
చెన్నై: ఆయుష్ శాఖపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, ఆయుష్ శాఖకు తమిళమే అర్థం కానప్పుడు తమిళనాడు మందులు ఏలా అర్థమవుతాయని తమిళ వైద్యలు ఆయుష్ శాఖను ప్రశ్నించకపోవడం వైద్యుల వినయానికి నిదర్శమని కమల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఇది హిందీ ప్రభుత్వం కాదని, భారత ప్రభుత్వం అని గట్టిగా కౌంటరిచ్చారు.
వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఆయుష్ శాఖ శిక్షణ తరగతిలో హిందీ తెలియని వారు వెళ్లిపోవచ్చని ఆయుష్ కార్యదర్శి రాజేష్ కొట్టెచా పేర్కొనడాన్ని కనిమోళి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ తసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని ధ్వజమెత్తారు.
చదవండి: వైరల్ : ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సేతుపతితో కమల్
Comments
Please login to add a commentAdd a comment