ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. చదవండి: డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే విధించిన హైకోర్టు
బన్నీ సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప-2 సెట్స్‌లోకి ఎన్టీఆర్ ప్రత్యేక్షం అయ్యాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటో లీక్ అవగా, ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.
దీంతో తారక్ బన్నీకి సర్‌ప్రైజ్ ఇవ్వడానికి ఇలా సరదాగా వచ్చాడా? లేదా పుష్ప-2లో ఏమైనా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడా అన్న చర్చ మొదలైంది. ఇక తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. చదవండి: ఇంకా నయం కాని మయోసైటిస్.. ఆక్సిజన్ మాస్క్‌తో సమంత
Today @tarak9999 Anna Visited @alluarjun's #Pushpa2TheRule Sets At Ramoji Film City 🔥🔥. Hero Looks ❤️🔥🤩. #ManOfMassesNTR pic.twitter.com/VX3b58b8jV
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 26, 2023
Comments
Please login to add a commentAdd a comment