Hindi
-
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో హిందీ బాషను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో యాష్ మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు. అది కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తుంది.#Watch | தமிழுக்கு அதிர்ந்த அரங்கம்.. இந்திக்கு SILENT.. "இந்தி தேசிய மொழி இல்ல".. பதிவு செய்த அஸ்வின்!சென்னையில் உள்ள தனியார் பொறியியல் கல்லூரியில் நடைபெற்ற பட்டமளிப்பு விழாவில் மாஸ் காட்டிய கிரிக்கெட் வீரர் அஸ்வின்#SunNews | #Chennai | #Ashwin | @ashwinravi99 pic.twitter.com/TeWPzWAExQ— Sun News (@sunnewstamil) January 9, 2025అసలు ఏం జరిగిందంటే.. కాంచీపురంలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో యాష్ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశాడు. యాష్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఏ భాష అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటుందని స్టూడెంట్స్‌ను అడిగాడు. ఇంగ్లిష్, తమిళ్, హిందీ భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలని కోరాడు. తమిళ్, ఇంగ్లిష్ అని అశ్విన్ చెబుతుండగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే హిందీ పేరు ఎత్తగానే ఆడిటోరియం మొత్తం మూగబోయింది. ఈ సందర్భంగా అశ్విన్ హిందీ జాతీయ భాష కాదు, అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అశ్విన్ మాటల్లో.. "హిందీ మన జాతీయ భాష కాదు. అది అధికారిక భాష మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నాను" అశ్విన్ ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యాష్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై (భాష) వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.కాగా, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం, రాజ్యాంగం ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను గుర్తిస్తుంది. ఇండియాలో ఇంగ్లిష్తో పాటు హిందీ అధికారిక భాష హోదాను కలిగి ఉంది. భారత్‌లో హిందీ సహా ఏ భాషకు జాతీయ భాష హోదా లేదు. అధికారిక భాష, జాతీయ భాష మధ్య వ్యత్యాసాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఇది విస్తృత చర్చలకు దారితీస్తుంది. సంవత్సరాలుగా హిందీని ఏకీకృత భాషగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇదిలా ఉంటే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో భాగమైన అశ్విన్.. టీమిండియా తరఫున 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 537 వికెట్లు తీసి భారత్ తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న యాష్.. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 38 ఏళ్ల అశ్విన్ తదుపరి ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. -
పుష్పరాజ్ మరో రికార్డ్.. అరుదైన క్లబ్లో చేరిన పుష్ప-2
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తియినప్పటికీ వసూళ్ల రాబట్టడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. తొలి రోజు నుంచి రికార్డుల సునామీ సృష్టిస్తోన్న పుష్పరాజ్.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.బాలీవుడ్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో పుష్ప-2 హిందీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ వసూళ్లు కేవలం 31 రోజుల్లోనే పుష్ప-2 సాధించింది. ఈ కలెక్షన్లతో రూ.800 కోట్ల అరుదైన క్లబ్లో చేరింది. ఇప్పటికే హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.వివాదంలో పుష్పరాజ్..అయితే ఈ మూవీ విడుదలకు ముందు రోజు విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల నాంపల్లి కోర్టు సైతం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.ఆస్పత్రిలో మహిళ కుమారుడు..సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ కుమారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు, అల్లు అరవింద్ ఆ బాలుడిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల సాయం ప్రకటించారు. ఇప్పటికే వారి ఫ్యామిలీకి చెక్కులు కూడా అందజేశారు. Brand #Pushpa inagurates 𝟖𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄 CLUB in Hindi ❤🔥#Pushpa2TheRule has a RECORD BREAKING COLLECTION in Hindi with 𝟖𝟎𝟔 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐍𝐄𝐓𝐓 in 31 days 💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/bRAgO99ygp— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2025 -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే పలు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు వేల కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. తాజా వసూళ్లు చూస్తే మరికొద్ది రోజుల్లోనే ఈ అరుదైన మైలురాయిని పుష్ప-2 మూవీ చేరుకునేలా కనిపిస్తోంది.అయితే నార్త్‌లో పుష్పరాజ్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. తాజాగా హిందీ పుష్ప-2 మరో రికార్డ్ సాధించింది. రిలీజైన 19 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త సృష్టించింది. దీంతో అత్యంత వేగంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. హిందీ సినీ చరిత్రలోనే పుష్ప-2 అరుదైన ఘనత సాధించింది. Pushpa Raj introduces the 700 CRORE CLUB to HINDI CINEMA 💥💥 The FIRST EVER FILM to collect 700 CRORES in HINDI ✨#Pushpa2TheRule collects massive 704.25 CRORES NETT in Hindi ❤🔥❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/9Mg6plgJyE— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2024 -
మలయాళ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!
ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. వందేళ్ల చరిత్రను తిరగరాశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అటు యూఎస్‌లోనూ తిరుగులేని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ— Pushpa (@PushpaMovie) December 20, 2024 The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT— Pushpa (@PushpaMovie) December 20, 2024 -
పుష్ప-2 మరో రికార్డ్.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు!
అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.(ఇది చదవండి: అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ)అయితే పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన పది రోజుల్లోనే నార్త్‌లో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది. ఇప్పటికే హిందీలో తొలిరోజు రూ.74 కోట్లతో మొదలైన పుష్పరాజ్ ఊచకోత ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెన్ డేస్‌లో రూ.507 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.#Pushpa2TheRule breaches another record-breaking milestone ❤️🔥Crosses 500 CRORES NETT in Hindi in just 10 days - THE FASTEST FILM IN HINDI to do so 💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/CwpYUbf2o7— Pushpa (@PushpaMovie) December 15, 2024 -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. 3డీ ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్ కానుంది.The #Barroz3D Hindi trailer is here! Thrilled to present this magical adventure in Hindi, brought to you in collaboration with #Penstudios. The Hindi version hits theatres on December 27. https://t.co/3pgb0ku861#Barroz— Mohanlal (@Mohanlal) December 11, 2024 -
పుష్పరాజ్ ఊచకోత.. అత్యధిక వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డ్!
ఇటీవల థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐకాన్ స్టార్ మూవీ తొలిరోజే ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల కలెక్షన్స్‌తో పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు.నార్త్‌లో వసూళ్ల ఊచకోత..ఇక హిందీ విషయానికొస్తే మొదటి రోజే అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్ సాధించింది. మొదటి రోజే ఏకంగా రూ.72 కోట్ల వసూళ్ల షారూఖ్ ఖాన్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లతో తన రికార్డ్‌ను తానే తిరగరాశాడు. ఇక నాలుగోరోజు ఆదివారం కావడంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఏకంగా రూ.86 కోట్ల నెట్ వసూళ్లతో ప్రభంజనం సృష్టించాడు పుష్పరాజ్. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.291 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. హిందీలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇప్పటికే జవాన్, పఠాన్, యానిమల్, గదర్- 2 సినిమాలను అధిగమించింది. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే పలు రికార్డులను బద్దలు కొట్టింది. పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులుఅత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్:పుష్ప 2 హిందీ వర్షన్ భారతదేశంలో రూ. 72 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల వసూళ్లను రాబట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని అధిగమించింది.అత్యధిక నాన్-హాలిడే ఓపెనింగ్: నాన్ హాలీడే గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓ ప్రత్యేక మైలురాయిని సాధించింది.అత్యధిక నాన్-ఫెస్టివల్ ఓపెనింగ్: ఈ మూవీ విడుదల సమయంలో ఎలాంటి పండుగ లేకపోయినా ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలిగింది.హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్: హిందీ వెర్షన్లో భాగంగా ఇండియాలో కేవలం నాల్గో రోజు(ఒక్క రోజు) రూ. 86 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.అత్యంత వేగంగా రూ.250 కోట్లు: భారతదేశంలో అత్యంత వేగంగా రూ.250 కోట్ల మార్కును అధిగమించిన హిందీ వర్షన్ చిత్రంగా పుష్ప- 2 నిలిచింది. డిసెంబర్ 8 (ఆదివారం) నాడు ఈ మైలురాయిని సాధించింది.అత్యధిక వీకెండ్ ఒపెనింగ్: పుష్ప 2 హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 291 కోట్ల నెట్ వసూళ్లు ఆర్జించింది.A HISTORIC SINGLE DAY in Hindi ❤️🔥#Pushpa2TheRule collects a Nett of 86 CRORES on Day 4 - creating an all time record of the HIGHEST Hindi collection in a single day 🔥The Wildfire Blockbuster also becomes the fastest Hindi film to reach 291 CRORES NETT in just 4 days 💥💥… pic.twitter.com/Jarw91cHNk— Pushpa (@PushpaMovie) December 9, 2024 -
పుష్ప రాజ్ హవా.. మూడు రోజుల్లోనే హిందీలో మరో రికార్డ్!
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది.అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిందీలో మూడు రోజుల్లోనే రూ.205 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.#Pushpa2TheRule is setting new benchmarks in Indian Cinema ❤🔥Registers the highest single day collection in Hindi with a 74 CRORES NETT on Day 3 🔥The BIGGEST INDIAN FILM is the fastest to 200 CRORE NETT film in Hindi with a 3 day figure of 205 CRORES 💥💥… pic.twitter.com/AMLH5EXu2Z— Pushpa (@PushpaMovie) December 8, 2024 -
హిందీ నేర్చుకుంటున్నందుకు...నన్ను హేళన చేశారు: నిర్మల
న్యూఢిల్లీ: తమిళనాడులో స్కూలుకెళ్లే రోజుల్లో హిందీ నేర్చుకునే విద్యారి్థనిగా అవమానాలను ఎదుర్కొన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్‌సభలో మంగళవారం బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లుపై ఆమె హిందీలో మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ఆమె తన చిన్ననాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘‘తమిళనాడులో హిందీ నేర్చుకునే వారికి అడ్డంకులు సృష్టించారు. తమిళ గడ్డపై పుట్టి, ఉత్తర భారత భాష నేర్చుకోవడమేంటని అడ్డుకునే వారు. నేను మదురై వీధుల్లో వెళ్తుండగా హేళనగా మాట్లాడేవారు’’ అని చెప్పారు.‘‘ఇష్టమైన భాషను నేర్చుకునే స్వేచ్ఛ, హక్కు నాకు లేవా? తమిళనాడు మన దేశంలో భాగం కాదా? హిందీ నేర్చుకోకుండా నన్ను అడ్డుకోవడం నిర్బంధం కాదా?’’ అని ప్రశ్నించారు. హిందీ, సంస్కృతాలను విదేశీ భాషలుగా పరిగణించడం తగదన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నామంటూ విమర్శించే వారు తన ప్రశ్నలకు సమాధానమివ్వాలన్నారు. ‘‘తమిళ భాషను ప్రధాని మోదీ ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఇంకెవరైనా చేయగలిగారా? మోదీ ప్రసంగాల్లో తరచూ తమిళ భాషను ప్రస్తావిస్తారు. అదీ తమిళులకు మేమిచ్చే గౌరవం! డీఎంకేతో పొత్తు పెట్టుకునే పారీ్టకి చెందిన ప్రధానులెవరైనా ఇలా చేశారా?’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి నిర్మల దుయ్యబట్టారు. -
హిందీ నేర్పిస్తారా? ఎలాన్ మస్క్ అదిరిపోయే ఆఫర్
ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్ఏఐ(xAI).. హిందీ ట్యూటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో ఏఐ ట్యూటర్లుగా పనిచేయడానికి భాషా నిపుణుల కోసం గ్లోబల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్ వంటి ఇతర భాషలలో నిపుణులను నియమించుకుంటోంది.తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏఐ మోడల్స్ భాషా అభ్యాస ప్రక్రియలకు మార్గనిర్దేశం చేయడంలో ద్విభాషా కమ్యూనికేషన్, సాంకేతిక రచన లేదా జర్నలిజంలో నైపుణ్యం అవసరం. "బలమైన పరిశోధనా నైపుణ్యాలు, వివిధ సమాచార వనరులు, డేటాబేస్లు, ఆన్లైన్ వనరులను ఇంగ్లీష్ నుంచి ఇతర భాషలలోకి మార్చగల సామర్థ్యం చాలా అవసరం" అని ఉద్యోగ వివరణ పేర్కొంది.వర్క్ ఫ్రమ్ హోమ్ఎక్స్ఏఐ ప్రకటించిన ఈ ట్యూటర్ ఉద్యోగాలు పూర్తిగా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అభ్యర్థులు స్థానిక టైమ్ జోన్లో సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ ఉద్యోగ కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీనికి ఎంపికైనవారికి ప్రామాణిక వైద్య ప్రయోజనాలతో పాటు అర్హతలు, అనుభవాన్ని బట్టి గంటకు 35 నుండి 65 డాలర్లు (రూ. 2,900 నుండి రూ. 5,400) వరకు చెల్లిస్తారు.ఎక్స్ఏఐ గురించి..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ఏఐని 2023లో ఎలాన్ మస్క్ స్థాపించారు. కృత్రిమ మేధస్సు సంక్లిష్టతను తొలగిస్తూ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని వివిధ భాషలకు తమ సేవలను విస్తరిస్తోంది. -
బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు ట్రోలింగ్.. ఆచార్యులు ఏమన్నారంటే?
'బిగ్‌బాస్ షోకి రమ్మని పిలిచారు.. కోట్లు ఇస్తామన్నారు, అక్కర్లేదని తిరస్కరించాను. నేను పాటించే సాంప్రదాయాలకు, విలువలకు అది అనువైన ప్రదేశం కానే కాదు.. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను అక్కడికి వెళ్లను. నాకు డబ్బు కన్నా విలువలే ముఖ్యం..' ఆధ్యాత్మికవేత్త, బాబా అనిరుద్ధాచార్య గతంలో అన్న మాటలివి.బాబాపై ట్రోలింగ్బిగ్బాస్ షో అంటేనే గిట్టని ఆయన ఇటీవల హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ లాంచ్‌లో మెరిశారు. అయితే కంటెస్టెంట్‌గా కాదు, కేవలం అతిథిగానే! అయినా సరే ఆ రియాలిటీ షోకి ఎందుకు వెళ్లావంటూ జనాలు విమర్శించారు. దీంతో బాబా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. ఊపిరి ఉన్నంతవరకు అదే చేస్తా..నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేసేందుకు, దాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతోనే వెళ్లానే తప్ప ఆ షోలో పాల్గొనాలని కాదు. దయచేసి నన్ను మన్నించండి. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. నేను బతికున్నంతవరకు సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ హౌస్‌లో మహేశ్ బాబు మరదలు.. తెలుగులో ఓకే ఒక్క సినిమా!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే తెలుగులో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వెల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అదే రోజు హిందీతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 6 నుంచి హిందీ బిగ్‌బాస్ సీజన్-18 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్లో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హౌస్‌లో అడుగుపెట్టింది. నమ్రతా శిరోద్కర్ చెల్లి అయిన శిల్పా బిగ్‌బాస్ సీజన్ 18లోకి నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు బిగ్‌బాస్ షో అంటే విపరీతమైన అభిమానమని.. నా కల నిజమైన క్షణమని సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రయాణం పట్ల ఆనందంగా ఉన్నట్లు శిల్పా శిరోద్కర్ అన్నారు. బిగ్‌బాస్ ద్వారా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లమని కూతురు ఎప్పుడు తనను అడుగుతుండేదని శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. అందరికంటే ఎక్కువ తన కూతురు సంతోషంగా ఉందని పేర్కొంది.(ఇది చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)1990 దశకంలో బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు శిల్పా శిరోద్కర్. బాలీవుడ్లో బందీష్, మృత్య్దండ్, హమ్, త్రినేత లాంటి సినిమాల్లో నటించారు. మోహన్‌బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మూవీ ఇదే కావడం విశేషం. అంతే కాకుండా నాగార్జున నాగార్జున బాలీవుడ్లో నటించిన ఖుదాగవా సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ చేశారు. 2000 సంవత్సరంలో చివరిసారిగా గజగామిని అనే హిందీ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
పెళ్లి క్యాన్సిల్ : బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ ఫేం, గాయకుడు
హిందీ బిగ్ బాస్ 16తో ఫేమస్ అయిన ప్రముఖ సింగర్ అబ్ధు రోజిక్ సంచలన విషయాన్ని ప్రకటించాడు. షార్జాకు చెందిన అమీరాతో త్వరలోనే పెళ్లి అని అట్టహాసంగా ప్రకటించిన అబ్ధుల్ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా వెల్లడించాడు. దీంతో ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.అబ్దు అమీరా ఏప్రిల్ 24, 2024న దుబాయ్‌లోని మజ్లిస్ షార్జాలో విలాసవంతమైన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 7న జరగాల్సిన వీరి పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. కానీ అబ్దు బాక్సింగ్ మ్యాచ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి నిర్ణయించు కున్నారు. తమ సాంస్కృతిక విభేదాలే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు ఇది అవసరమని పేర్కొన్నాడు. అందరూ అర్థం చేసుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు ప్రేమ తనను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. (డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్) కాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్ తన సాంగ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బిగ్ బాస్ 16 ద్వార ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించాడు. సంగీత కెరీర్ ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మే 9న ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిశ్చితార్థ వేడుక చిత్రాలను కూడా పంచుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచాడు. అమీరా-అబ్దు పెళ్లికి సల్మాన్ ఖాన్, నే-యో, ర్యాన్ గార్సియా, జాసన్ డెరులో, మైక్ టైసన్ లాంటి టాప్ సెలబ్రిటీలు రానున్నారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. విభేదల పరిష్కారానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, వారు చివరికి విడిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి, అబ్దుతన వ్యక్తిగత, ,వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.ఇవీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖవింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా! -
Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది?
న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే, అర్థం చేసుకునే భాషలలో హిందీ ఒకటి. హిందీ ప్రజల భాష అని మహాత్మా గాంధీ అభివర్ణించారు. అలాగే దానిని దేశ జాతీయ భాషగా చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. 1949, సెప్టెంబర్ 14న హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. అందుకే ఈ రోజు(సెప్టెంబర్ 14)ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ సభ ఆంగ్లంతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా ఆమోదించింది. మొదటి హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14న జరుపుకున్నారు. దీనిపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.మనదేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు. నిజానికి హిందీ జాతీయ భాష కాదు. ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. నిజానికి భారత రాజ్యాంగంలో ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో భాషపై చర్చ జరిగింది. ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంత మంది కోరగా, మరికొందరు దీనిని వ్యతిరేకించారు.రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత హిందీని అధికార భాషగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపి రూపంలో హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. 1949, సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీకి అధికార భాష హోదాను ఇచ్చింది. అధికారిక భాషకు జాతీయ భాషకు మధ్య వ్యత్యాసం ఉంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను తెలియజేసేందుకు ఉపయోగించేది జాతీయ భాష. ప్రభుత్వం తన అధికారిక పనుల కోసం ఉపయోగించేది అధికారిక భాష అవుతుంది. జాతీయ న్యాయస్థానం, పార్లమెంట్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీని అధికారికంగా వినియోగిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ? -
హిందీ బిగ్ బాస్ విన్నర్‌గా టాలీవుడ్ నటి (ఫోటోలు వైరల్)
-
‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్ టీవీ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేసే ‘సంసద్ టీవీ’ హిందీలో మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సోమవారం ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా సంసద్ టీవీ స్పందించింది.‘ఎంపీ సుప్రియా సూలే చేసిన ఆరోపణలు సత్యం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలను ఎంపీలు మాట్లాడిన భాషలోనే ప్రసారం చేస్తున్నాం. అయితే వినేవారి సౌలభ్యం కోసం హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషల్లో వినే ఆప్షన్ కల్పించాం. ఎంపీలు కూడా సభలో కూర్చొని.. పార్లమెంట్ కార్యకలాపాలను వినవచ్చు’అని ‘ఎక్స్’లో పేర్కొంది.సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రరంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల ప్రచారంలో సంసద్ టీవీ హిందీ మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపణలు చేశారు.‘పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ తొలి సెషన్లోనే సంసంద్ టీవీ ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలను హిందీ వాయిస్ ఓవర్ ఇస్తోంది. ఇలాంటి భయంకరమైన చర్యలకు సంసద్ టీవీ పాల్పడుతోంది. సంసద్ టీవీ హిందీలో ప్రసంగించని ఎంపీలపై వివక్ష చూపుతోంది. ఇతర భాషలతో పోల్చితే.. ఒక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయటం భారత సమాఖ్యవాదాన్ని సవాల్ చేయటమే...ప్రాంతీయ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలకు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, సెన్సార్షిప్ విధించటం వల్ల హిందీ మాట్లాడనివారి హక్కులను కాలరాయటమే. ప్రభుత్వం వెంటనే ఇలా ప్రసారం చేయటాన్ని నిలిపివేయాలి. ఇది పూర్తి వివక్ష, సమాఖ్యవాద వ్యతిరేక విధానం’అని ఆరోపణలు చేశారు.2023లో కూడా సంసద్ టీవీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడే క్రమంలో అధిక శాతం స్పీకర్‌ను చూపించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వంగా విపక్షాల స్క్రీన్ టైంను సంసద్ టీవీ తగ్గించి ప్రసారం చేసినట్లు ఆరోపణులు చేశారు. -
ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరొచ్చు
దేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది. విద్య లేదా వైద్యం... ఏదైనా ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఐఐటీ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది.ఇకపై ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్‌పూర్ ఐఐటీ నిలిచింది.ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్‌పూర్ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.దేశంలోని 50 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటుంటారు. అయితే ఆంగ్లంలో ఈ కోర్సులు ఉండటం వలన చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే జోధ్‌పూర్ ఐఐటీ ఇంజినీరింగ్ కోర్సులను హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతోంది. -
‘కొత్త నేర చట్టాలకు హిందీ పేర్లు రాజ్యాంగ విరుద్దం’
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లను పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్. మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. తూత్తుకుడికి చెందిన న్యాయవాది బి. రామ్‌కుమార్ ఆదిత్యన్ ఈ మూడు కొత్త చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియం-2023... ఈ మూడు చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని రామ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు.దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే హిందీ అధికార భాషగా ఉందన్నారు. దేశంలో 43.63% జనాభాకు మాత్రమే హిందీ మాతృభాష అని, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతుంటారని ఆయన ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశంలోని మూడు ముఖ్యమైన క్రిమినల్ చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టడం సమంజసం కాదన్నారు. హిందీ రాని వారికి ఈ చట్టాల పేర్లు ఇబ్బందికరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. -
బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో అయినా ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. తాజాగా హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ -3 ప్రారంభమైంది. ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్‌పైనే అందరిదృష్టి పడింది. ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్మాన్తో వారి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అయితే ఇది చూసిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది. వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. అసలు ఇది వినోదం కోసం తీసుకొచ్చిన షోలా లేదని మండిపడింది. రియాలిటీ షో ద్వారా బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్లో రాసుకొచ్చింది.దేవోలీనా తన ట్విటర్లో రాస్తూ..' ఇదేంటి వినోదం అని మీరు అనుకుంటున్నారా? దీన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది. బిగ్ బాస్ మీకేమైంది? బహుభార్యత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా? ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? వీరిని చూసిన అందరూ 2, 3, 4 వివాహాలు చేసుకోవచ్చా? అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా? రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి అడగండి.' అని చురకలు అంటించింది.'అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. చట్టం అందరికీ ఒకటే. అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా రెండో భార్య. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే.. మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఏ కారణంతో ఫాలో అవుతారు? కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా? ఇది తలచుకుంటేనే భయమేస్తోంది. ' అని రాసుకొచ్చింది.అంతేకాకుండా.. 'మీకు 2-3 పెళ్లిళ్లు చేసుకోవడం అంత అవసరం అయితే చేసుకుని ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపకండి. ఇలాంటి వాటితో సమాజం విధ్వంసం వైపు వెళ్తుంది. మరి బిగ్ బాస్.. మీకు ఏమైందో నాకు తెలియడం లేదు' అంటూ ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్స్ దేవోలీనాను ప్రశంసిస్తున్నారు. ఆ ముగ్గురిని రియాల్టీ షోలోకి తీసుకొచ్చినందుకు బిగ్ బాస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ రియాలీటి షోకు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 జియో సినిమాలో ప్రసారమవుతోంది.Do you think this is entertainment? This is not entertainment, it's filth. Don't make the mistake of taking this lightly because it's not just a reel, it's real. I mean, I can't even understand how anyone can call this shamelessness entertainment ? I feel disgusted just hearing… https://t.co/BVeVjGrTm2— Devoleena Bhattacharjee (@Devoleena_23) June 22, 2024 -
త్రీ సాంగ్మం
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్‌లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్‌కు నెటిజనులు జేజేలు పలికారు.హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్ఫామ్లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడిగాడు. -
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
లాంగ్వేజ్ పరీక్షకు 104 మంది హాజరు.. 99 మంది ఫెయిల్!
ఉత్తరాఖండ్‌లోని ఒక కాలేజీ విద్యార్థులు అందరినీ ఆశ్చర్యపరిచే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయం తెలిసినవారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల పండిట్ శివరామ్ ప్రభుత్వ కళాశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ కళాశాలలో బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలో 92 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 104 మంది విద్యార్థులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హిందీ పేపర్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపధ్యంలో జవాబు పత్రాలను మరోమారు మూల్యాంకనం చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ఫలితాలతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇటీవల ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో 129 మంది విద్యార్థుల్లో 119 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 104 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే హిందీలో ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థుల్లో 61 మంది విద్యార్థులు పొలిటికల్ సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు. హిస్టరీలో 56 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లీషులో 28 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సోషియాలజీలో 39 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రమేష్ రావత్ మాట్లాడుతూ ఈ విషయమై ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, జవాబు పత్రాలను మరోమారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అంజనా శ్రీవాస్తవ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాల పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
భాషలన్నింటిలో టాప్ ఏవో తెలుసా మీకు?
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి. భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు ఇంగ్లీష్: 1,500,000,000 మాండరిన్: 1,100,000,000 హిందీ: 609,500,000 స్పానిష్: 559,100,000 ఫ్రెంచ్: 309,800,000 ప్రామాణిక అరబిక్: 274,000,000 బెంగాలీ: 272,800,000 పోర్చుగీస్: 263,600,000 రష్యన్: 255,000,000 ఉర్దూ: 231,700,000 ఇండోనేషియన్: 199,100,000 జర్మన్: 133,200,000 -
బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడి
చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే. -
'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం
బెంగళూరు: బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలో వాణిజ్య దుకాణాలకు ఉండే బోర్డులను కన్నడలోనే ఉంచాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్లపై 60 శాతం కన్నడ పదాలని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. "నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. అనంతరం 60 శాతం కన్నడ వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత కన్నడ భాషా నేమ్ప్లేట్లను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 లోగా సమయం ఇస్తాం. ”అని గిరి నాథ్ చెప్పారు. కొత్త ఆదేశాల తర్వాత కేఆర్‌వి మద్దతుదారుడు దుకాణాదారులను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇది కర్ణాటక. కన్నడ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రానికి గర్వకారణం. మీ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందే.' అని ఓ మహిళ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందేనని సీఎం సిద్ధరామయ్య గత అక్టోబర్‌లో ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అప్పట్లోనే కన్నడ వర్సెస్ హిందీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య గతంలోనూ కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించారు. ఇదీ చదవండి: Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు? -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
బిగ్ బాస్‌లో మొదలైన ప్రేమ.. 'మతం' వల్ల బ్రేకప్ ప్రకటించిన నటి
పాపులర్ రియాల్టీ షో అయిన 'బిగ్ బాస్' ద్వారా అసిమ్ రియాజ్, హిమాన్షి ఖురానా పాపులర్ అయ్యారు. హిందీలో 13వ సీజన్లో వీరిద్దరూ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. హిమాన్షి ఖురానా ఆ సీజన్ ప్రారంభంలోనే ఎలిమినేట్ కాగా.. అసిమ్ రియాజ్ మాత్రం రన్నర్‌గా నిలిచాడు. అలా వారిద్దరూ సుమారుగా 3 ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగారు. తాజాగా వీరిద్దరి ప్రేమ బ్రేక్ అయింది. ఇదే విషయాన్ని సినీ నటి,సింగర్ అయిన హిమాన్షి ఖురానా అధికారికంగా తెలిపింది. అసిమ్ రియాజ్‌తో తన రిలేషన్‌షిప్‌కు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. వివిధ మత విశ్వాసాల కోసం ప్రేమను త్యాగం చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. హిమాన్షి ఖురానా ఏం చెప్పిందంటే సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకుంటూ, హిమాన్షి ఖురానా ఇలా తెలిపింది. 'అవును, మేము ఇకపై కలిసి ఉండాలని అనుకోవడం లేదు. మేము కలిసి గడిపిన సమయమంతా అద్భుతమైనది. కానీ మా బంధం ముగిసింది. మా రిలేషన్షిప్ ప్రయాణం చాలా అద్భుతమైనది. మేము మా ప్రత్యేక జీవితాలలో ముందుకు సాగుతున్నప్పుడు. మా విభిన్న మత విశ్వాసాల కోసం మేము మా ప్రేమను త్యాగం చేస్తున్నాము.' అని ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరూ వారి గోప్యతను గౌరవించాలని కూడా ఆమె కోరుతూ.. తమ గోప్యతను కూడా అందరూ గౌరవించాలని కోరుతున్నట్లు అభిమానులను అభ్యర్థించింది. (ఇదీ చదవండి: ‘హాయ్ నాన్న’ మూవీ రివ్యూ) హిమాన్షి ఖురానా పంజాబీ సిక్కు కుటుంబానికి చెందినది కాగా... అసిమ్ రియాజ్ ముస్లిం మతానికి చెందిన జమ్మూ ప్రాంత వాసి. వీరిద్దరూ 'బిగ్ బాస్ 13'లో కలుసుకున్న తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. 'బిగ్‌బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేమ పక్షులుగా గుర్తింపు పొందారు. చాలా ప్రేమ పాటల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో పోస్ట్‌లో హిమాన్షి ఖురానా ఇలా తెలిపింది. ' మా ప్రేమను కాపాడుకునేందుకు మేము ఇద్దరం ప్రయత్నించాము. కానీ, అందుకు పరిష్కారం కనుగొనలేకపోయాము. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం.. అయినప్పటికీ కలిసి జీవించేందుకు అదృష్టం లేదు. మా మధ్య ఎలాంటి ద్వేషం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. దీనిని పరిణతి చెందిన నిర్ణయం అంటారని భావిస్తున్నా.' అని తెలిపింది. మత విశ్వాసాల కోసం మాత్రమే తమ ప్రేమను త్యాగం చేశామని వారు ప్రకటించారు. pic.twitter.com/iPEAV90kgK — Himanshi khurana (@realhimanshi) December 6, 2023 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే: నాపై ట్రోలింగ్, బెదిరింపులు
టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ షో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ మలయాళం సహా ఏడు భాషల్లో ఎంత పాపులర్ అందరికీ తెలుసు. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో బాగా జనాదరణ పొందింది. హిందీలో తొలి సీజన్ 2006, నవంబరులో మొదలైంది. ముఖ్యంగా ఈ షోలో వినిపించే వాయిస్‌లు ఈ షోకేపెద్ద ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అయితే హిందీ బిగ్ బాస్‌కి వాయిస్ ఇచ్చే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ , నటుడు విజయ్ విక్రమ్ సింగ్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ప్రముఖ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ప్రకటించిన తర్వాత తనను చాలా ఇబ్బందులు పడుతున్నానంటూ వాపోయారు. కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని విజయ్ విక్రమ్ సింగ్ వెల్లడించారు. అలాగే తమ పిల్లల్ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించమంటూ ఫోర్స్ చేస్తుంటారని తెలిపాడు బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విజయ్ విక్రమ్ సింగ్ బిగ్ బాస్‌లో అధికారిక వ్యాఖ్యాతగా తన వాయిస్‌ని ఇవ్వడం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. ఈ షోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం తనకు పెద్ద డిస్‌అడ్వాంటేజ్‌గా మారిపోయిందనీ, విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపాడు. ముఖ్యంగా కీలకమైన పోటీదారుల ఎలిమినేట్ అయినపుడు మరీ దారుణంగా ఉంటుందని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. తన కుటుంబానికి కొన్ని ప్రత్యక్ష బెదిరింపులు కూడా వస్తుంటాయని పేర్కొన్నాడు. విన్నర్‌కు అసలు అర్హత లేదు అంటూ చాలా సార్లు కమెంట్లు వినిపిస్తుంటాయి.. కానీ, ఇది టాలెంట్ షో కాదు.. కేవలం జనం మెచ్చిన వాళ్లు విజేతలు - విజయ్ విక్రమ్ సింగ్ అసలు కంటెస్టెంట్స్‌ను తొలగించేంది తాను కాదని, ఎలిమినేషనకు తనకూ ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నా, పట్టించుకోరన్నారు. ప్రజల ఓట్లే పోటీదారుల తొలగింపునకు దారితీస్తుందని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదని వ్యక్తం చేశాడు. ఆ వాయిస్ తనది కాదన్నా వినరని తెలిపాడు. ప్రస్తుత సీజన్‌కు విజయ్ బదులుగా మరో నటుడు వాయిస్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్ వాయిస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ చాహ్తే హై' అంటూ హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సంభాషణల వాయిస్ అతుల్ కపూర్, విజయ్ సింగ్లదే. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ అతుల్ కపూర్ అయితే, షోను వివరించే వాయిస్, షో రీక్యాప్ లాంటి వాటికి వాయిస్ ఇచ్చేవారు విజయ్. కాగా 2010లో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌పై వాయిస్ ఓవర్‌తో పాపులర్ అయ్యాడు విజయ్. ఆతరువాత బీబీకి వాయస్‌తో కొన్ని, వెబ్ షో, సినిమా ఆఫర్లను దక్కించుకున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జ్‌తోపాటు, సుస్మితాసేన్ లీడ్ రోల్లో నటించిన తాలి, విక్కీకౌశల్ మూవీలోకూడా అవకాశాలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Vijay Vikram Singh (@vijayvikram77) -
బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్.. ఒకేసారి ఐదుగురు ఎలిమినేట్!!
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం అన్ని భాషల్లో అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో అత్యధికంగా బిగ్ బాస్ సీజన్- 17 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోయాడు. ఈ వారంలో ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే గత రెండు వారాలుగా ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్ బాస్.. ఈసారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఓకేసారి ఐదుగురిని ఎలిమినేట్ చేసి.. మరో ఐదుగురి కొత్తవారిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన వారిలో నీల్ భట్, నవిద్ సోలే, రింకు ధావన్, అభిషేక్ కుమార్, జిగ్నా వోరా ఎలిమినేట్ కానున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. ప్రోమో చూస్తే ఒకరిని ఒకరు వీడ్కోలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?
నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది. 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్‌గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
హరీశ్ పరీక్ష ఫలితాలు వెల్లడించండి
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న దండెబోయిన హరీశ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి చేసిన డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. అనంతరం ఇతర విద్యార్థులలాగానే హరీశ్‌కు అన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. కమలాపూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఏప్రిల్ 4న హిందీ ప్రశ్నపత్రం బయటికి రాగా విద్యార్థి దండెబోయిన హరీశ్‌ను బాధ్యుడిని చేస్తూ అప్పటి డీఈఓ ఐదేళ్లపాటు డీబార్ చేశారు. దీంతో విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులతో మిగిలిన పరీక్షలు రాశాడు. అయినప్పటికీ ఫలితాల్లో హరీశ్‌ది విత్‌హెల్డ్‌లో పెట్టి మాల్ ప్రాక్టీస్ కింద చూపారు. దీంతో హరీశ్ మరోసారి తన ఫలితాలు ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుదీర్‌కుమార్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. హరీశ్ పరీక్ష ఫలితాలను అధికారులు వెల్లడించకుండా విత్ హెల్డ్‌లో పెట్టారని, దీంతో అతను పైతరగతులకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హరీశ్ ఫలితాలు వెంటనే వెల్లడించడంతోపాటు సర్టిఫికెట్లన్నింటినీ అందజేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల హరీశ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు చెప్పినా ఫలితాలు ప్రకటించడం లేదు: బల్మూరి పేపర్ లీకేజీ కేసులో అకారణంగా డీబార్ చేసిన విద్యార్థి హరీశ్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినా హరీశ్ ఫలితాలు విడుదల చేయడం లేదని, మరో రెండు, మూడు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు పూర్తవుతున్న తరుణంలోనైనా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసి హరీశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ డ్రామాల కోసం హరీశ్ జీవితంతో ఆడుకుంటున్నాయని గురువారం గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కనీసం పదో తరగతి పేపర్ లీకేజీతో సంబంధం ఉందని అరెస్టు చేసిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసు ఏమైందో అయినా ప్రభుత్వం చెప్పాలని వెంకట్ ఎద్దేవా చేశారు. -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈనెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా మెహర్ రమేష్ డైరెక్షన్ చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో అజిత్ వేదాళం సినిమాను తెలుగులోకి రీమేక్ చేసి ఇక్కడి నేటివిటీకి తగినట్లుగా మెహర్ రమేష్ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కానీ ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసేందుకు భోళాశంకర్ టీం సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే హిందీలో కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో హిందీలో విడుదల చేయడం వాయిదా వేస్తారని అందరూ అనుకున్నారు. (ఇదీ చదవండి: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి.. నా జీవితంలో అంతకు మించే జరిగాయి) కానీ తాజాగ హిందీలో ఆగష్టు 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రైట్స్ కొనుక్కున్న సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆపై సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. చిరంజీవికి హిందీ బెల్ట్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా అక్కడ విడుదల చేస్తున్నట్లు ప్రకటన రావడంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరీ హిందీలో భోళాశంకర్ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే 25 వరకు ఆగాల్సిందే. -
స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో.. పెద్ద ప్లానింగే!
మల్టీస్టారర్ సినిమాలంటే ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్... హిందీలో ఉమెన్ మల్టీస్టారర్ ఫిలింస్ తెరకెక్కుతున్నాయి. 2018లో వచ్చిన లేడీ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘వీరే ది వెడ్డింగ్’ రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కథానాయిక ప్రాధాన్యంగా సాగే మల్టీ లేడీ స్టారర్ (ఒకే సినిమాలో ఎక్కువమంది కథానాయికలు నటించడం) చిత్రాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు కొన్ని రూపొంతున్నాయి. ఆ ‘మల్టీ లేడీ స్టారర్’ చిత్రాల గురించి తెలుసుకుందాం. జర ఆలస్యంగా జీ లే జరా బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా కత్రినా కైప్, ఆలియా భట్ కలిసి రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో ‘జీ లే జరా’ అనే సినిమాలో నటించనున్నారు. 2021లోనే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు హాలీవుడ్ కమిట్ మెంట్స్ కారణంగా ‘జీ లే జరా’ చిత్రం నుంచి ప్రియాంకా చో్ప్రా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక కత్రినా కైఫ్ తప్పుకున్నారనే టాక్ వినిపించింది. ఓ దశలో ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ‘జీ లే జరా’ చిత్రం ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రీమా కగ్తి ఇటీవల పేర్కొన్నారు. జోయా అక్తర్ ఈ సినిమాకు మరో నిర్మాత. కాగా ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ని ప్రకటించారు ఫర్హాన్ అక్తర్. సో.. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత జర ఆలస్యంగా ‘జీ లే జరా’ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆకాశంలో... కరీనా కపూర్, టబు, కృతీ సనన్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ బ్యూటీలు ఈ డ్యూటీ చేస్తున్నది ‘ది క్రూ’ సినిమా కోసం. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, అబుదాబి లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్న ముగ్గురు మహిళల జీవితాలు ఊహించని ఘటనల కారణంగా ఏ విధంగా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. అన్వేషణ విభిన్నమైన మనస్తత్వాలు, వయసు రీత్యా వ్యత్యాసం ఉన్న నలుగురు మహిళలు బైక్‌పై రోడ్ ట్రిప్ చేసి, ఆ అనుభవాలతో తమ జీవితాలను తాము కొత్తగా ఏ విధంగా మార్చుకున్నారు? అనే కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘ధక్ ధక్’. ఫాతిమా సనా షేక్, రత్నా ΄ాతక్, సంజన, దియా మీర్జా లీడ్ రోల్స్ చేస్తున్నారు. తరుణ్ డుడేజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తాప్సీ ఓ నిర్మాత. ‘ధక్ ధక్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. రైజ్.. రెబల్.. రిపీట్ భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ వంటి తారలు లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’.. ‘రైజ్.. రెబల్.. రిపీట్’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. కరణ్ బూలానీఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ఓ అమ్మాయి వివాహం చేసుకోదు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయిన భావన. తన ఫ్రెండ్స్‌ను కలవాలనుకుంటుంది. స్నేహితులు ఓ ΄ార్టీని ΄్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్– 2023’లో ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైందని, టీమ్ అంతా సంతోషంగా ఉన్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రేఖా కపూర్ పేర్కొన్నారు. లేడీ మల్టీస్టారర్ ట్రెండ్ వెబ్ సిరీస్‌లోనూ కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కిస్తున్న తాజా సిరీస్ ‘హీరా మండి’. మనీషా కోయిరాల, అదితీరావ్ హైదరి, సోనాక్షీ సిన్హా, రీచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు లీడ్ రోల్స్ చేశారు. ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయం వంటి అంశాలతో రూ΄÷ందిన ఈæ సిరీస్ 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హీరా మండి ్ర΄ాంతంలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 కొనసాగుతోంది. ఈ రియాల్టీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రియాలిటీ షో జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆషికా భాటియా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మనీషా రాణితో పాటు ఆషికాను నామినేట్ చేయగా ఎలిమినేట్ అయింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆషికా తన అలవాట్లపై సంచలన కామెంట్స్ చేసింది. తనకు సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉందని కుండబద్దలు కొట్టింది. ఈ విషయం మా అమ్మకు తెలుసని మరో బాంబు పేల్చింది. (ఇది చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!) ఆషిక మాట్లాడుతూ.. 'నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ విషయం గురించి మా అమ్మకు తెలుసు. అందుకే నేను ఎవరి అభిప్రాయాలను పట్టించుకోను. మా అమ్మకు తెలిసినప్పుడు ఇతరుల మాటలను పట్టించుకోను. నేను ధూమపానం చేస్తాను.. కానీ ఈ విషయాన్ని మా అమ్మ వద్ద దాచలేదు. ప్రజలు అవసరమైన దానికంటే అనవసర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.' అని చెప్పుకొచ్చింది. ఆషిక మాట్లాడుతూ.. 'నేను ఆరు నెలల క్రితమే ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ మానేశాను అని గతంలో కూడా చెప్పా. గతంలో వాటిని నేను ఎక్కువగా తాగేదాన్ని. అందుకే స్మోకింగ్ అలవాటు గురించి అంతగా పట్టించుకోలేదు. స్మోకింగ్‌తో నాకు ఎలాంటి సమస్యలు లేవు.' అని అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంపై ఆషికా స్పందించింది. ఎలిమినేట్ అయినందుకు నిరాశ చెందలేదు, కానీ నామినేషన్ ప్రక్రియ గురించి బాధపడ్డానని తెలిపింది. ఎందుకంటే కేవలం రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి.. ఇది అన్యాయమైనప్పటికీ.. ఇదంతా ఆటలో ఒక భాగం.. చివరికి ఎవరైనా వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఈసారి నా వంతు వచ్చిందని ఆషికా తెలిపింది. (ఇది చదవండి: బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి) View this post on Instagram A post shared by 💕A A S H I K A B H A T I A 💕 (@_aashikabhatia_) -
పిల్లలకు ఒత్తులు, దీర్ఘాలు నేర్పేందుకు.. ‘ఏం ఐడియారా బాబూ’ అంటున్న జనం!
నగరాల్లోని స్కూళ్లు హైటెక్‌గా మరిపోయాయి. గ్రామాల్లోని స్కూళ్లు ఇంకా ఆధునికతను సంతరించుకోలేదు. అయితే గ్రామీణ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అవసరమైన సులభ పద్ధతులను ఆవిష్కరించడంలో అక్కడి ఉపాధ్యాయులు ముందుంటున్నారనే పలు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. పాటల రూపంలో చిన్నారులకు ఏబీసీడీలు నేర్పడం, పాఠాలు బోధించడం వంటివి చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక విద్యార్థి చేతితో ఒక కర్రపట్టుకుని కనిపిస్తాడు. ఆ కర్రకు పైభాగాన హిందీలో ‘క’ అనే అక్షరం రాసివుంటుంది. మరోవైపు బ్లాక్‌బోర్డుపై దీర్ఘాలు, ఒత్తులు రాసివుంటాయి. ఆ విద్యార్థి ‘క’ అక్షరాన్ని ప్రతీ దీర్ఘం, ఒత్తు ముందు చూపిస్తూ, దానిని ఉచ్ఛరిస్తుంటాడు. అనంతరం క్లాసులోని మిగిలిన విద్యార్థులు ఆ అక్షరాన్ని ఉచ్ఛరిస్తుంటారు. ఈ వీడియో రికార్డు స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో @Ankitydv92 పేరుగ గల అకౌంట్లో జూలై 27న షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ దీనిని అద్భుతమైన క్రియేటివిటీ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..? बढ़िया जुगड़ सेट किए हैं गुरु जी... प्रणाम 🙏 pic.twitter.com/Szh1Wb94kb — Ankit Yadav Bojha (@Ankitydv92) July 27, 2023 -
ముంబైలో ఆదిపురుష్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రంగస్థలం ఏడు ప్రపంచాలు
అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్ పంత్ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్ నిషా... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది గౌర్ పంత్. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్ ‘శాంతినికేతన్’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ. భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్ వితౌట్ మెన్’ పేరుతో ఇంగ్లీష్‌లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది. ‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్‌తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి. బిన్ను నుంచి నసీమ్ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్ బాలక్రిష్ణన్ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను. బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు. ‘బిన్ను’ నాటకంలో... -
తెలంగాణ: టెన్త్ హిందీ పేపర్ లీక్!?
సాక్షి, వరంగల్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ కలకలం నడుస్తోంది. తాజాగా ఇవాళ(మంగళవారం) రెండో రోజూ పరీక్షల్లో హిందీ పేపర్ సైతం లీక్ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఉదయం 9గం.30కే పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. టెన్త్ విద్యార్థులకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ చక్కర్లు కొట్టింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. నిన్న తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది విద్యాశాఖ. అలాగే.. బందప్ప, సమ్మప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
భాషలను కాపాడుకోవాలి
‘భాష మన ఆలోచనలకు వాహకం మాత్రమే కాదు, మన ఆలోచనా సరళికి దోహదపడే గొప్ప పరికరం కూడా’ అన్నాడు బ్రిటిష్ ఆవిష్కర్త హంఫ్రీ డేవీ. ప్రస్తుత ప్రపంచంలో దాదాపు ఐదువేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. వాటిలో మూడోవంతు కేవలం ఆఫ్రికా ఖండంలోనే మనుగడలో ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు మూడువేలకు పైగా భాషలు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మన దేశంలోనే 192 భాషలు కొన ఊపిరితో కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల్లో మన దేశానిది రెండో స్థానం. మన దేశంలో ఇప్పుడు 780 భాషలు మనుగడలో ఉన్నాయి. పాపువా న్యూగినీ విస్తీర్ణంలోను, జనాభా లోను చిన్న దేశమే అయినా, అక్కడ ఏకంగా 840 భాషలు మనుగడలో ఉన్నాయి. మన రాజ్యాంగం ఇరవైరెండు భాషలను గుర్తించింది. ప్రస్తుత ప్రపంచంలో రకరకాల భాషా కుటుంబాలకు చెందిన భాషలు మనుగడలో ఉన్నాయి. వాటిలో కొన్ని బలంగా ఉనికి చాటుకోగలుగుతున్నాయి. ఇంకొన్ని, క్రమంగా మరుగునపడే స్థితికి చేరుకుంటున్నాయి. భాష పుట్టుక గురించిన కచ్చితమైన వాస్తవాలు చరిత్రలో నమోదు కాలేదు. సమూహాలు సమూహాలుగా విడిపోయిన భాషా కుటుంబాలన్నీ ఒకే మూలభాష నుంచి విడివడిపోయినవనీ, ఒక్కో భాషా కుటుంబం నుంచి వేర్వేరు భాషలు పుట్టా యనీ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. అన్ని భాషలకు మూలమైన తొలి భాష ఎప్పుడు ఎలా పుట్టిందో, ఎప్పుడు ఎలా అంతరించిపోయిందో చెప్పడానికి సరైన ఆధారాల్లేవు. మానవ సమూహాలు మనుగడ కోసం నేల నలు చెరగులా విస్తరించిన క్రమంలో ఏర్పడిన వేర్వేరు భాషా కుటుంబాల నుంచి పుట్టుకొచ్చిన భాషల గురించిన సమాచారం మాత్రమే మనకు తెలుసు. ‘తన సొంత భాషను ప్రేమించని వాడు జంతువు కన్నా, దుర్గంధం వెదజల్లే చేప కన్నా నీచమైన వాడు’ అన్నాడు ఫిలిప్పినో రచయిత జోస్ రిజాల్. పుట్టి పెరిగిన నేలను, తొలి పలుకులు నేర్చిన మాతృభాషను ప్రేమించని వాళ్లు అరుదు. మాతృభాషల మనుగడ కోసం ప్రజలు రాజకీయ ఉద్యమాలు, ఆందోళనలు సాగించిన సందర్భాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇదివరకు తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నకాలంలో అక్కడి ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దే ప్రయత్నాలు జరిగాయి. మిగిలిన జనాల కంటే భాషాభిమానం కాస్త ఎక్కువ మోతాదులో ఉన్న బెంగాలీలు దీనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. తమ భాషకు గుర్తింపు కోసం పోరాటం సాగించారు. వారు తమ భాషకు గుర్తింపునే కాదు, స్వతంత్ర దేశాన్ని కూడా సాధించుకున్నారు. బెంగాలీలు తమ భాష కోసం పోరాటం ప్రారంభించిన ఫిబ్రవరి 21వ తేదీని ‘యూనెస్కో’ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకునే భాషలన్నింటి సంరక్షణ, పరిరక్షణలే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ధ్యేయమని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2007 మే 16న ప్రకటించింది. భాషల సంరక్షణ, పరిరక్షణల బాధ్యతను ఐక్యరాజ్య సమితి నెరవేర్చలేదు. ఆ బాధ్యతను నెరవేర్చాల్సింది వివిధ దేశాల ప్రభుత్వాలే! ఒక భాషలో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు ఆ భాష అంతరించిపోతుంది. ఒక భాష అంతరిస్తే, ఆ భాషకు చెందిన సంస్కృతీ సాహిత్యాలు కూడా అంతరించిపోతాయి. వలస రాజ్యాలు మొదలైన తర్వాత ప్రపంచంలో చాలా భాషలే అంతరించిపోయాయి. ‘ఒక జాతిని అంతమొందించాలంటే, ఆ జాతి మాట్లాడే భాషను అంతమొందించాలి’ అనే నానుడి ఉంది. ఖండాంతరాలకు పాకి వలస రాజ్యాలను స్థాపించుకున్న పాలకులు చాలావరకు చేసిన పని ఇదే! ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్, పోర్చుగీస్ తదితర యూరోపియన్ వలస రాజ్యాల్లో వందలాది స్థానిక భాషలు కనుమరుగైపోయాయి. వలస రాజ్యాల కాలంలో బలవంతులైన పాలకుల భాషలకు విపరీతంగా ప్రాబల్యం పెరిగింది. ఉపాధి కోసం పాలకుల భాషలను నేర్చుకోవడం జనాలకు అనివార్యంగా మారింది. తమ తమ మాతృభాషలను కాపాడుకోవడం పెను సవాలుగా మారింది. రెండు మూడు తరాలు గడిచే సరికి చాలా భాషలు కొడిగట్టిపోయాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, యూరోపియన్ వలస పాలకుల దెబ్బకు గడచిన నాలుగు శతాబ్దాల్లో కేవలం ఉత్తర అమెరికాలోనే దాదాపు రెండువందలకు పైగా స్థానిక భాషలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషకు చెందిన సంస్కృతి అంతరించిపోతుంది. ఆ భాషలో నిక్షిప్తమైన జ్ఞానసంపద కనుమరుగైపోతుంది. ఒక్కొక్కసారి ఒక నాగరికత సైతం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఆ భాషా సంస్కృతులకు చరిత్రతో లంకె తెగి పోతుంది. ఒకటికి మించిన భాషలను నేర్చుకోవడం, ఒక భాష నుంచి మరొక భాషకు సాహితీ సంపదను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా భాషలు చిరకాలం మనుగడ సాగించగలుగుతాయి. ‘నా భాష పరిమితులంటే, నా ప్రపంచం పరిమితులే’ అన్నాడు ఆస్ట్రియన్ తత్త్వవేత్త లుడ్విగ్ విట్గెన్స్టీన్. ఒకటికి మించిన భాషలు తెలిసి ఉన్నప్పుడు లేదా ఒకటికి మించిన భాషల్లోని సాహిత్యం మన భాషలోనే మనకు అందుబాటులో ఉండటం జరిగినప్పుడు మన పరిమితులు తొలగి, మన ప్రపంచం మరింతగా విస్తరిస్తుంది. బహుశా ఇందుకే కాబోలు ‘ఇంకో భాష తెలిసి ఉండటమంటే, రెండో ఆత్మను కలిగి ఉండటమే’ అన్నాడు రోమన్ చక్రవర్తి షాలమేన్. మనం మన చరిత్రను కాపాడుకోవాలంటే, మన భాషలను కాపాడుకోవడమే మార్గం. -
జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు ఆదరణ పెరుగుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈని తొలుత ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. 2016లో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రారంభించారు. ఆ తరువాతి ఏడాది మరాఠీ, ఉర్దూను ఉపసంహరించారు. 2020లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి జేఈఈ పరీక్ష బాధ్యతలను చేపట్టాక ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. ఇతర భాషలకు ప్రాధాన్యమివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో పాటు జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తరువాత నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తోంది. 2021లో నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 9.39 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 1,49,621 మంది ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. బెంగాలీలో 24,841 మంది, గుజరాతీలో 44,094 మంది, హిందీలో 76,459 మంది దరఖాస్తు చేయగా తెలుగులో 371, తమిళం 1264, కన్నడ 234, మలయాళం 398, మరాఠీ 658, ఒడియా 471, పంజాబీ 107, ఉర్దూ 24, అస్సామీ 700 మంది ఉన్నారు. నాలుగు దఫాలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఇది. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య (యూనిక్ సంఖ్య)ప్రకారం చూస్తే 70 వేలు. వీరిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారు 45 వేలు. 2022లో జేఈఈకి మొత్తం 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ప్రాంతీయ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉంది. వీరిలో 50 వేల మంది వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాశారు. బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషల్లోనే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. 2022లో తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య 1,200 వరకు పెరిగింది. 2023లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల్లో సందేహాలు ఉంటే ఆంగ్ల ప్రశ్న పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. (క్లిక్ చేయండి: అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు) -
మందుల చీటీపై ‘శ్రీహరి’.. హిందీ ప్రిస్క్రిప్షన్ ఫోటోలు వైరల్
సాత్నా: మందుల చీటిపై (ప్రిస్క్రిప్షన్) ‘శ్రీహరి’ అంటూ మొదలుపెట్టాలని, ఔషధాల పేర్లను హిందీ భాషలో రాయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు డాక్టర్లు స్పందిస్తున్నట్లే కనిపిస్తోంది. సాత్నా జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు మందుల చీటిపై శ్రీహరి అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ చీటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొటార్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో పనిచేస్తున్న సర్వేష్ సింగ్ అనే డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రాశారు. సాధారణంగా ‘ఆర్ఎక్స్’ అనే లాటిన్ పదాన్నిమందుల చీటిపై మనం చూస్తుంటాం. ఆర్ఎక్స్ అంటే ‘ఔషధం తీసుకోండి’ అని అర్థం. సర్వేష్ సింగ్ 2017లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం సాధించారు. లౌలాచ్కు చెందిన రోగి రష్మీ సింగ్ కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించిన వైద్యుడు.. హిందీలో చీటీ రాసి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మందుల చీటిలో ‘ఆర్ఎక్స్’కు బదులుగా ‘శ్రీ హరి’ అని రాస్తున్నారు. प्रदेश के मुख्यमंत्री श्री @ChouhanShivraj द्वारा #MP_में_हिंदी_में_MBBS की पढ़ाई कराने की निर्णय के बाद #सतना में एक चिकित्सक ने किया अमल। मरीजों को हिंदी में दवाई लिखना किया शुरू। प्राथमिक स्वास्थ्य केंद्र कोटर में चिकित्सा अधिकारी हैं डॉ सर्वेश सिंह। pic.twitter.com/aX6Ddr1Vrx — Chetan Tiwari (@Chetantiwaribjp) October 16, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
హిందీలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు
భోపాల్: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. ఆదివారం భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్‌లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్ తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
హిందీ రుద్దితే ఊరుకోం
చెన్నై: దేశంలో కొన్ని ఉద్యోగాలు చేయాలంటే తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీని బలవంతంగా తమ నెత్తిపై రుద్దితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి స్టాలిన్ లేఖ రాశారు. భిన్నత్వంలో ఏకత్వమున్న మన దేశంలో రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న 22 భాషలనూ సమానంగా చూడాలని హితవు పలికారు. దేశంలో హిందీ మాట్లాడే వారి కంటే, ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్యే ఎక్కువని గుర్తు చేశారు. -
ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: హిందీలో వైద్య విద్యను అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఇకపై ప్రిస్కిప్షన్లపై తొలుత ‘శ్రీహరి’ అని రాసి తర్వాత మందుల పేర్లు రాయొచ్చన్నారు. ‘‘పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటి?’’ అన్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్‌లో హిందీలో వైద్య పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు. -
బలవంతంగా రుద్దడం సరికాదు.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానం ఆమోదయోగ్యం కాదని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు గల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోని ‘అధికార భాషలపై నియమించిన పార్లమెంటరీ కమిటీ’ నివేదికను అమలు చేయొద్దని కోరారు. ఈ మేరకు కేటీఆర్ బుధవారం ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఐఐటీ, ఎన్ఐటీ లాంటి విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలంటూ ఆ కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించడం శోచనీయమన్నారు. కేవలం 40 శాతం ప్రజలు మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదని, రాజభాషగా హిందీకి పట్టం కట్టలేదని స్పష్టం చేశారు. 22 భాషలను అధికారిక భాషలుగా రాజ్యాంగం గుర్తించిందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, బహుళజాతి సంస్థల్లో మన యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లిష్ మీడియంలో చదవడమే కారణమని చెప్పారు. మోదీ ప్రభుత్వ ‘హిందీ’ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు హిందీ మీడియంలోనేనా..? కేంద్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల నియా మక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కాకుండా హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ అన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటూ, మళ్లీ హిందీకే ప్రాధాన్యమిస్తు న్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువతీయువకులకు వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని 2020 నవంబర్ 18న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. ఇంకా బ్రిటిష్ వలసవాద విధానమేనా? ఢిల్లీలో కొందరు బ్యూరోక్రాట్లు, నేత లు ఇంకా బ్రిటిష్ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారని, అందుకు ఇంగ్లిష్, హిందీలోనే ఉన్న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలే సాక్ష్యమని కేటీఆర్ విమర్శించారు. ‘అఖిల భారత సర్వీసులంటూ అధిక శాతం పరీక్షలను ఆంగ్లం, హిందీల్లోనే నిర్వహించడం వల్ల మాతృభాషల్లో చదువుకుని ఆయా అంశా లపై పట్టున్న అభ్యర్థులు నష్టపో తున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంతోపాటు మెయిన్స్, ముఖా ముఖిలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారుల తోనే బోర్డులు ఏర్పాటుచేయాలి. యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్, ఎకనా మిక్ సర్వీసు పరీక్షలతోపాటు గిరిజనులు, గ్రామీణుల తో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్ సర్వీస్ అధికారుల ఎంపికలోనూ ఇంగ్లిష్‌కు మాత్రమే పెద్దపీట వేయడం అన్యాయం. బ్యాంకుల్లో ప్రాంతీయ భాష తెలియని సిబ్బందితో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పారు. సివిల్స్, రైల్వే, ఎస్ఎస్సీ, పోస్టల్, రక్షణ, నెట్ పరీక్షలతోపాటు కేంద్రం నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసే విష యమై నిపుణుల కమిటీని నియమించా లని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి. -
ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల రీత్యా వాహానాల రిజిస్ట్రేషన్ నిబంధనలు నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు అన్ని కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు వాహనదారులు చేస్తున్న తప్పిదాలు, రిజిస్ట్రేషన్ నంబర్ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి విషయాల్లో సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక వ్యక్తి కారుకి ఉండే నెంబర్ ప్లేట్ మీద నెంబర్ బదులు ఏం రాయించుకున్నాడో ఫోటోలు ట్వీట్ చేశారు సదరు కారు యజమాని నెంబర్ ప్లేట్ మీద రిజస్టేషన్ నెంబర్ని విచిత్రంగా హిందీలో తండ్రిని పిలిచే విధంగా 'పాపా' అనే అర్థం వచ్చేలా పెట్టుకున్నాడు. ఈ నెంబర్ ప్లేట్‌తోనే కారులో దర్జాగా తిరిగేస్తున్నాడు సదరు వ్యక్తి. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు సదరు కారు యజమానిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ స్థానంలో ఇలా పేర్లు ఉండకూడదంటూ సదరు యజమానికి జరిమాన విధించారు. ఈ మేరకు పోలీసులు ట్విట్టర్లో ...1987 చిత్రం "ఖయామత్ సే ఖయామత్ తక్"లోని నాన్న మీద ప్రేమతో కూడిన ప్రసిద్ధ పాట "పాపా కెహతే హై"ఉంటుందని చెప్పారు. అందులో మాదరి మా నాన్న పేరు కారు మీద రాస్తాను అంటే కుదరదన్నారు. అలాంటి రిజిస్ట్రేషన్ ప్లేట్లకు జరిమాన విధించబడుతుందని కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. సదరు వాహన యజమానికి జరిమాన విధించడంతో రిజస్ట్రేషన్ నెంబర్ సరిచేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రిజిస్ట్రేషన్ నెంబర్ సరిచేయక ముందు, సరిచేసుకున్నాక కారు నెంబర్ ప్లేట్‌కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. पापा कहते हैं बड़ा नाम करेगा, गाड़ी के प्लेट पर पापा लिखेगा, मगर ये तो कोई न जाने, कि ऐसी प्लेट पर होता है चालान.. ट्वीट पर शिकायत प्राप्त करने के बाद #UttarakhandPolice ने गाड़ी मालिक को यातायात ऑफिस बुलाकर नम्बर प्लेट बदलवाई और चालान किया। pic.twitter.com/oL4E3jJFAV — Uttarakhand Police (@uttarakhandcops) July 12, 2022 (చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. ) -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
ఒక్క భాషకు పెత్తనమా?
దేశంలో హిందీకి పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా 1970 లలో పెద్ద ఉద్యమమే సాగింది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ తెరపైకి తేవడంతో వాతా వరణం వేడెక్కింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీని వాడాలని అమిత్ షా చేసిన ప్రతిపాదనపై సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా కనిపించింది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలలో హిందీని అనుసంధాన లేదా ‘అధికార భాష’గా అంగీకరించడానికి ప్రజలు సానుకూలంగా లేరు. డీఎంకే అధినేత దివంగత కరుణానిధి నాయకత్వంలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఉద్యమ ప్రభావం సమసి పోలేదు. నేటి అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌పై శ్రద్ధ వహించాలన్న ఆకాంక్ష తల్లిదండ్రులలోనూ వ్యక్తమవుతోంది. ఉన్నతస్థాయి చదువులు చదివినా తగిన ఉద్యోగాలు స్వదేశంలో లభించడం లేదని భావిస్తున్న యువత విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లిష్ అంతర్జాతీయ అనుసంధాన భాషగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి నుండే ఇంగ్లిష్ బోధించాలనీ, తద్వారా అణగారిన తరగతుల ప్రజలకూ, యువతకూ ఉద్యోగావకాశాలు పెరుగు తాయనీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ‘త్రిభాషా సూత్రా’న్ని ప్రవేశపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ త్రిభాషా సూత్రంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దేశ వ్యాప్తంగా 57 శాతం మంది హిందీని మొదటి భాషగా చదువు తున్నారు. బహుశా ఈ కారణం వల్లనే హిందీని అను సంధాన భాషను చేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చి ఉండవచ్చు. భిన్న సంస్కృతులూ, భాషలూ, జీవన విధానాలూ విలసిల్లుతున్న మన దేశంలోని చాలా ప్రాంతాల్లో హిందీ పట్ల వ్యతిరేకత ఉంది. కేంద్రమంత్రి హిందీని ప్రతిపాదించిన తర్వాతనే గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో సైన్ బోర్డులన్నింటినీ గుజరాత్ భాషలో రాయాలని నిర్ణయించింది. అలాగే ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో 15 వేల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనా భాషగా ఉంటుందని యోగి ప్రభుత్వం ప్రకటించిన విషయమూ గమనార్హం. ఇంగ్లిష్‌కు చైనా, తదితర దేశాలు కూడా ప్రాధాన్యమివ్వడాన్నీ గమనించవచ్చు. ఇంగ్లిష్ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయి. ఫలితంగా ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమత పెరుగుతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వృద్ధి జరుగుతుంది. (క్లిక్: ఆలస్యమే! అయినా అభిలషణీయమే!) అయితే మాతృభాషలను నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషలను వదిలేస్తే ఆయా భాషలు అంతరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక భాషలు అంతరించాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హిందీని బలవంతంగా అమలు చేయాలని భావిస్తే హిందీ మాట్లాడేవారు, హిందీ మాతృభాష కాని వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు వ్యతిరేకించే విధానాలను అమలు చేయకపోవడమే మంచిది. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది) – టి. సమత, సీనియర్ పాత్రికేయులు -
Sakshi Cartoon: ..వ్యతిరేకించేది ప్రతిపక్షపార్టీవాళ్లు కాద్సార్! మన పార్టీ నాయకులే!
..వ్యతిరేకించేది ప్రతిపక్షపార్టీవాళ్లు కాద్సార్! మన పార్టీ నాయకులే! -
Sakshi Cartoon: ఇంగ్లీష్ ఎగ్జామ్‌ను హిందీలో రాసొచ్చాడట?
ఇంగ్లీష్ ఎగ్జామ్‌ను హిందీలో రాసొచ్చాడట? -
హిందీలో 'హర్ సర్కిల్' ప్లాట్‌ఫామ్‌ను లాంఛ్ చేసిన నీతా అంబానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ 'హర్ సర్కిల్'ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ హిందీలో లాంఛ్ చేశారు. దీంతో హర్ సర్కిల్ యాప్ హిందీలో కూడా అందుబాటులోకి ఉండనుంది. మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా వేదికను తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ మొదలైనవి హర్ సర్కిల్ సబ్స్క్రయిబర్స్కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో వేగంగా వృద్ధిలోకి వస్తున్న ప్లాట్‌ఫామ్ కావడం విశేషం. ఓవరాల్ రీచ్ 42 మిలియన్లు అంటే 4.2 కోట్లు కావడం విశేషం. హర్ సర్కిల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ హిందీ భాషలో అందుబాటులోకి వచ్చింది. మా నెట్వర్క్ ఆస్పత్రి అయిన సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు 24 గంటల పాటు మెంటల్ వెల్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, స్కిన్ కేర్, గైనకాలజికల్, కౌన్సిలింగ్ లాంటి అనేక అంశాల్లో ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో వేలాది మంది మహిళలు లాభపడుతున్నారు. ఫిట్నెస్, న్యూట్రిషన్, పీరియడ్స్, ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, ఫైనాన్స్ లాంటివాటికోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాకర్లను 1.50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉచితంగా ఉపయోగిస్తున్నారు. (చదవండి: ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్ధిక సహాయం) -
బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?
న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్ లేనే లేదు. మరి ఏటా బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో మాత్రమే ఎందుకు చదువుతారో తెలుసా? దానికి గట్టి కారణమే ఉంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే.. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ హిందీలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర భాషలను తీసుకునే పరిస్థితి లేదు. దాంతో బ్రిటిష్‌కాలం నుంచి కొనసాగుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉన్న ఇంగ్లిష్‌ను మధ్యే మార్గంగా.. ‘అనుసంధాన భాష’గా ఎంపిక చేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాలకు భాష విషయంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాష్ట్రమైనా కేంద్ర గుర్తింపు పొందిన భాషనుగానీ, తమకు నచ్చిన మరే భాషను గానీ.. సదరు రాష్ట్ర పరిధిలో అధికారిక భాషగా ప్రకటించవచ్చు. ఆ భాషలో కార్యకలాపాలు కొనసాగించవచ్చు. చదవండి: (Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..) -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
Mannu Bhandari: రాలిన రజనీగంధ
స్వాతంత్య్రానంతరం వచ్చిన రచయితల తరంలో మన్నూ భండారీ(3 ఏప్రిల్ 1931 – 15 నవంబర్ 2021) ఒక అద్భుతమైన మహిళ. కథకురాలిగా, నవలా రచయిత్రిగా పురుషాధిక్య ప్రపంచంలో ఆమె తలెత్తుకు నిలబడ్డారు. అజ్మీర్(రాజస్థాన్)లో కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె స్వాతంత్య్రోద్యమపు బందులు, నిరసనలు, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. వీధుల్లో అబ్బాయిలతో మార్చ్ చేస్తూ, స్లోగన్లు ఇస్తూ, రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్న ఆమె తీరును తండ్రి జీర్ణించుకోలేకపోయారు. కానీ నరాల్లో ఉద్యమావేశపు లావా ఉప్పొంగుతున్నప్పుడు ఆమెను ఎవరు ఆపగలరు? అదే కృతనిశ్చయాన్ని ఆమె తన సహ రచయిత రాజేంద్ర యాద వ్ను వివాహమాడటంలోనూ చూపారు. పై చదువులకు కోల్‌కతా వెళ్లినప్పుడు యాదవ్‌ను ఆమె కలిశారు. అదే కోల్‌కతాలో హిందీ టీచర్‌గా ఆమె కొన్నాళ్లు పనిచేశారు. చక్కటి చదువరి అయిన మన్ను తన మొదటి కథ ‘మై హార్ గయీ’(నేను ఓడిపోయాను) అలా రాసేశారు. 1957లో ‘కహానీ’ మ్యాగజైన్లో దానికి వచ్చిన స్పందన ఆమెను గాలిలో తేలి యాడించింది. ప్రతిగా మరిన్ని కథలు రాశారు. అన్నీ కూడా తను పెరిగిన అజ్మీర్‌లోని మనుషులను ఆధారం చేసుకొన్నవి. రాజేంద్ర యాదవ్ 1951 నాటికే ‘సారా ఆకాశ్’ రాసివున్నారు. హిందీ రచయితలకు సాహిత్య వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుందని వాళ్లు 1964లో ఢిల్లీకి మారిపోయారు. ఢిల్లీ యూనివర్సిటీలో మన్నూకు లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. ఇక తర్వాతి సంవత్సరాల్లో మిరుమిట్లు గొలిపే కీర్తిశిఖరాలను ఆమె అధిరోహించారు. కథలు రాస్తూనే, నవలలకు మారి, అటుపై సినిమా రచన ల్లోనూ మునిగిపోయారు. యాభైకి పైగా ఉన్న ఆమె కథలు ముఖ్యంగా చిన్న పట్ట ణాల్లోని మధ్య, దిగువ తరగతి జీవితాలను అరుదైన సున్నితత్వంతో చిత్రిస్తాయి. సామాజిక బంధనాల్లో చిక్కుకున్న, వాటిని దాటడానికి పోరాడిన, అలసిపోయిన మహిళలు కూడా ఆమె రచనల్లో కనబడతారు. 1950ల మధ్యలో మొదలైన నవ్య కథా ఉద్యమంలో మన్నూ భండారీ కూడా భాగం. ఆమె భర్త రాజేంద్ర యాదవ్‌తో పాటు మోహన్ రాకేశ్, కమలేశ్వర్ ప్రారంభించిన ఈ ఉద్యమం స్వాతంత్య్రానంతర తరం వారి ఆందోళనలు, అనుభవాలను ఎత్తి చూపడానికి లక్ష్యించినది. ముగ్గురు కూడా అసమాన ప్రతిభావంతులు, అదే సమయంలో ఎవరి అహాలు వారికి ఉండేవి. యాదవ్‌కూ మోహన్ రాకే శ్కూ చెడినప్పుడు కూడా మోహన్‌తో మన్నూ స్నేహం కొనసాగించింది. ‘నా సొంత అస్తిత్వం నాకు ఉండదా?’ అని రాకేశ్‌ను ప్రశ్నించారు మన్నూ. అయితే ముప్ఫై ఏళ్ల సహ జీవనం తర్వాత యాదవ్‌తో ఆమె వివాహ బంధం ముగిసింది. కానీ యాదవ్ ఇచ్చిన సహకారాన్ని ఆమె ఎప్పుడూ గుర్తుంచు కున్నారు. ఇద్దరూ కలిసి ‘ఏక్ ఇంచ్ ముస్కాన్’(ఒక అంగుళం చిరునవ్వు) నవల కూడా రాశారు. అందులోని అమర్ పాత్ర భాగాలు యాదవ్ రాస్తే, అమల, రంజన కోణాల్లోవి మన్నూ రాశారు. 1970 నాటికి ఆమె నాలుగు కథాసంపుటాలు ప్రచురించారు. తల్లిదండ్రులు విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడు బంటీ మానసి కోద్వేగపు ప్రయాణపు కోణంలో ‘ఆప్కా బంటీ’ రాశారు. అప్పటికి మన్నూకు కూడా తొమ్మిదేళ్ల పాప రచన ఉండటం కాకతాళీయం కాదు. ఈ నవల ధారావాహికగా ప్రచురితం అవుతున్నప్పడు వస్తున్న ఉత్తరాలను చూసి పోస్ట్‌మాన్... ఈ ఇంట్లోనే ఒక ఆఫీస్ తెరవకూడదా అన్నాడట. నవల మీద విప రీతమైన చర్చలు జరిగాయి. అయితే పాఠకుల స్పందన అధికంగా బంటీ మీదే కేంద్రీకృతమై... తన లక్ష్యానికీ, మాతృత్వానికీ మధ్య నలిగిపోయిన ఆధునిక స్త్రీ మీదకు ఎక్కువ ప్రసరించకపోవడం పట్ల ఆమె కొంత నొచ్చుకున్నారు కూడా. 1974లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘రజనీగంధ’ ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఆమె కథ ‘యేహీ హై సచ్’(ఇదే నిజం) ఆధారంగా తీసిన ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. అప్పటికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బాసూ ఛటర్జీ కోసం శరత్ కథ ‘స్వామి’ని తిరగరాశారు. సినిమా బాగా ఆడినప్పటికీ, క్లైమా క్స్‌లో భర్త కాళ్ల మీద భార్య పడే సీన్ పట్ల ఆమె పూర్తిగా విభేదించారు. భార్యను తన చేతుల్లోకి భర్త తీసుకోవడం ద్వారా కూడా అదే ఫలితం రాబట్టవచ్చని ఆమె వాదన. బాసూ ఛటర్జీ దూరదర్శన్ కోసం తీసిన ‘రజని’ సీరియల్ కోసం కూడా మన్నూ పని చేశారు. ఇది కూడా సంచలనం సృష్టించింది. బిహార్‌లోని బెల్చి గ్రామంలో జరిగిన దళితుల ఊచకోత ఘటనకు కదలిపోయి 1979లో పూర్తిస్థాయి రాజకీయ నవల ‘మహాభోజ్’ రాశారు. ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున అమల్ అల్లానా దర్శకత్వంలో నాటకంగా వచ్చి అరు దైన సమీక్షలు పొందింది. ఎన్ఎస్డీకి అది స్వర్ణయుగం. మనోహర్ సింగ్, సురేఖా సిక్రీ, ఉత్తర బావోకర్, రఘువీర్ యాదవ్ లాంటివాళ్లు అందులో ఉండి, నాటకంలో పాత్రధారుల య్యారు. ఇంతటి విజయాలు చూసిన తర్వాత ఎవరిలోనైనా అహం పొడసూపడం సహజం. కానీ మన్నూలో లేశమాత్రం కూడా అది కనబడేది కాదు. అన్ని స్థాయుల వాళ్లతోనూ ఆమె తన జీవితాంతం స్నేహం చేశారు. చివరి దశలో అనారోగ్యం ఆమెను తినేసింది. నవంబర్ 15వ తేదీన ఆమె మరణించారు. కానీ చెరిగి పోని ఆమె వారసత్వం మనకు మిగిలివుంది. – పూనమ్ సక్సేనా పాత్రికేయురాలు, అనువాదకురాలు -
నియామకాల్లో హిందీ ఆధిపత్యం
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్ వలన హిందీయేతర రాష్ట్రాల ఉద్యోగా ర్థులు నష్టపోతున్నారు. ఉదాహర ణకు తెలంగాణలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7%) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ వారున్నా మెజారిటీ హిందీ ప్రాంతం వారే. ఏపీ నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 72 కేంద్రీయ విద్యాల యాల్లోని దాదాపు 2,500 మంది ఉపాధ్యా యుల్లో తెలుగు వారు 20 శాతమే. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపా« ద్యాయ నియామ కాల్లో 75% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్ టీచర్ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష ఉంటుంది. వీటిలో ఇంగ్లిష్, హిందీ భాషలకు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఏ ప్రాంతం వారికైనా మార్కులు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80% పైగా మార్కులు వస్తుండగా హిందీయేతరులకు అందులో సగం కూడా రావడం లేదు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లిష్. నియామక పరీక్షలో ఇంగ్లిష్ అని వార్యం. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లిష్తో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని పరీక్షించ దలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. సివిల్ సర్వీసులకు కూడా ప్రాంతీయ భాషల్లో రాసే వీలుండగా కేంద్రీయ, నవోదయ ఉపాద్యాయ నియా మకాలకు లేకపోవడం అన్యాయం. నియామకాలు జోనల్ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్‌గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అస మానతకు మరో ముఖ్య కారణం. పైన ఇచ్చినవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ సంస్థ ల్లోనూ జరుగుతోంది. ఇండియన్ రైల్వేస్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్ సెక్రటేరి యట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, డిఫెన్స్, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ యూని వర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు... ఇలా వందలకొలదీ వున్నాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు చేస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగుకు లేకపోవడం వలన అవి తెలుగు వారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యో గాల్లో కూడా జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎది రించే ఉద్యమం ఊపందుకోవాలి. నాగటి నారాయణ వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు మొబైల్: 94903 00577 -
బాలీవుడ్లో రీమేక్ అవుతున్న ‘ఆకాశం నీ హద్దురా!’
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్ కానుంది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సూర్య నిర్మాత కూడా. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’గా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబరులో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై వీక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అంతేకాదు.. 93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంపిక బరిలో నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు సూర్య వెల్లడించారు. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు సూర్య. మాతృతకు దర్శకత్వం వహించిన సుధా కొంగరయే హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారనేది తెలియాల్సి ఉంది. -
హిందీ కోచింగ్‌కి వెళ్తున్న బెల్లంకొండ.. ఎందుకో తెలుసా?
Chatrapathi: యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మిస్తున్నారు. 2005లో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సేమ్ రిజల్ట్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్ చేయాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సినిమా షూటింగ్ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్డౌన్ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్లో పాల్గొనేందుకు మరింత బాగా సంసిద్దుడైయ్యాడు. సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇందుకోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్ విషయం స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అంతే కాదు...‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్ హిందీ కోచ్ ఇంతియాజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారట. బెల్లకొండ సాయి శ్రీనివాస్ కష్టానికి ఏ మేర ఫలితం లభిస్తుందో చూడాలి. -
హిందీభాషకు దక్షిణ వారధి పీవీ
బహుముఖి అయిన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును ఎలా అంచనాకట్టాలో తెలియడానికి జనం ఆయనకు ఇచ్చిన పేర్లో, బిరుదులో పరిశీలిస్తే చాలు. అపర చాణక్యుడు, మౌనముని, సంస్కరణల పితామహుడు, ఇంకా సాహితీవేత్త, బహుభాషావేత్త. అయితే ఆయన్ని పరిశీలించడానికి ఇంకోకోణం ఉంది. ఒక దక్షిణాదివాడు ఉత్తరాది భాష అయిన హిందీలో జెండా ఎగరేయడం. అక్కడి గొప్ప రచయితలు మెచ్చేంత అపర పండితుడిగా వెలగడం. ‘వేయిపడగలు’ లాంటి తెలుగు మహారచనను హిందీలోకి అనువదించడంతోపాటు, సాక్షాత్తూ దేశ రాజ్యాంగాన్నే ఆయన హిందీలోకి తర్జుమా చేశారు. ఆయన శతజయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్న సందర్భంగా తెలుగువాడైన పీవీ ఠీవీని మరోసారి గుర్తుచేసుకుందాం.పీవీ నరసింహారావు పేరు తలవగానే వెంటనే స్ఫురించేది ఆయన బహుభాషా అధ్యయనశీలత. భాషాపిపాస, అయనకు బాల్యంతోనే అంకురించింది. హైస్కూలు చదువు పూర్తయ్యేసరికి తెలుగుతో పాటు పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో మంచిపట్టు సాధించారు. ఇంటర్ మొదలు ‘లా’ వరకు మహారాష్ట్రలో చదవడం వలన మరాఠీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. నాటి నిజాం రాష్ట్రంలోని దక్కనీ ఉర్దూకు హిందీ భాషతో చాలా సారూప్యత ఉండటం మూలాన, పీవీకి హిందీ పట్ల ఆసక్తి కలిగింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతీయ నాయకులైన గాంధీజీ, నేతాజీ, నెహ్రూ లాంటివాళ్లు హిందీలో చేసిన ప్రసంగాలు, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లిన నాగపూర్‌లో తరచూ జరిగే హిందీకవి సమ్మేళనాలు మరింత ఆకర్షణ కలిగించాయి. అలా 1946 సంవత్సరంలో అలహాబాద్ యూనివర్సిటీ నుండి హిందీ ‘సాహిత్యరత్న’ (ఎంఏ) పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హిందీలో పరిశోధన చేయాలని అభిలషించి, సుప్రసిద్ధ కవ యిత్రి మహాదేవి వర్మ రచనలను లోతుగా అధ్యయనం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా వుంటే, హిందీలో డాక్ట రేటు పట్టా సాధించి అలహాబాద్‌లో యూనివర్సిటీ ఆచార్యుడై వుండే వారు. జీవితం ఎంతో విచిత్రమైనది. అనుకొనేవి జరగవు. ఆశించి నవి లభించవు. పీవీ విషయంలోనూ జరిగిందదే! ‘ర్యాంగ్లర్’ కావాలనుకున్నాడు. ఆస్ట్రానమీ అందలేదు. హిందీ ఆచా ర్యుడు కాలేదు. వకీలుగా కూడా స్థిరపడలేదు. ఆయన ఐచ్ఛికాంశం సైన్సు. స్మరించింది సాహిత్యాన్ని. కానీ ఆయనను వరించింది పాలిటిక్స్. స్వామి రామానంద తీర్థ ఆదేశాన్ని శిరసావహించిన పీవీ 1948లో హైదరాబాద్ స్టేటు భారత యూనియన్‌లో విలీనమయ్యాక రాజకీయాలకు దూరంగా, సమాజానికి దగ్గరగా ఉండాలని భావించారు. జర్నలిజంపై మనసు పడి, కాకతీయ వార్తాపత్రికను మూడేళ్ల పాటు నిర్వహించి, తొలి సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ నుంచి పిలుపు రావడంతో, పత్రికను మూసివేసి ప్రజాసేవపై దృష్టి పెట్టారు. 1952 ఎన్నికలలో ఓడిపోయాక, తిరిగి హిందీ భాషా, సాహిత్య సేవపై దృష్టిపెట్టి, తుది శ్వాస వరకు కొనసాగించారు. భారత రాజ్యాంగాన్ని ‘భారతీయ సంవిధాన్’ శీర్షికన ఆంగ్లంలోంచి హిందీలోకి అనువదించి తన హిందీ రచనకు శ్రీకారం చుట్టారు. విశ్వనాథ సత్యనారాయణ అనుమతితో ‘వేయిపడగలు’ నవలను, ‘సహస్రఫణ్’ పేరిట అనువాదానికి పూనుకొన్నది 1955–56 మధ్యకాలంలోనే! పద్నాలుగు సంవత్సరాల కృషి ఫలంగా వెలువ డిన ‘సహస్రఫణ్’ యావత్ భారతంలోని హిందీ సాహిత్య అభిమా నులను అలరించడమే కాదు, పీవీకి ‘కేంద్ర హిందీ నిర్దేశాలయ్’ వారి పురస్కారాన్నీ ప్రసాదించింది. పీవీ తొలుత విశ్వనాథ ‘ఏకవీర’ను కొంతభాగం అనువ దించారు. తదుపరి ‘చెలియలి కట్ట’ను పూర్తిగా తర్జుమా చేశారు. కానీ ప్రేమ, శృంగారంతో కూడిన రచనలుగా భావించి ప్రచురణకు అంగీకరించలేదనీ, సంస్కృతీ సాంప్రదాయాలకు, సామాజిక విలువ లకు అద్దం పట్టిన ‘వేయి పడగలు’ నవలనే ఇష్టపడి హిందీసేత చేశారని హిందీ సాహితీవేత్త ఆచార్య భీమ్సేన్ నిర్మల్ అన్నారు. హిందీ సాహితీ ప్రక్రియలలో పీవీ కవిత్వాన్నే ఎక్కువగా ప్రేమించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వాన్ని, హిందీలోని ఛాయావాద కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించారు. మహాదేవి వర్మ కవిత్వంలోని ఛాయావాదం, దుఃఖవాదం, రహస్యవాదం మొదలైన విభిన్న పార్శా్వలను ఆవిష్కరిస్తూ ఆమె షష్టిపూర్తి అభినందన సంచిక కొరకు రాసిన ఇరవై ఐదు పేజీల సుదీర్ఘ వ్యాసం, పీవీ సిద్ధాంత వ్యాసానికి సంగ్రహపత్రంగా భావించవచ్చు. వివిధ సందర్భాలలో పీవీ చేసిన హిందీ ప్రసంగాలు, వివిధ సంచికలు, పత్రికలకు రాసిన వ్యాసాలు కూడా ఎన్నదగినవి. ఈ ప్రసంగ వ్యాసాలు, ఆయన హిందీ భాషా సాహిత్య దృక్పథాన్ని మాత్రమే కాదు, భారతీయ భాషలలో హిందీ స్థానాన్ని, భారతీయ సంస్కృతీ విలువల పరిరక్షణలో హిందీ సాహితీవేత్తల కవుల కృషిని విస్పష్టం చేశాయి. భారతీయ భాషల ఆదాన ప్రదానాలకు హిందీ వారధి వంటిదనీ, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే హిందీ సాంస్కృతిక సమైక్యతకు నాంది పలికిందనీ సోదాహరణంగా వివరించారు. హిందీ కథా రచయిత ప్రేమ్‌చంద్ శతజయంతి సందర్భంగా ‘గగనాంచల్’ పత్రికకు రాసిన వ్యాసంలో ప్రేమ్‌చంద్ సాహిత్యం సమకాలీనతను సార్వకాలీనతను ప్రతిబింబించాయని తెలిపారు. పంజాబీ భాషలో కొత్తగా కవిత్వం రాసే వారెవరైనా సరే, వారు అమృతాప్రీతమ్ కవిత్వాన్ని ప్రేమించకుండా రాస్తే వాళ్లు కవులే కాలేరని వ్యాఖ్యానించారు. 1983లో తృతీయ ప్రపంచ హిందీ మహాసభల సందర్భంగా హిందీని అంతర్జాతీయ భాషగా పరివ్యాప్తి చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీవీకి హిందీ భాషా సాహిత్యాల పైనే కాదు, హిందీ సాహిత్య చరిత్ర పట్ల ఎంతో సాధికారత ఉన్నది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ సాహిత్య చరిత్ర గ్రంథానికి రాసిన 35 పేజీల ముందుమాట ఇందుకు నిదర్శనం. చివుకుల పురుషోత్తం ‘ఏది పాపం’? తెలుగు నవలను అలహాబాద్‌కు చెందిన సూర్యనాథ్ ఉపాధ్యాయ ‘క్యాహై పాప్’ శీర్షికను హిందీలోకి అనువదించారు. దీనికి పీవీ రాసిన పీఠిక కూడా విలువైనదే. భారత ప్రధానమంత్రిగా హిందీ భాషలో ప్రమాణస్వీకారం చేసి ఆ భాష పట్ల తన ప్రేమను వెల్లడించారు. ఇందిరాగాంధీ దక్షిణ భారత ప్రచార సభకు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, పీవీని ఉపాధ్యక్షులుగా నియమించి కార్యక్రమాలు సజావుగా సాగేటట్లు చేశారు. ఈ హిందీ ప్రచార సభకు విశ్వవిద్యాలయ స్థాయి ఏర్పడినాక, పీవీయే వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహారించారు. ఆయన వీసీగా ఉన్నప్పుడే సాహిత్య ప్రధానమైన ఎంఏను పాఠ్యక్రమాన్ని తొలిసారిగా భాషా ప్రధాన పాఠ్యక్రమంగా అమలు చేశారని నాటి రిజిస్ట్రార్ వేమూరి ఆంజనేయ శర్మ ఒక చోట వివరించారు. కేవలం ఎంఏ సాహిత్యం చదివితే వారు టీచర్లుగా పనిచేయడానికే పనికొస్తారు. ఫంక్షనల్ హిందీగా సిలబస్ తయారు చేసి శిక్షణ ఇస్తే వివిధ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడా ఉపకరిస్తారన్నది ఆయన సమున్నత భావన. ఈ ఆలోచనను అనంతరం అన్ని యూనివర్సిటీలు అమలు చేశాయి. హిందీ మాతృభాష కాని హిందీ రచయితలను ఎంతో ప్రోత్స హించారు. అఖిల భారత హిందీ సంస్థాన్ అధ్యక్షుడిగా ఉంటూ ‘సమవేత్ స్వర్’ హిందీ ద్వైమాసిక పత్రిక ప్రచురణను ప్రోత్సహిం చారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో (1991– 96) దక్షిణ హిందీ ప్రచార సభకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరించి, హిందీయేతర ప్రాంతాలలో హిందీభాష కోసం జరుగుతున్న కృషిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడే వాజ్‌పేయి కవితా సంకలనం ‘మేరీ ఇక్యావన్ కవితాయే’ను ఆవిష్కరించి, కూలంకషంగా విశ్లేషించారు. భారతీయ భాషల ద్వారా కంప్యూటర్ నడపటం సాధ్యం కాదని కంప్యూటర్ విశేషజ్ఞులే తేల్చిన తరుణాన పీవీ పూనుకుని హిందీలో సిద్ధార్థ వర్డ్ ప్రాసెసర్‌ను తయారు చేయించారు. అనంతరం లిపి వర్డ్ ప్రాసెసర్‌తో హిందీలో డి.సి.ఎ. ప్రారంభించారు. తరువాత జిస్టు కార్డు మార్కెట్లోకి వచ్చాక, ఎం.సి.ఎ. కూడా ప్రారంభించారు. భారతీయ భాషలలో కంప్యూటర్ నడుస్తుందని నిరూపించిన సాఫ్ట్వేర్ మేధావి పీవీ! డా‘‘ వి.వి.రామారావు వ్యాసకర్త ప్రముఖ రచయిత -
హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్’
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు, దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్–19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు మరో 17 లేబొరేటరీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల 26వ సమావేశం ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ పలు కీలక అంశాలను వారికి వివరించారు. దేశంలోని కోవిడ్ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్సాకాగ్ (ఇండి యన్ సార్స్ కోవ్–2 జినోమిక్ కన్సార్టియా) నెట్‌వర్క్‌లో మరో 17 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిద్వారా మరిన్ని శాంపిళ్లను పరీక్షించేందుకు, మరింత విశ్లేషణ చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి 10 ల్యాబ్‌లున్నాయన్నారు. పంజాబ్‌లో బి.1.1.7 వేరియంట్ దేశంలో సార్క్ కోవ్–2 మ్యుటేషన్లు, వేరియంట్లపై ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె.సింగ్ వారికి వివరించారు. బి.1.1.7, బి.1.617 వంటి వేరియంట్ల తీవ్రత వివిధ రాష్ట్రాల వారీగా ఎలా ఉందో తెలిపారు. బి.1.1.7 వేరియంట్ పంజాబ్, ఛండీగఢ్‌ల నుంచి ఫిబ్రవరి మార్చి మధ్యలో సేకరించిన శాంపిల్స్‌లో ఎక్కువగా కనిపించిందన్నారు. రెమిడెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు కోవిడ్–19 చికిత్సలో ఎక్కువగా వాడుతున్న ఔషధాలు.. ముఖ్యంగా రెమిడెసివిర్, టోసిలిజు మాబ్, అంఫొటెరిసిన్–బి ఉత్పత్తి, కేటాయింపుల సమన్వయానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ఫార్మా సెక్రటరీ ఎస్.అపర్ణ తెలిపారు. కోవిడ్ వైద్య సూచనల్లో పేర్కొనకపోయినా ఫవిపిరవిర్ ఔషధానికి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి, నెలకు 39 లక్షల వయల్స్ నుంచి 1.18 కోట్ల వయల్స్ వరకు తయారవుతోందని తెలిపారు. అదేవిధంగా, బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) బారిన పడిన వారికి ఇచ్చే అంఫొటెరిసిన్–బి ఔషధం తయారీ కూడా పెరిగిందని చెప్పారు. మే1–14 తేదీల మధ్య రాష్ట్రాలకు ఒక లక్ష వయల్స్ అంఫొటెరిసిన్–బిను అందజేశామన్నారు. పరీక్షల సామర్థ్యం పెంపు గ్రామీణ ప్రాంతాల వారికి కోవిడ్ పరీక్షలను మరింత చేరువ చేసేందుకు ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ వ్యాన్లు, ఆర్ఏటీ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెస్తున్నామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. వీటితో ఆర్టీ–పీసీఆర్, ఆర్ఏటీ పరీక్షల సామర్థ్యం రోజుకు 25 లక్షల నుంచి 45 లక్షలకు పెరుగుతుందని వివరించారు. హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను హిందీతోపాటు 14 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. (చదవండి: తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబీకుల హర్షం) -
హిందీ కన్నా అంబేడ్కర్‌కు సంస్కృతమే ఇష్టం
నాగపూర్: సంస్కృత భాషను భారతదేశ అధికార జాతీయ భాషగా ప్రకటించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకు తెలుసని అన్నారు. అలాగే రాజకీయ, సామాజిక పరిస్థితులు కూడా అంబేడ్కర్ బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే ఆ ప్రతిపాదన తెచ్చారని వెల్లడించారు. జస్టిస్ బాబ్డే బుధవారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ఎంఎన్‌ఎల్‌యూ) అకడమిక్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. మన ప్రాచీన మేధావులు న్యాయశాస్త్రం గురించి సమగ్రంగా బోధించారని గుర్తుచేశారు. అరిస్టాలిట్ వంటి పాశ్చాత్యుల బోధనకంటే ఇవి ఎందులోనూ తీసుపోవని అన్నారు. మన మేధావులు చెప్పిన విషయాలను పక్కనపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో ఏ భాష వాడాలన్నదానిపై సుప్రీంకోర్టుకు చాలా విజ్ఞాపనలు వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అంబేడ్కర్ ముందే ఊహించారని, అందుకే సంస్కృతాన్ని దేశ అధికార జాతీయ భాషగా మార్చాలని ప్రతిపాదించారని తెలిపారు. ‘‘ఉత్తర భారతదేశంలో తమిళ భాషను అంగీకరించరన్నది అంబేడ్కర్ అభిప్రాయం. అలాగే దక్షిణ భారతదేశంలో హిందీని ఒప్పుకోరని ఆయన నిర్ణయానికొచ్చారు. అందుకే సంస్కృతాన్ని దేశ అధికార భాషగా ప్రకటిస్తే ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవని భావించారు. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు’’ అని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో చేరేవారికి లా స్కూల్ ఒక నర్సరీలాంటిదన్నారు. - జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి -
వచ్చే వారమే బిగ్‌బాస్ ఫినాలే?!
బిగ్‌బాస్ అంటేనే ట్విస్టులు, షాక్‌లు సర్వసాధారణం. అవి లేకపోతే షో చప్పగా ఉంటుంది. ఎన్ని ట్విస్ట్‌లు ఉంటే షో అంత రక్తి కడుతుంది. హిందీ బిగ్‌బాస్‌లో ఈ ట్విస్ట్‌లు, డ్రామా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో హిందీ బిగ్‌బాస్ 14కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. మామూలుగా ఈ షో ఫినాలే జనవరి ఫస్ట్ వారంలో ఉంది. కానీ వచ్చే వారమే బిగ్‌బాస్ ఫినాలే ఉండబోతుంది అంటూ షో హోస్ట్ సల్మాన్ ఖాన్ బాంబ్ వేశారు. అంతేకాదు కేవలం నలుగురు మాత్రమే ఫినాలేలో ఉండబోతున్నారని తెలిపారు. ఈ షాకింగ్ కామెంట్స్ నేటి వీకెండ్ ఎపిసోడ్లో వెలువడనున్నాయి. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో సల్మాన్ వచ్చేవారమే ఫినాలే ఉండబోతుందని తెలిపి షాక్ ఇచ్చారు. (చదవండి: బిగ్‌బాస్ బిగ్ షాక్.. ఇక అందరూ ఎలిమినేషన్‌లోనే!) ప్రోమోలో ఉన్న దాని ప్రకారం సల్మాన్, బిగ్‌బాస్ 14 ఫినాలే ఎప్పుడు ఉండనుందో గెస్ చేయాల్సిందిగా హౌజ్మెట్స్ని కోరారు. దానికి వారు జనవరి ఫస్ట్ వారం బిగ్‌బాస్ 14 ఫినాలే వీకెండ్ అని తెలిపారు. అందుకు సల్మాన్ ‘మీకు అలా అనిపిస్తుందా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మీరనుకున్నట్లు జనవరి మొదటి వారం ఫినాలే వీకెండ్. కానీ కాదు. వచ్చ వారమే ఫినాలే ఉండనుంది. కేవలం నలుగురు మాత్రమే ఫైనల్‌కు వెళ్లనున్నారు’ అని తెలిపారు. అసలు సల్మాన్ ఇలా ఎందుకు అన్నాడు.. నిజంగా వచ్చే వారమే ఫినాలే వీకెండ్ కానుందా వంటి వివరాలు తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్లో చూడాల్సిందే. -
హిందీ బిగ్‌బాస్ విన్నర్‌తో అలీ రెజా
బిగ్‌బాస్ రియాలిటీ షో ముగిశాక కంటెస్టెంట్లు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అప్పటివరకు ఒకరిని విడిచి ఒకరం ఉండలేమన్నట్లుగా కనిపించే వాళ్లు బయటకు వచ్చాక మాత్రం పలకరింపులు కూడా తగ్గించేసేవాళ్లుంటారు. అయితే నాగార్జున మాత్రం కంటెస్టెంట్లను అంత ఈజీగా మర్చిపోరు. అలాగే నాగ్ కంట్లో పడటమూ అంత సులువేమీ కాదు. గత సీజన్లో కండల వీరుడు అలీ రెజా స్టైల్ నచ్చుతుందని అని నాగార్జున పొగిడేవారు. అయితే ఓసారి వీకెండ్లో నాగ్ ధరించిన బ్రాండెడ్ షూ చాలా నచ్చిందరి, అది తనకు కావాలని అలీ మనసులోని కోరికను బయటపెట్టాడు. అతని కోరికను తప్పకుండా నెరవేరుస్తానన్న నాగ్ ఆ మాట మీద నిలబడ్డారు. షో పూర్తైన నెల రోజుల తర్వాత కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ అలీకి బ్రాండెడ్ షూను నాగ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. (చదవండి: తెలుగు బిగ్‌బాస్‌లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?) అటు అలీ కూడా నాగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేశాడు. ఈ క్రమంలో నాగ్‌తో కలిసి మనాలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఫొటోలను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా వుంటే తాజాగా అలీ షేర్ చేసిన ఫొటో అభిమానులను ఆశ్చర్యంతో ముంచెత్తుతోంది. అతను హిందీ బిగ్‌బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లాతో పాటు షెహనాజ్ గిల్‌ను కలిశాడు. మంగళవారం నాడు చంఢీగఢ్ విమానాశ్రయమంలో వారిని కలుసుకోవడమే కాక ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'తెలుగు బిగ్‌బాస్ హిందీ బిగ్‌బాస్‌ను కలిసిన వేళ..' అని ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. 'ముగ్గురు ఫేవరెట్ కంటెస్టెంట్లు ఒకే చోట కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా' అని ఓ నెటిజన్ సంతోషం వ్యక్తం చేయగా 'భలే ఛాన్సు కొట్టేశారు' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా అలీ ఈ మధ్యే కొత్త యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించాడు. (చదవండి: కాబోయే కోడలికే ఆ డైమండ్: శిల్పా శెట్టి) View this post on Instagram Yeh dekho kaun mile kal . BB Telugu meets BB Hindi. #SidNaaz A post shared by Ali Reza (@i.ali.reza) on Nov 10, 2020 at 8:00pm PST -
బిగ్‌బాస్: నిక్కీ తంబోలి విపరీత చేష్టలు..
దక్షిణాది హీరోయిన్ నిక్కీ తంబోలికి హిందీ బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో అక్కడ వాలిపోయింది. తానింకా సింగిల్ అని చెప్తూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్నే బుట్టలో వేసే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే సోమవారం నామినేషన్ ప్రక్రియలో ఆమె చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంది. ఆమె విపరీత చేష్టలు చూసి జనాలు ఛీ కొట్టారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటారా? నవంబర్ 3న ప్రసారమైన ఎపిసోడ్లో ఓ టాస్కు జరిగింది. అందులో నిక్కీ.. తన ప్రత్యర్థి రాహుల్‌కు మాస్క్ దక్కకూడదని ఏకంగా తన ప్యాంటులో మాస్క్‌ను దాచిపెట్టుకుంది. దీంతో షాకైన రాహుల్ ఆమె నుంచి మాస్కు తీసుకోవడం అసాధ్యం కాబట్టి టాస్కు వదిలేశాడు. దీంతో అతడి ప్రవర్తనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్ వేదిక వదిలి వెళుతున్న సల్మాన్ ఖాన్!) ఇక నీచంగా ప్రవర్తించిన నిక్కీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిక్కీ రాహుల్ వైద్యతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాత్రం కుదరదని తేల్చి చెప్పాడు. నువ్వు చేసిన పని చాలా దారుణమని, నీ ముఖం చూస్తేనే రోత పుడుతుందని అసహనం వ్యక్తం చేశాడు. కాగా ఈ మాస్క్ వివాదంలో నిక్కీ తంబోలీ చర్యను సల్మాన్ ఖాన్ తీవ్రంగా తప్పుపట్టారు. నువ్వు మాస్క్ ఎక్కడ పెట్టుకున్నావు? అక్కడ ఎవరైనా చేయి పెట్టి తీసుకుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? అని అడగ్గా.. కావాలని చేయలేదు, తొందర్లో అలా జరిగిపోయింది అని జవాబిచ్చింది. తను చేసిన తప్పుకు రాహుల్‌కు క్షమాపణలు చెప్పింది. ఇక ఆ సమయంలో సహనంతో ప్రవర్తించిన రాహుల్ మీద సల్మాన్ ప్రశంసలు కురిపించారు. కాగా నిక్కీ తంబోలి చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో పాటు కాంచన 3, తిప్పరా మీసం చిత్రాల్లో నటించారు. (చదవండి: దీపావళి కానుకగా వన్‌గ్రామ్ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో) Ghar mein hua nomination ka face off! Aisa kya kiya @nikkitamboli ne ki huye @rahulvaidya23 aur gharwale unke khilaaf! Watch tonight 10 : 30 PM. Catch #BiggBoss14 before TV on @VootSelect. #BB14 @BeingSalmanKhan @PlayMPL #DaburDantRakshak @TRESemmeIndia @LotusHerbals pic.twitter.com/M799vU9vjs — Bigg Boss (@BiggBoss) November 3, 2020 -
‘అసహ్యం.. అందుకే నామినేట్ చేశాను’
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజమ్ టాపిక్‌పై తీవ్ర చర్చ నడిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల వారసులుతో పాటు కరణ్ జోహార్ వంటి వారిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ టాపిక్ బిగ్‌బాస్ రియాలిటీ షో లో కూడా చిచ్చు పెట్టింది. బంధుప్రీతిని కారణంగా చూపిస్తూ.. బిగ్‌బాస్ సీజన్ 14 కంటెస్టెంట్ ఒకరు హౌస్‌మెట్‌ని నామినేట్ చేశారు. దాంతో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో ఇలాంటి టాపిక్ ఎందుకు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. వివరాలు.. బిగ్‌బాస్ 14 గత వారం నామినేషన్ టాస్క్‌లో భాగంగా రాహుల్ వైద్య, జాన్ కుమార్ సనుని నామినేట్ చేశాడు. బంధుప్రీతి అంటే తనకు అసహ్యమని.. అందుకే జాన్ని నామినేట్ చేశానని తెలిపాడు. అంతేకాక జాన్‌కు అంత పాపులారిటీ లేదని.. కేవలం ప్రసిద్ధ సింగర్ కుమార్ సను కొడుకు కావడం వల్లనే షోలో ఉండగల్గుతున్నాడని విమర్శించాడు. (చదవండి: అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!) ఇక ఈ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తాజా ప్రోమోలు చూస్తే అర్థం అవుతోంది. వీకెండ్ షోలో సల్మాన్ రాహుల్ వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ‘ఒకవేళ నా తండ్రి నా కోసం ఏదైనా చేసినట్లయితే.. అది బంధుప్రీతి అవుతుందా’ అంటూ రాహుల్‌ని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత జాన్ని ఉద్దేశించి ‘మీ నాన్న నిన్ను ఎన్నిసార్లు రికమెండ్ చేశాడు అని ప్రశ్నించగా.. అందుకు జాన్ ఒక్కసారి కూడా అలా చేయలేదని’ తెలుపుతాడు. ఆ తర్వతా సల్మాన్ రాహుల్‌ని ఉద్దేశించి నెపోటిజం గురించి చర్చించే వేదిక ఇది కాదు అంటూ హెచ్చరించడం చూడవచ్చు. ఇక గత ఎపిసోడ్లో రాహుల్ తన ప్రకటనపై విచారం వ్యక్తం చేశాడు.. జాన్‌కి క్షమాపణ చెప్పాడు. జాన్ తల్లిదండ్రులు విడిపోయారనే విషయం తనకు తెలియదని రాహుల్ స్పష్టం చేశాడు. జాన్, రాహుల్ క్షమాపణను అంగీకరించాడు, అతను పగ పెంచుకోలేదని తెలిపాడు. Tomorrow episode promo#BiggBoss #BB14 #biggboss14 #sidharthshukla #hinakhan #AsimRiaz #ShehnaazGill #EijazKhan #JasminBhasin #NishantSinghMalkani #abhinavshukla #NikkiTamboli #rubinadilaik #RahulVaidya #pavitraPunia #JaanSanu #ShardulPandit #nainasingh #kavitakaushik pic.twitter.com/EXEIY8ZrNd — BIGGBOSS14jasoos (@biggbossjasoos) October 30, 2020 -
ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ బిగ్‌బాస్ మాత్రం అన్ని షోలకు బాస్‌గా ఇక్కడే సెటిలైపోయింది. పలు ప్రాంతీయ భాషల్లో ప్రసారమవుతూ ఎందరో ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా హిందీ బిగ్‌బాస్ 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 14వ సీజన్లో అడుగు పెట్టింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల హడావుడి ఒకత్తైతే, బయట వారి అభిమానులు చేసే సందడి మరో ఎత్తు ఉంటుంది. నామినేషన్లోకి వచ్చిన ప్రతీసారి ఓట్లు గుద్దుతూ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే బిగ్‌బాస్ 14వ సీజన్ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ రెండోవారానికిగానూ ఎలిమినేషన్ లేదని బాంబు పేల్చారు. అలా అని ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంటు ఇంట్లో ఎప్పటిలాగే స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ తిరిగే అవకాశమూ లేదు. ఎలిమినేషన్‌కు బదులుగా "ఇన్విజిబుల్" అని కొత్త ప్రయోగానికి తెర తీశారు. (చదవండి: గోళ్లతో రక్కిన కంటెస్టెంటు, కళ్లకు గాయాలు) నిజానికి ఈసారి షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సను నామినేషన్లో ఉండగా షెహజాద్ ఇన్విజిబుల్గా ఉంటారని సల్మాన్ వెల్లడించారు. అలాగే అతడు 'గాయబ్' అని రాసి ఉన్న దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఇకపై అతడు ఎలాంటి కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉండడు. హౌస్‌లో ఉంటాడన్న మాటే కానీ ఏ టాస్కులోనూ పాల్గొనడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు నడుచుకుంటాడు. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అతడు ఇన్విజిబుల్‌గానే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అతని ప్రవర్తన నచ్చకపోతే ఏ క్షణమైనా హౌస్ నుంచి బయటకు పంపించి వేస్తారు. ఇక ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన ప్రాంతీయ భాషల్లో కూడా ఎలిమినేషన్‌కు బదులు ఇన్విజిబుల్ అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే హిందీ బిగ్‌బాస్‌లో ప్రవేశపెట్టిన ఇన్విజిబుల్ ప్రక్రియ ఈ వారానికే పరిమితమవుతుందా? వచ్చే వారాల్లోనూ కొనసాగనుందా? అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?) -
గోళ్లతో రక్కిన కంటెస్టెంటు, కళ్లకు గాయాలు
హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పంజాబీ సింగర్, నటి సారా గుర్పాల్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె ఎలిమినేషన్‌ను చాలామంది తప్పు పట్టారు. కానీ ఆమెను పంపించేయడం వెనక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఆమె ఫొటోలే నిదర్శనం. ఈ ఫొటోల్లో ఆమె కళ్లకు తీవ్ర గాయాలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గాయం ఎలా అయిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో గత వారం ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది. అందులో భాగంగా సారా బుల్డోజర్ ఎక్కి కూర్చుంది. ఆమెను తోసేసి కూర్చునేందుకు నిక్కీ తంబోలి తన గోళ్లతో సారా కళ్ల దగ్గర రక్కింది. ఈ ఫుటేజీని బిగ్‌బాస్ టీమ్ ఎడిట్ చేసి తీసేసింది. (చదవండి: బిగ్‌బాస్: రెయిన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన అమ్మాయిలు) కానీ మిగతా కంటెస్టెంట్లు దీని గురించి మాట్లాడుకోవడంతో ఈ విషయం బయటపడింది. తనను గాయపరుస్తున్నా సరే సారా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేకుండా గేమ్ ఆడటంపైనే దృష్టి పెట్టడం విశేషం. ఇక ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సారా ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. ఆ వెంటనే ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. కాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14 అక్టోబర్ 3న ఆడంబరంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మంది కంటెస్టెంట్లు రుబీనా దిలైక్, ఆమె భర్త అభినవ్ శుక్లా, ఎజాజ్ ఖాన్, జాస్మిన్ బాసిన్, నిశాంత్ సింగ్ మల్కానీ, పవిత్ర పూనియా, నిక్కీ తంబోలి, సారా గుర్పాల్, రాహుల్ వైద్య, హెహజాద్ డియోల్, జాన్ కుమార్ సాను, రాధే మా పాల్గొన్నారు. (చదవండి: రణ్‌బీర్, అలియా వివాహం అప్పుడే!) -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది. కశ్మీరీ, డోంగ్రీ, హిందీ.. జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్ వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
తమిళనాడులో హిందీ వార్
రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్యమం బయలుదేరింది. తద్వారా తమిళాభిమాన పార్టీలు, బీజేపీ మధ్య సమరానికి దారితీసింది. కొందరు సినీ సెలబ్రిటీలు, యువత హిందీ తెలియదు పోరా అంటూ టీషర్టులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అదే సమయంలో హిందీ నేర్చుకుంటే తమిళం కాదు, డీఎంకే గల్లంతు అంటూ బీజేపీ యువత ఎదురు దాడికి దిగింది. సాక్షి, చెన్నై: ఆది నుంచి హిందీ, సంస్కృతానికి తమిళనాడు వ్యతిరేకమన్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పాలకులు హిందీని బలవంతంగా రుద్దే యత్నం చేస్తే ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడింది. దీంతో కేంద్రం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఇతర భాషల వారు రాష్ట్రంలో ఉన్నా విద్య, ఉపాధి రంగాల్లో తమిళులకే పెద్ద పీట. మిగిలిన భాషల వారు అల్పసంఖ్యాక వర్గాలే. హిందీ, సంస్కృతాన్ని తమిళుల దారిదాపుల్లోకి రానివ్వరు. బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే పోరాటాలు బయలుదేరుతాయి. (ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!) ఇటీవల కూడా హిందీ, సంస్కృతం విషయంగా కేంద్రం పలు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలతో పోరాటాలు భగ్గుమన్నాయి. తాజాగా కేంద్రం త్రి భాషా విధానంతో హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నట్టు తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చట్టాన్ని పాలకులే కాదు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఉద్యమం బయలుదేరడం గమనార్హం. సమరంలో సెలబ్రిటీలు హిందీకి వ్యతిరేకంగా సినీ సెలబ్రిటీలు యువన్ శంకర్‌రాజ, ఐశ్వర్య రాజేష్, శాంతను తదితరులు పరో క్షంగా, ప్రత్యక్షంగా హిందీ వ్యతిరేక నినాదాలతో టీ షర్టులు ధరించి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యారు. ‘హిందీ తెలియదు పోరా, నేను తమిళం మాట్లాడే భారతీయుడిని’ అన్న నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. డీఎంకే యువజన నేత, నటుడు ఉదయ నిధి సారథ్యంలో టీ షర్టుల హిందీ వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో కొందరు యువకులు హిందీ వ్యతిరేక నినాద టీషర్టులు ధరించి సామాజి క మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో హిందీకి వ్యతిరేకంగా కనిమొళి నేతృత్వంలో సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమం మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై కనిమొళిని ప్రశ్నించగా యువత, కొందరు సెలబ్రిటీలు హిందీకి వ్యతిరేకంగా తమదైన శైలిలో స్పందిస్తున్నారని తెలి పారు. చట్టం బయటకు వచ్చే సమయంలో ఈ ఆగ్రహం ఉప్పెనలా ఎగసి పడుతుందన్నారు. బీజేపీ యువత ఎదురు దాడిలో నిమగ్నమైంది. ‘హిందీ నేర్చుకున్నంత మాత్రాన.. తమిళం గల్లంతు కాదని, డీఎంకే అడ్రస్సే గల్లంతు’ అంటూ టీషర్టులతో ఎదురుదాడి సాగిస్తుండటం గమనార్హం. -
హిందీ రాకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలా?
బెంగుళూరు : హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. హిందీ రాకుంటే శిక్షణా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేసిన రాజేష్ కొట్చేపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ రానంత మాత్రానా ఇతర భాషల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ఐక్యత సమాఖ్యవాదంపై ఆధారపడి ఉంటుందని, భారత్‌లో అన్ని భాషలు సమానమేనని అన్నారు. హిందీ అర్థం కాకుంటే వెళ్లిపోండి అనడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. (ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్) వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు పట్ల తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. (హిందీ దుమారం) -
ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్
చెన్నై: ఆయుష్ శాఖపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, ఆయుష్ శాఖకు తమిళమే అర్థం కానప్పుడు తమిళనాడు మందులు ఏలా అర్థమవుతాయని తమిళ వైద్యలు ఆయుష్ శాఖను ప్రశ్నించకపోవడం వైద్యుల వినయానికి నిదర్శమని కమల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఇది హిందీ ప్రభుత్వం కాదని, భారత ప్రభుత్వం అని గట్టిగా కౌంటరిచ్చారు. వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఆయుష్ శాఖ శిక్షణ తరగతిలో హిందీ తెలియని వారు వెళ్లిపోవచ్చని ఆయుష్ కార్యదర్శి రాజేష్ కొట్టెచా పేర్కొనడాన్ని కనిమోళి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ తసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని ధ్వజమెత్తారు. చదవండి: వైరల్ : ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో సేతుపతితో కమల్ -
‘లాక్డౌన్ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే లాక్డౌన్ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించారు. ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మా అధికారికి లాక్డౌన్ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటివి కొనసాగించాలని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు. The tweet with respect of lockdown period was uploaded by an officer whose comprehension in Hindi was limited. And therefore same was removed. @TimesNow https://t.co/7nuUT7QfCx — Pema Khandu (@PemaKhanduBJP) April 2, 2020 -
బిగ్‌బాస్ విన్నర్: ఊహించిందే నిజమైన వేళ..
బిగ్‌బాస్ 13 హిందీ గ్రాండ్ఫినాలే ఎంతో ఘనంగా ముగిసింది. పార్టిసిపెంట్ల డ్యాన్సులు, కామెడీ స్కిట్లతో ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఇక దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ తన పాటలకు స్టెప్పులేయడంతో ప్రేక్షకుల ఈలలతో స్టేజీ దద్దరిల్లిపోయింది. ఇక ముందుగా ఊహించినట్టుగానే సిద్ధార్థ్ శుక్లా బిగ్‌బాస్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. దీంతో పాటు రూ.40 లక్షల ప్రైజ్‌మనీ, లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. అసిమ్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో కామెడీ కింగ్ సునీల్ గ్రోవర్, భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.(బిగ్‌బాస్: తక్కువ ఓట్లు.. ఐనా అతడే విన్నర్!) ముందే తప్పుకున్న పరాస్ ఆరుగురు కంటెస్టెంట్లు ఆర్తి సింగ్, రష్మీ దేశాయ్, షెహనాజ్ గిల్, పారాస్, సిద్ధార్థ్ శుక్లా, అసిమ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. వీరికి సల్మాన్ బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. తాము గెలుస్తామన్న నమ్మకం లేని వారు రూ.10 లక్షలు తీసుకొని షో నుంచి వైదొలగవచ్చని సూచించాడు. దీంతో పరాస్ ముందుగా బజర్ నొక్కి ఆ డబ్బును తీసుకొని తొలుత వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఆర్తి సింగ్, రష్మీ దేశాయ్, షెహనాజ్ గిల్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. చిట్టచివరగా అసిమ్, సిద్ధార్థ్ ఫైనల్ ట్రోఫీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోరాడారు. అయితే పలు సర్వేల జోస్యమే నిజం కాగా విజయం సిద్ధార్థ్‌నే వరించింది. ఇద్దరు ఫైనలిస్టులను స్టేజీపైకి ఆహ్వానించిన సల్మాన్.. సిద్ధార్థ్ గెలిచాడంటూ అతని చేయి పైకెత్తి విజయాన్ని ప్రకటించాడు. దీంతో సిద్ధార్థ్ అభిమానులు విజయానందంలో మునిగి తేలుతున్నారు. ఇక విన్నర్ కాకుండా మిగిలిన నలుగురికి అబుదాబీలోని అడ్వెంచర్ పార్క్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించాడు. బిగ్‌బాస్ 13 అన్ని సీజన్‌లోకెల్లా అత్యంత వివాదాస్పదమైన సీజన్ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. నేటి నుంచి బిగ్‌బాస్ హౌస్ ఉండదంటూ పార్టిసిపెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చివరి ఎపిసోడ్లో సల్మాన్ హర్భజన్, మహ్మద్‌లతో స్టేజీపైనే క్రికెట్ ఆడటం ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. తిరిగి ఏడు నెలల్లోనే బిగ్‌బాస్ 14తో మళ్లీ వస్తానంటూ సల్లూభాయ్ వీడ్కోలు తీసుకున్నాడు. (బిగ్‌బాస్ షోపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు) -
అత్యాచారానికి ప్రయత్నించాడు: బిగ్‌బాస్ కంటెస్టెంట్
బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ 13 సెంచరీ ఎపిసోడ్లను పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘ఛపాక్’ బృందం బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌తో పాటు హీరోయిన్ దీపిక పదుకొనే, హీరో విక్రాంత్ మాస్సే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటిసభ్యులతో కలిసి సందడి చేసిన ఛపాక్ బృందం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వారి జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనలను పంచుకోవాలని కోరారు. దీంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వారికి జరిగిన సంఘటనలను చెప్తూ విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్తి సింగ్ తనకు చిన్నవయసులో జరిగిన భయంకర అనుభవాన్ని పంచుకుంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. ఆ రోజు నేను ఇంట్లో మధ్యాహ్నం మూడింటికి నిద్రపోతున్న సమయంలో మా ఇంట్లో పని చేసే వ్యక్తి నాపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయి నేను ఏడ్చాను, అరిచాను, అతని బట్టలను చింపాను, బయటివాళ్ల సహాయం కోసం గొంతు చించుకుని అరిచాను. అతను భయపడిపోయి రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అలా నన్ను నేను కాపాడుకున్నాను. కానీ ఈ ఘటన తర్వాత నేను చాలా కుంగిపోయాను. నన్ను నేను అసహ్యించుకున్నాను. అలాంటి మానసిక స్థితి నుంచి బయటపడేయడానికి నా తల్లి, సోదరుడు ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు కూడా దీని గురించి మాట్లాడుతుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఇప్పటికీ ఒంటరిగా నిద్రించాలంటేనే వెన్నులో వణుకు పడుతుంది. అందుకే భయంతో నా గది తెలుపులు తెరుచుకునే నిద్రిస్తాను’ అని ఆమె పేర్కొంది. అయితే తనకు జరిగిన చేదు ఘటన గురించి సరైన వేదికపైనే మాట్లాడాలనుకున్నానని ఆర్తి సింగ్ తెలిపింది. దానివల్ల తాను చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మంది మహిళలకు చేరుతుందని చెప్పుకొచ్చింది. కాగా మహిళలు తమపై జరిగే దాడులపై తప్పనిసరిగా నోరు విప్పాలని కోరింది. కనీసం తల్లిదండ్రులతోనైనా చెప్పుకోవాలని సూచించింది. ఇక మిగతా కంటెస్టెంట్లు సైతం తాము ఎదుర్కొన్న ఘటనల గురించి చెప్తూ కన్నీటిమయమయ్యారు. చదవండి: ఘనంగా బిగ్‌బాస్ నటి వివాహం చీరకట్టులోనే యాక్షన్ ఫీట్‌కు సై అన్న బిగ్‌బాస్ భామ -
బిగ్‌బాస్: చెప్పుతో కొట్టింది..
బుల్లితెరపై గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రియాలిటీ షో బిగ్‌బాస్. బిగ్‌బాస్ 13 హిందీ సీజన్లో అయితే ఈ గొడవలకు లెక్కే లేదు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. వీకెండ్లో వారి తగాదాలకు పరిష్కరించడానికే సమయం సరిపోతుంది. అలా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బిగ్‌బాస్ షోలోని నిన్నటి ఎపిసోడ్లో పార్టిసిపెంట్లకు మళ్లీ లొల్లయింది. కానీ ఈ సారి ఏకంగా ఓ పార్టిసిపెంట్ తోటి కంటెస్టెంట్‌ను చెప్పు తీసుకుని కొట్టడం వివాదాస్పదమయింది. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విశాల్ ఆదిత్య, మధురిమా తులి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో ఉన్న వీరిద్దరు తగవులాడుకున్నారు. విశాల్ కోపంతో మధురిమను నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను దుర్భాషలాడాడు. దీంతో ఆవేశానికి లోనైన మధురిమ విశాల్‌కు చెప్పుదెబ్బ రుచి చూపించింది. తన చెప్పుతో కొట్టి అక్కడ నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్ ఇద్దరినీ కన్ఫెషన్ రూంకు పిలిచాడు. తొలుత విశాల్ మాట్లాడుతూ శారీరక హింసకు పాల్పడేవాళ్లను ఇంట్లో ఇనుమతిస్తారా? అని ప్రశ్నించాడు. అనంతరం మధురిమతో కలిసి తాను ఈ ఇంట్లో ఉండలేనని తేల్చి చెప్పాడు. మధురిమ మాట్లాడుతూ.. చెప్పుతో కొట్టడం తప్పేనని విశాల్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఈ గొడవలో అతని తప్పు కూడా ఉందని ఎత్తిచూపింది. ఈ గొడవలో ఇరువైపులా తప్పు ఉండటంతో బిగ్‌బాస్ ఇద్దరినీ మందలించాడు. శారీరక హింసకు పాల్పడినందుకుగానూ మధురిమను రెండు వారాల పాటు నేరుగా నామినేట్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ పేర్కొన్నాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి వివాదాస్పద వక్త -
ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది. -
బిగ్‌బాస్ షోను నిషేధించండి!
సాక్షి, లక్నో: వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ (హిందీ) 13 వ సీజన్ మూసివేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ టీవీ షోను వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఒక లేఖ రాశారు. బిగ్ బాస్-13 ప్రైమ్ టైమ్ స్లాట్‌లో ప్రసారం అవుతోందని, ఇందులో కంటెంట్ అసభ్యంగా, అసహ్యంగా ఉందని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే లేఖ రాశారు. బిగ్‌బాస్ షో ద్వారా అసభ్యత కూడా విపరీతంగా ప్రచారం జరుగుతోందని , సమాజంలో నైతిక విలువలను పతనం చేస్తోందని ఆయన విమర్శించారు. అందుకే ఈ షోను ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేశీయ వాతావరణంలో ఈ ప్రదర్శనను చూడటం కష్టం. అలాగే నేరుగా టీవీ ద్వారా జనాలకు చేరుతున్న ఇలాంటి షోలు, సీరియల్స్ నియంత్రణకోసం చలన చిత్రాల మాదిరిగానే ఒక సెన్సార్బోర్డును ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు బిగ్‌బాస్ షోను వ్యతిరేకిస్తున్నవారి వరుసలో రాజ్‌పుత్ కర్ణి సేన చేరింది. మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పద్మావత్, ఆర్టికల్ 15 వంటి చిత్రాలను నిషేధించాలంటూ ఆందోళనకు దిగిన కర్ణిసేన తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ -13 ని నిషేధించాలని పిలుపునిచ్చింది. బిగ్‌బాస్ రియాలిటీ షో భారతీయ సంస్కృతికి విరుద్ధమని, యువత దీన్ని చూడటం మంచిది కాదని పేర్కొంటూ దీన్ని నిషేధించాలని బుధవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు సేన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసింది. హిందూ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు హిందూ సంస్కృతిని దెబ్బతీస్తూ, లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ ఈ షో వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని సేన డిమాండ్ చేసింది. అంతకుముందు బీజేపీ నాయకుడు సత్యదేవ్ పచౌరి కూడా బిగ్‌బాస్ -13పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక్కఎపిసోడ్ కూడా చూడకపోయినా, ఈ షో ప్రసారాలపై సమాచారం తన దగ్గర ఉందని, సమాజంలో అశ్లీలతను వ్యాప్తి చేస్తున్న ఇలాంటి షోలను నిషేధించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.