హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కూడా బోనాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.