ఈ ఏడాది అత్యధిక టికెట్స్‌ అమ్ముడైన సినిమా ఇదే..! | BookMyShow report reveals which movie sold most tickets in 2024 | Sakshi
Sakshi News home page

BookMyShow: ఒక్క రోజులో అత్యధిక టికెట్స్‌ అమ్ముడైన సినిమా ఇదే..!

Published Fri, Dec 20 2024 4:12 PM | Last Updated on Fri, Dec 20 2024 4:27 PM

BookMyShow report reveals which movie sold most tickets in 2024

మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇకపోతే ఈ ఏడాదిలో చాలా చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ జాబితాలో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచిన సంగతి తెలిసిందే.

తాజాగా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో వెల్లడించింది. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్‌ వీక్షించినట్లు వెల్లడించింది.

కాగా.. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‍ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement