ విడుదల చేశారు. ‘ఎర్రచీర’ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఐటెమ్ సాంగ్ బావుంది. సుమన్ గారు దర్శకునిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించటం చాలా గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా దర్శకుడు బాబీ మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఢమరి అనే సొంత మ్యూజిక్ కంపెనీని స్టార్ట్ చేశాను. శ్రీకాంత్‌గారు ఇంతకుముందు ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో నటించారు. డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హీరోయిన్ సంజనా శెట్టి. సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సురేష్ కొండేటి, మాజీమంత్రి పుష్పలీల, సంగీత దర్శకుడు ప్రమోద్, రచయిత గోపి తదితరులు పాల్గొన్నారు. -
సాహో పోస్టర్: కల్కిగా మందిరాబేడీ
‘సాహో’ పోస్టర్ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ‘కల్కి’ పాత్ర పోషించిన మందిరా బేడి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో నటించిన వారి పాత్రలను పరిచయం చేస్తూ గత కొన్ని రోజులుగా చిత్ర దర్శకుడు సుజీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘గుడ్ ఇస్ బ్యాడ్’ (మంచి చెడుగా మారినప్పుడు) అనే ట్యాగ్‌తో వచ్చిన ఈ పోస్టర్లో మందిరా మెటాలిక్ బ్లాక్, గ్రే కలర్ శారీలో చిన్న జుట్టుతో సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. దీంతో పాటు జెన్నిఫర్‌గా నటించిన హాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దాదాపు 90 కోట్ల ఖర్చుతో అబుదాబిలో చిత్రీకరించారు. ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమాలో ఇదే హైలెట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరోవైపు సాహో ట్రైలర్‌ను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తామని నిర్మాతలు ట్విట్టర్లో ప్రకటించారు. -
డిఫరెంట్ టైటిల్‌తో నవీన్ చంద్ర!
‘అరవింద సమేత’ మూవీలో బెస్ట్ ఫర్ఫామెన్స్తో అందర్నీ ఆకట్టుకున్నాడు నవీన్ చంద్ర. ఇక ఈ మూవీ తరువాత హీరోగా నవీన్ చంద్ర మళ్లీ బిజీగా మారిపోయాడు. తాజాగా మరో మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ.. రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. 28°Cగా రాబోతోన్న ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలినీ హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ చంద్ర మరో తాజా చిత్రం హీరోహీరోయిన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. -
సప్తగిరి హీరోగా.. ‘వజ్ర కవచధర గోవింద’
అతని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే `వజ్ర కవచధర గోవింద` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి. కమెడియన్ సప్తగిరి ఫన్నీ దొంగగా నటిస్తున్న సినిమా `వజ్ర కవచరధర గోవింద`. ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ `నా దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన `సప్తగిరి ఎక్స్ ప్రెస్` విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న `వజ్ర కవచధర గోవింద` అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. సప్తగిరి వ్యావహారిక శైలికి పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది. మా కథకు అనుగుణంగానే పవర్‌ఫుల్‌గా `వజ్ర కవచధర గోవింద` అనే టైటిల్ పెట్టాం` అని అన్నారు. వైభవీ జోషి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . -
సీసాలో ఆవిరి
విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్‌ని ప్రకటించారాయన. అంతేకాదు.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేశారు. గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘‘ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని రవిబాబు తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించనున్నారు. -
సుదీప్ హ్యాపీ బర్త్ డే స్పెషల్ మోషన్ పోస్టర్
-
‘సైరా’ నుంచి మరో ఆకట్టుకునే పోస్టర్
తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇప్పటికే సంచలనం నమోదు చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్ బర్త్‌డే సందర్భంగా సైరా టీమ్ ఓ స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ‘హ్యాపీ బర్త్ డే అభినయ చక్రవర్తి’ అంటూ విష్ చేసింది. ఒంటినిండా నల్లని వస్త్రాలతో, చేతిలో ఆయుధంతో పోజిచ్చిన సుదీప్ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. -
‘మేరా భారత్’ పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్ : వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టేలా మేరా భారత్ మహాన్ షార్ట్ ఫిలిం నిర్మించడం అభినందనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేరా భారత్ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను భావి తరాలకు తెలియచేస్తూ, స్ఫూర్తిదాయకమైన, సందేశాత్మకమైన షార్ట్‌ఫిలింలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి సూచించారు. చిన్నారులతో షార్ట్‌ఫిలిం నిర్మించిన దర్శక నిర్మాతలను ఎంపీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల కమలరాజు, కొప్పురావూరి వెంకటకృష్ణ, అజ్మీరా అశోక్‌నాయక్, ఫిలిం డైరెక్టర్ బేతంపూడి శ్రీకాంత్, నిర్మాత మండె రమణ నటీనటులు అశ్విన్, ప్రదీప్, కెమెరామెన్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
‘చినబాబు’ లుక్ అదిరిపోయింది
తమిళ యువ హీరోలందరిలో సూర్య సినిమాలకు టాలీవుడ్లో కూడా క్రేజ్. సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ కొద్ది రోజుల్లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఊపిరి సినిమాలో కింగ్ నాగ్‌తో కలిసి నటించి, మంచి మార్కులు కొట్టేశాడు. ఖాకీ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న కార్తీ తాజా చిత్రానికి సంబంధించి మే డే కానుకగా పోస్టర్లను విడుదల చేశారు. తలకు పాగా చుట్టుకుని, అద్దాలు పెట్టుకుని మాస్ లుక్కులో ఉన్నాడు. బైక్ నంబర్ ప్లేట్‌పై ఫార్మర్ అని కూడా ఉంది. అలాగే కూలీలందరితో కార్తీ కూర్చొని ఉన్న మరొక ఫోటోను కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా రైతుకు సంబంధించిన కథే అని తెలుస్తోంది. ఇక కార్తీకి జోడిగా అఖిల్ ఫేం సాయేషా నటిస్తోంది. ఈ సినిమాకు ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, పాండ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, రవీందర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
‘అతని మౌనమే అతని ఆయుధం’
నారా వారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు నారారోహిత్. పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.... తను మాత్రం ప్రయోగాత్మక పాత్రలోనే నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. నారా రోహిత్ సినిమా అంటే కొత్తగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా నారారోహిత్ మూగవాడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఉగాది సందర్భంగా లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు శబ్దం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వికాస్ కురిమెళ్ల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. -
నాని చెప్పినట్లే చేసేశాడు
సాక్షి, సినిమా : హీరో నాని చెప్పినట్లుగా చేసేశాడు. కొత్త కృష్ణార్జున యుద్ధానికి సంబంధించి రెండో పాత్ర అర్జున్ లుక్కును సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. రాకింగ్ స్టార్ అవతారంలో నేచురల్ స్టార్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. భోగి సందర్భంగా ఊర మాస్ రోల్లో కృష్ణ పాత్ర లుక్కును విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించబోతున్నాడని పోస్టర్లను చూస్తే అర్థమైపోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 😊 Happy Sankranthi :))#ArjunFirstLook #KrishnarjunaYudham #KAY pic.twitter.com/ILY41MHqfm — Nani (@NameisNani) 15 January 2018 -
చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
చేగుంట: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు కోసం హైదరాబాద్‌లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. చేగుంటలో బుధవారం చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తమ డిమాండ్‌ను వినిపించడానికి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానం పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఎలాంటి భద్రత ఉండని కుటుంబ సభ్యులకు భరోసా లేని విధంగా ఉంటుందన్నారు. దీంతో ఉద్యోగులకు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల నుంచి నెలనెలా తీసుకునే డబ్బులను షేర్ మార్కెట్‌కు బదిలీ చేయడంతో పదవీ విరమణ అనంతరం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉద్యోగుల భవిష్యత్తు ఉందని వాపోయారు. ఈ విధానం రద్దు కోసం జరిపే పోరాటంలో అన్ని సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఎస్ సంఘం నాయకులు నాగరాజు, లక్ష్మణ్, సిద్దిరాములు, మధన్, వారాల నర్సింలు, రాజేందర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. -
2న ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మె
చేగుంట: సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ పేర్కొన్నారు. చేగుంటలో ఆయన సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 2న పది కార్మిక సంఘాలతో సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 3వేల పెన్షన్, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్పులు, డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణం, కనీస వేతన పెంపు, సకాలంలో కార్మిక సంఘాల రిజిస్టేషన్ తదితర అంశాలపై పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కార్మిక నాయకులు శంకర్ , కుమార్, రాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఉజ్జయిని మహంకాళి బోనాల పోస్టర్ విడుదల
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కూడా బోనాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. -
మనోజ్ 'శౌర్య' ఫస్ట్ లుక్ విడుదల
-
కేసీఆర్‌ను మేల్కొలిపేందుకే రైతు దీక్ష
- వైఎస్సార్సీపీ నేత శివకుమార్ వెల్లడి - మైనార్టీ సోదరులందరూ తరలిరావాలని విజ్ఞప్తి - పోస్టర్ విడుదల హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు... ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మేల్కొలిపేందుకు రైతన్నకు అండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుదీక్ష చేపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాస రెడ్డి దీక్ష చేపడుతున్నారన్నారు. అక్కడ ఏపీ రాష్ట్రంలోనూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి తిరిగి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లోని మైనార్టీ సోదరులందరూ ఎంపీ శ్రీనివాస రెడ్డి చేపట్టే దీక్షలో పాల్గొనాలని కోరారు. గారడీ మాటలొద్దు: వైఎస్సార్ సీపీ నగర యువజన విభాగం రైతులు కరువు పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వడగండ్ల వర్షాలు మరింత నష్టం తెచ్చిపెట్టాయని ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ గాల్లో తిరుగుతూ గారడీ మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నగర విభాగం అధ్యక్షుడు ఎ. అవినాష్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆదర్శ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రచార పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. వేరువేరు చోట్ల జరిగిన ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో నగర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.రిజ్వాన్ హుస్సేన్, కమిటీ సభ్యులు ఎం అల్తాఫ్ ఉద్దీన్, ఎం.ఇస్మాయిల్, ఫైషల్ షా, అబుల్ ఖైర్ సిద్దికీ, నగర యువజన విభాగం నాయకులు కపిల్, ఫైజల్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు. -
కూనపురి రాములు పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ: మాజీ మావోయిస్టు కూనపురి రాములు ప్రథమ వర్ధంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 11న నల్గొండ జిల్లా దాసిరెడ్డిగూడెంలో రాములు వర్ధంతి వేడుకలను నిర్వహించనున్నారు. అదే రోజున స్థూపం ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
సూర్య మాస్ పోస్టర్ ఇంగ్లీషుకు కాపీనా?
ప్రయోగాలకు పెద్దపీట వేసే హీరో సూర్య.. తన 'మాస్' చిత్రం పోస్టర్‌ను దీపావళి కానుకగా మంగళవారం అర్ధరాత్రి విడుదల చేశాడు. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్లో నల్లటి బొగ్గు రంగు పూసుకుని ఉన్న సూర్య చాలా విభిన్నంగా కనిపించాడు. బహుముఖ ప్రజ్ఞావంతుడైన వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ మాత్రం.. వేరే ఇంగ్లీషు సినిమా పోస్టర్‌కు కాపీ అన్న అనుమానాలు వస్తున్నాయి. 'ద బోర్న్ అల్టిమేటం' అనే ఇంగ్లీషు సినిమా పోస్టర్ కూడా అచ్చం ఇలాగే ఉంది. అందులో హీరో కూడా ఇలా నల్లరంగు పూసుకుని పోస్టర్లో కనిపిస్తాడు. 'మాస్' ఫేస్బుక్ పేజీలో సూర్య పోస్టర్ పోస్ట్ చేయగానే.. కొంతమంది ఈ రెండు సినిమాల పోస్టర్లను పక్కపక్కనే పెట్టి.. ఇది కాపీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు కమలహాసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం పోస్టర్ మీద కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది. అయితే అది వేరే సినిమాకు మాత్రం కాపీ కాదు. ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ మాత్రం ఇంగ్లీషు సినిమా పోస్టర్‌కు అచ్చుగుద్దినట్లుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌తో కలిసి వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. నయనతార, అమీ జాక్సన్ ఈ సినిమాలో సూర్య సరసన నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందిస్తున్నారు.