ఆది సాయికుమార్ కొత్త మూవీ.. హైదరాబాద్‌లో షూటింగ్! | Aadi Saikumar Latest Movie shooting Starts In Hyderabad | Sakshi
Sakshi News home page

Aadi Saikumar: హారర్ థ్రిల్లర్‌తో వస్తోన్న ఆది సాయికుమార్.. హైదరాబాద్‌లో షూటింగ్!

Published Fri, Dec 20 2024 9:23 PM | Last Updated on Fri, Dec 20 2024 9:23 PM

 Aadi Saikumar Latest Movie shooting Starts In Hyderabad

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం  ‘శంబాల. ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ సినిమాకు'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు.

ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ మూవీలో శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement