Aadi Sai Kumar
-
ఓటీటీలో అసురుడిని ఎదురించిన ధీరుడి కథ సడెన్ ఎంట్రీ
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే కాన్సెప్ట్‌తో 'షణ్ముఖ' చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆహా తెలుగు ఓటీటీ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. . ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్( Avika Gor) గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.A cop, a scholar, and an ancient mystery!Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3— ahavideoin (@ahavideoIN) April 10, 2025 -
‘షణ్ముఖ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించనుంది. డివోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ చేశారు.'సూరులైనా.. అసురులైనా.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇది ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే డైలాగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో ఆది సాయి కూమార్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ ఘనత ఆయనకే దక్కుతుంది: ఆది సాయికుమార్
‘‘నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది. ఈ నెల 21న ‘షణ్ముఖ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమా ఘనత అంతా దర్శక, నిర్మాత షణ్ముగం సాప్పనికే దక్కుతుంది. మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుంది. మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఆది సాయికుమార్(Adi Sai kumar) చెప్పారు.షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేశ్ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలకు ముందే అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.‘‘డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ మూవీ చేయడం హ్యాపీ’’ అని అవికా గోర్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాని ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్ రెడ్డి విడుదల చేస్తున్నారు’’ అన్నారు షణ్ముగం సాప్పని. -
ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘శంబాల’ లో ఏం జరిగింది? దేవి సమస్య ఏంటి?
వెనకాల గుడి, చుట్టూ పక్షులు, ఎర్రబారిన కళ్లు, విషణ్ణ వదనంతో ‘ఈ అమ్మాయికి ఏమైందబ్బా’ అనేలా కనిపించింది దేవి. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? అనేది ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంలో చూడాల్సిందే. ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. ఈ చిత్రంలో దేవి అనే ముఖ్య పాత్రలో నటిస్తున్న అర్చనా అయ్యర్ లుక్‌ని విడుదల చేశారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. ‘‘ఈ చిత్రంలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్ర చేస్తున్నారు. సరికొత్త కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
హారర్... థ్రిల్
ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’(Shambala). ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక(Swasika)ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత అనే పాత్రలో స్వాసిక కనిపించనున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్.‘‘సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘శంబాల’. ఈ మూవీలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా సవాల్‌తో కూడుకున్న పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘తమ్ముడు’తో పాటు హీరో సూర్య 45వ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్వాసిక. -
శంబాల: న్యూఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar) శంబాల అంటూ కొత్త ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ (Shambhala: Mystical World) అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది సాయి కుమార్ వింటేజ్ మేకోవర్ అదిరిపోయింది. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన కొత్త పోస్టర్ శంబాల మీద మరింతగా ఆసక్తి పెంచేలా ఉంది. ఈ పోస్టర్లో చూపించిన పొలం.. దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో లబ్బర్ పందు ఫేమ్ స్వాసిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో తళుక్కుమని మెరవనున్నారు. హన్స్ జిమ్మర్ వంటి హాలీవుడ్ వ్యక్తులతో కలిసి పనిచేసిన ప్రతిభావంతులైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శంబాల శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.చదవండి: క్యాన్సర్ నుంచి కోలుకున్నా.. త్వరలోనే మీ ముందుకు వస్తా: శివరాజ్ -
హారర్ థ్రిల్లర్
‘శంబాల’ కోసం జియో సైంటిస్ట్‌గా మారారు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. అర్చనా అయ్యర్ హీరోయిన్ . యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా సోమవారం (డిసెంబరు 23) ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘శంబాల’ నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో ఈ మూవీ తీస్తున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన యుగంధర్ ముని ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్్స జిమ్మర్తో పని చేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు’’అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. హైదరాబాద్‌లో షూటింగ్!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శంబాల. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ సినిమాకు'ఏ' యాడ్ ఇన్ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు.ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ మూవీలో శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా 'శంబాల'
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ఛాలెంజింగ్ రోల్లో నటించేందుకు రెడీ అయ్యాడు. తన నటిస్తున్న కొత్త సినిమా 'శంబాల' విభిన్నమైన కాన్సెప్ట్‌తో రానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామనే హింట్‌ను మేకర్స్ ఇచ్చారు.టైటిల్ పోస్టర్లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే 'శంబాల' కథ లో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్స్ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. డిసిప్లిన్, డెడికేషన్ కు కేరాఫ్‌గా నిలిచిన ఆది సాయికుమార్ ఈసారి జియో సైంటిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఆనంది ఈ సినిమాలో ఆదీకి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.'ఏ' యాడ్ ఇన్ఫినిటిమ్ అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తన తొలి సినిమా తరహాలోనే 'శంబాల'ను కూడా ఓ డిఫరెంట్ వరల్డ్‌లో రూపొందిస్తున్నారు.సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నారు.అమెరికాలోని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ ట్రైనింగ్ తీసుకున్న యుగంధర్, 'శంబాల' సినిమాను హాలీవుడ్ స్థాయిలో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా విజువల్స్ పరంగా, టెక్నికల్‌గా సినిమాను "టాప్ క్లాస్"అనే రేంజ్లో తెరకెక్కించేందుకు అన్ని రకాలుగా సహకరింస్తున్నారు నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి.టెక్నికల్ సపోర్ట్ విషయంలోనూ హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్‌నే తీసుకున్నారు యుగంధర్. డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్ జిమ్మర్ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఇండియన్ మ్యూజీషియన్ శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో వినిపించబోతున్నారు. -
దీపావళికి షణ్ముఖ
ఆది సాయికుమార్ హీరోగా అవికా గోర్ హీరోయిన్గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పాన్ ఇండియా మూవీగా షణ్ముగం సాప్పని దర్శకత్వలో సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. షణ్ముగం సాప్పని మట్లాడుతూ – ‘‘ఆది సాయికుమార్ కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీలా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందించిన చిత్రం ఇది. గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుంది. రవి బస్రూర్ ‘షణ్ముఖ’కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దీపావళి సీజన్లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాన్ ఇండియా మూవీని పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
పవర్ఫుల్ పోలీస్
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించారు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ– ‘‘డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘షణ్ముఖ’. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందించాం. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటించారు. ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
యువ హీరో ఆది సాయి కుమార్.. త్వరలో 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. అన్ని కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి:పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'? )ఇందులో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు లాంటి హిట్ సినిమాలకు అనూప్ రుబెన్స్ సంగీతమందించారు. ఇప్పుడు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్రానికి అలాంటి సాంగ్స్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'రుధిరాక్ష' కోసం ఏకమైన ఆది సాయికుమార్, జేడీ చక్రవర్తి
ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఆది సాయికుమార్. తాజాగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమా ‘రుధిరాక్ష’ను కూడా పట్టాలెక్కించాడు. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు. హై బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 'యానిమల్' ఫేం హర్షవర్షన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కిశోర్ బోయిదాపు డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర మాటలు అందిస్తున్నారు. -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ 'CSI సనాతన్'
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో ఆది సాయికుమార్. ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా 'CSI సనాతన్' అంటూ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్‌దేవ్ ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఆది సాయి కుమార్ యాక్షన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్గా నటించగా, నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చదవండి: ఎంపీతో హీరోయిన్ పరిణీతి ఎంగేజ్మెంట్.. అతిథులకు ఆహ్వానం -
ఇలాంటి కథ తెలుగులో ఇదే మొదటిది: హీరో ఆది
‘‘ఏడాదిన్నర క్రితం దర్శకుడు దేవ్ ‘సీఎస్ఐ సనాతన్’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. సాధారణ పౌరులకు కనెక్ట్ అయ్యే కథ ఇది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటించిన చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. సునిత సమర్పణలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆది మాట్లాడుతూ– ‘‘మామూలుగా ఇలాంటి కథలు మలయాళంలో చూస్తుంటాం. తెలుగులో మా ‘సీఎస్ఐ సనాతన్’ మొదటిది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఇప్పటికే మన దేశంలో ఈ కథలోని ఘటనల్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అన్నారు శివశంకర్ దేవ్. -
‘పులి మేక’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సనాతన్ లక్ష్యం
ఆది సాయికుమార్ టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుంది. ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. కార్పొరేట్ లీడర్ విక్రమ్ చక్రవర్తి హత్యను చేధించడమే లక్ష్యంగా సీఎస్ఐ (క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్) సనాతన్ ఐదుగురు నిందితులను విచారించడం ఈ ట్రైలర్లో కనబడుతుంది. ఐదుగురూ ఐదు రకాలుగా చెబుతారు. ‘నిజాన్ని అస్సలు ఊహించలేము’ అని సనాతన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగుతుంది. ‘‘మర్డర్ మిస్టరీగా రూపొందించిన ఈ చిత్రం ఉత్కంఠభరింతగా ఉంటుంది’’ అని నిర్మాత అజయ్ శ్రీనివాస్ అన్నారు. -
'టాప్ గేర్' మూవీ రివ్యూ
టైటిల్: టాప్ గేర్ నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మజీ, సత్యం రాజేశ్, మైమ్ గోపీ, శత్రు, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్ చంద్ర నిర్మాణ సంస్థలు:ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాత: కేవీ శ్రీధర్ రెడ్డి దర్శకత్వం: కె.శశికాంత్ సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ: డిసెంబర్ 30,2022 యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'టాప్ గేర్'సినిమాతో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆది. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే: ఆది సాయికుమార్(అర్జున్) ఓ క్యాబ్ డ్రైవర్. రియా సుమన్(ఆద్య)ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. కొత్తగా పెళ్లైన దంపతులు కావడంతో చాలా అన్యోన్యంగా ఉంటారు. మైమ్ గోపీ(సిద్ధార్థ్) డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇతని ముఠాలో బ్రహ్మజీ, సత్యం రాజేశ్ కూడా ఉంటారు. డ్యూటీకి వెళ్లిన అర్జున్ ఇంటికొస్తుండగా ఓ క్యాబ్ బుకింగ్ ఆర్డర్ వస్తుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అనుకోకుండా ఆరోజు అతని క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు ఎక్కుతారు. ఆరోజు రాత్రి అర్జున్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అతనికి ఓ గుడ్ న్యూస్ చెప్పాలని భార్య ఆద్య ఇంటి దగ్గర నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ ఆరోజు రాత్రి అర్జున్ ఇంటికెళ్లాడా? ఆ గుడ్ న్యూస్ విన్నాడా? అసలు క్యాబ్‌లో ఎక్కిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత అర్జున్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? డ్రగ్స్ ముఠాకు, హీరోకు సంబంధం ఏంటీ? అర్జున్ను పోలీసులు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. కథ ఎలా సాగిందంటే.. డ్రగ్స్ ముఠా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విలన్ ఇంట్రడక్షన్‌తోనే కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆది, రియా సుమన్ పెళ్లి, దంపతుల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో ఎలాంటి పరిచయం లేకుండానే డైరెక్ట్‌గా పాత్రలను రంగంలోకి దించారు డైరెక్టర్. జీవనం సాఫీగా నడుస్తున్న క్యాబ్ డ్రైవర్ జీవితంలోకి డ్రగ్స్ ముఠా ఎంట్రీ కావడం, ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండానే కథ సాగడం ప్రేక్షకుల కాస్త బోర్ కొట్టించింది. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్ చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఫస్టాఫ్ ఓ రొమాంటిక్ సాంగ్ మినహా ఎలాంటి యాక్షన్ సీన్స్, కామెడీ లేకుండానే ముగుస్తుంది. సెకండాఫ్‌కు వచ్చేసరికి కథలో వేగం పెంచారు. డ్రగ్స్ ముఠా, హీరో మధ్య సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథలో డేవిడ్ అనే పాత్రే అసలు ట్విస్ట్. సెకండాఫ్ మొత్తం డ్రగ్స్ ఉన్న బ్యాగ్ చుట్టే కథ నడిపించారు. మధ్యలో అక్కడక్కడ కొత్త పాత్రల ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచారు. డ్రగ్స్ ముఠా, పోలీసులు, హీరో చుట్టే సెకండాఫ్ తిరుగుతుంది. మధ్యలో ఓ యాక్షన్ ఫైట్, డ్రగ్స్ బ్యాగ్ కోసం హీరో అర్జున్(ఆది) చేసే సాహసం హైలెట్. ఒకవైపు యాక్షన్ సన్నివేశాలు చూపిస్తూనే.. మరోవైపు భార్య, భర్తల ప్రేమానురాగాలను డైరెక్టర్ చక్కగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ నవ్వులు తెప్పించడం ఖాయం. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం శశికాంత్కే సాధ్యమైంది. ఓవరాల్‌గా మనుషుల ఎమోషన్స్‌తో ఇతరులు ఎలా ఆడుకుంటారనే సందేశాన్నిచ్చారు డైరెక్టర్. అలాగే డ్రగ్స్ బారినపడి యువత జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే సందేశమిచ్చారు డైరెక్టర్. ఎవరెలా చేశారంటే.. ఆది సాయికుమార్ యాక్షన్ బాగుంది. క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. రియా సుమన్ నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విలన్‌గా మైమ్ గోపీ(సిద్ధార్థ్) ఆకట్టుకున్నారు. శత్రు(ఏసీపీ విక్రం) పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం సినిమాకు ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు.ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. -
ఆ ధైర్యం ఉంటేనే సినిమా తీయాలి: నిర్మాత శ్రీధర్ రెడ్డి
‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలెంజింగ్ మారింది. సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ నిర్మాతకు సవాళ్లే. వాటిని ఎదుర్కొగలను అనే ధైర్యం ఉంటేనే సినిమా నిర్మాణ రంగంలోకి దిగాలి’అని నిర్మాత కేవీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆది సాయి కుమార్, రియా జంటగా కె.శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేవీ శ్రీధర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ‘టాప్ గేర్’ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది. ► టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు. హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ► ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చగలను. ► టాప్ గేర్ సినిమాను చూశాక సాయి కుమార్.. ‘ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుంది’అని చెప్పారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. -
ఆది సాయికుమార్ ‘టాప్‌గేర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అది అందరికీ అర్థం కాని పెద్ద పజిల్: ఆది సాయికుమార్
‘‘ప్రస్తుతం ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారన్న విషయం అంచనాలకు అందడంలేదన్న మాటలను నేనూ వింటున్నాను. ఓ సినిమా సెంట్రల్ ఐడియా కొత్తగా ఉందంటే సగం పాసైయినట్లే అని నమ్ముతాను’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘టాప్‌గేర్’ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఒక్కరోజులో జరిగే కథతో రూపొందిన చిత్రం ‘టాప్ గేర్’. ఏ మాత్రం తనకు సంబంధం లేని ఓ సమస్యలో ఇరుక్కునే ఓ క్యాబ్ డ్రైవర్ అందులో నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఈ సినిమా కథనం. మేజర్ షూటింగ్ అంతా కారులోనే చేశాం. స్క్రీన్‌ప్లే రేసీగా సాగుతుంది. నా గత చిత్రాల మాదిరిగానే ‘టాప్ గేర్’ కూడా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్. నా ప్రతి సినిమాకు నేను వంద శాతం కష్టపడుతూనే ఉన్నాను. నా సినిమా లను గమనిస్తే అందులోని ప్రధానాంశం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. ‘టాప్‌గేర్’ కూడా అలాంటి కథాంశమే. ► ప్రస్తుతం మాస్ యాక్షన్ ఫిల్మ్ నిర్వచనం మారింది. ఇప్పుడు ఎక్కువగా ‘కేజీఎఫ్’లాంటి స్టయిలిష్ యాక్షన్ ఫిలింస్‌ని చూస్తున్నారు. భవిష్యత్‌లో నేనూ ఓ స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేస్తాను. ► థియేటర్స్‌లో ఓ హిట్ సాధించడం అనేది అందరికీ ఓ సవాలుగా మారింది. రీసెంట్గా విడుదలైన నా ‘క్రేజీ ఫెలో’ చిత్రం మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ మా సినిమా విడుదలైన మర్నాడే కన్నడ ‘కాంతార’ తెలుగులో విడుదలైంది. ఆ సినిమా ఫ్లోలో మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. బహుశా.. రాంగ్ రిలీజ్ డేట్ కావొచ్చు. ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలను ఆడియన్స్ ఓటీటీలోనే చూడాలని ఫిక్స్ అయ్యారో లేదా థియేట్రికల్ మూవీ అంటే ఏదో ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ఉండాలని ఫిక్స్ అయ్యారా? అన్నది ఇప్పుడు అందరికీ అర్థం కాని పెద్ద పజిల్. ► ప్రస్తుతానికి నెగటివ్ రోల్స్ చేయాలనుకోవడం లేదు. ఏదైనా అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతం లక్కీ మీడియాలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పులిమేక’ వెబ్ సిరీస్ చేశాను. త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ► నాన్నగారు చేసిన ‘అసలేం గుర్తుకురాదు..’ (‘అంతఃపురం’) సినిమా పాటను రీమిక్స్ చేయా లని ఉంది. అయితే నా సినిమాలో ఆ పాటకు తగ్గ సందర్భం కుదరాలి. ఒకవేళ రీమిక్స్ చేస్తే దర్శకుడు కృష్ణవంశీగారే తీయాలి. -
హీరో ఆదికి 'టాప్ గేర్' టీమ్ బర్త్‌డే విషెస్
'ప్రేమ కావాలి' అంటూ కెమెరా ముందుకొచ్చి తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్. 2011లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వైవిధ్యభరితమైన కథలతో అలరిస్తున్నారు. రోల్ ఎలాంటిదైనా సరే అందులో లీనమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాకు గాను దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నారు ఆది. ఈ ఏడాది కూడా ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులను థ్రిల్ చేశారాయన. ప్రస్తుతం ఆయన తెలుగులో టాప్ గేర్ సినిమా చేస్తున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. నేడు (డిసెంబర్ 23) ఆది సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో 'టాప్ గేర్' టీమ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు ఆది సాయి కుమార్. చదవండి: ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్ చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన కైకాల సత్యనారాయణ -
'యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి'.. 'టాప్ గేర్'లో ట్రైలర్
యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ముందుకొస్తున్నారు ఆది సాయి కుమార్. 'టాప్ గేర్'తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ హీరో రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అసలు కథేంటంటే..: కథలోని పాత్రలందరూ డేవిడ్, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్కూ సంబంధం ఏంటి? క్యాబ్ డ్రైవర్ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్లో ఆది యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది చెప్పే డైలాగ్ సినిమాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోబ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆది సాయికుమార్ 'టాప్ గేర్' ట్రైలర్ విడుదల
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం టాప్ గేర్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. డిసెంబర్30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను వదిలారు. మాస్ మహారాజ రవితేజ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘‘యుద్ధం గెలవాలంటే మృత్యువుతో పోరాడే గెలవాలి’’ అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఎంతోకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఆది సాయికుమార్‌కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. -
ఆసక్తి రేపుతున్న ఆది సాయికుమార్ 'టాప్ గేర్' టీజర్
ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్ తాజాగా సినిమా టీజర్‌ను వదిలారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కార్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. విజువల్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రేజీఫెలో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదిసాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమా కోసం ఆది స్పెషల్ కేర్ తీసుకుని బరువు తగ్గాడు కూడా! ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిరర్మించారు. అక్టోబర్ 14న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రేపటి(డిసెంబర్ 3) నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీవితంలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బెస్ట్ ఆప్షన్ పట్టుకుని వెళ్లిపోవడమే జీవితం.. మీ బెస్ట్ ఆప్షన్ ఈ వీకెండ్‌కి మా క్రేజీ ఫెలోని చూడటమే.. చూసేయండి మరి అంటూ ఆహా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. “Life is full of options andi, best option pattukoni vellipovadame jeevitham”. 😛 🙂 Mee best option ee weekend ki ma “crazy fellow” ni chudatame. Chuseyandi mari 😉#CrazyFellowOnAHA Streaming from dec 3rd https://t.co/hw1zXxA9eE@iamaadisaikumar @DiganganaS @mirnaaofficial pic.twitter.com/6IR4toLPzx — ahavideoin (@ahavideoIN) December 2, 2022 చదవండి: ఓటీటీలోకి ఊర్వశివో రాక్షసివో స్ట్రీమింగ్ హిట్ 2 మూవీ రివ్యూ -
Top Gear: నువ్వు నా వెన్నెల...
‘వెన్నెల వెన్నెల.. నువ్వు నా వెన్నెల.. దైవమే ప్రేమగా పంపేనే నిన్నిలా...’ అంటూ సాగుతుంది ‘వెన్నెల వెన్నెల...’ పాట. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె.శశికాంత్ డైరెక్షన్లో రూపొందిన ‘టాప్ గేర్’ చిత్రంలోని పాట ఇది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అదించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. కేవీ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని ‘వెన్నెల వెన్నెల’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
సిద్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల సాంగ్ విన్నారా?
యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టాప్ గేర్. కె శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వెన్నెల వెన్నెల పాటను రిలీజ్ చేశారు. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్ చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి -
ఆది సాయికుమార్ 'టాప్ గేర్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'వెన్నెల వెన్నెల' పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. 1st single #VennelaVennela Will be out on 25th ! @rameemusic @sidsriram @IRiyaSuman #TOPGEAR pic.twitter.com/5hDXnXQ8zb — AadiSaikumar (@AadiSaikumar) November 21, 2022 -
వచ్చే నెల టాప్ గేర్
ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాప్ గేర్’. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇందులో ఆది టాక్సీ డ్రైవర్‌గా నటించారు. అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ పాయింట్‌ని మూవీలో టచ్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
ఆది సాయి కుమార్ 'టాప్ గేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ 'టాప్ గేర్' అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది సాయికుమార్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ ఆది సాయికుమార్ రీసెంట్గా అందరినీ మెప్పించారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న టాప్ గేర్ సినిమాతో ఆది సాయి కుమార్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. -
యాక్షనే కాదు రొమాన్స్‌లోనూ ‘టాప్ గేర్’ వేసిన ఆది
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఇటీవల ‘క్రేజీ ఫెలో’తో అలరించిన ఆది..త్వరలోనే ‘టాప్ గేర్’అనే డిఫరెంట కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్‌ను చూపిస్తోంది. యాక్షన్లోనే కాదు.. రొమాన్స్‌లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్ రియా సుమన్, ఆది కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు
‘‘క్రేజీ ఫెలో’ సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ చాలా బాగుంది’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ విజయం యూనిట్ అందరిది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు ‘‘మంచి సినిమా వస్తే థియేటర్‌కి వస్తామని ‘క్రేజీ ఫెలో’తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ఫణికృష్ణ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్. ∙మిర్నా మీనన్, ఆది, దిగంగన, రాధామోహన్, ఫణికృష్ణ -
Crazy Fellow Review: ‘క్రేజీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: క్రేజీ ఫెలో నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్, నర్నా శ్రీనివాస్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్ నిర్మాత: కే.కే. రాధామోహన్ దర్శకుడు: ఫణికృష్ణ సిరికి సంగీతం: ఆర్.ఆర్. ధృవన్ సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల ఎడిటర్: సత్య గిడుతూరి విడుదల తేది: అక్టోబర్ 14, 2022 యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇటీవలె ‘తీస్మార్ ఖాన్’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటకుల మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(అక్టోబర్ 14) విడుదలైన ఈ ‘క్రేజీ ఫెల్లో’ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభిరామ్ అలియాస్ నాని ఓ క్రేజీ ఫెలో. చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణించడంతో అన్నావదినలు(అనీష్, వినోదిని వైద్యనాథన్) గారాబంగా పెంచుతారు. ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలు తప్ప అతనికి వేరే ఏ పని ఉండదు. పైగా ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. అభి అతి వల్ల స్నేహితుడి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇక తమ్ముడిని ఇలానే వదిలేస్తే.. పనికిరాకుండా పోతాడని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు అన్నయ్య. అక్కడ మధుమతి(దిగంగనా సూర్యవంశీ)ని చూస్తాడు అభి. వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. గతంలో అభి వేసిన వెధవ వేషాలు తెలిసి మధుమతి అతనికి దూరంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా వీరిద్దరు ఓ డేటింగ్ యాప్ ద్వారా స్నేహితులు అవుతారు. అయితే ఆ యాప్‌లో వీరిద్దరు వేరు వేరు పేర్లు, ఫోటోలు అప్లోడ్ చేస్తారు. వారిద్దరు కాస్త క్లోజ్ అయ్యాక మధుమతికి చిన్ని అని ముద్దు పేరు పెడతాడు అభి. ఇలా చాటింగ్ ద్వారా క్లోజ్ అయ్యాక.. ఓ రోజు కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలో మరో అమ్మాయిని(మిర్నా మీనన్) చూసి చిన్ని అనుకొని ప్రపోజ్ చేస్తాడు. అనూహ్యంగా ఆమె పేరు కూడా చిన్ని కావడం.. అతను ప్రపోజ్ చేయడాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడడంతో గొడవలు జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల అభి ప్రేమించిన చిన్నిని కాకుండా ప్రపోజ్ చేసిన చిన్నితో పెళ్లికి రెడీ అవుతాడు. మరి తాను చాటింగ్ చేసిన చిన్నియే మధుమతి అని అభికి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఏం జరిగింది? ఇన్నాళ్లు తాను గొడవపడిన అభిరామే తను ప్రేమించిన నాని అని తెలుసుకున్న మధుమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పుడు డేటింగ్ యాప్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. అలాంటి ట్రెండింగ్ పాయింట్‌ని పట్టుకొని కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. కథలో కొత్తదనం లేదు కాని కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. డేటింగ్ యాప్ ద్వారా అభి, మధుమతి పరిచయం కావడం.. చూడకుండానే ప్రేమలో పడడం, చివరికి ఒకరికి బదులు మరొకరిని కలవడం..స్టోరీ వినడానికి ఇలా రొటీన్‌గా ఉన్న.. దానికి కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడపడం ‘క్రేజీ ఫెలో’కి ప్లస్ అయింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఆది, నర్రా శ్రీనివాస్ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌పై కూడా దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఇద్దరి హీరోయిన్లతో చాలా చోట్ల భావోద్వేగాలను పండించోచ్చు. కానీ దర్శకుడు దానిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ప్రేమ విషయంలో కూడా అదే చేశాడు. ముఖ్యంగా రెండో హీరోయిన్ మిర్నా మీనన్, హీరోతో లవ్‌లో పడే సన్నివేశాలు మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఏడాదిలో ఆరేడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ప్రతి సినిమాలోనూ ఆది ఒకే లుక్‌లో కనిపించడంతో కొత్తదనం లోపించినట్లు అనిపించేది. కానీ ‘క్రేజీ ఫెలో’తో ఆది తనపై ఉన్న విమర్శకు చెక్ పెట్టాడు. తెరపై కొత్త లుక్‌లో కనిపించి అలరించాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలోనూ మెరుగయ్యాడు. ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకునే అభి పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించడంతో పాటు యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ ఇరగదీశాడు. మధుమతి గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది కానీ ప్రతి సన్నివేశానికి ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. చిన్ని పాత్రలకు మిర్నా మీనన్ న్యాయం చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ రమేశ్ పాత్రలో నర్రా శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఆది, నర్రా శ్రీనివాస్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. . హీరో వదినగా వినోదిని వైద్యనాథ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె డబ్బింగ్ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో బ్రదర్‌గా అనీష్ కురువిల్లా, స్నేహితులుగా సాయి, సాయితేజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు ఉన్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య గిడుతూరి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
క్రేజీ ఫెలో కోసం బరువు తగ్గాను
‘‘క్రేజీ ఫెలో’ని ఎంజాయ్ చేస్తూ, చేశాను. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ మూవీ చూశామనే అనుభూతి కలిగిస్తుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు... ► చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే యువకుడి పాత్రను ‘క్రేజీ ఫెలో’లో చేశాను. ఫణికృష్ణ చాలా మంచి కథ రాసుకున్నాడు. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. కామెడీ టైమింగ్‌లోనూ ఫణి స్పెషల్ కేర్ తీసుకున్నాడు. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. కథలో సెకండాఫ్ మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్రెష్ లుక్ ట్రై చేశాను.. బరువు తగ్గాను. ► నేను హీరోగా చేసే కొన్ని సినిమాల కథలను నాన్న (నటుడు సాయికుమార్)గారు వింటారు. ‘క్రేజీ ఫెలో’ కథ విని, హ్యాపీ ఫీలయ్యారు. నాన్నగారి అభిప్రాయం తీసుకోకుండా నేను చేసిన కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ‘గాలిపటం’ సినిమా కథ బాగుంది కానీ క్లయిమాక్స్ కాస్త మార్చితే బాగుంటుందని నాన్నగారు సలహా ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ఆడియన్స్ ఆ క్లయిమాక్స్ ఒప్పుకోలేదు. ఇలా నాన్నగారి జడ్జ్మెంట్ బాగుంటుంది. ► ప్రస్తుతం ‘టాప్ గేర్’, ‘సీఎస్ఐ: సనాతన్’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్ చేశాను. నవంబరులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావొచ్చు. ‘అమరన్ ఇన్ సిటీ’ సినిమా షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది. -
ఇప్పుడు అదే పెద్ద సవాల్
‘‘నేను కాంబినేషన్‌ని కాదు.. కథని బలంగా నమ్ముతాను. ‘క్రేజీ ఫెలో’ బలమైన కథ. ఫణికృష్ణ కొత్తవాడైనా సినిమాని చక్కగా తీశాడు. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే క్లీన్ సినిమా ఇది’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ కథని ముందు ఆదికి వినిపించాడు ఫణికృష్ణ. ఆ తర్వాత నేను విన్నాను, నచ్చింది. ఈ సినిమాలో ఆది క్యారెక్టర్ క్రేజీగా, కొత్తగా ఉంటుంది. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు ఓటీటీకి అలవాటుపడ్డారు. అంతర్జాతీయ స్థాయి కంటెంట్ దొరుకుతుండటంతో వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంతో పాటు వారిని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక–నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ‘క్రేజీ ఫెలో’ మంచి కంటెంట్ ఉన్న వినోదాత్మక చిత్రం.. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారనే నమ్మకం ఉంది. నిర్మాతలకు ప్రస్తుతం రెవెన్యూ ఆప్షన్స్ పెరిగినప్పటికీ మిగిలేది ఏమీ లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో పాటు సినిమా నిర్మాణ ఖర్చులు పెరగడమే కారణం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీ కార్పొరేట్ స్టయిల్లో ఉంది.. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం ఆయుష్ శర్మ హీరోగా హిందీ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
అది దర్శక నిర్మాతలకు ఒక సవాల్: కేకే.రాధామోహన్
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారింది. ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ కంటెంట్ దొరకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం ఇప్పుడు దర్శక నిర్మాతలకు సవాల్‌గా మారింది’అని నిర్మాత కేకే. రాధామోహన్ అన్నారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రమిది. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా కేకే.రాధామోహన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం ఉన్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం ఉంది. ► క్రేజీ ఫెలో కథ చాలా బాగుంటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో. ► ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం సవాల్‌గా మారింది. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ► ఇప్పుడు ఇండస్ట్రీలో రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. శాటిలైట్, ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్‌కి రూ. 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది. ► ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం. -
ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
దసరా పండుగ సందర్భంగా గతవారం ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ వంటి చిత్రాలు థియేటర్లో సందడి చేశాయి. ఇందులో గాడ్ ఫాదర్ బ్లాక్బాస్టర్ విజయం సాధించగా ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. గత వారం పెద్ద చిత్రాలు ఉండటం చిన్న సినిమాలు ఈ వారం థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. మరి అందులో ఏ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. అలాగే ఓటీటీలో కూడా పలు పెద్ద సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ అలరించబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్లోకి వచ్చే చిత్రాలేవో ఓసారి చూద్దాం! థియేటర్లో విడుదల కాబోయే వచ్చే సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆది సాయికుమార్ ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’ చిత్రంతో రాబోతున్నాడు. దర్శకుడు ఫణికృష్ణ సిరికి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 14న విడుదల కానుంది. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్ హీరోయిన్లుగా నటించారు. ‘కేరింత’ ఫేం విశ్వంత్, మాళవిక సతీషన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. సరికొత్త కథాంశంతో దర్శకుడు కంభంపాటి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ‘కేజీయఫ్’ సిరీస్ చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన కన్నడ నటుడు యశ్. ఆ క్రేజ్‌ను దృష్టిని పెట్టుకొని పలువురు నిర్మాతలు యశ్ గతంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అలా.. ‘సంతు.. స్ట్రయిట్ ఫార్వార్డ్’ అనే సినిమా ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. ఆయన భార్య రాధిక పండిట్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్లో సందడి చేయబోతుంది. మహేశ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ (2016)లో విడుదలై మంచి విజయం అందుకుంది. కన్నడ దర్శక-నిర్మాత, నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’. సెప్టెంబరు 30న కన్నడనాట విడుదలైన ఈ సినిమా రికార్డు సృష్టించింది. దాంతో చిత్ర బృందం ఈ సినిమాని ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది. అలా తెలుగులో కంతారాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటుడు సునీల్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గీతా. దర్శుడకు విశ్వా రావ్ రూపొందించిన ఈ మూవీకి రచ్చయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రముక కమెడియన్ సప్తగిరి, పృథ్వీలు కీ రోల్ పోషించిన ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లో విడుదల కానుంది. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందకు రాబోతోంది. సీనియర్ నటి ఇంద్రజ, సాయికుమార్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించాడు. ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ ది ప్లే లిస్ట్ (అక్టోబరు 13) మిస్ మ్యాచ్చ్డ్ (Miss matched) హీందీ (అక్టోబర్ 14) తాప్సీ దోబారా (అక్టోబర్ 15) సోనీ లివ్ ఈషో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) గుడ్ బ్యాడ్ గర్ల్ (Good bad girl) (అక్టోబర్ 14) అమెజాన్ ప్రైమ్ ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్ (అక్టోబర్ 14) నేను మీకు బాగా కావాల్సిన వాడిని (అక్టోబర్ 14) డిస్నీ+హాట్‌స్టార్ ఆషికానా సీజన్ 2 హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 8th ఎపిసోడ్( House of the dragon 8th episode) షి హల్క్ డిస్కవరీ ప్లస్(Discovery+): ది జర్నీ ఆఫ్ ఇండియా(స్ట్రీమింగ్) -
‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ లో కనిపిస్తోంది: శర్వా
‘‘హీరో ఆది సాయికుమార్ని నేను బ్రదర్‌లా భావిస్తాను. ఆదికి సక్సెస్ వస్తే నేనూ ఎంజాయ్ చేస్తాను. నిర్మాత రాధామోహన్ గారు పదేళ్లుగా తెలుసు. నేను హీరోగా చేసిన ‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు శర్వానంద్. ఆది సాయికుమార్, మిర్నా మీనన్ జంటగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరో శర్వానంద్, దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు మారుతి. ‘‘రాధామోహన్ గారితో తొలి సినిమా చేసే దర్శకులకు విజయం వస్తుంది. అలా ఫణి కృష్ణకు కూడా ‘క్రేజీ ఫెలో’తో విజయం వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు సంపత్ నంది. ‘‘క్రేజీ ఫెలో’ హిలేరియస్ ఎంటర్టైనర్. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది’’ అన్నారు ఆది. ‘‘ఈ సినిమాలో ఆది సాయికుమార్ కొత్తగా కనిపిస్తారు. మేం అందరం క్రేజీగా పని చేశాం’’ అన్నారు ఫణి కృష్ణ. ‘‘ఈ కథకు ఆది బాగా సరిపోయాడు. దర్శకుడిగా ఫణి కృష్ణకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు రాధామోహన్ . ఈ కార్యక్రమంలో నటుడు అనీష్ కురువిల్లా, నటి వినోదినీ వైద్యనాథన్, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆసక్తి రేపుతున్న ఆదిసాయికుమార్ 'క్రేజీఫెలో' ట్రైలర్
ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసి, ఈ నెల 14న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మావాడు చాలా మారిపోయాడు.. ఇంతకుముందులా లేడు’ అంటూ అనీష్ కురువిల్లా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై, ‘పుణ్యానికి పోతే పాపం ఎదురయిందంటే ఇదే అనుకుంటా’ అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో ముగిసింది. ‘‘ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ ఉన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా: సతీష్ ముత్యాల -
Top Gear: టాక్సీ డ్రైవర్‌గా ఆది సాయికుమార్
ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచమైయ్యాడు ఆదిసాయికుమార్. ఆ తర్వాత పలు వైవిధ్యభరితమైన సినిమాల్లో భాగమవుతూ తనదైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్.. మరికొద్ది రోజుల్లో టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3డీ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మోషన్ పోస్టర్ లో ఆది సాయి కుమార్ కారు నడుపుతున్నట్లు చూపించి.. యాక్షన్ మోడ్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది. కే.వీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. -
ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ఫస్ట్‌లుక్, 3D మోషన్ పోస్టర్ విడుదల
యంగ్ హరో ఆది సాయికుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాప్ గేర్. ఇటీవలె విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మరో అప్డేట్ను అందించి చిత్ర బృందం. ఈ చిత్రంలో ఆది సరికొత్త పాయింట్‌తో అలరించబోతున్నాడని తెలుస్తోంది ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే. ఇకపోతే ఈ మోషన్ పోస్టర్ సరికొత్తగా 3డీలో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పొందుతోంది. ఇందులో ఆది సరసన రియా సుమన్ నటిస్తోంది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
‘తీస్మార్ ఖాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : తీస్మార్ ఖాన్ నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పూర్ణ తదితరులు నిర్మాణ సంస్థ :విజన్ సినిమాస్ బ్యానర్ నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ:బాల్ రెడ్డి ఎడిటర్: మణికాంత్ విడుదల తేది: ఆగస్ట్ 19, 2022 ‘ప్రేమ కావాలి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ‘లవ్లీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘తీస్మార్ఖాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 19) విడుదలైన ‘తీస్మార్ ఖాన్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తీస్మార్ ఖాన్(ఆది సాయికుమార్) ఓ అనాధ. తనకు ఒక్కపూట అన్నం పెట్టిందని మరో అనాధ అమ్మాయి వసూధ అలియాస్ వసు(పూర్ణ)ని అమ్మలా చూసుకుంటాడు. వీరిని ఓ పోలీసు కానిస్టేబుల్ దత్తత తీసుకొని పెంచుతాడు. అతను చనిపోయిన తర్వాత వసు భర్త చక్రి(సునీల్), తీస్మార్ ఖాన్ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ జిమ్ సెంటర్ నడుపుకుంటున్న తీస్మార్ ఖాన్ జీవితంలోకి అనుకోకుండా జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తాడు. జీజా రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్. అతని అరాచకాలను ఆడ్డుకునేందుకు నేరుగా హోంమంత్రి శ్రీరంగ రాజన్(శ్రీకాంత్ అయ్యంగార్)నే రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వసు హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు? జీజాకు ఈ హత్యతో ఏదైనా సంబంధం ఉందా? హోమంత్రి రంగ రాజన్‌కు తీస్మార్ ఖాన్ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? తల్లిలా భావించే వసు మరణం తర్వాత తీస్మార్ ఖాన్‌కు హోంమంత్రి ఎలాంటి సహాయం చేశాడు. అవారాగా తిరిగే తీస్మార్ ఖాన్ ఎస్సై ఎలా అయ్యాడు? తీస్మార్ ఖాన్‌పై ముంబై మాఫీయా డాన్ తల్వార్(కబీర్ ఖాన్) ఎందుకు పగ పెంచుకున్నాడు? చివరకు వసుని హత్య చేసిన వారిని తీస్మార్ ఖాన్ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పోలీసు కథా నేపథ్యంలో యాక్షన్, లవ్, థ్రిల్లర్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది. కొత్త కొత్త ట్విస్ట్‌లతో దర్శకుడు కథను బాగా రాసుకున్నప్పటికీ..తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడపడ్డాడు. హీరో ఎలివేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. తీస్మార్ ఖాన్, వసు బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలతో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే బాల్యం ఎపిసోడ్ కాస్త సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. తీస్మార్ ఖాన్, అనగ కలిసిన తర్వాత సినిమాలో వేగం పుంజుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటి సీన్స్, లవ్ ట్రాక్ సరదాగా సాగుతుంది. వసు మృతి... కథను మలుపు తిప్పుతుంది. ఇంటర్వెల్ ముందు తీస్మార్ ఖాన్ ఎస్సైగా ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తాయి. మొదట్లో కాస్త సాగదీసినట్లు అనిపించినా.. జీజా మరణం తర్వాత కథలో మరింత వేగం పెరుగుతుంది. అయితే కథలో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. కథ, కథనంలో మరింత జాగ్రత్త పడితే ‘తీస్మార్ ఖాన్’ ఫలితం మరోలా ఉండేది. కమర్షియల్, థ్రిల్లర్ సినిమాను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తీస్మార్ ఖాన్ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ మూడు పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. అనగ పాత్రకు రాజ్‌పుత్ పాయల్ న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించిది. పాయల్ రాజ్‌పుత్‌తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు గుర్తిండిపోతాయి. ఇక పూర్ణ తన పాత్రకు న్యాయం చేసింది. చక్రిగా సునీల్ మెప్పించాడు. ఆయన పాత్రలోని వేరియషన్ ఆడియన్స్‌ని థ్రిల్‌కు గురి చేస్తుంది. ఇక ఈ చిత్ర నిర్మాత నాగం తిరుపతి రెడ్డి కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. హోమంత్రిగా శ్రీకాంత్ అయ్యంగార్, విలన్స్‌గా కబీర్ సింగ్, అనూప్ సింగ్ తమ తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. ఒక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్. రొమాంటిక్ సాంగ్ తెరపై మరింత రొమాంటిగ్ ఉంటుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మణికాంత్ తన కత్తెరకు ఇంకాస్తా పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్
మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! ''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. ‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్‌గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. -
ఆ సినిమాలు నమ్మకాన్ని ఇచ్చాయి: ఆది సాయికుమార్
‘‘తీస్ మార్ ఖాన్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత థియేటర్స్‌కు జనాలు వస్తారా? రారా అని భయం ఉండేది. అయితే ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2’ చిత్రాలు అందరికీ మంచి నమ్మకాన్ని ఇచ్చాయి. ఆ చిత్రాల్లానే మా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఆది సాయికుమార్. ‘నాటకం’ ఫేమ్ కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించారు. డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఇది. తిరుపతి రెడ్డిగారు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అన్నారు తిరుపతి రెడ్డి. ‘‘ఇప్పటివరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీశాను. ఇప్పుడు పక్కా కంటెంట్, కమర్షియల్‌ను మిక్స్ చేసి తీసిన సినిమా ఇది’’ అన్నారు కల్యాణ్ జి. గోగణ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యాళ్ల తిర్మల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొన్నారు. -
ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది: డైరెక్టర్
Aadi Sai Kumar Comments On Tees Maar Khan: స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తీస్ మార్ ఖాన్". విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ కల్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ... ''ఈ మధ్య నేను కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చేశాను కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేశాను కానీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అయింది అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు కల్యాణ్ ఈ కథ చెప్పడం జరిగింది. విన్న వెంటనే ఈ కథకు మంచి స్పాన్ ఉందని, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందనుకున్నాను. అయితే మా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి గారు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. ఇప్పటి వరకు మేము అన్ని పాటలు ఆన్ లైన్ లోనే రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ అయ్యాంగార్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ,పూర్ణ వంటి మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు. ప్రతిసారి సాయి కార్తీక్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తారు. డి. ఓ. పి. గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసిన తరువాత థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అని భయముండేది. అయితే బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు అందరికీ మంచి హోప్ ని ఇచ్చాయి. ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలి'' అని తెలిపారు. ''ఇందులో ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను కాదు, అయినా నేను ఈ కథ చెప్పగానే నన్ను నా కథను నమ్మి ఇంత పెద్ద కాస్టింగ్ ఇచ్చారు. హీరో ఆది గారికి ఈ కథ నచ్చుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను. తను నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. సాయి కార్తిక్ గారు నేను అనుకున్న దానికంటే మంచి అవుట్ పుట్ ఇచ్చారు. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ కల్యాణ్ జి గోగణ పేర్కొన్నారు. -
ఏ అమ్మ కొడుకునైనా కొడతా.. ఆసక్తిగా ట్రైలర్
Aadi Saikumar Tees Maar Khan Trailer Released: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'మా అమ్మని తప్పుగా చూశారు. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతా' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తుంటే పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆది లుక్స్, డైలాగ్ డెలీవరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఆది.. స్టూడెంట్, రౌడీ, పోలీస్ వంటి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసిందే. -
ఆది, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ బాగుంది: నిర్మాత
Producer Nagam Thirupathi Reddy: మంచి కథ పుట్టాలన్నా.. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలన్నా కూడా దాని వెనుక నిర్మాత అభిరుచి, ఇష్టం దాగి ఉంటుంది. ఓ నిర్మాతకు కథ, కథనం నచ్చితే అది తెరపైకి వస్తుంది. నిర్మాతల అభీష్టం మేరకు సినిమాలు కార్యరూపం దాల్చుతాయి. ఎంతో మంది నిర్మాతలు సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. గొప్ప గొప్ప సినిమాలను నిర్మిస్తుంటారు. అలాంటి ఓ ధ్యేయంతోనే నిర్మాత ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. డా.నాగం తిరుపతి రెడ్డి ప్రస్తుతం విజన్ సినిమాస్ బ్యానర్ మీద ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా 'తీస్ మార్ ఖాన్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి ముందుగానే ఈ సినిమాను వీక్షించారు. చదవండి: బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తీస్ మార్ ఖాన్’ సినిమాను ఇప్పుడే చూశాను. ఎంతో అద్భుతంగా వచ్చింది. అనుకున్నదానికంటే సినిమా ఎంతో బాగా వచ్చింది. ఆది సాయికుమార్ చాలా కొత్తగా కనిపించారు. ఆది, పాయల్ రాజ్ పుత్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సినిమాను వీక్షించిన తరువాత మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాం. నటీనటులందరూ కూడా అద్భుతంగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌కు అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి.. ఆగస్ట్ 19న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన -
మరో విభిన్నపాత్రలో సునీల్.. పోస్టర్ రిలీజ్..
Sunil First Look Poster From Tees Maar Khan Movie: కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ చిత్రంలో 'చక్రి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్ సింగ్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్ ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. -
బీచ్‌లో ఆది, పాయల్ రొమాన్స్.. ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సాంగ్
ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘సమయానికే’ అంటూ సాగే ఈ మెలోడీ ట్యూన్‌కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా శ్రుతి ఆలపించారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ వీడియో సాంగ్‌లో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్‌లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు. ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఆగస్ట్ 19న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. -
సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్
సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఓటీటీకి ‘ఊ’ చెప్పిన తారల గురించి తెలుసుకుందాం. బాబాయ్-అబ్బాయ్‌ల ‘రానా నాయుడు’ హీరోలు వెంకటేశ్, రానా కలిసి తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇటీవల పూర్తయింది. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ ఆధారంగా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. బాబాయ్ వెంకీ – అబ్బాయ్ రానా నటించిన ఈ సిరీస్‌ని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ‘దూత’తో వస్తున్న నాగ చైతన్య మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది. సుశాంత్ నీళ్ల ట్యాంక్ హీరో సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘లీడర్’ చిత్రంతో తెలుగుకి పరిచయమైన ప్రియా ఆనంద్ ఆ తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత ‘మా నీళ్ల ట్యాంక్’తో తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి కథాంశంతో రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది. రాజ్ తరుణ్ పెళ్లంట యువ హీరో రాజ్ తరుణ్ తొలిసారి ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ‘ఏబీసీడీ’ చిత్ర దర్శకుడు సంజీవరెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌లో శివానీ రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే పెళ్లి కుమారుడి పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వారిద్దరిపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది. తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. పులి మేక ఆడుతున్న ఆది ఆది సాయికుమార్ ‘పులి-మేక’ ఆటకు సిద్ధమయ్యారు. తొలిసారి ఆయన ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. గోపీచంద్ ‘పంతం’ మూవీ ఫేమ్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదికి జోడీగా లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. జీ5, కోన ఫిలిం కార్పొరేషన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందుతోంది. పోలీస్ అధికారులను టార్గెట్ చేసి చంపుతున్న సీరియల్ కిల్లర్ నేపథ్యంలో కథ ఉంటుందట. -
తీస్మార్ ఖాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే! మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేసింది. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. చదవండి: మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్ నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో -
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
మూడు పాత్రల్లో ఆది సాయి కుమార్.. అవేంటంటే ?
Aadi Sai Kumar Three Different Roles In Tees Maar Khan Movie: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గర ఉన్నా.. మనం ఆపలేనంత పవర్ వాడి దగ్గర ఉంది.. సార్’, ‘బాగా రాసుకోండి.. బాగా కనపడాలి.. పేరు గుర్తుందిగా.. తీస్ మార్ ఖాన్’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రమిది. స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
పాయల్‌తో ఆది సాయి కుమార్ రొమాన్స్.. ఆసక్తిగా 'తీస్ మార్ ఖాన్' టీజర్
Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released: 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో అలరించాడు. ఇటీవల 'బ్లాక్' మూవీతో సందడి చేసిన ఆది సాయి కుమార్ అంతగా మెప్పించలేకపోయాడు. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు ఆది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ చేతిలో తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెలో తదితర చిత్రాలు ఉన్నాయి. తాజాగా 'తీస్ మార్ ఖాన్' మూవీ టీజర్ రిలీజ్ అయింది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. 'రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి' అంటూ డైలాగ్‌తో వచ్చే ఆది ఎంట్రీ బాగుంది. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ విలన్‌గా అలరించనున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్ జి గొగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్ కీలక పాత్రు పోషిస్తున్నారు. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. -
యంగ్ హీరో ఆది కొత్త సినిమా టైటిల్ ఇదే!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టాప్ గేర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. రియా సుమన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ధనలక్ష్మీ ప్రొడక్షన్స్‌పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికాంత్ దర్శకుడు. ‘‘ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకుని వైవిధ్యమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం’’ అన్నారు ఆది సాయికుమార్. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. Here's the Intriguing Title revealing Poster of #AadiSaiKumar next, All filled with Red, Rage & Rush "#TOPGEAR" 💥🔥#AdityaMovies & Entertainments Presents #SriDhanaLakshmiProductions @IRiyaSuman @actorbrahmaji #SatyamRajesh #Shashikanth #SridharReddyKV @adityamovies pic.twitter.com/b5unTqA620— Aditya Music (@adityamusic) June 11, 2022 చదవండి: గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. -
పూరి వద్ద నేర్చుకున్నవి ఎంతో ఉపయోగపడ్డాయి: డైరెక్టర్
GB Krishna Speech In Aadi Saikumar Black Movie Pre Release Event: ‘‘బ్లాక్’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, గణేష్ గుప్త అన్నారు. ఆది సాయికుమార్, దర్శనా బానిక్ జంటగా జీబీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్’. మహంకాళి దివాకర్ నిర్మించిన ఈ సినిమా శనివారం (మే 28) విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం (మే 27) నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆది మాట్లాడుతూ– ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్’. దర్శక, నిర్మాతలు కష్టపడి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని ఆశాభావం తెలిపారు. జీబీ కృష్ణ మాట్లాడుతూ–‘‘పూరి జగన్నాథ్ సార్ వద్ద నేను నేర్చుకున్న అవుట్‌పుట్స్ ‘బ్లాక్’కి ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రేక్షకులు మా సినిమా చూసి థ్రిల్ అవుతారు’’ అన్నారు. ‘‘మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు మహంకాళి దివాకర్. ఈ వేడుకలో ఎమ్మెల్సీ దయానంద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, నటుడు కౌశల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: 👇 డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్.. నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్ -
ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు: ఆది
Aadi Saikumar Black Movie Trailer Released: ఆది సాయికుమార్ తాజాగా నటించిన చిత్రం బ్లాక్. జి.బి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (మే 21) 'బ్లాక్' ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది.' అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్లో మిగతా డైలాగ్‌లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆది పోలీస్‌గా అలరించనున్నాడు. బిగ్‌బాస్ రెండో సీజన్ టైటిల్ విన్నర్ కౌశల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మూవీ ఒక రాబరీ, ఒక దొంగతనం చుట్టూ తిరిగే కథాంశంగా ఉంది. 'విభిన్నమైన కథ, కథానాలతో రూపొందుతున్న చిత్రమిది. ఆది నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్.' అని చిత్రబృందం తెలిపింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీలో దర్శనబానిక్, ఆమని, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. చదవండి: మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం -
'క్రేజీ ఫెలో'గా మారిపోయిన హీరో ఆది.. లుక్ చూశారా?
హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆది కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. Unveiling the Crazy Look💥 of our #CrazyFellow 🕺 @AadiSaikumar #CrazyFellowLook@DiganganaS @mirnaaofficial @siriki_phani @SriSathyaSaiArt @KKRadhamohan #RRDhruvan #SatishMutyala @GiduturiSatya @adityamusic @UrsVamsiShekar pic.twitter.com/cwU91imGxd — Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) May 19, 2022 -
మరో కొత్త సినిమాను ప్రకటించిన ఆది సాయికుమార్
యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన నాలుగైదు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తాజాగా ఈ యువ హీరో మరో చిత్రాన్ని లైన్లో పెట్టేశాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కబోతోంది. తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని ఓ వైవిద్యభరితమైన కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్.. రిలీజ్ ఎప్పుడంటే
పోలీసాఫీసర్‌గా తన ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందో ప్రేక్షకులకు చూపించేందుకు ఈ నెలలోనే గురి పెట్టారు ఆది సాయికుమార్. బి. కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్, దర్శన బానిక్ జంటగా మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం ‘బ్లాక్’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా ఆదిగారి నటన, కథ కొత్తగా ఉంటాయి. సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఈ నెల మొదటివారంలో ట్రైలర్‌ను, 22న సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్. -
ఆది సాయి కుమార్‌కు జోడిగా తమిళ బ్యూటీ
తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన మలయాళ బ్యూటీ మిర్నా మీనన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా మిర్నీ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆదికి జోడీగా ఇప్పటికే దిగంగనా సూర్యవంశీ ఎంపికయ్యారు. తాజాగా మరో హీరోయిన్గా మిర్నా మీనన్‌ను ఎంపిక చేశారు. ‘‘ఇద్దరి హీరోయిన్లకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. వినోద ప్రదానంగా రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం ప్రముఖ తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సాయి కుమార్‌ను కొడదామనుకున్నా: సీనియర్ నటుడు
'మౌనపోరాటం', 'కర్తవ్యం', 'పంజరం', 'మామగారు', 'సీతారత్నంగారి అబ్బాయి' వంటి ఎన్నో సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో అలరించాడు సీనియర్ నటుడు వినోద్ కుమార్. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన ఆయన తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తర్వాత అంత భారీ ఆస్తులు మీకే ఉన్నాయటగా అన్న ప్రశ్నకు వినోద్ నోరెళ్లబెట్టాడు. ముకేశ్ అంబానీకి ఉన్నదాంట్లో 0.1% ఆస్తులున్నా ఇక్కడెందుకు ఉండేవాడిని? ఎప్పుడో లండన్‌లో స్థిరపడేవాడిని అని చెప్పుకొచ్చాడు. కుర్ర వయసులో ఉన్నప్పుడు ఎందరినో ప్రేమించాను కానీ వారెవరూ తనను తిరిగి ప్రేమించకపోవడంతో చివరకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నానని తెలిపాడు. కర్తవ్యం సినిమాలో హీరో సాయి కుమార్ తనకు డబ్బింగ్ చెప్పకపోయేసరికి కొడదామనుకున్నానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆమనితో రొమాంటిక్ సాండ్ డ్యాన్స్ షూటింగ్ చేస్తున్నామని, అది చూడలేక తన భార్య సెట్స్‌లో నుంచి వెళ్లిపోయిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు వినోద్ కుమార్. -
వరుస సినిమాలతో దూసుకుపోతున్న డైరెక్టర్
ఒక సినిమాను ఎంత త్వరగా ఫినిష్ చేశారు.. ఎంత క్వాలిటీగా తీశారు అనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు సినిమాలను చాలా ఫాస్ట్‌గా తీసినా ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంకొందరు సినిమాలను నెమ్మదిగా తీస్తుంటారు. కానీ కొత్త కథలను ఎంచుకుంటూ మేకింగ్ పరంగా కొత్తదనాన్ని చూపిస్తూ సినిమాను అతి వేగంగా పూర్తి చేయగల దర్శకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కళ్యాణ్ జి గోగణ ముందుంటారు. నాటకం సినిమాతో కళ్యాణ్ జి గోగణ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమాతో కళ్యాణ్ జి గోగణకు మంచి పేరు వచ్చింది. మళ్లీ అదే బ్యానర్లో సుందరి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన కాదల్, తీస్ మార్ ఖాన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలా నిర్మాతలకు సపోర్టివ్‌గా సినిమాలను వేగంగా తెరకెక్కిస్తూ మంచి దర్శకుడిగా నిరూపించుకున్నారు కళ్యాణ్ జి గోగణ. ఆయన ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న తీస్ మార్ ఖాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ పుట్, దర్శకుడి పనితనం నచ్చిన నిర్మాత తిరుపతి రెడ్డి, హీరో ఆది మరొక సినిమాను కళ్యాణ్ జీ గోగణతో చేయబోతోన్నారు. తీస్ మార్ ఖాన్ సినిమా ఇంకా పూర్తి కాకముందే మరో చిత్రాన్ని కూడా ఓకే చేశారు. అలా నిర్మాత, హీరోలను మెప్పిస్తూ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజన్ ఉన్న దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ దూసుకుపోతున్నారు. -
హత్య చేసిందెవరు? ఇన్వెస్టిగేట్ చేయనున్న హీరో ఆది!
ఒక బిల్డింగ్‌లో జరిగిన హత్య కేసును క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ఐ) ఆఫీసర్ సనాతన్ ఎలా ఛేదించారు? అనే నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటిస్తున్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో చాగంటి ప్రొడక్షన్లో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జి.శేఖర్, సంగీతం: అనీష్ సోలోమాన్. -
అతిథి దేవోభవ: 'సినిమా కలెక్షన్లు బాగున్నాయి'
Aadi Sai Kumar Athithi Devo Bhava Movie Thank You Meet: ‘‘మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ‘అతిథి దేవోభవ’ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నాకు అభినందలు వస్తున్నాయి. కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని ఆది సాయికుమార్ అన్నారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, సువేక్ష జంటగా తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. రాం సత్య నారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కలెక్షన్లు బాగున్నాయని రిపోర్ట్ వచ్చింది. సెంటిమెంట్‌తో పాటు యాక్షన్, కామెడీ సన్నివేశాలను నాగేశ్వర్‌గారు బాగా తీశారు’’ అన్నారు. ‘‘మా సినిమా బాగుందని ప్రేక్షకులు చక్కని తీర్పు ఇచ్చారు’’ అన్నారు నాగేశ్వర్. ‘‘మా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాతలు రాజాబాబు, అశోక్. -
బెంజ్ కారు కొన్న యంగ్ హీరో.. ఫోటోలు వైరల్
Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral: ఆది సాయికుమార్ లేటెస్ట్ మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్, యాక్షన్ ఓరియెంటెండ్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ ఏడాది కొత్త సినిమాతో పలకరించిన ఆది సాయికుమార్ ఇప్పుడు తన ఇంట్లోకి కూడా కొత్త కారును ఆహ్వానించాడు. ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో పాటు తండ్రి సాయికుమార్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో ఆర డజనుకు పైగా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) -
'అతిథి దేవో భవ’ మూవీ రివ్యూ
టైటిల్ : అతిథి దేవోభవ నటీ,నటులు: ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: అమర్నాథ్ బొమ్మిరెడ్డి విడుదల తేది: జనవరి 7, 2022 ‘ప్రేమ కావాలి’,‘లవ్లీ’ సినిమాల తర్వాత యంగ్ హీరో ఆది సాయికుమార్ ఖాతాలో మరో హిట్ లేదు. వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఆది. తాజాగా ఈ యంగ్ హీరో 'అతిథి దేవో భవ’ అంటూ శుక్రవారం(జవవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభి అలియాస్ అభయ్‌రామ్(ఆది సాయికుమార్) చిన్నప్పటి నుంచి మోనో ఫోబియాతో బాధపడుతుంటాడు. ఒంటరిగా ఉండలేదు. ఎక్కడికి వెళ్లినా తోడు ఉండాల్సిందే. ప్రతిసారి స్నేహితుడిని తోడుగా తీసుకు వస్తున్నాడని ఓ అమ్మాయి బ్రేకప్ కూడా చెబుతుంది. దీంతో తనకు ఉన్న లోపం గురించి ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. తర్వాత అతని లైఫ్‌లోకి మరో అమ్మాయి వైష్ణవి(నువేక్ష) వస్తుంది. మరి అభయ్ తన సమస్యను వైష్ణవితో చెప్పాడా?లేదా? మోనోఫోబియా వారి ప్రేమకి ఏవిధంగా అడ్డంకిగా మారింది? అభయ్ ఫ్లాట్‌కి వచ్చిన ప్రియ ఎవరు? ఆమె వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తనకున్న భయాన్ని అభయ్ ఎలా అధిగమించాడు?అనేదే మిగతా కథ. ఎలా చేశారంటే..? అభయ్ పాత్రకి న్యాయం చేశాడు ఆది సాయికుమార్. నటనలో కొత్తదనం ఏమీ లేదు. వైష్ణవి పాత్రలో నువేక్ష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తల్లిగా రోహిణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హీరో స్నేహితుడిగా సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇమ్మాన్యుయేట్, అదుర్స్ రఘు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' సినిమాల్లో మాదిరే.. ఈ మూవీలో కూడా హీరో ఓ మాససిక రుగ్మతతో(మోనో ఫోబియా) బాధపడుతుంటాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..తెరపై చూపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి. ఈ మూవీలో ఆ రెండూ లేవు. ఫస్టాఫ్ అంతా కామెడీగా నడిపించే ప్రయత్నం చేశాడు.. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సప్తగిరితో వచ్చే కామెడీ సీన్స్ తెచ్చిపెట్టినట్లు ఉంటాయే తప్ప అంతగా హాస్యాన్ని పండించవు. ఇక సెకండాఫ్‌లో కాసేపు థ్రిల్ ఇవ్వాలని ట్రై చేశాడు. అదీ కూడా వర్కౌట్ కాలేదు. సినిమా మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సప్తగిరి డ్రంక్డ్రైవ్లో దొరికిన సీన్ కానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌తో వచ్చే సీన్ కానీ సినిమాకు అతికించినట్లు ఉంటాయే తప్ప.. పెద్దగా నవ్వించవు. క్లైమాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే' పాట సినిమాకే హైలెట్. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అతిథి.. నిరాశపరచదు
‘‘అతిథి దేవోభవ’ సినిమా చాలా బాగుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఈ చిత్రం నచ్చితే ఓ పది మందికి చెప్పండి.. నచ్చకపోతే ఇరవై మందికి చెప్పండి’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. రాం సత్యనారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘వందేమాతరం’ నుంచి సాయి కుమార్‌తో ప్రయాణం చేస్తున్నాను. వాళ్లబ్బాయి ఆదికి ‘అతిథి దేవోభవ’తో పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆది భావోద్వేగాలు బాగా పండించాడనిపిస్తోంది’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మంచి సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘మా సినిమా ఫస్ట్ హాఫ్ వినోదంగా, సెకండాఫ్ కొత్తగా ఉంటుంది’’ అన్నారు పొలిమేర నాగేశ్వర్. -
ఆ విషయంలో నిర్మాతలు షాక్ ఇచ్చారు!: హీరో
‘‘నేను చేసిన సినిమాల్లో కొన్ని వైఫల్యమవడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని ఎగ్జిక్యూషన్ ప్రాబమ్స్ అయితే మరికొన్ని చిత్రాలకు రిలీజ్ డేట్స్ కలిసి రాలేదు. ‘చుట్టాలబ్బాయి’, ‘రఫ్’ చిత్రాలకు రిలీజ్ డేట్స్ కలిసి రావడంవల్ల రెవెన్యూ పరంగా ఆ సినిమాలు స్ట్రాంగ్ అయ్యాయి. ఇప్పుడు ‘అతిథి దేవో భవ’ చిత్రానికి మంచి రిలీజ్ డేట్ దొరికిందనే భావిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో మిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానున్న సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ‘అతిథి దేవో భవ’లో నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. సినిమాలో హీరోకి ఓ ఫోబియా ఉంటుంది. ఒంటరిగా ఉండటం అంటే భయం. దీంతో తనకు తోడుగా ఎవరు వచ్చినా ‘అతిథి దేవో భవ’ అని ఫీలవుతుంటాడు. ఒక్క రోజులో జరిగే కథ ఇది. మంచి మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. రోహిణిగారు తల్లి పాత్ర చేశారు. స్క్రీన్ ప్లే పరంగా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ప్రస్తుత పరిస్థితులకు కనెక్ట్ అవుతుంటాయి. వ్యక్తిగత విషయానికి వస్తే.. కొందరు ఒంటరిగా ఉండటానికి భయపడుతుంటారని చెబుతుంటారు. కానీ నేను ఒంటరిగా ఉండగలను. ఈ ఆధునిక రోజుల్లో ఒంటరిగా ఉండేందుకు టైమ్ దొరకడం కూడా అరుదే. ► నాగేశ్వర్‌గారు చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమాను బాగానే తీశారు. ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ కాలేదు. నిజానికి డిసెంబరులోనే విడుదల చేద్దాం అనుకున్నాం.. తేదీ కుదర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటంతో ఈ నెల 7న వస్తున్నాం. ‘అతిథి దేవో భవ’ రిలీజ్ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలకు ధన్యవాదాలు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని, రిలీజ్ విషయంలో నాకు నిర్మాతలు షాక్ ఇచ్చారు (నవ్వుతూ). ► ‘బ్లాక్’, ‘తీస్ మార్ ఖాన్’ చిత్రాల షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే ‘అమర్: ఇన్ ది సిటీ’, క్రైమ్ థ్రిల్లర్ ‘సీఎస్ఐ సనాతన్’ సినిమాల షూటింగ్ జరుగుతోంది. ‘జంగిల్’ సినిమాతో తమిళంలో పరిచయం అవుతున్నాను. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా తీస్తున్నాం. సంక్రాంతికి ‘ఫన్నీ కృష్ణ’ అనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఏడాది నా సినిమాలు కనీసం నాలుగు రిలీజ్ అవుతాయనే నమ్మకం ఉంది. ఇక లాక్‌డౌన్‌కు ముందు ఓటీటీ ఆఫర్ వస్తే, వద్దనుకున్నాను. ఇప్పుడు ఓటీటీ హవా కనిపిస్తోంది. మంచి స్క్రిప్ట్ వస్తే ఒప్పుకుంటాను. -
ఆకట్టుకుంటున్న 'అతిథి దేవో భవ' ట్రైలర్
Actor Aadi Sai Kumar Atithi Devo Bhava Movie Trailer Released: ఆది సాయికుమార్, సువేక్ష జంటగా నటించిన చిత్రం 'అతిథి దేవోభవ'. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరో నాని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అన్ని విగ్రహాలు ఒక వైపు పెట్టి బుద్దుని మాత్రం ఇలా మధ్యలో వదిలేశారు అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. లవ్, యాక్షన్ ఓరియెంటెండ్గా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మిర్యాల రామ్ - అశోక్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో పలు చిన్న సినిమాలు పండగ బరిలోకి దిగుతున్నాయి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా అన్నది చూడాల్సి ఉంది. -
హీరోకి అందరూ అతిథులే!
ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో మిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో పొలిమేర నాగేశ్వర్ మాట్లాడుతూ – ‘‘చోడవరం దగ్గర బోగాపురం స్వస్థలం. చదువుకునే రోజుల్లోనే సినిమాలు, నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. బీటెక్ పూర్తి చేసి, సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను. దర్శకులు కె. విశ్వనాథ్, వీవీ వినాయక్, రాజమౌళి వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో చేశాను. దర్శకుడిగా ‘అతిథి..’తో నాకు రాజాబాబు, అశోక్ అవకాశం ఇచ్చారు. లవ్.. యాక్షన్.. థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ట్రైలర్లో కనిపిస్తున్నట్లుగా హీరో ఎందుకు భయపడుతుంటాడు? కథలోని అందర్నీ ఎందుకు అతిథిలుగా భావిస్తుంటాడు? అనేవి హైలైట్‌గా ఉంటాయి. ఇప్పటికే నా దగ్గర చాలా రకాల కథలు ఉన్నాయి. తర్వాతి ప్రాజెక్ట్ గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు. -
తీస్మార్ ఖాన్ సెట్లో నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్..
'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ త్వరలోనే 'తీస్ మార్ ఖాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 25న నిర్మాత నాగం తిరుపతి రెడ్డి బర్త్‌డే వేడుకను విజన్ సినిమాస్ ఆఫీసులో తీస్ మార్ ఖాన్ టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది సాయికుమార్, సునీల్ సహా మూవీ టాం పాల్గొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ''ముందుగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నా. నాగం తిరుపతి రెడ్డి, కళ్యాణ్ జి గోగణలతో 'తీస్ మార్ ఖాన్' సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌పై ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేశాం. దర్శక నిర్మాతలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు అని పేర్కొన్నారు. -
హీరో ఆది సాయికుమార్ బర్త్‌డే సెలబ్రేషన్స్
'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ప్రేమ కావాలి సినిమాకు బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తూ విలక్షణ కథలతో అలరిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకున్న ఈ హీరో మరికొద్ది రోజుల్లో 'తీస్ మార్ ఖాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో 'తీస్ మార్ ఖాన్' నిర్మాత తమ విజన్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 'తీస్ మార్ ఖాన్' దర్శకనిర్మాతలు నాగం తిరుపతి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'తీస్ మార్ ఖాన్' ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు. ఇక 'తీస్ మార్ ఖాన్' సినిమా విషయానికొస్తే.. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. -
రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టిన హీరో ఆది
విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ కొత్త సినిమా 'తీస్ మార్ ఖాన్'. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా 'తీస్ మార్ ఖాన్' గ్లాన్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌లో అదరగొట్టనున్నారని తెలుస్తోంది. ఈ గ్లాన్స్ వీడియో ద్వారా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో అది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
ఆది సాయికుమార్ ‘తిస్‌మార్ ఖాన్’ షూటింగ్ పూర్తి
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ హై యాక్షన్ వోల్టేజ్ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమా చేశాను. కథ తగ్గ హీరో ఆది సాయి కుమార్ ఎంతో అద్భుతంగా నటించారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు ఏదైతే కథ చెప్పాడో అదే తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు. దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆది సాయి కుమార్‌ను సరికొత్తగా ఆవిష్కరించే సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. -
కోకాపేటలో హీరో ఆది సినిమా షూటింగ్
Hero Aadi Sai Kumar: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. విజయదశమి పండుగ సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ కోకోకాపేటలోని ఒక ప్రయివేట్ హౌస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ మిషా నారంగ్, నటుడు భూపాల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో శివశంకర్ దేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాగంటి ప్రొడక్షన్లో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. -
విడుదలకు సిద్దం అవుతున్న ఆది సాయికుమార్ ‘బ్లాక్’
ఆది సాయి కుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వం లో మహంకాళి మూవీస్ పతాకం పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్’.ఈ సినిమాలో ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా బ్లాక్ సినిమా నుంచి దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్ని విడుదలైంది. టీజర్ లో కనిపించిన యాక్షన్ షాట్స్ తో సరికొత్త క్యారెక్టర్ తో ఆకట్టుకునే సంభాషణలతో ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కుశాల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. -
గోవాలో పాయల్‌తో ‘తీస్ మార్ ఖాన్’ రొమాన్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తోంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది. హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా, ఇది వరకు చూడని సరికొత్త క్యారెక్టరరైజేషన్‌తో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలవనుంది. విజన్ సినిమాస్ పతాకంపై ఈ సినిమా ను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు. -
యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ‘అతిథి దేవోభవ’ మెలోడీ
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అతిథి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నువేక్ష నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే’ అనే పల్లవితో సాగే ఈ మెలోడీ వినసొంపుగా ఉంది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ ఆకట్టుకోగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ వాయిస్ దానికి అదనపు ఆకర్షణని తెచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఈ లిరికల్ వీడియో సైతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. చదవండి: క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో `కిరాతక’, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే.. -
ఆది సాయి కుమార్ ‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్ విడుదల
యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘అతిథి దేవోభవ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నువేక్ష నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య విభిన్నమైన కథాంశాలతో వస్తున్న ఆది గతంతో ‘శశి’ మూవీతో ఆకట్టుకున్నాడు. Here comes the Promising First look of #SrinivasaCineCreations #AtithiDevobhava 🌟ing #AadiSaiKumar & #Nuveksha Directed by #PolimeraNageshwar 🎬 🎶 #SekharChandra ✂ #KarthikSrinivas 🎥 @AMARNATH_DOP 💵 #RajababuMiryala,#AshokReddyMiryala#RamaSatyaNarayanaReddy pic.twitter.com/qwaDEowk9w — BA Raju's Team (@baraju_SuperHit) September 1, 2021 -
క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో `కిరాతక’, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే..
ఆది సాయికుమార్, పాయల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం‘కిరాతక’.ఎం.వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు.కిరాతక టైటిల్‌తో పాటు ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ముగించుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ .. ఆది, వీరభద్రమ్‌ల హిట్ కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తోన్న చిత్రమిది. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ టెక్నికల్‌గా హైస్టాండర్స్‌లో నిర్మించబోతున్నాం. కిరాతక తప్పకుండా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’అని అన్నారు. ఆదిసాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ మధ్య కెమిస్ట్రీ తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు దర్శకుడు ఎం వీరభద్రమ్. -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్
ఆది సాయి కుమార్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో 'అమరన్’రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది. సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సంగీతం అందిస్తున్నారు. -
క్రైమ్ థ్రిల్లర్‌గా ఆది ‘కిరాతక’ మూవీ, ఫస్ట్‌లుక్ విడుదల
ఆది సాయికుమార్, పాయల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాతక’. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఇటీవల ప్రకటించగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం(జూలై 8) ‘కిరాతక’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ స్పష్టం వెల్లించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటివరకు చాలా కథలు విన్నాను. కానీ ఈ థ్రిల్లర్ కథ బాగా నచ్చింది.పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే ఆదితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వీరభద్రమ్, నిర్మాత నాగం తిరుపతిరెడ్డిలకు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ తెలిపింది. నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా విజన్ సినిమాస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3గా ‘కిరాతక’ మూవీ రూపొందుతోంది. మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్ హిట్ కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈమూవీ మేకింగ్ విషయంలో ఎక్కడ తగ్గకుండా నిర్మిస్తున్నాము. డైరెక్టర్ వీరభద్రమ్ కథ వివరించగానే బాగా నచ్చింది. తప్పకుండా మా సినిమా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ జరిపి ఆగస్ట్ 13 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు. అలాగే దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అలాగే దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆది ఇంత వరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. ‘కిరాతక’ మూవీ కథ నచ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో నటించడానికి పాయల్ రాజ్‌పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘కిరాతక’గా ఆది సాయికుమార్.. పాయల్‌తో రొమాన్స్‌కి రెడీ
ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాతక` అనే పవర్ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ - ‘ఆది కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్గా నటిస్తుంది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి`` అన్నారు. చిత్ర నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ - ‘‘మా విజన్ సినిమాస్ బ్యానర్లో ఆది సాయికుమార్ , ఎం. వీరభద్రం గారి కాంబినేషన్లో `కిరాతక`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ వీరభద్రం గారు చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం’ అన్నారు. -
ఫాదర్స్ డే స్పెషల్: సాయికుమార్ ఫ్యామిలీ వాయిస్!
‘‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’’... సాయికుమార్ కెరీర్‌కి తొలి బ్రేక్ అయిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రంలోని డైలాగ్ ఇది. సాయికుమార్ ఇంటి నాలుగు స్తంభాల్లో ముగ్గురు మన కళ్ల ముందు ఉన్నారు. కనిపించని నాలుగో స్తంభం పీజే శర్మ. ఈ మూడు స్తంభాల బలం ఆ నాలుగో స్తంభం. ఆ బలంతో సాయికుమార్ కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా సాయికుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ‘సాక్షి’తో చెప్పిన విశేషాల్లో కొన్ని... స్వరం నాన్నది.. సంస్కారం అమ్మది – సాయికుమార్ ► నా స్వరం నాన్న (ప్రముఖ నటుడు పీజే శర్మ) గారిది. సంస్కారం అమ్మ (కృష్ణజ్యోతి) ఇచ్చింది. ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అభిమానం ప్రేక్షకులందరిదీ. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఈ విషయంలో ఆది, జ్యోతిర్మయి చాలా లక్కీ (నవ్వుతూ). నాన్నగారి నుంచి నాకు, నా నుంచి నా పిల్లలు ఆది, జ్యోతిర్మయికి క్రమశిక్షణ అలవడింది. ► మా నాన్నగారు హీరో అవ్వాలనుకున్నారు. అమ్మకి హీరోయిన్ అవ్వాలని ఉండేది. కానీ అప్పట్లో ఉన్న పోటీ, వారి వ్యక్తిగత పరిస్థితుల వల్ల వారు ఊహించిన స్థాయిలో కుదర్లేదు. కుటుంబం కోసం అమ్మ త్యాగం చేయాల్సి వచ్చింది. పీజే శర్మ ఎంత కాలం ఇండస్ట్రీలో ఉంటారు.. మళ్లీ తిరిగి అగ్రహారం వచ్చి పౌరోహిత్యం చేయరా? అనుకున్నవాళ్లూ ఉన్నారు. అమ్మ మాకు ఒక స్ఫూర్తిగా, నాన్న ఓ శక్తిగా నిలబడ్డారు. అమ్మ ప్రోద్బలంతో, నాన్న ప్రోత్సాహంతో కెరీర్లో ముందుకు వెళ్లాను. నాన్న ఏది సాధించాలనుకున్నారో అన్నీ కలగలిపిన హీరోగా ఆది తయారయ్యాడు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను.. ‘నేను అవుతాను’ అంటూ మా అమ్మాయి అయింది. ► ‘పోలీస్‌స్టోరీ’ సినిమా మంచి విజయం సాధించినందుకు నాన్నగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాను సాధించలేకపోయింది నేను సాధించానని సంతోషపడ్డారు. ఆ సినిమా 100డేస్ ఫంక్షన్లో వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నా నేను అమ్మ, నాన్న చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్ చూడటానికి వెళ్లినప్పుడు ఎవరైనా పెద్దవారు వస్తే మమ్మల్ని మేం కూర్చున్న సీట్ల నుంచి లేపి వేరే చోట కూర్చోమనేవారు. కానీ నాన్నగారు రిక్వెస్ట్ చేసి నన్ను, తమ్ముళ్లను అక్కడే కూర్చొనేలా చేసి తాను మరోచోట సినిమా చూసేవారు. ► సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, హీరోలకు అర్థం చేసుకునే భార్య దొరకాలి. నా అదృష్టం సురేఖ దొరికింది. అలాగే ఆదికి అరుణ. జ్యోతికి కృష్ణ ఫల్గుణ మంచి సపోర్టివ్. ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడితో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ఏడాది నా 60వ పుట్టినరోజు రానుంది. నా మనవరాలు ఆద్యశ్రీకి యాక్టింగ్ అంటే ఆసక్తి. మనవడు ఇవాన్‌కు కార్ రేసింగ్ అంటే ఇష్టం. అలాగే ఆది కూతురు అయానా కూడా ఇంటెలిజెంట్ అమ్మాయి. యాక్ట్రస్ అవుతుందేమో చూడాలి. కానీ అయానాకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ అని ఆది చెబుతుంటాడు. ► నాన్నగారికి ఉన్న చిన్న చిన్న కోరికల్లో కొన్నింటిని తీర్చగలిగాం. మరికొన్నింటిని తీర్చలేకపోయాం. అప్పట్లో స్థోమత లేదు. ఇప్పుడు ఉన్నా ఆయన మాకు దూరమైపోయారు. ఇక అమ్మ పాస్‌పోర్ట్ చూసి ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆమెను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేకపోయాను. 1993లో నేను అమెరికా వెళ్లాను. తనే అమెరికా వెళ్లినంత హ్యాపీ ఫీలయ్యారు నాన్నగారు. అప్పుడు నేను సురేఖకు రాసిన ఉత్తరం ఇంకా ఉంది. ‘‘నాతో పాటు అమ్మ, నాన్న, మన పిల్లలు, నువ్వు కూడా వస్తే బాగుండేది. భవిష్యత్తులో అందరం వద్దాం. ఎంజాయ్ చేద్దాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ తర్వాత అమ్మగారు చనిపోయారు. నాన్నగారు అప్పట్లో వచ్చే స్థితిలో లేరు. కానీ ‘శంకర్‌దాదా’ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇకపై ఆది, జ్యోతిర్మయి నేను చూడని ప్లేసెస్‌ను చూపించాలి మరి (నవ్వుతూ). నాన్నకి వందకి వంద – ఆది సాయికుమార్ ► తాతగారిలా నాన్నగారు కూడా స్ట్రిక్టే. కానీ మరీ అంత స్ట్రిక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాన్నగారు బాగా ప్రోత్సహించారు... స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారు ఫ్రెండ్లీగా ఉన్నా క్రికెట్, టెన్నిస్ టీమ్‌ల గురించి మాత్రం పోట్లాడుకుంటుంటాం (నవ్వుతూ). క్రికెట్‌ను చాలా మిస్ అవుతున్నాను. 2009లో వదిలేశాను.. ఆ తర్వాత సినిమాలవైపు వచ్చాను. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో మళ్లీ స్టార్ట్ చేశాను. నేను, ప్రజ్ఞా ఓఝా, అంబటి రాయుడు అండర్ 19 ఆడాం. క్రికెట్లో నేను ఆల్‌రౌండర్. క్రికెట్లో అప్పుడైతే ఇండియాకి ఆడాలి.. లేదంటే రంజీ, రైల్వేస్. ఇప్పుడు ఐపీఎల్ లాంటివి చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి.. ఇప్పుడు అనిపిస్తుంటుంది.. అయ్యో అనవసరంగా వదిలేశానే అని. ► నా తొలి చిత్రం ‘ప్రేమకావాలి’ వంద రోజుల ఫంక్షన్లో నాన్న పక్కన నేనుంటాను.. తాతగారు నాకు ముద్దు పెడుతుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. నేను నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. ఆ సమయంలో నాకు, తాతగారికి మధ్య మంచి ర్యాపో ఉండేది. నాన్నకి నేను వందకి వంద మార్కులు వేస్తాను. మా నాన్న నుంచి నేను కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నా పిల్లలకి నేర్పాలి. నా కూతురికి నాన్నగారి పోలికలు వచ్చాయేమో. అందరూ కావాలనుకుంటుంది. ఎక్కువమంది ఉంటే సంతోషపడుతుంది. నాన్నకి వందకి నూటపది – డాక్టర జ్యోతిర్మయి ► నేను డాక్టర్ అవ్వాలనే టాపిక్ ఇంట్లో నడుస్తుండేది. కానీ అసలు విషయం ఏంటంటే.. మా పెద్దవాళ్లు ఆశించడానికన్నా ముందే నేను డాక్టర్ (జ్యోతిర్మయి పీడియాట్రీషియన్)ని కావాలనుకున్నాను. నిజానికి చిన్నప్పుడు నేను ఐదారేళ్లు సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. ‘బొంబాయి’ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్లకి డబ్బింగ్ చెప్పడానికి ఆడిషన్‌కి వెళ్లాను. అందులోని ‘కాఫీ కావాలా, టీ కావాలా? అని అమ్మ అడగమంది’ అనే డైలాగు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా చెప్పలేదు. దీంతో ఎంపిక కాలేదు. మా బాబాయ్ ‘ఈశ్వర్’ సినిమాని ‘ఆయుధ’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశాం. ఆ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఎత్తు ఎక్కువ అని తీసుకోలేదు. పాప పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాను. నా తొలి సినిమా అదే. ఆ సినిమాకి రూ.5000 పారితోషికం ఇచ్చారు. అంత చిన్న వయస్సులో అంత పెద్దగా సంపాదించానని చాలా కాలం చెప్పుకున్నాను. ► నాన్నగారు నాకంటే మా ఆయనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. మామ, అల్లుడిలా కాకుండా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక క్రికెట్ అంటే చాలు.. మా నాన్న సపోర్ట్ చేసిన టీమ్‌కి వ్యతిరేకంగా ఆది సపోర్ట్ చేస్తాడు. మా బాబాయిలు కూడా! వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పగిలిపోతాయో చెప్పలేం. నాన్నకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే.. కృష్ణ ఫల్గుణతో నా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడే క్రికెట్ మ్యాచ్ చూశారు. అంత ఇష్టం నాన్నకి! నాన్నకి నేను వందకి 110 మార్కులు వేస్తాను. మా నాన్నగారి నుంచి పాజిటివిటీ నేర్చుకున్నాను. నా పిల్లలకీ నేర్పించాలనుకుంటున్నాను. సాయికుమార్ తల్లితండ్రులు పీజే శర్మ, కృష్ణజ్యోతి ఆది, అరుణ, సురేఖ, సాయికుమార్, జ్యోతిర్మయి, కృష్ణ ఫల్గుణ -
ఆది సాయికుమార్ కొత్త సినిమా.. కీలక పాత్రలో సునీల్
వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆది సాయికుమార్‌ను మరో కొత్త డైమన్షన్‌లో ప్రెజంట్ చేసే చిత్రమిది. అలాగే హీరో సునీల్‌గారు మా చిత్రంలో ఓ కీ రోల్లో కనిపించబోతున్నారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి.. సునీల్‌గారైతే బావుంటుందని ఆయన్ని కలిసి అడగ్గానే ఆయన నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. ఈ చిత్రాన్ని మా బ్యానర్‌పై ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు సక్సెస్ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోయే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు. -
ఆది సాయికుమార్-అవికా గౌర్ కొత్త సినిమా ప్రారంభం
వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్-1’. ఇందులో అవికా గోర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్టగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్ టచ్ కూడా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాతలు. అన్కాంప్రమైజ్డ్గా చేయబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్ చేసే కథాంశంతో థ్రిల్లర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీర్ శంకర్, పవిత్రా లోకేశ్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఆది కొత్త సినిమా షురూ
-
ఈ సినిమాకు నేను సపోర్ట్ చేస్తా: పద్మారావు
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, హీరో ఆది ఉగాది పండగ రోజు కొత్త సినిమా మొదలు పెట్టారు. హీరోయిన్ సిమ్రత్ కౌర్ కథానాయిక. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టి విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై యుగంధర్ టీ (గుడివాడ యుగంధర్) నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత పిల్లలు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సంజయ్ మెఘా, అరుంధతి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. "శిఖర ప్రొడక్షన్స్ బ్యానర్ లో మంచి సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత (గుడివాడ యుగంధర్)కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా నేను వెనుకాడకుండా ముందుంటానని అందరి ముందు హామీ ఇస్తున్నాను" అని అన్నారు. దర్శకుడు భాస్కర్ బంటుపల్లి మాట్లాడుతూ.. "ఇది నా రెండవ సినిమా. నిర్మాత నా కథ విన్న వెంటనే నాపై నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చారు, అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఆది సాయికుమార్ తన కెరీర్లో చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆదికి ఈ కథ చెప్పిన వెంటనే కథ నచ్చి ఒప్పుకున్నారు. అలాగే బ్యాక్ ఎండ్‌లో ఉండి నాకు సపోర్ట్ చేసిన సాయికుమార్ కి ధన్యవాదాలు. రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ చేసి సినిమాను రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాము" అన్నారు. నిర్మాత యుగంధర్ మాట్లాడుతూ... ‘కర్ణాటక డిస్ట్రుబ్యూటర్ అయిన నేను ప్రొడక్షన్ నంబర్ 1 స్టార్ట్ చేసి ఈ సినిమా తీస్తున్నాను. ఇకపై నా బ్యానర్ పై చాలా చిత్రాలు వస్తాయి. నా బ్యానర్లోని ప్రతి సినిమా నుంచి వచ్చిన డబ్బులో కొంత భాగం పేద విద్యార్థులకు ఉపయోగిస్తాను. నేను సినిమాలు తీయడానికి కూడా ముఖ్య కారణం కూడా అదేన’ని అన్నారు. చదవండి: బండ బూతులు మాట్లాడే అమ్మాయికి సినిమా ఛాన్స్! -
జోష్ మీదున్న హీరో ఆది..మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్
హీరో ఆది సాయికుమార్, ఇటీవలె నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినమా ఇటీవలె విడుదలయ్యింది. ఇప్పుడు ఆది మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్తో , స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాకేత్ కొమండూరి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక దర్శకత్వంతో పాటు కథ స్క్రీన్ ప్లే మాటలను భాస్కర్ బంటు పల్లి అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి : ‘శశి’ టీంకు భారీ షాక్.. విడులైన తొలి రోజే.. అర్థరాత్రి షూటింగ్లో గాయపడ్డ నటి -
ఆది సాయికుమార్‌కు భారీ షాక్.. ‘శశి’విడులైన తొలి రోజే..
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మార్చి 19న (శుక్రవారం) ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా గత వారం మార్చి 12న విడుదలైన జాతిరత్నాలు మూవీకి షాక్‌నిస్తూ విడుదలైన తొలి రోజే పైరసి భూతం తాకింది. అయినప్పటికి బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈసారి ‘శశీ’ మూవీకి కూడా భారీ షాక్ తగిలింది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీ పైరసీ బారిన పడింది. ఇక ఈ మూవీతో పాటు ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్లు’ సినిమాలు కూడా విడుదల కావడం.. ఇప్పుడు ఈ పైరసీ భూతం వెంటడాటంతో ‘శశి’ మూవీ టీంకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అంతేగాక దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై పడే ప్రమాదం ఉంది. కాగా పైరసి వెబ్సైట్లు మూవీరూల్స్, తమిళరాక్స్తో పాలు పలు పైరసి వెబ్సైట్లలో ఈ మూవీ లింకులు వచ్చేశాయి. దీంతో ప్రేక్షకుల్లో అంతగా పాజిటివ్ టాక్ లేకపోవడంతో ఈ మూవీని థీయేటర్లో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ భామకు కరోనా పాజిటివ్ పైరసీ కారణంగా రూ.2,100 కోట్ల నష్టం ‘జాతిరత్నాలు’ టీమ్‌కి భారీ షాక్ -
ఫ్రైడే మూవీస్: ఈ వారం 3 భారీ సినిమాలు.. విజేత ఎవరు?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించి కాసులను సొమ్ము చేసుకుంటాయి. మరికొన్ని ఫ్లాపులను మూటగట్టుకొని పోతాయి. అందుకే శుక్రవారం నిర్మాతకు టెన్షన్ డేగా మారుతుంది. గత వారం టాలీవుడ్లో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్, లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ శుక్రవారం (మార్చి 19)కూడా పలు భారీ చిత్రాలు విడుదల కాబోతుంది. మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’లాంటి చిన్న సినిమా కూడా శుక్రవారం విడుదల అవుతున్నాయి. ఐటి స్కామ్ నేపథ్యంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్లు’. ఇందులో కాజల్, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించి ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అవుతుంది. యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపిస్తోంది. హీరో కార్తికేయ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తుంటారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కుతోంది. ప్రేమ కావాలి ఫేమ్ ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు రూపొందించిన ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తున్నారు. ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్ ఎలా మారతాయి? అనే అంశాలతో ‘శశి’ సినిమా తెరకెక్కింది. మరి ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. -
మనదే మొదటి స్థానం
‘‘ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్ ఎలా మారతాయి? అనే అంశాలు ‘శశి’ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత డ్రామా ఉంది. సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి’’ అని ఆదీ సాయికుమార్ అన్నారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఆది మాట్లాడుతూ– ‘‘నా ‘లవ్లీ’ సినిమాను వైజాగ్‌లో పంపిణీ చేసిన వర్మగారు ఈ చిత్రకథ వినమన్నారు. శ్రీనివాస్ ‘శశి’ కథ చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఓకే చెప్పాను. ఇందులో రెండు షేడ్స్ ఉన్న రాజ్‌కుమార్ పాత్రలో కనిపిస్తాను. నా రగ్డ్ లుక్ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఉంటూనే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. గతంలో నేను చేసిన కొన్ని సినిమాలు పలు కారణాల వల్ల సరైన విజయం సాధించలేదు. నా కథలను నాన్నగారు (సాయికుమార్) వింటారు కానీ తుది నిర్ణయం నాదే. పెళ్లికి ముందు ఏ పాత్ర అయినా చేసే స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు అలా లేదు (నవ్వుతూ).. బోల్డ్ తరహా క్యారెక్టర్స్ చేయను. గడచిన 2020 అందరికీ బ్యాడ్.. యువ హీరోలంతా ఓ గ్రూప్ పెట్టుకుని సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. హీరోల మధ్య సఖ్యత విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ తర్వాతే ఏదైనా! ఈ విషయంలో టాలీవుడ్‌దే మొదటి స్థానం’’ అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో ఆది దంపతులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ... కరోనా తరువాత శ్రీవారిని మొదటిసారి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తను నటించిన శశి చిత్రం ఈ నెల 19న రిలీజ్ అవబోతుందని, ట్రీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించినట్లే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశీస్తున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ .. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు గెలవాలని శ్రీవారిని మొక్కుకున్నాని అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ సిటింగ్ ఎమ్మెల్సీ అనుభవపరుడని పేర్కొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిని వాణీదేవి దివంగత మాజీ ప్రధాని పివీ నరసింహ రావు కూతురని గుర్తు చేశారు. వీరు ఇరువురు అత్యంత మెజారిటీతో గెలుపొందాలి అని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. -
'శశి' ట్రైలర్ విడుదల చేసిన పవన్ కల్యాణ్
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా 'శశి' లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆది లుక్స్ కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. రాజీవ్ కనకాల హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్, వైవా హర్ష , సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' పాట ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. చంద్రబోస్ రచించిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 19న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఆదికి 'శశి' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. చదవండి : (రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్లో ఆలియా!) (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) -
పూర్ణ ‘బ్యాక్ డోర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
‘‘బ్యాక్ డోర్’ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో, యువ కథానాయకుడు తేజ ముఖ్యపాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యాక్ డోర్’. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఆది సాయికుమార్ విడుదల చేశారు. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా బాలాజీకి మంచి పేరు రావాలి’’ అన్నారు దర్శకుడు వీరభద్రం చౌదరి. బి.శ్రీనివాసరెడ్డి, కర్రి బాలాజీ, సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, తేజ, నిర్మాత తిరుపతిరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు ఫస్ట్ లుక్ రిలీజులో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
ఆది లుక్ బాగుంది
‘‘నేను, సాయికుమార్ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు ఆది పుట్టాడు. ‘శశి’ టీజర్ చూస్తుంటే రగ్డ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆది లవర్ బాయ్‌లా కనిపించాడు. ఈ టీజర్లో తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ని అభినందిస్తున్నా’’ అన్నారు చిరంజీవి. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘శశి’. బుధవారం ఆది సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా ‘శశి’ టీజర్‌ని చిరంజీవి విడుదల చేశారు. ‘‘శశి’ ఎమోషనల్ లవ్ స్టోరీ’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’కి అన్నయ్య చిరంజీవి విషెస్ లభించాయి. ఇప్పుడు ‘శశి’ టీజర్‌ను ఆయన లాంచ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సాయికుమార్. -
ప్యాన్ ఇండియా మూవీ సిరీస్‌లో...
ఆదీ సాయికుమార్ హీరోగా ఓ ప్యాన్ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రంతో బాలవీర్. యస్ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. యస్.వి.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై యస్.వి.ఆర్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఇందులో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, వీఎఫ్ఎక్స్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆదీ సాయికుమార్ చేసిన గత చిత్రాలకు భిన్నంగా కామిక్ టచ్‌తో సాగే చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి పెట్టాం. ఈ చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సిరీస్‌లో చాప్టర్ 1 త్వరలోనే ప్రారంభం కానుంది. ఆదికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నాం’’ అన్నారు. -
‘కేజీఎఫ్’ తరహాలో ఆది సాయికుమార్ కొత్త చిత్రం
బాహుబలితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి మన టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండటం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం తనకు పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. (పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో నన్ను..) ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంటసీ ఎలిమెంట్స్, వీఎఫ్ఎక్స్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎస్వీఆర్ ప్రోడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.ఎస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ నిర్మిస్తున్నారు. ఇది వరకు ఆది సాయికుమార్ చేసిన చిత్రాలకు భిన్నంగా కామిక్ టచ్‌తో సాగే చిత్రమిది. మేకర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి పెట్టారు. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా పక్కా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్టర్1 త్వరలోనే ప్రారంభం కానుంది. (సమంత బ్యూటీ థెరపీ వీడియో) -
ఆది బ్లాక్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్లాక్’ అనే టైటిల్ ఖరారైంది. ఇందులో దర్శనా బానిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. మహంకాళి మూవీస్ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.బి కృష్ణ దర్శకుడు. ఇందులో పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించనున్నారు ఆది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేసేందుకు ప్రణాళిక వేస్తున్నారు చిత్రబృందం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. మిగిలిన షూట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత దివాకర్. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్. -
వైరల్: చిరు ఎత్తుకున్న ఆ హీరో ఎవరు?
కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ సెలెబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కుటుంబంతో సరదాగా గడుపుతూనే వీలుచిక్కినప్పుడల్లా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిన్ననాటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దండ వేయించుకుని.. షీల్డు కూడా అందుకున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు అప్పటి బుడ్డోడు ఇప్పటి యువ హీరో. ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు సాయికుమార్ వారసుడు ఆది. తన చిన్నతనంలో చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలిపే ఓ ఫోటోను షేర్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించిన 'కలికాలం' సినిమా 1991లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందుకు మెగాస్టార్ చేతుల మీదుగా సాయికుమార్‌కు ఇవ్వాల్సిన షీల్డ్‌ను ఆయన కొడుకు ఆదికి అందించారు. ఆ సమయంలో ఆదిని చిరు ఎత్తుకున్నారు. ఈ ఫొటోను ఆది తాజాగా తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాల్లో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. చదవండి: తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్‌కు డౌట్ -
ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం
‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-2’తో కౌశల్ మందకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తన అటిట్యూడ్, గేమ్ ప్లానింగ్, ఇమేజ్‌తో ఆ సీజన్ మొత్తం రఫ్పాడించాడు. ఇక విజేతగా కౌశల్ పేరును ప్రకటించిన తర్వాత ఆయన అభిమానులు చేసిన కార్యక్రమాలు, కౌశల్ ఆర్మీ పేరిట చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నంత సేపు కౌశల్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి స్టార్ దర్శకుల సినిమాల్లో కౌశల్‌కు సినిమా అవకాశం లభించినట్లు అనేక వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశల్, అయన అభిమానులు ఊహించని విధంగా సీన్ రివర్సయింది. టాలీవుడ్లో ఎక్కడా కూడా అతడి ఊసే లేదు. దీంతో తన యాడ్ ఏజెన్సీకే పరిమితమయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత కౌశల్‌కు ఒక సినిమా అవకాశం లభించింది. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కౌశల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చాలా కీలకమైందిని తెలుస్తోంది. జీబీ క్రిష్ణ దర్వకత్వం వహిస్తున్న ఆది 16వ చిత్రంలో కౌశల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం కౌశల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, కెరీర్‌కు మరింత హెల్ప్ అవుతుందని కౌశల్‌తో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కౌశల్ నుంచి గాని చిత్రబృందం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కౌశల్‌కు సినిమా అవకాశం వార్త నిజమా కాదా అని తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి. చదవండి: సల్మాన్ పేరుతో మోసం! బాలయ్య కోసం భారీగా శత్రు గణం View this post on Instagram Here's the first look poster of mine from my upcoming movie........... Sending my heartfelt thanks to my director @krishna_kitti123 , producer @diwakargaru n my dear hero @aadipudipeddi for releasing my first look on my b'day.Thank you so much for this surprise gift & also thank you for all the support that i receive from you guys on the sets. So guys hope you all love the first look poster of mine. A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on May 13, 2020 at 7:33am PDT -
సస్పెన్స్ థ్రిల్లర్
ఆది సాయికుమార్ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా తర్వాతి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు ఆది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ వద్ద పనిచేసిన జి.బి.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మహంకాళీ మూవీస్ పతాకంపై మహంకాళీ దివాకర్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మహంకాళీ దివాకర్ మాట్లాడుతూ– ‘‘సస్పె¯Œ ్స థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. హిట్ కొట్టాలని కసి మీద ఉన్న ఆదికి సరైన కథ దొరికింది. జీబీ కృష్ణ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు ఆది. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమాని నిర్మించనున్నాం. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వాహణ : శంకర్. -
ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను
వినాయకుడు టాకీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా, రచయిత అబ్బూరి రవి విలన్‌గా, సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆది మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన అందరూ నేను చేసిన అర్జున్ పండిట్ పాత్ర చాలా బావుందని అభినందిస్తున్నారు. ప్రతి రోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ– ‘‘మా చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుండి సినిమా బావుంది అనే టాక్ రావడం ఆనందంగా ఉంది. సినిమా విజయం వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. టెక్నీషియన్స్, మా టీమ్ అందరి హార్డ్ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ రాజు, పార్వతీశం, పద్మనాభ రెడ్డి, అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, అబ్బూరి రవి, శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్, మనోజ్ నందం సంగీతం : శ్రీచరణ్ పాకాల దర్శకత్వం : సాయికిరణ్ అడివి నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ సాయికుమార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన ఆది.. ఆరంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. అనంతరం వరుస ఫెయిల్యూర్స్‌తో నిరాశపరిచాడు. ఇటీవల కాలంలో బుర్రకథ, జోడి వంటి సినిమాలు సరైన విజయాలు సాధించకపోవడంతో డీలా పడిన ఆది సాయి కుమార్.. తన పంథా మార్చుకొని విభిన్న కథాంశమైన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన అడివి సాయికిరణ్ ఆదిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడా? ఆదికి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో విజయం అందుకున్నాడా? చూద్దాం. కథ: 1980లో కశ్మీర్ పండిట్లు జమ్మూ కశ్మీర్ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగుతారు. ఘాజీబాబా (అబ్బూరి రవి) నేతృత్వంలోని ఓ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతుంది. పండిట్లను కశ్మీర్ నుంచి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలనేది వారి కుట్ర. అయితే కొంతకాలం తర్వాత ఘాజీబాబా కశ్మీర్‌ను వదిలి హైదరాబాద్‌కు వస్తాడు. ఘాజీబాబా హైదరాబాద్‌కు వచ్చాడని తెలుసుకున్న ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్ అర్జున్ (ఆది) పక్కా వ్యూహంతో అతడిని అరెస్ట్ చేస్తాడు. ఘాజీబాబాకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేస్తుంది. అయితే ఘాజీబాబాను కాపాడేందుకు అతడి ముఖ్య అనుచరుడు ఫరూఖ్ (మనోజ్ నందం) ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ప్రారంభిస్తాడు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏకే శర్మ (రావు రమేశ్) కూతురు నిత్యను కిడ్నాప్ చేసి భారత ప్రభుత్వాన్ని బెదిరించాలనేది ఫరూఖ్ ప్లాన్. అయితే నిత్యకు కార్తీక్ రాజు, తానియా, సాల్మన్‌లతో ఎలా పరిచయం ఏర్పడింది? కార్తీక్ రాజు, తానియాల ప్రేమ చిగురించిందా? చివరకు నిత్యను ఫరూఖ్ కిడ్నాప్ చేసి ఘాజీబాబాను విడిపిస్తాడా? ఫరూఖ్‌ను కెప్టెన్ అర్జున్ అడ్డుకుంటాడా? అనేదే మిగతా కథ. నటీనటులు: ఇప్పటివరకు లవర్ బాయ్‌గా సాఫ్ట్ లుక్‌లో కనిపించిన ఆది సాయి కుమార్ కెప్టెన్ ఆర్జున్ పాత్రలో రఫ్‌గా కనిపించాడు. కమాండో ఆపరేషన్లలో తన నటన, యాటిట్యూడ్‌తో మెప్పించాడు. అయితే ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తం కనిపిస్తాడు. ఇక తొలిసారి స్క్రీన్‌పై విలన్‌గా కనిపించిన రచయిత అబ్బూరి రవి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో మరో విలన్‌గా నటించిన మనోజ్ నందం తీవ్రవాదిగా అంతగా సూట్ కాలేదు. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఏ కోణంలోనూ తీవ్రవాదికి ఉండాల్సిన లక్షణాలు కనిపించలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన శషా చెట్రి, నిత్య పర్వాలేదనిపించారు. కార్తీక్ రాజు, పార్వతీశంలు కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఇక రావు రమేశ్ కేంద్ర మంత్రిగా ఒదిగిపోయాడు. కృష్ణుడు కనిపించింది కాసేపైనా చివర్లో కంటతడిపెట్టిస్తాడు. మిగతా తారాగణం వారి పాత్రల మేరకు మెప్పించారు విశ్లేషణ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది.. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత వంటి సెన్సిటివ్ సినిమాలను తెరకెక్కించి మెప్పించిన దర్శకుడు సాయికిరణ్ అడివిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే సెన్సిటివ్ డైరెక్టర్‌గా ముద్రపడిపోయిన సాయికిరణ్ తీవ్రవాదం నేపథ్యం గల చిత్రాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. మంచి స్టోర్ లైన్ అయినప్పటికీ.. పూర్తి కథగా మలచడంలో రచయిత, దర్శకుడు విఫలమయ్యారు. రోటీన్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులు విసిగిపోతారు. ఆది నటుడిగా వంద మార్కులు సాధించనప్పటికీ.. అతడికి ఈ సినిమా బ్రేక్ ఇవ్వలేకపోయింది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తన పాటలతో మెప్పించలేకపోయాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు కూడా అంత కొత్తగా ఏమనిపించలేదు. క్లైమాక్స్‌లో రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యం హార్ట్‌టచ్ చేసేలా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనితనం తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ రొటీన్ స్క్రీన్ ప్లే స్లో నేరేషన్ కాలేజ్, ప్రేమ సన్నివేశాలు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
పబ్లిసిటీ కోసం కాదు
‘‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ చిత్రానికి కొన్ని వాస్తవిక సంఘటనలు తీసుకొని ఫిక్షనల్ పాయింట్స్ యాడ్ చేశాం. డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. కాశ్మీర్ సమస్యను పబ్లిసిటీ కోసం వాడుకోలేదు. కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా సినిమా కూడా నచ్చుతుంది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. ఆది సాయికుమార్, అబ్బూరి రవి, శషాచెట్రి, నిత్యా నరేశ్, కృష్ణుడు, పార్వతీశం, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘బాగా పరిశోధన చేసి ఈ కథ రాశాం. ఈ ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్‌గా నిలబడ్డారు’’ అన్నారు సాయికిరణ్ అడివి. ‘‘ఈ చిత్రంలో నన్ను నటించమని సాయికిరణ్ నాలుగు నెలల పాటు తిరిగాడు. నేను యాక్టర్‌ని కాదు రైటర్ని అంటూ తనకి కనబడకుండా తప్పించుకు తిరిగినా, ఫైనల్‌గా నటించా. నటుడిగా సరిపోయానా? లేదా? అనేది ప్రేక్షకులు చెప్పాలి’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కార్తీక్ రాజు, నిత్యా నరేశ్ మాట్లాడారు. -
అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’
ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). సెన్సిబుల్ సినిమాలు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత లాంటి సెన్సిబుల్ సినిమాలతో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ.. ‘వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోంది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను తప్పకుండా చేరుకుంటామన్న నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమా బావుందని మెచ్చుకున్నారు. అక్టోబర్ 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సాయికిరణ్ అడివి గారు కథపై ఎంతో పరిశోధన చేసి సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను యంగ్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేయగా, ఈ చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్‌ను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సినిమాలో బ్యాడ్ బాయ్ గా నటించిన మనోజ్ నందం ఫస్ట్ లుక్ ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టీజర్ ఆవిష్కరించారు. ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి. -
‘జోడి’ మూవీ రివ్యూ
టైటిల్ : జోడి జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్ నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల కెరీర్ స్టార్టింగ్‌లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు, నటుడిగా మంచి మార్కులు సాధించిన ఆది సాయి కుమార్, తరువాత సక్సెస్‌ల వేటలో వెనుకపడ్డాడు. ఇటీవల ఆది హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా ‘జోడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. మరి జోడితో అయినా ఆది సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..? కథ : కమలాకర్ రావు (నరేష్) బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ వ్యక్తి. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు క్లబ్లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతూ ఉంటాడు. క్రికెట్ మీద పిచ్చితో కొడుక్కి కపిల్ అని పేరు పెంటుకుంటాడు. తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటంతో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు కపిల్ (ఆది సాయి కుమార్). సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసే కపిల్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇన్సిస్టిట్యూట్‌లో పనిచేసే కాంచనమాల(శ్రద్ధా శ్రీనాథ్)తో ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్‌ను ఇష్టపడుతుంది. కానీ కాంచన, బాబాయి రాజు (శిజ్జు) మాత్రం వారి పెళ్లికి అంగీకరించడు. తన అన్న కూతురిని ప్రాణంగా చూసుకునే రాజు.. కాంచన, కపిల్ల పెళ్లికి ఎందుకు నో చెప్పాడు..? ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏంటి..? ఈ కథలోకి ఇండస్ట్రియలిస్ట్ అవినాష్ ఎలా వచ్చాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు: కెరీర్ స్టార్టింగ్‌లోనే లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ కపిల్ పాత్రలో ఈజీగా నటించేశాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. తన కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. కాంచనమాల పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఒదిగిపోయారు. జెర్సీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ శ్రద్ధా ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ మరోసారి సూపర్బ్ అనిపించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. వెన్నెల కిశోర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన కడుపుబ్బా నవ్వించాడు. ఇతర పాత్రల్లో సత్య, శిజ్జు, గొల్లపూడి మారుతీరావు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది, ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడు. దర్శకుడు విశ్వనాథ్ అరిగెల ప్రేమకథతో పాటు మంచి సందేశం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా కథను రెడీ చూసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా లవ్ స్టోరిలో కొత్తదనం లేకపోవటంతో ప్రథమార్థం బోరింగ్‌గా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో కథ ఆసక్తికర మలుపు తిరిగినా.. కథనం నెమ్మదిగా సాగటం నిరాశపరుస్తుంది. ఫణి కల్యాణ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : కథ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం రొటీన్ టేకింగ్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
అసలు సంగతి ఏంటి?
‘అస్సలు ఈ టైమ్‌లో ఇంత హైట్‌లో కూర్చుని బీరు కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది’ అంటూ ఆది సాయికుమార్ డైలాగ్‌తో విడుదలైన ‘జోడి’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జోడి’. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో భావన క్రియేషన్స్ పతాకంపై శాంతయ్య, పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రేమ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆది, శ్రద్ధల మధ్య అందమైన ప్రేమకథతో పాటు వీకే నరేష్ పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆది, శ్రద్ధ లుక్స్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. అవుట్ డోర్ ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా ఉన్న మా చిత్రానికి ప్రీ రిలీజ్ బజ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న మా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. గొల్లపూడి మారుతీరావు, సత్య, ‘వెన్నెల’ కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణికళ్యాణ్, కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్. -
ఆకట్టుకునేలా ఆది, శ్రద్ధాల ‘జోడి’
ఆది సాయి కుమార్ హీరోగా, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోడి. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భావన క్రియేషన్స్ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో ఆది, శ్రద్ధాల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. తండ్రి పాత్రలో సీనియర్ నరేస్ మరోసారి మంచి కామెడీతో పాటు బరువైన సెంటిమెంట్‌ను కూడా పండించారు. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా వెన్నెల కిశోర్, సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కొత్తగా ఉన్నావు అంటున్నారు
‘‘నేను ఓ రియలిస్టిక్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న టైమ్‌లో విశ్వనాథ్ ఈ కథ గురించి చెప్పాడు. చాలా బాగుంది. మిమ్మల్ని ఈ సినిమాతో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా అనే నమ్మకముంది’’ అన్నారు హీరో ఆది సాయికుమార్. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో విజయలక్ష్మీ నిర్మించారు. విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శ్రద్ధా నటించిన ‘యూటర్న్’ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆమె చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఈ చిత్రం టీజర్ రిలీజయ్యాక అందరూ ఫోన్ చేసి ‘నువ్వు చాలా కొత్తగా ఉన్నావు’ అని అభినందించారు’’ అన్నారు. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో మొదౖలై ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. నిర్మాత విజయలక్ష్మీ ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది అంటే, హీరో అది ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు. హీరోయిన్ శ్రద్ధా కథ వినగానే చేస్తున్నా అన్నారు. నరేశ్‌గారికి పాత్ర చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు ఫణికుమార్, నేను కొత్త ట్యూన్స్ కోసం ప్రయత్నించాం’ అన్నారు. శ్రద్ధా మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను మరచిపోలేను. ‘జోడి’ కథ వింటూ చాలాసార్లు నవ్వుకున్నాను’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలు మోహమాటంతో, కొన్ని సినిమాలు ఆ సినిమా స్పాన్ చూసి చేస్తాం. కానీ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో న చ్చి చేశాను’’ అన్నారు. ‘‘నేచురల్‌గా ఉండే సినిమా చేద్దాం అనుకున్నాను. విశ్వనాథ్ ఈ కథ చెప్పగానే ఆదిగారు కరెక్ట్ అనిపించి ఆయనకు చెప్పాం. కథ వినగానే ఆది ఓకే అన్నారు. శ్రద్ధా మా సినిమాకు ఎస్సెట్ అవుతుంది’’ అన్నారు విజయలక్షి. -
సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల
బుర్రకథ సినిమాతో రీసెంట్గా ఆడియెన్స్‌ను పలకరించిన ఆది సాయికుమార్‌కి నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఈ చిత్రంపై హైప్‌క్రియేట్ అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది జోడి అనే మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు యూనిట్ ప్రకటించింది. ఇటీవలె టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
‘బుర్రకథ’ మూవీ రివ్యూ
-
‘బుర్రకథ’ మూవీ రివ్యూ
టైటిల్ : బుర్రకథ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : ఆది సాయి కుమార్, రాజేంద్రప్రసాద్, మిస్త్రీ చక్రవర్తి తదితరులు సంగీతం : సాయికార్తీక్ దర్శకత్వం : డైమండ్ రత్నబాబు నిర్మాతలు: కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ దీపాల, కిషోర్ ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న హీరో ఆది సాయికుమార్. అయితే చాలా కాలంపాటు సరైన సక్సెస్‌లేక వెనుకబడ్డ ఆది.. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఈసారి ‘బుర్రకథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈసారి ఆది ఆశించిన విజయం లభించిందా? సరైన సక్సెస్‌లేక కొన్నేళ్లుగా తడబడుతున్న ఆయన కెరీర్ గాడిలో పడిందా? లేదా అన్నది ఓసారి చూద్దాం. కథ అభిరామ్(ఆది సాయికుమార్) పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీంతో అభిరామ్ కాస్త అభి, రామ్‌గా భిన్న వ్యక్తిత్వాలతో లైఫ్ గడిపేస్తూ ఉంటారు. ఏవైనా పెద్ద శబ్దాలను విన్నప్పుడు అభి, రామ్‌గా.. రామ్ అభిగా మారిపోతూ ఉంటారు. ఒక్కరిగానే పుట్టినా.. ఇద్దరిలా పెంచుతారు ఈశ్వర్ప్రసాద్ (రాజేంద్రప్రసాద్). వ్యతిరేక ధృవాలుగా ఉన్న అభి, రామ్ ఎప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారో అని ఈశ్వర్ ప్రసాద్ ఎదురుచూస్తు ఉంటాడు. రెండు మెదళ్లైనా.. వారిద్దరిది ఒకే మనసు అని అభి, రామ్ తెలుసుకుంటారని ఆశిస్తూ ఉంటాడు? అయితే అభిరామ్ జీవితంలోకి హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి), గగన్ విహారి(అభిమన్యు సింగ్) రాకతో ఎలాంటి చిక్కులు వచ్చాయి? చివరకు అభి, రామ్ కలిసిపోయి అభిరామ్ అయ్యారా? అభిరామ్ తండ్రి ఈశ్వర్ ప్రసాద్ కోరిక నెరవేరిందా అన్నదే మిగతా కథ. నటీనటులు అభి, రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లో ఆది సాయి కుమార్ ప్రేక్షకులను మెప్పిస్తాడు. మొదటి చిత్రం నుంచి ఆది తన స్టెప్పులతో, ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ఆది డ్యాన్స్, యాక్షన్స్‌తో ఆకట్టుకుంటాడు. అభిగా అల్లరిచిల్లరగా తిరిగే పాత్రకు, రామ్ లాంటి డీసెంట్ క్యారెక్టర్‌కు తన నటనతో వేరియేషన్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అలవోకగా నటించేశాడు. హాస్యాన్ని పండించడమే కాదు, ఎమోషన్స్ సీన్స్‌లోనూ తన అనుభవాన్ని చూపించాడు. హీరోయిన్గా మిస్త్రీ చక్రవర్తి పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. లుక్స్ పరంగా ఓకే అనిపించింది. మరో హీరోయిన్ అయిన నైరాషా కనిపించిన రెండు మూడు సీన్స్‌లో ఫర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో కమెడియన్ పృథ్వీ, గాయత్రి గుప్తా, జబర్ధస్త్ మహేష్, విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ తమపరిధి మేరకు నటించారు. విశ్లేషణ రచయితలు దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కించడం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు వెనకబడ్డారు. అయితే డైలాగ్ రైటర్‌గా మంచి పేరున్న డైమండ్ రత్నబాబు.. ఈ చిత్రంలో కూడా మంచి పంచ్ డైలాగ్‌లను రాశాడు. కంటెంట్ కంటే కామెడీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన రత్నబాబు.. సినిమాను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా మలచడంతో సక్సెస్ అయ్యాడు. ఇదే పాయింట్‌తో ఓ ప్రయోగం చేసే అవకాశం ఉన్నా.. కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించిడంతో ఏమంత కొత్తగా ఉండదు. పైగా స్క్రీన్ ప్లే కూడా అంత ప్రభావవంతంగా అనిపించదు. ప్రతీ సన్నివేశం అతికించినట్లు అనిపించడంతో.. చూసే ప్రేక్షకుడికి ఫ్లో మిస్ అయినట్లు అనిపిస్తుంది. రత్నబాబు రచయితగా సక్సెస్ అయినా.. దర్శకుడిగా మాత్రం కాస్త తడబడ్డాడు. ఈ చిత్రాన్ని కమర్షియల్ హంగులతో, కామెడీ ఎంటర్టైనర్గా మలచడంతో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. కథలో ఏం జరగబోతోంది అన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. సంగీత దర్శకుడిగా సాయి కార్తీక్ ఓకే అనిపించాడు. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేశాడు. కెమెరామెన్ ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. అందరూ ప్రయోగాల బాటపడుతున్న వేళ.. మళ్లీ అదే మూసధోరణిలో తీసిన ఈ చిత్రం ఏమేరకు విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ప్లస్పాయింట్స్ నటీనటులు సంగీతం కామెడీ మైనస్ పాయింట్స్ కథనం కొత్తదనం లోపించడం బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
నేను లూజర్‌ని కాదు.. ఫైటర్ని
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను ఎవ్వరూ ఆపలేరు. మార్నింగ్ షోకే బాగుందని టాక్ వస్తే ఆ సినిమా హిట్టే. ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమానే తీసుకోండి. మార్నింగ్ షో తర్వాత అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా బాగున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆది సాయికుమార్. డైమండ్ రత్నబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశాలు నాయకా, నాయికలుగా శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి నిర్మించిన ‘బుర్రకథ’ నేడు విడుదలదవుతోంది. ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ‘బుర్రకథ’లోది చాలెంజింగ్ రోల్. ఒక మనిషికి రెండు బుర్ర లుంటే ఏ విధంగా నడుచుకుంటాడు? అనేది కథ. ఇలాంటి పట్టున్న క్యారెక్టర్స్ చేస్తేనే మనలో ఉన్న నటుడికి సరైన టెస్ట్. అందుకే చాలెంజ్ అన్నాను. రెండు బుర్రలున్న మనిషి కథ. రెండు క్యారెక్టర్లు చాలా కష్టపడి చేశాడు ఆది అనుకోకూడదు. చాలా ఈజీగా ఈజ్‌గా చేశాడే అనుకోవాలి. ఆ పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది. ► జనరల్‌గా నా సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటే నా పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు నా గత చిత్రాలు ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’లను అబ్జర్వ్ చేస్తే కావాలని నేను కామెడీ చేయను. కథలోనే ఉంటుంది. ఈ సినిమాలో రత్నబాబు ఆ కామెడీ పాళ్లు కొంచెం పెంచారు. కొన్ని కొన్ని సీన్స్ ఎలా పండుతాయో, థియేటర్లో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. ► నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉంటుందని చెప్పగలను. ఉదాహరణకు నా మూడోసినిమా ‘సుకుమారుడు’. అందులో కొంచెం గ్రే షేడ్‌తో ఉండే పాత్ర నాది. అందరూ ఆ సినిమా చేసేటప్పుడు లవర్‌బాయ్ పాత్రలు చేసుకోవచ్చు కదా అన్నారు. ‘ఒకే రకమైన పాత్రలు ఎందుకు?’ అన్నాను. నాలోనూ నటుడున్నాడు, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. సినిమా ఫెయిల్ అయ్యింది. అందరూ నువ్వు బాగానే నటించావు అన్నారు. అదే సినిమా హిట్ అయ్యుంటే అందరూ నా చాయిస్ కరెక్ట్ అనేవారు. కానీ సినిమా ఫెయిల్ అవటంతో మరో ప్రయోగం చేసే అవకాశం లేకుండా పోయింది. అందరూ లవర్‌బాయ్‌గా చేయమంటే ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా చేశాను. అలాగే ‘గాలిపటం’ మంచి సబ్జెక్ట్. మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేశాను. ఆ సినిమాలు కమర్షియల్‌గా బాగానే పే చేశాయి. వాటిలో ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ బాగా వసూలు చేశాయి. ‘శమంతకమణి’ సినిమాతో మళ్లీ ఓ ఎక్స్పెరిమెంట్ చేశాను. అది చాలా మంచి పేరొచ్చింది. ► ‘బుర్రకథ’ సినిమా ద్వారా ఇప్పుడు చాలా పెద్ద పేరొస్తుంది, ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. ప్రతి మనిషిలోనూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి లూసర్, రెండోది ఫైటర్. లూసర్ కిందపడగానే ఓడిపోయాను అని వెళ్లిపోతాడు. కానీ, నేను లూసర్‌ని కాదు ఫైటర్ని. కిందపడ్డా లేచి పరిగెత్తాలి, రేసులో నిలవాలి అనే ఫైటర్‌ను నేను. ► ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా కంప్లీట్ అయ్యింది కానీ, కొంచెం సీజీ బ్యాలెన్స్ ఉంది. మరో రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. ఇవికాక ‘జోడీ’ అనే కంప్లీట్ ఫ్యామిలీ క్యూట్ లవ్‌స్టోరీ చేస్తున్నాను. అందులో ఒక్క ఫైట్ కూడా ఉండదు. తమిళ్, తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇవికాక సాయిరాజ్ అనే నూతన దర్శకునితో చేయబోతున్న చిత్రం షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుంది. లక్ష్యం నెరవేరింది ‘‘హాస్యానందం’ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా. ఆ తర్వాత రచయితగా, ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగా. ఒక సెల్లో రెండు సిమ్‌లు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు మైండ్లు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘బుర్రకథ’’ అని ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో వచ్చాను. ‘బుర్రకథ’ సినిమా ఓపెనింగ్ రోజు నా లక్ష్యం నెరవేరిందని చేతికి ‘డైరెక్టర్’ అని పచ్చబొట్టు వేయించుకున్నా. చిన్న నిర్మాతలను దర్శకుడు కాపాడుకోవాలి. మార్కెట్‌ని బట్టి బడ్జెట్ పెడితేనే నిర్మాతలకు లాభం ఉంటుంది. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తానని నిర్మాతకు మాటిచ్చా.. 46 రోజుల్లోనే పూర్తి చేశా. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నేనే రెండు పాటలు కూడా రాశా. రామాయణం, మహాభారతం, పరిసరాల స్ఫూర్తితో కథలు రాసుకుంటా. హాలీవుడ్లో రచయితకి మంచి పారితోషికం ఉంటుంది. టాలీవుడ్లో డైరెక్టర్‌కి ఉంటుంది. నా రెండో సినిమాగా ‘బుర్రకథ’నే తమిళ్, హిందీలో రీమేక్ చేసే చాన్స్ ఉంది. మూడో సినిమాగా మోహన్‌బాబుగారి ఫ్యామిలీకి సరిపడే కథ రెడీచేశా. ఆయన చాన్స్ ఇస్తే చేస్తా’’ అన్నారు. -
‘బుర్రకథ’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈ సినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈసినిమా వాయిదా పడటంతో జూలై 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో శుక్రవారం విడుదల కావాల్సిన బుర్రకథ వాయిదా పడింది. శనివారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవటంతో వారం ఆలస్యంగా జూలై 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. -
‘బుర్రకథ’ విడుదల వాయిదా
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈసినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ శుక్రవారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఆఖరి నిమిషంలో టెన్షన్ ఉండకూడదన్న ఉద్దేశంతో సినిమాను ఒక రోజు ఆలస్యంగా శనివారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే శుక్రవారానికి కూడా సెన్సార్ విషయంలో క్లారిటీ వచ్చే అవకావం లేకపోవటంతో ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో ఆది సాయికుమార్ తో పాటు.. దర్శకుడు డైమండ్ రత్నబాబు తొలి సినిమా కావటంతో ఈ ఇద్దరి కెరీర్లకు ఈ సినిమా కీలకంగా మారింది. -
నాలో ఆ ఇద్దరూ ఉన్నారు
‘‘స్క్రిప్ట్‌లో దమ్ముంటేనే లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తా. అయితే అలాంటి సీన్లు చేసేవారిని నేను తప్పు పట్టడం లేదు. నా సినిమాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ చూడాలనుకుంటా’’ అన్నారు ఆది సాయికుమార్. రచయిత ‘డైమండ్’ రత్నబాబు దర్శకునిగా పరిచయం అవుతున్న సినిమా ‘బుర్రకథ’. ఇందులో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లు. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► చాలెంజింగ్ పాత్రలు చేసినప్పుడే మనలోని బెస్ట్ బయటకు వస్తుంది. ఈ సినిమాలో రెండు బుర్రలు ఉన్న అభిరామ్ క్యారెక్టర్ చేశాను. నాకు సవాల్‌గా అనిపించింది. రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ సరిగా చూపించానా? లేదా? అనే విషయంలో ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తారో అని భయంగా ఉంది. ► ఒక మనిషిలో రెండు బుర్రలు ఉన్నట్లు నేనొక ఆర్టికల్ చదివాను. ఈ కాన్ఫ్లిక్ట్ సబ్జెక్ట్‌ని సింపుల్‌గా, ఎంటర్టైనింగ్ వేలో చూపించారు రత్నబాబు. అభి, రామ్ క్యారెక్టర్ల విషయంలో ఆడియన్స్‌కు మొదటి 15 మినిట్స్‌లోనే క్లారిటీ వస్తుంది. అభిది జోవియల్ క్యారెక్టర్. రామ్ లోకజ్ఞానం తెలిసినవాడు. నాలో అభి–రామ్ ఇద్దరూ ఉన్నారు. అభి–రామ్ క్యారెక్టర్స్ మధ్య రాజేంద్రప్రసాద్‌గారు నలిగిపోవడం ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. మా సినిమాతో పాటు మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ సోలో రిలీజ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ► ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పేరు, డబ్బు... ఒక సినిమాకు ఈ మూడు అంశాలు వస్తే ఆ చిత్రం హిట్‌గా భావిస్తాను. ‘ప్రేమకావాలి, లవ్లీ’ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్‌ని అందుకోలేకపోయాను. ఇందుకోసం ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకుంటూ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► నేను అంగీకరించని సినిమాలు కొన్ని సూపర్‌హిట్ సాధించాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. నేను వదులుకున్న సినిమా హిట్ సాధించిందన్న బాధ నాకు లేదు. ఎందుకంటే మన జడ్జ్మెంట్ అన్ని వేళలా కరెక్ట్‌గా ఉండదు. ఈ విషయంలో ‘నీకు టేస్ట్ లేదు’ అని మా సిస్టర్ నన్ను ఆటపట్టిస్తుంది. ► మా నాన్నగారికి (సాయికుమార్) కన్నడలో నటుడిగా మంచి పేరు ఉంది కదా అని నేను అక్కడ సినిమాలు చేయలేను. ముందుగా తెలుగులో మంచి హిట్ సాధించి, ఆ తర్వాత కన్నడగురించి ఆలోచిస్తాను. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మా పాప నా షూటింగ్‌లకు వస్తోంది. ► నా కెరీర్‌లోని గ్యాప్‌ను నేను ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి విలన్ పాత్రలు చేయాలనే ఆలోచన లేదు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ‘ఆపరేషన్ గోల్డ్‌షిఫ్’లో అర్జున్ పండిట్ అనే పాత్ర చేశాను. ‘జోడి’ ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. -
ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్
ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఆది సాయికుమార్. కానీ మళ్లీ ఆరేంజ్ సక్సెస్‌ను కొట్టలేక రేసులో వెనుకబడ్డాడు. తాజాగా ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కిన బుర్రకథ చిత్రంతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలే ఏర్పరిచాయి. కాసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒకే మనిషిలో రెండు బుర్రలు, రెండూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉండటం, వాటి వల్ల క్రియేట్ అయ్యే ఫన్, వచ్చే కష్టాలు ఇలా అన్నింటిని టచ్ చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఎండింగ్లో కమెడియన్ పృథ్వీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలె సాహో టీజర్‌ను కాపీ కొడుతూ పృథ్వీ చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రంలో మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు మొదటిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెండు మెదళ్ల కథ
దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు మొదటిసారి దర్శకత్వం వహించారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్యే ‘బుర్రకథ’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు ఫ్యాన్సీ రేటుతో సినిమాకు బిజినెస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ హక్కులను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
వర్మ తిరుపతికెళ్లినప్పుడే ఊహించాను
‘నాన్నగారూ.. నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను..’ అనే హీరో ఆది చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ‘బుర్రకథ’ సినిమా టీజర్ వినోదాత్మకంగా ఉంది. ‘బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నా నాన్నగారూ..’’ అని ఆది చెప్పే డైలాగ్‌కి తండ్రి రాజేంద్రప్రసాద్ అవాక్కవుతాడు. ‘నీ కొడుకు రెండు బ్రెయిన్లతో పుట్టాడు’ అంటూ డాక్టర్ పోసాని కృష్ణమురళి చెప్పగానే.. ‘రామ్‌గోపాల్ వర ్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను’ అంటూ రాజేంద్రప్రసాద్ నిట్టూరుస్తాడు. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడో రకం’ సినిమాలతో రచయితగా పెద్ద విజయాల్ని అందుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. బీరమ్ సుధాకర్‌రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తొలుత పరిచయం అయిన వ్యక్తి రత్నబాబు. ఓ డైరెక్టర్‌కి దర్శకత్వశాఖతో పాటు సంభాషణలు రాయడంలో పరిజ్ఞానం ఉండాలని ఆయన వద్దే నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఏ దర్శకుడికైనా తొలి సినిమా ముఖ్యం. నేను, శివ నిర్వాణ తొలి సినిమా అడ్డంకిని విజయవంతంగా దాటివచ్చాం. ఇప్పుడు డైమండ్ రత్నబాబు వంతు. ‘బుర్రకథ’తో తను హిట్టు దర్శకుల జాబితాలతో నిలవాలి’’ అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ‘‘మరుధూరి రాజా తర్వాత నాకు బాగా ఇష్టమైన సంభాషణల రచయిత రత్నబాబు. దర్శకుడిగా అతడికి ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాలి. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆదితో చేయాల్సింది. కానీ, కుదరలేదు’’ అన్నారు డైరెక్టర్ ఏ.ఎస్. రవికుమార్ చౌదరి. ‘‘రెండు బ్రెయిన్లు ఉన్న ఓ యువకుడి కథ ఇది. ఆ పాయింట్లో నుంచే వినోదం పుడుతుంది. రామ్, అభి పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తెనాలి రామలింగడి తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘జూన్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్. ‘‘డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఉంటుంది’’ అని ఆది తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, గాయత్రి గుప్తా, మణిచందన్, తదితరులు పాల్గొన్నారు. -
ఆసక్తికరంగా ‘బుర్రకథ’ టీజర్
ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న ఆది సాయి కుమార్.. అటుపై సక్సెస్ అందుకోలేకపోయారు. చాలా కాలం నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ప్రస్తుతం ఓ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బుర్రకథ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేసింది చిత్రబృందం. ఓ మనిషికి రెండు బుర్రలు అనే కొత్త కథతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టేలా కనబడుతున్నాడీ హీరో. టీజర్‌తోనే ఈ మూవీ కాన్సెప్ట్‌ను క్లియర్‌గా చెప్పేసింది యూనిట్. ఆద్యంతం వినోదాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించగా.. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందించగా.. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. -
మే 24న ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బుర్ర కథ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనరే బుర్ర కథ. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
రెండు బుర్రల కథ
ఒక్క మెదడుతోనే ఎన్నో విషయాలు ఆలోచించగలుగుతున్నాం. అదే రెండు మెదళ్లు ఉంటే? ఇదే కాన్సెప్ట్‌తో ‘బుర్ర కథ’ చిత్రం తెరకెక్కింది. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్. శ్రీకాంత్ దీపాల నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘రెండు షేడ్స్‌లో ఆది సాయికుమార్ పాత్ర ఉండబోతోంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సి.రాంప్రసాద్ -
ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బుర్ర కథ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనరే బుర్ర కథ. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు. -
జోడీ కుదిరింది
‘ప్రేమ కావాలి, లవ్లీ’ వంటి ప్రేమకథా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్. లేటేస్ట్‌గా మరో లవ్‌స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. నూతన దర్శకుడు విశ్వనాథ్ అరిగెల తెరకెక్కించిన ‘జోడీ’లో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. పద్మజ, సాయి వెంకటేశ్ గుర్రం నిర్మాతలు. ఉగాది సందర్భంగా ‘జోడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘హీరో, హీరోయిన్ జోడీ మధ్య జరిగే ప్రేమకథ, వాళ్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణి కల్యాణ్, కెమెరా: విశ్వేశ్వర్. -
సెల్యూట్ సైనికా
మనందరికీ ప్రత్యేకంగా ఇల్లు ఉంటుంది. కానీ సైనికులు ఇండియా మొత్తం ఇంటిలానే భావిస్తారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధపడిపోతారు. అలా రియల్ లైఫ్‌లో ప్రాణాలు ఒడ్డిన సైనికులను మనం సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్’ బ్యాక్‌డ్రాప్ సినిమాల గురించి తెలుసుకుందాం. కమాండో సందీప్ ముంబైలో 2008లో జరిగిన 26/11 ఎటాక్స్ దేశంలో సంచలనం సృష్టించాయి. ఆ దురదృష్టకర సంఘటనలో మరణించిన 174 (దాదాపుగా) మందిలో ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. ఈ సంఘటన ఆధారంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. సినిమాలొచ్చాయి. వాటిలో రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ ఒకటి. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో ‘మేజర్’ అనే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కనుంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో హీరో అడవి శేష్ నటించనున్నారు. ఈ చిత్రానికి హీరో మహేశ్‌బాబు ఒక నిర్మాత. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అడవి శేష్, మహేశ్‌బాబు కాపాడతాడు శత్రువులు దేశంలోనే కాదు.. దేశం లోపల కూడా ఉంటారు. ఎవర్నైనా ఎదుర్కోవాల్సింది మన సైనికులే. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్›్డ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఇలా విభాగాలే వేరు. దేశ రక్షణే అందరి లక్ష్యం. దేశ ప్రధాని రక్షణకోసం ఓ ఎన్ఎస్జీ కమాండో ఎలాంటి సాహసం చేశారనే అంశం ఆధారంగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కాప్పాన్’. (కాపాడతాడు) సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య, సముద్రఖని ఎన్ఎస్జీ కమాండోలుగా నటిస్తున్నారు. ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తారని తెలిసింది. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. సూర్య కమాండో అర్జున్ పండిట్ ఆర్మీ ఆఫీసర్లు చేసే సీక్రెట్ ఆపరేషన్స్‌కు విభిన్నమైన పేర్లు పెడుతుంటారు. ఆలాగే గోల్డ్‌ఫిష్ అనే పేరుతో ఓ ఆపరేషన్‌ను షురూ చేశారు కమాండో అర్జున్ పండిట్. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు అనేది వెండితెరపై చూడాల్సిందే. వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఇందులో కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ నటించారు. శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ కీలక పాత్రలు చేశారు. ఆది సాయికుమార్ సరిహద్దు సమరం ఓ మంచి సక్సెస్ కోసం సరిహద్దుకు వెళ్లారు హీరో తనీష్. ఇటీవలే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు తనీష్. 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ హీరోగా ఇతనికి తొలి చిత్రం. ఆ తర్వాత హీరోగా చేయడంతో పాటు కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో విలన్‌గాను నటించారు. తనీష్ నెక్ట్స్ చిత్రం ‘సరిహద్దు’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వి. కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైనికుడి పాత్రలో నటిస్తున్నారు తనీష్. కార్తికేయ–తనీష్ కాంబినేషన్లో వచ్చిన రంగు సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తనీష్ దేశాన్ని రక్షించే సైనికుడంటే ప్రజలందరికీ గౌరవం ఉంటుంది. అందుకే సినిమా సైనికులను కూడా ఆదరిస్తుంటారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్’ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరెంతో మంది సైనికులను తెరపై చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాక్ చేతికి చిక్కి, ధైర్యంగా ఇండియా తిరిగొచ్చిన భారత ఆర్మీ కమాండర్ అభినందన్ మీద చాలా సినిమాలు వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు అభినందన్ బయోపిక్ కోసం టైటిల్స్ రిజిస్టర్ చేశారు. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే బోర్డర్లో సైనికుల కాపలానే కారణం. అందుకే సెల్యూట్ సైనికా.. రైఫిల్ మేన్ వస్తాడా? ఈ ఏడాది నేషనల్ ఆర్మీడే (జనవరి 15) సందర్భంగా ‘రైఫిల్‌మేన్’ అనే సినిమాలో సోల్జర్‌గా నటించనున్నట్లు వెల్లడించారు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. స్మాల్ టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. సోల్జర్ జస్వంత్‌సింగ్ రావత్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. ఆయన జీవితంపై సినిమా తీసే హక్కులు మాకే ఉన్నాయంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చిందట. దాంతో ప్రస్తుతానికి ‘రైఫిల్‌మేన్’ చిత్రం లీగల్ సమస్యలను ఎదుర్కొంటోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కార్గిల్ అమ్మాయి సరిహద్దులో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పైలెట్‌గా మారారు. 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ గుంజన్ సక్సెనా కీలకంగా వ్యవహరించారు. ఆమె జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో గుంజన్ పాత్రను జాన్వీ చేస్తున్నారు. ఇందుకోసం జాన్వీ విమానం నడపడంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కార్గిళ్ గాళ్’ అనే టైటిల్ కూడా పెట్టారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల మేజర్ షూటింగ్ లక్నోలో ప్లాన్ చేశారు. వేసవిలోపు ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కటంటే ఒక్క సినిమాలో మాత్రమే నటించిన జాన్వీ కపూర్‌కు ఇంత తొందరగా బయోపిక్ చాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి.. జాన్వీ ఏ మేరకు ఆడియన్స్‌ను మెప్పిస్తుందో తెలియాలి. జాన్వీ కపూర్ అప్పుడు నీరు.. ఇప్పుడు నింగి రెండేళ్ల క్రితం లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మగా నీటి లోపల పాకిస్తాన్ శత్రువులతో పోరాడారు రానా. ఇది ‘ఘాజీ’ చిత్రం కోసం. ఇప్పుడు ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ కోసం రానా మళ్లీ లెఫ్టినెంట్ కల్నల్‌గా బాధ్యతలు చేపట్టారు. 1971 ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించినప్పుడు ఏం జరిగింది? అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అభిషేక్ దుథాయియా దర్శకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ కల్నల్ విజయ్ పాత్రలో హీరోగా నటిస్తారు అజయ్ దేవగన్. మద్రాస్‌కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ పాత్రను రానా చేస్తున్నారు. సంజయ్‌దత్, సోనాక్షీ సిన్హా, పరిణీతీ చోప్రా ఇతర కీలక పాత్రధారులు. అలాగే ‘1945’ (తమిళంలో ‘మడైతిరందు’) అనే సినిమాలో కూడా రానా స్వాతంత్య్రానికి పూర్వం నాటి సైనికుడి పాత్రలో రానా కనిపిస్తారని తెలిసింది. దీనికోసం ప్రత్యేక కసరత్తులు చేశారట. రానా సైన్యంలో చేరతారా? ‘సైనికుడు’ పేరుతో వచ్చిన సినిమాలో మహేశ్‌బాబు నటించారు కానీ సరిహద్దు సైనికుడిలా మాత్రం కనిపించలేదు. అయితే..‘పోకిరి, దూకుడు, ఆగడు’ వంటి చిత్రాల్లో బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మహేశ్ సైన్యంలో చేరే సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ సమాచారం. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేశ్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు ఆర్మీ ఆఫీసర్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాగే ఫన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక వెంకటేశ్‌తో కలిసి నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. కేఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఆ లొకేషన్లో ఆర్మీ ఆఫీసర్ కాస్ట్యూమ్స్ కనిపించడంతో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నారనే టాక్‌కు మరింత బలం చేకూరినట్లయింది. మహేశ్‌బాబు, నాగచైతన్య ఆర్మీ జాయినింగ్ గురించి అధికారిక ప్రకటన వస్తే మరింత స్పష్టత లభిస్తుంది. -
తలకోన అడవుల్లో...
ఆది సాయికుమార్, వేదిక జంటగా కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. నిఖిల్‌తో ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ బ్యానర్‌పై కావ్య వేణుగోపాల్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కనున్న చిత్రమిది. చిత్తూరు జిల్లాలోని తలకోనలో ఈ నెల 25న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘రోబో, 2.0’ చిత్రాలకు అసోసియేట్ కెమెరామేన్‌గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య స్వరాలు సమకూరుస్తున్నారు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
గోల్డ్ ఫిష్ కీరవాణి పాట
ఆది సాయికుమార్ ఎన్.ఎస్.జి కమాండోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. శషా చెత్రి, నిత్యా నరేష్ కథానాయికలు. రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా ఘాజీ బాబా పాత్రలో నటిస్తున్నారు. సాయికిరణ్ అడివి దర్శకుడు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి ఓ దేశభక్తి పాట పాడారు. ‘‘కీలక సన్నివేశంలో వచ్చే కీరవాణిగారు పాడిన పాట సినిమాని ఇంకో స్థాయికి తీసుకువెళ్లింది. రామజోగయ్య శాస్త్రిగారు విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు సాయికిరణ్. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలోని సందేశం జనాలను ఆలోచింపచేస్తుంది. కీరవాణిగారి సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పైగా ఆ పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్‌రెడ్డి తుమ్మ, సహ నిర్మాత: దామోదర్ యాదవ్ (వైజాగ్), నిర్మాతలు: ప్రతిభ అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల. -
లుక్ టెస్ట్ చేయగానే ధైర్యం వచ్చింది
‘‘భారతీయ తెరపై ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాని క్రాస్ జోనర్ పద్ధతిలో తీశాం. యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలతో సినిమా ఉంటుంది. ఇందులో ఎన్ఎస్జీ కమాండో పాత్రకు ఆది సాయికుమార్ పర్ఫెక్ట్ అనిపించింది. అయితే ఆ పాత్రకు డ్యాన్సులు ఉండవు. అందుకని చేస్తాడో లేదో అనుకున్నాను. కానీ కథ విని నటుడిగా తనకు చాలా కొత్తగా ఉంటుందని చేయడానికి అంగీకరించాడు’’ అన్నారు అడివి సాయికిరణ్. ‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ విజయాల తర్వాత అడివి సాయికిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. ఆదిసాయికుమార్, అబ్బూరి రవి, సషా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యానరేష్, పార్వతీశం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు ఈ చిత్రనటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ – ‘‘లవర్‌బాయ్ పాత్రలు చేసిన నాకు ఎన్ఎస్జీ కమాండో లుక్ సెట్ అవుతుందో లేదో అనిపించింది. నాన్న కథ విని నాకీ పాత్ర బాగుంటుందని చెప్పారు. లుక్ టెస్ట్ చేయగానే ధైర్యం వచ్చింది. నా పాత్రకు హీరోయి¯Œ , పాటలు ఏవీ ఉండవు. కశ్మీర్ పండిట్ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా కనిపిస్తాను. 1980 నాటి కాలంలో కశ్మీర్ పండిట్ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని చర్చిస్తూ ఈ సినిమా చేశాం. ఇటీవల అలాంటి ఘటనలే మళ్లీ కశ్మీర్లో జరగడం బాధను కలిగించింది’’ అని అన్నారు. ‘‘కేరింత’ సినిమాతో దర్శకుడు సాయికిరణ్ నన్ను పరిచయం చేశారు. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు’’ అన్నారు నిత్యా నరేష్. నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ – ‘‘కెమెరామేన్ జైపాల్‌రెడ్డి ద్వారా నాకు సాయికిరణ్ అడివి పరిచయం అయ్యారు. నిర్మాతను కూడా సాంకేతిక నిపుణుడిగా భావించి ఈ సినిమా చేశారు. వంద శాతం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఇంటె¯Œ ్స ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నాలుగు పాటలుంటాయి. క్షణం, గరుడవేగ, గూఢచారి తర్వాత నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. అబ్బూరి రవి మాట్లాడుతూ – ‘‘ఈ కథ విని నోట మాట రాలేదు. సాయికిరణ్ ఇలాంటి సినిమా చేస్తారని ఊహించలేదు. హైదరాబాద్‌లో స్థిరపడిన కశ్మీర్ పండిట్ కుటుంబాల్ని కలుసుకొని వారి బాధలను స్వయంగా తెలుసుకొని సాయికిరణ్ ఈ కథను రాసుకున్నారు’’ అన్నారు. కార్తీక్‌రాజు, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: దాయోధర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్‌రెడ్డి తుమ్మ. -
ఆసక్తికరంగా ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ టీజర్
రానా, త్రివిక్రమ్ లాంటి సెలబ్రెటీలతో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట లుక్స్ రిలీజ్ చేయించింది ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ చిత్రయూనిట్. నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించి.. బజ్ క్రియేట్ చేసింది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్ నటించిన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాటల రచయిత అబ్బూరి రవి కీలకపాత్రలో నటిస్తుండగా.. ఎయిర్టెల్ భామ సాషా ఛెత్రి హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని కాశ్మీర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్ అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. మొదటి సారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్న అబ్బూరి రవి, సాషా ఛెత్రిలకు ఈ సినిమా విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. -
ఘాజీ బాబా వచ్చేశారు
‘‘బొమ్మరిల్లు, అతిథి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కిక్, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా, ఎవడు, కేరింత, చీకటి రాజ్యం, ఊపిరి, గూఢచారి’ వంటి చిత్రాల రచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అబ్బూరి రవిని నటుడిగా పరిచయం చేస్తున్నారు దర్శకుడు అడివి సాయికిరణ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఆది సాయికుమార్ హీరోగా, శషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిళ్ల్ల, రావు రమేశ్ కీలకపాత్రల్లో నటించారు. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి. బిహెచ్, సతీష్ డేగలతో పాటు ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో తీవ్రవాది ‘ఘాజీ బాబా’ పాత్రలో అబ్బూరి రవి నటించారు. ఆయన ఫస్ట్ లుక్‌ను దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే... అబ్బూని (అబ్బూరి రవి) విలన్‌గా పరిచయం చేయడం. నేనూ, రవి కలిసి చదువుకున్నాం. నాకు ఇష్టమైన స్నేహితుడు. కశ్మీరీ పండిట్ల సమస్య మీద సాయి కిరణ్‌గారు తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నన్ను రచయితగా లాంచ్ చేసింది త్రివిక్రమే. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’లో నా లుక్ తన చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. అడివి సాయి కిరణ్‌తో ‘కేరింత’ సినిమాకు వర్క్ చేశా. నన్ను టెర్రరిస్ట్ (సినిమాలో పాత్రని ఉద్దేశించి) గా చూస్తాడని కలలో కూడా ఊహించలేదు (నవ్వుతూ)’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘ఘాజీ బాబా పాత్రలో నటించమని అబ్బూరి రవిగార్ని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది’’ అన్నారు సాయి కిరణ్ అడివి. ఈ చిత్రానికి కెమెరా: జయపాల్ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ, కో ప్రొడ్యూసర్: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
ఆపరేషన్ ముగిసింది
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ముగిసింది. మరి.. ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఈ ఆపరేషన్ ఎవరి కోసం? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా చూడాల్సిందే. ఆది సాయికుమార్, శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అడివి సాయికిరణ్ దర్శకుడు. కాగా ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులందరూ నిర్మాణంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇందులో కమాండో అర్జున్ పండిట్ పాత్రలో నటించారు ఆది సాయికుమార్. ఆదివారం ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ– ‘‘ఆది ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ ఇది. చాలా కష్టపడి తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. ఆ తర్వాత సినిమా విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. దామోదర్ యాదవ్ ఈ సినిమాకు సహ నిర్మాత. కిరణ్ రెడ్డి తుమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
కమాండో అర్జున్ పండిట్
మైనస్ పది డిగ్రీల చలిలో దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఎన్.ఎస్.జీ కమాండో అర్జున్ పండిట్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కోసం కష్టపడుతున్నారు. మరి.. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు? అనేది వెండితెరపై తెలుస్తుంది. ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ ముఖ్య తారలుగా ‘వినాయకుడు’ ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్, ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి. బిహెచ్, సతీష్ డేగలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు నిర్మాతలు. ఈ సినిమాకి పని చేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రానా విడుదల చేశారు. అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జీ కమాండోగా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం మైనస్ పది డిగ్రీల చలిలో షూటింగ్ జరుపుతున్నాం. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కల్పిత కథ ఇది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
అందరూ నిర్మాతలే
ఆది సాయికుమార్, నిత్యా నరేశ్, పార్వతీశం, శషా చెట్రి ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ‘వినాయకుడు, కేరింత’ వంటి సినిమాలు తెరకెక్కించిన అడవి సాయికిరణ్ దర్శకుడు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులే ఈ చిత్రం నిర్మించడం విశేషం. ఎయిర్టెల్ మోడల్ శషా చెట్రి ఈ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మాటలు రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, చింతపల్లి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఒక్క షెడ్యూల్ మినహా చిత్రీకరణ పూర్తయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బుర్ర కథ చూడండహో
‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం ఆడోరకం, ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘డైమండ్’ రత్నబాబు మెగా ఫోన్ పట్టారు. ఆది సాయికుమార్ హీరోగా ఆయన డైరెక్షన్లో ‘బుర్రకథ’ అనే సినిమా తెరకెక్కనుంది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రచయిత, పాటల రచయిత, దర్శకుడు శివశక్తి దత్తా కెమెరా స్విచ్చాన్ చేయగా రచయిత పరుచూరి గోపాల కృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ‘డైమండ్’ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చి డైరెక్టర్‌గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు టాప్ టెక్నీషియన్స్‌ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు నిర్మాతకి, నాపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న ఆదిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘బుర్రకథ’ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వారంలో హీరోయిన్స్, ఇతర నటీనటులను ఓకే చేయనున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ దీపాల. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రామ్ ప్రసాద్. -
ఆది హీరోగా ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ కెరీర్ స్టార్టింగ్‌లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్లు వచ్చినా.. మళ్లీ అలాంటి విజయాలు రాలేదు. మధ్యలో రూట్ మార్చి మల్టిస్టారర్ సినిమాల్లో నటించిన కలిసి రాలేదు. ఆది హీరోగా గతేడాది వచ్చిన ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆది తన మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆదికి సరైన హిట్ కావాలి. మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి ఆది హీరోగా చేస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించనున్నారు. దీపాల ఆర్ట్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. -
ఆదితో జతకట్టనున్న సురభి!
శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది జోడిగా సక్సెస్ఫుల్ హీరోయిన్ సురభి నటించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతమందిస్తున్న ఈ మూవీలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఆది కొత్త సినిమా ఓపెనింగ్
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ఆదివారం ప్రారంభమైంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ శౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ పాల్గొన్నారు. హీరో ఆది మాట్లాడుతూ... డైరెక్టర్ నాకు 3 గంటలు నెరేషన్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టొరీ ఇది. మంచి ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. త్వరలో హీరోయిన్ పేరు ప్రకటిస్తాము. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నాకు కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నానన్నారు. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ... మంచి లవ్ స్టొరీ తో వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా చెయ్యడానికి మాకు సహకరిస్తున్న సాయి కుమార్ గారికి, హీరో ఆదికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు సంభందించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నానన్నారు. -
నెక్ట్స్ మూడు సినిమాలు ఒకే బ్యానర్లో..!
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయికుమార్, విజయాలు సాదించటంలో మాత్రం తడబడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నా తరువాత ఆ ట్రాక్ రికార్డ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డాడు. శమంతకమణితో మల్టీ స్టారర్ సినిమా చేసినా అది కూడా ఆది కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నెక్ట్స్‌నువ్వే మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆది. అంతేకాదు నెక్ట్స్‌నువ్వే సినిమా నిర్మాతల్లో ఒకరైన తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో వరుస సినిమాలకు ఓకె చెప్పాడు. ఆది తన తదుపరి మూడు చిత్రాలను జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలోనే చేయనున్నాడట. వీటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా మరోటి తెలుగు సినిమా. రిలీజ్ కు రెడీగా ఉన్న నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని వి4 క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, జ్ఞానవేల్‌రాజా, యువి క్రియేషన్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
తర్వాత నువ్వే
నువ్వు... నువ్వు... నువ్వు... తర్వాత నువ్వే అంటున్నారు ఆదీ సాయికుమార్. ఇంతకీ ఎవర్ని అంటున్నారు? అంటే.. ప్రస్తుతానికి నో ఆన్సర్. దసరాకి స్క్రీన్ మీద చూసుకోవాల్సిందే. ఆదీ సాయికుమార్ హీరోగా ప్రభాకర్. పి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 మూవీస్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. వైభవి, రేష్మి కథానాయికలు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘వి4 బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మొదటి సినిమా ద్వారా ప్రభాకర్. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఆదీ సాయికుమార్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుçపుతున్నాం. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్‌రెడ్డి, హిమజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, ఎడిటింగ్: ఎస్.బి. ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
ఆ నలుగురి నమ్మకమే ఈ విజయం!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా ట్రై చేద్దామనుకున్నా. కానీ, కెమెరా వెనకాల డైరెక్టర్‌గా ఉండటమే బాగుందనిపించింది. అందుకే ప్రస్తుతానికి డైరెక్టర్‌గానే ఉందామని డిసైడ్ అయ్యా’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శమంతకమణి’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందంటోన్న శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో జరిగిన సంఘటన ఆధారంగా ‘భలే మంచిరోజు’ కన్నా ముందే ఈ చిత్రకథ రాశా. ఫస్ట్ సినిమాకి నలుగురు హీరోలంటే కష్టం కదా! ‘భలే మంచిరోజు’ తర్వాత నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్‌లను కలిశా. నలుగురికీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఓపెనింగ్ సీన్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్... ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు నెరేట్ చేశాను. అప్పుడు నలుగురికీ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆ నలుగురి నమ్మకమే ఈ రోజు ‘శమంతకమణి’ విజయం. రాజేంద్ర ప్రసాద్‌గారు చేసిన పాత్ర మాకు చాలా ఫ్లస్ పాయింట్. నలుగురు హీరోలను హ్యాండిల్ చేయడంలో ఫస్ట్ డే భయపడ్డాను. క్లైమాక్స్ సీన్లో నలుగురితో పాటు రాజేంద్రప్రసాద్‌గారు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఆ సీన్ బాగా రావాలని కోరుకున్నాను. సినిమాకు మౌత్ టాక్ బాగుంది. నాకు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఐయామ్ హ్యాపీ. మరో రెండేళ్లపాటు క్రైమ్ కామెడీ సినిమాలు చేయకూడదనుకుంటున్నా’’ అన్నారు. -
కొన్నాళ్ల పాటు మల్టీస్టారర్స్ చేయను!
‘‘ఇప్పటివరకూ నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదు. కానీ, ఈ సిన్మా తర్వాత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా’’ అన్నారు సందీప్ కిషన్. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ రేపు విడుదలవుతోంది. సందీప్ చెప్పిన సంగతులు... ♦ ఇందులో లవ్‌లో ఫెయిలైన కోటిపల్లి శివ అనే యువకుడి పాత్ర చేశా. ఓ పల్లెటూరిలో థియేటర్ నడిపే శివకు, కారుకు సంబంధం ఏంటనేది తెరపైనే చూడాలి. కొన్నిసార్లు పాత్రలు బాగున్నా... సినిమా అంతా ఉండవు. కానీ, ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. శివ పాత్ర అలాంటిదే. ఇందులో ఊర మాస్ సీనుంది. లుంగీ కట్టుకుంటే సీన్ బాగుంటుందని నేనూ, దర్శకుడు డిస్కస్ చేసుకుని ఈ లుక్ డిజైన్ చేశాం. ♦ శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమా ‘భలే మంచిరోజు’ టేకింగ్ నాకు బాగా నచ్చింది. మనిషిగానూ నచ్చాడు. నలుగురు హీరోలం శ్రీరామ్ ఆదిత్యను కలసినప్పుడు చాలా సింపుల్‌గా కథ చెప్పాడు. అందరికీ ఎగై్జటింగ్‌గా అనిపించి ఓకే చేశాం. ఆదితో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. సుధీర్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో రోహిత్ బాగా క్లోజ్ అయ్యాడు. ఒకరి పాత్రతో మరొకరి పాత్రకు పోలిక ఉండదు. ఇందులో రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు మల్టీస్టారర్స్ చేయకూడదనుకుంటున్నా. ♦ ‘నక్షత్రం’ త్వరలోనే విడుదలవుతుంది. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తెలుగులో కునాల్ కోహ్లీ దర్శకత్వంలో నేను, తమన్నా జంటగా ఓ సినిమా, మంజులగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ రెండూ కాకుండా తెలుగు, తమిళ భాషల్లో సుసీంద్రన్ దర్శకత్వంలో ‘నా పేరు శివ’కు సీక్వెల్‌గా ‘కేరాఫ్ సూర్య’, తమిళ హిట్ ‘డీ–16’ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ‘నరకాసురుడు’ చేస్తున్నా. ♦ నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్. ‘నరకాసురుడు’కి ముందు తననే అడిగారట. తనెందుకు చేయలేదో నాకు తెలీదు. దర్శకుణ్ణి కూడా నేనింతవరకు అడగలేదు. వరుసగా మంచి దర్శకులతో పనిచేసే అవకాశాలు వస్తుండడం హ్యాపీ. వినోదం పాటు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నా. -
అదంత ఈజీ కాదు!
‘‘ఈ కథ మిస్సయితే మంచి సినిమా మిస్సయినట్లే అనిపిస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఆ సినిమా ఒప్పేసుకుంటా. స్క్రిప్ట్ ఎగై్జటింగ్‌గా ఉంటే మళ్ళీ మల్టీస్టారర్ చేయడానికి కూడా రెడీయే’’ అన్నారు నారా రోహిత్. సందీప్‌కిషన్, నారా రోహిత్, సుధీర్‌బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శమంతకమణి’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేశారు. వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. నారా రోహిత్ చెప్పిన విశేషాలు. ♦ నలుగురు హీరోలు కలిసి ఓ సినిమా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఈ స్క్రిప్ట్‌లో ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉంది. ఇందులో పోలీసాఫీసర్ రంజిత్ కుమార్‌గా చేశా. రంజిత్ ‘క్రాకీ’. ఎప్పుడెలా ఉంటాడో ఎవరికి తెలీదు. జోకులేస్తాడు. నవ్వేలోపు సీరియస్ అవుతాడు. ♦ ‘భలే æమంచిరోజు’ తర్వాత శ్రీరామ్ ఆదిత్య చేసిన సినిమా ఇది. రెండో సినిమానే 37 రోజుల్లో కంప్లీట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. బ్రిలియంట్ స్క్రిప్ట్ రాసుకోవడంతో పాటు పక్కా క్లారిటీగా తీశాడు. సినిమాలో నా కో–స్టార్స్ డామినేట్ చేస్తారని భయపడను. నా రోల్‌కి న్యాయం చేస్తానా? లేదా అని భయపడుతుంటాను. ఒకవేళ భయపడి ఉంటే ‘ప్రతినిధి’ సినిమాలో కోటాగారిలాంటి సీనియర్ యాక్టర్‌తో నటించేవాణ్ణి కాదు. ♦ నిజానికి ఇంకో పాత్రకోసం తగ్గుతుంటే ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ 25న నా బర్త్‌డే. ఆ రోజు నా అప్‌కమింగ్ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నాం. టైటిల్ కూడా డిఫరెంట్‌గా, ఎగై్జటింగ్‌గా ఉంటుంది. దీనికి పవన్ మల్లెల డైరెక్టర్. ఈ సినిమా కోసం 21 కిలోలు బరువు తగ్గా. డిఫరెంట్ డైట్ ఫాలో అయ్యా. ప్రస్తుతం 79 కేజీలు బరువు ఉన్నా. ఇంకో 6 కిలోలు తగ్గాలి. ♦ శమంతకమణి తర్వాత ‘కథలో రాజకుమారి’ విడుదల కానుంది. ‘పండగలా వచ్చాడు’ సినిమాలో నాకు కొంచెం గెటప్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ సినిమా చర్చల దశలో ఉంది. ♦ తెలుగులో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఇది మంచిదే. ‘నిన్ను కోరి’ సినిమా ఒక ఐదేళ్ల క్రితం వస్తే ఎలా ఉండేదో? ‘కథలో రాజకుమారి’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాను. ‘బాణం’ చేయడం వల్ల ‘అసుర, ప్రతినిధి’ లాంటి సినిమాలు వచ్చాయి. ♦ ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ షో చేయడం ఆనందంగా ఉంది. నాకు హోస్ట్ చేయాలని లేదు. ప్రజెంట్ కాన్సెన్ట్రేషన్ అంతా సినిమాలపైనే ఉంది.