మరో మూడు రోజుల్లో థియేటర్స్ షేక్ కానున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనుంది. 2021లో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తోంది. పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కించిన పుష్ప-2 ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇప్పటికే ఓవర్‌సీస్ టికెట్స్ బుకింగ్స్ పూర్తి కాగా.. ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా ఒక రోజు గడవకముందే రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టికెట్స్ విడుదలైన కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అధిగమించింది.
పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో రూ.10 కోట్లను దాటేసింది. పుష్ప 2 బుకింగ్ మొదలైన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి 2 లక్షల టిక్కెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. పుష్ప- 2 కన్నడ బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్-2ను సైతం మించిపోయింది. 2022లో ఈ మూవీ టికెట్స్ 12 గంటల్లో 1.25 లక్షలు మాత్రమే సేల్స్ సాధించింది. యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ-సేల్స్‌లో రూ.80 కోట్లు వసూలు చేసింది.
రాజమౌళి బాహుబలి-2 తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.90 కోట్ల వసూళ్ల మేర టికెట్స్ విక్రయించారు. తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే పుష్ప- 2 హిందీలో రూ.5.5 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment