
ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక(Swasika)ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత అనే పాత్రలో స్వాసిక కనిపించనున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
‘‘సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’. ఈ మూవీలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా సవాల్‌తో కూడుకున్న పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘తమ్ముడు’తో పాటు హీరో సూర్య 45వ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్వాసిక.
Comments
Please login to add a commentAdd a comment