యువ హీరో ఆది సాయి కుమార్.. త్వరలో 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. అన్ని కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
(ఇదీ చదవండి:పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'? )
ఇందులో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు లాంటి హిట్ సినిమాలకు అనూప్ రుబెన్స్ సంగీతమందించారు. ఇప్పుడు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్రానికి అలాంటి సాంగ్స్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్‌గా చేస్తోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)
Comments
Please login to add a commentAdd a comment