'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది.
అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిందీలో మూడు రోజుల్లోనే రూ.205 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.
#Pushpa2TheRule is setting new benchmarks in Indian Cinema ❤🔥
Registers the highest single day collection in Hindi with a 74 CRORES NETT on Day 3 🔥
The BIGGEST INDIAN FILM is the fastest to 200 CRORE NETT film in Hindi with a 3 day figure of 205 CRORES 💥💥… pic.twitter.com/AMLH5EXu2Z— Pushpa (@PushpaMovie) December 8, 2024
Comments
Please login to add a commentAdd a comment